న్యూఢిల్లీ:సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం వరకు వేతన జీవులకు పన్ను మినహాయించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు.. అసలేం జరిగింది..నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ఆసక్తికర విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సామాన్యులకు పన్ను మినహాయింపు విషయంలో ప్రధాన మంత్రి మోదీ తొలి నుంచి సుముఖంగా, స్పష్టంగా ఉన్నారని తెలిపారు. ఆయన వద్దకు పన్ను మినహాయింపు ప్రతిపాదన తీసుకెళ్లగానే ఓకే చెప్పారు. అయితే ఈ విషయంలో తన ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను ఒప్పించేందుకే ఎక్కువ సమయం పట్టిందన్నారు.
పన్ను మినహాయింపు ద్వారా ప్రభుత్వానికి జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ఇతర మార్గాల ద్వారా ఆదాయం చూసుకున్న తర్వాతే వారు ఒప్పుకున్నారని, ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లానా పన్ను చెల్లింపుదారులు తనను కలిసి నిజాయితీగా పన్ను చెల్లించే తమకు బడ్జెట్‌లో వరాలేవీ ఉండవా అని అడిగేవారని గుర్తుచేశారు. వారి కోసమే పన్ను మినహాయింపు ప్రకటించామని నిర్మల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment