Indians abroad
-
విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయులకు సైతం మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ఈ–పోస్టల్ బ్యాలెట్ వంటి టెక్నాలజీ ఆధారిత ఆధునిక విధానాలను ఉపయోగించాలని అన్నారు. మన దేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కుమార్ శుక్రవారం నిర్వాచన్ సదన్‌లో ‘భారత్–ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి, భారత ఎన్నికల సంఘం పాత్ర’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 2022 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారుల(ట్రైనీలు)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, కుట్రపూరిత ప్రచారం సాగుతున్నాయని అన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీబీపీఎస్) ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రతిపాదించింది. విదేశాల్లోని భారతీయుల్లో 1.15 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు అంచనా. -
ఆస్ట్రేలియాలో మోదీ మ్యాజిక్.. ఓ రేంజ్లో భారతీయుల స్వాగతం!
సిడ్నీ/మెల్బోర్న్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంతో పాటుగా పలు దేశాల్లో అభిమానులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. కాగా, మోదీ.. ఇప్పటికే పలు దేశాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అభిమానులు, భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజాగా ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న భారతీయులు ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మోదీని కలిసేందుకు భారత సంతతి ప్రజలు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుని మరీ వచ్చారు. సోమవారం రాత్రి మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. తాము ప్రయాణించిన విమానానికి మోదీ ఎయిర్ వేస్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక, మోదీ కోసం 170 మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, తలకు టర్బన్లను కట్టుకుని విమానంలో డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్బోర్న్లోని మోదీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు. వీరంతా సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. "Modi Airways" , a plane full of Indian diaspora members arriving in Sydney this morning for the Diapsora Event. https://t.co/GCjs4TSuag pic.twitter.com/RCpIBVWIyG — Sidhant Sibal (@sidhant) May 23, 2023 WATCH | Indian Diaspora from Melbourne ready to take off on special chartered flight @modiairways to meet PM @narendramodi in Sydney, Australia. pic.twitter.com/T8vhbRayXP — DD News (@DDNewslive) May 23, 2023 #Live Modi Airways arrives at Qudos Arena @EthnicLinkGuru @Pallavi_Aus @DrAmitSarwal https://t.co/welCRRSmwU — The Australia Today (@TheAusToday) May 23, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం -
అక్కడే చనిపోతామనుకున్నాం.. భారత్ చేరిన సూడాన్ బాధితులు
ఢిల్లీ: సుడాన్(sudan)లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ వేగంగా కొనసాగుతోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూడాన్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్.. స్వదేశం చేరుకున్నారు. ఈ సందర్బంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు. కాగా, మొదటి బ్యాచ్‌లో సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మొత్తంగా జెడ్డాకు చేరుకున్న 534 మందిలో 360 మంది వాణిజ్య విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చేశారు. ఆపరేషన్ కావేరీ సాయంతో సూడాన్ నుంచి మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుంది అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా కౌంటర్‌తో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. మరోవైపు.. బుధవారం ఉదయం సుడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుడాన్ నుంచి మూడో బ్యాచ్‌లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, సూడాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల్లో చాలా మంది గాయపడ్డారు. అనంతరం, ఢిల్లీలో వారు సూడాన్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సూడాన్‌లో నివాసాలపై బాంబు వేయడంతో భయానక పరిస్థితులను చూశాడు. స్వదేశానికి తిరిగి వస్తామని అనుకోలేదు. అక్కడే చనిపోతామనే భయంతో క్షణక్షణం కాలం గడిపాము. కట్టుబట్టలతో సూడాన్ నుంచి బయలుదేరాము. బాంబు దాడుల కారణంగా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాము. కొందరు వ్యక్తులు మమ్మల్ని గన్‌తో బెదిరించి మావద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. First flight carrying Indian nationals who were evacuated from Sudan landed in Delhi yesterday. #OperationKaveri brought 360 Indian Nationals to the homeland as first flight reaches New Delhi.@MEAIndia @EoI_Khartoum pic.twitter.com/xXp4ZJW40K — DD India (@DDIndialive) April 27, 2023 ఇది కూడా చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
భారత్‌కు బై బై!.. ఆ దేశానికే తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: విద్య, ఉపాధి, వ్యాపారం.. తదితర కారణాలతో భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారు అక్కడే స్థిరపడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. తమ పిల్లలు ఆయా దేశాల పౌరులుగా పెరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత పౌరసత్వం వదులుకుని.. విదేశీ పౌరసత్వాలు పొందుతున్నారు. విదేశాంగ శాఖ వివరాల ప్రకారం.. 2011 నుంచి 2022 మధ్య 16.63 లక్షల మంది భారత్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా సహా 135 దేశాల్లో స్థిరపడ్డారు. 2022లో అత్యధికంగా 2,25,260 మంది.. 2019లో 1.44 లక్షలు, 2020లో 85వేలు, 2021లో 1.63 లక్షల మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు.. తొలి ప్రాధాన్యం అమెరికాకే ఇస్తున్నారు. 2017 నుంచి 2021 మధ్య 6.08 లక్షల మంది భారత్ పౌరసత్వాన్ని వదులుకోగా.. వీరిలో అత్యధికంగా 2.56 లక్షల మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత కెనడా(91,429 మంది), ఆస్ట్రేలియా(86 వేల మంది), బ్రిటన్(66 వేల మంది) దేశాల్లోనే ఎక్కువ మంది భారతీయులు స్థిరపడ్డారు. -
విదేశీ స్టాక్స్‌లో రికార్డు పెట్టుబడులు
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయుల పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతున్నాయి. 2022లో విదేశీ సెక్యూరిటీలు, ప్రాపర్టీ, డిపాజిట్లలో భారతీయులు చేసిన పెట్టుబడులు రికార్డు స్థాయిలో 2.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక 12 నెలల కాలంలో విదేశాల్లో భారతీయులు చేసిన అత్యధిక పెట్టుబడులు ఇవేనని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విభాగం వారీగా చూసుకున్నా కానీ గతేడాది పెట్టుబడులు అత్యధికంగా ఉన్నాయి. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాలకు పంపించుకోవచ్చు. విదేశీ యాత్రలు, విదేశీ విద్య, వైద్యం, పెట్టుబడులకు ఈ పరిమితి వర్తిస్తుంది. బహుమతులు, విరాళాలకూ ఇదే పరిమితి అమలవుతుంది. 2009కి ముందు 12 నెలల కాలంలో విదేశీ షేర్లు, ప్రాపర్టీలు, డిపాజిట్లలో భారతీయుల పెట్టుబడులు 350 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. 2022 డిసెంబర్‌తో అంతమైన 12 నెలల కాలంలో విదేశీ ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడులు రికార్డు స్థాయిలో 969.50 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డిసెంబర్ నెల వరకే చూసుకున్నా ఇలా విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 120 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్టాక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి ముఖ్యంగా విదేశీ స్టాక్స్ పట్ల భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీలతో ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర షేర్లలో దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2022 డిసెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పోర్ట్‌ఫోలియోలో రూ.27,055 కోట్ల విలువైన విదేశీ స్టాక్స్‌ను కలిగి ఉన్నాయి. అది ఈ ఏడాది జనవరి చివరికి రూ.29,012 కోట్లకు వృద్ధి చెందింది. విదేశీ పెట్టుబడుల పరంగా మ్యూచువల్ ఫండ్స్‌కు కొన్ని నియంత్రణపరమైన పరిమితులు ఉన్నాయి. ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విలువ అనుమతించిన గరిష్ట స్థాయికి చేరిపోవడంతో.. తాజా పెట్టుబడుల స్వీకరణను సెబీ నిలిపివేసింది. పైగా విదేశాలకు పంపించే మొత్తం రూ.7 లక్షలకు మించితే మొదట్లోనే 20 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన విదేశీ పెట్టుబడులకు పెద్ద ప్రతిబంధకం అవుతుందన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే విదేశాలకు పంపించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. -
‘ఉక్రెయిన్ నుంచి వెంటనే వెళ్లిపోండి’.. భారత పౌరులకు హెచ్చరిక
కీవ్: రష్యాలోని కీలకమైన కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి మాస్కో సేనలు. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడం వల్ల కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు మరింద దిగజారుతున్నాయి. పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఎవరైనా ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉండి ఉంటే వీలైనంత త్వరగా అందుబాటులోని మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’ అని భారత రాయబార కార్యాలయం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: బ్రిటన్‌లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది! -
విదేశాల్లోని వారికి నగదు పంపాలా?
అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయి రెండు నెలలకుపైనే అవుతోంది. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లిన వారు, ఉపాధి ఇతర అవసరాల కోసం వెళ్లిన భారతీయులు తిరిగి రావాలనుకుంటున్నా.. రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడి వారికి ఆర్థిక సాయం అవసరం కావచ్చు. ‘స్వేచ్ఛాయుత చెల్లింపుల పథకం’ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు (మైనర్లు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల కోసం పంపుకోవచ్చు. విదేశీ విద్య, నిర్వహణ ఖర్చులు, బహుమతులు, విరాళాలు, పర్యటన ఖర్చులు తదితర అవసరాల కోసం నగదు పంపుకునేందుకు (ఫారిన్ అవుట్వార్డ్ రెమిటెన్స్) నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇంటి నుంచే ఈ లావాదేవీలను సులువుగా చేసుకునే అవకావం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో విదేశాల్లోని వారికి నగదు పంపుకునేందుకు (ఫారిన్ రెమిటెన్స్) అనుమతిస్తున్నాయి. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు నమోదు చేసుకుని ఉండాలి. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఆన్లైన్ రెమిటెన్స్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాయి. ఇలా నమోదు చేసుకున్న తర్వాత దేశీయ లావాదేవీల మాదిరే విదేశాల్లోని తమ వారి ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎవరికి అయితే నగదు పంపించాలని అనుకుంటున్నారో వారి పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్‌తో బెనిఫీషియరీని నమోదు చేసుకోవాలి. ఇందుకు కొంత సమయం తీసుకుంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే బెనిఫీషియరీ నమోదుకు 30 నిమిషాలు చాలు. మధ్యాహ్నం 2.30 గంటల్లోపు నమోదైన అన్ని రెమిటెన్స్ అభ్యర్థనలను అదే రోజు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పూర్తి చేసేస్తుంది. అదే ఎస్బీఐ అయితే నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత యాక్టివేషన్‌కు ఒక రోజు సమయం తీసుకుంటుంది. ఎస్బీఐ కస్టమర్లు ఒకే రోజు గరిష్టంగా మూడు బెనిఫీషియరీలను నమోదు చేసుకోవచ్చు. పరిమితులు.. ఎల్ఆర్ఎస్ కింద ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) పరిమితి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లుగా ఉంది. ఆన్లైన్ కొనుగోళ్లకూ ఇదే పరిమితి అమలవుతుంది. అయితే, బ్యాంకులు ఫారిన్ రెమిటెన్స్ లావాదేవీలకు సంబంధించి పలు రకాల పరిమితులను నిర్దేశిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే కనిష్టంగా ఒక లావాదేవీలో 100 డాలర్లు, గరిష్టంగా 12,500 డాలర్ల వరకే పంపుకునేందుకు అనుమతిస్తోంది. రెమిట్నౌ అనే ఆన్లైన్ సదుపాయం ద్వారా ఒక కస్టమర్ ఈ మేరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు మించిన మొత్తాల్లో విదేశాల్లోని తమ వారికి పంపించాలని అనుకుంటే అప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంకు అయితే ఒక కస్టమర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గరిష్టంగా 25,000 డాలర్ల వరకు విదేశాలకు పంపించుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్బీఐ కస్టమర్‌కు ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ పరిమితి ఒక లావాదేవీలో రూ.10 లక్షలుగా అమల్లో ఉంది. అలాగే, ఎస్బీఐ కస్టమర్లు నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత మొదటి ఐదు రోజుల్లో మాత్రం కేవలం 50,000 వరకే పంపుకోగలరు. ఇక ఎల్ఆర్ఎస్ కింద కొన్ని దేశాలకు నగదు పంపుకునే అవకాశం లేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిషేధించిన దేశాలు లేదా యూఎస్ ట్రెజరీ ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ కస్టమర్లకు పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని వారికి నగదు పంపుకునే అవకాశం ఉండదు. ఇక కొన్ని బ్యాంకులు కొన్ని రకాల ఫారిన్ కరెన్నీ రెమిటెన్స్లకే పరిమితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు 20 కరెన్సీల్లో ఫారిన్ రెమిటెన్స్‌లను ఆఫర్ చేస్తోంది. అదే ఎస్బీఐ కస్టమర్లు అయితే యూఎస్ డాలర్, యూరో, గ్రేట్ బ్రిటన్ పౌండ్, సింగపూర్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్ మారకంలో రెమిటెన్స్‌లు చేసుకోవచ్చు. కమీషన్, చార్జీలు.. బ్యాంకులు ఫారిన్ కరెన్సీ రెమిటెన్స్‌లకు సంబంధించి మారకం రేట్లను రోజువారీగా ప్రకటిస్తుంటాయి. ఈ వివరాలను బ్యాంకు వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. ఫారీన్ అవుట్వార్డ్ రెమిటెన్స్‌ల లావాదేవీలకు బ్యాంకులు చార్జీలు, కమీషన్లను వసూలు చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 500 డాలర్ల వరకు లావాదేవీపై రూ.500 చార్జీని వసూలు చేస్తోంది. అదే 500 డాలర్లకు మించిన లావాదేవీలపై ఈ చార్జీ రూ.1,000గా ఉంది. ఎస్బీఐ కస్టమర్లు అయితే వివిధ కరెన్సీల్లో వివిధ రకాల చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్ డాలర్ రూపంలో అయితే చార్జీ 11.25 డాలర్లు, బ్రిటన్ పౌండ్ రూపంలో చార్జీ 10 పౌండ్లు ఇలా చార్జీలు మారిపోతుంటాయి. యాక్సిస్ బ్యాంకు మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫారీన్ రెమిటెన్స్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వారికి.. విదేశీ రెమిటెన్స్ లావాదేవీల కోసం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో నమోదు చేసుకోని వారి పరిస్థితి ఏంటి..? అటువంటప్పుడు ‘డీసీబీ బ్యాంకు రెమిట్ ఫెసిలిటీ’ని పరిశీలించొచ్చు. డీసీబీ బ్యాంకు ఖాతా దారులతోపాటు ఇతరులు అందరికీ ఇది అందుబాటులో ఉన్న సదుపాయం. పైగా విదేశీ రెమిటెన్స్ లావాదేవీలకు డీసీబీ బ్యాంకు ఎటువంటి చార్జీలను లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. పాన్ కార్డు ఉన్న వారు డీసీబీ బ్యాంకులో డీసీబీ రెమిట్ సదుపాయం కోసం బ్యాంకుకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. కాకపోతే వీరికి డీసీబీ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులో ఖాతా ఉండాలి. డీసీబీ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25,000 డాలర్ల వరకు ఒక కస్టమర్ విదేశాలకు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఇంతకు మించి పంపించుకోవాలంటే డీసీబీ బ్యాంకు శాఖకు వెళ్లాలి. ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ కూడా ఇటువంటి సదుపాయమే. ఇతర బ్యాంకు కస్టమర్లు విదేశాలకు నగదు పంపుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ ఉపయోగపడుతుంది. కాకపోతే ఐసీఐసీఐ బ్యాంకు శాఖకు వెళ్లి నమోదు చేసుకోవాలి. కేవైసీ వివరాలు కూడా సమర్పించాలి. మనీ2వరల్డ్ ద్వారా రెమిటెన్స్‌లపై రూ.750 కమీషన్‌గా చెల్లించాలి. ఏజెంట్లు... నెట్ బ్యాంకింగ్ సదుపాయాల్లేని వారు నాన్ బ్యాంకింగ్ ఏజెంట్ల సేవలను ఫారిన్ రెమిటెన్స్ కోసం వినియోగించుకోవచ్చు. థామస్‌కుక్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ తదితర సంస్థలను ఫారీన్ రెమిటెన్స్ సేవలకు ఆర్బీఐ అనుమతించింది. అయితే, రెమిటెన్స్ లావాదేవీల పరంగా పరిమితులు సంస్థలను బట్టి మారిపోవచ్చు. చార్జీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. థామస్‌కుక్ ద్వారా ఆన్లైన్లో 5,000 వరకు డాలర్లను పంపుకోవాలంటే అందుకు గాను 8 డాలర్ల ఫీజును చెల్లించుకోవాలి. అంతకుమించిన లావాదేవీలపై ఫీజు రూ.11 డాలర్లుగా ఉంది. పన్నులు ఉన్నాయా..? విదేశీ రెమిటెన్స్‌పై కమీషన్లు/చార్జీలు, కరెన్సీ మారకం చార్జీలను పక్కన పెడితే.. పన్నుల భారం కూడా ఉంటుంది. పన్ను వర్తించే విలువపై 18% జీఎస్టీ చెల్లించాలి. పన్ను వర్తించే విలువ కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.60,000 వరకు ఉంటుంది. కనుక ఈ మొత్తంపై జీఎస్టీ రూ.45–10,800 మధ్య చెల్లించాల్సి రావచ్చు. 2020 అక్టోబర్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7లక్షలకు మించి విదేశాలకు పంపితే 5% మూలం వద్ద పన్నును వసూలు (టీసీఎస్) చేస్తారు. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెమిటెన్స్ చేస్తుంటే మాత్రం టీసీఎస్ 0.5 శాతమే. -
విదేశాల్లోని భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చే ప్రక్రియను 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. విమానాలు, నౌకల ద్వారా దశలవారీగా వారిని తీసుకువస్తామని, డబ్బులు చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే అనుమతిస్తామని, భారత్ వచ్చాకా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సోమవారం హోం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల తర్వాత 2 వారాల పాటు వారు ఆసుపత్రిలోగానీ క్వారంటైన్‌లోగానీ డబ్బులు చెల్లించి ఉండాలి. 14 రోజుల తర్వాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలకనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఆయా దేశాల్లోని భారతీయ ఎంబసీలు భారత్‌కు వచ్చేవారి జాబితాను రూపొందిస్తాయి. భారత్‌కొచ్చాక ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలను విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ వెబ్సైట్లలో త్వరలో పొందుపరుస్తారు. మార్చి 23న అన్ని అంతర్జాతీయ ప్రయాణాలను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. -
కొరియర్ ద్వారా దేశంలోకి రద్దయిన నోట్లు
బనశంకరి (బెంగళూరు): ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను వాడుకలోకి తెచ్చేందుకు విదేశాల్లోని భారతీయులు అక్రమ మార్గాల బాట పట్టారు. కొరియర్ పార్సిళ్లలో నోట్లు ఉంచి రవాణా చేశారు. డిసెంబర్ 30 వరకు బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో రూ.1.24కోట్ల విలువైన పాత కరెన్సీని పట్టుబడ్డాయి. విదేశాల్లో ఉన్న కొంత మంది తమ వద్ద ఉన్న పాతపెద్దనోట్లను మొబైల్ ఫోన్ బాక్సులు, పుస్తకాలు ఇతర వస్తువుల్లో దాచి కొరియర్ ద్వారా బెంగళూరులోని తమ వారికి చేరవేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారమందింది. దీంతో వారు వివిధ దేశాల నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరిన కొరియర్ పార్శిళ్లను తనిఖీ చేయగా నోట్లు బయటపడ్డాయి. ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.