Government High School
-
Hyderabad: ఫిలింనగర్ పాఠశాలకు టీచర్లు కావలెను!
ఫిలింనగర్: రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ లేని సమస్యను ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటోంది. ఈ పాఠశాలకు చెందిన 22 మంది టీచర్లు ఒకేసారి బదిలీ కావడానికి గల కారణాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మూడురోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టీచర్ల మూకుమ్మడి బదిలీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 948 మంది విద్యార్థులున్న ఈ బడిలో ఇప్పుడు హెచ్‌ఎంతోపాటు ఇంకొక టీచర్ మాత్రమే మిగిలారు. కొత్తగా విద్యార్థులు చేరడం లేదు. బోధన సాగడంలేదు. ఇక్కడ తెలుగు మీడియం బోధనను పూర్తిగా తొలగించారు. పదో తరగతిలోని తెలుగు మీడియం విద్యార్థులను ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడంతో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. ఈ పాఠశాలకు రావడానికి టీచర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఒక్క ఈ పాఠశాలకే టీచర్లు ఎందుకు రావడం లేదు, ఉన్న టీచర్లు ఎందుకు వెళ్లారు.. అన్నదానిపై విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే స్కూల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ హల్చల్ ఒకే చోట.. క్లిక్ చేయండి -
ఇదేం ‘లెక్క’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఫిజిక్స్ టీచర్లు ఇక నుంచి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అన్యాయమంటూ ఫిజిక్స్ టీచర్లు ఉన్నతాధికారులను కలిశారు. దీనివల్ల తమకు తీవ్ర మానసికఒత్తిడి కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.గణితం బోధించే ఉపాధ్యాయులకు తక్కువ పనిగంటలు ఉంటాయని, తామే ఎక్కువ గంటలు పనిచేస్తామని, అయినా అదనంగా గణితం బోధించమనడం ఏమిటని ప్రశ్నించారు. అసలిది పాత విషయమేనని అనవసరంగా పెద్దది చేస్తున్నారని గణితం టీచర్లు అంటున్నారు. పరస్పర వాదనల నేపథ్యంలో ఈ ఏడాది బోధనకు ఏ స్థాయిలో సమస్య తలెత్తుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలూ ఆందోళన చెందుతున్నాయి. అసలేంటీ పంచాయితీ గతంలో ఫిజిక్స్ సబ్జెక్టు గణితం వారు, కెమిస్ట్రీ సబ్జెక్టు బయలాజికల్ సైన్స్ వారు చెప్పేవారు. 2000లో ఫిజికల్ సైన్స్ పోస్టులు మంజూరు చేసి, 2002లో భర్తీ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం ఓ టైంటేబుల్తో సర్క్యులర్ ఇచ్చింది. ఇందులో 8, 9, 10 ఫిజిక్స్ చెప్పాలని, 6, 7 తరగతులకు గణితం చెప్పాలని పేర్కొంది. 2017 వరకూ ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత సిలబస్‌లో మార్పులొచ్చాయి. గణితం వారికి ఎక్కువ బోధన, సైన్స్ వారికి తక్కువ బోధన క్లాసులు ఉన్నాయనే వాదన తెరమీదకొచ్చింది.అప్పట్లో ఎస్ఈఆర్టీ 2017లో 6వ తరగతి గణితంను ఫిజిక్స్ టీచర్లు, 7వ తరగతి గణితంను 10 వరకూ చెప్పే గణితం టీచర్లే చెప్పాలని కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గణితం టీచర్లు ఆందోళనకు దిగారు. గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది ఫెయిల్ అ వుతున్నారని, మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. దీంతో ఎస్సీఈఆర్టీ ఇచ్చిన ఆదేశాలు నిలిపివేసింది. అప్పట్నుంచీ వివాదం అలాగే కొనసాగింది. స్థానిక హెచ్ఎంలు సర్దుబాటు చేసుకొని క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా మళ్లీ ఫిజికల్ సైన్స్ టీచర్లు 6, 7 క్లాసుల గణితం చెప్పాలని ఆదేశాలివ్వడంతో వివాదం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పం ఎట్టి పరిస్థితుల్లోనూ 6, 7 తరగతులకు గణితం సబ్జెక్టు బోధించం. దీనివల్ల 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సైన్స్ యాక్టివిటీ అయిన ఇన్స్పైర్ అవార్డులు, స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్,, నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ తదితర ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం కష్టం. గణితం కన్నా భౌతిక, రసాయన శా్రస్తాల బోధనే కష్టం. డిగ్రీలో, బీఈడీలో గణితం చదవాలన్న అర్హత నిబంధనలు లేవు. ఇలా గణితం నేపథ్యం లేని ఫిజిక్స్ అధ్యాపకులూ ఉన్నారు. వారిని గణితం బోధించమంటే ఎలా వీలవుతుంది? తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – అజయ్‌సింగ్, రాష్ట్ర ఫిజికల్ సైన్స్ టీచర్ల ఫోరం అధ్యక్షుడు జరిగే నష్టం ఏమిటి?ప్రభుత్వ ఉపాధ్యాయులు బీఈడీ చేసిన సమయంలో ఇప్పుడున్న సిలబస్ లేదు. ఈ కారణంగా ఫిజిక్స్ మినహా 6, 7 తరగతుల గణితం చెప్పాలంటే కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సమయాన్ని ఇలా వెచి్చస్తే కీలకమైన 9, 10 తరగతుల విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులో అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. జాతీయస్థాయిలో జరిగే నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు 8వ తరగతి నుంచే సైన్స్‌లో గట్టి పునాది పడాలని ఫిజిక్స్ టీచర్లు చెబుతున్నారు.రాష్ట్రంలో ఉన్న టీచర్లలో 25 శాతం మంది ఫిజిక్స్ టీచర్లు ఉన్నారు. వీరికన్నా 20 శాతం గణితం టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు వారికే 6,7 మేథ్స్ బోధన అప్పగించాలని కోరుతున్నారు. స్కూళ్లు తెరిచేలోగా సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. -
