L.B stadium
-
భారత్ అలవోకగా...
ఫైనల్‌కు చేరిన సానియా బృందం నేడు ఫిలిప్పీన్స్‌తో తుది పోరు ఫెడ్ కప్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2)లో భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో తుర్క్మెనిస్తాన్పై ఘన విజయం సాధించింది. భారత క్రీడాకారిణుల జోరు ముందు తుర్క్మెనిస్తాన్ అమ్మాయిలు ఏ మాత్రం ప్రతిఘటన కనబర్చకుండా తలవంచారు. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రార్థనా తోంబరే 6-0, 6-2తో జహానా బెరమోవాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ 51 నిమిషాల్లో ముగిసింది. రెండో సింగిల్స్‌లో కూడా అంకితా రైనా చెలరేగింది. ఈ మ్యాచ్‌లో అంకితా 6-1, 6-2తో అనస్తసియ ప్రెంకోను ఓడించింది. ఈ మ్యాచ్ ముగిసేందుకు 52 నిమిషాలు పట్టింది. సెమీస్ ఫలితం రెండు మ్యాచ్‌లకే తేలిపోవడంతో డబుల్స్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. మరో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్ 2-1 తేడాతో ఇండోనేసియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే ఫైనల్లో ఫిలిప్పీన్స్‌తో భారత్ తలపడుతుంది. శుక్రవారం జరిగిన ఇతర వర్గీకరణ మ్యాచ్‌లలో మలేసియా 2-0తో ఇరాన్‌పై... పసిఫిక్ ఓషియానియా 3-0తో సింగపూర్‌పై గెలుపొందాయి. -
తెలంగాణ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
-
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్
ఎల్బీ స్టేడియం: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీలో షణ్ముఖ తేజ, రోహన్ విజేతలుగా నిలిచారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తలపడే విభాగంలో షణ్ముఖ తేజ గెలువగా, 5వ తరగతిలోపు విద్యార్థులు పోటీ పడే విభాగంలో ఎం.సాయి రోహన్ నెగ్గాడు. ఫైనల్స్ ఫలితాలు: 6-10 క్లాస్ విభాగం: 1.షణ్ముఖ తేజ (5), 2.పి.సుశీల్‌రెడ్డి (5), 3. బి.సాయి చాణి క్య (5), 4. డి.గణేష్ (4), 5. ఎన్. వెంకట్(4), 6. డి.సాయి శ్రవణ్ (4), 7. బి.సాయి రేవంత్‌రెడ్డి (4), 8. భవేష్ (4), 9.సి.హెచ్.మాధురి, 10. హరి చరణ్ సాయి (4). 5 క్లాస్ విభాగం: 1.ఎం.సాయి రోహన్ చౌదరి (5), 2. సి.హెచ్. కార్తీక్ సాయి (5), 3. సి.హెచ్.వర్షిత (4), 5.సర్వజ్ఞి (4), 5.ఎస్.యశస్ నందన్(4), 6. కె.జి.సాత్విక (4), 7. సూరజ్ (4), 8. జస్వంత్ (4), 9. వి.ఆర్.ఎస్. విరించి (4), 10.వెంకట రఘనందన్ (4). -
భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్
ఓయూ ఇంటర్ కాలేజి మహిళల టోర్నీ ఎల్బీ స్టేడియం: ఓయూ ఇంటర్ కాలేజి మహిళల క్యారమ్ టోర్నీలో భవాన్స్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బర్కత్‌పురాలోని అవంతి కాలేజిలో జరిగిన ఫైనల్లో భవాన్స్ కాలేజి జట్టు 2-1 స్కోరుతో సెయింట్ ఆన్స్ కాలేజి (మెహిదీపట్నం) జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వనిత కాలేజి 2-1తో వెస్లీ కాలేజి జట్టుపై గెలిచింది. సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 2-1తో ఎస్ఎన్ వనిత డిగ్రీ కాలేజి జట్టుపై, సెయింట్ ఆన్స్ 2-0తో వెస్లీ కాలేజి జట్టుపై నెగ్గాయి. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు. -
బాక్సింగ్ టోర్నీలో సంతోష్‌కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలిండియా పురుషుల ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్లు సత్తా చాట్టారు. విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ బాక్సర్ సంతోష్ పసిడి పతకం గెలిచాడు. పి.మనోజ్‌రెడ్డి, ఎం.డి.ఇమ్రాన్, అనురాగ్ కాంస్య పతకాలను గెలుపొందారు. ఎండి. జాహెద్ బెస్ట్ లూజర్ అవార్డును అందుకున్నాడు. నేడు బాక్సింగ్ సెలక్షన్ కమ్ టోర్నీ రాష్ట్ర సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ (టీబీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ఆసక్తి గల బాక్సర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ప్రతాప్‌రెడ్డి (94401-63038)ని సంప్రదించ వచ్చు. -
మితుల్-ధనుష్ జోడీకి టైటిల్
రుక్మిణీ బాయి స్మారక టీటీ ఎల్బీ స్టేడియం: రుక్మిణీ బాయి స్మారక ప్రైజ్‌మనీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో అండర్-12 బాలుర డబుల్స్ టైటిల్‌ను మితుల్ అగర్వాల్, ఎ.ధనుష్ జోడి (బీవీబీ, జూబ్లీహిల్స్) చేజిక్కించుకుంది. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో మితుల్-ధనుష్ జోడి 3-0తో వేణు-సుదర్శన్ ద్వయం (గీతాంజలి దేవాశ్రయ్ స్కూల్)పై విజయం సాధించింది. ఈ పోటీల విజేతలకు ఎస్బీఐ జన రల్ మేనేజర్ హేమంత్ ట్రోఫీలను అందజేశారు. మిగతా ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు అండర్-12 బాలుర సింగిల్స్: 1. సుదర్శన్ (గీతాంజలి దేవాశ్రయ్ స్కూల్), 2. కేశవన్ కన్న(జీఈపీఎస్). అండర్-12 బాలికల సింగిల్స్: 1. రమ్య(సెయింట్ ఆంథోని స్కూల్), 2. రుచిరల్ (సెయింట్ పాల్స్ హైస్కూల్). అండర్-12 బాలికల డబుల్స్: 1. దేవయాని-భవిత జోడి (గీతాంజలి), 2. కీర్తన, ఇషిత జోడి (రోజరి కాన్వెంట్ స్కూల్). -
గౌస్ హ్యాట్రిక్ స్పోర్టింగ్ జయభేరి
సి-డివిజన్ ఫుట్‌బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం: సి-డివిజన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ 5-0 గోల్స్‌తో సీసీఓబీ జూనియర్ జట్టుపై ఘనవిజయం సాధించింది. స్పోర్టింగ్ ఆటగాడు గౌస్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్ ఆటగాళ్లు కదం తొక్కారు. రెహ్మాన్, అబ్బాస్ తలా ఒక గోల్ చేశారు. తిరుమలగిరి విలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో సచ్దేవ్ ఐడీఎల్ జట్టు 6-0 గోల్స్ తేడాతో సికింద్రాబాద్ బ్లూస్ (బి)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో జయుడు రెండు గోల్స్, క్యానీ, షాన్, రోహిత్, ఉదయ్‌లు తలా ఒక గోల్ చేశారు. జింఖానా మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సుసాయి సీనియర్ జట్టు 2-1తో ఓకే స్పోర్టింగ్ క్లబ్ జట్టును ఓడించింది. -
హైదరాబాద్ బాక్సర్లదే హవా
తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ బాక్సర్లు విజృంభించారు. రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శనివారం ఈ పోటీలు జరిగాయి. 28-30 కేజీల విభాగం ఫైనల్లో ఎం.డి. నవీద్ (నిజామాబాద్)... ఎం.డి. షాహిద్ (మహబూబ్‌నగర్)పై గెలిచి టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి బాక్సింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత జయరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫలితాలు: 30-32 కేజీలు: 1.తవజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2.ఎం.డి. రయీస్(రంగారెడ్డి). 32-34 కేజీలు: 1.ఎం.డి. రయీస్ (హైదరాబాద్), 2..ఎ. డేవిడ్(రంగారెడ్డి), 34-36 కేజీలు: 1. డొనాల్డ్ విన్స్టన్ (రంగారెడ్డి), 2.అబ్దుల్ రెహ్మాన్(హైదరాబాద్). 36-38 కేజీలు: త్రిజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2. ఎస్. నిఖిల్ రాజ్(మెదక్). 38-40 కేజీలు: 1. నితిన్ (కరీంనగర్), 2.ఉస్మాన్ (హైదరాబాద్). 40-42 కేజీలు: 1.ఎం.డి.సద్దాం (మహబూబ్‌నగర్), 2.డేవిడ్ (హైదరాబాద్), 42-46 కేజీలు: 1.ఎస్. నితిన్ రాజ్ (హైదరాబాద్), 2.హేమంత్ సింగ్ (ఆదిలాబాద్). 48-50 కేజీలు: 1.ఆర్య (రంగారెడ్డి), 2.రాజ్ (మెదక్). 50-52 కేజీలు: 1.దీప్తాంశ్(నల్లగొండ), 2.సి. సాయికుమార్ (ఆదిలాబాద్). 52-54 కేజీలు: 1.ఎం.డి. ఉస్మాన్(హైదరాబాద్), 2.ఎస్.ఎ. గఫార్ (రంగారెడ్డి). -
ఆర్బీఐపై హెచ్ఏఎల్ గెలుపు
సి-డివిజన్ ఫుట్‌బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం: సి-డివిజన్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్లో హెచ్ఏఎల్ జట్టు 6-0 గోల్స్‌తో ఆర్బీఐ జట్టుపై విజయం సాధించింది. తిరుమలగిరి విలేజ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో హెచ్ఏఎల్ జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాహుల్, ఇమాన్యుయెల్, డెంజిల్, గణేష్, కార్తీక్, శరత్‌లు తలా ఒక గోల్స్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఎయిరిండియా, సోషల్ స్పోర్టింగ్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. శనివారం ఓయూ మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో ఏకే స్పోర్టింగ్ క్లబ్‌తో సీసీఓబీ (జూనియర్) తలపడుతుంది. జింఖానా మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో యంగ్ స్పోర్టింగ్ క్లబ్‌తో సికింద్రాబాద్ బ్లూస్, అలాగే తిరుమలగిరి విలేజ్ మైదానంలో జరిగే మ్యాచ్‌లో కంటోన్మెంట్ ఫుట్‌బాల్ క్లబ్‌తో హెచ్ఏఎల్ ఢీకొంటుంది. -
‘టి’ బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట: లవ్ అగర్వాల్
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేయనున్నట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు, పలు ప్రతిపాదనలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న క్రీడ పథకాలు, నూతనంగా నిర్మించనున్న స్పోర్ట్స్ హాస్టళ్లు, ఆధునిక క్రీడా సామాగ్రి కొనుగోలుకు కావాల్సిన బడ్జెట్ సిద్ధం చేయాలని అధికారులను లవ్ అగర్వాల్ ఆదేశించారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్‌లో వాటర్ స్పోర్ట్స్ కోసం ఆధునిక వాటర్ బోట్స్, షూటింగ్ రే ంజ్లో కొత్త ఆయుధాల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సదుపాయాలతో తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని లవ్ అగర్వాల్ క్రీడాధికారులను ఆదేశించారు. మన ఊరు-మన ప్రణాళికనూ రూపొందించాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, రాణించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కొత్తగా కోచ్‌లు, ఉద్యోగుల నియామకాలు, క్రీడాసంఘాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా సమర్థంగా అమలు చేయాలని సూచించారు. -
ఆకాశ్, అనన్యలకు టైటిల్స్
అండర్-14 టెన్నిస్ టోర్నీ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎల్. ఆకాశ్ రెడ్డి, అనన్య మోహన్ విజేతలుగా నిలిచారు. ఇమాన్యుయెల్ కోచింగ్ సెంటర్, సూర్యోదయ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్‌ను ఆకాశ్, బాలికల టైటిల్‌ను అనన్య కైవసం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని అకాడమీలో మంగళవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఆకాశ్ రెడ్డి 3-6, 7-6, 6-4తో అమన్ అయూబ్‌ఖాన్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో అతను 5-3, 4-1తో చింతా ప్రణవ్‌పై, అయూబ్ ఖాన్ 4-2, 4-2తో లంక సుహిత్రెడ్డి పై గెలిచారు. బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో అనన్య మోహన్ 6-1, 6-3తో దామెర సంస్కృతిపై గెలిచింది. సెమీఫైనల్లో ఆమె 4-0, 4-0తో లిపిక మురమాలపై, సంస్కృతి 4-2, 3-5, 4-1తో సాహితిరెడ్డిపై గెలుపొందారు. అంతకుముందు జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో అకాశ్ 7-3తో రుచిత్ గౌడ్‌పై, అయూబ్ ఖాన్ 7-2తో పి.కౌశల్‌పై, సుహిత్రెడ్డి 7-4తో వల్లభనేని ప్రీతమ్‌పై, ప్రణవ్ 7-4తో లోకాదిత్య వర్ధన్‌పై నెగ్గారు. బాలికల క్వార్టర్స్‌లో సంస్కృతి 8-4తో లాస్య పట్నాయక్‌పై, అనన్య మోహన్ 8-2తో కె.అవంతికరెడ్డిపై, లిపిక 8-4తో పి.అమూల్యపై నెగ్గారు. -
‘స్ట్రాంగ్‌మాన్’ స్టీఫెన్
హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్టీఫెన్ మెరిశాడు. జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన 61 కేజీల విభాగం ఫైనల్లో స్టీఫెన్ అత్యుత్తమ పవర్లిఫ్టర్గా ఎంపికయ్యాడు. దీంతో అతనికి హైదరాబాద్ ‘స్ట్రాంగ్ మాన్’ అవార్డు దక్కింది. ఈ పోటీల విజేతలకు బేగంబజార్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ రాజ్, తెలంగాణ పవర్ లిఫ్టింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 59 కేజీలు: 1.జి.రమేష్ (460 కేజీలు), 2.బి.పవన్ కుమార్, 3.ఎం.భాను ప్రకాష్. 66 కేజీలు: 1.కె.స్టీఫెన్ (565 కేజీలు), 2.కె.దినేష్, 3.డి.శివకుమార్. 74 కేజీలు: 1.ఎం.జానకిరామ్ (570 కేజీలు), 2.జి.శేషు, 3. కె.మనోజ్ యాదవ్. 83 కేజీలు:1.ఎన్.అంజయ్య (572.5 కేజీలు), 2.ఎస్.కృష్ణ, 3.జె.నరేందర్. 93 కేజీలు: 1.కె.సంతోష్ (425 కేజీలు), 2. కె.శ్రీకాంత్, 3.ఎ.విక్టర్. 105 కేజీలు: 1.వై. రాఘవేంద్ర గౌడ్ (765 కేజీలు), 2.ఆర్.ఉదయ్ కృష్ణ. 120 కేజీలు: 1.ఎల్.ప్రవీణ్ (752 కేజీలు). ప్లస్ 120 కేజీలు: 1.బి.సుమిత్ (747.5 కేజీలు). -
వరుణ్, అంజలిలకు క్యాడెట్ టైటిల్స్
రాష్ట్ర ర్యాంకింగ్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బాలబాలికల క్యాడెట్ సింగిల్స్ టైటిళ్లను బి.వరుణ్ శంకర్, అంజలి గెలుచుకున్నారు. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ సందర్భంగా హైదర్‌గూడలోని స్కూల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ శంకర్ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ-జీటీటీఏ) 11-7, 14-12, 6-11, 13-11తో అద్వైత్ (ఆవా)పై విజయం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవామండలి-జీఎస్ఎం) 11-3, 6-11, 11-8, 11-7తో భవిత (జీఎస్ఎం)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలికల సింగిల్స్‌లో జి. ప్రణీత (జీఎస్ఎం), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీఫైనల్లో ప్రణీత 12-10, 11-8, 8-11, 11-6తో రాగ నివేదిత (జీటీటీఏ)పై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో వరుణి 11-7, 12-10, 12-10, 11-9తో వి.సస్య (ఆవా)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ సెమీస్‌లో సరోజ్ సిరిల్ (ఎస్‌పీటీటీఏ) 11-9, 11-6, 5-11, 12-10, 14-12తో సాయి తేజేశ్ (ఎస్‌పీటీటీఏ)పై, ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్ (జీటీటీఏ) 11-9, 12-10, 9-11, 11-8, 11-7తో అమాన్ ఉల్ రెహ్మాన్ (ఎస్‌పీటీటీఏ)పై గెలిచారు. ఫైనల్లో పోస్టల్, ఆర్బీఐ ఇంటర్ ఇన్స్టిట్యూషన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పోస్టల్, ఆర్బీఐ జట్లు ఫైనల్లోకి చేరాయి. సెమీఫైనల్లో ఆర్బీఐ 3-1తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై గెలిచింది. ఇదివరకే పోస్టల్ జట్లు ఫైనల్ పోరుకు అర్హత సంపాదించాయి. -
బాక్సింగ్ చాంప్ రాజు
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజి బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో 49 కేజీల టైటిల్‌ను ఎన్. రాజు (హైదరాబాద్) కైవసం చే సుకున్నాడు. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియం బాక్సింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఫైనల్లో రాజు.. మహబూబ్‌నగర్‌కు చెందిన అఖిల్ శ్రీగిరిపై గెలిచాడు. ఈపోటీల ముగింపు వేడుకలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ బాక్సర్ ఆర్. ప్రవీణ్ కుమార్ సింగ్, కోచ్ ఓంకార్ యాదవ్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 52 కేజీలు: 1. పి. మహేందర్ (హైదరాబాద్), 2. సదానంద్ (రంగారెడ్డి జిల్లా). 56 కేజీలు: 1. సి.హెచ్. ధీరజ్ (హైదరాబాద్), 2. వివేక్ సింగ్ (నల్లగొండ). 60 కేజీలు: 1. వెంకటేశ్వర్లు (మహబూబ్‌నగర్), 2. ఎం.డి. ఇంతియాజ్(కరీంనగర్). 64 కేజీలు:1. ఎస్.డేవిడ్ (హైదరాబాద్), 2. వినయ్ కుమార్ (మెదక్). 69 కేజీలు: 1. ఎస్.సాయి (హైదరాబాద్), 2. ఎం.డి. మతీన్ (కరీంనగర్). 75 కేజీలు: 1. ఆర్. అశోక్ నాయక్ (నల్లగొండ), 2. మనోజ్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా). -
