Bhavans College
-
అట్టహాసంగా ‘ఎస్పీఎల్’ ముగింపు వేడుక
సాక్షి, హైదరాబాద్(నేరేడ్మెట్) : ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్’ (ఎస్పీఎల్) రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల బహుమతుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. గురువారం నేరేడ్మెట్ సైనిక్‌పురిలోని భవన్స్ క్రికెట్ మైదానంలో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. సాక్షి డైరెక్టర్లు ఏఎల్ఎన్ రెడ్డి, రాణిరెడ్డి, భవన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ జేఎల్ఎన్ శాస్త్రి, శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏజీఎం డీ.వెంకటేశ్వర్లు, డీన్ జి.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సెంచరీతో చెలరేగిన సంతోష్
ఎడ్డీ ఐబారా వన్డే టోర్నీ సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో సంతోష్ (80 బంతుల్లో 132; 14ఫోర్లు, 4 సిక్సర్లు), వినయ్ (99), బౌలింగ్‌లో అంకిత్ (5/6) చెలరేగడంతో భవన్స్ జూనియర్ కాలేజ్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. హెచ్‌సీఏ ఎడ్డీ ఐబారా అండర్-19 టోర్నమెంట్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీగాయత్రి జట్టుపై 303 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భవన్స జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. వినయ్, సంతోష్‌తో పాటు సిద్ధార్థ్ నాయుడు (43) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీగాయత్రి జట్టు అంకిత్ సింగ్ ధాటికి 25.4 ఓవర్లలో 36 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు హెచ్‌పీఎస్: 36 (అనికేత్ రెడ్డి 5/12); వెస్లీ బాయ్స్ కాలేజ్: 37 (7.4 ఓవర్లలో) కాల్ పబ్లిక్ స్కూల్: 284/8 (హర్షవర్ధన్ 55, సూర్యతేజ 119, సుధీంద్ర 37; తరుణ్ 4/42); లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్: 218 (మీర్ విజారత్ అలీ 94, హర్షవర్ధన్ 3/50). కంబైన్డ డిస్ట్రిక్ట్: 189 (రఘు 47; సారుు కోమల్ 4/44); సీడీఆర్ జూనియర్ కాలేజ్ : 187 (సారుు కోమల్ 72; వంశీ 5/24). -
భవాన్స్ కాలేజీకి క్యారమ్ టైటిల్
ఓయూ ఇంటర్ కాలేజి మహిళల టోర్నీ ఎల్బీ స్టేడియం: ఓయూ ఇంటర్ కాలేజి మహిళల క్యారమ్ టోర్నీలో భవాన్స్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బర్కత్‌పురాలోని అవంతి కాలేజిలో జరిగిన ఫైనల్లో భవాన్స్ కాలేజి జట్టు 2-1 స్కోరుతో సెయింట్ ఆన్స్ కాలేజి (మెహిదీపట్నం) జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వనిత కాలేజి 2-1తో వెస్లీ కాలేజి జట్టుపై గెలిచింది. సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 2-1తో ఎస్ఎన్ వనిత డిగ్రీ కాలేజి జట్టుపై, సెయింట్ ఆన్స్ 2-0తో వెస్లీ కాలేజి జట్టుపై నెగ్గాయి. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు. -
చాంప్ భవాన్స్ కాలేజి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సైనిక్‌పురికి చెందిన భవాన్స్ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. ఏవీ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా... నిజామ్ కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఈ పోటీలు జరిగాయి. ఫైనల్స్ ఫలితాలు: 56 కేజీలు : 1. ఎం. సంపత్‌కుమార్, (వివి కాలేజి) 62 కేజీలు: 1.జి.వెంకటేశ్ (ఏవీ కాలేజి), 2.ఆదిత్య యాదవ్ (భవాన్స్ కాలేజి), 3.డి.ఆదిత్య యాదవ్ (లయోలా అకాడమీ). 69 కేజీలు: 1.జి.సందీప్ (నిజామ్ కాలేజి), 2.ఎ.అనిల్ రెడ్డి (భవాన్స్ కాలేజి), 3.ప్రదీప్ మణి (సిగ్నోడియా కాలేజి). 77 కేజీలు: 1.వై.ఆర్. సాగర్ (జి.పుల్లారెడ్డి కాలేజి), 2.ఎం.డి.రహ్మత్ (భవాన్స్ కాలేజి), 3.అరుణ్ లాల్ (వి.వి. కాలేజి). 85 కేజీలు: 1.ప్రమోద్ (ఏవీ కాలేజి), 2. ఎం.డి.అబ్దుల్లా (భవాన్స్ కాలేజి), 3.డి.కార్తిక్ రాజ్ (పీజీ కాలేజి, సికింద్రాబాద్). 94 కేజీలు: 1.టి.నవీన్ కుమార్ (నిజామ్ కాలేజి), 2.ఎం.హరీష్ (ఏవీ కాలేజి), 3.డి.నితిన్ (సుప్రభాత్ కాలేజి). 105 కేజీలు: 1.ఎం.ఆర్.చైతన్య (భవాన్స్ కాలేజి), 2.ఆర్.గణేష్ యాదవ్ (సుప్రభాత్ కాలేజి), 3.అజయ్ సింగ్ (భవాన్స్ కాలేజి). 105+ కేజీలు: 1. ఆర్. దర్శన్ (సుప్రభాత్ కాలేజి). -
భవాన్స్, మహర్షి కాలే జీలకు టైటిల్స్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్లో ఓవరాల్ బాలుర టీమ్ టైటిల్‌ను సైనిక్‌పురికి చెందిన భవాన్స్ కాలేజి కైవసం చేసుకుంది. బాలికల టీమ్ టైటిల్‌ను మహర్షి జూనియర్ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా జూని యర్ కాలేజి అండర్-19 గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్‌లో గురువారం ఈ పోటీలు జరిగాయి. బాలుర వ్యక్తిగత చాంపియన్‌గా బి.రమేష్ (కూకట్పల్లి న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజి) నిలువగా, బి.గోపాల్ (రైల్వే జూనియర్ కాలేజి)కు రెండో స్థానం లభించింది. బాలికల వ్యక్తిగత టైటిల్‌ను ఎ.కవిత (మహర్షి జూనియర్ కాలేజి) గెలిచింది. విజేతలకు పీఆర్టీ సీనియర్ పద్మారావు పతకాలను అందజేశారు. -
విజేత వెస్లీ కాలేజి
జింఖానా, న్యూస్‌లైన్: ఎడ్డీ ఐబరా అండర్-19 వన్డే నాకౌట్ టోర్నీలో వెస్లీ జూనియర్ కాలేజి విజేతగా నిలిచింది. భవాన్స్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్లీ బ్యాట్స్‌మన్ రాహుల్ (91 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన భవాన్స్ 168 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టులో వికాస్ బిల్లా (50) అర్ధ సెంచరీతో రాణించగా.. నఫీజ్ 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. వెస్లీ బౌలర్స్ ప్రణీత్, చందన్, శ్రీకాంత్, నవీన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్లీ జట్టు నాలుగు వికెట్లకు 170 పరుగులు చేసింది. చైతన్య 47 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. భవాన్స్ బౌలర్ నరేష్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్‌లో తొలి రోజు వరంగల్ జట్టు 227 పరుగులు చేసింది. జట్టులో ఫరూఖ్ (74), శరత్ యాదవ్ (47) రాణించారు. ఆదిలాబాద్ బౌలర్ రాకేష్ అత్యధికంగా 7 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తర్వాత బరిలోకి దిగిన ఆదిలాబాద్ జట్టు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రమేష్ యాదవ్ (74) అర్ధ సెంచరీతో విజృంభించగా.. లఖ్మణ్ (31 నాటౌట్), వినోద్ (42 నాటౌట్) బరిలో ఉన్నారు. వరంగల్ బౌలర్ ఫరూఖ్ నాలుగు వికెట్ల్లు చేజిక్కించుకున్నాడు. -
ఏవీ కాలేజిపై లయోలా అకాడమీ జయభేరి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీలో లయోలా అకాడమీ, భవాన్స్ కాలేజి జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఎల్బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ మైదానంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో లయోలా అకాడమీ జట్టు 15-12తో ఆంధ్రా విద్యాలయం (ఏవీ)పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి లయోలా అకాడమీ జట్టు 9-7తో ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత అదే ఊపును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండో సెమీఫైనల్లో భవాన్స్ కాలేజి 21-7తో అవంతి కాలేజి జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్స్‌గా అవార్డులను భాస్కర్ (ఓయూ సైన్స్ కాలేజి), మహావీర్ సింగ్(హెచ్ఎంవీ), ప్రమోద్(భద్రుకా కాలేజి), హరీష్(గవర్నమెంట్ సిటీ కాలేజి), అశోక్(అవంతి కాలేజి), రాజ్ కుమార్(ఏవీ కాలేజి) టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్నారెడ్డి నుంచి అందుకున్నారు. -
చాంప్స్ అవంతి, కస్తూర్బా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో మహిళల టీమ్ టైటిల్‌ను నిరుటి విజేత కస్తూర్బా గాంధీ కాలేజి జట్టు నిలబెట్టుకుంది. విల్లా మేరీ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా, సెయింట్ పాయిస్ కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. పురుషుల టీమ్ టైటిల్‌ను అవంతి కాలేజి జట్టు కైవసం చేసుకుంది. భవాన్స్ కాలేజి జట్టు రెండో స్థానం పొందగా, ఏవీ కాలేజి జట్టుకు మూడో స్థానం లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఆదివారం ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల విజేతలకు అవంతి కాలేజి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.మోహన్ సింగ్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డెరైక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, డాక్టర్ రాజేష్ కుమార్, ఇంటర్ కాలేజి టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: పురుషుల విభాగం: 12 కి.మీ.: 1.ఎస్.దినేష్ కుమార్ (అవంతి కాలేజి), 2. సి.హెచ్. బుచ్చయ్య (జీసీపీఈ), 3.సయ్యద్ అహ్మద్ (అవంతి కాలేజి), 4.డి.లింగం (ిసిల్వర్ జూబ్లీ కాలేజి), 5. ఎ.రాకేష్ (ఏవీ కాలేజి), 6.వై.మారుతి (నిజామ్ కాలేజి), 7. ఎన్.మధు (రైల్వే కాలేజి) 8. సూర్య ప్రకాష్ (గవర్నమెంట్ కాలేజి), 9. నరేందర్ సింగ్ (అవంతి కాలేజి). మహిళల విభాగం: 6 కి.మీ.: 1.వైష్ణవి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. షబ్నం ( విల్లా మేరీ కాలేజి), 3.గంగా జమున (కస్తూర్బా కాలేజి).