సెంచరీతో చెలరేగిన సంతోష్ | santosh century helps to victory of bhavans college | Sakshi
Sakshi News home page

సెంచరీతో చెలరేగిన సంతోష్

Published Tue, Sep 20 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

santosh century helps to victory of bhavans college

ఎడ్డీ ఐబారా వన్డే టోర్నీ  


 సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో సంతోష్ (80 బంతుల్లో 132; 14ఫోర్లు, 4 సిక్సర్లు), వినయ్ (99), బౌలింగ్‌లో అంకిత్ (5/6) చెలరేగడంతో భవన్స్ జూనియర్ కాలేజ్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. హెచ్‌సీఏ ఎడ్డీ ఐబారా అండర్-19 టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీగాయత్రి జట్టుపై 303 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భవన్‌‌స జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. వినయ్, సంతోష్‌తో పాటు సిద్ధార్థ్ నాయుడు (43) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీగాయత్రి జట్టు అంకిత్ సింగ్ ధాటికి 25.4 ఓవర్లలో 36 పరుగులకే కుప్పకూలింది.

 ఇతర మ్యాచ్‌ల వివరాలు
 హెచ్‌పీఎస్: 36 (అనికేత్ రెడ్డి 5/12); వెస్లీ బాయ్స్ కాలేజ్: 37 (7.4 ఓవర్లలో)
 కాల్ పబ్లిక్ స్కూల్: 284/8 (హర్షవర్ధన్ 55, సూర్యతేజ 119, సుధీంద్ర 37; తరుణ్ 4/42); లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్: 218 (మీర్ విజారత్ అలీ 94,  హర్షవర్ధన్ 3/50).
 కంబైన్‌‌డ డిస్ట్రిక్ట్: 189 (రఘు 47; సారుు కోమల్ 4/44); సీడీఆర్ జూనియర్ కాలేజ్ : 187 (సారుు కోమల్ 72; వంశీ 5/24).   

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement