భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్ | Bhavans College Carrom title | Sakshi
Sakshi News home page

భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్

Published Fri, Dec 26 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్

భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్

ఓయూ ఇంటర్ కాలేజి మహిళల టోర్నీ
 ఎల్బీ స్టేడియం: ఓయూ ఇంటర్ కాలేజి మహిళల క్యారమ్ టోర్నీలో భవాన్స్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బర్కత్‌పురాలోని అవంతి కాలేజిలో జరిగిన ఫైనల్లో భవాన్స్ కాలేజి జట్టు 2-1 స్కోరుతో సెయింట్ ఆన్స్ కాలేజి (మెహిదీపట్నం) జట్టుపై విజయం సాధించింది.
 
  మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వనిత కాలేజి 2-1తో వెస్లీ కాలేజి జట్టుపై గెలిచింది. సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 2-1తో ఎస్‌ఎన్ వనిత డిగ్రీ కాలేజి జట్టుపై, సెయింట్ ఆన్స్ 2-0తో వెస్లీ కాలేజి జట్టుపై నెగ్గాయి. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement