30నుంచి శ్రీలంక, భారత్ జట్ల మధ్య త్రోబాల్ టోర్నీ | srilanka and india team Throw ball tournment starts on 30 | Sakshi
Sakshi News home page

30నుంచి శ్రీలంక, భారత్ జట్ల మధ్య త్రోబాల్ టోర్నీ

Published Thu, Nov 28 2013 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

srilanka and india team Throw ball tournment starts on 30

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఈనెల 30 నుంచి రెండు రోజుల పాటు అంతర్జాతీయ త్రోబాల్ టోర్నమెంట్ ముషీరాబాద్ ప్లేగ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్  ఇన్‌కంట్యాక్స్ డిప్యూటీ కమీషనర్ ఎస్‌కే గుప్తా తెలిపారు.
 
 ఒలింపిక్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ైెహ దరాబాద్ త్రోబాల్ సంఘం అధ్యక్షులు డి. శ్రీధర్, కార్యదర్శి ఎంవి నర్సింహులు, ఉపాధ్యక్షులు డాక్టర్ బాలరాజ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ పోటీలను సికింద్రాబాద్ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్ ప్రారంభిస్తారని తెలిపారు. డిసెంబర్ 1న జరిగే ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరవుతారని ఆయన వివరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement