ఢిల్లీ: పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వ్యూహత్మక అడుగులు వేసింది. బీహార్‌లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బీహార్ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా దేశంలో ఆహార ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధిని కల్పిస్తుంది. అలాగే, బీహార్‌లో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అంతేగాక మఖానాను పండించే రైతులకు సాంకేతిక సాయం, ఆర్థిక సాయం సైతం అందించనున్నారు. దీని ద్వారా మఖానా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ దేశంలోనే మఖానా ఉత్పత్తిలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిని మరింత ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
🚨 Big boost for Bihar’s Makhana farmers! 🌿💰
FM Nirmala Sitharaman announces the setup of a Makhana Board in Bihar to enhance processing, marketing & farmer training. This will strengthen the Bihar Makhana industry, ensuring better value & global reach!#Makhana #BiharInfra pic.twitter.com/6sfaDR9m2t— Bihar Infra & Tech (@BiharInfra) February 1, 2025
ఇది బీహార్‌కి నిజంగా చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. బీహారీలు చాలా ఏళ్లుగా మఖానాను పండిస్తున్నారు. ఇక, మఖానా అనగా ఇదొక రకమైన ఆహారం. ఇవి ఆకుల మాదిరిగా ఉండి గింజలాంటి నిర్మాణంలో ఉంటాయి. వీటిలో గింజల లాంటివి వస్తాయి. దేశంలో 90 శాతం మఖానాను బీహార్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బీహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా ప్రాంతం అపే పేరు కూడా వచ్చింది. బడ్జెట్‌లో చేసిన ఈ ప్రకటనతో ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది.
బీహార్‌కు వరాలు ఇలా..
- బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థికసాయం.
- ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాం.
- పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం
- ఇందులో భాగంగానే బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
- బీహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన. దీ
- దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment