గచ్చిబౌలి కేవీ స్కూల్ క్రీడాకారిణులకు సన్మానం | gachibowli K.V school honor to players | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలి కేవీ స్కూల్ క్రీడాకారిణులకు సన్మానం

Published Fri, Jan 3 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

gachibowli K.V school honor to players

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ కేంద్రీయ  విద్యాలయం క్రీడల్లో పతకాలను సాధించిన గచ్చిబౌలి  స్కూల్ విద్యార్థులను గురువారం సన్మానించారు. ఇటీవల హకీంపేట్‌లో జరిగిన జాతీయ కేవీ త్రోబాల్ టోర్నీలో గచ్చిబౌలి బాలికల జట్టు స్వర్ణం సాధించింది.
 
  అలాగే హర్యానాలో ఈనెల 18 నుంచి 22 దాకా జరిగే జాతీయ పైకా హాకీ టోర్నమెంట్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయి ధరణి, పి.సునీత, గీతా సాగర్‌లను హైదరాబాద్ రీజినల్ కేవీఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సాంబన్న ముఖ్య అతిథిగా విచ్చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.శ్రీనివాస్‌రాజు, పీఈటీ పి.విజయభాస్కర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement