
వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వర్జీనియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీ, కూతురు చనిపోయారు. వీరిని గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్, ఉర్మిగా గుర్తించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను వర్జీనియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. ప్రదీప్ పటేల్, ఆయన కూతురు ఉర్మి.. గురువారం రోజున వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కి వెళ్లారు. వారు స్టోర్‌లో ఉన్న సమయంలో నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ అక్కడికి వెళ్లాడు. తనకు మందు కావాలని అడగడంతో స్టోర్ సిబ్బందికి, అతడికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, స్టోర్‌లో ఉన్న వర్కర్లపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పలు జరిపాడు. కాల్పుల్లో ప్రదీప్ కుమార్, ఉర్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. ఉర్మి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, కాల్పులు జరిపిన ఫ్రేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని మెహసనా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువులకు చెందిన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. మృతుడు ప్రదీప్ కుమార్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ప్రదీప్, ఉర్మి మృతితో కుటుంట సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
🚨 Gujarati father, daughter shot dead in US store in Virginia.
Pradeep Patel, 56, was shot dead on the spot, while his 24-year-old daughter, Urmi, succumbed to her injuries two days later. pic.twitter.com/RtU2VYqAmv— The Tradesman (@The_Tradesman1) March 23, 2025
Comments
Please login to add a commentAdd a comment