నూటొక్క వసంతాలను చూసిన చార్లోట్ చోపిన్ ఈ ఏడాది మే నెలలో మనదేశం అందించే అత్యున్నత పద్మపురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పుట్టి వందేళ్లు దాటింది. నిజమే, 1922, డిసెంబర్ 11వ తేదీన ఫ్రాన్స్‌లోని చేర్ పట్టణంలో పుట్టారామె. యాభై ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక రుగ్మతలకు సమాధానంగా యోగసాధన ప్రారంభించారు చార్లోట్. అప్పటి నుంచి ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.
తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని అంతటితో సంతృప్తి చెందలేదామె. యోగసాధన గురించి ప్రపంచానికి తెలియచేయాలని కంకణం కట్టుకున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందానికి, ఆహ్లాదకరమైన జీవనానికి యోగసాధనను మించినది మరొకటి లేదని వర్క్‌షాప్‌లు పెట్టి అవగాహన కల్పించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకుంటున్న చార్లోట్ చోపిన్
ఫ్రాన్స్‌లో పరిమళించిన మనప్రాచీన విద్య..
చార్లోట్ 1982 లో చేర్ పట్టణం నుంచి యోగసాధన పట్ల అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. యోగసాధన వల్ల లభించే ప్రయోజనాలను వివరిస్తూ, యోగసాధన నేరి్పస్తూ ఫ్రాన్స్ మొత్తం పర్యటించారామె. ఫ్రెంచ్ టీవీలో ‘ఫ్రాన్స్ గాట్ ఇన్‌క్రెడిబుల్ టాలెంట్’ ్రపోగ్రామ్ ద్వారా దేశమంతటా యోగ విద్యను విస్తరింపచేశారు. ఆమె తాను నివసిస్తున్న చేర్ పట్టణంలో స్వయంగా వేలాది మందికి నేరి్పంచారు. దేశవిదేశాల్లో యోగవిద్య విస్తరించడానికి ఆమె విశేషమైన కృషి చేశారు.
ప్రాచీనమైన యోగవిద్య మనికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఏకైకమార్గమని ప్రపంచానికి చాటారు చార్లోట్. యోగసాధనకు వయసుతో సంబంధం లేదని, అందుకు తానే పెద్ద నిదర్శనమని అనేక సందర్భాల్లో చె΄్పారామె. తన ఆరోగ్య రహస్యం యోగసాధన అని 2024, మే, 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సందర్భంగా కూడా చె΄్పారు చార్లోట్ చోపిన్.
ఇవి చదవండి: Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె
Comments
Please login to add a commentAdd a comment