గత గురువారం పద్మ అవార్డు వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పద్మ అవార్డు గ్రహీతల్లో ఫ్రాన్స్ మహిళ భారతీయ వస్త్రాలంకరణలో తళుక్కుమన్నారు. అందరీ అటెన్షన్ ఆమె వైపే. చక్కగా సంప్రదాయ ఆకుపచ్చ పట్టు చీరలో భారతీయ మహిళ మాదిరిగా వచ్చి మరీ అవార్డు తీసుకున్నారు. ఆమెను భారతదేశపు నాల్గొవ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీతో సత్కరించారు. ఆ ఫ్రాన్ మహిళ పేరు ఫార్లెట్ చోపిన్. ఇంతకీ ఎవరీ షార్లెట్ చోపిన్ అంటే..
ఫ్రాన్స్‌కు చెందిన షార్లెట్ చోపిన్ యోగా ప్రాక్టీషనర్. ఫ్రాన్‌స్లోని చెర్‌లోని చిన్న పట్టణమైన లేరే నివాసి. ఆమె ఈ యోగాను 50 ఏళ్ల వయసులో నేర్చుకుని సాధించడం ప్రారంభించింది. వయోపరిమితిని లెక్కచేయకగా చాలా అలవోకగా నేర్చుకుని యోగా టీచర్‌గా మారి యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నందుకు గానూ ఆమెకు ఈ పురస్కరం లభించింది.
అంతేగాదు గతేడాది జూలైలో షార్లెట్ చోపిన్ పారిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో యోగాను ప్రోత్సహించేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఆమె యోగా ఆనందాన్ని, సంపూర్ణ శ్రేయస్సును ఎలా ప్రోత్సహిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది కూడా. కాగా గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చోపీన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
Defying age limiting norms by learning #yoga post turning 50, Charlotte Chopin, a 101-year-old Yoga exponent from France receives #PadmaShri from President Droupadi Murmu at the Rashtrapati Bhavan #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/B0QMx2FJ6B
— PIB India (@PIB_India) May 9, 2024
(చదవండి: కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!)
Comments
Please login to add a commentAdd a comment