Padma Shri
-
ప్రయోగాలే ప్రాణమై...
తోట పని గురించి పెద్దలు చెప్పిన మాట... ‘జీవితానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉత్సాహానికి ప్రయోగశీలతను ఇస్తుంది’ పుదుచ్చేరిలోని తెలుగు సంతతికి చెందిన శ్రీలక్ష్మికి తోట అనేది ఉత్సాహాన్ని ఇచ్చే శక్తి మాత్రమే కాదు ప్రయోగక్షేత్రం కూడా! తాను చదివిన చదువుకు చేసిన ప్రయోగాలకు సంబంధమే లేదు. ఎంబీఏ చేసిన శ్రీలక్ష్మికి కార్పొరేట్ దారి కనిపించలేదు. పచ్చటి వ్యవసాయ క్షేత్రాలే కనిపించాయి. ప్రయోగాలు దారి చూపించాయి నిమ్మ వాసనతో కూడిన మిరియాల వంగడాన్ని అభివృద్ధి చేయడంలాంటి ఎన్నో ఆవిష్కరణలు చేసింది శ్రీలక్ష్మి...కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడపాక్కం గ్రామంలో తెలుగు సంతతికి చెందిన వెంకటపతి రెడ్డియార్ కుటుంబం ఉంది. వెంకటపతి రెడ్డియార్ 4వ తరగతిలోనే బడి మానేసి వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సాయంగా పొలం బాట పట్టాడు. హార్టికల్చర్ మీద ఆసక్తితో తనకు ఉన్న స్వీయ అనుభవాలతో కొత్తరకం పూల మొక్కల పెంపకంలో రాణించాడు. వందరకాల కనకాంబరం వంగడాల అభివృద్ధితో రికార్డు సృష్టించాడు. ఎన్నో పేటెంట్లను కలిగిన రెడ్డియార్ పరిశోధనలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం వరించింది.పరిశోధనల కోసం జీవితాన్ని అంకితం చేసిన తండ్రి వెంకటపతి రెడ్డియార్ అడుగు జాడలలో ఆమె కూతురు శ్రీలక్ష్మి(32) నడుస్తోంది. కొత్తరకం సువాసనలతో వివిధ రకాల వంగడాలను సృష్టిస్తోంది. తండ్రి వెంకటపతి రెడ్డియార్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఏడు సంవత్సరాల వయస్సులోనే శ్రీలక్ష్మి పొలం బాట పట్టింది. ఓ వైపు చదువుకుంటూ, మరో వైపు పొలం పనులు చేసేది. కాలక్రమంలో తండ్రి పరిశోధనలకు చేదోడు వాదోడుగా మారింది.కార్పొరేట్ ప్రపంచాన్ని కాదనుకొని...ఎంబీఏ చేసినా, వ్యవసాయం మీద మక్కువతో ఆ దిశగానే అడుగులు వేసింది. తండ్రి మెళకువలు అంది పుచ్చుకుంది శ్రీలక్ష్మి. సేంద్రియ, సేంద్రీయేతర విధానాలతో పొలంలో వివిధ రకాల మొక్కల పెంపకం, వాటిని పలు∙రాష్ట్రాలకు ఎగుమతులు చేయడం మొదలు పెట్టింది. ఆరెంజ్, చాక్లెట్, నేరేడు, పన్నీర్ సువాసనలతో కొత్తరకం జామవంగడాల సృష్టి ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో ఆరంజ్ ఫ్లేవర్కు ప్రధాని నరేంద్ర మోదీ, చాక్లెట్ ఫ్లేవర్కు కిరణ్ బేడీల పేర్లు పెట్టారు.నిమ్మ మిరియం!నిమ్మ సువాసనతో 1.5 ఎకరాలలో కొత్తరకం మిరియాల మొక్కలను పండించారు. సాధారణ రకం మిరియాల మొక్కలతో ఆరేడు సంవత్సరాల తర్వాతే పంట చేతికి వస్తుంది. దీనికి భిన్నంగా సరికొత్త వంగడంతో అంతకన్నా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమతోనే దిగుబడి ఆశాజనకంగా ఉండే విధానాన్ని శ్రీలక్ష్మి ఆవిష్కరించింది. ‘పది సంవత్సరాలుగా పరిశోధన చేశాం. ఎట్టకేలకు మా కష్టం ఫలించింది. వివిధ మొక్కలను పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ కొత్త ఆవిష్కరణకు పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం’ అంటుంది శ్రీలక్ష్మి. మన ఆసక్తే మన శక్తి...పంటపొలాల్లోకి వెళితే కొత్తప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. ఆ సంతోషమే ఉద్యానరంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ప్రయోగాల విషయంలో నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఇంతా అంతా కాదు. ‘మన ఆసక్తే మనశక్తి’ అనేది ఆయన మాట. ఆ ఆసక్తితోనే ప్రయోగాల దారిలో ప్రయాణం చేస్తున్నాను. వ్యవసాయ పరిశోధనల్లో మహిళల కొరత కనిపిస్తోంది. పరిశోధన రంగంలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య పెరిగేకొద్దీ కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయి.– శ్రీలక్ష్మి – ఎం. అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
దులారి దేవి ‘గిఫ్ట్’తో నిర్మలా సీతారామన్ బడ్జెట్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ధరించే కేంద్ర బడ్జెట్ 2025-26ను శనివారం (ఫిబ్రవరి 1, 2025) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ధరించిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడు బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా సీతారామన్ తన చీరలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆఫ్-వైట్ చేనేత పట్టు చీరలో వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చీర ను పద్మశీ పురస్కారాన్ని అందుకున్న మధుబని కళాకారిణి దులారి దేవి బహుమతిగా అందించారట. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ కళాత్మకతకు అద్దం పట్టిన ఈ చీర, ఆర్టిస్ట్ దులారి దేవి గురించి తెలుసుకుందాం పదండి!ఉదయం 11:00 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతూ పార్లమెంటులో సంప్రదాయ చీరలో కనిపించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, శతాబ్దాల నాటి కళను గౌరవిస్తూ ఎంతో సంక్లిష్టమైన మధుబని కళాకృతులతో తీర్చిదిద్దిన చీర అది. ప్రధానంగా మిథిలా కళా సంప్రదాయంలో పనిచేసే దులారి దేవి, అణగారిన దళిత మల్లా కులంలో జన్మించారు. బీహార్‌లోని మధుబనిలోని మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఔట్రీచ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సందర్భంగా ఆమెకు ఈ చీరను బహూకరించారట. తాను ఎంతో కష్టపడి, జాగ్రత్తగా రూపొందించిన మధుబని ప్రింట్ చీరను నిర్మలా సీతారామన్‌కు అందజేసి బడ్జెట్ దినోత్సవం నాడు ధరించాలని దులారీ దేవి కోరారట. దీనిక మ్యాచింగ్‌గా ఎరుపు రంగు బ్లౌజ్‌ను ఎంచుకున్నారు.మధుబని కళబిహార్లోని మిథిలా ప్రాంతంలో మిథిలా పెయింటింగ్‌గా పేరొందిన కళ ఇది. ఇది సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలు, పూల మూలాంశాలు, ప్రకృతి, పురాణాల వర్ణనల ద్వారా దుస్తులను రూపొందిస్తారు. ఈ కళారూపం దాని శక్తివంతమైన రంగులు, సున్నితమైన గీతలు, ప్రతీకాత్మక వర్ణనలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ కళాకారిణి , చిత్రకారిణి చిన్న వయసులోనే.. అంటే పదమూడేళ్ల వయసులోనే వివాహం జరిగింది. పెద్దగా చదువుకోలేదు కూడా. మధుబని కళాకారిణి మహాసుందరి దేవి ఇంట్లో గృహ సేవకురాలిగా పని చేస్తున్న సమయంలో దులారీ దేవి మధుబని కళను ఒంట పట్టించుకున్నారు. ఆ త రువాత మరో కళాకారిణి కర్పూరి దేవిని పరిచయంతో ఈ కళలోని మరిన్ని మెళకువలను నేర్చుకుని నైపుణ్యం సాధించారు. భర్తను కోల్పోవడం , గ్రామీణ జీవితంలోని కష్టాలు వంటి అనేక వ్యక్తిగత సవాళ్ల మధ్య మిథిలా ప్రాంతంలో ఈ కళతోనే జీవనోపాధి వెతుక్కున్నారు. తన కళను విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఈ కళలో ఆమె చేసిన కృషి, సేవలకు గాను 2021లో దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు వచ్చి వరించింది.మరోవైపు 2019లో మధ్యంతర బడ్జెట్ మొదలు, వరుసగా 2020, 2021, 2022, 2023, 2024 (ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఫిబ్రవరి 1), 2024 (మధ్యంతర బడ్జెట్, జులై 23) ఇలా వరుసగా 7 సార్లు నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇలా ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రిగా రికార్డ్ సాధించారు. అంతేకాదు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. ,2019-20 బడ్జెట్లో భాగంగా 1372020-21లో 162 నిమిషాల పాటు ప్రసంగించిన ఆమె తాజా బడ్జెట్ ప్రసంగంలో 74 నిమిషాల పాటు ప్రసంగించడం విశేషం. -
వికసించిన వ్యవసాయ పద్మాలు
వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త సుభాష్ శర్మ (మహారాష్ట్ర)తో పాటు హారిమన్ శర్మ (హిమాచలప్రదేశ్), ఎస్. హాంగ్‌థింగ్ (నాగాలాండ్)లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. సుభాష్ శర్మ పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన యవత్మాల్ జిల్లాలో అనేక దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తున్నారు. హిమాచలప్రదేశ్‌కు చెందిన హారిమన్ శర్మ ఆపిల్ సాగును కొండప్రాంతాల నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. సాధారణ ఉష్ణోగ్రతలోనూ పండే ఆపిల్ వంగడాలను అభివృద్ధి చేశారు. నాగాలాండ్‌కు చెందిన హాంగ్‌థింగ్ అధికాదాయాన్నిచ్చే కొత్త పంటలను అక్కడి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోబోతున్న ఈ భూమిపుత్రులకు తెలుగు రైతుల తరఫున శుభాకాంక్షలు చెబుతోంది ‘సాక్షి సాగుబడి’. వారి కృషి గురించి కొన్ని వివరాలు.కరువు సీమలో కాంతిరేఖ.. సుభాష్ శర్మ! మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేరు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన ఎందరో పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, యవత్మాల్ వ్యవసాయ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, సీనియర్ ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ శర్మ కూడా అక్కడ దీర్ఘకాలంగా సేద్యం చేస్తున్నారు. యవత్మాల్ జిల్లా వితస గ్రామ వాస్తవ్యుడైన శర్మ.. నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సుభాష్ శర్మకు 67 ఏళ్లు. ఆరుతడి పంటల సాగులో 47 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. రసాయనిక సేద్యపు చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని దిశను మార్చుకున్నారు. సేద్యంలో గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడాయన. అంతేకాదు, నల్లరేగడి పొలాల్లో అనేక వినూత్న సుస్థిర వ్యవసాయ పద్ధతులను స్వీయానుభవంలో కనుగొని, అనుసరిస్తున్న విశిష్ట రైతు శాస్త్రవేత్త కూడా. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవంతో, ప్రజ్ఞతో మెట్టప్రాంతాల్లో ప్రకృతి సేద్యానికి అనుగుణమైన సాగు పద్ధతులను సుభాష్ శర్మ రూపొందించుకున్నారు. 30 ఏళ్లుగా ప్రకృతి సేద్యంసుభాష్ శర్మకు 13 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న ఆయనకు 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దుల మేతకు కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. మార్కెట్లో ఎప్పుడు, ఏయే పంట ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో గమనించుకుంటూ రైతులు బహుళ పంటలు సాగుకు ప్రణాళికను రూపొందించుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటారాయన.పత్తి సాగులో వినూత్న పద్ధతిప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పత్తిని, కందిని కూడా ఈ పద్ధతిలోనే సాగు చేయడం ఆయన ప్రత్యేకత. అధిక దిగుబడిని సాధించే ఈ వినూత్న పద్ధతిని గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మ పై ప్రత్యేక కథనాన్ని 2018 డిసెంబర్లోనే ‘సాక్షి సాగుబడి’ ప్రచురించింది. సుభాష్ శర్మ తన యూట్యూబ్ చానల్లో వీడియోలు అందుబాటులో ఉంచారు.@naturalfarmingbysubhashsharma9@KrishiTVఅధిక దిగుబడి, అధిక నికరాదాయం!ప్రకృతి సేద్యంలోని శాస్త్రీయతను అర్థం చేసుకొని రైతులు అనుసరించినప్పుడే సత్ఫలితాలు సాధించగలుగుతారు. పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తే.. భూసారంతో పాటు దిగుబడి కూడా పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు, శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్రకొత్త పంటల హాంగ్థింగ్నాగాలాండ్లోని కోక్లక్కు చెందిన ఎల్. హాంగ్‌థింగ్ అనే 58 ఏళ్ల రైతు శాస్త్రవేత్త అధికాదాయాన్నిచ్చే కొత్త ఉద్యాన పంటలను రైతులకు అందుబాటులోకి తేవటంలో విశేష కృషి చేశారు. ఆప్రాంత రైతాంగానికి తెలియని లిచి, నారింజ వంటి కొత్త పండ్ల రకాలను వారికి అందుబాటులోకి తెచ్చారు. 30 ఏళ్లుగా ఉద్యాన తోటలను సాగు చేస్తున్నారు. ఆయన కృషి వల్ల 40 గ్రామాల్లో 200 మంది రైతులు కొత్త రకాల పండ్ల చెట్ల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోగలిగారు. తిని పారేసిన పండ్ల విత్తనాలను సేకరించి మొలకెత్తించటం వంటి ప్రయోగాలను ఆయన బాల్యం నుంచే చేపట్టటం విశేషం. ఆయన రూపొందించిన అనేక మెళకువలను వందలాది మంది రైతులు అనుసరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు.ఆపిల్ సాగును దేశవ్యాప్తం చేసిన హారిమన్ఆపిల్ పండ్ల తోటలను హారిమన్ శర్మ మంచు కొండల మీద నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని గల్లసిన్ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్తపోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండప్రాంతాల్లో మాత్రమే ఆపిల్ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమప్రాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్ ప్రయోగాలు చేయటంప్రారంభించారు.పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదానప్రాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్‌ఎంఎన్–99 అనే గ్రాఫ్టెడ్ ఆపిల్ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమల్ దృష్టికి వెళ్లటంతోప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్ ఆపిల్ మొక్కలను అందించిన ఘనత ఆయనది. -
నమ్మి పదవిస్తే నమ్మక ద్రోహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నైతిక విలువలకు బొత్తిగా చోటు లేకుండా పోతోంది. నేతలు పార్టీలనే కాకుండా ఇచ్చిన మాటను, చేసిన ప్రకటనను కూడా ఫిరాయించేస్తున్నారు. అధికారం ఎటు వైపు ఉంటే అటే ఉంటామంటున్నారు. వైఎస్సార్ సీపీ ఎంతో నమ్మకం ఉంచి కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీకి గౌరవ ప్రదమైన శాసనమండలిలో స్థానం కల్పించింది. గవర్నర్ కోటాలో ఆమెకు మండలిలో సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం కల్పించారు. బీసీలలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది సేవలందిస్తున్న సీనియర్లు ఉన్నప్పటికీ మత్స్యకార వర్గంలోని వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలైన పద్మశ్రీని మహిళా కోటాలో అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీగా పార్టీ అధిష్టానానికి సిఫారసు చేశారు.పద్మశ్రీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక గత ఆగస్టు 30న కాకినాడ నగరపాలక సంస్థలో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా కొనసాగుతానని అప్పటి కలెక్టర్ కృతికాశుక్లాకు లేఖ అందజేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేశాక ఏడాది తిరగకుండానే పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్ సీసీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పద్మశ్రీ వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు. పనులు చక్కబెట్టాలన్నా, లాబీయింగ్ చేయాలన్నా అధికార పార్టీలో ఉండాల్సిందేననే ధోరణితోనే ఎమ్మెల్సీ అటు వైపు ఫిరాయించారనే విమర్శలున్నాయి.పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెండు నెలలు గడిచిపోయాయి. కారణాలేమైనా పదవులకు రాజీనామా చేసే ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన రోజు నుంచి అధికారిక హోదాను వదులుకుంటారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే వారెవరైనా ఇది అమలు చేస్తారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం సహా ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీకి ఎవరు వచ్చినా పార్టీ, వారు అంతవరకూ అనుభవించిన పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి లక్ష్మణ రేఖ గీశారు. ఆయా పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులంతా దీన్ని పాటించే వైఎస్సార్ సీపీలోకి వచ్చారు.విస్తుబోతున్న జనంపద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంటే చేశారు తప్ప ఆ పదవి ద్వారా సంక్రమించిన గన్‌మెన్, ప్రొటోకాల్‌ను వదులుకోలేకపోతున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్సీ హోదాలోనే హాజరవడంతో జనం విస్మయానికి గురవుతున్నారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినోత్సవంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ అధికారికంగా పాల్గొన్నారు. ఇటీవల కాకినాడ దుమ్ములపేటలో చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తిచేసే ప్లాంట్‌కు శ్రీకారం చుట్టిన అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్‌తో పద్మశ్రీ హాజరయ్యారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మెకనైజ్డ్ బోట్ల యజమానులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్‌తో పాల్గొన్నారు. పార్టీ వద్దనుకుని, ఎమ్మెల్సీ పదవి వద్దనుకుని రాజీనామా చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ హోదాను ఎందుకు వదులుకోవడం లేదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.సముచిత గౌరవం కల్పించినా..వైఎస్సార్ సీపీ మాత్రం ఎప్పుడూ నమ్మిన వారికి న్యాయం చేయడంలో ముందే ఉంటుంది. ఎస్సీ, బీసీలకు న్యాయం చేయడంలో వైఎస్సార్ సీపీ మొదటి నుంచి ఒక అడుగు ముందే ఉంటోంది. పార్టీలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కీలకమైన రెవెన్యూ మంత్రిని చేసింది. అనంతరం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలిసారి బీసీల నుంచి బోస్‌ను రాజ్యసభ సభ్యుడిని కూడా చేసింది. వైఎస్సార్ సీపీని నమ్ముకున్న వారికి ఏదో ఒక రోజు సముచిత గౌరవం దక్కుతుందని కర్రి పద్మశ్రీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా మరోసారి నిరూపితమైంది. పద్మశ్రీ భర్త కర్రి నారాయణకు పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులతో సముచిత ప్రాధాన్యం కల్పించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాక పూర్వం నుంచి ద్వారంపూడి వెంట ఉన్న నారాయణకు, ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం ద్వారంపూడి సిఫారసు చేశారు. ద్వారంపూడి వెంట ఉన్న నారాయణ 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీతో చెట్టపట్టాలేసుకు తిరిగారు. తిరిగి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన నారాయణను నమ్మి అతని భార్య పద్మశ్రీని ఎమ్మెల్సీని చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కూటమికి దక్కడంతో మరోసారి నారాయణ, భార్య ఎమ్మెల్సీ పద్మశ్రీ కూటమి వైపు వెళ్లిపోయారు. ఎంతో నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ పదవిని ఇస్తే ఆమె విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామంటున్న నేతల జాబితాలో కర్రి దంపతులు చేరిపోయారంటున్నారు.డబ్బుకు అమ్ముడుపోవడం అన్యాయండబ్బుకు అమ్ముడుపోవడంతోనే ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఇది అతి పెద్ద వెన్నుపోటు. రాజకీయాల్లో ఎంతోమంది పార్టీలు మారుతుంటారు. అయితే కర్రి పద్మశ్రీ, భర్త నారాయణ వ్యవహారశైలి అత్యంత దారుణం. సాధారణ వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి గౌరవిస్తే చివరకు డబ్బుకు ఆశపడి రాజీనామా చేయడం అన్యాయం. రాజీనామా చేశానంటూనే అధికారిక కార్యక్రమాలకు ఎలా హాజరవుతున్నారు. గన్మెన్లను వెంట పెట్టుకు తిరుగుతున్నారు. ప్రొటోకాల్ వదులుకోలేక పోతున్నారు.– ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, -
అవసరం తీరాక.. జంప్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీకి వైఎస్సార్సీపీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణ గృహిణిగా ఉన్న ఆమెకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. కొంత కాలానికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా ఓడిపోయిన కుటుంబం నుంచి వచ్చిన మహిళకు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా అనేక అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే వెన్నుపోటు పొడిచారు. రాజకీయంగా ఉనికితో పాటు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీని మోగసించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పద్మశ్రీ, భర్త ప్రసాద్‌కు పారీ్టలో ప్రాధాన్యం పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాద్ బుధవారం నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీలో మొదటి నుంచి ఘంటా ప్రసాద్ కీలకంగా ఉన్నారు. పార్టీ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యతనిచ్చి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా చేశారు. 2021లో దెందులూరు నియోజకవర్గం పెదపాడు జెడ్పీటీసీగా ఘంటా ప్రసాద్ భార్యకు అవకాశం కలి్పంచారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో జెడ్పీ చైర్మన్ పదవీ ఖాళీ అయింది. అనేక మంది పదవి కోసం ప్రయత్నాలు చేసినా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు పదవి ఇవ్వాలనే కారణంతో పద్మశ్రీకి గతేడాది జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. మొదట జనసేన.. ఇప్పుడు టీడీపీ 2026 ఏప్రిల్ వరకు ఆమెకు పదవీ కాలం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలుకావడంతో పదవి కాపాడుకోవడానికి కూటమి వైపు చూశారు. తొలుత జనసేన అని ప్రకటించి చివరికి టీడీపీలో చేరారు. 2013 ఎన్నికల్లో ఘంటా ప్రసాద్ తండ్రి ఘంటా రంగారావు పెదపాడు మండలం సత్యవోలు నుంచి సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రాధాన్యం ఇచ్చినా వంచనకు పాల్పడి పార్టీకి ద్రోహం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా జెడ్పీటీసీల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తనతో పాటు 15 మంది జెడ్పీటీసీలను తీసుకువెళ్లడానికి అన్ని రకాలుగా ప్రయతి్నంచినా, జెడ్పీటీసీలు ససేమిరా అనడంతో ఒంటరిగా టీడీపీలో చేరారు. ఘంటా రాకను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు ఘంటా ప్రసాద్ ఈ నెల 2న పారీ్టకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మళ్లీ మూడురోజులు తరువాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను విశాఖలో కలిసి ఆగమేఘాల మీద ఘంగా ప్రసాద్ టీడీపీ కండువా వేయించుకున్నారు. మళ్లీ బుధవారం అమరావతిలో లోకే‹Ùను కలిసి జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మినహా ఏలూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెడ్పీ చైర్పర్సన్ చేరికను బలంగా వ్యతిరేకించారు. -
101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!
గత గురువారం పద్మ అవార్డు వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పద్మ అవార్డు గ్రహీతల్లో ఫ్రాన్స్ మహిళ భారతీయ వస్త్రాలంకరణలో తళుక్కుమన్నారు. అందరీ అటెన్షన్ ఆమె వైపే. చక్కగా సంప్రదాయ ఆకుపచ్చ పట్టు చీరలో భారతీయ మహిళ మాదిరిగా వచ్చి మరీ అవార్డు తీసుకున్నారు. ఆమెను భారతదేశపు నాల్గొవ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీతో సత్కరించారు. ఆ ఫ్రాన్ మహిళ పేరు ఫార్లెట్ చోపిన్. ఇంతకీ ఎవరీ షార్లెట్ చోపిన్ అంటే..ఫ్రాన్స్‌కు చెందిన షార్లెట్ చోపిన్ యోగా ప్రాక్టీషనర్. ఫ్రాన్స్‌లోని చెర్లోని చిన్న పట్టణమైన లేరే నివాసి. ఆమె ఈ యోగాను 50 ఏళ్ల వయసులో నేర్చుకుని సాధించడం ప్రారంభించింది. వయోపరిమితిని లెక్కచేయకగా చాలా అలవోకగా నేర్చుకుని యోగా టీచర్‌గా మారి యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నందుకు గానూ ఆమెకు ఈ పురస్కరం లభించింది. అంతేగాదు గతేడాది జూలైలో షార్లెట్ చోపిన్ పారిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో యోగాను ప్రోత్సహించేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఆమె యోగా ఆనందాన్ని, సంపూర్ణ శ్రేయస్సును ఎలా ప్రోత్సహిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది కూడా. కాగా గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చోపీన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. Defying age limiting norms by learning #yoga post turning 50, Charlotte Chopin, a 101-year-old Yoga exponent from France receives #PadmaShri from President Droupadi Murmu at the Rashtrapati Bhavan #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/B0QMx2FJ6B— PIB India (@PIB_India) May 9, 2024 (చదవండి: కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!) -
‘పద్మశ్రీ’లకు రూ.25వేల పింఛన్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి, ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తొవ్వ ఖర్చులకు కూడా కష్టంగా ఉన్నా, కనుమరుగవుతున్న కళలు, తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు కష్టపడుతున్న కళాకారులకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవితోపాటు పద్మశ్రీకి ఎంపికైన ఆనందాచార్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విఠలాచార్యలను ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని..లేదంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో తెలుగు సంప్రదాయ కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం సముచితమని, ఈ పరిస్థితుల్లో పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించినట్టు తెలిపారు. రాజ కీయాలకతీతంగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థి దశ నుంచి తనకు వెంకయ్యనాయుడు ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని రేవంత్‌రెడ్డి చెప్పారు. 1978లో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డితో కలిసి ప్రజాసమస్యలపై పోరాడిన నేత వెంకయ్యనాయుడని కొనియాడారు. రాజకీయాల్లో భాష ప్రాధాన్యతపై వెంకయ్య చేసిన సూచనలను తాను పాటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన నాయకుడన్నారు. కళాకారుడిగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిరంజీవి అని..పున్నమినాగు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు ఒకే కమిట్మెంట్తో ఆయన ఉన్నారని కొనియాడారు. కొత్త సంప్రదాయానికి నాంది పలికిన రేవంత్‌రెడ్డి : వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో ప్రమా ణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎనీ్టఆర్, అక్కినేని అయితే, మూడోకన్ను చిరంజీవి అని కొనియాడారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ రాజ్యం సుభిక్షం : చిరంజీవి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడ కళాకా రులు గౌరవం పొందుతారో.. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ముదావహమని పేర్కొన్నారు. ప్రజాగాయకు డు గద్దర్ పేరున అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. రాజకీయాల్లో దుర్భాషలు ఎక్కువయ్యాయని, వ్యక్తిగతంగా దుర్భాష లాడటం మంచిది కాదని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకయ్య, చిరంజీవిల ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్ అమ్మ’ కు పద్మశ్రీ
సేంద్రీయ వ్యవసాయంతో పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ‘నారియల్ అమ్మ’ వార్తల్లోనిలిచారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికిచెందిన 67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో విశేషకృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. సాంప్రదాయ వ్యవసాయం, కొబ్బరి సాగుతో 'నారియల్ అమ్మ' గా ఖ్యాతి గడించారు. దక్షిణ అండమాన్‌లోని రంగాచాంగ్‌కు చెందిన చెల్లమ్మాళ్ కొబ్బరి సాగులో విప్లవాత్మకమైన, వినూత్న పద్ధతులను అవలబించారు. స్థిరమైన వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ను కూడా అలవర్చుకున్నారు. కొబ్బరి ఆకులు, పొట్టును మల్చింగ్గా ఉపయోగించి వర్షానంతర కాలంలో నేల తేమను కాపాడుకుంటూ తేమ నష్టాన్ని తగ్గించడమే కాకుండా కలుపు, తెగుళ్ల బెడదను నివారించారు. అలాగే హానికర రసాయనాలకు దూరంగా 'ట్రాప్ ప్లాంట్స్'తో తెగుళ్ల నివారణలో వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు. ఫలితంగా ఆరోగ్యకరమైన కొబ్బరి దిగుబడిని సాధించారు. అంతేకాదు తనతోపాటు తోటి రైతులు కూడా సేంద్రీయ పద్ధతులను పాటించేలా కృషి చేశారు.. తన 10 ఎకరాల భూమిలో బహుళ జాతుల పంటలను పండిస్తారు చెల్లమ్మాల్. అలాగే ఏనుగు పాదం, అరటి, వేరుశెనగ, పైనాపిల్, బత్తాయి, పచ్చిమిర్చి, ట్యూబ్ రోజ్, గ్లాడియోలస్, ఆకు, కూరగాయలతో వైవిధ్యమైన సాగు ఆమె ప్రత్యేకత. సమీకృత వ్యవసాయ విధానంతో తక్కువ కొబ్బరి మార్కెట్ ధరల సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచింది. స్థిర వ్యవసాయ పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో మారుమూల గ్రామం నుంచిజాతీయ అవార్డు దాకా సాగిన చెల్లమ్మాళ్ అద్భుత ప్రయాణం భావి తరం రైతులకు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చెల్లమ్మాళ్ కొడుకు రామచంద్రన్, ఆమెకు వ్యవసాయంలో ఆసరాగా ఉంటారు. విభిన్న పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపక విశేషాలను స్థానిక విద్యార్థులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రదర్శిస్తూ వ్యవసాయ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. -
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి నెట్వర్క్ : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో ఏర్పడిన ఖాళీలకు గురువారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గత నెల 31న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరులో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. అనంతరం పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన కవురు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి వరించడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠానికి ఖాళీ ఏర్పడింది. దీంతో బీసీ మహిళగా ఉన్న గంటా పద్మశ్రీను ఈ పదవి వరించింది. జిల్లా పరిషత్ ఏర్పడిన అనంతరం బీసీ మహిళగా పద్మశ్రీ మొట్టమొదటి చైర్పర్సన్ కావడం.. మహిళకు జిల్లా పరిషత్ పీఠాన్ని అందించడం పట్ల పార్టీ శ్రేణులు, ప్రజలు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తానని చెప్పారు. ఇక పద్మశ్రీకి మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వాసుబాబు, వెంకట్రావు, అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీలు వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ♦ ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 22వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కొమ్ము వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి గత నెలలో షేక్ అమీరున్నీసాబేగం రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ముప్పిడి సరోజని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ ప్రత్యేకాధికారి జీవీకే మల్లికార్జునరావు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ♦నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన (ఎస్సీ మహిళకు రిజర్వు) బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్‌గా కోనేటి రామకష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలిపారు. ♦ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్–1గా ముచ్చు లయయాదవ్ (వైఎస్సార్సీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ డివిజన్ కార్పొరేటర్ అయిన ఆమెను ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఎన్నుకున్నారు. ♦ విజయనగరం జిల్లా ఎల్.కోట మండల పరిషత్ రెండో వైస్ ఎంపీపీగా భీమాళి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) సభ్యుడు ముధునూరు శ్రీనివాసవర్మరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా పనిచేసిన దండేకర్‌కుమారి మరణించడంతో ఎన్నిక అనివార్యమైంది. ♦గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ రెండో వైస్ చైర్‌పర్సన్‌గా 40వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రకటించి, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేనేత వర్గానికి చెందిన కాచర్ల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, స్థానిక సంస్థలకు సంబంధించి బత్తలపల్లి ఎంపీపీగా అప్పరాచెరువు ఎంపీటీసీ సభ్యురాలు బగ్గిరి త్రివేణి, చెన్నేకొత్తపల్లి వైస్ ఎంపీపీ–1గా చెన్నేకొత్తపల్లి–2 ఎంపీటీసీ సభ్యురాలు పి.రాములమ్మను ఎన్నుకున్నారు. ఇక అనంతపురం జిల్లా విడపనకల్లు మండల ఉపాధ్యక్షురాలు–2గా హాంచనహాళ్ ఎంపీటీసీ రాకెట్ల పుష్పావతి ఎంపికయ్యారు. కోరం లేకపోవడంతో రాయదుర్గం వైస్ ఎంపీపీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. అన్నిచోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, అందరూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వారే కావడం గమనార్హం. ♦అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీగా జల్లా పద్మావతమ్మ ఎంపికయ్యారు. ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో గరిగుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు జల్లా పద్మావతమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికలు వాయిదా.. చిత్తూరు జిల్లాలోని మూడు మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల ఎంపిక గురువారం కోరంలేక వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు రామకుప్పం, చిత్తూరు రూరల్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సంబంధిత ఎంపీటీసీ సభ్యులకు వారం ముందే సమాచారమిచ్చారు. ఇందుకు ఎంపీటీసీ సభ్యులు రాకపోవడంతో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది. విజయపురం వైస్‌ఎంపీపీ స్థానానికి ఎన్నిక మొదటిసారి వాయిదా పడడంతో శుక్రవారం మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీపీ ఎన్నికకు నిర్ణీత సమయంలో ఎంపీటీసీ సభ్యులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు. -
పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
విరబూసిన ప్రకృతి సేద్య పద్మాలు: పగలు సేద్యం.. రాత్రి వైద్యం.. దేశీ వరి వంగడాలే ప్రాణం!
2023 పద్మశ్రీ పురస్కార గ్రహీతల్లో వ్యవసాయంతో సంబంధం ఉన్న వారంతా (ప్రసిద్ధ ఆక్వా శాస్త్రవేత్త డా. విజయ్‌గుప్తా మినహా) దేశీ వంగడాలతో ప్రకృతి, సేంద్రియ తరహా సేద్య పద్ధతులను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారే. అంతేకాదు, నెక్రమ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్) 9 పంటల మిశ్రమ ప్రకృతి సాగు చేస్తున్నారు. పతయత్ సాహు (ఒడిషా) ఔషధ మొక్కలను సాగు చేస్తూ ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. చెరువాయల్ రామన్ (కేరళ) దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు. తులారామ్ ఉపేతి (సిక్కిం) 80 ఏళ్లుగా వారసత్వ సేంద్రియ సేద్యం చేస్తున్న కురువృద్ధుడు కావటం విశేషం. పురాతన ‘అటవీ కృషి’ పద్ధతిని పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన డా. ఖాదర్ వలి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరులో జన్మించినా మైసూరులో స్థిరపడినందున కర్ణాటక కోటాలో ఎంపికయ్యారు. వీరి కృషి గురించి రేఖామాత్రంగా... తొమ్మిది పంటల మిశ్రమ సేద్యం నెక్రమ్ శర్మ (59).. మంచు కొండల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు. ఈ ఏడాది ఆ రాష్ట్రం నుంచి పద్మశ్రీకి ఎంపికైంది ఆయనొక్కరే. ప్రభుత్వ ఉద్యోగం కోసం విఫలయత్నం చేసిన ఆయన తదనంతరం సేద్యాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. నాలుగున్నర ఎకరాల వారసత్వ భూమిలో 38 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల భూసారం దెబ్బతింటున్నదని గుర్తించి, 22 ఏళ్ల క్రితమే సుభాష్ పాలేకర్ బాటలో ప్రకృతి సేద్యంలోకి మళ్లారు. కనీసం 3 డజన్ల పంటలకు చెందిన దేశీ విత్తనాలను ఆయన పరిరక్షిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. పది వేల మంది రైతులకు ఆయన ఉచితంగా దేశీయ విత్తనాలు పంచిన ఘనత ఆయనిది. ‘నౌ అనజ్’ (9 పంటలు) అనే పురాతన ప్రకృతి సేద్య పద్ధతిని శర్మ పునరుద్ధరించారు. పొలంలో కనీసం 9 రకాల పంటలు కలిపి మిశ్రమ సాగు చేస్తున్నారు. తిండి గింజలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, తీగజాతి పంటలను కలిపి ఒకే పొలంలో సాగు చేస్తారు. వానాకాలంలో 9 పంటలు, శీతాకాలంలో మరో 9.. ఏటా 18 పంటలను ఆయన సాగు చేస్తున్నారు. 20 ఏళ్లుగా దేశీ విత్తన పరిరక్షణపై కృషి చేస్తున్నారు. 8 రకాల చిరుధాన్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రకృతి సాగు వల్ల 50% నీటి అవసరం తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. దేన్నీ బయట నుంచి తెచ్చి వేసే అవసరం లేదంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నానని, మంచి ఆహారాన్ని ఇష్టపడే స్నేహితులే తనకు బలమని అన్నారు. ‘రోజుకు 14 గంటలు పనిచేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు బాధ్యతను పెంచింది. ఇక 18 గంటలు పనిచేస్తా’నంటున్నారు నెక్రమ్ శర్మ వినమ్రంగా. పగలు సేద్యం.. రాత్రి వైద్యం పతయత్ సాహు (67).. విశిష్ట వ్యవసాయ వైద్యుడు. ఒడిషాలోని కలహండి జిల్లా నందోల్ ఆయన స్వగ్రామం. 40 ఏళ్లుగా దాదాపు 3 వేల ఔషధ మొక్కలను తన ఎకరంన్నర భూమిలో పూర్తి సేంద్రియంగా పెంచుతూ.. ఆ మూలికలతోనే ప్రజలకు వైద్యం చేస్తున్నారు. ప్రతి మొక్క గుణగణాల గురించి తడుముకోకుండా అనర్ఘళంగా చెప్పగలరాయన. పగలు ఔషధ మొక్కల తోట పనులు స్వయంగా చేసుకుంటూ బిజీగా గడిపే సాహు.. రాత్రిపూట ప్రజలకు వైద్యం చేస్తారు. ఇంతని ఫీజు అడగరు. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. యుక్తవయసులోనే ఆసక్తితో ఔషధ మొక్కలు సేకరించి పెంచటం అలవాటు. తాత ఆయుర్వేద వైద్యుడు. చదువు అయ్యాక తాత దగ్గరే సంప్రదాయ ఆయుర్వే వైద్యం నేర్చుకున్నారు. ఇప్పుడున్న 3 వేల జాతుల ఔషధ మొక్కల్లో చాలా వరకు స్వరాష్ట్రంలో అరణ్యాల్లో నుంచి అటవీ అధికారులతో పాటు వెళ్లి ఎన్నో అరుదైన మొక్కలను సేకరించారు. 500 రకాలను ఒడిషా ఔషధ మొక్కల బోర్డు తోడ్పాటుతో ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి సంరక్షిస్తున్నారు. ఔషధ మొక్కల జీవవైవిధ్యానికి ఆయన క్షేత్రం నిలయంగా మారింది. వ్యవసాయంతో వైద్యంతో అనుసంధానం చేయటం విశేషం. అరుదైన ఔషధులను పరిరక్షిస్తూ వాటి ప్రయోజనాలను అక్షరబద్ధం చేసి కొత్త తరానికి అందించటం గొప్ప సంగతి. ‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు! డాక్టర్ ఖాదర్ వలి (65).. సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కడు కృషి) పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త. కమతం చిన్నదైనా అందులో 20% విస్తీర్ణంలో అడవిని పెంచుకుంటూ.. మిగతా స్థలంలో సీజనల్ పంటలు సాగు చేయటమన్నది ‘అటవీ కృషి’లో ఒక అంశం. ‘కడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువును రూపొందించారు. రసాయనాల్లేకుండా వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే మనకు, ప్రకృతికి మేలు చేసే సేద్యమని ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి ‘సిరిధాన్యాలు’ తింటూ హోమియో/ఆయుర్వేద మందులు వాడుతుంటే.. మధుమేహం నుంచి కేన్సర్ వరకు ఏ జబ్బయినా 6 నుంచి 2 ఏళ్లలోగా తగ్గిపోతాయంటారు డా. ఖాదర్. వరి, గోధుమలకు బదులు రోజువారీ ప్రధాన ఆహారంగా సిరిధాన్యాలను ఒక్కో రకాన్ని రెండు, మూడు రోజులు మార్చి మార్చి తినాలి. కొత్తగా అలవాటు చేసుకునే వారు 6 వారాల పాటు అన్నంగా కాకుండా అంబలి రూపంలో, కూరలు నంజుకుంటూ, తాగాలన్నది ఆయన సూచన. ఐదేళ్ల క్రితం డా. ఖాదర్‌ని ‘సాక్షి సాగుబడి’ తెలుగువారికి తొలిసారి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నీలి విప్లవ మార్గదర్శి మోదడుగు విజయ్ గుప్తా (83).. ఆక్వాకల్చర్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శాస్త్రవేత్త. సముద్రతీర ప్రాంత పట్టణం బాపట్లలో జన్మించారు. మత్స్యకారుల జీవితాల్లో మార్పు తేవాలన్న ఆసక్తితో కృషి చేసి అంతర్జాతీయ స్థాయి మత్స్యశాస్త్రవేత్తగా ఎదిగారు. ఆగ్నేయాసియాలో నీలి విప్లవానికి మార్గదర్శకుడిగా పేరుగాంచారు. 22 దేశాల్లోని చిన్న రైతులు, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా చేపల పెంపకం పద్ధతులను రూపొందించారు. మలేషియాలోని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫిష్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మన దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని చేపల వినియోగాన్ని తలసరిన 5 కిలోల నుంచి 15 కిలోలకు పెంపొందించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చని విజయ్ గుప్తా సూచిస్తున్నారు. ఆక్వా శాస్త్రవేత్తగా ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి (2005)ని, మొదటి సన్హాక్ శాంతి బహుమతి(2015)ని గెలుచుకున్నారు. సేంద్రియ సేద్య కురువృద్ధుడు తులారామ్ ఉపేతి.. 98 ఏళ్లు ఉపేతి గత 80 ఎనభయ్యేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 2023లో పద్మశ్రీ పురస్కారం పొందిన వ్యవసాయదారుల్లోకెల్లా ఈయనే పెద్ద. సిక్కిం తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అక్కడి రైతులు ముఖ్యపాత్ర పోషించారు. ఐదో తరగతి చదివిన ఉపేతి చిన్నతనం నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగించారు. ఇతర రైతులకు మార్గనిర్దేశం చేశారు. సిక్కిం భారత్‌లో కలవక ముందు టిబెట్‌లోని యటుంగ్‌కు భుజాలపై మోసుకెళ్లి ధాన్యం, మొక్కజొన్నలను అమ్మేవారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తులారామ్ ఐదారేళ్ల క్రితం వరకు స్వయంగా పొలానికి వెళ్లి పనులు చేయించేవారు. దేశీ వరి వంగడాలే ప్రాణం! చెరువాయల్ రామన్(72).. కేరళకు చెందిన ఆదివాసీ సేంద్రియ రైతు. దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు కూడా. వయనాడ్ ప్రాంతంలో మనంతవాడి పంచాయతీలోని కమ్మన గ్రామంలో ఆయన నివశిస్తారు. రామన్ 150 ఏళ్ల నాటి వారసత్వ పూరింట్లోనే, విత్తనాల కుండల మధ్యనే, ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. స్థానికంగా ‘గార్డియన్ ఆఫ్ నేటివ్ పాడీ’గా ప్రసిద్ధి చెందారు. రామెట్టన్ అని కూడా ఆయన్ను పిలుస్తారు. ఔషధ గుణాలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే గుణం వంటి ప్రత్యేకతలు కలిగిన స్వదేశీ వరి రకాలు శతాబ్దాలుగా మన దేశంలో వాడుకలో ఉన్నాయి. అయితే, హైబ్రిడ్, జన్యుమార్పిడి వరి రకాల రాకతో దేశీ రకాలు చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెరువాయల్ రామన్ తన 4 ఎకరాల పొలంలో 1.5 ఎకరాలను 22 ఏళ్ల క్రితం దేశీ వరి సాగుకు కేటాయించారు (మిగతా పొలంలో ఇతర పంటలు పండిస్తున్నారు). 54 దేశవాళీ రకాల వరిని ప్రతి ఏటా పండిస్తూ సంరక్షిస్తున్నారు. తన జీవితాన్ని దేశీ విత్తనాల పరిరక్షణకే అంకితం చేశారు. వయనాడ్ ప్రాంతంలో కురిచ్య గిరిజన జాతిలో పుట్టిన ఆయన ఆసుపత్రి వార్డెన్‌గా ఉద్యోగం చేసేవారు. అయితే, తమ గిరిజన కుటుంబాలు పురాతన దేశీ వరిసేద్యానికి క్రమంగా స్వస్తి చెబుతుండటాన్ని గుర్తించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. 2004 నుంచి దేశీ వరి రకాలను ఉద్యమ స్ఫూర్తితో తాను సాగు చేయటమే కాదు. ఆ ప్రాంతంలో రైతులను కూడగట్టి సంఘంగా ఏర్పరిచి దేశీ వరి సాగును విస్తృతం చేశారు. అపురూపమైన దేశీ వరి విత్తనాలు డబ్బు కన్నా విలువైనవని ఆయన భావన. అందుకే విత్తనాలను అమ్మరు. ఉచితంగా ఇస్తారు. పండించిన తర్వాత అంతే పరిమాణంలో విత్తనాలను తనకు తిరిగి ఇవ్వాలి. అదొక్కటే షరతు. కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘జీనోమ్ సేవియర్ పురస్కారం’ ప్రదానం చేసి గౌరవించింది. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్! -
శివానంద ‘యోగ’
-
నా కళను అవమాన పరుస్తున్నారు: కిన్నెర మొగులయ్య
-
ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ గ్రహీత.. 110 ఏళ్ల వయసున్న సాలు మరద తిమ్మక్క బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ఆమెను ప్రగతిభవన్‌లో మంత్రు లు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి స్వయంగా తోడ్కొని వెళ్లారు. అందరికీ పరిచయం చేశారు. ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పర్యావరణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. మంచి పనిలో నిమగ్నమైతే గొప్పగా జీవించవచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనడానికి తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. అందరూ ఆమె బాటలో నడవాలని ఆకాంక్షించారు. కాగా.. వ్యవసాయం, అటవీ సంరక్షణ రంగాల్లో రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలవడం పట్ల తిమ్మక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు అవసరముంటే తాను అందజేస్తానని చెప్పారు. కర్ణాటకకు చెందిన తిమ్మక్క బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల్లో ఒకరు. 25 ఏళ్లవరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి.. పచ్చదనం, పర్యావరణ హితం కోసం ఆమె కృషి చేస్తున్నారు. చదవండి👉🏼 కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, 110 సంవత్సరాల సాలుమరద తిమ్మక్క ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. pic.twitter.com/j9hLTlz4cK — Telangana CMO (@TelanganaCMO) May 18, 2022 ‘ఆకుపచ్చని వీలునామా’ఆవిష్కరణ హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ పై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎంను కలిసిన తమిళ హీరో విజయ్ తమిళ సినీనటుడు విజయ్ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ్‌కు కేసీఆర్ శాలువా కప్పి సత్కరించారు. చదవండి👉 భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది -
నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా: మొగులయ్య
తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న ఏకైక కళాకారుడు మొగులయ్య. గ్రామాల్లో అక్కడా ఇక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకున్న అతడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగులయ్యను సత్కరించింది. అయితే తాజాగా అతడు తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు. 'నన్ను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. మొన్నామధ్య పాట పాడితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయలు ఇచ్చారు. అయితే బీజేపీ వాళ్లు ముఖ్యమంత్రి తన ఇంట్లో నుంచి కోటి రూపాయలు ఇస్తున్నడా? అని నాతో గొడవపడ్డారు. పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట. నాకు ఆ పతకం అవసరం లేదు. నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ ఎవరిదైనా సరే అది తిరిగి ఇచ్చేస్తా. కానీ పేదోడిని అయిన నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతది' అని ఆవేదన వ్యక్తం చేశాడు మొగులయ్య. చదవండి 👇 ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే? 'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' అంటున్నారు -
వయసు: 102 ఆరోగ్యరహస్యం: సమాజసేవ
మంగళవారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్లుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాబితాలో102 ఏళ్ల శకుంతల చౌధురి పేరు కూడా ఉంది. ‘అస్సాంలో వందేళ్లు దాటిన ఏకైక మహిళ శకుంతల’ అనే మాటపై భేదాభిప్రాయాలు ఉండొచ్చుగానీ ‘ఆమె అలుపెరగని సమాజ సేవిక’ అనే వాస్తవాన్ని ఎవరూ విభేదించరు. అస్సాంలో ఏడుదశాబ్దాలకు పైగా ఆమె పేరు ‘సామాజిక సేవ’కు ప్రత్యామ్నాయంగా మారింది. గౌహతిలోని ‘కస్తూర్బా ఆశ్రమం’ కేంద్రంగా శకుంతలమ్మ ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ సేవాకేంద్రాలను స్థాపించడం ద్వారా ఎన్నో గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది. ‘స్త్రీ శక్తి జాగారణ్’ ఉద్యమంతో స్త్రీల అక్షరాస్యతకు కృషి చేసింది. స్త్రీ సాధికారత వైపు అడుగులు వేయించింది. శకుంతలమ్మ సుదీర్ఘ ఉపన్యాసాలేవి ఇవ్వదు. చాలా నిశ్శబ్దంగా సేవాకార్యక్రమాలు చేస్తూ పోతుంది. ఈ విధానం ఎంతోమందికి ఆదర్శం అయింది. ‘మనం మాట్లాడడం కంటే మనం చేసే పని మాట్లాడితేనే మంచిది’ అంటారు ఆమె. గాంధీజి, వినోభావే సిద్ధాంతాలతో ప్రభావితం అయిన శకుంతల చిన్న వయసులోనే సమాజసేవను ఊపిరిగా మలుచుకుంది. ‘శకుంతలమ్మను వ్యక్తి అనడం కంటే మహావిశ్వవిద్యాలయం అనడం సరిౖయెనది. ఆమె సైద్ధాంతిక జ్ఞానం, సేవాదృక్పథం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటారు ఆమె అభిమానులు. ‘సహాయం కోసం శకుంతలమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్లినట్లుగా అనిపించదు. మన ఇంటి పెద్ద దగ్గరికి ఆత్మీయంగా వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటారు సామాన్యులు. శకుంతలమ్మకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న... ‘ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?’ ఆమె చెప్పే సమాధానం: ‘సమాజసేవ’ శకుంతలమ్మ ఇచ్చిన చిన్న సమాధానంలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో కదా! -
ఆ మాత్రం ఎవరైనా చేస్తారు.. రాబియా వేరే పని కూడా చేసింది!
ఆమె క్లాస్‌లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. 56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు. ఎందుచేత ఆమె స్ఫూర్తి? ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్‌షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది. ఆడవాళ్ల స్కూలు రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది. రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్‌గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి. ‘చలనం’ సంస్థ రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్‌గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి. కేన్సర్ సర్వయివర్ 32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్రూమ్లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి. రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు -
పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది
సాక్షి, వెబ్‌డెస్క్: ట్రాన్స్జెండర్లు.. ఈ పేరు వినగానే చాలా మందికి రోడ్డు మీద భిక్షాటన చేసుకునేవారే గుర్తుకు వస్తారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటు. వారిలో కూడా చాలామంది మంచి ఉద్యోగాలు చేసేవారు.. సమాజసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నావారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మంజమ్మ జోగతి. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. ఫోక్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక అవార్డు తీసుకునే వేళ మంజమ్మ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజనులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ) కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గాను మంజమ్మ జోగతి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తనదైన స్టైల్లో ఆశీర్వదించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. మంజమ్మ తన చీర కొంగుతో రామ్‌నాథ్‌కు దిష్టి తీసినట్లు చేశారు. ఇది వారి స్టైల్లో ఆశీర్వదించడం అన్నమాట. రామ్‌నాథ్ కోవింద్ కూడా మంజమ్మ ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఇది చూసిన సభికులు చప్పట్లతో వారివురిని ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్‌గా నిలిచారు మంజమ్మ. (చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!) మంజమ్మ జీవితం.. మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని.. నిలబడి.. నేడు సన్మానాలు అందుకున్నారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు. ఇక ఆమె కుటుంబం మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లింది. ట్రాన్స్జెండర్ల సంఘం తమను తాము రేణుకా ఎల్లమ్మ దేవత సేవలో అంకితం చేసుకునే ప్రక్రియే జోగప్ప. ఇలా మారిన వారు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు. పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్యనే మంజమ్మ జోగతి పలు కళారూపాలు, జోగతి నృత్యం, స్త్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..) మంజమ్మ సేవలకు గాను 2006లో, ఆమెకు కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత అనగా 2019లో, ఆమె సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. చదవండి: భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను -
పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!
‘పిక్చర్ ఆఫ్ ది డే’ అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో నెటిజనులు షేర్ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన పద్మ పురస్కారాలు ప్రదానోత్సవం సందర్భంగా తీసిన చిత్రమిది. ప్రత్యేక వస్త్రాలంకరణతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అవార్డు అందుకోవడానికి వెళుతున్న వృద్ధురాలికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తుండడం ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉన్న వృద్ధురాలి పేరు తులసి గౌడ. సామాజిక సేవ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అటవీ విజ్ఞాన సర్వస్వం కర్ణాటకకు చెందిన 73 ఏళ్ల తులసి గౌడ.. అడవుల్లోని సమస్త జీవజాతుల గురించిన తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా ప్రఖ్యాతి గాంచారు. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిక్షరణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. 30 వేలకు పైగా మొక్కలు నాటి ప్రకృతి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ ఆమె ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. (చదవండి: పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు) సింప్లిసిటీకి జేజేలు పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి దేశరాజధాని ఢిల్లీకి వచ్చిన తులసి గౌడ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా తనకు అలవాటైన వస్త్రాధారణనే కొనసాగించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి నిరాడంబరంగా వచ్చిన ఆమెను చూసి ప్రధాని మోదీ సహా ఇతర మంత్రులు, ఉన్నత అధికారులు వినమ్రంగా నమస్కరించారు. తులసి గౌడ నిరాడంబరతకు నెటిజనులు సైతం జేజేలు పలుకుతున్నారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్.. హజబ్బ! కాగా, కర్ణాటక రాష్ట్రానికే చెందిన హరేకల హజబ్బ కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అక్షరం ముక్క రాని హజబ్బ ఎంతోమంది పిల్లలకు చదువుకునే భాగ్యం కల్పించారు. మంచి పనికి పేదరికం అడ్డుకాదని ఆయన నిరూపించారు. పళ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న హజబ్బ.. సొంతిల్లు కూడా కట్టుకోకుండా తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల కట్టించారు. పద్మ అవార్డుతో వచ్చిన 5 లక్షల రూపాయలను కూడా స్కూల్‌కే ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నారు. నెటిజనులు ఆయనకు కూడా సలాం చేస్తున్నారు! (Harekala Hajabba: అవమానం నుంచి పుట్టిన ఆలోచన..) -
అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ
సాక్షి, వెబ్‌డెస్క్: ఆపదలో ఉన్న వారికి.. సాయం కోరే వారికి చేయూతనివ్వడానికి మన దగ్గర ఎనలేని సంపద ఉండాల్సిన పని లేదు. తోటి వారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం.. చేయూత ఇవ్వాలనే ఆలోచన ఉంటే చాలు. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బ. పళ్లు అమ్ముకుని జీవనం సాగించే హజబ్బ తన ఊరి పిల్లల పాలిట దైవం అయ్యాడు. రెక్కడాతే కాని డొక్కాడని స్థితిలో ఉన్న హజబ్బ.. తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల నిర్మించాడు. 1-10వ తరగతి వరకు ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. హజబ్బ సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన సేవా గుణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. హజబ్బ జీవితాన్ని మార్చిన సంఘటన.. మంగుళూరుకు చెందిన హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్ మార్కెట్లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి.. కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగారు. హజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. (చదవండి: పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే) తన పరిస్థితి మరేవరికి రాకూడదని.. జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది. ఇంగ్లీష్ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు. తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొకుండా ఉండాలంటే.. వారికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలని భావించాడు. కానీ తన గ్రామంలో మంచి స్కూల్ లేకపోవడం.. మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హజబ్బను కలవరపరిచింది. రూ.5000తో ముందడుగు.. ఈ క్రమంలో హజబ్బ తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలిన నిర్ణయించుకున్నాడు. అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో అవమానాలు.. అడ్డంకులు ఎదురుకున్నాడు. వాటన్నింటిని దాటుకుని.. 1999, జూన్‌లో తన కలని నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి.. పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు. (చదవండి: ‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు') ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది. ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు హజబ్బ. పదేళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్ నిర్మించాడు. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ యూనివర్శిటీ కళాశాలను ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. అవార్డుల డబ్బులన్ని స్కూల్ అభివృద్ధి కోసమే.. హజబ్బ సేవా నిరతని గుర్తించి ఇప్పటికే పలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరింnebr. ఇక అవార్డులతో పాటు లభించే మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసమే వినియోగించాడు. ఈ క్రమంలో ఓ సారి అవార్డుతో పాటు వచ్చిన 5 లక్షల రూపాయలను స్కూల్ కోసం కేటాయించాడు. ఇక భవిష్యత్తులో వచ్చే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధికే వినియోగిస్తానంటున్న హజబ్బకు సొంత ఇళ్లు లేదు. కానీ తన గురించి ఆలోచించకుడా.. పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆరాటపడుతున్న హజబ్బను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజనులు. చదవండి: పద్మ అవార్డుల ప్రదానోత్సవం -
పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా మృతి
జైపూర్: ప్రముఖ న్యూరాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా(71) కోవిడ్ అనంతర సమస్యలతో శుక్రవారం మరణించారు. వైరస్ బారిన పడి అనారోగ్యానికి గరైన డాక్టర్ పనగారియా గడిచిన కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. ఇక ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పనగారియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని స్పందిస్తూ.. వైద్య రంగంలో తన కృషి భవిష్యత్ తరాల వైద్యులకు అదేవిధంగా పరిశోధకులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. Dr. Ashok Panagariya made a mark as an outstanding neurologist. His pioneering work in the medical field will benefit generations of doctors and researchers. Saddened by his demise. Condolences to his family and friends. Om Shanti. — Narendra Modi (@narendramodi) June 11, 2021 రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పనగారియా మృతి వ్యక్తిగతంగా నాకు, ఆయన కుటుంబానికి తీవ్ర నష్టదాయకం అంటూ సంతాపం వ్యక్తం చేశారు.అలానే పనగారియా మృతిపై ఎనర్జీ మినిస్టర్ బిడి కల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు. చదవండి: కరోనాతో సీనియర్ నటుడు కన్నుమూత -
కరోనా రోగులకు ఉచిత వైద్యం: రూ.5 డాక్టర్ విన్నపం
రాంచీ: కరోనా కష్టకాలంలో రోజుకు ఒక్క పేద కరోనా బాధితుడికైనా ఉచితంగా చికిత్స అందించాలని ఐదురూపాయల డాక్టర్ పద్మశ్రీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. దేశంలో సెకండ్ వేవ్ కరోనా చాపకింద నీరులా చుట్టేస్తోంది. మరోవైపు దేశంలో రోజు మూడు నుంచి 4 లక్షల కరోనా కేసులు నమోదు కావడంతో పాటూ వేల సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది చికిత్స అందక, ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే బిల్లు భరించలేమని కొంతమంది కరోనా బాధితులు ఇంట్లోనే తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించిన బాధితులు మాత్రం ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఒక్క పేదవాడికైనా ఉచితంగా చికిత్స అందించాలని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోరారు. మనదేశంలో ఐదురూపాయలకు ఏం కొంటాం. కనీసం టీ కూడా తాగలేం. కానీ జార్ఖండ్‌కు చెందిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కరోనా కష్టకాలంలో కోవిడ్ సోకిన పేదవారికి కేవలం రూ.5లకే చికిత్స అందిస్తూ వారి ప్రాణాల్ని కాపాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు డాక్టర్ అయితే మీ సంపాదన ఎంతవరకు సరిపోతుందో ఆలోచించాలి. కరుణ, దాతృత్వం వైద్య వృత్తిలో ఓ భాగం. కాబట్టి ప్రతిరోజూ ఒక్క కరోనా బాధితుడికైనా ఉచితంగా అందించాలన్నారు. తనకు గుండె, ప్రోస్టేట్ సంబంధిత సమస్యలున్నాయి. ఆస్పత్రి నిర్వహణ, తన మెడిసిన్‌కు ఖర్చు రోజుకు రూ.200 కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే ఫీజు రూ.50 పెంచాల్సి వచ్చింది. తన మెడిసిన్ ఖర్చుల కోసం రోగుల నుంచి వసూలు చేయలేనన్నారు. అది కూడా ఇవ్వలేని వాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తున్నానని పేర్కొన్నారు. మిగతా వైద్యులు కూడా ప్రతిరోజు ఒక్క పేదవాడికి వైద్యం చేసి, వాళ్లకు చేతనంత సాయం అందించాలన్నారు. ప్రస్తుతం ఆయన రోజుకు 20మంది బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణదాతగా ప్రశంసలు పొందుతున్నారు. చదవండి: మానవత్వం చాటిన అధికారి -
భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను
ఎవరికైనా ఒక్కసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తే చాలు అనే కల ఉంటుంది. కానీ, 41 ఏళ్ల అన్షు జమ్సేన్పా మాత్రం ఒకే సీజన్లో రెండుసార్లు పర్వతారోహణ పూర్తి చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచింది. ఆమె సాధించిన ఘనతకు మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ‘వేగం’ అత్యవసరం అని నిరూపిస్తుంది అన్షు జమ్సేన్పా. ఆ వేగం వల్లే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. భర్త, అత్తమామ, పిల్లలు ఇంట్లో అన్ని బాధ్యతలనూ ఓ చేత్తో మోస్తూనే తన కలల జెండాను ఎవరెస్ట్ శిఖరం అంచున రెపరెపలాడించింది. ఐదు సార్లు అధిరోహణ.. జీవితంలో ఒక్కసారయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కలలు కనేవారు ప్రపంచం లో చాలా మంది ఉన్నారు. కానీ, అందరి కలలు నెరవేరవు. వారి శ్రమ, పట్టుదల కూడా అంతే వెనకంజలో ఉంటాయి. కానీ, అన్షు జమ్సేన్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక్కసారి కాదు ఐదుసార్లు అధిరోహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ ఆమె జన్మస్థలం. ఇద్దరు పిల్లల తల్లి అయిన అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది. తాను సాధించిన విజయం గురించి అన్షు మాట్లాడుతూ– ‘నేను అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో రాణించేదాన్ని. రాక్ క్లైంబింగ్ చేసేదాన్ని. ఆ సమయంలో అరుణాచల్ పర్వతారోహణ, అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్లు నా ప్రతిభ గుర్తించి నా భర్తకు చెప్పి, ఒప్పించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించమని నన్ను ప్రోత్సహించారు. ఒకసారి నేను ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాను, మరలా వెనక్కి తిరిగి చూడలేదు’ అని వివరించింది అన్షు. అధిరోహణ కష్టమే.. అయినా ఇష్టం.. శిక్షణా సమయంలో పర్వతాలను అధిరోహించడం తనకు చాలా ఇష్టమని గ్రహించిన అన్షు ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి జయించిన రోజు ఇప్పటికీ గుర్తుంది అని సంతోషం వ్యక్తం చేస్తుంది. అన్షుకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుతూ ‘నేను దేవుని దగ్గరికి చేరుకున్నట్టే అనిపించింది. నా కలలో నేను చూసిన సన్నివేశం నా కళ్ల ముందు నిలిచింది. ఆ సమయంలో నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అని సంబరంగా చెబుతుంది అన్షు. ఆమె తండ్రి ఇండోటిబెట్ సరిహద్దులో ఒక పోలీసు అధికారి, తల్లి నర్సు. ఎవరెస్టును జయించటానికి అన్షు రన్నింగ్, జిమ్, యోగా, ఏరోబిక్స్ వంటివి నేర్చుకుంది. మొదట చిన్న చిన్న పర్వతాలను అధిరోహించడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకుంది. -
కరోనా నుంచి కోలుకున్న 93 ఏళ్ల వ్యక్తి
న్యూఢిల్లీ : 93 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత కేవలం 8 రోజుల్లోనే కరోనాను జయించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ కవి, సాహిత్య విభాగంలో పద్మశ్రీ అందుకున్న ఆనంద్ మోహన్ జుష్తీ గుల్జార్ దెహల్వి శ్వాసకోశ సమస్యతో జూన్ 1న నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఐసీయాకి తరలించి డాక్టర్ అభిషేక్ దేశ్వాల్ నాయకత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆదివారం నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అంతేకాకుండా జుష్తీ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సహకారం అందించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జుష్తీ.. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక మీరంతా మా ఇంటికి విందుకు రావాలి అంటూ వైద్య సిబ్బందిని ఆహ్వానించారు. 93 ఏళ్ల వయసులోనూ చాలా త్వరగా కోలుకున్న జుష్తీకి అభినందనలు అంటూ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ అజిత్ కుమార్ ట్వీట్ చేశారు. జుష్తీ రికవరీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రచనలతోనే కాదు అతి తక్కువ రోజుల్లోనే కరోనాపై విజయం సాధించి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరింత కాలం జీవించాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. (కేజ్రీవాల్‌కు రేపు కరోనా పరీక్షలు? ) -
బీజేపీ పాకిస్తాన్ ప్రేమలో పడింది అందుకే..
