Yoga teachers
-
జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!
ఫొటోలో కనిపిస్తున్న ఈ బాలుడు ఐదేళ్ల వయసులోనే యోగా గురువు స్థాయికి చేరుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రత్యక్ష్ విజయ్ అతి పిన్న వయసు యోగా గురువుగా, ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. నాలుగేళ్ల వయసు నుంచే ప్రత్యక్ష్ , తన తల్లిదండ్రులతో కలసి యోగా సాధన చేయటం మొదలు పెట్టాడు. రెండువందల గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన ఈ బాలుడు, గత ఏడాది జులై 27న ఆనంద్ శేఖర్ యోగా పాఠశాల నుంచి యోగా గురువు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు. కోర్సు సమయంలో ప్రత్యేక యోగాకు సంబంధించి అనేక మెలకువలను నేర్చుకున్నాడు. యోగాలోని ‘అలైన్మెంట్, అనాటమిక్ ఫిలాసఫీ’ వంటి క్లిష్టమైన అంశాలను నేర్చుకున్నాడు. ప్రత్యక్ష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస గురించి మాత్రమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా అని గ్రహించా’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడు పెద్దలతోపాటు పిల్లలకు కూడా యోగా నేర్పిస్తున్నాడు. ఆన్లైన్లో వర్చువల్ రియాలిటీ క్లాసులు కూడా తీసుకుంటున్నాడు. వీటితోపాటు కొన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నాడు. (చదవండి: కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!) -
యోగా టీచర్‌పై లైంగిక దాడి.. హత్యకు సుపారీ
గౌరిబిదనూరు: యోగా టీచర్ హత్యకు సుపారీ తీసుకున్న నిందితులు ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు నటించడంతో చనిపోయిందని భావించి గుంతలో పడేసి వెళ్లారు. బాధితురాలు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. చిక్కబళ్లాపురం పోలీసులు గురువారం వివరాలు వెల్లడించారు. బెంగుళూరులోని కేఆర్ పురకు చెందిన ఓ మహిళ తన భర్తతో విభేదించి విడిగా ఉంటోంది.యోగా నేర్పుతూ జీవనం సాగిస్తోంది. ఆమెతో సంతోష్ అనే వ్యక్తి సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సంతోష్ భార్య సింధు అనుమానించింది. యోగా టీచర్‌ను హత్య చేయాలని డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న సతీశ్‌రెడ్డికి రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చింది. సతీశ్‌రెడ్డి టీచర్‌తో పరిచయం చేసుకున్నాడు. తాను మాజీ సైనికుడినని, రైఫిల్ షూటింగ్ నేర్పుతానని చెప్పి కారులో తీసుకెళ్లి స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. తొలుత ఒక పర్యాయం లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ దాడికి యత్నిస్తుండగా ఎలాగైనా వారి నుంచి తప్పించుకోవాలని భావించిన బాధితురాలు తాను యోగాలో నేర్చుకున్న విద్య ద్వారా శ్వాసను బంధించింది. శ్వాస లేకపోవడంతో ఆమె చనిపోయిందని భావించి శిడ్లఘట్ట వద్ద ధనమిట్నహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గుంతలో పడేశారు. శరీరంపై చెట్లు వేసి ఉడాయించారు. అర్ధరాత్రి సమయంలో ఆమె నాలుగు కిలోమీటర్లు నడిచి ధనమిట్నహళ్లి చేరుకొని అక్కడి వారి సహయాంతో చిక్కబళ్ళాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి నిందితులు సతీశ్‌రెడ్డి, నాగేంద్రరెడ్డి, రమణారెడ్డి, రవిచంద్ర, రవితోపాటు సుపారీ ఇచ్చిన సింధును అరెస్ట్ చేశారు. -
Charlotte Chopin: యోగవికాసానికి పద్మ పురస్కారం!
నూటొక్క వసంతాలను చూసిన చార్లోట్ చోపిన్ ఈ ఏడాది మే నెలలో మనదేశం అందించే అత్యున్నత పద్మపురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పుట్టి వందేళ్లు దాటింది. నిజమే, 1922, డిసెంబర్ 11వ తేదీన ఫ్రాన్స్‌లోని చేర్ పట్టణంలో పుట్టారామె. యాభై ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక రుగ్మతలకు సమాధానంగా యోగసాధన ప్రారంభించారు చార్లోట్. అప్పటి నుంచి ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని అంతటితో సంతృప్తి చెందలేదామె. యోగసాధన గురించి ప్రపంచానికి తెలియచేయాలని కంకణం కట్టుకున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందానికి, ఆహ్లాదకరమైన జీవనానికి యోగసాధనను మించినది మరొకటి లేదని వర్క్‌షాప్‌లు పెట్టి అవగాహన కల్పించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకుంటున్న చార్లోట్ చోపిన్ఫ్రాన్స్లో పరిమళించిన మనప్రాచీన విద్య..చార్లోట్ 1982 లో చేర్ పట్టణం నుంచి యోగసాధన పట్ల అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. యోగసాధన వల్ల లభించే ప్రయోజనాలను వివరిస్తూ, యోగసాధన నేరి్పస్తూ ఫ్రాన్స్ మొత్తం పర్యటించారామె. ఫ్రెంచ్ టీవీలో ‘ఫ్రాన్స్ గాట్ ఇన్క్రెడిబుల్ టాలెంట్’ ్రపోగ్రామ్ ద్వారా దేశమంతటా యోగ విద్యను విస్తరింపచేశారు. ఆమె తాను నివసిస్తున్న చేర్ పట్టణంలో స్వయంగా వేలాది మందికి నేరి్పంచారు. దేశవిదేశాల్లో యోగవిద్య విస్తరించడానికి ఆమె విశేషమైన కృషి చేశారు.ప్రాచీనమైన యోగవిద్య మనికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఏకైకమార్గమని ప్రపంచానికి చాటారు చార్లోట్. యోగసాధనకు వయసుతో సంబంధం లేదని, అందుకు తానే పెద్ద నిదర్శనమని అనేక సందర్భాల్లో చె΄్పారామె. తన ఆరోగ్య రహస్యం యోగసాధన అని 2024, మే, 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సందర్భంగా కూడా చె΄్పారు చార్లోట్ చోపిన్.ఇవి చదవండి: Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె -
101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!
గత గురువారం పద్మ అవార్డు వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పద్మ అవార్డు గ్రహీతల్లో ఫ్రాన్స్ మహిళ భారతీయ వస్త్రాలంకరణలో తళుక్కుమన్నారు. అందరీ అటెన్షన్ ఆమె వైపే. చక్కగా సంప్రదాయ ఆకుపచ్చ పట్టు చీరలో భారతీయ మహిళ మాదిరిగా వచ్చి మరీ అవార్డు తీసుకున్నారు. ఆమెను భారతదేశపు నాల్గొవ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీతో సత్కరించారు. ఆ ఫ్రాన్ మహిళ పేరు ఫార్లెట్ చోపిన్. ఇంతకీ ఎవరీ షార్లెట్ చోపిన్ అంటే..ఫ్రాన్స్‌కు చెందిన షార్లెట్ చోపిన్ యోగా ప్రాక్టీషనర్. ఫ్రాన్స్‌లోని చెర్లోని చిన్న పట్టణమైన లేరే నివాసి. ఆమె ఈ యోగాను 50 ఏళ్ల వయసులో నేర్చుకుని సాధించడం ప్రారంభించింది. వయోపరిమితిని లెక్కచేయకగా చాలా అలవోకగా నేర్చుకుని యోగా టీచర్‌గా మారి యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నందుకు గానూ ఆమెకు ఈ పురస్కరం లభించింది. అంతేగాదు గతేడాది జూలైలో షార్లెట్ చోపిన్ పారిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో యోగాను ప్రోత్సహించేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఆమె యోగా ఆనందాన్ని, సంపూర్ణ శ్రేయస్సును ఎలా ప్రోత్సహిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది కూడా. కాగా గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చోపీన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. Defying age limiting norms by learning #yoga post turning 50, Charlotte Chopin, a 101-year-old Yoga exponent from France receives #PadmaShri from President Droupadi Murmu at the Rashtrapati Bhavan #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/B0QMx2FJ6B— PIB India (@PIB_India) May 9, 2024 (చదవండి: కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!) -