సెయింట్ పాల్స్ శుభారంభం
తెలంగాణ టేబుల్ టెన్నిస్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సెయింట్ పాల్స్, భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్-జూబ్లీహిల్స్) జట్లు శుభారంభం చేశాయి. హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదలైన ఈ ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్టు 3-0తో డాన్ బాస్కో స్కూల్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్‌లో దివేష్ (సెయింట్ పాల్స్) 11-4, 19-17, 11-7తో జీవన్‌పై, రిత్విక్ (సెయింట్ పాల్స్) 11-7, 11-4, 11-5తో నిఖిల్‌పై గెలిచారు. డబుల్స్‌లో దివేష్-రిత్విక్ జోడి 11-9, 11-3, 11-5తో జీవన్-నిఖిల్ జోడిపై గెలిచింది. మరో మ్యాచ్‌లో బీవీబీపీఎస్ (సి) జట్టు 3-2తో దేవసియా స్కూల్ జట్టుపై గెలిచింది. సింగిల్స్‌లో ధనుష్ (బీవీబీపీఎస్) 11-5, 11-8, 11-8తో వినయ్‌పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో మితుల్ (బీవీబీపీఎస్) 8-11, 9-11, 5-11తో ప్రద్యుమ్న(దేవసియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లో భువన్-మితుల్ (బీవీబీపీఎస్) జోడి 11-4, 11-4, 12-10తో ప్రద్యుమ్న-యతీష్ (దేవసియా) జోడిపై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో ధనుష్ (బీవీబీపీఎస్) 9-11, 11-7, 8-11, 11-6, 4-11తో ప్రద్యుమ్న (దేవసియా) చేతిలో ఓడిపోగా, మితుల్ (బీవీబీపీఎస్) 11-7, 11-6, 12-10తో వినయ్(దేవసియా) పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 3-0తో మెరిడియన్‌పై, ఓక్రిడ్జ్ స్కూల్ 3-0తో బీవీబీపీఎస్పై గెలిచాయి. -
ఆలియా జీహెచ్ఎస్ శుభారంభం
స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం: విశాల్ స్మారక హైదరాబాద్ స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో ఆలియా గవర్నమెంట్ మోడల్ హైస్కూల్ (జీహెచ్ఎస్), గతి జీహెచ్ఎస్ జట్లు శుభారంభం చేశాయి. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ (హెచ్‌డీహెచ్‌ఏ) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన పోటీల్లో ఆలియా జీహెచ్ఎస్ జట్టు 7-6తో శివరాంపల్లి కేంద్రీయ విద్యాలయం (కేవీ)పై విజయం సాధించింది. రెండో లీగ్ మ్యాచ్‌లో గతి గవర్నమెంట్ హైస్కూల్ (బంజారాహిల్స్) 7-2తో ఎంవీఎం హైస్కూల్ (కొండాపూర్) జట్టుపై గెలిచింది. అంతకుముందు ఈ పోటీలను గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీహెచ్‌ఏ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి ఫ్రాంక్లిన్, హ్యాండ్‌బాల్ కోచ్‌లు రవి కుమార్, జగన్ మోహన్‌లు పాల్గొన్నారు. లీగ్ ఫలితాలు బాలుర విభాగం: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్) 9-0తో మమత హైస్కూల్ (సికింద్రాబాద్)పై, బ్లూ డైమండ్ ఈఎస్ఐ 7-0తో గవర్నమెంట్ హైస్కూల్ (విజయనగర్‌కాలనీ)పై, జీహెచ్ఎస్ (చాదర్‌ఘాట్) 5-4తో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (షేక్‌పేట్)పై, ఆలియా జీహెచ్ఎస్ 13-4తో చిరెక్ స్కూల్ (ఖాజాగూడ)పై, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ 6-0తో మమత హైస్కూల్‌పై, ఆర్మీ స్కూల్ 7-3తో నల్లగొండ జెడ్పీ హైస్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ (కింగ్ కోఠి) 1-0తో చిరెక్ స్కూల్ (ఖాజాగూడ)పై గెలిచాయి. బాలికల విభాగం: హోలీ ఫ్యామిలీ హైస్కూల్ (సికింద్రాబాద్) 2-0తో ఎంవీఎం హైస్కూల్ (కొండాపూర్)పై, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ 5-0తో మమత హైస్కూల్‌పై, నల్గొండ జెడ్పీ హెస్కూల్ 6-2తో చిరెక్ స్కూల్ (కొండాపూర్)పై, ఎంవీఎం హైస్కూల్ 5-1తో చిరెక్ పబ్లిక్ స్కూల్ (కొండాపూర్)పై విజయం సాధించాయి. -
సానియాకు ఇచ్చినట్లే మిగతా క్రీడాకారులకు ఇవ్వాలి
టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎల్బీ స్టేడియం: రాష్ట్రంలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు రాకపోవడం విచారకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, అంబర్పేట్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (టీకేఏ) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం టీకేఏ చైర్మన్ అయిన జి.కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు ఇచ్చిన భారీ నజరానాను ఇతర క్రీడాకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు, కోచ్‌లకు ఉపాధి కల్పించగలమనే భరోసా ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు తమ స్పానర్షిప్ కోసం రాజకీయ పార్టీల ఆఫీసులు, ఎమ్మెల్యేల చుట్టు తిరిగే అవసరం లేకుండా చూడాలన్నారు. అలాగే రాష్ట్రంలోని పార్టీలు రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ నేడు ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని అందిస్తున్న కబడ్డీని ఒలింపిక్ క్రీడల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం ఇక్బాల్ ఇకలేరు
ఎల్బీ స్టేడియం: జాతీయ బాల్ బ్యాడ్మింటన్ మాజీ ఆటగాడు ఎల్.ఎ.ఇక్బాల్ అలీ (78) అనారోగ్యంతో గురువారం కన్ను మూశారు. హైదరాబాదీ క్రీడాకారుడైన ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగిగా పదవీవిరమణ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ గత నెలలో జరిగిన ఒలింపిక్‌డే రన్‌కు హాజరై క్రీడాస్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సన్మానించారు. పలు జాతీయ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ల్లో సత్తాచాటిన ఆయనను భారత ప్రభుత్వం 1975లో అర్జున అవార్డుతో సత్కరించింది. కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన రాష్ట్ర జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఇక్బాల్ వద్ద శిక్షణ పొందిన రాంబాబు, రాజ్ కుమార్ తదితరులు జాతీయ చాంపియన్లుగా ఎదిగారు. ఇక్బాల్ మృతి పట్ల రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, హైదరాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు సి.హెచ్.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎ.రవీందర్ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
బాలికల చాంప్ ఫ్యూచర్ కిడ్స్
ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ ట్రోఫీ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ బాలికల టైటిల్‌ను చేజిక్కించుకుంది. సెయింట్ పాయిస్ హైస్కూల్ రెండో స్థానం పొందగా, మెరీడియన్ హైస్కూల్ జట్టుకు మూడో స్థానం దక్కింది. బాలుర టీమ్ టైటిల్‌ను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గెలుచుకుంది. ఇందులో మహాత్మా గాంధీ స్మారక (ఎంజీఎం) హైస్కూల్ రెండో స్థానం, ఆల్ సెయింట్ హైస్కూల్ మూడో స్థానం పొందాయి. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ టోర్నీని నిర్వహించారు. బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 47-32తో సెయింట్ పాయిస్ హైస్కూల్ (రామ్‌నగర్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 35-18తో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టుపై, సెయింట్ పాయిస్ 26-18తో మెరీడియన్ హైస్కూల్ (బంజారాహిల్స్)పై గెలిచాయి. బాలుర టైటిల్ పోరులో ఓక్రిడ్జ్ స్కూల్ జట్టు 47-28తో ఎంజీఎం హైస్కూల్ జట్టుపై గెలిచింది. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్రదర్ ప్రతాప్‌రెడ్డి విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.15 వేలు, రన్నరప్‌కు రూ. 7 వేలు, మూడో స్థానం పొందిన జట్లకు రూ. 5 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజయ్ పాల్గొన్నారు. -
క్యాడెట్ చాంప్స్ వరుణ్, అంజలి
సెయింట్ పాల్స్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ అకాడమీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణ్, అంజలి విజేతలుగా నిలిచారు. క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను గ్లోబల్ టీటీ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన బి.వరుణ్ శంకర్ కైవసం చేసుకున్నాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ట్రోఫీని ఎన్.అంజలి గెలుచుకుంది. హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో శనివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ 11-6, 11-7, 11-8తో అద్వైత్ (ఆనంద్‌నగర్ వెల్పేర్ అసోసియేషన్)పై విజయం సాధించాడు. బాలికల ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవా మండలి) 11-8, 11-6, 11-1తో రుచిరా రెడ్డి (ఎస్‌పీటీటీఏ)పై గెలిచింది. స్నేహిత్‌కు సబ్-జూనియర్ టైటిల్ సబ్-జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను నిరుటి విజేత ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్(జీటీటీఏ) నిలబెట్టుకున్నాడు. సబ్-జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో జి.ప్రణీత (జీఎస్ఎం) ఫైనల్లోకి చేరింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-4, 13-11, 11-4, 11-6తో సాయి తేజస్ (ఎస్‌పీటీటీఏ)పై నెగ్గాడు. బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత 11-4, 7-11, 11-9, 11-7, 7-11, 12-10తో పోరాడి వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)పై నెగ్గింది. టీమ్ చాంపియన్ ఎస్బీఐ ఇంటర్ ఇనిస్టిట్యూషన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎస్బీఐ జట్టు 3-2తో పోస్టల్ డిపార్ట్మెంట్ జట్టుపై గెలిచింది. -
తరుణ్ యాదవ్‌కు టైటిల్
తెలంగాణ సబ్-జూనియర్ బాక్సింగ్ సిరీస్ ఎల్బీ స్టేడియం: తెలంగాణ సబ్-జూనియర్ బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో 28-30 కిలోల విభాగంలో తరుణ్ యాదవ్ (హైదరాబాద్) టైటిల్ చేజిక్కించుకున్నాడు. షేక్ షాజీబ్ (మెదక్)కు రెండో స్థానం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) సౌజన్యంతో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో విజేతలకు టేబుల్ టెన్నిస్ అర్జున అవార్డీ మీర్ ఖాసీమ్ అలీ ట్రోఫీలను అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. సబ్ జూనియర్ విభాగం: అండర్-16 బాలురు : 34-36 కేజీలు: 1.ఎం.డి.జాహిద్ (వరంగల్), 2. తవ్జ్యోత్ (హైదరాబాద్). 38-40 కేజీలు: 1. త్రిజ్యోత్ (హైదరాబాద్), 2. కె.సాయితేజ (రంగారెడ్డి). 42-44 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్ (హైదరాబాద్), 2. పవన్ (రంగారెడ్డి జిల్లా). 46- 48 కేజీలు: 1.ఎం.పవన్ కుమార్ (హైదరాబాద్), 2. రాఖిల్ సాయి(ఆదిలాబాద్). 48-50 కేజీలు: 1.కె.యశ్వంత్ నాయక్ (మహబూబ్‌నగర్), 2.అబ్దుల్ సయ్యద్ (నిజామాబాద్). అండర్-13 బాలురు : 42-44 కేజీలు: 1.ఎం.వేణు (వరంగల్), 2. ఇమ్రాన్ ఖాన్ (హైదరాబాద్). అండర్-15 బాలురు: 42-44 కేజీలు: 1.బి.సతీష్ (ఆదిలాబాద్), 2. బి.కిషోర్(కరీంనగర్). అండర్-14 బాలురు: 40-42 కేజీలు: 1.ఎస్.నితిన్ రాజ్(హైదరాబాద్), 2.ఎం.ఆశోక్ (నిజామాబాద్). -
22 నుంచి స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నీ
ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నమెంట్ ఈనెల 22 నుంచి 24 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్డీహెచ్బీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీని విశాల్ సింగ్ స్మారకార్థంగా నిర్వహిస్తున్నట్లు సి.హెచ్ ఫ్రాంక్లిన్ తెలిపారు. బాల బాలికల విభాగాల్లో ఈపోటీలు నిర్వహిస్తున్నట్లు, ఆసక్తి గల స్కూల్ జట్లు తమ ఎంట్రీలను ఈనెల 21లోగా పంపించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు పి.జగన్మోహన్ గౌడ్(98491-94841), డాక్టర్ రవి కుమార్(98662-29937)లను సంప్రదించవచ్చు. -
ఫైనల్లో భవాన్స్, సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్
సెయింట్ పాల్స్ ఇంటర్ స్కూల్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ స్టాగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ బాలికల విభాగంలో భవాన్స్ స్కూల్(ఏ), సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. హైదర్‌గూడలోని సెయింట్ హైస్కూల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల స్కూల్ టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో తొలి సెమీఫైనల్లో భవాన్స్ స్కూల్(ఏ) జట్టు 3-0 స్కోరుతో గీతాంజలి స్కూల్ జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టు 3-0తో రోజారీ కాన్వెంట్ స్కూల్ (ఏ)పై గెలిచింది. అంతకు ముందు జరిగిన ఈ పోటీల ప్రారంభ వేడుకలకు బ్రదర్ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, టెక్నికల్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రోయింగ్‌లో టీఎస్ఎస్ పతకాల పంట
5 స్వర్ణాలు సహా 9 పతకాలు ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్, జాతీయ స్కూల్స్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్ఎస్) క్రీడాకారులు సత్తా చాటారు. ఐదు బంగారు పతకాలు సహా తొమ్మిది పతకాలు సాధించారు. జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు ఇటీవల కోల్‌కతాలో జరిగాయి. ఈ పోటీల్లో బాలుర టీమ్ విభాగంలో రెండు స్వర్ణా లు, కాంస్యం, బాలికల టీమ్ విభాగంలో ఒక్కో పసిడి, కాంస్యం టీఎస్ఎస్ రోయర్లు గెలిచారు. అక్కడే జరిగిన జాతీయ స్కూల్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో బాలుర సింగిల్స్ స్కల్ ఈవెంట్లో సి.హెచ్. నవీన్ బంగారు పతకం గెలుచుకోగా... విజయ్, త్రినాథ్, సునీల్, ఆరిఫ్, గణేష్‌లతో కూడిన జట్టు టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచింది. బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో గీతాంజలి కాంస్యం దక్కించుకుంది. బాలికల టీమ్ విభాగంలో సీతా మహాలక్ష్మి, లక్ష్మీప్రసన్న, అర్చన, మనస్విని, ప్రియాంకలతో కూడిన బృందం రజతం గెలిచింది. జాతీయ రోయింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) మేనేజింగ్ డైరె క్టర్ రాహుల్ బొజ్జా, రాష్ట్ర రోయింగ్ కోచ్ చక్రవర్తి అభినందించారు. -
ఒలింపిక్ పరుగుపై సద్దుమణిగిన వివాదం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జంటనగరాల్లో ఈ నెల 23న జరగనున్న ఒలింపిక్ పరుగును ఎవరు నిర్వహించాలనే విషయంపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. శాప్ కమిటీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం తమ తప్పని కొందరు క్రీడా సంఘాల నేతలు అంగీకరించడంతోపాటు రాష్ట్ర ఒలింపిక్ సంఘం నిబంధనల ప్రకారం నడుచుకొంటామని హెచ్‌డీఓఏ అధ్యక్షుడు బి.విజయకుమార్ యాదవ్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ పరుగు నిర్వహించాలని, ఇది తెలంగాణ ప్రభుత్వ పరుగు కాదని వారు అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్రీడా సంఘాలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, పీడీలు, కోచ్‌ల సమావేశాన్ని ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫతేమైదాన్ క్లబ్లో ఏర్పాటు చేసినట్లు హెచ్‌డీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తెలిపారు.