ఇండోర్ : ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ఎలా ఇస్తారని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. తాజాగా బాలీవుడ్ నటి స్వరభాస్కర్ కూడా వ్యతిరేకించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడిందని.. అందుకే పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ప్రకటించిందని విమర్శించారు. (చదవండి: పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటా) ఆదివారం ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ‘ రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి’ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరభాస్కర్ మాట్లాడుతూ.. సీఏఏ ఒక మోసపూరిత చట్టమని మండిపడ్డారు. ‘శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం.. చొరబాటు దారులను అరెస్ట్ చేయడం లాంటి చట్టాలు ఇదివరకే భారత్‌లో ఉన్నాయి. దాని ప్రకారమే అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చి పద్మశ్రీ కూడా ప్రకటించారు. మళ్లీ సీఏఏ లాంటి చట్టాలు ఎందుకు? ఆ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం?’ అని ఆమె ప్రశ్నించారు. ‘ఒకవైపు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారతీయులను అరెస్టులు చేస్తారు. వారిపై దాడులు చేస్తారు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటిస్తారు. ఇదీ బీజేపీ ప్రభుత్వం తీరు. ఎక్కడికి వెళ్లినా పాకిస్తాన్ మంత్రాన్ని జపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడింది. అందుకు పాకిస్తానీయులకు అవార్డులు ప్రకటిస్తుంది’ అని స్వరభాస్కర్ విమర్శించారు. కాగా, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ విమర్శించింది. -
కరువు నుంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన బగూజీ!
ముంబై: భూమాతను నమ్ముకున్న వాళ్లెవ్వరూ నష్టపోరని.. వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన పోపట్‌రావు బగూజీ పవార్. ఒకానొకనాడు కరువుతో అల్లాడిన గ్రామం.. నేడు పచ్చదనంతో నిండిన ఆదర్శ గ్రామంగా మారడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే స్ఫూర్తితో ముందుకు సాగి భారత నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ దక్కించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని వర్షాభావ ప్రాంతంలో ఉన్న హివారే బజార్ అనే గ్రామానికి 1989లో సర్పంచ్‌గా బగూజీ ఎన్నికయ్యారు. హివారే బజార్ వరుస కరువులతో అతలాకుతలమై... పంటలు పండక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడేది. అక్కడ ఏడాదికి సగటున 15 ఇంచుల వర్షపాతం మాత్రం నమోదయ్యేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పాడి కూడా పెంచుకోవాలి.. అటువంటి సమయంలో సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన బగూజీ... ముందుగా అక్కడ కురుస్తున్న కొద్దిపాటి వర్షపు నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలా అన్న అంశంపై దృష్టి సారించారు. అన్నా హజారే విధానాలను అనుసరిస్తూ.. నీటి యాజమాన్య వ్యవస్థను మెరుగుపరిచారు. అంతేగాకుండా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు. ఈ క్రమంలో కేవలం ఏడాది కాలంలోనే లక్షలాది చెట్లతో గ్రామం పచ్చదనం సంతరించుకుంది. దీంతో వర్షపాతం కూడా క్రమక్రమంగా పెరగసాగింది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచే దిశగా కాంటూర్ ట్రెంచెస్ విధానాల్ని బగూజీ అనుసరించారు. ఒక్క నీటి చుక్క కూడా వృథా కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అదే విధంగా కేవలం వ్యవసాయంపైనే ఆధార పడకుండా ఆవులు, గేదెలు, మేకలు తదితర పశువుల పెంపకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దీంతో అనతికాలంలోనే పాడి ఉత్పత్తి పెరిగి వారు లాభాలు గడించారు. (బత్తాయి పండ్ల వ్యాపారికి ‘పద్మశ్రీ’) హెచ్ఐవీ టెస్టు తప్పనిసరి కేవలం వ్యవసాయం, నీటి నిర్వహణపైనే కాకుండా గ్రామస్తుల ఆరోగ్యంపై కూడా బగూజీ శ్రద్ధ వహించేవారు. మద్యం కారణంగా అనారోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయంటూ వారిలో చైతన్యం నింపి.. మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. అదే విధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందే హెచ్ఐవీ పరీక్ష చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో దీర్ఘకాలంలో హివారే బజార్ ఆదర్శగ్రామంగా రూపుదిద్దుకుంది. ఇక గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మాజీ సర్పంచ్ బగూజీని పద్మశ్రీ వరించింది. కాగా ప్రజాప్రతినిధిగా తనదైన ముద్ర వేసిన బగూజీ ప్రస్తుతం మహారాష్ట్ర మోడల్ విలేజ్ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
పేదోడికి పెద్ద బహుమతి
చదువుకోలేదు కానీ వందల మందికి విద్యను అందిస్తున్నాడు. ఆస్తులు లేవు కానీ ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నాడు. పండ్లను విక్రయిస్తూ వచ్చిన డబ్బును పేద పిల్లల చదువుకు ధారపోస్తున్నాడు. సాయం చేయాలంటే ధనవంతులే అయి ఉండక్కర్లేదని, పెద్ద మనసు ఉంటే చాలని నిరూపించాడు కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బా. పండ్లను విక్రయిస్తూ గడిచిన 20 ఏళ్లుగా వందల మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాడు. ఈ పేదోడి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారత నాల్గవ అత్యున్నత పురస్కారం ‘ పద్మ శ్రీ’ ప్రకటించింది. విద్యారంగంలో అతను చేస్తున్న అసమాన సేవకు గాను ఈ అవార్డు లభిచింది. ‘అక్షర శాంత’గా ప్రసిద్ధిగాంచిన హజబ్బా గురించి తెలుసుకుందాం. (చదవండి : జైట్లీ, సుష్మాకు విభూషణ్) పేదవాడే కానీ.. దక్షిణ కర్ణాటకలోని కోణాజీ సమీపంలో ఉన్న హరెకళ న్యూపడ్పు గ్రామానికి చెందిన హజబ్బా నిరక్షరాస్యుడు,పేదవాడు. బత్తాయి పండ్లను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పండ్లను విక్రయిస్తే వచ్చిన డబ్బులతో తన సొంత గ్రామంలోని పేద పిల్లలను చదిస్తున్నారు. తనలాగా ఎవరూ నిరక్షరాస్యులు కారాదని సంకల్పించి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. దాని నిర్మాణం కోసం ఐదువేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇతర దాతలు, ప్రభుత్వం సహాయంతో స్థలంలో ఆ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1999లో నిర్మించిన ఆ పాఠశాలలో వందలాది పేదవిద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలగా మారింది. ఆ ఆలోచన పుట్టిందిలా.. ‘గతంలో ఓ విదేశీ జంట నా దగ్గరకు వచ్చి పండ్ల ధర ఎంత అని ఆంగ్ల భాషలో అడిగింది. నాకు తుళు,బెరీ భాష తప్ప వేరేది రాదు. వారు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేకపోయా. దీంతో విసుగు చెందిన ఆ జంట అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. ‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా అనుకున్నాను. చదువుకోలేకపోవడం వల్లే నాకు వారి భాష అర్థం కాలేదు. నాలాగా ఎవరూ బాధపడొద్దని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచే పేద పిల్లలకు చదువు కోసం సహాయం చేశాను. మా గ్రామంలోని పేద పిల్లలందరు ఇప్పుడు చదువుకుంటున్నారు. మా గ్రామంలో ఓ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఓ జాతీయ మీడియాతో హజబ్బా అన్నారు. (చదవండి : బ్రెజిల్ పద్మశ్రీలు) నమ్మలేకపోయాడు పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం అధికారులు చెప్పే వరకు నాకు తెలియదు. రేషన్ బియ్యం తీసుకునేందుకు షాపు ముందు క్యూలో నిలుచున్న నా దగ్గరకు అధికారులు వచ్చి ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. దీంతో ఇది కలా, నిజమా అని నమ్మలేకపోయా’ అని హజబ్బా అన్నారు. ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు ఎంతో మంది పేద పిల్లలకు చదువును అందిస్తున్న హజబ్బాను మంగళూరు వాసులు ముద్దుగా ‘అక్షర శాంత’ గా పిలుచుకుంటారు. ఆయన జీవిత విశేషాలను మంగళూరు యూనివర్సీటీలో సిలబస్‌గా పెట్టారు. కేరళలోని కర్ణాటక మీడియం పాఠశాలలలో ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. 2009లో సీఎన్ఎన్ ఏబీఎన్ ‘రియల్ హీరోస్’ అవార్డును పొందారు. ఈ అవార్డు కింద వచ్చిన 5లక్షల రూపాయలతో పాఠశాల కోసం స్థలాన్ని కొన్నారు. తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకుపోతారు. -
శాపంగా మారిన పద్మశ్రీ పురస్కారం
భువనేశ్వర్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఒడిశాకు చెందిన మౌంట్‌మ్యాన్ దైతరి నాయక్ (71) తెలిపారు. తాను పడ్డ కష్టానికి దక్కిన పురస్కారం కారణంగా.. ఆయన ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. పర్వత శ్రేణుల్లోని జల ప్రవాహాన్ని తన స్వగ్రామానికి తీసుకురావడానికి దైతరి నాయక్ మూడు కిలోమీటర్ల మేర కాలువ నిర్మించిన విషయం తెలిసిందే. కుటుంబ పోషణకు కూలి చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో ఈ కాలువను చిన్న చిన్న పనిముట్ల సహాయంతో నిర్మించారు. పరిసర కొండపై పడిన వర్షపు నీటిని గ్రామ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా కాలువను తవ్వారు. అనేక సంవత్సరాలపాటు కష్టపడి ఈ కాలువను నిర్మించిన ఆయన గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పద్మశ్రీ పురస్కారమే తనకు శాపంగా మారిందని దైతరి నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు రాకముందు తాను వ్యవసాయ పనులకు వెళ్ళి, తన కుటుంబాన్ని పోషించుకునేవాడినని, ప్రస్తుతం తనను పనులకు ఎవరూ పిలవడం లేదన్నారు. దీంతో తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి సైతం కష్టంగా ఉందని వాపోయారు. ‘ఒడిశా కాలువ మనిషి’గా ప్రసిద్ధి పొందిన ‘పద్మశ్రీ’ దైతరి నాయక్ ప్రస్తుతం మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు మరో ఆవేదన కూడా ఉంది. తాను నిర్మించిన కాలువను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇప్పటికీ నెరవేరడం లేదని ఆయన తెలిపారు. కేందుఝర్ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మశ్రీ’ని తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై స్థానిక సబ్ కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ మాట్లాడుతూ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇచ్చేయవద్దని తాను దైతరి నాయక్‌ను కోరానని తెలిపారు. ఈ పురస్కారానికి ఆయన అర్హుడని తెలిపారు. నాయక్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నందువల్ల ఆయనకు సహాయపడటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి ఆయనకు పక్కా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. -
‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నా..
‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నానని బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ అన్నారు. చిత్ర పరిశ్రమలో నైపుణ్యం ఉన్న నటులు చాలా మంది ఉన్నారని.. కానీ వారికి ఇంకా పద్మశ్రీ రాలేదన్నారు సైఫ్. అర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పించ్ షోలో సైఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు చేసిన కామెంట్లను సైఫ్ గుర్తు చేసుకున్నారు. ‘తైమూర్ తండ్రి పద్మశ్రీ కొనుక్కున్నారు.. రెస్టారెంట్లో కొంత మందిని కొట్టారు.. ‘సేక్రేడ్ గేమ్స్’లో నటించే అవకాశం ఆయనకు ఎలా ఇచ్చారు.. ఆయనకు నటన రాదు.. అసలు ఆయన నవాబ్ ఏంటి’ అని నెటిజన్లు తనను కామెంట్ చేశారని సైఫ్ గుర్తు చేసుకున్నారు.ఈ విమర్శలపై సైఫ్ స్పందిస్తూ.. ‘పరిశ్రమలో నాకన్నా ఎంతో ప్రతిభ ఉన్న సీనియర్ నటులు ఎందరో ఉన్నారు. వారికి దక్కని పద్మశ్రీ నాకు రావడం పట్ల నేను కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాను. ఈ అవార్డును తీసుకోవాలని నేను అనుకోలేద’ని ఆయన తెలిపారు. అయితే ‘నటన, టాలెంట్‌లో నాకన్నా తక్కువ స్థాయిలో ఉండి అవార్డు అందుకున్న వారు కూడా ఉన్నారు కదా అనిపించింది. అయినా కూడా ఈ అవార్డును తీసుకోవాలంటే నా మనసు ఒప్పుకోలేదు. కానీ మా నాన్న ‘నువ్వు భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించకూడదు’ అని అన్నారు. దాంతో అవార్డును స్వీకరించాను. ప్రస్తుతానికి నా నటనను నేను ఆస్వాధిస్తున్నా. భవిష్యత్తులో మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తా. చూద్దాం అప్పుడైనా జనాలు నన్ను చూసి.. ఈయన పద్మశ్రీకి అర్హుడు అంటారేమో’ అని సైఫ్ చెప్పుకొచ్చారు. అంతేకాక జనాలు అనుకుంటున్నట్లు నవాబ్ అనే బిరుదు తనకు కూడా ఇష్టం ఉండదని.. కానీ కబాబులను మాత్రం చాలా ఇష్టంగా తింటాన’ని పేర్కొన్నారు సైఫ్. -
జయరాం కేసు తెలంగాణకు బదిలీ
సాక్షి, అమరావతి బ్యూరో: వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం ప్రకారం జయరాంను ఇంటికి రప్పించి హత్య చేసిన రాకేష్‌రెడ్డి.. ఆ తర్వాత ఇద్దరు తెలంగాణ పోలీసు అధికారుల సలహా మేరకు మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చి ప్రమాద ఘటనగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఈ çఘట న వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన మేన కోడలు శిఖాచౌదరి చుట్టే కేసు తిరిగింది. కేసు నుంచి శిఖాను బయటపడేసేందుకు ఏపీలోని కొందరు టీడీపీ నేతలు యత్నిస్తున్నారనే ప్రచా రం జరిగింది. చివరకు రాకేశ్ నిందితుడని నందిగామ పోలీసులు పేర్కొనగా.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జయరాం భార్య పద్మశ్రీ చెప్పడంతో కేసు మరో కీలక మలుపు తిరిగింది. అన్నీ అనుమానాలే..? అమెరికా పౌరసత్వమున్న జయరాంకు వందల కోట్ల ఆస్తులున్నాయి. ఆ స్థాయి వ్యక్తి రాకేష్ వద్ద రూ. 4.17 కోట్లు ఎందుకు అప్పుగా తీసుకున్నాడన్న అంశం ప్రశ్నగా మిగిలిపోయింది. శిఖాని పెళ్లిచేసుకోవాలని భావించిన రాకేష్ కేవలం డబ్బు కోసమే జయరాంను హత్య చేశాడా? జయరాంను హత్య చేశాక ఆ సమాచారం శిఖాకి చెప్పలేదా? హత్య విషయాన్ని తెలంగాణ పోలీ సులకు చెబితే వారెందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు? శిఖా పాత్రపై అనేక ఆరోపణలు వెల్లువెత్తినా.. ఏపీ పోలీసులు ఎందు కు నిర్లక్ష్యం చేశారు? అంటూ పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నందిగామ పోలీసులు హైదరాబాద్‌లో రాకేష్, జయరాం నివాసాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. జయరాం కాల్‌డేటా ఆయన ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో కలిశారు? అన్న కోణం లోనూ ఆధారాలు సేకరించారు. హత్యానేరాన్ని అంగీకరిస్తూ రాకేష్ వాగ్మూలంలో ఇచ్చిన సమా చారానికి, పోలీసులు సేకరించిన ఆధారాలకు ఎక్కడ పొంతన లేదని తెలుస్తోంది. సాంకేతికంగానూ సాక్ష్యాల సేకరణ కష్టంగా మారిందని, ఈ సా«క్ష్యాలతో కేసు నిలబడదని, నేరస్తులు తప్పించుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కేసులో సాంకేతికంగా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని జిల్లా ఎస్పీ త్రిపాఠి పేర్కొనడం నిపుణుల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. నిందితులకు రిమాండ్ జయరాం హత్య కేసులో నిందితు లైన కవకుంట్ల రాకేష్, దున్నే శ్రీనివాస్‌లను నందిగామ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చామని ఎస్హెచ్ఓ వెంకటరమణ తెలిపారు. నిందితులకు 20వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. కేసు తెలంగాణతో ముడిపడడం వల్లే బదిలీ: ఏపీ ప్రభుత్వం సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని, కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం కేసును తెలంగాణకు అప్పగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడడంతో కేసుపై ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. -
పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నా : ప్రముఖ దర్శకుడు
ఇంపాల్: మణిపూర్ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరొందిన అభిరాం శ్యామ్ శర్మ తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఈశాన్య భారతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని 83 ఏళ్ల శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో 500కు పైగా ఎంపీలు ఉంటే తమ రాష్ట్రం నుంచి కేవలం ఒక్కరిద్దరే ఉన్నారని.. తమ ఆవేదనను ఎలా వ్యక్తపరుస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలను కూడా గౌరవించాలనీ.. తమపై ఈవిధంగా వివక్ష చూపడం సబబు కాదని శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం బలవంతగా బిల్లును అమలుచేయడం సరికాదన్నారు. ఇషనౌ, ఇమాగి నింగతెమ్ వంటి సినిమాలు శర్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన చిత్ర పరిశ్రమకు సేవలను గుర్తిస్తూ.. ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
‘సంతోషం.. ఎవరూ తిట్టలేదు’
ఎవరూ విమర్శించలేదు.. అదే సంతోషం అంటున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయ్. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను ప్రభుత్వం మనోజ్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డును ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. దాంతో చాలా సంతోషంగా ఫీలయ్యాను’ అన్నారు. అంతేకాక ‘గతంలో ప్రభుత్వం అవార్డులు ప్రకటించినప్పుడు ఏ అర్హత ఉందని ఇచ్చారు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు. సదరు నటుడు నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ దారుణంగా విమర్శించేవారు. ఈసారి నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అందుకు సంతోషంగా ఉంది. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా చాలా సంతోషంగా ఉన్నార’ని తెలిపారు. పద్మ అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగ్గా.. ‘ఆ రోజు రాత్రి పడుకునే ముందు అనుపమ్ ఖేర్ నాకు ఫోన్ చేసి అవార్డు వచ్చిందని చెప్పారు. ఇది విన్న వెంటనే నేను ఫ్రీజ్ అయిపోయాను. ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. నాకు ఈ గౌరవం దక్కుతుందని అనుకోలేదు’ అని వెల్లడించారు మనోజ్. ప్రస్తుతం మనోజ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సోన్ చిడియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. -
210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం
భువనేశ్వర్: పెద్దల అదుపాజ్ఞలు లేక కుంటుపడిన తన విద్యాభ్యాసంలా.. నేటి తరం బాలలు విద్యకు దూరం కాకూడదనే ‘పెద్ద మనసు’ ఆయనను సంఘ సేవలోకి అడుగిడేలా చేసింది.. పసి హృదయాల్లో ప్రాథమిక విద్యాభ్యాసంపై మక్కువ పెంపొందించి విద్యార్జనకు పునాది వేసే ‘ఆశా ఓ ఆశ్వాసన్’ సంస్థను స్థాపించేలా ప్రేరేపించింది. స్వీయ జీవితంలోని తప్పిదాలు భావితరాలకు పునరావృతం కాకూడదనే సదభిప్రాయమే ఆయనకు మన దేశపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ తెచ్చిపెట్టింది. ఆయనే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి వలస వచ్చి కటక్ మహానగరంలోని బక్షిబజార్ (మురికివాడ)లో స్థిరపడిన దేవరపల్లి ప్రకాశరావు. ఆయన వయసిప్పుడు 59 సంవత్సరాలు. తాత, ముత్తాతల కాలం నుంచి అదే ప్రాంతంలో స్థిరపడ్డారు. అర్ధాంతరంగా ఆయన చదువు అటకెక్కడంతో.. తండ్రి పెట్టిన టీ కొట్టునే జీవనాధారం చేసుకున్నారు. తనలా మరెవరూ విద్యకు దూరం కాకూడదనే సత్సంకల్పంతో తనకున్న రెండు గదుల ఇంటిలోనే ఓ గదిని చిన్న స్కూల్‌గా మార్చేశారు. ఇప్పుడు ఆ స్కూల్లో సుమారు 80 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యాదానమే కాదు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ప్రకాశరావుది పెద్ద చెయ్యే. ఒకానొక సందర్భంలో తనకు రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడిన ఓ అపరిచిత వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన.. 1976 నుంచి ఇప్పటి వరకు 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. ప్రతి రోజూ ప్రభుత్వాస్పుత్రిలోని పేద రోగులకు పాలు, బిస్కెట్లు, పండ్లు దానం చేస్తుంటారు. విద్యాధికుడు కాకున్నా జీవన స్రవంతిలో దైనందిన మనుగడ కోసం ఆయన 8 భాషల్లో మాటామంతీ చేయగల సమర్థుడు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం తరహాలోనే చదువుపై బాలల్లో మక్కువ పెంపొందించేందుకు పాలు, బిస్కెట్లు, బన్ వంటి తినుబండారాలు నిత్యం ఉచితంగా ఇస్తూ ఆదరిస్తున్నారు. పిల్లలకు యూనిఫాం, చెప్పులు కూడా ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం 4 నుంచి 9 ఏళ్ల లోపు సుమారు 80 మంది బాలలు ఆయన ఆధ్వర్యంలో అక్షరాలు నేర్చుకుంటున్నారు. చిట్ట చివరగా ఆయన మరణానంతరం కూడా మానవాళి మనుగడకు ఎంతో కొంత దోహదపడాలనే తపనతో అవయవ దానం చేసేందుకు ఇప్పటికే అంగీకార పత్రం ఇచ్చారు. ఆయన ఆర్జించిన దానిలో సింహ భాగం సంఘసేవకే వెచ్చిస్తుంటారు. కాగా నిజ జీవితంలో ఎదురైన కష్ట నష్టాలు తోటి వారిలో తిరిగి చూడరాదనే భావమే సంఘ సేవకు ప్రేరేపించి నేడు తనను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీతగా నిలిపిందని ‘సాక్షి’తో దేవరపల్లి ప్రకాశరావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు ప్రకాశరావు సంఘసేవ గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా దేవరపల్లి ప్రకాశరావుతో భేటీ అయ్యారు. ఆయన నిర్వహిస్తున్న సంస్థను సందర్శించి ముచ్చటపడ్డారు. ఆయన సేవలు అనన్యమని అభినందించారు. అనంతరం మన్ కీ బాత్ ప్రసార కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రకాశరావు సంఘసేవలో తలమునకలై నిరంతరం కొనసాగించడం అభినందనీయమని.. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం విశేషం. ప్రకాశరావును పద్మశ్రీ వరించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనకు అభినందనలు తెలియజేశారు. -
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
-
పేరున్న ఊరు పుట్టపాక
పోగు, పోగు కలిపి వస్త్రం నేస్తారు. నైపుణ్యం ఉన్నవారు చేసే పనే. అయితే ఆ వస్త్రాన్ని తయారుచేయడంలో తమదైన ప్రత్యేకతను ఏళ్లుగా చాటుతూ వస్తున్నారు పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు. తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, తమలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ, పోటీతత్వంతో కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. ఆ కళానైపుణ్యం పుట్టపాక గ్రామానికి అవార్డులు కురిపిస్తోంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక అనే మారుమూల పల్లె.. చేనేతల పరంగా విశ్వవిఖ్యాతి గాంచింది. ఇక్కడి కళాకారులు తమ కళా నైపుణ్యంతో మరుగున పడిన ప్రాచీన కళ ‘తేలియా రుమాల్’ను ఏనాడో వెలుగులోకి తెచ్చారు. ఆ వెలుగులోని ప్రతిభను చూసి వస్త్ర ప్రపంచం పుట్టపాకను కీర్తించడం మొదలైంది. తేలియా రుమాల్ ఒక్కటే కాదు, ఇక్కడి కళాకారులు చేనేత వస్త్రతయారీనే ఒక ప్రయోగశాలగా మార్చారు! నూతన ఒరవడి సృష్టించారు. తేలియా రుమాల్‌ను, ఖతాల్ చీరలను నిలువు దారంపై డిజైన్ చేయడంలో వీరు విలక్షణమైన శైలిని ప్రదర్శిస్తున్నారు. అసలు నిలువు దారం డిజైన్లు చేసి రంగులు అద్దడం ప్రపంచానికి పరిచయం చేసింది పుట్టపాక కళాకారులే. ఏ ప్రాంత ప్రజల అభిరుచికి తగినట్లుగా ఆ ప్రాంతం వారి కోసం వస్త్రాలు రూపొందించడంలో వీరు ఘటికులు. వీరి చేనేత కళా నైపుణ్యానికి ఇంతవరకు రెండు పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు వరించాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టు వస్త్రం తయారీ మొదలైందీ ఇక్కడే. ఆ గుర్తింపు కూడా గ్రామంలో చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవడానికి ఒక కారణం. ఈ గ్రామ జనాభా 4,550 ఉంటే, అందులో 3 వేల జనాభా చేనేత కళాకారులదే! ఎండలో చల్లగా, చలిలో వెచ్చగా తేలియా రుమాలు అనేది ఒక రకమైన వస్త్రం. ఇది అతి ప్రాచీన కళావిశేషం. గజం నర్సింహ అనే పుట్టపాక చేనేత కళాకారుడు ఆ ప్రాచీన తేలియా రుమాలుకు పునరుజ్జీవం పోశారు. 21 రోజుల పాటు సాగే ‘యజ్ఞం’ అది. మొదట ఆముదపు పొట్టును కాల్చి బూడిద చేస్తారు. నువ్వుల నూనెతో బూడిదను కలిపి, నూలును అందులో ఉంచుతారు. రోజంతా నీటితో కలిపిన గొర్రె పేడలో నానబెడతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నూలును ఉతికి శుభ్రపరుస్తారు. ఆరబెడతారు. మళ్లీ అందులోనే పెడతారు. ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తారు. ఆ తర్వాత వస్త్రం అవసరాన్ని బట్టి వార్పుపై అవసరమైనంత పొడవులో దారాలను తీస్తారు. మగ్గంపై కావాల్సిన తీరులో డిజైన్లతో కూడిన వస్త్రాన్ని రూపొందిస్తారు. ఇలా తేలియా రుమాలు వస్త్రంతో తలపాగాలు, చీరలు, దుపట్టాలతో పాటు ఇతర దుస్తులను తయారు చేస్తారు. ఇవి ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉండడమే కాక çసువాసనలు వెదజల్లుతాయి. ఇలా తయారు చేసే చీరలైతే డిజైన్లను బట్టి ముప్పై వేల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఒక చీర నేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం పుట్టపాకలో నేసే ప్రాచీన తేలియా రుమాల్ వస్త్రాలకు ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం. తెల్ల దారానికి ప్రకృతి రంగులైన గుమ్మడి రంగు, తేలియా రంగు, ఇండిగో, నల్ల రంగులను ఉపయోగిస్తారు. మొదటగా తెల్ల దారాన్ని జిగురు తొలగించేందుకు గానూ ఒక రోజు నీళ్లలో నానబెట్టి నీడలో ఆరబెడతారు. వారం రోజులు అయ్యాక జిగురు తొలగిస్తారు. ఆ తర్వాత దారాన్ని శుద్ధి చేయడం కోసం కిలో దారానికి 150 కరక్కాయ పిందె పొడి, అల్లం 10 గ్రాములు కలిపి శుద్ధి చేస్తారు. ప్రకృతి రంగులు ఎలా వస్తాయి? గుమ్మడి రంగు: గుమ్మడి రంగు వేయడానికి అడవి పసుపు, తేయాకు, కత్తాకు కలిపి గుమ్మడి రంగును రూపొందిస్తారు. తేలియా రంగు : సున్నపు రాయి (కుంకుమ రాళ్లు), అడవి పసుపు, నువ్వుల నూనె, నిమ్మకాయతో కలిపి తయారు చేస్తారు. ఇండిగో రంగు : ఇండిగో కేక్, కాస్టిక్, కుంకుడు రసం, నిమ్మరసం కలిపి తయారు చేస్తారు. నల్ల రంగు : పాత ఇనుప సామాను 25 రోజులు నీటిలో నానబెట్టి తుప్పు పట్టిస్తారు. తాటిబెల్లం, ఇనుప తుప్పు, నల్ల కరక్కాయ పొడి, కుంకుడు రసం, నిమ్మ రసం కలిపి నల్లటి రంగుగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన రంగులతోనే ప్రాచీన తేలియా రుమాల్ అనే వస్త్రానికి రంగులు అద్దుతారు. ఈ రంగులతోనే పుట్టపాక ప్రపంచ ఖ్యాతి సాధించింది. తొలి ççసహకార సంఘం ఓసారి ఏడుగురు చేనేత కళాకారులు కలిసి ఓ డిజైన్ రూపొందించి, చేనేత వస్త్రాలు తయారు చేశారు. ఆ సమయంలో ‘ఆప్కో’ సంస్థ చేనేత సహకార సంఘాల ద్వారా వస్త్రాలను తయారు చేయిస్తూ కొనుగోలు చేస్తోంది. ఇక్కడ కార్మికులు తయారు చేసిన డిజైన్లు కొయ్యలగూడెం సహకార సంఘం ద్వారా ఆప్కోకు పంపాలనుకున్నారు. కానీ, కొయ్యలగూడెం చేనేత సహకారసంఘం సభ్యులు వస్త్రాన్ని ఆప్కోకు పంపలేదు. దీంతో మనకు కూడా ఒక సంఘం కావాలని చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏర్పాటైన సంఘంలో నాలుగు వందల కుటుంబాలు ఉండేవి. వాళ్లంతా వెయ్యి మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలు తయారు చేసేవారు. ప్రాచీన తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు పట్టుచీరలు, స్పన్, సిల్క్ చీరలు తయారు చేసేవారు. ఆ రోజుల్లో స్పన్ సిల్క్ చీర ధర రూ. 200 ఉండేది. ప్రస్తుతం దాని ధర రూ.10 వేలకు పైగా ఉంటుంది. అప్పట్లో గజం గోవర్థన్, గజం అంజయ్య, రాపోలు అంజయ్య, గుండు జగన్నాథం, గజం రాములు, గజం నర్సింహులు అనే వారు మాస్టర్ వీవర్స్‌గా మారి చేనేత కళాకారులకు ముడి సరుకులు ఇస్తూ, తయారు చేయించేవారు. ఆ క్రమంలోనే తేలియా రుమాల్‌ను ఆధునిక డిజైన్లతో తయారుచేయించడం మొదలు పెట్టారు. పట్టు చీరలు, మస్రే చీరలు, తలపాగా, దుపట్టా (చున్నీ)లను తయారు చేసేవారు. డబల్ ఇక్కత్ తేలియా రుమాల్ వస్త్రంతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆధునిక సాంకేతికతకు కూడా అందని డిజైనింగ్ పుట్టపాక చేనేత కళాకారుల సృజనాత్మకతలో కనిపిస్తుంది. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలు లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుడి భవనంతో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు సహా ఎందరో ప్రముఖులకు చేరాయి. వారి ప్రశంసలకు నోచుకున్నాయి. దాంతో పుట్టపాక చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, పోటీతత్వంతో అనేక కొత్త కొత్త డిజైన్లను రూపొందించడం మొదలు పెట్టారు. అవార్డుల వెల్లువ చేనేత కార్మికుడు గజం నర్సింహ కుమారుడు అంజయ్య తన తండ్రి చేసిన తేలియా రుమాళ్ల వస్త్రాలను ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త డిజైన్లను రూపొందించాడు. ఆయనతో పాటు గజం గోవర్థన్, అంజయ్య, గోలి సాంబయ్య తదితరులు తమ హస్తకళా నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేస్తూ వస్తున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం గజం గోవర్ధన్ (2011), గజం అంజయ్య (2013) లకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. 2009 సంతు కబీర్ అవార్డును చేనేత దిగ్గజం గజం రాములుకు ప్రకటించగా, అప్పటికే ఆయన మృతి చెందడంతో ఆయన భార్య రాంబాయమ్మ అవార్డును అందుకున్నారు. 2010 సంవత్సరానికి సంతు కబీర్ అవార్డును గజం అంజయ్య అందుకున్నారు. ముందు ఏడాది జాతీయ చేనేత అవార్డును గజం భావనాఋషి అందుకున్నారు. 2010 జాతీయ చేనేత అవార్డును ఐదుగురు కళాకారులు గూడ శ్రీను, గజం భద్రయ్య, పున్న కష్ణయ్య, ఏ.నాగరాజు, గజం యాదగిరిలు అందుకున్నారు. రాంబాయమ్మ కూడా వ్యక్తిగతంగా చేనేత కళానైపుణ్యంతో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. చేనేత జాతీయ అవార్డు కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి సంయుక్తంగా అందుకున్నారు. 2016 చేనేత జాతీయ అవార్డు పుట్టపాక గ్రామానికి చెందిన గజం శ్రీనివాస్‌కు రాగా, ఇదే గ్రామానికి చెందిన చెరుపల్లి భావనాఋషికి నేషనల్ మెరిట్ అవార్డు లభించింది. వీరే కాక ఈ గ్రామానికి చెందిన చాలామంది చేనేత కార్మికులు రాష్ట్రపతి సంతు కబీర్ అవార్డు, కమలా అవార్డు, అష్టకళా నైపుణ్య అవార్డు, జాతీయ అవార్డులతో పాటు పలు ప్రశంసలు అందుకున్నారు. వస్తు మార్పిడి నుంచి విదేశీ ఎగుమతుల వరకు! వందేళ్ల క్రితం పుట్టపాకలో కొద్దిమంది చేనేత కళాకారులు ఉండేవారు. చేనేత వస్త్రాలను తయారు చేసి, ప్రజలకు అందజేసి, వారివద్ద నుంచి ధాన్యం, ఇతర ఆహార పదార్థాలు, వస్తువులను తీసుకునేవారు. అప్పట్లో సాదా బట్టలు, టవల్స్, దోతులు, అంచు చీరలు అమ్మేవారు. ఏమైనా శుభకార్యాలప్పుడు వస్త్రాలు కావాలని చెబితే, నేసి ఇచ్చేవారు. రానురాను తయారు చేసిన వస్త్రా లను మూట కట్టుకొని, భుజాన వేసుకొని, పరిసర ప్రాంత గ్రామాలతో పాటు ఉమ్మడి జిల్లా చుట్టుపక్కల కూడా తిరుగుతూ అమ్మేవారు. అప్పుడు నేసిన వస్త్రాలన్నీ వస్తు మార్పిడి కిందే చేసేవారు. 1950 కి ముందు నాటికి ఇక్కడి చేనేత కళాకారుల సంఖ్య 200 లకు చేరుకుంది. వారు షావుకారుల వద్ద మగ్గాలు నేసేవారు. షావుకార్లు కళాకారులకు నూలు, రంగులు, ముడి సరుకులు ఇచ్చి తయారు చేయించేవారు. ఇలా కార్మికులు తయారు చేసిన వస్త్రాలను దేశంలోనే కాకుండా అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అప్పట్లో గజం నర్సింహ ప్రాచీన తేలియా రుమాల్ వస్త్ర తయారీలో సిద్ధహస్తుడు. గ్రామంలో ఐదారుగురు షావుకారులు ఉండేవారు. ఇక్కడ నేసిన చేనేత వస్త్రాలకు పేరు ప్రఖ్యాతులు రావడంతో.. శ్రీకాకుళం, గుంటూరు, మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలకు చెందిన చేనేత కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి. గజం నర్సింహ ముంబయి, సోలాపూర్ ప్రాంతాలకు మొట్టమొదటగా ఎగుమతి చేశారు. తర్వాత్తర్వాత కలకత్తా, చెన్నై, గుజరాత్, బెంగళూరులతో పాటు సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, అరబ్ దేశాలకు ఎగుమతులు జరిగాయి. నైపుణ్యానికే ఈ గుర్తింపు పుట్టపాకలోని చేనేత కళాకారులను నైపుణ్యవంతులుగా తయారు చేయడమే నా లక్ష్యం. అందుకోసమే చేనేతను అభివృద్ధి చేసి, కళాకారులను ప్రోత్సహిస్తున్నా. చేనేతకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. చేనేత కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటా. – గజం గోవర్ధన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
‘పద్మశ్రీ’కి శ్రీకాంత్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పేరును కేంద్ర పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కు సిఫారసు చేశారు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలవడంతోపాటు మరో సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాల కోసం పేర్లు పంపించేందుకు గడువు సెప్టెంబరు 15వ తేదీతోనే ముగిసినప్పటికీ... కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయల్ ప్రత్యేక చొరవ తీసుకొని శ్రీకాంత్ పేరును పరిశీలించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ‘దేశంలోని యువతరానికి శ్రీకాంత్ ఆదర్శప్రాయుడు. ఈ ఏడాది అతను సాధిస్తున్న విజయాలు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తాయి. మాజీ క్రీడల మంత్రి హోదాలో నన్ను చాలా మంది సంప్రదించి శ్రీకాంత్ పేరును పద్మశ్రీకి నామినేట్ చేయాలని కోరారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని శ్రీకాంత్ పేరును నేను ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారానికి ప్రతిపాదించాను’ అని గోయల్ తెలిపారు. -
పద్మశ్రీ అందుకున్న విరాట్ కోహ్లీ
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి పద్మ విభూషన్ అవార్డు అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం రోజున కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడంపై కోహ్లీ ట్విట్ చేశాడు. రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, తన జీవితంలో మరిచిపోలేని రోజని, దేవుడు చాలా దయమయుడని అతడు ట్విట్లో పేర్కొన్నాడు. What an absolute honor and a memorable day to receive the Padma Shri award from the President of India. God's been kind. 😇😇😇 Jai Hind 🇮🇳 pic.twitter.com/zh3EUkrTFl — Virat Kohli (@imVkohli) 30 March 2017 కాగా విరాట్ కోహ్లి సహా ఎనిమిది మందికి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ పతక విజేతలు సాక్షి మలిక్, మరియప్పన్ తంగవేలు, దీపా మలిక్‌తో పాటు శేఖర్ నాయక్, వికాస్ గౌడ, దీపా కర్మాకర్, శ్రీజేశ్ ఉన్నారు. -
పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్
షికాగో: ప్రముఖ సితార్, సుర్బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (82) ఇటీవలే తనకు కేటాయించిన ‘పద్మశ్రీ’ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తనకున్న పేరు ప్రఖ్యాతులకు ఈ అవార్డు తక్కువని.. అయినా చాలా ఆలస్యంగా తనను గుర్తించారన్నారు. సెయింట్ లూయిస్‌లో ఉంటున్న ఉస్తాద్‌ను షికాగోలోని భారత కాన్సులేట్ అధికారులు సంప్రదించగా.. ‘నా జూనియర్లు ఎప్పుడో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. దశాబ్దాలు ఆలస్యంగా నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా’ అని తెలిపారు. -
ప్రతిభకు ‘పద్మా’భిషేకం
న్యూఢిల్లీ: చేసింది. సంచలన క్రికెటర్, టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా ఎనిమిది మందికి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’లను ప్రకటించింది. ఈ జాబితాలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ పతక విజేతలు సాక్షి మలిక్, మరియప్పన్ తంగవేలు, దీపా మలిక్‌తో పాటు శేఖర్ నాయక్, వికాస్ గౌడ, దీపా కర్మాకర్, శ్రీజేశ్ ఉన్నారు. కోహ్లి (క్రికెట్): సంచలనాల క్రికెటర్ విరాట్ కోహ్లి. ఇంటాబయటా... వేదికేదైనా... ఫార్మాట్ ఏదైనా పరుగుల వేటగాడు మాత్రం అతడే. ఛేదనలో కొండంత లక్ష్యాన్ని సైతం పిండిచేయగల ఈ ‘రన్ మెషిన్’ ఇప్పుడు టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సాక్షి (రెజ్లింగ్): రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్. హరియాణాకు చెందిన సాక్షి 58 కేజీల బౌట్లో తన అద్వితీయ ప్రదర్శనతో కాంస్యాన్ని సాధించింది. వికాస్ గౌడ (అథ్లెటిక్స్): కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో డిస్కస్ త్రో చాంపియన్ వికాస్. కర్ణాటకకు చెందిన వికాస్ రెండు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాడు. మరియప్పన్ తంగవేలు (పారాథ్లెటిక్స్): ఈ పారాలింపియన్ ప్రతిభకు వైకల్యమే చిన్నబోయింది. తమిళనాడుకు చెందిన తంగవేలు రియో పారాలింపిక్స్‌లో హైజంప్ టి42 కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. దీపా మలిక్ (పారాథ్లెటిక్స్): హరియాణాకు చెందిన దీపా మలిక్ రియో పారాలింపిక్స్ మహిళల షాట్‌పుట్ ఎఫ్–53 విభాగంలో అచ్చెరువొందించే ప్రదర్శనతో రజత పతకం గెలిచింది. దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్): ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్ రియోలో తృటిలో పతకం కోల్పోయింది. త్రిపురకు చెందిన ఈ మెరుపుతీగ వాల్టింగ్ ఈవెంట్లో తన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి భారత అభిమానుల మనసుల్ని గెలుచుకుంది. శ్రీజేశ్ (హాకీ): ప్రత్యర్థులు గోల్స్ చేయకుండా అడ్డుగోడలా నిలబడే గోల్‌కీపర్ శ్రీజేశ్. కేరళకు చెందిన శ్రీజేశ్ భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని సారథ్యంలో భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. శేఖర్ నాయక్ (అంధుల క్రికెట్): అంధుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ (2014)లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన నాయకుడు శేఖర్. కర్ణాటకకు చెందిన శేఖర్ తన ప్రదర్శనతో అలరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు. -
శ్రీమతి కంటే శ్రీ బెటర్: పీసీ
'పద్మశ్రీ' ప్రియాంకా చోప్రా.. నన్ను నేను ఇలా చెప్పుకోవటానికి కాస్త సిగ్గనిపిస్తుంది.. కానీ గర్వంగా ఉంటుంది. ఎందుకంటే.. పారితోషికం, పాపులారిటీల కంటే ప్రభుత్వం ఇచ్చే అవార్డులనే గౌరవంగా భావిస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్' అంటూ సంతోషం వ్యక్తంచేస్తోంది పీసీ. అవార్డు తీసుకుని నాలుగు రోజులవుతోన్నా ఇంకా ఆ హడావిడి నుంచి బయటికిరాని ఈ జార్ఖండ్ ముద్దుగుమ్మ.. షూటింగ్స్ అన్నింటికి కామాపెట్టి, అవార్డును ఎంజాయ్ చేస్తోంది. 'మా నాన్నతోపాటు కుటుంబంలో చాలా మంది ఆర్మీలో పనిచేశారు. అందుకే ప్రభుత్వ పురస్కారాలను గొప్పగాఫీలవుతాం'అని చెబుతోంది. ఇప్పటికే 33 ఏళ్లు నిండిన పీసీని పెళ్లి గురించి అడిగితే.. .. 'ఇప్పుడు నేను పద్మశ్రీ ప్రియాంక చోప్రా. శ్రీమతి ప్రియాంక కంటే 'శ్రీ' ప్రియాంకే ఎంతో బెటర్ అని నా ఉద్దేశం' అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. 'క్వాంటికో'లో తన సహచరులకు 'పద్మశ్రీ' అంటే ఏంటో తెలియదని, వాళ్లకు దాని విలువ తెలియజెప్పేప్రయత్నం చేస్తానని అంటోంది. నాలుగురోజుల కిందట రాష్ట్రపతి నుంచి 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న ప్రియాంక.. తన చీరకు గుచ్చిన మెడల్ ను సాయంత్రందాకా తీయకపోవటానికి కారణమేమిటా? అని అడిగినవాళ్లకు ఇంటర్వ్యూల ద్వారా బదులిస్తోంది. -
'పద్మ అవార్డుల గురించి వివరించా'
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకోవడం పట్ల బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. పద్మ పురస్కారాల విశిష్టత గురించి తనతో పాటు హాలీవుడ్ లో నటించిన వారికి వివరించానని, తనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల వారెంతో ఆనందపడ్డారని తెలిపింది. మంగళవారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రియాంక చోప్రా అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారతదేశం గురించి ప్రపంచం మూసధోరణితో ఆలోచిస్తోందని తెలిపింది. ఇండియా గురించి పూర్తిగా తెలిసినవారితోనే తాను ఎక్కువగా గడిపానని వెల్లడించింది. భారతీయత గురించి గర్వంగా చెప్పుకుంటానని, ఇండియా గురించి తెలుసుకోవాలనుకునేవారికి వివరిస్తానని చెప్పింది. -
మెరిశారు..
-
మహిళలతో కన్నీరు పెట్టిస్తే అరిష్టమే
ఒంగోలు సబర్బన్ : అధికారం కోసం లేనిపోని హామీలిచ్చి అవి నెరవేర్చకుండా ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలకు అరిష్టమేనని..మహిళల ఉసురు ఊరికే పోదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఒంగోలు వచ్చిన ఆమె స్థానిక డీసీసీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో అందరినీ నమ్మించి ఓట్లేయించుకుని చంద్రబాబు అందలమెక్కారన్నారు. మ్యానిఫెస్టో అమలు చేయకుండా ఏడాదిపాటు సాగించిన చంద్రబాబు పాలనంతా డొల్లేనని విమర్శించారు. డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి నిలువునా ముంచిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని విడ గొట్టాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖలిచ్చిన చంద్రబాబు ఆ బురదను కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, నెల్లూరుకు చెందిన నాయకురాలు చేను సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ జి.రాజ్ విమల్, వేము శ్రీనివాసరావు, పర్రె నవీన్ రాయ్, గాదె లక్ష్మా రెడ్డి, ఎస్.కె.రసూల్, బొడ్డు సతీష్ పాల్గొన్నారు. -
పద్మశ్రీ అందుకున్న కోటా శ్రీనివాసరావు
-
పద్మసిరులు
వైద్యరంగ సరోవరంలో వికసించిన పద్మాలివి. మనకు లభించిన పద్మసిరివరాలివి. భారత ప్రభుత్వ గుర్తింపు పొంది పద్మ‘సిరి’ని సొంతం చేసుకున్న చికిత్సా శస్త్రాలివి. ఈ ఇద్దరి సేవలూ మహిళల కోసమే కావడం మరో విశేషం. ఒకరు మహిళల ‘గైనిక్’ సమస్యలను తీర్చే నిపుణీమణి. మరొకరు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ గడ్డలను తొలగించే వైద్య శిఖామణి. భారత ప్రభుత్వం బహూకరించే ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘పద్మశ్రీ’ ఈ ఇద్దరూ అందుకున్నారు. అత్యున్నత పురస్కారాల్లో మొదటిదైన ఈ గౌరవం దక్కించుకున్న సందర్భంగా ప్రముఖ వైద్యురాలు, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని, ప్రముఖ రొమ్ము క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రఘురామ్ ‘సాక్షి’ ప్రతినిధితో పంచుకున్న భావాలివి. వైవిధ్యమే విజయసోపానం ఒకవైపు వైద్య సేవలు అందిస్తూనే 2000 సంవత్సరంలో రోటేరియన్‌గా మారి విస్తృతంగా పర్యటనలు చేస్తూ సమాజాన్ని చాలా దగ్గరగా చూశాను. నాకు అర్థమైన విషయం ఏమిటంటే... విద్యాధికుల్లో సైతం తమ శరీరం పట్ల ఏవో అపోహలు ఉంటున్నాయి. పిల్లలు పుట్టాక గర్భసంచిని చాలామంది మహిళలు ఒక అనవసరమైన అవయవంగా భావిస్తున్నారు. అది ‘వేస్ట్ ఆర్గాన్’ ఎంత మాత్రమూ కాదు. ఎంతో విలువైన ఆ భాగాన్ని ఏ క్యాన్సర్ ఉంటేనో తప్ప... అనవసరంగా కత్తిగాటుకు బలి చేయవద్దనే సందేశాన్ని అందించాను. హిస్ట్రెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కలిగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ప్రివెంటివ్ గైనకాలజీ గుండెజబ్బుల వంటివి నివారించుకోవాలంటే సక్రమమైన జీవనశైలిని ఆచరించాలనే స్పృహ చాలామందిలో ఉంది. కానీ ‘గైనకాలజీ’ లోనూ ఈ విధమైన ‘నివారణ’ చర్యలు తీసుకోవచ్చనే అవగాహన సమాజంలో లేదు. మెనోపాజ్‌కు చేరగానే కొన్ని హార్మోన్లు మనకు దూరమవుతాయనీ, దానివల్ల స్వాభావిక రక్షణ పోతుందనీ... కాబట్టి... స్వాభావికమైన ఆ సురక్షిత చర్యలను ముందునుంచే పొంది కొన్ని జబ్బులను నివారించుకోవచ్చనే అవగాహన సాధారణంగా ఉండదు. అందుకే ‘ప్రివెంటివ్ గైనకాలజీ’ భావనను మహిళల్లోకి విశేషంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను. ‘మామ్ అండ్ మీ’ స్కూళ్లల్లోని కౌమార బాలికలకు తమ శరీరం మీద తమకు అవగాహన కలిగేలా చేయడం కోసం కృషిచేస్తున్నాం. ఇందుకోసం మేం కొంతమందిమి ఒక బృందంలా ఏర్పడి ‘మామ్ అండ్ మీ’ అనే సంస్థను ఏర్పాటు చేశాం. తలిదండ్రుల సమక్షంలోనే తరుణవయస్కులైన పిల్లలకు అనేక అంశాలమీద, తమకు ఆ వయసులో కలిగే సమస్యల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. రోజుల బిడ్డల కోసం ‘ప్రత్యూష’ నెలలు పూర్తిగా నిండకముందే ప్రవసం కావడమో లేదా ఉమ్మనీరు మింగేసి పుట్టడమో జరిగితే, వారికి తక్షణం వైద్యసదుపాయాలు అవసరమవుతాయి. అలాంటి పిల్లలకు అవసరమైన ఆ సదుపాయాలను రెండు మూడు రోజులపాటు అందిస్తే చాలు... వాళ్లు నిండునూరేళ్లూ బతికేస్తారు. సాధ్యమైనంత మేరకు అలాంటి సహాయం అందించేందుకు నేనూ, సినీనటి సమంత, నిర్వాహకురాలు శశి మంధా కలిసి ‘ప్రత్యూష’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాం. శస్త్రచికిత్స సదస్సులు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ఉపకరణాలన్నీ పురుషులకు అనువుగా తయారైనవే. ఓ మహిళా వైద్యురాలి దగ్గర ఎంతగా విజ్ఞానం ఉన్నా సరైన ఉపకరణాలు లేకపోతే శస్త్రచికిత్సలు సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదు కదా. అందుకే ఎర్గానమిక్స్ (పనిచేసేందుకు సులువుగా ఉండటం) పరంగా మహిళలకు అనువైన విధంగా శస్త్రచికిత్స ఉపకరణాలు రూపొందించడంతో పాటు వాటిని సౌకర్యంగా ఉపయోగించడంలో వర్క్‌షాప్‌లు నిర్వహించి, మహిళా వైద్యులకు శిక్షణను ఇస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు అధునాతన శస్త్రచికిత్సలతో పూర్తిగా కోతపెట్టి చేసే ఓపెన్ సర్జరీల స్థానంలో కేవలం రెండు మూడు గాట్లు పెట్టి చేసే మినిమల్ ఇన్వేజివ్ శస్త్రచికిత్సలు చేయించుకునే విషయంలోనూ అవగాహన కల్పిస్తున్నాం. దీనివల్ల అన్ని రిస్క్‌లూ తక్కువ. ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి దగ్గర్నుంచి, కోత గాయం మానే వరకూ త్వరగా కోలుకొని, తమ వృత్తులను నిర్వహించుకోవచ్చు. మూసలోకి వెళ్లకండి ఇప్పుడే వృత్తిలోకి వస్తున్న డాక్టర్లకు నేనిచ్చే సలహా ఏమిటంటే- ఎప్పుడూ మూసపద్ధతిలో ఆలోచించకండి. అప్పటికి, అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. అలా తీసుకున్న నిర్ణయాలను సృజనాత్మకంగా అమలు చేయండి. విజయం తప్పక మీ సొంతం అవుతుంది. అమ్మకోసం జన్మభూమికి... నేను ఇంగ్లండ్‌లో వైద్యుడిగా స్థిరపడ్డ సమయంలో మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడంతో 2007లో ఇక్కడికి వచ్చా. ఆమెకు చికిత్స ఇచ్చే సమయంలో నా మాతృదేశంలో రొమ్ము క్యాన్సర్ రోగుల పరిస్థితిని చూసి, ఇంగ్లండ్‌లో కంటే నా అవసరం ఇక్కడే ఎక్కువగా ఉందని గ్రహించా. రొమ్ముక్యాన్సర్‌లో ఏటా లక్షా నలభై వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతి పదినిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. ఈ చేదు నిజాలు తెలుసుకున్న తర్వాత... బ్రెస్ట్ ఆంకాలజీ సర్జన్‌గా ఇక్కడే సేవలు అందించడం ప్రారంభించాను. నా దృష్టి కోణమే వేరు అందరూ తమ చికిత్స కేంద్రాలను ‘బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్స్’గా పేర్కొంటారు. కానీ నేను మొదటిసారిగా ‘బ్రెస్ట్ హెల్త్ కేర్ సెంటర్’గా మార్చాను. ఇది క్యాన్సర్‌కు చికిత్స చేసేది మాత్రమే కాదు... పూర్తిగా రొమ్ము ఆరోగ్యాన్ని పరిరక్షించే చికిత్సాలయం కూడా. దాంతో ఈ కాన్సెప్ట్ నచ్చి, ఎంతో ప్రఖ్యాతి వహించిన కోకిలాబెన్, మేదాంతా హాస్పిటల్ వాళ్లు ఇదే మార్గాన్ని అనుసరించారు. ఇలా ఎన్నో ఆసుపత్రులు అనుసరించేలా ఒక ప్రామాణికత (బెంచ్‌మార్క్)ను రూపొందించడం నాకెంతో సంతోషంగా ఉంటుంది. అమ్మ పేరిట ఫౌండేషన్ మా అమ్మ పేరిట ఉషాలక్ష్మీ ఫౌండేషన్‌ను స్థాపించి రొమ్ము క్యాన్సర్ రోగులకు సేవలందించడం మొదలుపెట్టాను. నా ప్రయత్నంలో రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి సినీనటి గౌతమి, యశ్‌చోప్రా సతీమణి పమేలా చోప్రా, శోభాడే, పూజాబేడీ, షబానా ఆజ్మీ వంటి ప్రముఖులు పాలుపంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల వారి కోసం... పల్లెప్రాంతాల్లోని మహిళలకు రొమ్ముక్యాన్సర్ విషయంలో అవగాహన చాలా తక్కువని తెలుసుకున్నాను. మొదటి దశలోనే దీన్ని కనిపెట్టే స్క్రీనింగ్ ప్రక్రియలు వారికి తెలిపితే..? ఆ ఆలోచన వచ్చిందే తడవుగా 2013లో రాష్ట్రంలోని ఏఎన్ఎమ్ (ఆరోగ్య కార్యకర్త)లకు రొమ్ముక్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ఎలాగో నేర్పించడం ప్రారంభించాం. ఇప్పుడు ఉమ్మడిరాష్ట్రం విడిపోయాక... తెలంగాణ మహిళా సమతా సొసైటీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీల పేరిట ప్రయోగాత్మకంగా 15 జిల్లాలలో స్క్రీనింగ్ చేయడం నేర్పించాం. దీని ఫలితం బాగా కనిపించింది. ఎన్నో మరణాల నివారణ జరిగింది. దశాబ్దకాల ప్రణాళిక ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఏఎన్ఎమ్లందరికీ శిక్షణ ఇవ్వగలిగితే... అధిక సంఖ్యలో రొమ్ముక్యాన్సర్లను ముందే పసిగట్టగలిగితే ఎంతోమందిని మృత్యువు కోరల నుంచి తప్పించవచ్చు. అందుకే కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసి... వారి ‘నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్’తో, నా ‘పాప్యులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ కార్యక్రమా’న్ని కూడా అనుసంధానం (ఇంటిగ్రేట్) చేస్తే... ఎంతోమంది రోగులకు రక్షించినవాళ్లమవుతాం. వచ్చే పదేళ్ల పాటు ఈ కార్యక్రమంతో ఎంతోమంది రొమ్ముక్యాన్సర్ రోగులను రక్షించాలన్నదే నా ప్రణాళిక. ఇతర సర్జన్లతో కలిసి... 2011లో ‘అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా’ అనే ఒక సంస్థను స్థాపించాం. ఈ ఏడాది దాని అధ్యక్షుడిగా నేను ఎంపికయ్యా. 2015 నుంచి 2017 వరకు కొనసాగే నా పదవీకాలంలో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలలో ఉన్న అక్కడి డాక్టర్లకూ నా కాన్సెప్ట్స్ వివరించే అవకాశం నాకు దక్కింది. విదేశీయులకూ మన చికిత్సా, నివారణా పద్ధతులను నేర్పి ప్రపంచంలోని కొన్ని దేశాల మహిళలను రొమ్ముక్యాన్సర్ బారినుంచి కాపాడే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. రొమ్ముకాన్సర్ అంటే అక్కడి గడ్డను తొలగించడం మాత్రమే కాదు... రొమ్మును మునపటిలాగే మళ్లీ పునర్నిర్మించడం వంటి ఆంకోప్లాస్టిక్ పరిజ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తున్నాను. నలుగురికి రుణపడి ఉన్నాను పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు ప్రధానంగా నేను నలుగురికి రుణపడి ఉన్నాను. మొదటిది నా కుటుంబం. రెండోవారు నా తల్లిదండ్రులు. మూడోవారు నా ఉపాధ్యాయులు. వారెప్పుడూ నన్ను వైవిధ్యంగా ఉండమనీ, విభిన్నంగా ఆలోచించమనీ ప్రోత్సహించారు. ఈ సమస్యను ఇలా వైవిధ్యంగా ఎందుకు పరిష్కరించకూడదు, ఇలా ఎందుకు ప్రయత్నించకూడదు... అంటూ నేనెంత భిన్నంగా ఆలోచిస్తే అంతగా ప్రోత్సహించారు నా ఉపాధ్యాయులు. ఇక నాలుగోవారు నా పేషెంట్లు. ఎన్నో రుగ్మతల చికిత్స కోసం, ఎన్నో వ్యాధులను దూరం చేయడం కోసం నాకు వచ్చిన ‘ఔటాఫ్ ద బాక్స్’ ఆలోచనలను తమకు చేసే చికిత్సలలో అనుమతించి, నన్ను ప్రోత్సహించారు. ఈ నలుగురూ నా అభివృద్ధికి సోపానాలు. అందుకే వారికి నేనెంతో రుణపడి ఉంటాను. - డాక్టర్ మంజుల అనగాని, సన్‌షైన్ హాస్పిటల్స్ డాక్టర్‌కి సేవాభావం ఉండాల్సిందే! ఒక డాక్టర్ తాను పరిపూర్ణ వైద్యుడిగా రూపొందాక సేవచేయడమే తన ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటానంటూ హిప్పోక్రాటిక్ ఓత్ అనే ప్రతిజ్ఞ చేస్తాడు. డాక్టర్ అంటే అతడికి అత్యున్నతస్థాయి నైతిక విలువలు ఉండాలి. సేవ చేయడంలోనూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని, దాన్ని అధిగమించడానికి కృషి చేయాలి. ఈ సేవా తపన లేకపోతే ఈ వృత్తిలో ఉండటం సరికాదు. ఎందుకంటే... మనమీద అంత నమ్మకం ఉండబట్టే కదా... ఒక రోగి తన ప్రాణాలను మన చేతుల్లో పెడతాడు. అలాంటి అవకాశం ఉన్న వృత్తి కాబట్టే దీన్ని పవిత్రవృత్తి (నోబుల్ ప్రొఫెషన్)గా అందరూ పేర్కొంటారు. అందుకే ఎంతగా వీలైతే సమాజానికి డాక్టర్ అంతగా సేవలందించాలి. - డాక్టర్ రఘురామ్, కిమ్స్ హాస్పిటల్ -
పద్మ పురస్కారాలకు ప్రముఖుల తిరస్కారం
-
దేవుడు మంచి అకౌంటెంట్!
హైదరాబాద్ శివారులోని కోకాపేటలోని భారీ సెట్ అది.అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందక్కడ.సోమవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్... ‘పద్మశ్రీ’ పురస్కార విజేతగా ఆదివారం రాత్రి ప్రభుత్వం ప్రకటించిన కోట శ్రీనివాసరావును యూనిట్ సభ్యులంతా కలసి అభినందించారు. సత్కరించారు. ‘మా మావకి ఇది ఓ పదిహేనేళ్లకు సరిపడా కిక్ వచ్చింది’ అన్నారు రాజేంద్రప్రసాద్, కోటకు కేక్ తినిపిస్తూ. కోటను అభినందిస్తూ వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మరోపక్క ఎవరెవరో పూలబొకేలు పంపిస్తున్నారు. ఇంటి నుంచి వచ్చిన ఉసిరికాయ పచ్చడి, వగైరాలతో భోజనం చేస్తూ కోట ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘పద్మశ్రీ’ పురస్కారం గెలుచుకున్నందుకు అభినందనలు సార్? ధన్యవాదాలండీ. ఈ అవార్డు రావడానికి కారకులైన నా దర్శక, నిర్మాతలకూ, సహనటులకూ, సాంకేతిక నిపుణులకూ, ప్రేక్షకులకూ - అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. పద్మశ్రీ రావడం ఓ పక్క థ్రిల్‌గా, మరోపక్క చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో విజయవాడ దగ్గర కంకిపాడులో నాటకాలతో మొదలైన ప్రస్థానం ఇక్కడకు చేరుకున్నందుకు ఏదో సాధించానని కించిత్ గర్వంగానూ ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి మీకు తోడ్పడిన అంశాలు ఏమిటనుకుంటున్నారు? నేను నటనను వృత్తిగానే భావించాను కానీ, ఏనాడూ వ్యాపారంగా చూడలేదు. నటించినందుకు డబ్బులు తీసుకున్నాను కానీ, మరీ విచ్చలవిడిగా వసూలు చేయలేదు. సిన్సియారిటీనే నా కెరీర్‌కు శ్రీరామరక్ష. అప్పుడూ, ఇప్పుడూ శ్రద్ధగానే పనిచేశా, పనిచేస్తాను కూడా! గుమ్మడికాయంత ప్రతిభతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని మీరే చాలాసార్లు చెబుతుంటారు. మరి మీ విషయంలో? ఎవరికైనా అదే అప్లై అవుతుంది. ‘పద్మశ్రీ’ రాగానే చాలామంది నాకు ఫోన్లు చేసి ‘మీకెప్పుడో రావాలి... ఇప్పటికే చాలా ఆలస్యమైంది’’ అన్నారు. మనం అనుకుంటే అన్నీ జరిగిపోతాయా చెప్పండి. దేనికైనా ప్రాప్తం ఉండాలి. మనకెప్పుడు ప్రాప్తమో, ఎంత ప్రాప్తమో... అంతే! దేవుడు చాలా గొప్ప అకౌంటెంట్. ఆయనకు ఏ లెక్క ఎప్పుడు వేయాలో, ఎక్కడ ఎంత సరిపెట్టాలో బాగా తెలుసు. అయినా అవార్డులతో వ్యక్తుల ప్రతిభను ఎలా కొలవగలం! అలా అనుకుంటే... మహా నటుడు ఎన్టీఆర్‌కు ఏ నంది అవార్డు వచ్చిందని!! ఇన్ని దశాబ్దాల మీ నట జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తోంది? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నాటకరంగంలో నాకు అన్నీ నేర్పిన తొమ్మిదిమంది గురువులను నేనెప్పటికీ మరిచిపోలేను. మా అన్నయ్య కోట నరసింహారావు, భావనాచారి, దేశ రాజు హనుమంతరావు, భానుప్రకాశ్, ఆయన తమ్ముడు శశాంక్, ఆదివిష్ణు, ఎల్బీ శ్రీరామ్, రత్నాసాగర్, కేజీ రామ్‌ప్రసాద్... ఈ తొమ్మండుగురు నాకు గురువులు. వీళ్లందరినీ గతంలో నేను ప్రత్యేకంగా సత్కరించాను కూడా! అప్పటి ‘ప్రతిఘటన’లో తెలంగాణ మాండలికం మొదలు ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు యాస దాకా... అన్ని మాండలికాలనూ అవలీలగా పండిస్తారు. ఆ పట్టు ఎలా చిక్కింది? ప్రత్యేకంగా నేర్చుకోవడమంటూ ఉండదు కానీ, శ్రద్ధగా గమనిస్తూ, పట్టుకుంటా. ఎవరైనా ప్రత్యేకమైన యాసలో మాట్లాడితే, వాళ్లతో కాసేపు మాట్లాడి గమనిస్తా. వాటిని మనసులో పెట్టుకొని, సమయం, సందర్భం, పాత్రను బట్టి, దర్శక, రచయితల సహకారంతో వాడుతుంటా. ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు మాండలికం కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా నామిని రచనలను తెప్పించి, చదివించారు. పుస్తకాలు బాగానే చదువుతారా? అస్సలు లేదండీ. 35 ఏళ్ల నుంచి నటన తప్ప, నాకు వేరే పని లేదు. షూటింగులు లేకపోతే ఇల్లు. రామాయణ, భారతాలు కూడా ఆమూలాగ్రం చదవలేకపోయా. మీ తొలి నాటకం గుర్తుందా? ఎందుకు మర్చిపోతామండీ...! పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు రాసిన ‘ఆడది’ నాటకంలో శతభిషం పాత్ర నేనే చేశా. ఆ నాటకంలో ఒక్క స్త్రీ పాత్ర కూడా ఉండదు. గమ్మత్తేమిటంటే నా నక్షత్రం కూడా శతభిషమే. నటనలో సహజత్వం కోసం ఏమైనా కసరత్తులు చేస్తారా? రంగస్థలంపై నాటకాలు ఆడుతున్నప్పుడు కూడా నా గురువులు ఇలా యాక్ట్ చేయాలని నాకెప్పుడూ చేసి చూపించలేదు. ‘నాలుగు రోజులుగా నువ్వు ఆకలితో ఉన్నావనుకో! నువ్వైతే ఎలా యాక్ట్ చేస్తావో చేసి చూపించు’ అనేవారు. ఎందుకంటే ఎవరి భావోద్వేగాలు వాళ్లకు ఉంటాయి కదా! నేను మొదటి నుంచీ ఆ పంథానే అనుసరించా. అందుకే నా నటనలో అనుకరణ కాకుండా, సహజత్వం కనబడుతుందేమో! ప్రాణం ఖరీదు’ మొదలుకుని ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 800పై చిలుకు సినిమాలు చేశారు. ఇంకా చేయాలనుకునే పాత్ర ఏమైనా మిగిలి ఉందా? ఒకప్పుడు సినిమాల ప్రభావం మనుషులపై చాలా ఉండేది . ఎన్టీఆర్ ఫ్యాంట్, ఏఎన్నార్ కట్, శోభన్‌బాబు హెయిర్‌స్టైల్, వాణిశ్రీ చీర - జాకెట్... ఇలా అందరూ అనుసరించేవారు. అయితే, అప్పట్లో సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం, కౌబోయ్ - ఇలా ఏ తరహా అయినా ఆ పాత్రలకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. కానీ, ఇప్పుడు నన్నడిగితే ప్రజల ప్రభావం, చుట్టుపక్కల సమాజం ప్రభావం సినిమాలపై ఉంది. అప్పట్లో రాజకీయ నాయకుడంటే ఒక గెటప్ ఫాలో అయితే సరిపోయేది. ఇప్పుడలా కుదురుతుందా! అసెంబ్లీకి వెళ్లి చూడండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా... ఎన్ని రకాల వేషభాషలు కనిపిస్తాయో..? కాబట్టి, ఏ రోజుకు ఆ రోజు కొత్త రకంగా పాత్రను పోషించవచ్చు. అయినా, గెటప్స్, కేరెక్టర్ ఒక్క రోజులో తేలిగ్గా మర్చిపోతున్నప్పుడు ఇక డ్రీమ్ రోల్స్ ఏముంటాయ్! రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారా? చిన్నప్పటి నుంచి నాలో కొంత ఆర్.ఎస్.ఎస్. భావజాలం, హిందూత్వ అభిమానం ఉండేవి. 1990లో బీజేపీలో చేరా. అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నా. మిగతావాళ్లలాగా పార్టీలు మారలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం కొంత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాను. మీకు ‘పద్మశ్రీ’ రావడానికి ఆ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉపయోగపడిందంటారా? అలాగైతే ఈ పురస్కారం ఎప్పుడో వచ్చేది కదా! మన తెలుగు పరిశ్రమలో పద్మ పురస్కారాలు అందుకోవాల్సిన వాళ్లు... మీ కన్నా సీనియర్లు ఇంకా చాలామందే ఉన్నారేమో? అవును. నా కన్నా సీనియర్లయిన కైకాల సత్యనారాయణ, గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు - ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఒకరికి రావడం, రాకపోవడం మన చేతుల్లో లేదు కదా. నిర్మాణం, దర్శకత్వం చేయాలని ఎప్పుడైనా అనిపించిందా..? నాకొద్దు సార్. అవి నాకు తెలియని పనులు. చేతకానివి. అవి చేయడానికి చాలా విద్వత్తు కావాలి. ఒకవేళ నేనే ప్రొడక్షన్ చేస్తే, ‘కష్టపడి సంపాదించిన సొమ్మును ఎందుకిలా తగలేస్తున్నాడ’ని మీరే కామెంట్ చేస్తారు. ఇన్నేళ్ల అనుభవంతో చెప్పండి... తరువాతి తరానికి మీరిచ్చే సలహా? సాధన. అది ఉంటేనే ఏ రంగంలోనైనా మనం దీర్ఘకాలం నిలబడగలుగుతాం. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన...’ అని పెద్దలు ఊరకే అనలేదు కదా! అయినా ఇప్పుడు జనంలో సాధన తక్కువైంది, వాదన ఎక్కువైంది. ‘ఎడమవైపున నడవాలి’ అని చెప్పావనుకోండి ‘ఏం! కుడివైపున ఎందుకు నడవకూడదు?’ అని వాదిస్తారు. మీరు వ్యంగ్యాస్త్రాలు విసురుతారని, కొటేషన్స్ చెబుతారని ప్రతీతి. వాటిలో మీకు నచ్చిన మాట? ఆర్టిస్టులకూ, టెక్నీషియన్లకూ నేను తరచూ చెప్పే మాట ఒకటే... మనకు టైమొస్తే తీరిక టైమ్ ఉండదు. టైమ్ పోయిందా... మన బజారుకు కర్ప్యూ పెట్టినట్టే! ఒక్కడూ దగ్గరకు రాడు! నటుడిగా మీకంటూ తీరని కోరికలు ఏమైనా...? ఏమీ లేవు. ఒకటే కోరిక... చనిపోయే చివరి క్షణం వరకూ నటించాలి. రేపు మరణించినా నటునిగా చిరస్థాయిగా జీవించే ఉండాలి. మై టాప్ టెన్ ప్రతిఘటన (1986) అహ నా పెళ్ళంట (1987) శత్రువు (1990) అలెగ్జాండర్ (1992) రక్షణ (1993) గాయం (1993) హలో బ్రదర్ (1994) పంజరం (1997) గణేశ్ (1998) ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007) - పులగం చిన్నారాయణ -
విరబూసిన వాణిజ్య పద్మాలు
* అగాఖాన్కు పద్మ విభూషణ్ * బిల్-మిలిందా గేట్స్‌లకు పద్మభూషణ్ * పాయ్, నందరాజన్లకు పద్మశ్రీ న్యూఢిల్లీ: వాణిజ్యం, పరిశ్రమల కేటగిరి కింద ముగ్గురు వ్యక్తులకు పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఆయన సతీమణి మిలిందా గేట్స్‌లకు సామాజిక సేవ విభాగంలో పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. ఇక వాణిజ్యం, పరిశ్రమల కేటగిరిలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ల్లో నివసించే కరీమ్ ఆల్ హుస్సేని అగాఖాన్‌ను పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఇది దేశంలో రెండో అత్యున్నత అవార్డు. ఇన్ఫోసిస్ మాజీ బోర్డ్ సభ్యుడు టి. వి. మోహన్‌దాస్ పాయ్‌కు, ఇండో అమెరికన్ ఆర్థిక వేత్త నంద్రాజన్ రాజ్ చెట్టిలకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. బిల్‌గేట్స్, మిలిందాగేట్స్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద 8,200 కోట్ల డాలర్లపైనే. 1995 నుంచి 2014 వరకూ 2-3 ఏళ్లు మినహా ప్రతీ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తన భార్యతో కలిసి 2000లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. పేదరికం, ఆరోగ్యం, విద్య రంగాల్లో ఈ ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అగాఖాన్ షియా ఇస్లామ్‌కు సంబంధించిన నిజారి ఇస్లామిజమ్కు 49వ ఇమామ్‌గా వ్యహరిస్తున్న ఈయన ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హోటళ్ల వ్యాపారం ప్రధానమైనది. ఎన్నో రేసుగుర్రాలకు అధిపతి. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ఆయన సంపద 80 కోట్ల డాలర్లు. ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియాల్లో ధార్మిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నందరాజన్ రాజ్ చెట్టి న్యూఢిల్లీలో 1979లో జన్మించిన చెట్టి.. హార్వర్డ్‌లో 2003లో పీహెచ్డీ చేశారు. అత్యంత పిన్నవయస్సు(29 సంవత్సరాలు)లోనే హార్వర్డ్ ఎకనామిక్స్‌లో బోధన చేపట్టి రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం జర్నల్ ఆప్ పబ్లిక్ ఎకనామిక్స్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. టి. వి.మోహన్‌దాస్ పాయ్ 1994లో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో చేరిన పాయ్.. సీఎఫ్ఓ స్థాయికి ఎదిగారు. ఫైనాన్స్ ఏషియా నుంచి ఉత్తమ సీఎఫ్ఓ అవార్డును పొందారు. కామర్స్, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రుడైన ఆయన వృత్తిరీత్యా చార్టెర్ట్ అకౌంటెంట్. విద్య, పరిశోధన, మానవ వనరుల్లో మరింతగా కృషి చేయడానికి 2006లో ఇన్ఫీ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం అక్షర ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. -
ఉత్తములు ఎవరో !
పంద్రాగస్టు పురస్కారాలపై ఉద్యోగుల్లో చర్చ నిజమైన సేవలకు గుర్తింపు ఏదీ? ఏటా చాంతాడంత జాబితా విడతలవారీగా పేర్ల ప్రతిపాదనలు..వారికే పురస్కారాలు శాఖాధిపతి నచ్చిన పేర్లకే సిఫార్సు కలెక్టర్ చొరవతోనైనా ఉత్తములను గుర్తిస్తారని నిజమైన ‘ఉత్తముల్లో’ ఆశ ఉత్తమ సేవలకు గుర్తుగా మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం అంటే గతంలో ఓ గౌరవం. ఆయాస్థాయిల్లో వారు ‘పద్మశ్రీ’ వచ్చినంత సంబరపడే వారు. ఆ ప్రశంసాపత్రం, ఫొటోలకుఫ్రేమ్ కట్టుకుని ఇంట్లో భద్రపరుచుకునేవారు. ప్రస్తుతం సీన్ మారింది. గతంలో పదుల సంఖ్యలో దక్కే పురస్కారాలు నేడు వందల సంఖ్యకు చేరాయి. ఉత్తముల ఎంపికలో పారదర్శకత, నిజాయితీ లోపించింది. నిజంగా కష్టపడి పనిచేసిన అధికారి, సేవకుడిగా ఉన్నవారి కంటే సిఫార్సులకే ‘ప్రశంసాపత్రం’ దక్కుతోంది. ఈ క్రమంలో కొత్త కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ చొరవతో నిజమైన ఉత్తములకు గౌరవం దక్కుతుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. చిత్తూరు: జిల్లాలో 36వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 97 శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. రోజు వారీ పాలనలో, కార్యకలాపాల్లో ఆ ఏడాది ఉత్తమ సేవలు అందించిన వ్యక్తులకు ఏడాదిలో రెండుసార్లు పురస్కారాలను అందిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వం నుంచి మంత్రి చేతుల మీదుగా, గణతంత్ర దినోత్సవం ఉత్తములు ఎవరో ! రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. గతంలో ఉత్తమాధికారుల గుర్తింపు చిత్తశుద్ధితో జరిగేది. జిల్లా అంతా కలిపి 20-30 కంటే సంఖ్య దాటేది కాదు. కొన్ని శాఖల్లో ఆ ఏడాది ఉత్తమ సేవలు అందించలేదనే భావన ఉంటే అసలు పురస్కారానికి ఆ శాఖాధిపతి ఎవరి పేర్లను సిఫార్సు చేసేవారు కాదు. కాలక్రమేణ ఉత్తముల ఎంపికలో పారదర్శకత లోపించింది. 30 నుంచి వందకు, అక్కడి నుంచి 200కు సంఖ్య చేరింది. ప్రస్తుతం ఏటా 450 మంది ఉద్యోగులకు ఉత్తమ పురస్కారాలు అందజేస్తున్నారు. విడతల వారీగా పేర్ల ప్రతిపాదనలు జిల్లా అధికారి స్థాయి నుంచి జఫేదారు దాకా ఉత్తమసేవలు అందించిన వారి పేర్లను పంపాలని కలెక్టర్ తరఫున జిల్లా యంత్రాంగానికి డీఆర్వో ఆదేశిస్తారు. అయితే చాలా సందర్భాల్లో ఆగస్టు 14 వరకు ఁఉత్తముల* జాబితా సిద్ధం కాదు. గత ఏడాది ఎవరికి ఇచ్చాం ? అంతకు ముందు ఎవరి పేరు సిఫార్సు చేశాం? మిగిలింది ఎవరు ? వారిలో ఎవరి పేర్లు ప్రతిపాదించాలి ? అనే తరహాలోనే ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. వీరిలో విధులకు దూరంగా ఉన్నవారు ? విధి నిర్వహణలో తీవ్ర ఆరోపణలు వచ్చిన వారికి కూడా మువ్వన్నెల జెండా పండుగ రోజూ ముచ్చటగా పురస్కారాలను అందజేస్తున్నారు. దీనిపై నిజంగా ఉత్తమ సేవలు అందించిన వారు తీవ్ర వేదన పడుతున్నారు. మరోపక్క కార్యాలయంలో ఉన్నతాధికారితో మంచిగా ఉన్నవారి పేర్లకు ప్రాధాన్యం లభిస్తోంది. కాస్త ముక్కుసూటిగా ఉండి ఉన్నతాధికారి మాటను ఖాతరు చేయకుండా నిక్కచ్చిగా పనిచేసే వారి పేర్లు కూడా జాబితాలోకి ఎక్కడం లేదు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఁఉత్తముల జాబితా*లో కూడా తనదైన మార్క్‌ను చూపించి నిజమైన సేవలు అందించే వారిని గుర్తించాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
మా ఆయన పద్మశ్రీ లాక్కోవట్లేదు: కరీనా
సైఫ్ అలీఖాన్‌కు గతంలో ఇచ్చిన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనుకుంటోందని కథనాలు రావడంతో.. ఆయన భార్య, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. అవన్నీ వదంతులేనని, అవార్డు వెనక్కి తీసుకోవట్లేదన్న విషయాన్ని అధికారులు ఒక లేఖ ద్వారా తమకు తెలియజేశారని చెప్పింది. ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కరీనా విలేకరులను పిలిచి మరీ ఈ లేఖ విషయం తెలిపింది. కళా రంగంలో సేవలు అందించినందుకు గాను 2010 సంవత్సరంలో సైఫ్ అలీఖాన్‌ను ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ముంబైలోని ఓ హోటల్లో ఎన్నారై వ్యాపారవేత్త మీద దాడి చేసిన సంఘటనలో ముంబై కోర్టు అతడిపై నేరారోపణ చేయడంతో ప్రభుత్వం పద్మశ్రీని వెనక్కి తీసుకుంటుందంటూ కథనాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటూ నేరుగా ప్రభుత్వం నుంచే లేఖ వచ్చిందని, అందువల్ల ఇక ఎవరూ దీని గురించి ఎలాంటి కట్టుకథలు రాయనక్కర్లేదని తెలిపింది. -
‘పద్మశ్రీ’ కేసులో మోహన్‌బాబుకు ఊరట
హైకోర్టు ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని తిరిగి భారత రాష్ట్రపతికి అప్పగించాలని... ఇందుకు కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. ‘పద్మశ్రీ’ని మోహన్‌బాబు పేరుకు ముందు సినిమాల్లో వాడుతున్నారని, ఇది వాణిజ్య అవసరాలకు వినియోగించడమేనని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిని విచారించిన హైకోర్టు.. ‘పద్మశ్రీ’ని తిరిగి అప్పగించేలా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. దాంతో మోహన్‌బాబు గత శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం... ఎక్కడా పేరుకు ముందు ‘పద్మశ్రీ’ని వాడకూడదని, ఈ మేరకు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై మోహన్‌బాబు ప్రమాణ పత్రం దాఖలు చేయగా.. హైకోర్టు ఆదేశాలపై మధ్యంతర స్టే ఇస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. కేసులో ప్రతివాదులైన కేంద్ర హోంశాఖను ఈ అఫిడవిట్‌పై సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. -
పీడితవర్గ రచయితకు పద్మశ్రీ
కొలకలూరి ఇనాక్‌కు పద్మశ్రీ రావడం అంటే అశ్రువుకు పద్మశ్రీ రావడం... వేదనకు పద్మశ్రీ రావడం... తరతరాలుగా చెప్పుల్లేకుండా పరుగులెత్తిన పాదాలకీ సీసపుపోతతో నెత్తురు కార్చిన చెవులకీ తాటాకులు కట్టిన వీపుకీ రక్తమే చెమటగా చిందించిన మట్టి కట్టెకీ శ్రమజీవికీ బడుగుజీవికీ దళిత ఆక్రందనికీ పద్మశ్రీ రావడం. ఇది అక్షరం తనను తాను గౌరవించుకోవడం కాదు. సమాజం తనను తాను గౌరవించుకోవడం. కింద పడ్డ అన్నం ముద్దను దోసిళ్లలో అందుకొని కళ్లకద్దుకొని భుజించడం. కథకుడిగా, కవిగా, విమర్శకుడిగా, అధ్యాపకుడిగా ఇనాక్ ప్రస్థానాన్ని రెండు నెలల క్రితం ఇదే పేజీలో ప్రస్తావించింది సాక్షి. ఇనాక్‌కు సాహిత్య అకాడెమీ పురస్కారం రాకపోవడాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు అంతకు మించిన గౌరవం అందుకున్నందుకు హర్షం ప్రకటిస్తోంది. నిలదీసే కథలు ఆయనవి నా కన్నీళ్లే నా సాహిత్యం అని కొలకలూరి ఇనాక్ అన్నంత మాత్రాన కేవలం కష్టాలు చెప్పి, బాధలు ఏకరువు పెట్టి పాఠకుల్ని ఏడిపించడం ఆయన తన రచనా ధోరణిగా పెట్టుకోలేదు. కరుణ ఆయన సాహిత్యంలో అంతర్గతంగా ఉన్నా అది పాఠకులను ఆలోచన వైపు మళ్లిస్తుంది. పీడితులను మారుతున్న సమాజంలో భాగస్వాములను కమ్మని చైతన్యపరుస్తుంది. ఆయన పాత్రలేవీ శ్రమ నుంచి దూరం కావు. అవి పిరికివి కావు. వాటికి తామెలా ఉన్నామో, అలా ఎందుకున్నామో, తామెలా ఉండాలో, అలా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసు, లేదా తెలుసుకుంటాయి. హక్కుల సాధనను ఆయన పాత్రలు అనేక రకాలుగా చేస్తుంటాయి. కూలి రాబట్టుకోవడం, దేవాలయ ప్రవేశం, నీళ్లు సంపాదించుకోవడం, ఆకలిని తీర్చుకోవడం, మద్యపాన రుగ్మత వంటి వస్తువుల నుండి కులాంతర వివాహాల దాకా ఆయన సాహిత్య వస్తువు విస్తరించి ఉంటుంది. కంచికచర్ల కోటేశు సజీవ దహనం, రూప్‌కన్వర్ సహగమనం, ప్యాపిలి వినాయక చవితి సంఘటన వంటి నిర్దిష్ట వస్తువులు ఆయన కథలు కావడం విశేషం. నిర్దిష్టతను సంభాషణల ద్వారా, వ్యాఖ్యల ద్వారా సాధారణీకరించడం కొలకలూరికి తెలిసిన విద్య. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, విమర్శకులు ఇనాక్ కథల నుంచి... పొట్ట పేగులిబ్బందిగోడు.... ఇబ్బందిగోడు మాంసం గోత్తే పెద్ద గిరాకీ. లేద్దూడల్ని, రోగం రొచ్చు లేనివాటిని, కుర్రాటిని, కొవ్వినాటిని గోత్తాడు ఇబ్బందిగోడు. పక్కూళ్ల పల్లెలోళ్లు గూడా ఆదోరవైతే అజీలుగా ఆడింటిముందు తెల్లారగట్టకే కాకులోలినట్టోలి కావుకావుమంటుంటారు. వొక్కక్కడూ రెండూ మూడూ కుప్పలెత్తుకుంటాడు. ఆల్లొత్తన్నారు గందాని ఈడు బేరం బెంచడు. కొంటన్నారు గందాని రోగిష్టోటిని గొయ్డు. ఆదోరం యాపారం. ఇంక వారవంతా కాళ్లారజావుక్కూకోటమే. ఉంటే కూడొండుకుంటాడు లేబోతే గంజి కాసుకుంటాడు. గంజిగ్గతిలేనోడు కాడీడు. ఆడి కొంపని గుడిసెంటే సిన్నమాట. ఇల్లంటే పెద్ద మాట. గూడంటే సరిపోద్ది. మట్టిగోడలు, తడికె తలుపు, ఒంటి నిట్టాడి, తాటాక్కప్పు, కిటికీలంటే తప్పు, బొక్కలంటే సెల్లు. తడికేత్తే ఇల్లంతా సీకటి గుయ్యారం. పొయ్యి ముట్టిచ్చకపోతే పొగులు. బెడ్డలిగిచ్చకపోతే రేత్రి. ఆడి గూట్లో కన్ను బొడసుకున్నా యేందీ కానరాదు..... తాకట్టు..... శాస్త్రి ఇంట్లోగాని వంటి మీద గాని విలువైన వస్తువేదీ లేదు. ‘తాకట్టు పెట్టడానికి నా దగ్గరేముంది?’ ‘ఏమున్నా సరే’ ‘ఏమీ లేదనేగా. ఇవ్వననరాదూ?’ ‘ఇస్తానంటున్నానుగా’ ‘ఏం తాకట్టు పెట్టేది?’ ‘నీ జందెం’ ‘జంధ్యమా?’ శాస్త్రి బిత్తరపోయాడు. తిక్కపట్టినవాడిలాగా మిత్రుడి ముఖంలోకి చూశాడు. జంధ్యం మంత్రపునీతం. ద్వితీయ జన్మం. ఉపనయన చిహ్నం. ద్విజలక్షణం. వేదవిద్యా పరిరక్షణభారం. మోక్షదాయని. శత్రు సంహారిణి, గాయత్రీ మంత్ర పరిరక్షితం. ఆలోచిస్తున్నకొద్దీ శాస్త్రికి పిచ్చెక్కుతూ ఉంది. ఓబిలేసు మాట్లాడకుండా కూర్చున్నాడు.... ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలు: ఉత్తమమైన కవిత్వానికి ప్రతి ఏటా ఇచ్చే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలను 2012, 2013 సంవత్సరాలకుగాను వరుసగా రామాచంద్రమౌళి, ఈతకోట సుబ్బారావులకు ప్రకటించారు. ఫిబ్రవరి 1 సాయంత్రం చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో బహుమతి ప్రదానం. -
విద్యాబాలన్‌కి పద్మశ్రీనా? - శ్రీప్రియ
సీనియర్ నటి, దర్శకురాలు శ్రీప్రియకు కోపం వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల గురించి శ్రీప్రియ తన ట్విట్టర్లో కొంచెం ఘాటుగానే స్పందించారు. సీనియర్ తారలను మర్చిపోవడం బాధాకరం అన్నారామె. విజయనిర్మలకు నటిగా ఎంతో గుర్తింపు ఉందని, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డ్ కూడా సాధించిన ఆమెకు ఇంకా ‘పద్మ’ పురస్కారం రాకపోవడం ఏంటి? అని ప్రశ్నించారు శ్రీప్రియ. అలాగే, నాటి తరం తారల్లో లక్ష్మి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలని, భారతీయ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమెను గుర్తించకపోవడం ఏంటి? అని ఘాటుగా స్పందించారు. కమల్‌హాసన్‌కి పద్మభూషణ్ రావడం ఆనందించదగ్గ విషయం అని, ఆయనకా అర్హత ఉందని పేర్కొన్నారామె. కానీ, ఎన్ని సినిమాలు చేసి ఉంటుందని విద్యాబాలన్‌కి పద్మ పురస్కారం కట్టబెట్టారో తనకు తెలియడం లేదని శ్రీప్రియ పేర్కొన్నారు. సీనియర్ తారలకు తగిన గుర్తింపు లభించడంలేదనే బాధతో ఈ కామెంట్లు చేశానని ఆమె స్పష్టం చేశారు. -
పురస్కారాలు పదిలం చేసుకోవాలి
పురస్కారాలను పొందడం ఎంత ప్రధానమో వాటిని పదిలపరచుకోవడం అంతే ముఖ్యమని ప్రఖ్యాత నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మభూషణ్‌ను సొంతం చేసుకున్న ఈ సకల కళావల్లభుడు ఆదివారం స్థానిక ఆల్వార్‌పేటలోని తన కార్యాలయంలో మీడియూతో మాట్లాడారు. పద్మభూషణ్ అవార్డు తనను వరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పురస్కారం కోసం ఎందరో ఎదురు చూస్తుంటారని, అలాంటి అవార్డు తనకు దక్కడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కమల్ హాసన్ కింది విధంగా బదులిచ్చారు. ఈ అవార్డు రావడానికి కారణం ఎవరు? కచ్చితంగా నా తల్లిదండ్రులు, గురువులే. తల్లిదండ్రులు ఏర్పరచిన పునాది, గురువులు బోధించిన విద్యనే కారణం. దర్శకుడు కె.బాలచందర్, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణలాంటి వారే పద్మభూషణ్ లాంటి వారు. వారు నాకు గురువులు కావడం నా అదృష్టం. నిజానికి వారి స్థారుు అంత ఉందనినాకప్పుడు అనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తోంది. నాతోపాటు ప్రముఖ గీత రచయిత వైరముత్తుకు పద్మభూషణ్ అవార్డు లభించడం సాహితీ రంగానికే గర్వకారణం అన్నారు. పద్మభూషణ్‌పై మీకు రావడంపై కామెంట్? అవార్డును పొందడం దక్కించుకోవడం సంతోషంగా ఉన్నా దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. పురస్కారాన్ని పొందాలి, దాన్ని పదిలపరచుకోవాలి. అలాగే ఇలాంటి అత్యుత్తమ అవార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతిభావంతులు చాలా రంగాల్లో ఉన్నారు. అలాంటి వారికి నేను సిఫార్సు చేయడానికి సిద్ధమే. ఆహా మనకూ స్థానం దక్కిందని వాళ్లు సం తోషిస్తారు. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందిస్తున్న భారత దేశానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దక్షిణ చిత్ర పరిశ్రమపై మీ అభిప్రాయం ఏమిటి? దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ప్రయాణిస్తోంది. అది మన కళాకారుల గొప్పతనం. ఇలాంటి పురస్కారాలతో మన దేశ సంస్కృతికి విజయం దక్కిం దని భావిస్తున్నాను. దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది. అనువాద చిత్రాల సమస్యలపై ఏమంటారు? భిన్నత్వంలో ఏకత్వం అంటారు. దాన్ని పాటిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరి సంస్కృతిని ఇతరులు గౌరవించాలి. మాతృ భాష అనేది ఆ మని షిని చాలా దగ్గరగా తీసుకెళుతుంది. వేరే భాషలో అంతగా తాత్పర్యం ఇవ్వడం సాధ్యం కాదు. అయి నా ప్రేక్షకులు పరిభాషా చిత్రాలను ఆదరిస్తున్నారు. అలాంటి చిత్రాలను నిషేధించడం సరైన పద్ధతి కాదు. ఎవరికి నచ్చిన చిత్రాన్ని వారు చూస్తారు. విశ్వరూపం-2 ఏ దశలో ఉంది? విశ్వరూపం - 2 చిత్రం తొలి భాగం కంటే సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అన్ని విధాలుగా బెటర్‌గా ఉంటుంది. చిత్ర ఆడియోను కూడా మరింత ప్రత్యేకంగా తీర్చి దిద్దుతున్నాం. విశ్వరూపం -2 కోసం మరికొంత షూటింగ్ చేయాల్సి ఉంది. లొకేషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నాం. మరో మూడు నెలల్లో చిత్రం విడుదలవుతుంది. చివరిగా మీ కూతురు శృతి హాసన్ గురించి? శృతి సినీ, సంగీత రంగాల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం నటిగా పలు భాషల్లో ప్రకాశిస్తున్నారు. ఆమె కూడా నాకు ఒక అవార్డులాంటిదే. ఆ విధంగా పుత్రికోత్సాహాన్ని అనుభవిస్తున్నాను. -
పద్మభూషణుడైన సకలకళావల్లభుడు
పురస్కారాలు అందుకోవడం తొలి నుంచే అలవాటైంది కమల్‌హాసన్‌కి. అయిదేళ్ల వయసులోనే మొదటి సినిమా ‘కలత్తూర్కన్నమ్మ’ (1959) ద్వారా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారాయన. అప్పట్నుంచి బిరుదులు, పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలోకి చేరుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, ప్రైవేటు పురస్కారాలైతే... అసలు లెక్కే లేదు. పాతికేళ్ల క్రితమే కమల్ ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్నారు. అయితే... ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారం ఈ మహానటుణ్ణి వరించింది. 55ఏళ్ల నటప్రస్థానాన్నీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాను చేసిన అద్వితీయ పాత్రలని, కళలకు తాను చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’కి కమల్ని కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఇది దక్షిణాది సినీ పరిశ్రమనే కాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమల్ అభిమానులందరినీ ఆనందపరిచే విషయం. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కమల్‌హాసన్‌ని తమిళ చిత్రపరిశ్రమ తొలినాళ్లల్లో బాగానే ప్రోత్సహించింది. బాలనటునిగా ఆరు చిత్రాల్లో నటించారాయన. ఆరేళ్ల వయసులోనే ‘పార్తాల్ పసి తీరుమ్’(1960) చిత్రం పుణ్యమా అని మహానటుడు శివాజీగణేశన్‌తో అభినయించే క్రెడిట్ కొట్టేశారు. ‘ఆ సినిమాలో శివాజీసార్ నన్ను ఎత్తుకున్నారు. ముద్దాడారు’ అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు కమల్. బాలనటునిగా తెరపై తేలిగ్గానే కనిపించినా, సినీపరిశ్రమలో ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి కమల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఓ వయసొచ్చాక... కొన్నాళ్ల పాటు పలువురు డాన్స్ మాస్టర్స్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. అక్కినేని, కృష్ణంరాజు లాంటి ప్రముఖులకు డాన్స్ మూమెంట్స్ కూడా నేర్పారు. ఆ తర్వాత అలా కనిపించి, ఇలా మాయమయ్యే పాత్రలు చాలానే చేశారు. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘అరంగేట్రం’(1974) కమల్‌కి తొలి బ్రేక్‌గా నిలిస్తే... బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘అపూర్వరాగంగళ్’(1975) ఆయన్ను స్టార్‌ని చేసింది. తెలుగు ప్రేక్షకులకు కమల్ని పరిచయం చేసింది కూడా బాలచందరే. ‘అంతులేని కథ’ తెలుగుతెరపై కమల్ కనిపించిన తొలి సినిమా. ‘మరోచరిత్ర’(1978)తో ఆయన తెలుగునాట కూడా స్టార్‌గా అవతరించారు. ఇక అప్పట్నుంచి నటనకు భాషతో నిమిత్తం లేదు అని నిరూపిస్తూ... హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి మహానటుడిగా అవతరించారు కమల్. తెలుగులో డెరైక్ట్‌గా కమల్ నటించిన అంతులేని కథ, మరోచరిత్ర, ఇది కథ కాదు, అందమైన అనుభవం, సొమ్మొకడిదీ సోకొకడిది, ఆకలిరాజ్యం, సాగరసంగమం, స్వాతిముత్యం, ఒకరాధా ఇద్దరు కృష్ణులు, శుభసంకల్పం, ఇంద్రుడు-చంద్రుడు చిత్రాలు ఆయన్ను తెలుగు నటుణ్ణి చేసేశాయి. తెలుగులో డెరైక్ట్‌గా ఇన్ని విజయాలు అందుకున్న పరభాషా నటుడు మరొకరు లేరు. ఎర్రగులాబీలు, అమావాస్య చంద్రుడు, ఖైదీవేట, నాయకుడు, విచిత్రసోదరులు, మైకేల్ మదనకామరాజు, చాణక్య, సతీలీలావతి, గుణ, భామనే.. సత్యభామనే, మహానది, సత్యమే శివం, దశావతారం, విశ్వరూపం.. ఇలా ఎన్నో అనువాదాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు కమల్. ఇక ‘పుష్పక విమానం’ సంగతి సరేసరి. ఆయన తమిళ నటుడంటే మింగుడు పడనంతగా ప్రేమను పెంచుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ పనిలో ఉన్నారాయన. ఈ సందర్భంలో ఆ మహానటుడికి ‘పద్మభూషణ్’ రావడం పట్ల.. భాషతో ప్రమేయం లేకుండా సినీ అభిమాని అయిన ప్రతి ఒక్కరూ హర్షం వెలిబుచ్చుతున్నారు. -
పలువురు నగరవాసులకు ‘పద్మాలు’
న్యూఢిల్లీ: జాతికి విశిష్ట సేవలు అందించిన వారికి ప్రకటించే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఈసారి పలువురు ఢిల్లీవాసులకు దక్కాయి. ప్రజావ్యవహారాల విభాగంలో న్యాయమూర్తి దల్వీర్ భండారి, సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ తిరుమలాచారి రామసామి, డాక్టర్ వినోద్ ప్రకాశ్ శర్మ, సాహిత్య, విద్య విభాగంలో మృత్యుంజయ్ ఆచార్య, పౌరసేవల విభాగంలో విజయేంద్రనాథ్ కౌల్, వైద్యవిభాగంలో డాక్టర్ నీలమ్ క్లేర్‌కు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. పద్మశ్రీ పురస్కారాలు ప్రముఖ శిల్పి ప్రొఫెసర్ బీహారీ దాస్, ఒడిస్సీ నృత్య విభాగంలో గీతా మహాలిక్, చిత్రకళాకారుడు పరేశ్ మైటీ, సామాజిక సేవకుడు జేఎల్ కౌల్, సైన్స్, ఇంజనీరింగ్ నిపుణుడు బ్రహ్మసింగ్, రామస్వామి అయ్యర్, ప్రముఖ అంకాలజిస్టు లలిత్‌కుమార్, ఎముకల వైద్యుడు డాక్టర్ అశోక్ రాజ్‌గోపాల్, దంతవైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ మహేశ్ వర్మ, డాక్టర్ తితియాల్, కంటి వైద్యుడు డాక్టర్ నితీశ్ నాయక్, హృద్రోగాల నిపుణుడు డాక్టర్ సుబ్రత్ కుమార్ ఆచార్య, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ అశోక్ చక్రధర్, సాహితీకారులు కేకేఈ దారువాలా, మనోరమ జఫా, రెహానా ఖటూన్, దినేశ్ సింగ్, అంజుమ్ చోప్రా, ప్రముఖ క్రికెటర్ లవ్‌రాజ్ సింగ్, పర్వతారోహణ క్రీడాకారుడు ధర్మశక్తు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. -
యువరాజ్ సింగ్‌కు పద్మశ్రీ అవార్డు
-
పద్మశ్రీ కేసులో అఫడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు
-
వారంలోగా పద్మశ్రీ అవార్డులు తిరిగి ఇచ్చేయండి
హైదరాబాద్ : పద్మశ్రీ వివాదం కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది. 'దేనికైనా రెడీ' చిత్రానికి మోహన్‌బాబు గౌరవ నిర్మాతేనని.. నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దేనికైనా రెడీలో బ్రహ్మానందం నటించారా అని ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదిని ప్రశ్నించగా.. బ్రహ్మానందం నటించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దేనికైనా రెడీ సినిమా టైటిల్స్‌లో మోహన్‌బాబు, బ్రహ్మానందం తమ ఇంటిపేరుకు బదులుగా పద్మశ్రీ అవార్డు పేరు పెట్టుకోవడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. వారం రోజుల్లోగా తమకున్న పద్మశ్రీ అవార్డులను తిరిగిచ్చెయ్యాలని.. సినీనటుడు బ్రహ్మానందం, మోహన్‌బాబులను ఆదేశించింది. సెన్సార్ బోర్డు తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలు వీరు పాటించడం లేదని న్యాయస్థానం మండిపడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. టైటిల్స్‌లో ఇంటిపేరుకు బదులుగా అవార్డు పేరును వాడుకోవడం తప్పన్న పిటిషనర్ బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. 2007లో మోహన్ బాబుకు, 2009లో బ్రహ్మానందంకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. -
‘పద్మశ్రీ’ని తిరిగిచ్చేయండి
మోహన్‌బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టు సూచన ‘పద్మ’పురస్కారాల దుర్వినియోగంపై అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ‘పద్మ’ పురస్కారాలు దుర్వినియోగం అవుతున్నాయుంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతికి తిరిగి స్వాధీనం చేయాలని ప్రముఖ నటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబు, హాస్యనటుడు బ్రహ్మానందంలకు హైకోర్టు సూచిం చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామంటూ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ‘దేనికైనా రెడీ’ సినిమా టైటిల్స్‌లో మోహన్‌బాబు, బ్రహ్మానందం పేర్ల ముందు ‘పద్మశ్రీ’ని ఉపయోగించుకోవడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. బ్రహ్మానందానికి సినిమాయేతర వ్యవహారాలతో సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది మాదిరాజు శ్రీనివాసరావు కోర్టుకు నివేదించారు. సినిమా ప్రదర్శన సమయంలో మోహన్‌బాబు పేరు ముందు పద్మశ్రీ ఉపయోగించినందుకు దేనికైనా రెడీ చిత్ర నిర్మాత క్షమాపణ చెబుతూ లేఖ కూడా పంపారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది వి.కృష్ణమోహన్ విన్నవించారు. పేరుకు ముందు పద్మశ్రీ ఉపయోగించడం ఉద్దేశపూర్వకంగా జరగలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఈ విధంగా చేయకూడదని చట్టం నిర్దేశించినపుడు అది తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే’’ అని వ్యాఖ్యానించింది. ఇంతకీ సినిమా నిర్మాత ఎవరని ప్రశ్నించగా.. విష్ణువర్ధన్ అని, ఆయన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అని కృష్ణమోహన్ సమాధానమిచ్చారు. ఈ సంస్థ తరఫున కూడా తానే హాజరవుతున్నానని చెప్పారు. అయితే నిర్మాత తరఫున గజేంద్రనాయుడు అనే వ్యక్తి వకాలత్‌పై సంతకం చేయడాన్ని గుర్తించి, అసలు ఇది ఏ తరహా కంపెనీ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేట్ లిమిటెడ్ అని న్యాయవాది సమాధానమిచ్చారు. ఇటువంటి కంపెనీల్లో సహజంగా కుటుంబసభ్యులే కీలకంగా ఉంటారని, ఈ కంపెనీ కూడా మోహన్‌బాబు కుటుంబానికే సంబంధించినదై ఉంటుందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తామని, ఆ కంపెనీకి సంబంధించి కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్వోసీ) నుంచి వివరాలు తెప్పించుకుం టామని తెలిపింది. మోహన్‌బాబు తదితరులను కోర్టుకు పిలిపించి స్వయంగా విచారిస్తామంది. ‘‘మీ కక్షిదారుల (మోహన్‌బాబు, బ్రహ్మానందం)కు చెప్పండి. వారు పొందిన పద్మశ్రీ అవార్డులను తిరిగి స్వాధీనం చేయూలని. ఇలా చేయడం ద్వారా వారు అవార్డుల హుందాతనాన్ని కాపాడిన వారవుతారు’’ అని న్యాయవాదులతో వ్యాఖ్యానించింది. అవి బిరుదులు కావు: సుప్రీంకోర్టు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు బిరుదులు కాదని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం ఈ నాలుగు అవార్డులు బిరుదులుగా పరిగణించాలా? వద్దా? అనే అంశంపై ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం 1995 డిసెంబర్ 15న తీర్పు వెలువరించింది. ఈ పురస్కారాలను తవు పేర్ల ముందు గానీ, ఇంటి పేర్లుగా గానీ వినియోగించరాదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారు ఆ అవార్డును వెనక్కి ఇచ్చివేయాలని స్పష్టం చేసింది. దీనికన్నా ముందు 1968 ఏప్రిల్ 17న ఈ నాలుగు అవార్డుల జారీకి సంబంధించి కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ అవార్డులను లెటర్హెడ్లు, విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, పుస్తకాలపై ఉపయోగించరాదు. అంతేకాక అవార్డు గ్రహీతలు తమ పేర్లతో కూడా వీటిని కలిపి ఉపయోగించకూడదు. అలా చేస్తే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం’’ అని స్పష్టంగా పేర్కొంది.