భవాన్స్, మహర్షి కాలే జీలకు టైటిల్స్ | Bhavans ,maharishi college won title | Sakshi
Sakshi News home page

భవాన్స్, మహర్షి కాలే జీలకు టైటిల్స్

Nov 29 2013 12:18 AM | Updated on Sep 2 2017 1:04 AM

ఇంటర్ జూనియర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్‌లో ఓవరాల్ బాలుర టీమ్ టైటిల్‌ను సైనిక్‌పురికి చెందిన భవాన్స్ కాలేజి కైవసం చేసుకుంది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్‌లో ఓవరాల్ బాలుర టీమ్ టైటిల్‌ను సైనిక్‌పురికి చెందిన భవాన్స్ కాలేజి కైవసం చేసుకుంది. బాలికల టీమ్ టైటిల్‌ను మహర్షి జూనియర్ కాలేజి జట్టు చేజిక్కించుకుంది.
 
  హైదరాబాద్ జిల్లా జూని యర్ కాలేజి అండర్-19 గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్‌లో గురువారం ఈ పోటీలు జరిగాయి. బాలుర వ్యక్తిగత చాంపియన్‌గా బి.రమేష్ (కూకట్‌పల్లి న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజి) నిలువగా, బి.గోపాల్ (రైల్వే జూనియర్ కాలేజి)కు రెండో స్థానం లభించింది. బాలికల వ్యక్తిగత టైటిల్‌ను ఎ.కవిత (మహర్షి జూనియర్ కాలేజి) గెలిచింది. విజేతలకు పీఆర్‌టీ సీనియర్ పద్మారావు పతకాలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement