ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి అండర్-19 బాలుర త్రోబాల్ టోర్నమెంట్ టైటిల్‌ను భవాన్స్ జూనియర్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జూనియర్ కాలేజి స్కూల్ గేమ్స్ సమాఖ్య (హెచ్‌డీజీసీఎస్‌జీఎఫ్)ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి(జీజేసీ) మైదానంలో మంగళవారం జరిగిన ఫైనల్లో భవాన్స్ జూనియర్ కాలేజి జట్టు 25-2, 16-25, 25-8 స్కోరుతో కూకట్‌పల్లి జీజేసీ జట్టుపై విజయం సాధించింది.
భవాన్స్ జూనియర్ కాలేజి జట్టులో వెంకట్‌రెడ్డి నిఖిల్, సుందరం చక్కటి నైపుణ్యాన్ని కనబర్చి తమ జట్టుకు విజయాన్ని అందించారు. కూకట్‌పల్లి జీజేసీ జట్టులో జాఫర్, దిలీప్‌లు రాణించారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో భవాన్స్ జూనియర్ కాలేజి టీమ్ 25-7, 25-7తో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి (నారాయణగూడ)పై గెలిచింది.
రెండో సెమీఫైనల్లో కూకట్‌పల్లి జీజేసీ 25-3, 25-13తో ఓబుల్‌రెడ్డి హైస్కూల్ జట్టుపై గెలిచింది. విజేతలకు హెచ్‌డీజీసీఎస్‌జీఎఫ్ మాజీ కార్యదర్శి రమణ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గేమ్స్ కార్యదర్శి ఎల్.రాజేంద్రప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
భవాన్స్ కాలేజికి త్రోబాల్ టైటిల్
Published Tue, Oct 1 2013 11:54 PM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement
Advertisement