under 19 cricket tourny
-
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ముక్కోణపు సిరీస్‌లో యువ భారత జట్టు.. సౌతాఫ్రికా అండర్ 19 జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టోర్నీలో భాగంగా నిన్న (జనవరి 2) జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఆరాధ్య శుక్లా (4/43), సౌమీ పాండే (3/49), అర్షిన్ కులకర్ణి (2/53) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ప్రిటోరియస్ (67), స్టీవ్ స్టాల్క్ (46), మోకోయినా (28 నాటౌట్) మాత్రమే రాణంచగా.. మిగతావారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆదర్శ్ సింగ్ (66), అర్షిన్ కులకర్ణి (91), అరవెల్లి అవినాశ్ (60 నాటౌట్) రాణించడంతో మరో 55 బంతులు మిగిలుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రొటీస్ బౌలర్లలో మోకోయినా 2, జుయాన్ జేమ్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ ముక్కోణపు టోర్నీలో భారత్, సౌతాఫ్రికాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియా చేతిలో, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడింది. జనవరి 4న ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియాతో తలపడుతుంది. అనంతరం 6న భారత్-సౌతాఫ్రికా, 8న సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్, జనవరి 10న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
వినీత్, నితీశ్ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ తొలిరోజు భారీ స్కోరు సాధించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ‘అసోసియేట్ అండ్ అఫిలియేట్’ జట్టుతో సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్ 90 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 327 పరుగులు చేసింది. వినీత్ రెడ్డి (217 బంతుల్లో 143 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్సర్), నితీశ్ రెడ్డి (269 బంతుల్లో 171 బ్యాటింగ్; 22 ఫోర్లు) అజేయ సెంచరీలతో విజృంభించారు. బౌండరీలతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ అజేయంగా 327 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజీవ్‌గాంధీ స్టేడియంలో నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం విశేషం. -
విజేత వెస్లీ జూనియర్ కాలేజ్
ఎడ్డీ ఐబరా క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఎడ్డీ ఐబరా అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో వెస్లీ బాలుర జూనియర్ కాలేజ్ విజేతగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్సలో సోమవారం జరిగిన ఫైనల్లో వెస్లీ కాలేజ్ 5 వికెట్ల తేడాతో భవన్స ఎస్ఏ జూనియర్ కాలేజ్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భవన్స కాలేజ్ 43.1 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. వినయ్ (30) మెరుగ్గా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో విద్యానంద్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వెస్ల్లీ కాలేజ్ జట్టు 27.2 ఓవర్లలో 5 వికెట్లకు 96 పరుగులు చేసి గెలిచింది. భవన్స కాలేజ్ బౌలర్లలో అఖిలేశ్ రెడ్డి 4 వికెట్లతో రాణించాడు. తర్వాత జరిగిన ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో హెచ్‌సీఏ సెక్రటరీ కె. జాన్ మనోజ్, జారుుంట్ సెక్రటరీ పురుషోత్తం అగర్వాల్, కోశాధికారి దేవరాజ్, ఈసీ సభ్యులు అద్నాన్ మహమూద్, జగ్గులాల్ పాల్గొన్నారు. -
ఫైనల్లో భవన్స్, వెస్లీ జట్లు
ఎడ్డీ ఐబారా క్రికెట్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: ఎడ్డీ ఐబారా అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో భవన్స జూనియర్ కాలేజ్, వెస్లీ బాలుర జూనియర్ కాలేజ్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించడంతో టాస్ ఆధారంగా విజేతలను నిర్ణయించారు. విజనరీ కాలేజ్, భవన్స జట్ల మధ్య జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విజనరీ కాలేజ్ 46.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత వర్షం కారణంగా భవన్స ఇన్నింగ్ జరుగలేదు. వెస్లీ కాలేజ్, సెయింట్ జాన్స్ చర్చ్ కాలేజ్‌ల మధ్య జరిగిన రెండో సెమీస్‌లోనూ వెస్లీ కాలేజ్ 42 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మారుతి (72) అర్ధసెంచరీ చేశాడు. సెయింట్ జాన్స్ చర్చ్ బౌలర్లలో అజయ్ దేవ్ 4, హితేశ్ 3 వికెట్లు తీశారు. తర్వాత వర్షం కారణంగా సెరుుంట్ జాన్స ఇన్నింగ్‌సను రద్దుచేశారు. టాస్ పద్ధతిలో వెస్లీ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. -
సెంచరీతో చెలరేగిన సంతోష్
ఎడ్డీ ఐబారా వన్డే టోర్నీ సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో సంతోష్ (80 బంతుల్లో 132; 14ఫోర్లు, 4 సిక్సర్లు), వినయ్ (99), బౌలింగ్‌లో అంకిత్ (5/6) చెలరేగడంతో భవన్స్ జూనియర్ కాలేజ్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. హెచ్‌సీఏ ఎడ్డీ ఐబారా అండర్-19 టోర్నమెంట్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీగాయత్రి జట్టుపై 303 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భవన్స జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. వినయ్, సంతోష్‌తో పాటు సిద్ధార్థ్ నాయుడు (43) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీగాయత్రి జట్టు అంకిత్ సింగ్ ధాటికి 25.4 ఓవర్లలో 36 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు హెచ్‌పీఎస్: 36 (అనికేత్ రెడ్డి 5/12); వెస్లీ బాయ్స్ కాలేజ్: 37 (7.4 ఓవర్లలో) కాల్ పబ్లిక్ స్కూల్: 284/8 (హర్షవర్ధన్ 55, సూర్యతేజ 119, సుధీంద్ర 37; తరుణ్ 4/42); లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్: 218 (మీర్ విజారత్ అలీ 94, హర్షవర్ధన్ 3/50). కంబైన్డ డిస్ట్రిక్ట్: 189 (రఘు 47; సారుు కోమల్ 4/44); సీడీఆర్ జూనియర్ కాలేజ్ : 187 (సారుు కోమల్ 72; వంశీ 5/24).