చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్‌ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర | Meet Madhubani Artist Dulari Devi: FM Nirmala Sitharaman's Budget Day Saree | Sakshi
Sakshi News home page

చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్‌ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర

Published Sat, Feb 1 2025 3:54 PM | Last Updated on Sat, Feb 1 2025 5:14 PM

Meet Madhubani Artist Dulari Devi: FM Nirmala Sitharaman's Budget Day Saree

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ధరించే  కేంద్ర బడ్జెట్ 2025-26ను  శనివారం (ఫిబ్రవరి 1, 2025) ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్  ధరించిన చీర ప్రత్యేక  ఆకర్షణగా నిలిచింది.గత 7 బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా సీతారామన్ తన చీరలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు.  ఆఫ్-వైట్ చేనేత పట్టు చీరలో వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈచీరను పద్మశీ పురస్కారాన్ని అందుకున్న  మధుబని  కళాకారిణి దులారి దేవి బహుమతిగా అందించారట. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ కళాత్మకతకు అద్దం పట్టిన ఈ చీర, ఆర్టిస్ట్‌  దులారి దేవి గురించి తెలుసుకుందా పదండి!

ఉదయం 11:00 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతు పార్లమెంటులో సంప్రదాయ చీరలో కనిపించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ,శతాబ్దాల నాటి కళను గౌరవిస్తూ ఎంతో సంక్లిష్టమైన మధుబని కళాకృతులతో తీర్చిదిద్దిన చీర అది. ప్రధానంగా మిథిలా కళా సంప్రదాయంలో పనిచేసే దులారి దేవి, అణగారిన దళిత మల్లా కులంలో జన్మించారు. బీహార్‌లోని మధుబనిలోని మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఔట్రీచ్ కార్యక్రమంలో  నిర్మలా సీతారామన్‌ను  కలిసిన సందర్భంగా ఆమెకు ఈ చీరను బహూకరించారట.తాను  ఎంతో కష్టపడి, జాగ్రత్తగా రూపొందించిన మధుబని ప్రింట్ చీరను నిర్మలా సీతారామన్‌కు అందజేసి బడ్జెట్ దినోత్సవం నాడు ధరించాలని దులారీ దేవి కోరారట.  దీనిక మ్యాచింగ్‌గా  ఎరుపు రంగు బ్లౌజ్‌ను ఎంచుకున్నారు.

మధుబని కళ
బిహార్‌లోని మిథిలా ప్రాంతంలో  మిథిలా పెయింటింగ్‌గా  పేరొందిన కళ ఇది.  ఇది సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలు, పూల మూలాంశాలు, ప్రకృతి, పురాణాల వర్ణనల ద్వారా  దుస్తులను రూపొందిస్తారు. ఈ కళారూపం దాని శక్తివంతమైన రంగులు, సున్నితమైన గీతలు, ప్రతీకాత్మక వర్ణనలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ కళాకారిణి , చిత్రకారిణి  చిన్న వయసులోనే.. అంటే పదమూడేళ్ల వయసులోనే వివాహం  జరిగింది. పెద్దగా చదువుకోలేదు కూడా. మధుబని కళాకారిణి మహాసుందరి దేవి ఇంట్లో గృహ సేవకురాలిగా పనిచేస్తున్న సమయంలో దులారీ దేవి మధుబని కళను ఒంటపట్టించుకున్నారు. ఆ త రువాత మరో కళాకారిణి కర్పూరి దేవిని పరిచయంతో  ఈకళలోని మరిన్ని మెలకులను నేర్చుకుని నైపుణ్యం సాధించారు. భర్తను కోల్పోవడం , గ్రామీణ జీవితంలోని కష్టాలు వంటి అనేక వ్యక్తిగత సవాళ్లధమ్య  మిథిలా  ప్రాంతంలో  ఈ కళతోనే జీవనోపాధి వెతుక్కున్నారు. తన కళను  విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.ఈ కళలో ఆమె చేసిన  కృషి, సేవలకు గాను 2021లో దేశంలోనే అత్యంతగౌరవప్రదమైన పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు వచ్చి వరించింది.

మరోవైపు 2019లో మధ్యంతర బడ్జెట్  మొదలు, వరుసగా 2020, 2021, 2022, 2023, 2024 (ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఫిబ్రవరి 1), 2024 (మధ్యంతర బడ్జెట్, జులై 23) ఇలా వరుసగా 7 సార్లు నిర్మల సీతారామన్‌ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.  ఇలా ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రిగా రికార్డ్‌ సాధించారు. అంతేకాదు  అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. ,2019-20 బడ్జెట్‌లో భాగంగా 1372020-21లో  162 నిమిషాల పాటు ప్రసంగించిన ఆమె తాజా బడ్జెట్‌ ప్రసంగంలో 74 నిమిషాల పాటు ప్రసంగించడం విశేషం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement