సాక్షి, అమరావతి: విద్య, ఉపాధి, వ్యాపారం.. తదితర కారణాలతో భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారు అక్కడే స్థిరపడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. తమ పిల్లలు ఆయా దేశాల పౌరులుగా పెరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత పౌరసత్వం వదులుకుని.. విదేశీ పౌరసత్వాలు పొందుతున్నారు.
విదేశాంగ శాఖ వివరాల ప్రకారం.. 2011 నుంచి 2022 మధ్య 16.63 లక్షల మంది భారత్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా సహా 135 దేశాల్లో స్థిరపడ్డారు. 2022లో అత్యధికంగా 2,25,260 మంది.. 2019లో 1.44 లక్షలు, 2020లో 85వేలు, 2021లో 1.63 లక్షల మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు.. తొలి ప్రాధాన్యం అమెరికాకే ఇస్తున్నారు. 2017 నుంచి 2021 మధ్య 6.08 లక్షల మంది భారత్ పౌరసత్వాన్ని వదులుకోగా.. వీరిలో అత్యధికంగా 2.56 లక్షల మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత కెనడా(91,429 మంది), ఆస్ట్రేలియా(86 వేల మంది), బ్రిటన్(66 వేల మంది) దేశాల్లోనే ఎక్కువ మంది భారతీయులు స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment