Throw ball tournment
-
మేరీల్యాండ్‌లో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్
మేరీల్యాండ్ : అమెరికాలోని మేరీల్యాండ్‌లో కేఎల్ఏపీ సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా అక్టోబరు 26 న నిర్వహించిన వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా జరిగాయి. పురుషులకు వాలీబాల్ మహిళలకు త్రోబాల్ క్రీడలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వాలీబాల్‌కు 20 జట్లు, త్రోబాల్‌కు 10 జట్లకు గాను మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 కు ప్రారంభమైన ఈ పోటీలను రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లో టాప్కు చేరిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో వాలీబాల్ విజేతగా న్యూయార్క్ స్పైకర్స్ నిలిచింది. రన్నరప్‌గా వాషింగ్టన్ కింగ్స్ నిలిచింది. టీమ్ స్ట్రైవ్ మూడో స్థానానికి పరిమితమయ్యింది. ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో హాజరై తమ మద్ధతును తెలిపారు. రాత్రి 9.30కి పోటీలు ముగిశాయి. ఈ టోర్నమెంట్‌కి సహకరించిన ఇండియన ప్యారడైజ్ కూషన్ హోటల్ ఎమ్‌డి జిన్ఓక్కు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే స్పాన్సర్లు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. -
గచ్చిబౌలి కేవీ స్కూల్ క్రీడాకారిణులకు సన్మానం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ కేంద్రీయ విద్యాలయం క్రీడల్లో పతకాలను సాధించిన గచ్చిబౌలి స్కూల్ విద్యార్థులను గురువారం సన్మానించారు. ఇటీవల హకీంపేట్‌లో జరిగిన జాతీయ కేవీ త్రోబాల్ టోర్నీలో గచ్చిబౌలి బాలికల జట్టు స్వర్ణం సాధించింది. అలాగే హర్యానాలో ఈనెల 18 నుంచి 22 దాకా జరిగే జాతీయ పైకా హాకీ టోర్నమెంట్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయి ధరణి, పి.సునీత, గీతా సాగర్లను హైదరాబాద్ రీజినల్ కేవీఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సాంబన్న ముఖ్య అతిథిగా విచ్చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.శ్రీనివాస్‌రాజు, పీఈటీ పి.విజయభాస్కర్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
30నుంచి శ్రీలంక, భారత్ జట్ల మధ్య త్రోబాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఈనెల 30 నుంచి రెండు రోజుల పాటు అంతర్జాతీయ త్రోబాల్ టోర్నమెంట్ ముషీరాబాద్ ప్లేగ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఇన్‌కంట్యాక్స్ డిప్యూటీ కమీషనర్ ఎస్కే గుప్తా తెలిపారు. ఒలింపిక్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ైెహ దరాబాద్ త్రోబాల్ సంఘం అధ్యక్షులు డి. శ్రీధర్, కార్యదర్శి ఎంవి నర్సింహులు, ఉపాధ్యక్షులు డాక్టర్ బాలరాజ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ పోటీలను సికింద్రాబాద్ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్ ప్రారంభిస్తారని తెలిపారు. డిసెంబర్ 1న జరిగే ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరవుతారని ఆయన వివరించారు. -
భవాన్స్ కాలేజికి త్రోబాల్ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి అండర్-19 బాలుర త్రోబాల్ టోర్నమెంట్ టైటిల్‌ను భవాన్స్ జూనియర్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జూనియర్ కాలేజి స్కూల్ గేమ్స్ సమాఖ్య (హెచ్డీజీసీఎస్జీఎఫ్)ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి(జీజేసీ) మైదానంలో మంగళవారం జరిగిన ఫైనల్లో భవాన్స్ జూనియర్ కాలేజి జట్టు 25-2, 16-25, 25-8 స్కోరుతో కూకట్పల్లి జీజేసీ జట్టుపై విజయం సాధించింది. భవాన్స్ జూనియర్ కాలేజి జట్టులో వెంకట్‌రెడ్డి నిఖిల్, సుందరం చక్కటి నైపుణ్యాన్ని కనబర్చి తమ జట్టుకు విజయాన్ని అందించారు. కూకట్పల్లి జీజేసీ జట్టులో జాఫర్, దిలీప్‌లు రాణించారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో భవాన్స్ జూనియర్ కాలేజి టీమ్ 25-7, 25-7తో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి (నారాయణగూడ)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో కూకట్పల్లి జీజేసీ 25-3, 25-13తో ఓబుల్‌రెడ్డి హైస్కూల్ జట్టుపై గెలిచింది. విజేతలకు హెచ్డీజీసీఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి రమణ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గేమ్స్ కార్యదర్శి ఎల్.రాజేంద్రప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.