Charlotte
-
Charlotte Chopin: యోగవికాసానికి పద్మ పురస్కారం!
నూటొక్క వసంతాలను చూసిన చార్లోట్ చోపిన్ ఈ ఏడాది మే నెలలో మనదేశం అందించే అత్యున్నత పద్మపురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పుట్టి వందేళ్లు దాటింది. నిజమే, 1922, డిసెంబర్ 11వ తేదీన ఫ్రాన్స్‌లోని చేర్ పట్టణంలో పుట్టారామె. యాభై ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక రుగ్మతలకు సమాధానంగా యోగసాధన ప్రారంభించారు చార్లోట్. అప్పటి నుంచి ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని అంతటితో సంతృప్తి చెందలేదామె. యోగసాధన గురించి ప్రపంచానికి తెలియచేయాలని కంకణం కట్టుకున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందానికి, ఆహ్లాదకరమైన జీవనానికి యోగసాధనను మించినది మరొకటి లేదని వర్క్‌షాప్‌లు పెట్టి అవగాహన కల్పించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకుంటున్న చార్లోట్ చోపిన్ఫ్రాన్స్లో పరిమళించిన మనప్రాచీన విద్య..చార్లోట్ 1982 లో చేర్ పట్టణం నుంచి యోగసాధన పట్ల అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. యోగసాధన వల్ల లభించే ప్రయోజనాలను వివరిస్తూ, యోగసాధన నేరి్పస్తూ ఫ్రాన్స్ మొత్తం పర్యటించారామె. ఫ్రెంచ్ టీవీలో ‘ఫ్రాన్స్ గాట్ ఇన్క్రెడిబుల్ టాలెంట్’ ్రపోగ్రామ్ ద్వారా దేశమంతటా యోగ విద్యను విస్తరింపచేశారు. ఆమె తాను నివసిస్తున్న చేర్ పట్టణంలో స్వయంగా వేలాది మందికి నేరి్పంచారు. దేశవిదేశాల్లో యోగవిద్య విస్తరించడానికి ఆమె విశేషమైన కృషి చేశారు.ప్రాచీనమైన యోగవిద్య మనికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఏకైకమార్గమని ప్రపంచానికి చాటారు చార్లోట్. యోగసాధనకు వయసుతో సంబంధం లేదని, అందుకు తానే పెద్ద నిదర్శనమని అనేక సందర్భాల్లో చె΄్పారామె. తన ఆరోగ్య రహస్యం యోగసాధన అని 2024, మే, 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సందర్భంగా కూడా చె΄్పారు చార్లోట్ చోపిన్.ఇవి చదవండి: Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె -
షార్లెట్‌లో వైఎస్సార్సీపీ సిద్ధం!
నార్త్ కరోలినా షార్లెట్‌లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వములో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డ తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను నేను ఉన్నాను అని, కరోనా కష్టాలను కూడా అధికమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమా ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ని మళ్లీ గెలిపించు కోవడానికి మేము సిద్ధం అని అందరు నినదించారు. మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించటంతో ఆడిటోరింలో సందడివాతావరణం నెలకొంది. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. (చదవండి: చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు) -
ఛార్లెట్‌లో గ్రాండ్‌గా టీటీఏ బోర్డ్ మీటింగ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు మీటింగ్ ఛార్లెట్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాదిలో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభల గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ గురించి చర్చించారు. అంతకుముందు టీటీఏ సభ్యులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బోర్డు సమావేశానికి సంస్థ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి హాజరైనా సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కన్నుమూసిన ప్రజాగాయకుడు గద్దర్‌కి టీటీఏ బోర్డు ఘన నివాళులు అర్పించింది. సంస్థ సభ్యులు గద్దర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. తన ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని, ప్రజాగాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. గద్దర్ ఆలపించిన పాటలు పాడి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన టీటీఏ బోర్డు మీటింగ్‌లో సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సియాటెల్‌లో జరిగే టిటిఎ మెగా కన్వెన్షన్ 2024ను విజయవంతం చేయాలన్నారు. అలాగే నిధుల సమీకరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి.. సమావేశానికి హాజరైన బోర్డు మరియు టిటిఎ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సియాటెల్‌లో జరగనున్న టిటిఎ మెగా కన్వెన్షన్ అప్డేట్లను అందించారు. నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన విజన్‌ను పంచుకున్నారు. సియాటెల్‌లో జరిగే కన్వెన్షన్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. సంస్థ ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెద్ది, EC సభ్యులు టిటిఎ మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. టిటిఎ మెగా కన్వెన్షన్‌కు సంబంధించి సూచనలను, సలహాలను, కార్యాచరణ ప్రణాళికలను అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి తెలియజేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలపై అన్ని టిటిఎ రాష్ట్ర చాప్టర్లు పనిచేయాలని కోరారు. అడ్వైజరీ కో-ఛైర్ మోహన్ పాటల్లోల, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి తదితరులు కన్వెన్షన్‌తో పాటు ఇటీవల జరిగిన సేవా డేస్ విశేషాలను అందరితో పంచుకున్నారు. ఇకసెక్రటరీ కవితారెడ్డి 2023 కార్యక్రమాలపై నివేదికలను అందజేశారు. బతుకమ్మను విజయవంతం చేసిన మహిళా నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కి విశేష స్పందన వచ్చింది. సమావేశాలకు అయ్యే ఖర్చులను దాతలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా 4లక్షల డాలర్ల నిధులను సేకరించినట్లు నిర్వహకులు తెలిపారు. విరాళాలు ప్రకటించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు, వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిభింభించేలా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ డాన్స్ ప్రదర్శన ఆడియన్స్‌లో జోష్ నింపింది. ఛార్లెట్‌లో నిర్వహించిన ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవ్వటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. -
షార్లెట్ లో కన్నుల పండుగగా శ్రీ గోదాదేవి కల్యాణోత్సవం
-
షార్లెట్ లో గణేష్ నిమజ్జనం వేడుకలు
-
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
-
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో ఘనంతో బతుకమ్మ, దసరా వేడుకలు
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకను సెప్టెంబరు 25 వ తేదీన ఉత్తర చార్లెట్ లో ఉన్న జే ఎం రాబిన్సన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ ఎనిమిదవ తేదీన దక్షిణ షార్లెట్‌లో లో గల కమ్యూనిటీ హౌస్ మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కొరకు తెలంగాణా సంఘం కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని పాఠశాల ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా అందముస్తాబు చేశారు. ప్రాంతాల నుండి రంగు రంగుల పూలతో పేర్చి అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో చక్కగా ముస్తాబైన మహిళలు పిల్లలతో సహా వందల కుటుంబాలు తరలివచ్చారు. నోరూరించే తినుబండారాల దుకాణాలు ఒకపక్క, జిగెల్లుమనే ఆభరణాలు, వస్త్ర దుకాణాలు,ఇతర వ్యాపార పరిచయ వేదికలు అక్కడివారిని ఆకర్షించాయి. అనంతరం మహిళల కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ ఆట పాటలుతో, గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, పిల్లలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు. తరువాత బతుకమ్మలను ఊరేగింపుగా ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కొలనులో విడిచిపెట్టారు, తరువాత ముత్తయిదువలు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సద్దుల బతుకమ్మ దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ జానపద గాయకుడు జనార్దన్ పన్నెల పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చార్లెట్ తెలంగాణా సంఘం వరుసా పదమూడో సంవత్సరం జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన చార్లెట్ తెలంగాణా సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బోధ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. -
‘పరుగెత్తండి..దాక్కోండి..ఫైట్ చేయండి’
నార్త్ కరోలినా : అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. చార్లెట్ క్యాంపస్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అకడమిక్ ఇయర్ ముగింపు రోజే యూనివర్సిటీలో ఈ ఘటన చోటుసుకుంది. ఇందుకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారమివ్వడంతో పాటుగా.. విద్యార్థులను వెంటనే అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘పరుగెత్తండి, దాక్కోండి, ఫైట్ చేయండి. మిమ్మల్ని కాపాడుకోండి. క్యాంపస్‌లో కాల్పులు జరిగినందు వల్ల పోలీసులు అన్ని బిల్డింగ్‌లలో దుండగుడి కోసం అన్వేషిస్తున్నారు’ అంటూ క్యాంపస్ ఎమర్జెన్సీ ఆఫీస్ ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘నాతో పాటు మరో 30 మంది ఫిల్మ్ క్లాసులో ఉన్నాం. అప్పుడు ఓ విద్యార్థి పరిగెత్తుకు వచ్చి క్యాంపస్‌లో కాల్పులు జరుగుతున్నాయని చెప్పాడు. అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. షాక్ అయ్యాను. వెంటనే అప్రమత్తమై మేమందరం లోపల నుంచి లాక్‌చేసుకున్నాం. ఇక అప్పటి నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు నా తల్లిదండ్రులకు మెసేజ్ చేస్తూనే ఉన్నాను. దాదాపు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మమ్మల్ని గది నుంచి బయటికి రావాల్సిందిగా చెప్పారు భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు యూఎన్సీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ హ్యారీ స్మిత్ పేర్కొన్నారు. చార్లెట్లో క్యాంపస్‌లో చోటుచేసుకున్న ఈ హింస తమను తీవ్రంగా కలచివేసిందని, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
తొలి స్వర్ణం స్వీడన్ ఖాతాలో
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): వింటర్ ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకం స్వీడన్ ఖాతాలోకి వెళ్లింది. పోటీల తొలి రోజు శనివారం మహిళల స్కీయాథ్లాన్ క్రాస్ కంట్రీ ఈవెంట్లో స్వీడన్‌కు చెందిన చార్లోటి కల్లా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మారిట్ జోయెర్న్ (నార్వే) రజతం... క్రిస్టా పర్మాకోస్కీ (ఫిన్లాండ్) కాంస్యం సాధించారు. ఆతిథ్య దక్షిణ కొరియా జట్టు తొలి రోజే పసిడి బోణీ చేసింది. పురుషుల 1500 మీటర్ల షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో లిమ్ హయోజున్ కొరియాకు బంగారు పతకాన్ని అందించాడు. మరోవైపు మహిళల ఐస్ హాకీ మ్యాచ్‌లో దక్షిణ కొరియా–ఉత్తర కొరియా క్రీడాకారిణులతో కూడిన ఉమ్మడి కొరియా జట్టుకు ఓటమి ఎదురైంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్మడి కొరియా 0–8తో పరాజయం పాలైంది. 34వ స్థానంలో శివ కేశవన్ వరుసగా ఆరో వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత స్టార్ శివ కేశవన్‌కు తొలి రోజు నిరాశే ఎదురైంది. ల్యూజ్ క్రీడాంశం సింగిల్స్ ఈవెంట్లో బరిలోకి దిగిన శివ కేశవన్ తొలి రోజు రెండు రేసులు ముగిశాక 1ని:39.288 సెకన్లతో 34వ స్థానంలో ఉన్నాడు. 1,365 మీటర్లతో కూడిన ట్రాక్‌పై అతను తొలి రేసును 50.578 సెకన్లలో... రెండో రేసును 48.710 సెకన్లలో ముగించాడు. 40 మంది పాల్గొంటున్న ఈ రేసులో ఆదివారం మరో రెండు రేసులు జరుగుతాయి. నిర్ణీత నాలుగు రేసులు ముగిశాక అత్యుత్తమ సమయం నమోదు చేసిన తొలి ముగ్గురికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. -
ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రవాసాంధ్రులు
నార్త్ కరోలినా (ఛార్లెట్) : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి అమెరికాలోని ఉత్తర కరోలినా ఛార్లెట్ నగరంలో ప్రవాసాంధ్రులు తమ మద్ధతుగా గళమెత్తారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం తీరును, రాష్ట్రంలో తలెత్తుతున్న పరిణామాలపై వైఎస్ఆర్ సీపీ విభాగం నేతలు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చి, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఛార్లెట్ నగరంలో శనివారం వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. 'మీ కేసుల మాఫీ కోసం.. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా?', 'ప్రత్యేక హోదా బిక్ష కాదు.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు' అని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరును వైఎస్ఆర్ సీపీ ఛార్లెట్ టీమ్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆ విషయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామని చెప్పారని, రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో అంశాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక హోదాకు మద్ధతు కరువైందని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు సినిమాలను బాయ్ కాట్ చేస్తామని ఎన్ఆర్ఐలు హెచ్చరిస్తున్నారు. ఓ మంచి కారణం కోసం మద్ధతు తెలపాల్సిందిగా టాలీవుడ్ ఇండస్ట్రీని కోరారు. ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉపాధి అవకాశాలొస్తాయన్నారు. స్పెషల్ ప్యాకేజీ కంటే స్పెషల్ స్టేటస్‌తోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈ టీమ్ అక్కడి ప్రవాసాంధ్రులకు వివరించింది. 'ఏపీకి ప్రత్యేక హోదా కావాలి' అనే నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. సుబ్బారెడ్డి మేక, కె.రాధాక్రిష్ణరెడ్డి, పి.సంజీవరెడ్డి, సబ్బసాని వెంకట్, సింగల్రెడ్డి శ్రీనివాస్, రోహిత్, రామక్రిష్ణ, కైపు, మదం బోయనపల్లి, అనిరుద్‌రెడ్డి, వెంకట్ వరప్రసాద్, ఛార్లెట్ లోని తెలుగు విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి తమ మద్ధతు ప్రకటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. -
అమెరికా నగరంలో ఎమర్జెన్సీ
షార్లట్: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఉన్న షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు. పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుడి మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. మంగళవారం పోలీసు అధికారి బ్రింట్లీ విన్సెంట్ జరిపిన కాల్పుల్లో 43ఏళ్ల కీత్ లామంట్ స్కాట్ మృతి చెందడంతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. వరుసగా రెండో రోజు ఆందోళనలతో షార్లట్ అట్టుడికింది. దీంతో షార్లట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో షార్లట్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఉత్తర కరోలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ ప్రకటించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. ఆందోళనకారులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. షార్లట్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు చేపట్టామని మేయర్ జెన్నిఫర్ రాబర్ట్స్ తెలిపారు. ఆందోళనకారులు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, పోలీసు కాల్పుల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపడతామని హామీయిచ్చారు.