ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జిల్లా రెజ్లర్లు రాణించారు. ఈ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న ఉస్మాన్‌గంజ్‌లోని కుంటరోడ్ గవర్నమెంట్ హైస్కూల్ రెజ్లర్లు పతకాల పంట పండించారు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జిల్లా రెజ్లర్లు రాణించారు. ఈ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న ఉస్మాన్‌గంజ్‌లోని కుంటరోడ్ గవర్నమెంట్ హైస్కూల్ రెజ్లర్లు పతకాల పంట పండించారు. ఇటీవల మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 42 కేజీల విభాగంలో అర్జున్ కుంబే విజేతగా నిలిచాడు.
అతను తన విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఎం.శివానంద కుమార్ (63 కేజీలు) రజత పతకాన్ని గెల్చుకోగా, ముఖేష్ జాదవ్ (38 కేజీలు) కాంస్య పతకాన్ని గెలిచాడు. అలాగే మెదక్ జిల్లా సదాశివపేట్‌లో జరిగిన రాష్ట్ర అండర్-19 రెజ్లింగ్ పోటీల్లో ఎం.మోనిక (44 కేజీలు) రజత పతకాన్ని సాధించగా, ప్రియాంక(48 కేజీలు) కాంస్యం దక్కించుకుంది.
జాతీయ స్కూల్ పోటీలకు...
ఈ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన అర్జున్ జనవరి 2 నుంచి 8 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. సంగారెడ్డి, సదాశివపేట్‌లో జరిగిన రాష్ట్ర స్కూల్ రెజ్లింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన స్కూల్ విద్యార్థులతోపాటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ను కుంటరోడ్ గవర్నమెంట్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయడు ఎం.శ్రీధర్ రెడ్డి అభినందించారు.