నలుగురు విద్యార్థులకు కరోనా
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం కరోనా కలకలం రేపింది. విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలలో 6నుంచి 10 తరగతులకు చెందిన 128 మంది విద్యార్థులు ఉండగా సోమవారం 29 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇందులో నలుగురు వైరస్ బారిన పడినట్లు తేలిందని నందిగామ పీహెచ్సీ డాక్టర్ పాల్గుణ తెలిపారు. దీంతో వీరి స్వగ్రామాలైన మోత్కులగూడ, మొదళ్లగూడ, వీర్లపల్లి, మామిడిపల్లిలో ఆందోళన నెలకొంది. మిగతా వారికి మంగళవారం టెస్టులు చేస్తామన్నారు. -
పాఠశాలలో నాగుపాము కలకలం
చెన్నారావుపేట: మండలంలోని పాపయ్యపేట హైస్కూల్లో పాము కలకలం రేపింది. పాఠశాలలోని ఓ గదిలో నాగుపాము దర్శనమిచ్చింది. బుధవారం అన్ని గదులు శానిటైజర్ చేశారు. తొమ్మిదో తరగతి గదిని గురువారం శానిటైజర్ చేయడానికి తలుపులు తీయగా ఆ గదిలో నాగుపాము కనిపించింది. ఇన్ని రోజులు పాఠశాలలు తెరిచి లేకపోవడంతోనే పాము కిటికి నుంచి లోపలకి వచ్చి ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం పామును సురక్షింతంగా పంట పొలాల్లోకి వెళ్లగొట్టినట్లు హెచ్ఎం స్వామి, వేణు, నాగరాజు, ఎస్ఎంసీ చైర్మన్ జాటోత్ యాకూబ్, జీపీ సిబ్బంది జున్న శ్రీను, తదితరులు ఉన్నారు. -
పూర్వ విద్యార్థులు కాదు.. అపూర్వ విద్యార్థులు
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు పూర్వ విద్యార్థులు కాదని.. అపూర్వ విద్యార్థులని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం సిద్ధిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల(మల్టీపర్పస్ హైస్కూల్) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ.. చరిత్ర కలిగిన పాఠశాల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈచ్ వన్, టిచ్ వన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి సహకరించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి రూ.25 లక్షలు.. 75 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సిద్ధిపేట ప్రభుత్వ పాఠశాల ఎందరో మేధావులను అందించిందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీఈటీ పాడుబుద్ధి.. !
సాక్షి, రాయదుర్గం : విద్యార్థినుల పట్ల అసభ్యకర, వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడి(పీఈటీ)కి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. రాయదుర్గం పట్టణంలోని రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇలాహి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో ఆగ్రహోదగ్రులయ్యారు. ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి మంగళవారం పాఠశాల వద్దకు చేరుకున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడిని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ప్రధానోపాధ్యాయులు అబ్దుల్‌వారిస్ వారిని వారించి.. మాట్లాడదాం అని చెప్పి.. వ్యాయామ ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి తప్పించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక శిక్షణ పేరుతో వెకిలిచేష్టలు పీఈటీ ఇలాహి ఇంగ్లిష్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తానని ప్రతి శుక్రవారం ఎనిమిదో తరగతి విద్యార్థినులను రప్పించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ పిల్లలు సోమవారం రాత్రి తమకు తెలిపారని పలువురు తల్లిదండ్రులు చెప్పారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టల గురించి పిల్లలు చెబుతుంటే తట్టుకోలేకపోయామన్నారు. ఈ ఘటనపై ప్రశ్నించేందుకు వస్తే తమను చూసి తప్పించుకునేయత్నం చేసిన ఇలాహిని పట్టుకున్నామన్నారు. బాధిత విద్యార్థినులకు భరోసాగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌వారిస్ అసభ్యరంగా ప్రవర్తించిన పీఈటీని తప్పించి, వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం ఈ ఘటనపై మండల విద్యాధికారి నాగమణితో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కఠినంగా శిక్షించాలి పీఈటీ ఇలాహిని వెంటనే విధుల నుంచి తొలగించాలని వివిధ పాఠశాలల విద్యార్థినులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన పీఈటీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. పీఈటీపై చర్యలు తీసుకోవాలి ఉర్దూ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, న్యాయవాది అయిన జింకా వసుంధర డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటి సమాజంలో ఇలాంటి కీచకులు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. -
ప్రభుత్వ బడికి..ప్రాణం పోశారు!
సాక్షి,శ్రీకాకుళం : ఐకమత్యంగా ఉంటే ఎంతటి అవరోధాన్నైనా సులువుగా అధిగమించవచ్చని నిరూపించారు బైపల్లి గ్రామస్తులు. 1959లో ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రారంభమైన ఈ బడిలో కాల క్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ప్రాథమిక పాఠశాలగా మారింది. మరికొద్ది సంవత్సరాలకు ఉపాధ్యాయులు లేక దీనస్థితికి చేరుకుంది. గత ఏడాది 13 మంది విద్యార్థులతో మూతపడే పరిస్థితికి చేరుకుంది. దీంతో గ్రామస్తులు పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. అయితే విద్యార్థుల కొరత ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించలేదు. గతంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై పలాస మండలానికి వెళ్లిపోవడంతో కేవలం డిప్వూటేషన్‌లో ఉపాధ్యాయులు వచ్చి వెళ్లేవారు. దీంతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారు. ఈ ఏడాది మాత్రం తమ పిల్లలకు మెరుగైన విద్య అందాలనే ఉద్దేశంతో గ్రామస్తులు మూడుసార్లు సమావేశమయ్యారు. గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు, పెద్దలు, ఉద్యోగుల నుంచి సుమారు రూ.4 లక్షలు సేకరించి పాఠశాల నిధిని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటిం టా తిరిగి విద్యార్థుల తలిదండ్రులను ఒప్పించి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మరో 60 మంది విద్యార్థులను బడిలో చేర్పించారు. వీరికి విద్యను అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుని కోసం ఎదురు చూడకుండా గ్రామంలో పాఠశాల బలోపేత కమిటీని ఏర్పాటు చేసి అర్హులైన ముగ్గురు వలంటీర్లను నియమించారు. నెలకు రూ.20 వేలు ఖర్చు.. పాఠశాలలో ముగ్గురు విద్యా వలంటీర్లు, మరో ఆయాను నియమించారు. వలంటీర్ల కు ఒక్కొక్కరికీ గౌరవ వేతనంగా రూ.5000, ఆయాకు రూ.3000 అందిస్తున్నారు. ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చి పాఠశాలకు రంగులు, ఫర్నిచర్, యూనిఫాం, నోట్ పుస్తకాలు సమకూర్చారు. ప్రభుత్వ సహాయం లేకుండా సొంతంగా విద్యార్థుల కు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలలో చినవంక పాఠశాల నుంచి చొక్కరి ధర్మారావు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై వచ్చి తరగతులు బోధిస్తున్నారు. సామూహిక అక్షరాభ్యాసం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇటీవల రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా బైపల్లి పాఠశాలలోనూ అధి కారుల సమక్షంలో సాముహిక సుమారు 25 మంది పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మండల ప్రత్యేకాధికారి శ్రీని వాస్, తహసీల్దార్ కల్పవల్లి, ఎంపీడిఓ తిరుమలరావు, ఎంఈ చిన్నవాడుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. -
ఓటెత్తిన బాలలు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : ఓటుహక్కు వినియోగించేందుకు బారులు తీరారు. ఓటర్ల జాబితా చూసి ఎన్నికల అధికారి ఓట్లు అందించారు. బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేయడంతో ప్రక్రియ ముగిసింది.. ఇటీవలే ఎన్నికలు ముగిశాక.. మళ్లీ ఈ ఎన్నికలేమిటా?.. అనుకుంటున్నారు కదూ.. ఇవి సార్వత్రిక ఎన్నికలు కావు.. వాటిని తలపించేలా నిర్వహించిన విద్యార్థి నాయకుని ఎన్నికలు. తెర్లాం మండలం నందబలగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు శుక్రవారం హెచ్ఎం విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎన్నికలను నిర్వహించారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగానే నందబలగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు ఎన్నికలు జరిగాయి. ప్రతి తరగతి నుంచి ఒకరిని, పాఠశాలకు సంబంధించి ఒక నాయకుడిని ఎన్నుకొనేందుకు సాధారణ ఎన్నికల మాదిరిగానే అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేయించడం, నామినేషన్ల ఉప సంహరణ, ఓటర్ల జాబితా (హాజరు రిజిస్టర్)ల ప్రచురణ, అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం, బ్యాలెట్ పేపరు తయారు, బెండకాయ మార్క్‌తో అభ్యర్థుల గుర్తుపై బ్యాలెట్‌పై ఓటుముద్ర వేయడం వంటి ప్రక్రియలన్నీ విద్యార్థులతో చేయించారు. ఇదంతా పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల మాదిరిగా నిర్వహించడంతో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ తరగతి, పాఠశాల నాయకులను ఎన్నుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఓట్లను లెక్కించి విజేతల వివరాలు ప్రకటించి, విద్యార్థి నాయకులతో ప్రమాణం చేయిస్తామని పాఠశాల హెచ్ఎం విజయభాస్కర్ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు వేయడం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఏటా తమ పాఠశాలలో విద్యార్థి నాయకులను ఇదే పద్ధతిలో ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులంతా తమ సహకారం అందిస్తున్నారని హెచ్ఎం తెలిపారు. -
రాజ్ భవన్ స్కూల్.. నావల్ల కాదు బాబోయ్!
సోమాజిగూడ: సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిస్థానంలో ఉన్న రాజ్‌భవన్ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ విధులు నిర్వహించలేనని చేతులెత్తేశారు. ఈ స్కూల్లో హెచ్ఎంకు కనీసం రూమ్ కూడా లేదని, రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని వాపోయారు. ఇక్కడ విధులు నిర్వహించడం తనవల్ల కాదంటూ.. తనను ఆ స్కూలు నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ డీఈఓ వెంకటనర్సమ్మకు రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అయితే డీఈఓ విజ్ఞప్తిని ఇప్పటికీ అంగీకరించలేదు. అయినప్పటికీ ఆయన గత 10 రోజుల నుంచే పేరెంట్ స్కూలు (బేగంపేట్–2)కు హాజరవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజ్‌భవన్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా విద్యాశాఖ 20మంది విద్యా వలంటీర్లతో పాటు సమీప పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఇక్కడ నియమించింది. ఇదే సమయంలో హెచ్ఎంగా బేగంపేట్–2 పాఠశాలకు చెందిన సుమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం పాఠశాలలో 1,300 మంది విద్యార్థులుడగా.. 10 మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉపాధ్యాయులు, 15 మంది విద్యా వలంటీర్లు ఉన్నారు. ఇక ప్రైమరీ సెక్షన్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు 10 మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. తాజాగా హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ తానిక్కడ విధులు నిర్వర్తించలేనని, పేరెంట్ స్కూలుకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల డీఈఓకు లేఖ రాశారు. దీనిపై డీఈఓ వెంకటనర్సమ్మ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన మాత్రం గత పది రోజులుగా స్కూలు రావడం మానేశారు. కనీసం రూమ్ కూడా లేదు... ఈ విషయంపై ఇన్చార్జి హెచ్ఎం సుమన్‌ను వివరణ కోరగా... తాను బేగంపేట్–2 స్కూలుకు వెళ్తున్నట్లు చెప్పారు. అదేమంటే రాజ్‌భవన్ స్కూల్లో హెచ్ఎం కూర్చునేందుకు కనీసం రూమ్ కూడా లేదని, గత రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లోనే రాజ్‌భవన్ స్కూలును వీడి బేగంపేట్ స్కూలుకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
రాజ్‌భవన్ స్కూల్ వద్ద గందరగోళం
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. ఎండల తీవ్రత తగ్గనప్పటికీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో వేసవి సెలవులు ముందుకు జరిగాయి. వార్షిక విద్యా ప్రణాళికలను ఖరారు చేసిన ప్రభుత్వం.. సర్కారు బడుల్లో బడిబాటకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే జూన్ 1 నుంచే పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాజ్‌భవన్ ప్రభుత్వం పాఠశాల ఈరోజు ప్రారంభమైంది. దీంతో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద బారులు తీరారు. అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే.. అడ్మిషన్లు ఎలా పూర్తి అవుతాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులకు సర్దిచెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. -
‘పది’లో మాస్ కాపీయింగ్..
బోధన్ టౌన్ : పట్టణంలోని బీటీనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పరీక్ష కేంద్రంలో చిటీలు అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సోమవారం హాల్చల్ చేస్తున్నాయి. కొందరు యువకులు పరీక్ష కేంద్రం వద్ద చిటీలు అందించడానికి గోడలు ఎక్కిన దృశ్యాలను, విద్యార్థి సంఘాల నాయకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పరీక్షకేంద్రాల వద్ద పకడ్భందీగా ఏర్పాటుచేశామని, మాస్‌కాపీయింగ్‌కు తావులేదని అధికారులు చెబుతున్నా, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదికాగా సోమవారం పట్టణంలోని పరీక్ష కేంద్రాలను డీఈవో నాంపల్లి రాజేశ్ తనిఖీ చేశారు. -
పాఠశాలలో కొట్టుకున్న ఉపాధ్యాయులు
హన్వాడ(మహబూబ్‌నగర్): విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలని ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బాహాబాహీకి దిగిన వైనమిది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నత పాఠశాలలో పనిచేసే హిందీ పండిట్ నాగేష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు చంద్యానాయక్, గణితం టీచర్ హన్మంతునాయక్, ఇంగ్లిష్ టీచర్ శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలలోనే వ్యక్తిగతంగా భోజనం తయారు చేయించుకునేవారు. ఇందుకోసం సొంతంగా సరుకులు తెచ్చుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ స్టౌ కూడా సమకూర్చున్నారు. కొన్నాళ్లు ఇది బాగానే సాగిన బి య్యం, సరుకులు అయిపోవడంతో గొడవలు మొదల య్యాయి. ప్లేట్లు, ఇతర సామాగ్రిని తోటి వారికి తెలియ కుండా హిందీ పండిట్ నాగేష్ ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన మిగతా ఉపాద్యాయులు నాగేష్‌ను నిలదీశారు. ఆ తర్వాత నాగేష్ మిగతా వారితో కలిసేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఇంతలో నాగేష్ వారు వం డుకునే ఎలక్ట్రిక్ స్టౌను పగలగొట్టాడు. విషయం తెలి యడంతో మిగతా ముగ్గురు ఆయనను ప్రశ్నించారు. ఈక్రమంలో మంగళవారం చంద్యానాయక్.. నాగేష్‌పై దాడి చేయడంతో గొడవ పెద్దదైంది. దీంతో మిగతా ఉపాధ్యాయులు సర్దిచెప్పారు. వ్యక్తిగత గొడవలే.. ఉపాధ్యాయులు నాగేష్, చంద్యానాయక్ ఒకే కాలనీలో ఉంటుండగా.. చంద్యానాయక్ తన ఇంటి నిర్మాణం కో సం బేస్మెంట్ రాయిని నాగేష్ నుంచి తీసుకున్నాడని హెచ్ఎం విజయరామరాజు తెలిపారు. దీనికి సంబంధిం చి డబ్బు విషయమై గొడవ జరగగా కొట్టుకున్నారని చె ప్పారు. ఎంఈఓ రాజునాయక్ మాట్లాడుతూ ఉపాధ్యా యులిద్దరూ వ్యక్తిగత గొడవతో కొట్టుకున్నారని తెలిపా రు. విషయాన్ని డీఈఓకు తెలియజేశామని చెప్పారు. -
ఆదిలోనే మొరాయింపు
►నిరుపయోగంగా బయోమెట్రిక్ యంత్రాలు ►పాఠశాలల్లో అమలుకాని ఈ–హాజరు ►చోద్యం చూస్తున్న అధికారులు ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయపాలన పాటించడం, మధ్యాహ్నభోజనంలో అక్రమాలు నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఈ–హాజరు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు గాను కోట్ల రూపాయల వ్యయంతో బయోమెట్రిక్ యంత్రాలు అందజేసి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కానీ ప్రారంభంలోనే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ–హాజరు అటకెక్కింది. బద్వేలులోని ఉన్నత పాఠశాలలో దాదాపు 1,100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు పది యంత్రాలను ప్రభుత్వం అందజేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఉపయోగించలేదు. ఉపాధ్యాయులు,విద్యార్థులు హాజరు వేయలేదు. జిల్లాలో 3,178 పాఠశాలలు ఉండగా వీటిలో 11,743 మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా 361 పాఠశాలలో ఈ–హాజరు ప్రవేశపెట్టారు. వీటిల్లో ఉన్న 3,764 మంది ఉపాధ్యాయులు, 55,886 మంది విద్యార్థులు బయోమెట్రిక్ హాజరు వేయాలని పేర్కొన్నారు. ఇందుకుగాను మొత్తం 5,129 బయోమెట్రిక్, ఐరిష్ యంత్రాలు అవసరమవుతాయని నిర్ణయించారు. ఇప్పటి వరకు 359 ఉన్నత పాఠశాలల్లో 989 యంత్రాలను రిజిస్టర్ చేశారు. మిగిలినవి అందజేసినా వాటిని రిజిస్టర్ చేయకుండా బీరువాల్లో భద్రపరిచారు. ఒక శాతం ఉపాధ్యాయులు కూడా బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగించడం లేదు. విద్యార్థుల ఈ–హాజరు శాతం సున్నా. జిల్లాలో ప్రతి రోజు ఐదు యంత్రాలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ నెల 17న పరిశీలించగా 13మంది ఉపాధ్యాయులు ఈ–హాజరు వేశారు. వారిలో కొండాపురం మండలంలో ఆరుగురు, దువ్వూరులో ఐదుగురు, వీరబల్లి, చిన్నమండెం మండలాలలో ఒకరు వంతున ఈ–హాజరు నమోదు చేశారు. 18న కొండాపురంలో 11 మంది, దువ్వూరులో ఐదుగురు, వీరబల్లిలో నలుగురు, చిన్నమండెంలో ఒకరు వంతున హాజరు నమోదు చేశారు. 19న కొండాపురంలో 9 మంది , దువ్వూరులో ఇద్దరు, ఒంటిమిట్టలో ముగ్గురు, వీరబల్లిలో నలుగురు, చిన్నమండెంలో ముగ్గురు మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేశారు. పని చేయకపోవడంతోనే... బయోమెట్రిక్ హాజరుకు ప్రభుత్వం అందజేసిన యంత్రాలు నాసిరకంగా ఉన్నాయని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల 3–జీ నెట్వర్క్ ఉండకపోవడంతో హాజరు వేయడం కుదరడం లేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేద్దామన్నా ఒక్కో పర్యాయం 3 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. ఒక్కో యంత్రంలో వందమంది విద్యార్థులు హాజరు వేయాలని నిర్ణయించారు. నెట్వర్క్ సరిగా లేని సమయంలో వంద మంది నమోదు చేయాలంటే 3 నుంచి 4 గంటల సమయం పట్టవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒక్కొ యంత్రానికి ప్రభుత్వం రూ.7వేలకు పైనే వెచ్చించిందని సమాచారం. ఈ లెక్కన రూ.లక్షల ఖర్చు చేసి అందజేసిన యంత్రాలు మూలన పడటంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ–హాజరు విషయమై ఆయా పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. అవగాహన లోపం.. అందని సాంకేతిక సహాయం యంత్రాల వినియోగంలో చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా పరిష్కరించలేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యుత్ సమస్య కూడా ఉండటంతో చార్జింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినా సమస్య పరిష్కరించడంలో చొరవ చూపడం లేదు. వీటిని సరఫరా చేసిన ఏజెన్సీ నిర్వాహకులు సహకారం అంతంతమాత్రమే. సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేస్తే తాము ఇచ్చే సమయంలో సరిగానే ఉన్నాయని చెబుతూ తప్పించుకుంటున్నారని కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
బడికి వస్తే నెలకు రూ.200
విద్యార్థులకు ఎంపీటీసీ ప్రోత్సాహకం రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ ప్రభుత్వ హైస్కూల్ కు వచ్చే పొరుగు గ్రామాల విద్యార్థులకు ఒక్కొక్క రికి ప్రోత్సాహకంగా ప్రతి నెల రూ.200 ఇస్తానని ఎంపీటీసీ సభ్యుడు మాలోతు నర్సింహ ప్రకటిం చారు. ఇబ్రహీంపూర్లో శుక్రవారం జరిగిన గ్రామ సందర్శనలో హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య 73 మాత్రమే ఉందని, పక్కనే ఉన్న ఫతేషాపూర్, మాదారం ప్రాథమిక పాఠశాలల్లో చదివిన తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్న ఇక్కడి జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులు రావడం లేదని ఎంఈవో జయసాగర్ వద్ద గ్రామస్తులు వాపోయారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ నర్సింహ మాట్లాడుతూ హైస్కూల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా ఫతేషాపూర్, మాదారం గ్రామాల విద్యా ర్థులు ఇతర గ్రామాలకు వెళ్లడం బాధాకరమన్నారు. నిడిగొండ, ఖిలాషాపూర్ పాఠశాలలకు వెళ్లే ఫతేషా పూర్, మాదారం విద్యార్థులు ఇబ్రహీంపూర్ పాఠశాలలో చేరితే నెలకు ఒక్కొక్కరికి రూ. 200 చొప్పున ప్రతి నెల ఇస్తానని ఎంపీడీవో బానోతు సరిత, స్పెషలాఫీసర్ నరేందర్‌రెడ్డి, ఎంపీపీ దాసరి అనిత సమక్షంలో ఆయన ప్రకటించారు. -
విద్యార్ధులను కాపాడి ప్రాణాలు వదిలిన హెచ్ఎం
-
పాఠశాలలో విషాదం: కరెంట్ షాక్ తగిలి హెచ్ఎం మృతి
పూడూరు: స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల కోసం జెండాను ఏర్పాటుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన విద్యార్థులను కాపాడే ప్రయత్నంలో ఓ ప్రధానోపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలిచివేసింది. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలోప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కలువ ప్రభావతి (40) మరణించారు. పెద్ద ఉమ్మాంతాల్ గ్రామానికి చెందిన ప్రభావతి.. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం స్కూల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకుగానూ ఆదివారం పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలోనే విద్యార్థులు కీర్తన, గణేష్, శివతేజ, మధుప్రియలు జెండా కర్రను జరుపుతుండగా, విద్యుధాఘాతానికి గురయ్యారు. వెంటనే స్పంఇంచిన ప్రభావతి.. విద్యార్థులను పక్కకునెట్టేసి.. ప్రమాదంలో చిచ్కుకుపోయారు. స్పృహకోల్పోయిన ఆమెను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రభావతి మరణించినట్లు వైద్యులు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి మృతి
జానీబాషాపురంలో విషాధ ఛాయలు రాజంపేట టౌన్: కడపలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి షేక్ అన్వర్ బాషా (16) మృతి చెందాడు. రాజంపేట పట్టణం జానీబాషాపురంకు చెందిన అన్వర్‌బాషా ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులు బుధవారం జానీబాషాపురంకు తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం స్వగృహానికి చేరగానే తల్లిదండ్రులు, సోదరులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్రెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పోలా వెంకటరమణారెడ్డిలు మృతదేహాన్ని సంద ర్శించి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం ఏ.శంకర్రాజు, ఫిజికల్ డెరైక్టర్ ఎస్.షామీర్‌బాషా, ఉపాధ్యాయ బృందం అన్వర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఫిజికల్ డెరైక్టర్ ఎస్.షామీర్‌బాషాకు అన్వర్ ప్రియ శిష్యుడు కావడంతో మృతదేహాన్ని చూసి ఆయన తట్టుకోలేక పోయారు. ఇటీవల చెన్నైలో జరిగిన బాల్‌బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీల్లో అన్వర్ బంగారు పతకాన్ని సాధించాడని, మంచి క్రీడాకారుడిని కోల్పోయామని షామీర్‌బాషా కన్నీరు, మున్నీరయ్యారు. అన్వర్ మృతికి సంతాప సూచికంగా ప్రభుత్వ హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు. అన్వర్ మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్ఆర్ .యూసఫ్, ఎస్.జాకీర్‌హుస్సేన్, దండు గోపీ, జీ.హుస్సేన్‌లు ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల ప్రభుత్వ జూని యర్ కళాశాలలో జరిగిన ఓ సంఘటనకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రమణరాజు అన్వర్‌పై కేసు నమోదు చేయించడంతో ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులు మృతదేహం వద్దకు వచ్చిన సమయంలో బంధువులు రమణరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైస్కూల్లో పందుల గోల
-
కుంటరోడ్ స్కూల్ రెజ్లర్లకు 5 పతకాలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జిల్లా రెజ్లర్లు రాణించారు. ఈ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న ఉస్మాన్‌గంజ్‌లోని కుంటరోడ్ గవర్నమెంట్ హైస్కూల్ రెజ్లర్లు పతకాల పంట పండించారు. ఇటీవల మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 42 కేజీల విభాగంలో అర్జున్ కుంబే విజేతగా నిలిచాడు. అతను తన విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఎం.శివానంద కుమార్ (63 కేజీలు) రజత పతకాన్ని గెల్చుకోగా, ముఖేష్ జాదవ్ (38 కేజీలు) కాంస్య పతకాన్ని గెలిచాడు. అలాగే మెదక్ జిల్లా సదాశివపేట్‌లో జరిగిన రాష్ట్ర అండర్-19 రెజ్లింగ్ పోటీల్లో ఎం.మోనిక (44 కేజీలు) రజత పతకాన్ని సాధించగా, ప్రియాంక(48 కేజీలు) కాంస్యం దక్కించుకుంది. జాతీయ స్కూల్ పోటీలకు... ఈ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన అర్జున్ జనవరి 2 నుంచి 8 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. సంగారెడ్డి, సదాశివపేట్‌లో జరిగిన రాష్ట్ర స్కూల్ రెజ్లింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన స్కూల్ విద్యార్థులతోపాటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ను కుంటరోడ్ గవర్నమెంట్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయడు ఎం.శ్రీధర్ రెడ్డి అభినందించారు. -
షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్లో అండ ర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను షేక్‌పేట్‌కు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్) జట్టు చేజిక్కించుకుంది. అండర్-17 బాలుర టీమ్ టైటిల్‌ను మలక్‌పేట్‌కు చెందిన ఫ్రభుత్వ హైస్కూల్(జీహెచ్ఎస్) జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన అండర్-14 బాలుర విభాగం ఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టు 37-13 స్కోరుతో సునాయాసంగా మలక్‌పేట్ జీహెచ్ఎస్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టులో ఆర్.శ్రవణ్, లక్ష్మణ్ నాయక్, పి.భాను చక్కటి ఆటతీరును ప్రదర్శించి తమ జట్టును విజయపథాన నడిపించారు. సెమీఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 59-8తో అలవోకగా ఆలియా జీహెచ్ఎస్పై, మలక్‌పేట్ జీహెచ్ఎస్ 8-6తో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ హైస్కూల్‌పై గెలిచాయి. అండర్-17 బాలుర ఫైనల్లో మలక్‌పేట్ జీహెచ్ఎస్ 34-22తో శ్రీ జె.వి.హైస్కూల్‌పై గెలిచింది. సెమీస్‌లో మలక్‌పేట్ జీహెచ్ఎస్ 28-20తో ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్పై, శ్రీ జె.వి. హైస్కూల్ 28-20తో వెంకట్రావ్ మెమోరియల్ హైస్కూల్‌పై నెగ్గాయి. -
ఐటీ నుంచి ఊరట
సాక్షి, సిటీబ్యూరో:: హైకోర్టు తాజా ఉత్తర్వులతో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు కాస్త ఊరట లభించింది. గత నెల 18న ఐటీ శాఖ స్వాధీనం చేసుకొన్న హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతాలకు హైకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా విముక్తి లభించింది. దీంతో నెల రోజులుగా స్తంభించిన హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతాలన్నీ గురువారం నుంచి యథావిధిగా పని చేయడం ప్రారంభించాయి. బిల్లుల చెల్లింపులు చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే తమ వద్ద ఉన్న డీడీలను ఎన్ క్యాష్ చేసుకొనేందుకు అధికారులు వాటిని ఆయా బ్యాంకులకు పంపారు. ఆదాయార్జనకు కసరత్తు చేస్తున్నారు. ఊతమిచ్చిన ఉత్తర్వులు ఆదాయ పన్ను బకాయీలపై ఇన్‌కంట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు హెచ్ఎండీఏకు మరింత ఊతాన్నిచ్చాయి. ఈ నెల 16లోగా ఆదాయ పన్ను శాఖకు రూ.15కోట్లు చెల్లించాలని ఈ నెల 5న ఐటీ ట్రిబ్యునల్ హెచ్ఎండీఏను ఆదేశించింది. 21 నుంచి రెగ్యులర్ హియరింగ్ ప్రారంభమవుతుందని ఇందుకు హెచ్ఎండీఏ సిద్ధం కాలేకపోతే.. నెలకు రూ.10కోట్ల చొప్పున 6నెలల పాటు రూ.60 కోట్లు చెల్లించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కలవరపడ్డ హెచ్ఎండీఏ గత మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో హైకోర్టు.. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ తక్షణం రూ.10కోట్లు మాత్రం ఐటీకి చెల్లించాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. దీంతో ఖాతాల విడుదలకు మార్గం సుగమమైంది. స్పందించని సర్కార్ 2007-08లో హెచ్ఎండీఏ సర్కార్ భూముల విక్రయం ద్వారా రూ.2684 కోట్లు ఆర్జించి ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ ఆదాయంపై రూ.630 కోట్లు ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ హెచ్ఎండీఏకు నోటీసులు జా రీచేసింది. వడ్డీతో సహా మొత్తం రూ.700 కోట్లకు పైగా చెల్లించాలంటూ ఐటీ అధికారులు వత్తిడి తేవడంతో ఇప్పటికే మూడుసార్లు రూ.200 కోట్ల దాకా హెచ్ఎండీఏ చెల్లించింది. ఆపై చేతులెత్తేసింది. దీంతో ఐటీ అధికారులు గత నెల 18న హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి రూ.25కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. -
కుండపోత వర్షం!
చోడవరం,న్యూస్‌లైన్: ఇటీవల ఎన్నడూ లేనం త భారీగా బుధవారం కుండపోత వర్షం కురి సింది. రైతాంగానికి ఊరటనిచ్చింది. నీలం తుపాను తర్వాత ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పట్నుంచి దుక్కు వర్షం కోసం రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ముగుస్తున్న తరుణంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం చోడవరంలో అత్యధికంగా 7 సెం.మీ.ల వర్షపాతం నమోదయిం ది. మాడుగుల, కె.కోటపాడులలో 5 సెం.మీ లు, చీడికాడలో 4.5, రావికమతంలో 4, బుచ్చెయ్యపేటలో 3 సెం.మీల చొప్పున వర్షం కురి సింది. చోడవరం పట్టణంలో లోతట్టు ప్రాంతాలతో పాటు గవర్నమెంట్ హైస్కూల్ ఆవరణ, బానీకోనేరు, రెల్లివీధి, బాలాజీనగర్, న్యూశాం తినగర్ ప్రాంతాలు నీటమునిగాయి. చెరువుల్లో ను పంట పొలాల్లోనూ భారీగా నీరు చేరింది. కొండగెడ్డల్లో నీరు ప్రవహించింది.ఈ వర్షం చెర కు, అపరాల పంటలకు ఎంతో మేలు చేయగా వరి నాట్లు జోరందుకోవడానికి దోహదపడనున్నాయి. మెరుపులు, ఉరుములు పెద్ద శబ్ధాలా తో రావడంతో జనం భయకంపితులయ్యారు.