ఎడ్డీ ఐబరా క్రికెట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఎడ్డీ ఐబరా అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో వెస్లీ బాలుర జూనియర్ కాలేజ్ విజేతగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌సలో సోమవారం జరిగిన ఫైనల్లో వెస్లీ కాలేజ్ 5 వికెట్ల తేడాతో భవన్‌స ఎస్‌ఏ జూనియర్ కాలేజ్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భవన్‌స కాలేజ్ 43.1 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. వినయ్ (30) మెరుగ్గా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో విద్యానంద్ 3 వికెట్లు దక్కించుకున్నాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వెస్ల్లీ కాలేజ్ జట్టు 27.2 ఓవర్లలో 5 వికెట్లకు 96 పరుగులు చేసి గెలిచింది. భవన్‌స కాలేజ్ బౌలర్లలో అఖిలేశ్ రెడ్డి 4 వికెట్లతో రాణించాడు. తర్వాత జరిగిన ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో హెచ్‌సీఏ సెక్రటరీ కె. జాన్ మనోజ్, జారుుంట్ సెక్రటరీ పురుషోత్తం అగర్వాల్, కోశాధికారి దేవరాజ్, ఈసీ సభ్యులు అద్నాన్ మహమూద్, జగ్గులాల్ పాల్గొన్నారు.