వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. జగన్ బర్త్‌డే సందర్భంగా పిల్లలూ, పెద్దలూ అంతా కేక్ కట్ చేసి తమ ప్రియతమ నేతలకు జన్మదిన శుభాకాంక్షలందించారు.
జగనన్న అభిమానులు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో హాజరై.. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు.
మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
Comments
Please login to add a commentAdd a comment