Hansaji Yogendra: వయసు 76..ఉత్సాహం 16
మన దేశంలో యోగా గురువులంటే పురుషులే కనిపిస్తుంటారు. కాని హన్సా యోగేంద్ర యోగా గురువుగా చేసిన కృషి ఎవరికీ తక్కువ కానిది. ముఖ్యంగా వయోవృద్ధులలో నైరాశ్యం తొలగి జీవన ఉత్సాహం ఏర్పడాలంటే ఏం చేయాలో ఆమె వీడియో పాఠాల ద్వారా తెలియచేస్తుంది. ఆలోచన, ఆహారం, ఆరోగ్యం ఈ మూడింటికీ మార్గదర్శి హన్సా యోగేంద్ర. ముందు మనం హన్సా యోగేంద్ర రోజువారీ జీవితం చూద్దాం. ఆమె ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తారు. కాసేపు మంచం మీదే పవన ముక్తాసన వంటి ఒకటి రెండు ఆసనాలు వేస్తారు. కొన్ని నిమిషాల ప్రాణాయామం చేస్తారు. ఓంకార ధ్వని చేస్తారు. ‘ఇది సృష్టిలోని శక్తిని మీకు అనుసంధానిస్తుంది’ అంటారు. అప్పుడు ‘మార్నింగ్ డ్రింక్’ తాగుతారు. అంటే టీ, కాఫీ కాదు. రాత్రంతా వెండిగ్లాసులో ఉంచిన నీటిని కాచి దానిలో ఉసిరి, అల్లం, మిరియాలు, పసుపు, అశ్వగంధ మిశ్రమాల ΄పొడిని కొద్దిగా కలిపి కాస్త నిమ్మకాయ పిండి ఆ కషాయాన్ని తీసుకుంటారు. ‘ఇది జఠరాగ్నికి చాలా మంచిది’ అంటారామె. ఆ తర్వాత కాసేపు మత్సా్యసనం, భుజంగాసనం, శలభాసనం వేస్తారు. సరిగ్గా 8.30 అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం అంటే రాత్రి నానబెట్టిన డ్రైఫ్రూట్స్. చివరలో పాలు. ఆ తర్వాత ఆమె యోగా వీడియోలు రికార్డు చేస్తారు. లేదంటే తమ మానసిక శారీరక బాధలు చెప్పుకోవడానికి వచ్చే అనుయాయుల సమస్యలు విని కౌన్సెలింగ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనంలో ఒక రోటీ, పప్పు, ఏదైనా కూర. ‘నేను భోజన బల్ల మీద నీళ్ల గ్లాస్ పెట్టుకోను. మజ్జిగ గ్లాసు పెట్టుకుంటాను. నీళ్ల కంటే మజ్జిగ మన జీర్ణక్రియకు మంచిది’ అంటారామె. ఆ తర్వాత పనిలో పడతారు. సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తారు. ఉడకబెట్టిన పప్పులేవైనా తీసుకుంటారు. రాత్రి సూప్‌తోపాటు, ఇడ్లీ సాంబార్ లాంటివి భుజిస్తారు. రాత్రి సరిగ్గా 10.30కు నిద్ర ΄ోతారు. ‘జీవితం ప్రశాంతంగా గడవాలంటే సిస్టమేటిక్‌గా ఉండాలి’ అంటారామె. యోగా గురువు హన్సా యోగేంద్ర ముంబైలో పుట్టి పెరిగింది. చిన్న వయసులోనే యోగా పట్ల ఆకర్షితురాలైంది. బిఎస్సీ, ఎల్ఎల్బీ చేసినా మనసు యోగా వైపుకు లాగడంతో ప్రఖ్యాత యోగా గురువు యోగేంద్ర స్థాపించిన ‘ది యోగా ఇన్స్టిట్యూట్’కు తరచూ వెళ్లేది. అక్కడే ఆమె యోగేంద్ర కుమారుడు జయదేవ యోగేంద్ర దగ్గర యోగా నేర్చుకుంది. ఆ తర్వాత జయదేవను వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఆమెవైపు పెద్దలు అంగీకరించలేదు. కాని తన జీవితాన్ని యోగాకు అంకితం చేయాలన్న నిశ్చయంతో ఆమె జయదేవను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి యోగా కేంద్రాన్ని వృద్ధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె 76 సంవత్సరాలు. గత ముప్పై, నలభై ఏళ్లలో ఆమె సంస్థ ద్వారా తయారైన యోగా టీచర్లు, ఆమె ద్వారా కనీసం లక్షమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇవాళ ఆమె చేసే వీడియోలు లక్షల్లో చూస్తున్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఉత్తమ మార్గం అంటారామె. అలవాట్లు.. ఆలోచనలు ఆలవాట్లు. ఆలోచనల మీద నియంత్రణ అన్నది జీవితాన్ని అదుపులో ఉంచుతుందని అంటారు హన్సా. అర్థవంతంగా జీవించడం ప్రతి ఒక్కరి అవసరం అని చెబుతారు. విపరీతమైన పరుగులాట, వేళకాని వేళ భోజనం, వేళకాని వేళలో నిద్ర... ఇవి జీవితానికి, ఆరోగ్యానికి ప్రధాన శత్రువులంటారామె. ఇవే అనవసర వృద్ధా΄్యాన్ని తెస్తున్నాయని అంటారు. ప్రకృతిలో దొరికే అందరికీ తెలిసిన పదార్థాలతోనే అకాల వృద్ధా΄్యాన్ని నిరోధించవచ్చంటారు. కాఫీ, టీ వంటివి కూడా శరీరానికి అక్కర్లేదని అవి అలవాటుగా మారి నాడీ వ్యవస్థను డీలా పరుస్తాయంటారు. ‘ఐదు ముఖ్యమైన ఉదయపు అలవాట్లు’,‘మంచినీరు తాగాల్సిన పద్ధతి’, ‘ప్రతి స్త్రీ వేయాల్సిన ఐదు ఆసనాలు’, ‘స్నానం చేయాల్సిన పద్ధతి’,‘ఎలాంటి ఆహారం తీసుకోవాలి’, ‘జబ్బులు రానివ్వని ఐదు ముద్రలు’... ఆమె చేసిన ఇలాంటి వీడియోలన్నీ పెద్దఎత్తున ఆదరణ ΄పొందాయి. సాత్విక ఆహారం గురించి ‘ది సాత్విక్ కిచెన్’ అనే పుస్తకం రాశారామె. ‘ఆ«ధ్యాత్మికత, ఆసనాలు మన జీవితానికి మార్గం చూపుతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆధ్యాత్మికంగా మీ బలహీనతలను జయించండి’ అంటారు హన్సా. ‘జీవితం విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండి రిస్క్ తీసుకునైనా నిజాయితీగా ΄ోరాడితే జీవితం కచ్చితంగా మీకు సంతోషాలనే ఇస్తుంది. జీవితాన్ని అనవసర జంజాటాల్లో పడేయకండి’ అంటారామె. హన్సా కుమారుడు రిషి జయదేవ్ యోగేంద్ర కూడా యోగ సాధనలో ఉన్నాడు. ‘అతన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అంటారామె. -
వందేళ్ల ఫ్రాన్స్ బామ్మగారికి పద్మశ్రీ!
యోగా అనేది మన దేశానికి చెందినది. అయితే మన దేశంలో కూడా అంతలా శ్రద్ధగా చేసేవాళ్లు తక్కువే. యోగా చేస్తున్న అతి పెద్ద వయసు వృద్ధులు లేరు కూడా. కానీ ఫ్రాన్స్‌కి చెందిన ఓ బామ్మ మాత్రం అతి పెద్ద వయసు యోగా టీచర్. ఆమె ఫ్రాన్స్‌లో యోగా విప్లవాన్నే తీసుకొచ్చి ఎనలేని కృషి చేసింది. అందుకుగానే భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్న పురస్కారం ఆమెను పద్శ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నలుగురు ఫ్రెంచ్ జాతీయులకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. వారిలో ఈ బామ్మ కూడా ఉన్నారు. గతేడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడూ తొలిసారిగా పారిస్‌లో షార్లెట్ చాపిన్ను కలిశారు. ఆమె చాలా చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్దావిడి అంతలా ఎలా చలాకీగా ఉన్నారని ఆరా తీశారు మోదీ. అప్పుడే తెలిసింది మోదీకి ఆమె ఒక యోగా గురవని. ఈ విషయాన్నే ఆయన మనకీబాత్‌లో ప్రస్తావిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ చాపిన్ ఈ యోగా విద్య ఎలా నేర్చుకుందో వింటే ఆశ్చర్యపోతారు. ఆమెకు ఏడేళ్ల వయసులో భారత్‌కు వచ్చినప్పుడూ ఈ యోగా విద్య గురించి తెలిసుకుందంట. అక్కడ కొందరూ మగపిల్లలు ఈ యోగాసనాలు వేయడం చూసి, తాను అలా వేయగలనా? అని మనసులోనే అనుకుందట ఆ బామ్మ. అయితే ఆమె తర్వాత ఫ్రాన్స్ వెళ్లిపోవడంతో...ఆ ఆసనాల సంగతి మర్చిపోయి బాల్ రూమ్ డ్యాన్సర్‌గా కెరియర్ని మొదలుపెట్టింది. ఈ డ్యాన్స్‌ని చేసేటప్పుడు అయిన గాయాల వల్ల మూడుసార్లు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలను చేయించుకుంది. వాటి నుంచి కోలుకొనే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాని తిరిగి 50 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ‘అప్పట్నుంచీ యోగమార్గమే నా జీవితం అయ్యింది. యాభై ఏళ్లుగా నేను చేస్తూ, ఎంతో మందితో చేయిస్తున్నా. లెక్కల ప్రకారం చూస్తే నాకిప్పుడు వందేళ్లు. కానీ పాతికేళ్లే అనుకుంటారు. యోగావల్లనే ఆ హుషారు, ఉత్సాహం’ అనే చాపిన్ ఫ్రాన్స్‌లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు. అంతేగాదు ఆమె పలు టీవీ షోలు కూడా చేస్తున్నారు. ఈ యోగాసనాలతో గిన్నిస్ రికార్డునీ కూడా సొంతం చేసుకున్నారు. వయసు మీరడం వల్ల ఆమె మాట ముద్దగా ఉంటుందేమో కానీ... ఆమె వేసే యోగాసనాల్లో మాత్రం వణుకూ లేకపోవడం విశేషం. ఇక మోదీ ఆమెను చూసి యోగా కేవలం పశ్చిమ దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలకు చేరుకుంటుంది. అది కేవలం షార్లెట్ వంటి వారి కృషి వల్లే జరుగుతుందంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు మోదీ. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
వివాదంలో యోగ గురువు రాందేవ్ బాబా
-
గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్‌స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు..
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/తూర్పుగోదావరి: ప్రతాప్‌సింగ్.. ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్.. షార్ప్ కిల్లర్ కూడా. జైలు జీవితం అతడిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. పరివర్తన చెందిన అతడు ఇప్పుడు యోగా గురువుగా మారి ఎందరికో యోగా నేర్పుతూ.. తనలా ఎవరూ కాకూడదనే సందేశాన్ని ఇస్తున్నాడు. అతడి గతాన్ని పరికిస్తే.. ఉత్తరాఖండ్‌లోని ఫితోడ్ గఢ్ గ్రామంలోని ఉన్నత కుటుంబంలో జన్మిచాడు ప్రతాప్‌సింగ్. తండ్రి ఆర్మీ అధికారి. అన్న కూడా ఆర్మీలో చేరి అధికారి స్థాయికి ఎదిగాడు. తాను కూడా ఆర్మీలో చేరాలని ప్రతాప్‌సింగ్ కలలుకన్నా నెరవేరలేదు. చదవండి: అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం పోలియో వల్ల వచ్చిన అవిటితనం కారణంగా కలని నెరవేర్చుకోలేకపోయాడు. దానికి తోడు సవితి తల్లి సూటిపోటి మాటల్ని భరించలేక ఇంటినుంచి పారిపోయి చిన్నతనంలోనే ఢిల్లీ చేరుకున్నాడు. ఓ గ్యాంగ్‌స్టర్ వద్ద చేరి 15 సంవత్సరాలకే దోపిడీలు, కిడ్నాప్‌లు చేశాడు. ప్రతాప్ సింగ్ గ్యాంగ్ ఆగడాల కారణంగా ఢిల్లీ కల్యాణ్‌పూర్‌లో అడుగుపెట్టాలంటే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎవరినైనా చంపాలనుకుని సుపారీ తీసుకుంటే వారికి చావు మూడినట్టే. అతీ సమీపానికి వెళ్లి గురి చూసి కాల్చి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తరువాతే ఆ గ్యాంగ్ అక్కడ నుంచి వెళ్తుందనే పేర్కొంది. జైలులోనే పరివర్తన పదహారు హత్య కేసులతో సంబంధం ఉన్న ప్రతాప్‌సింగ్ ఏలూరు జిల్లా పినకడిమిలో జరిగిన హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 2017లో ఖైదీలలో పరివర్తన తీసుకుని రావడానికి ప్రణవ సంకల్ప సమితి ఆధ్వర్యంలో యోగా నేర్పించారు. అందులో ఇంటర్మీడియెట్, టెన్త్ చదివిన 30 మందిని ఎంపిక చేశారు. 6వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ప్రతాప్‌సింగ్ తాను యోగా నేర్చుకుంటానని పట్టుపట్టడంతో అతడికీ యోగా నేర్పించారు. 9 నెలల శిక్షణలో ధ్యానం, జపం నేర్చుకుని పరివర్తన చెందాడు. చెడు మార్గాన్ని వీడి నూతన జీవితం వైపు ప్రయాణిస్తానని, తిరిగి ఎప్పుడూ అటూవైపు వెళ్లనని దృఢంగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే శిక్షా కాలం పూర్తయ్యాక నలుగురికీ యోగా నేర్పుతూ అదర్శప్రాయంగా ఉంటున్నాడు. గుంటూరులో కలెక్టర్ తన యోగా విన్యాసాలను చూసి మెచ్చుకున్నారని.. తాను గ్యాంగ్‌స్టర్‌ని అయినా.. తనలో వచ్చిన మార్పు చూసి కలెక్టర్ మెచ్చుకోవడం కంటే సంతృప్తి తనకు ఏముంటుందని ప్రతాప్‌సింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అనర్థాలను వివరిస్తూ.. ఇప్పుడు యోగా శిక్షకుడుగా పలువురికి యోగా నేర్పుతూ తనలా ఎవరి జీవితం చీకటి కోణంలోకి వెళ్లకూడదని ప్రతాప్‌సింగ్ హితవు చెబుతున్నాడు. యోగాతోపాటు చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పలువురిలో పరివర్తన తీసుకొస్తున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ రాజమహేంద్రవరంలోని అనం కళా కేంద్రంలో మంగళవారం ప్రణవ యోగ సంకల్ప సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. ఇదే కార్యక్రమంలో ప్రతాప్‌సింగ్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్ సన్మానించారు. -
చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు
స్వామి కువలయానంద ప్రసిద్ధ యోగా గురువు. ఆయన అసలు పేరు జగన్నాథ గణేశ గుణే. 1883 ఆగస్టు 30న జన్మించారు. ఆయన యోగా గురువు మాత్రమే కాదు. యోగా పరిశోధకులు కూడా. కువలయానంద ప్రధానంగా యోగా శాస్త్రీయ పునాదులపై తన మార్గదర్శక పరిశోధనకు పేర్గాంచారు. 1920లో యోగాపై పరిశోధన ప్రారంభించి, 1924లో యోగా అధ్యయనం కోసం ‘యోగా మీమాంస’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. స్వామి కువలయానంద గుజరాత్ రాష్ట్రంలోని ధబోయ్ గ్రామంలో సంప్రదాయ కర్హడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కువలయానంద తండ్రి శ్రీ గణేశ గుణే ఉపాధ్యాయులు. తల్లి సరస్వతి గృహిణి. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలపై వారు కొంతకాలం ఆధారపడవలసి వచ్చింది. కువలయానంద చదువు కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన 1903లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులయ్యారు. బరోడా కాలేజీలో చదువుకోవడానికి స్కాలర్షిప్ పొందారు. కువలయానంద విద్యార్థి రోజుల్లో శ్రీ అరబిందో, లోకమాన్య తిలక్ వంటి రాజకీయ నాయకుల వల్ల ప్రభావితమయ్యారు. ఆయన జాతీయ భావవాదం, దేశభక్తి ఉద్వేగం ఆయన తన జీవితాన్ని మానవాళి సేవకు అంకితం చేయడానికి ప్రేరేపించాయి. ఈ సమయంలోనే జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేందుకు ప్రతిజ్ఞను తీసుకున్నాడు. 1916 నుండి 1923 వరకు ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు భారతీయ సంస్కృతిపై పాఠాలు బోధించారు. అందులో యోగా అంతర్లీనమై ఉండేది. యోగాలో కువలయానంద మొదటి గురువు బరోడాలోని జుమ్మదాడ వ్యాయామశాల ప్రొఫెసర్ రాజారత్న మాణిక్‌రావు. 1919లో కవలయానంద నర్మదా నది ఒడ్డున బరోడా సమీపంలోని మల్సార్లో స్థిరపడిన బెంగాలీ యోగి పరమహంస మాధవదాస్ను కలిశారు. మాధవదాస్ మార్గదర్శకత్వంలో కువలయానందకు యోగా క్రమశిక్షణ అలవడింది. కువలయానంద ఆధ్యాత్మికంగా ఆదర్శవాది అయినప్పటికీ, అదే సమయంలో కఠినమైన హేతువాది. కాబట్టి యోగా ప్రభావాల శాస్త్రీయతలపై పరిశోధనలు జరిపారు. 1930ల నాటికే కువలయానంద భారతదేశంలో యోగావంటి శారీరక విద్యను వ్యాప్తి చేయడానికి ఒక మార్గంగా యోగా ఉపాధ్యాయుల సమూహాలకు శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర యోగాలో శిక్షణ పొందిన వారిలో జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకరు! 1929 లో నెహ్రూ కువలయానందను కలవడం జరిగింది. ఆయనతో పరిచయం ఆయ్యాకే నెహ్రూకు యోగాపై గురి ఏర్పడింది. 1931 నుంచీ నెహ్రూ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ వచ్చారు. కువలయానంద తన 82 ఏళ్ల వయసులో 1966 ఏప్రిల్ 18న మరణించారు. (చదవండి: సామ్రాజ్య భారతి.. 1876/1947) -
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి
ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదితా జోషి ఒకప్పుడు డిస్క్–సర్వికల్ స్పాండిలోసిస్‌తో 8 ఏళ్లు మంచం పట్టింది. వీల్‌చైర్‌లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. కాని యోగా మహా గురువు అయ్యంగార్ ఆమెను కేవలం ఒక సంవత్సరకాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది. ఆమె పరిచయం... యోగా అవసరం... ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. కాని మంచి ఆరోగ్యం అనేది యోగా వల్ల వచ్చే ఒక ఫలితం మాత్రమే. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’ అంటుంది నివేదితా జోషి. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఆమె యోగా కేంద్రం ‘యోగక్షేమ’ ఎప్పుడూ యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు. కాని నివేదితా జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగార్ యోగ. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు బి.కె.ఎస్ అయ్యంగార్ ప్రియ శిష్యురాలు నివేదితా. మహా మహా మొండి సమస్యలను కూడా అయ్యంగార్ యోగా ద్వారా జయించవచ్చు అని గురువుకు మల్లే నిరూపిస్తోందామె. తానే ఒక పేషెంట్‌గా వెళ్లి అలహాబాద్‌లో పుట్టి పెరగిన నివేదితా జోషి సీనియర్ బిజెపి నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో 3 గంటల పాటు పూజలో కూచొని లేవలేకపోయింది. ఆ రోజుల్లో ఎంఆర్ఐలు లేవు. డాక్టర్ మజిల్ వీక్నెస్ అని భావించాడు. నిజానికి ఆమెకు వచ్చిన సమస్య స్లిప్డ్ డిస్క్. ఆ సమస్య ఆమెను వదల్లేదు. బాధ పడుతూనే మైక్రోబయాలజీ చేసింది. మైక్రోబయాలజిస్ ్టగా కెరీర్ మొదలెట్టే సమయానికి ఇక పూర్తిగా కదల్లేని స్థితికి వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 27 సంవత్సరాలు. ‘నా చేతులతో నేను జుట్టు కూడా ముడి వేసుకోలేకపోయేదాన్ని’ అందామె. తీవ్రమైన డిప్రెషన్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఎవరో పూణెలోని అయ్యంగార్ యోగా కేంద్రం గురించి చెప్పారు. ‘నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా సమస్యను చెప్పలేదు. నా రిపోర్టులు చూపించలేదు. కాని కంఠం దగ్గర ఉన్న నా చర్మం ధోరణిని బట్టి ఆయన నాకున్న సమస్య ఏమిటో ఇట్టే చెప్పేశారు. రేపటి నుంచే పని మొదలెడుతున్నాం అన్నారు.’ అందామె. ఆ తర్వాత అయ్యంగార్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ కఠోరంగా ఆసనాలు సాధన చేయించారు. మామూలుగా యోగాలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే అన్ని ఆసనాలు వేయగలరు. కాని అయ్యంగార్ యోగాలో ఏ శారీరక ఇబ్బంది ఉన్నా కొన్ని వస్తువుల, ఉపకరణాల సాయం తో ప్రతి ఆసనం వేయొచ్చు. అలా కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న నివేదితాతో అన్ని ఆసనాలు వేయిస్తూ కేవలం సంవత్సర కాలంలో ఆమెను కాళ్ల మీద నిలబెట్టాడాయన. ఒక రకంగా ఇది మిరాకిల్. అద్భుతం. అందుకే నివేదితా యోగాకే తన జీవితం అంకితం చేసింది. మరో 18 ఏళ్ల పాటు అయ్యంగార్‌కు శిష్యరికం చేసింది. ‘నా పేరుతో నువ్వు ఢిల్లీలో అధికారిక యోగా కేంద్రం తెరువు’ అని అయ్యంగార్ చేతే ఆమె చెప్పించుకోగలింది. గురువు చేతుల మీదుగానే 2008లో ఢిల్లీలో ‘యోగక్షేమ’ కేంద్రాన్ని తెరిచింది. నిద్ర – మెలుకువ ‘ఇవాళ్టి రోజుల్లో యువతీ యువకులు అనారోగ్య బారిన పడటానికి కారణం వారు నిద్ర పోవాల్సిన టైమ్‌లో నిద్రపోయి మేల్కొనాల్సిన టైములో మేల్కొనకపోవడం. దానివల్ల బాడీ క్లాక్ దెబ్బ తింటుంది. చేసే క్రియలన్నీ తప్పి జబ్బులొస్తాయి’ అంటుంది నివేదితా. ఆ అలవాటు సరి చేసుకోకుండా యోగా చేస్తే ఉపయోగం లేదంటుంది ఆమె. నివేదితా తన దగ్గరకు వచ్చే వారిలో నిద్రలేమి సమస్యలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు, అశాంతి, డిప్రెషన్, మానసిక సమస్యలు... వీటన్నింటిని యోగా ద్వారా అదుపులోకి తెస్తోంది. ‘మీ శరీరం ఒక దిక్కు మనసు ఒక దిక్కు ఉంటే ఎలా? శరీరం మనసు ఒక సమతలంలోకి రావాలి. అప్పుడే ఆరోగ్యం. ధ్యానం చాలా అవసరం. అది మనసును శుభ్రపరుస్తుంది’ అంటుందామె. మానవత్వం కోసం యోగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022’కు థీమ్‌గా ‘మానవత్వం కోసం యోగా’ ఎంచుకున్నారు. మానవత్వం కోసం యోగా ఎలా? జగాన ఈ కసి, పగ, శతృత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్‌లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంత పరిచేదే, దాని అలజడిని తగ్గించేది, ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతివైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగసాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. ‘అయితే యోగా అంటే గుడ్డిగా చేయడం కాదు. ఏ వరుసలో ఆసనాలు వేయాలి, ఎంతసేపు ఆసనాలు వేయాలి అనేది ప్రధానం. మీరు సరైన ఫలితాలు పొందాలంటే ఈ రెండూ జాగ్రత్తగా తెలుసుకోండి. లేకుంటే మీ శ్రమ వృధా’ అంటుందామె. యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగసాధకులవుదామని కోరకుందాం. -
యోగా కోసం వెళితే.. శృంగారం చేయాలని..
డెహ్రాడూన్ : యోగా నేర్చుకోవటానికి వచ్చిన ఓ జపాన్ మహిళపై లైగింక వేధింపులకు పాల్పడి జైలు పాలయ్యారు ముగ్గురు యోగా గురువులు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జపాన్‌కు చెందిన మహిళ రిషీకేశ్‌లో ఉంటూ అక్కడి ఆమ్‌బాగ్ ఏరియాలోని యోగా స్కూల్లో యోగా నేర్చుకుంటోంది. యోగా స్కూల్లో పనిచేస్తున్న ముగ్గురు గురువులు హరిక్రిష్ణ, చంద్రకాంత్, సోమ్‌రాజ్‌లు ఆమెపై కన్నేశారు. తరచు ఆమెను లైంగికంగా వేధించేవారు. తమతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చేవారు. దీంతో విసుగు చెందిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. శనివారం ముని కీ రేతి పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఆదివారం నాడు వారి స్వగృహాలలో అదుపులోకి తీసుకున్నారు. చదవండి : ఓరిస్, చెట్నీస్ రెస్టారెంట్స్ పేరుతో.. -
ప్రభుత్వాసుపత్రుల్లో యోగా టీచర్లు
* పీహెచ్సీ నుంచి బోధనాసుపత్రుల వరకూ నియామకాలు * కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ యోచన.. త్వరలోనే మార్గదర్శకాలు * 2 రాష్ట్రాల్లో 2,000 మంది టీచర్లు అవసరం సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో యోగా గురువులను నియమించాలని కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని బట్టి యోగా గురువులను నియమించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యోగా కోర్సులను ఏఏ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి, వాటికి తగిన గుర్తింపు ఉందా లేదా వంటి వివరాలను కేంద్ర ఆయుష్ విభాగం సేకరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా టీచర్ల నియామకాలపై త్వరలోనే అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక నిపుణుల కమిటీని నియమిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనికోసం ఢిల్లీలో ఓ ఆయుష్ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అయితే యోగా టీచర్ల సౌలభ్యాన్ని బట్టి నియామకాలు దశల వారీగా చేపట్టాలని ఆయుష్ విభాగం భావిస్తోంది. పడకల సామర్థ్యాన్ని బట్టి యోగా టీచర్లను నియమించాలా లేదా ఔట్ పేషెంట్ రోగుల సామర్థ్యాన్ని బట్టి నియామకాలు చేయాలా అన్నది నిర్ణయించాలి. కాగా, తెలంగాణ, ఏపీలలో 1,700కి పైగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 300కి పైగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 60 ఏరియా ఆస్పత్రులు, 18 బోధనాసుపత్రులు ఉన్నాయి. సుమారు 2వేల మందికిపైగా యోగా టీచర్లు అవసరమవుతారు. దీనిపై త్వరలోనే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది.