Study Abroad
-
రెడీ స్టడి గో
⇒ వచ్చే నెల నుంచే పలు దేశాల్లో అడ్మిషన్ల ప్రక్రియలు ప్రారంభం⇒ సరైన అవగాహనతో ముందుకెళితే సమస్యలు రాకుండా ఉంటాయంటున్న నిపుణులు⇒ విదేశీ విద్యకు అర్హతలు, అవకాశాలపై సూచనలివీ ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా విదేశీ విద్య వైపు చూస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.వారంతా విదేశాలకు వెళ్లే ముందు హైదరాబాద్‌కే చేరుతున్నారు. ఇక్కడున్న కన్సల్టెన్సీలను సంప్రదించి విదేశీ విద్య కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చే నెలలోనే కొత్తగా అడ్మిషన్ల ప్రక్రియలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సరైన అవగాహనతో ముందుకెళితే.. సులువుగా విదేశీ విద్య పూర్తి చేసుకోవచ్చని, మంచి జాబ్ కూడా సంపాదించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అసలు విదేశీ విద్యకు అర్హతలు, తీసుకో వాల్సిన జాగ్రత్తలేమిటో స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.అవకాశం, అవగాహన పెరగడంతో..విదేశాల్లో విద్య అంటే ఒకప్పుడు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమన్న భావన ఉండేది. దానికితోడు పెద్దగా అవగాహన లేకపోవడంతో.. విదేశాలకు వెళ్లడం ఎందుకులేనన్న పరిస్థితి ఉండేది. కానీ పెరిగిన అవకాశాలు, అవగాహన, ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారితో సులువుగా అనుసంధానమయ్యే వీలు వంటివి.. విదేశాలకు వెళ్లి చదువుకునేవారి సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది. పాస్‌పోర్టు జారీ విధానం సులభతరం కావడం, విదేశాల వీసాలు సులువుగా దొరుకుతుండటం, స్కాలర్ షిప్‌లతో అవకాశాలూ పెరిగాయి. మరోవైపు స్థానికంగా విద్య కోసం ఖర్చులు కూడా బాగా పెరిగిన నేపథ్యంలో.. మరింత అదనంగా ఖర్చు చేస్తే విదేశాల్లో చదువుకోవచ్చని, అక్కడే ఉద్యోగమూ సంపాదించవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.స్టూడెంట్ వీసా తీసుకుని..⇒ స్టూడెంట్ వీసా ఉంటే ఆ దేశంలోసంబంధిత కోర్సు పూర్తయ్యేంత వరకు ఉండి చదువుకునేందుకు అనుమతిఉంటుంది. తర్వాత కూడా రెండేళ్ల పాటు వర్క్ పర్మిట్ మీద ఉండేందుకు అనుమతిస్తారు.ఆ రెండేళ్లలోగా సరైన ఉద్యోగం పొందలేకపోతే.. స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.⇒ స్టూడెంట్ వీసా కోసం ఏ దేశానికి వెళ్లాలనుకుంటే ఆ దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయం లేదా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా వీసా అప్లికేషన్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.⇒ విద్యార్థులకు అమెరికా అయితే ఎఫ్, ఎం, జే వీసాలు ఇస్తుంది. యూకే అయితే టైర్–4 వీసాలు జారీ చేస్తుంది. కెనడా స్టడీ పర్మిట్స్ పేరిట ఇస్తుంది.హైదరాబాద్ నుంచే ఎక్కువఅమెరికాకు గతేడాది 75,000 మంది ఇండియా నుంచి వెళ్తే..అందులో హైదరాబాద్ నుంచే 22,500 మంది ఉన్నట్టు అంచనా. ఇక కెనడాకు మొత్తం 1.3 లక్షల మంది వెళ్లగా.. దాదాపు 35,000 మంది హైదరాబాద్ మీదుగా వెళ్లారని.. ఇందులో సిటీవారే ఎక్కువని ఓపెన్ డోర్ సంస్థ నివేదిక చెబుతోంది. మిగతా దేశాలకు కూడా హైదరాబాద్ నుంచి వెళ్లిన విద్యార్థులే ఎక్కువని పేర్కొంటోంది.ఏమేం అర్హతలు ఉండాలి?⇒ చదువుకున్న కాలేజీ నుంచి కండక్ట్ సర్టిఫికెట్ ఉండాలి.⇒ సరైన పాస్‌పోర్టు ఉండాలి. ⇒ ఆదాయ వనరులు సరిగ్గా ఉండాలి⇒ ఆంగ్లంలో నైపుణ్యం ఉండాలి (ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్లో మంచి స్కోర్ కలిగి ఉండాలి)⇒ మెడికల్, పోలీస్ క్లియరెన్స్ ఉండాలి.⇒ టోఫెల్, ఐఈఎల్టీఎస్, డుయో లింగో, ఎస్ఏటీ, జీఆర్ఈ వంటి పరీక్షల్లో స్కోరును బట్టి యూనివర్సిటీలు అడ్మిషన్లు ఇస్తుంటాయి. ఒక్కో దేశంలోని ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పరీక్షలో స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది.⇒ వీసా కోసం అప్లికేషన్ చేసుకున్న తర్వాత కాన్సులర్ అధికారితో ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు దరఖాస్తులో అందజేసిన వివరాలు సరైనవేనా, కాదా అనే విషయాన్ని ఇంటర్వ్యూలో రూఢి చేసుకుంటారు. అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? చదువు అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలపై సమగ్రంగా ప్రశ్నలు అడుగుతారు.వీసాలు రిజెక్ట్ అవుతుంటాయి.. ఎందుకు? ⇒విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నవారికి ఒక్కోసారి వీసా రిజెక్ట్అవుతుంటుంది. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి.⇒ ఆదాయ వనరులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం⇒ డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడం.⇒ చదువు పూర్తయ్యాక తిరిగి స్వదేశం వెళతామని రుజువు చేయలేకపోవడం⇒ చదువులో మంచి మార్కులు లేకపోవడం ళీఏదైనా తప్పులు లేదా ఫ్రాడ్ చేయడంవిదేశాల్లో స్కాలర్షిప్ పొందడమెలా?విదేశాలకు చదువు కోసం వెళ్తున్న అందరికీ అక్కడి వర్సిటీల్లోఫీజులు చెల్లించే స్తోమత ఉండకపోవచ్చు. అందువల్ల కాస్త ఆర్థిక భారంతగ్గించుకునేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కాలర్షిప్ పొందడం కూడా సులువే..1. విదేశాల్లో వర్సిటీలు మాత్రమే కాకుండా వేరే సంస్థలు కూడా స్కాలర్షిప్స్ ఇస్తుంటాయి. అందుకే యూనివర్సిటీ వెబ్సైట్లతోపాటు స్కాలర్షిప్లు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను కూడా తరచూ చూస్తుండాలి.2. విదేశాలకు వెళ్లాలనుకోవడానికి ఏడాది ముందే స్కాలర్‌షిప్‌ల గురించి వెతుకుతుండాలి. ముందుగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.3. చాలా స్కాలర్షిప్ టెస్టుల కోసం అడ్మిషన్ లెటర్ అవసరం ఉండదు. అందుకే అడ్మిషన్ లెటర్ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలనుకోవడం సరికాదు.4. పూర్తి స్థాయి స్కాలర్షిప్ కాకుండా కొంతమేరకే వస్తే మాత్రం వేరే స్కాలర్‌షిప్‌ల కోసం కూడా వెతకాలి. ఒకటికన్నా ఎక్కువ స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా ఉంటుంది.5. మెరిట్ ఉన్న విద్యార్థులకే స్కాలర్షిప్ వస్తుందనుకోవడం పొరపాటు. స్పోర్ట్స్, ఇతర నైపుణ్యాల ఆధారంగా కూడా స్కాలర్షిప్ ఆఫర్ చేసే సంస్థలు చాలా ఉంటాయి. వాటిని గుర్తించాలి.టోఫెల్లో అక్రమాలతో ఇబ్బంది..గతేడాది టోఫెల్ పరీక్షలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. టోఫెల్, జీఆర్ఈలో మార్కులు ఎక్కువ వచ్చేలా చేస్తామంటూ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వల వేసిన గుట్టు రట్టయింది. అలాంటి వారిని నమ్మి పరీక్షలు రాయిస్తే.. తీరా విదేశాలకు వెళ్లాక అది ఫేక్ అని తేలితే చిక్కులు తప్పవు. ఆ విద్యార్థులను భారత్‌కు తిప్పిపంపడమేగాక.. భవిష్యత్తులో మళ్లీ విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించే ప్రమాదం ఉంటుంది. స్టూడెంట్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్‌తో వెళ్లొచ్చుభారత విద్యార్థులు విదేశాల్లోని అవకాశాలు అందిపుచ్చుకునేలా.. ఆయా దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వాటిద్వారా మన విద్యార్థులు విదేశాల్లోని వర్సిటీల్లో కొంతకాలం చదువుకొనేందుకు అవకాశం ఉంటుంది. ‘సెమిస్టర్ ఎట్ సీ, రోటరీ యూత్ ఎక్సే్ఛంజ్ , ఎరామస్ ప్లస్, ఫుల్ బ్రైట్ నెహ్రూ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్, యూత్ ఫర్ అండర్ స్టాండింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా విదేశాల్లోని విద్యార్థులతో కలసి చదువుకుని, అక్కడి స్థితిగతులను అర్థం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.ఉద్యోగ అనుభవంతో వెళ్తే మేలు..విదేశాల్లో చదువుతోపాటు అక్కడే స్థిరపడాలనుకునే వారు డిగ్రీ అయిపోయాక ఇక్కడ కనీసం రెండేళ్లపాటు ఏదైనా ఉద్యోగం చేసిఉంటే మంచిది. దీనివల్ల విదేశాల్లో ఎంఎస్ అయ్యాక.. ఇక్కడి అనుభవంతో అక్కడ ఉద్యోగం సులువుగా పొంది, స్థిరపడేందుకు అవకాశాలు మెండుగాఉంటాయి. ఏ దేశంలో త్వరగా సెటిల్ కాగలమో ముందుగానే తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ఐర్లాండ్ వంటి దేశాల్లో ఐదేళ్లలోనే గ్రీన్‌కార్డు వస్తుంది.సందీప్‌రెడ్డి , ఐర్లాండ్ ప్రస్తుత పరిస్థితులు బాగోలేవుఅమెరికాలో ప్రస్తుత పరిస్థితులు అంత బాగోలేవు. ఆర్థిక మాంద్యం నడుస్తోంది. రెండేళ్ల నుంచీ ఉద్యోగాల్లేవు. ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. స్టూడెంట్స్ చాలా మంది చదువు కోసం వస్తున్నారు. వారికి పార్ట్‌టైమ్ జాబ్స్ దొరకట్లేదు. ఇంటి అద్దెతోపాటు కూరగాయలు, నిత్యావసర ధరలు కూడాభారీగా పెరిగాయి. దీంతో ఇక్కడ జీవనం కష్టంగా మారుతోంది. సాయి సింధూజ న్యూజెర్సీ వర్సిటీలపై స్టడీ చేయాలి ముందుగానే ఏ యూనివర్సిటీమంచిదో కాస్త పరిశోధన చేయాలి. ఆ తర్వాతే కన్సల్టెన్సీల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అదే నేరుగా కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తే.. సరైన కాలేజీ లేదా యూనివర్సిటీకి దరఖాస్తు చేయకపోవచ్చు. తర్వాత బాధపడి ఏమీ లాభం ఉండదు. కొన్ని కన్సల్టెన్సీలు ఎక్కువ కమీషన్ ఇచ్చే వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తుంటాయి. అందుకే వర్సిటీలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.నిఖిల్ మండల, మాంచెస్టర్, బ్రిటన్ -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
భారత్‌కు బై బై!.. ఆ దేశానికే తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: విద్య, ఉపాధి, వ్యాపారం.. తదితర కారణాలతో భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారు అక్కడే స్థిరపడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. తమ పిల్లలు ఆయా దేశాల పౌరులుగా పెరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత పౌరసత్వం వదులుకుని.. విదేశీ పౌరసత్వాలు పొందుతున్నారు. విదేశాంగ శాఖ వివరాల ప్రకారం.. 2011 నుంచి 2022 మధ్య 16.63 లక్షల మంది భారత్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా సహా 135 దేశాల్లో స్థిరపడ్డారు. 2022లో అత్యధికంగా 2,25,260 మంది.. 2019లో 1.44 లక్షలు, 2020లో 85వేలు, 2021లో 1.63 లక్షల మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు.. తొలి ప్రాధాన్యం అమెరికాకే ఇస్తున్నారు. 2017 నుంచి 2021 మధ్య 6.08 లక్షల మంది భారత్ పౌరసత్వాన్ని వదులుకోగా.. వీరిలో అత్యధికంగా 2.56 లక్షల మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత కెనడా(91,429 మంది), ఆస్ట్రేలియా(86 వేల మంది), బ్రిటన్(66 వేల మంది) దేశాల్లోనే ఎక్కువ మంది భారతీయులు స్థిరపడ్డారు. -
Open Doors: విదేశీ విద్య @ అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లే భారతీయ విద్యార్థుల టాప్ చాయిస్ ఇప్పటికీ అమెరికానే! 2021–22లో అమెరికాలో 9.48 లక్షల మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందగా వారిలో 21 శాతం (1,99,182 మంది) భారతీయులే! 2020–21తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ కరోనా వల్ల 2020–21లో అమెరికాలో అడ్మిషన్లు తీసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 13.2 శాతం తగ్గింది. వైరస్ ప్రభావం తగ్గడంతో 2021–22లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. భారతీయ విద్యార్థుల సంఖ్య 18.9 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో చైనాదే అగ్రస్థానం. కానీ వారి సంఖ్య 2020–21లో 3.17 లక్షలుండగా 2021–22లో 2.9 లక్షలకు తగ్గింది. అమెరికాలో 9,48,519 మంది విదేశీ విద్యార్థులున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 21.1 శాతం (2 లక్షలు) మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 19.8 శాతం (1.88 లక్షలు) ఇంజనీరింగ్ చదువుతున్నారు. వచ్చే వేసవిలో భారత విద్యార్థులకు 82 వేలకు పైగా వీసాలు జారీ చేస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. గతేడాది 62 వేల వీసాలు జారీ చేసినట్లు ‘మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ పబ్లిక్ డిప్లొమసీ’ గ్లోరియా బెర్బెనా తెలిపారు. -
కల చెదురుతోంది.. కథ మారుతోంది! భద్రం బ్రదరూ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ చదువుల మోజులో అనేకమంది విద్యార్థులు కన్సల్టెన్సీల మాయలో పడి మోసపోతున్నారు. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ తంతు సర్వసాధారణంగా మారిపోయింది. ఇదే సమయంలో విదేశాల్లో ఎంఎస్ కోర్సులకు ప్రవేశాలుంటాయి. దీంతో వివిధ రూపాల్లో గ్రాడ్యుయేట్ల, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల ఫోన్ నంబర్లు సంపాదిస్తున్న కన్సల్టెన్సీలు, ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలోని వర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని పత్రాలూ తామే రెడీ చేస్తామని చెబుతున్నాయి. అంతేకాదు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు తాత్కాలిక సర్దుబాటు చేసేవారిని ఏర్పాటు చేస్తామంటూ విద్యార్థుల్ని ముగ్గులోకి దింపుతున్నాయి. దీంతో ఏదో ఒక కారణంగా అమెరికా లాంటి విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ కన్సల్టెన్సీల వలలో చిక్కుతున్నారు. లక్షకు రూ.10 వేలు కమీషన్! మన రాష్ట్రం నుంచి ఎంఎస్ కోసం ఏటా ఒక్క అమెరికా నుంచే 12 వేల మంది వెళ్తున్నారు.కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు మరో 15 వేల మంది వెళ్తున్నారు. ఎంఎస్ కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ వర్సిటీ ఫీజులతో పాటు, చదువుకునే సమయంలో ఖర్చులన్నీ తానే భరించాలి. చదువు పూర్తయ్యే వరకు ఎలాంటి ఉద్యోగం చేయడానికి వీల్లేదు. దీంతో విశ్వవిద్యాలయం ఫీజు రూ.25 లక్షలు, ఇతర ఖర్చులకు మరికొంత నగదు బ్యాంకులో ఉన్నట్టు చూపించాలి. లేదా తగిన ఆదాయ వనరులున్నట్టు అధికారిక పత్రాలు చూపించాలి. ఇంజనీరింగ్ తర్వాత కొనసాగింపుగా మరే కోర్సులోనూ చేరని వాళ్లు, ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నట్టుగా చూపించాలి. సంబంధిత పత్రాలతో పాటు, ఉద్యోగానుభవానికి సంబంధించిన పత్రాలు కూడా కన్సల్టెన్సీలే సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఊరూ పేరూ లేని కంపెనీలతో నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్ చేసినట్టు ధ్రువపత్రాలు పుట్టిస్తున్నారు. అంతేకాదు వాళ్లే విద్యార్థి పేరుతో అప్పటికప్పుడు ఖాతా తెరిపించి, అందులో తమకు తెలిసిన వారి ద్వారా డబ్బులు వేయిస్తున్నారు. ముందు చెక్‌పై సంతకం పెట్టించుకుని విద్యార్థి వెళ్లిన వెంటనే డ్రా చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకుంటున్నారు. బ్యాంకులో డబ్బులు వేసిన వ్యక్తికి లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ ఇప్పిస్తున్నారు. నకిలీలపై పెరిగిన నిఘా.. అమెరికా, మరికొన్ని దేశాలు నకిలీ పత్రాలు, బ్యాంకు ఖాతాలపై గత రెండేళ్ళుగా దృష్టి పెట్టాయి. ప్రైవేటు సంస్థల చేత విచారణ చేయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఇలాంటి అనేక ఉదంతాలు వెలుగుచూశాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా కన్సల్టెన్సీల దందా కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు మోసపోతూనే ఉన్నారు. కొన్నిసార్లు వీసానే మంజూరు కావడం లేదు. మరికొన్ని సందర్భాల్లో వీసా వచ్చి విమానం ఎక్కినా విదేశాల్లో దిగాక విమానాశ్రయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా బయటపడ్డారనే సమాచారం తెలిసేవరకు గుండెలరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దొరికిన వారెందరో.. ►ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఈ విధమైన నకిలీ పత్రాలు వెలుగు చూశాయి. దీంతో ఎంబసీ అధికారులు ఢిల్లీ చాణక్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు చేసి పలువురిని అరెస్టు చేశారు. ►హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన వెర్టెక్స్ నెట్‌కామ్ సొల్యూషన్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినట్టు ఓ కన్సల్టెన్సీ నకిలీ పత్రాలు సృష్టించినట్టు తేలింది. ఇదే సంస్థ పేరుతో ఇంటర్న్‌షిప్ లెటర్, మహారాష్ట్రలోని గోదావరి అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ కో–ఆపరేటివ్ బ్యాంకు పాస్‌బుక్, అందులో రూ.24 లక్షలున్నట్టు పత్రాలు సమర్పించి దొరికిపోయారు. ►వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి సాఫ్ట్‌టెక్ కంప్యూటర్స్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు పేర్కొని, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో రూ.25 లక్షలు ఉన్నట్టు చూపించి పట్టుబడ్డాడు.ఇదే జిల్లాకు చెందిన మరో అభ్యర్థి సాఫ్ట్‌టెక్ కంప్యూటర్స్‌లో పైతాన్ కోర్సు చేసినట్టు నకిలీ పత్రాలు సమర్పించి పట్టుబడ్డాడు. ►ఏప్రిల్ నెలలో మొత్తం ఆరు కన్సల్టెన్సీ సంస్థలపై కేసులు నమోదు కావడం గమనార్హం. నాన్న కల నిజం చేయాలని.. హైదరాబాద్‌లోని సుచిత్ర సర్కిల్లో ఉండే కన్సల్టెన్సీ ఏజెంట్ ఫోన్ చేసి నమ్మించాడు. అమెరికాలో చదువు కోవడమే కాకుండా, ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తానన్నాడు. మా నాన్నకు నేను అమెరికా వెళ్లాలనేది కల. అక్కడ అందరూ డాలర్లు సంపాదిస్తున్నారనే ఆలోచన ఉండేది. ఆయన కల నిజం చేయాలని కన్సల్టెన్సీ చెప్పినట్టు చేశాం. బ్యాంకు ఖాతాలో ఎవరు డబ్బులేశారో? అనుభవ పత్రాలు ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు. వీసా ఇంటర్వ్యూలో అమెరికన్ ఎంబసీ కనిపెట్టింది. నేను నిజం చెప్పి తప్పించుకున్నాను. కానీ రూ.4 లక్షల వరకు పోగొట్టుకున్నాను. – నవీన్ (అమెరికన్ ఎంబసీ వీసా ఇంటర్వ్యూలో పట్టుబడ్డ విద్యార్థి, వరంగల్) కన్సల్టెన్సీల ఉచ్చులో పడొద్దు విదేశాలకు వెళ్లే విద్యార్థులు తెలియకుండానే కన్సల్టెన్సీల ఉచ్చులో పడుతున్నారు.ఒకసారి వెళ్ళాక ఏమవుతుందిలే అని తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ విదేశాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంది. విశ్వసనీయత కోణంలో వాళ్ళు చూస్తారు. ఈ మధ్య సర్టిఫికెట్లు కూడా నకిలీవి సృష్టిస్తున్నారు. ఇలాంటి మార్గాన్ని విద్యార్థులు ఎంచుకోవద్దు. – తుమ్మల పాపిరెడ్డి (ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్) -
చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త
సాక్షి, అమరావతి: చైనాలో చదవాలనుకునే విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వాటిలో చేరే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించాయి. ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ ఉమ్మడిగా, ఎన్ఎంసీ వేర్వేరుగా ఇటీవల సర్క్యులర్లు విడుదల చేశాయి. గత కొంతకాలంగా చైనాలో మళ్లీ కోవిడ్ తీవ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది. విద్యార్థులకు ఆన్లైన్లో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఎంసీ సూచించాయి. ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని మంచి విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలని కోరాయి. ‘కోవిడ్ నేపథ్యంలో చైనా ప్రభుత్వం నవంబర్ 2020 నుంచి అన్ని వీసాలను సస్పెండ్ చేసింది. వీటి కారణంగా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు చైనాకు తిరిగి వెళ్లలేకపోయారు. ఆ ఆంక్షలను ఇంకా తొలగించలేదు సరికదా చదువుల కొనసాగింపునకు వీలుగా ఇప్పటివరకు పరిమితులతో కూడా సడలింపు ఇవ్వలేదు. ఈ తరుణంలో చైనాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రస్తుత, రాబోయే విద్యా సంవత్సరాలకు వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటీసులు జారీ చేశాయి. వివిధ కోర్సుల్లో చేరిన వారితోపాటు కొత్తగా చేరే వారికి ఆయా కోర్సులను ఆన్లైన్లో నిర్వహిస్తామని ఆ వర్సిటీలు తెలిపాయి. భారతదేశంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా ఆన్లైన్ విధానంలో అభ్యసించే డిగ్రీ కోర్సులను యూజీసీ, ఏఐసీటీఈ గుర్తించవు. విద్యార్థులు నిర్దిష్ట డిగ్రీ కోర్సును ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేశంలో అనుమతులు లేని కోర్సులను విదేశాల్లో అభ్యసించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి’ అని ఏఐసీటీఈ, యూజీసీ హెచ్చరించాయి. ఆన్లైన్ విధానంలో సమస్యలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కూడా ఇదే విధమైన నోటీసును ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసింది. చైనా వర్సిటీల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆ దేశం విధించిన కఠినమైన ఆంక్షల గురించి ముందుగానే నోటీసు ద్వారా తెలియజేసింది. విదేశీ వర్సిటీల్లో విద్యను అభ్యసించడానికి తగిన దేశాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కోవిడ్ కేసులు వెలుగుచూడటంతో 2020 మార్చిలో భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆన్లైన్ విధానంలో చదువులను కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్స్ విషయంలో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను చైనాతో చర్చించి పరిష్కరించాలని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
విదేశీ చదువుల్లో ఏపీ దూకుడు
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే అగ్రస్థానంలో ఉన్నారు. 2016 నుంచి 2021 వరకు ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో 15 శాతం మంది ఏపీ విద్యార్థులే కావడం విశేషం. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 2019–2020లో కరోనా కారణంగా విదేశాలు రాకపోకలపై నిషేధం విధించాయి. పలు దేశాలు వీసాల మంజూరును నిలిపేయడంతో విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో విదేశాల్లో చదువులకు వెళ్లినవారు సైతం వెనక్కి వచ్చేశారు. అగ్రభాగాన ఏపీ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఏటా ఏపీ నుంచే అత్యధిక శాతం మంది ఉంటున్నారు. దేశం మొత్తం మీద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2016లో 3,71,506 మంది విదేశాలకు వెళ్లారు. వీరిలో ఏపీ విద్యార్థులు 12.43 శాతం మంది ఉన్నారు. ఇక 2017లో 4,56,823 మంది వెళ్లగా వారిలో ఏపీ విద్యార్థుల శాతం.. 12.27. అలాగే 2018లో 5,20,342 మంది విదేశాలకు వెళ్లగా 12.06 శాతం మంది ఏపీ విద్యార్థులే. 2019లో 5,88,931 మందికిగాను ఏపీ విద్యార్థుల శాతం.. 11.79గా ఉంది. 2020లో 2,61,604 మంది విదేశీ విద్యార్థుల్లో 13.62 శాతం మంది ఏపీ విద్యార్థులున్నారు. ఇక ఈ ఏడాది విదేశాలకు వెళ్లిన 71,769 మందిలో 16.42 శాతం మంది ఏపీ విద్యార్థులే ఉండడం విశేషం. (చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు) 2020లో తగ్గిపోయిన విద్యార్థులు.. 2020 తర్వాత గణాంకాలను పరిశీలిస్తే.. దేశం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్య ఆ ఏడాది ఒక్కసారిగా పడిపోయింది. కాగా, గత ఆరేళ్లలో 2019లో అత్యధికంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఆ ఏడాది దేశం నుంచి 5,88,931 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఇది 2020లో 2,61,406కు తగ్గిపోయింది. 2020 తర్వాత అత్యధిక కాలం ప్రవేశ నిషేధాలు అమలు కావడం, వీసాలు నిలిపివేయడం విదేశీ చదువులపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా సహా కొన్ని దేశాలు నిషేధాలను పాక్షికంగా సవరించాయి. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక వీసాల మంజూరును ప్రారంభించాయి. ఈ ఏడాది మంజూరైన వీసాలను బట్టి 71,769 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. వీరిలోనూ ఏపీ విద్యార్థులే అత్యధికం. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 11,790 మంది విదేశీ చదువులకు వెళ్లారు. ఏపీ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర నుంచి 10,166 మంది, గుజరాత్ నుంచి 6,383 మంది, పంజాబ్ నుంచి 5,791 మంది, తమిళనాడు నుంచి 4,355 మంది, కర్ణాటక నుంచి 4,176 మంది ఉన్నారు. (చదవండి: ఆరోగ్యంలో అగ్రపథం.. టాప్ 5లో ఏపీ) -
Study Abroad: దుబాయ్ పిలుస్తోంది!
భారత విద్యార్థుల విదేశీ విద్య గమ్యస్థానం మారుతోంది. ఇప్పటివరకు అమెరికాకు పోటెత్తిన భారత యువత ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆసక్తికరంగా భారత్ వెలుపల అత్యధిక ఇండియన్ స్టూడెంట్స్ యూఏఈలో చదువుతుండటం తాజా పరిణామం. భారత విద్యార్థులు తమ గమ్యస్థానంగా అమెరికాను కాదని ఇతర దేశాలను ఎందుకు ఎంచుకుంటున్నారో ఈ వీడియో చూసి తెలుసుకోండి. -
అమెరికాకు తగ్గుతున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?
అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఏకైక లక్ష్యం కలిగిన విద్యార్థుల్లో 47 శాతం మంది ఇండియా, చైనా నుంచి మాత్రమే ఉన్నారని తెలుస్తున్నది. 2019–20 విద్యాసంవత్సరంలో యుకె, ఆస్ట్రేలియాకు వెళ్ళిన ప్రపంచ యువతలో భారతదేశానికి 2వ స్థానం దక్కింది. ఇటీవలి కాలంలో కెనడా వెళ్ళాలనే భారత యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతీయ యువతలోని శాస్త్రసాంకేతిక నైపుణ్యాలు, సులభంగా కలిసి పోగలతత్వం, నేర్చుకోవాలనే తృష్ణ, శ్రమించే గుణం, ఆంగ్లభాషలో పట్టు లాంటి ప్రత్యేకతల నడుమ మన విద్యార్థులు విదేశీ చదువుల్లో రాణిస్తున్నారు. కోవిడ్–19 కారణంతో 5.4 శాతం దేశ యువత విదేశీ చదువులను మానుకోవడం జరిగింది. కరోనా విజృంభణతో విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూలతో 2020లో విమానయాన ఆటంకాలు, వీసాల విడుదలలో ఇక్కట్లు, విదేశీయానానికి అధిక వ్యయం వంటి కారణాలతో 42 శాతం యువత తమ ప్రయాణ ప్రణాళికలను తాత్కాలికంగా పోస్ట్ఫోన్ చేసుకోవలసిన దుస్థితి వచ్చింది. 2021లోని జనవరి, ఫిబ్రవరిలో 72,000 మంది వెళ్ళాల్సి ఉండగా, వారి విదేశీయానానికి 2వ వేవ్ బ్రేకులు వేసింది. కోవిడ్–19 వేవ్‌ల భయంతో వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఎంబసీలు, హై కమిషన్లు విరామం ప్రకటించారు. అనేక దేశాలు భారతీయ యువత ప్రవేశానికి నిషేధాలు, ఆంక్షలు కూడా విధించాయి. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కోవిడ్ టీకా పత్రం తప్పనిసరి చేయడం, కొన్ని కంపెనీల టీకాలను (కొవాక్సీన్, స్పుత్నిక్–వి లాంటివి) గుర్తించకపోవడం కూడా మన యువతకు అడ్డంగా నిలుస్తున్నాయి. కోవిడ్–19 వేవ్స్ పట్ల ఖచ్చితమైన అంచనాలు లేనందున విదేశాలకు వెళ్ళాలనే యువతకు దినదిన గండంగా తోస్తున్నది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అన్ని టీకాలను విశ్వ దేశాలు గుర్తించాలని, విమానయానం సులభతరం చేయాలని, టికెట్ ధర తగ్గించాలని, వీసా నియమనిబంధనలు సరళతరం చేయాలని విద్యార్థులు, తల్లితండ్రులు, పౌరసమాజం కోరుకొంటున్నది. త్వరలో కరోనా మబ్బులు తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని, సరస్వతి కోవెలలు చదువుల ధ్వనులతో నిండుగా వెలిగి పోవాలని కోరుకుందాం. - డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, కరీంనగర్ -
చలో యూకే.. పోస్ట్ స్టడీ వర్క్ ఇక.. ఓకే!
యూకేలో ఉన్నత విద్య.. మన దేశ విద్యార్థులకు.. టాప్–4 డెస్టినేషన్! అకడమిక్‌గా పలు వెసులుబాట్లు ఉండటంతో.. మన విద్యార్థులు యూకే వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా యూకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త విధానంతో.. బ్యాచిలర్ నుంచి పీహెచ్డీ వరకు..ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ఉద్యోగం దొరికితే.. ఆ దేశంలోనే స్థిరపడొచ్చు. ఇంతకీ.. ఆ కొత్త విధానం ఏంటి? అంటే.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా!! ఈ విధానం ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానంతో.. భారత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఈ నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధి విధానాలు.. భారత విద్యార్థులకు ప్రయోజనాలు.. పోస్ట్ స్టడీ వర్క్ గరిష్ట సమయం తదితర అంశాలపై విశ్లేషణ... అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం ఇటీవల గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్డీ విద్యార్థులు మూడేళ్లుపాటు పోస్ట్ స్టడీ వర్క్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా మంజూరైతే.. ఆఫర్ లెటర్ లేకపోయినా.. అక్కడే ఉండి ఉద్యోగానేష్వణ చేయొచ్చు. ఉద్యోగం లభిస్తే గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి ముగిశాక.. ఇతర వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు గ్రాడ్యుయేట్ వీసాతో ఉద్యోగం పొంది.. రెండేళ్లు, లేదా మూడేళ్ల వ్యవధి పూర్తయ్యాక.. స్కిల్డ్ వర్కర్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరైతే.. సదరు అభ్యర్థులు మరింత కాలం యూకేలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. గ్రాడ్యుయేట్ వీసాకు అర్హతలు ► జూలై 1, 2021 నుంచి గ్రాడ్యుయేట్ రూట్ వీసా అమల్లోకి వచ్చింది. ► ఈ వీసా పొందేందుకు యూకే ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలు పేర్కొంది. ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే నాటికి యూకేలో ఉండాలి. ► ప్రస్తుతం స్టూడెంట్ వీసా లేదా చదువుల కోసం ఇచ్చే టైర్–4 జనరల్ వీసా కలిగుండాలి. ► యూకే విద్యా విధానం నిబంధనల ప్రకారం–నిర్దేశించిన కనీస కాలపరిమితితో ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ► కనీసం 12 నెలల వ్యవధిలోని కోర్సులను స్టూడెంట్ వీసా లేదా, టైర్–4 జనరల్ వీసా ద్వారా చదివుండాలి. స్టూడెంట్ వీసా ముగిసే లోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకొని.. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం పొందాలనుకునే విద్యార్థులు.. తమ స్టూడెంట్ వీసా లేదా టైర్–4 జనరల్ వీసా కాలపరిమితి ముగిసేలోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిబంధన కల్పిస్తున్న మరో ముఖ్యమైన వెసులుబాటు.. విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్లు పొందకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా పొందేందుకు వీలుగా తాము కోర్సులు పూర్తిచేసుకున్న యూకే ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ‘ఆన్లైన్’ విద్యార్థులకూ.. అవకాశం కరోనా కారణంగా యూకే యూనివర్సిటీల్లో ఆన్లైన్ విధానంలో కోర్సులు చదివిన విద్యార్థులు కూడా గ్రాడ్యుయేట్ వీసా విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా పరిస్థితుల్లో 2020 నుంచి లాక్డౌన్, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాంతో విద్యా సంస్థలు ఆన్లైన్లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించి... బోధన సాగించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ వెసులుబాటు కల్పించారు. ఫలితంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో స్టూడెంట్ వీసా లేదా టైర్–4 వీసా కలిగి.. జనవరి 24, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2021లోపు యూకే ఇన్స్టిట్యూట్లలో యూకే వెలుపలే ఉంటూ.. ఆన్లైన్ విధానంలో కోర్సులు అభ్యసించిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లో పూర్తి చేయాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ► పాస్ట్ పోర్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, స్కాలర్షిప్ లేదా స్పాన్సర్షిప్ ప్రొవైడర్ నుంచి ధ్రువీకరణ పత్రం, కోర్సు ప్రవేశ సమయంలో ఇచ్చే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్(సీఏఎస్) రిఫరెన్స్ నెంబర్, బయో మెట్రికల్ రెసిడెన్స్ పర్మిట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ► పీహెచ్డీ విద్యార్థుల విషయంలో అకడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికెట్ కూడా అవసరం. ఎనిమిది వారాల్లో నిర్ణయం ఆన్లైన్లో గ్రాడ్యుయేట్ వీసా దరఖాస్తును పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకునేందుకు గరిష్టంగా ఎనిమిది వారాల సమయం పడుతుందని యూకే ఇమిగ్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తుకు ఆమోదం లభిస్తే ఈ–మెయిల్ లేదా యూకే ఇమిగ్రేషన్ పోర్టల్‌లో దానికి సంబంధించిన ధ్రువీకరణను తెలుసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసాతో ప్రయోజనాలు ► కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం లభిస్తుంది. ► ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. ► స్వయం ఉపాధి పొందొచ్చు. స్వచ్ఛంద సేవకు అవకాశం ఉంటుంది. ► గ్రాడ్యుయేట్ వీసా కాల పరిమితి సమయంలో యూకే నుంచి స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లి, మళ్లీ యూకేకు తిరిగిరావచ్చు. నిపుణుల కొరతే కారణం ► యూకేలో పలు రంగాల్లో నిపుణులైన మానవ వనరుల కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం తాజాగా గ్రాడ్యుయేట్ రూట్ వీసాను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ► ప్రస్తుతం యూకేలో హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో నిపుణుల కొరత కనిపిస్తోంది. ► 2030 నాటికి ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం కూడా తాజా గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం తేవడానికి మరో కారణంగా చెబుతున్నారు. భారత విద్యార్థులకు ప్రయోజనం గ్రాడ్యుయేట్ రూట్ వీసాతో భారత విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గత నాలుగైదేళ్లుగా యూకేకు వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తాజా విధానంతో వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. ఈ వీసా కాల పరిమితి సమయంలో అక్కడే ఉండి ఉద్యోగం సాధించి.. అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ కూడా పొందొచ్చు. యూకేలో విద్యార్థులు యూకేలో విద్య కోసం గత నాలుగేళ్లుగా భారత్ నుంచి వెళుతున్న విద్యార్థుల సంఖ్య వివరాలు.. » 2016 – 11,328 » 2017 – 14,435 » 2018 – 19,505 » 2019 – 34,540 » 2020 – 49,884 గ్రాడ్యుయేట్ రూట్ వీసా.. ముఖ్యాంశాలు ► జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం. ► బ్యాచిలర్, పీజీ విద్యార్థులు రెండేళ్లు; పీహెచ్డీ అభ్యర్థులు మూడేళ్లు అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ► 2020, 2021లో యూకేలోని వర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం. ► కోవిడ్ నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ విధానంలో అభ్యసించిన వారు కూడా అర్హులే. ► ఉద్యోగం సొంతం చేసుకున్నాక.. వర్క్ వీసాకు బదిలీ చేసుకునే వీలుంటుంది. ► కోర్సుల సర్టిఫికెట్లు రాకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. ఎంతో సానుకూల అంశం యూకే తాజా నిర్ణయం.. భారత విద్యార్థులకు ఎంతో సానుకూల అంశంగా చెప్పొచ్చు. యూకేలోని విదేశీ విద్యార్థుల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంటోంది. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. గ్రాడ్యుయేట్ వీసా ద్వారా భారత విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయోజనం పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం విదేశీయులకు ఇచ్చే వీసాల విషయంలోనూ.. దాదాపు యాభై శాతం వీసాలు మన దేశానికి చెందిన వారికే లభిస్తున్నాయి. – జె.పుష్పనాథన్, డైరెక్టర్ (సౌత్ ఇండియా), బ్రిటిష్ కౌన్సిల్ -
వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా!
విదేశీ చదువు ఒక డోర్ అనుకుంటే.. దాన్ని తెరిచే ‘కీ’.. వీసా ఇంటర్వ్యూ! నిజానికి స్టడీ అబ్రాడ్ విద్యార్థులు విమానం ఎక్కాలా.. వద్దా.. అని నిర్ణయించేది ఈ వీసా ఇంటర్వ్యూనే! ఫారిన్ ఎడ్యుకేషన్ దరఖాస్తు ప్రక్రియలో చివరి అంకమైన వీసా ఇంటర్వ్యూ అత్యంత కీలకమైంది. కాని విదేశాల్లో చదవాలని కలలు కనే ఎంతో మంది ప్రతిభావంతులు... వీసా ఇంటర్వ్యూలో తడబడి అవకాశాన్ని జార విడుచు కుంటున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఫాల్ సెషన్ (ఆగస్టు–సెప్టెంబర్)కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. వీసా ఇంటర్వ్యూల తీరుతెన్నులపై ప్రత్యేక కథనం... ఇంటర్వ్యూ ఉద్దేశం స్టడీ అబ్రాడ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు... సదరు విదేశంలో నివసించేందుకు, విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నారా.. అనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. చదువు పూర్తయిన తర్వాత అభ్యర్థి స్వదేశానికి తిరగి వెళ్తాడా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా విద్యార్థి ఇచ్చే సమాధానాల్లో నిజాయితీని కూడా చూస్తారు. ఒక్కోదేశంలో ఒక్కో తీరు ► విదేశీ విద్యకు సంబంధించి వీసా ఇంటర్వ్యూ విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ► అమెరికాలో విద్యను అభ్యసించాలంటే.. ఎఫ్–1 వీసా పొందాల్సి ఉంటుంది. దీని కోసం వీసా ఇంటర్వ్యూకు హాజరవడం తప్పనిసరి. ► యూకే బోర్డర్ ఏజెన్సీ సైతం వీసా ఇంటర్వ్యూని తిరిగి ప్రవేశపెట్టింది. ఒకసారి వీసా తిరస్కారానికి గురైన లేదా ప్రామాణిక టెస్టుల్లో తక్కువ స్కోర్లు పొందిన అభ్యర్థులను వీసా ఇంటర్వ్యూకి పిలిచే అవకాశాలు ఎక్కువ. ► స్టడీ అబ్రాడ్ పరంగా మరో ముఖ్యమైన దేశం కెనడాకు సంబంధించి అవసరం అనుకుంటేనే విద్యార్థులను వీసా ఇంటర్వ్యూకు పిలుస్తారు. కెనడాలో స్టూడెంట్ వీసా పొందాలంటే.. వైద్య పరీక్షలు తప్పనిసరి. ఆస్ట్రేలియా భిన్నంగా ఆస్ట్రేలియా.. దరఖాస్తు ఆధారంగా అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలవాలా.. వద్దా అనేది నిర్ణయిస్తోంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏదైనా ఒకటి జరగొచ్చు. ► వీసా ఇంటర్వ్యూయర్ అభ్యర్థిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం. ► అభ్యర్థిని పిలిచి నేరుగా ఇంటర్వ్యూ చేయడం. ► మరింత సమాచారం కోరుతూ అభ్యర్థికి లెటర్ రాయడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండానే అభ్యర్థికి తిరస్కరణ లేఖ పంపడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండా వీసా మంజూరు చేయడం. అవసరమైన పత్రాలు వీసా ఇంటర్వ్యూలో ప్రధానంగా అప్లికేషన్ లేదా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్‌ను అడుగుతారు. దీంతోపాటు ఇంటర్వ్యూయర్ కింది డాక్యుమెంట్లలో దేన్నైనా అడిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆయా డాక్యుమెంట్లను సిద్ధంగా తమ వద్ద ఉంచుకోవడం మంచిది. అవి.. పాస్‌పోర్ట్, ఫీజు రిసీట్, 10–12 తరగతులు, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల మెమోలు, జీఆర్ఈ/జీమ్యాట్/శాట్ స్కోర్‌కార్డ్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్. ఫైనాన్షియల్ ప్రొఫైల్ వీసా ఇంటర్వూ్వ ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యమైంది.. విద్యార్థి ఫైనాన్షియల్ ప్రొఫైల్. అభ్యర్థి సదరు దేశంలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమతను కలిగి ఉన్నాడా.. లేదా? అనే నిర్ణయానికి వచ్చేందుకు పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. అవి.. –లోన్ అప్రూవల్ లెటర్, సేవింగ్స్ బ్యాంక్ స్టేట్మెంట్ (3 నెలలు), ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్స్(3 సంవత్సరాలు). ఇలా చేస్తే మేలు ► వీసా ఇంటర్వ్యూను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూయర్ అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని.. సమాధానాలను చక్కటి ఇంగ్లిష్‌లో చెప్పగలిగేలా ఉండాలి. ► చేరేబోయే ప్రోగ్రామ్ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఆ కోర్సును సదరు దేశంలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారో చెప్పి ఒప్పించగలగాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశంలో లభించే ఉద్యోగ అవకాశాలను వివరించేలా సిద్ధంకావాలి. ► ఇంటర్వ్యూయర్ వద్దకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. తక్కువ సమయంలో ఇంటర్వ్యూని ముగించాలని భావిస్తుంటారు. కాబట్టి సమాధానాలను సూటిగా చెప్పడం ద్వారా ఇంటర్వ్యూయర్ మనుసు గెలవొచ్చు. అడిగే ప్రశ్నలు ► వీసా ఇంటర్వ్యూయర్ పలు ప్రశ్నలను అడిగేందుకు ఆస్కారం ఎక్కువ. అవి... ► విదేశీ విద్య కోసం ఈ దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు ► భారత్‌లో ఎందుకు చదవాలనుకోవడం లేదు ► ఎందుకు నిర్దిష్ట ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ► మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే(సదరు దేశం) ఉద్యోగం అవకాశం దక్కితే ఏం చేస్తారు ► ఒకవేళ వ్యక్తిగత ఆర్థిక స్థోమత విద్యాభ్యాసానికి సహకరించని పరిస్థితుల్లో మీ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయి? డూస్.. డోంట్స్ ► చక్కటి వస్త్రధారణతోపాటు సంభాషణ, ప్రవర్తనపై దృష్టిపెట్టాలి. ► ప్రశ్నలను ఆసాంతం విని..తర్వాత సమాధానానికి ఉపక్రమించాలి. ► ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ఇంటర్వ్యూయర్‌తో వాదించడం సరికాదు. ► సదరు దేశం, విద్యనభ్యసించబోతున్న విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవాలి. ► అవసరమైన డాక్యుమెంట్లను వెంట సిద్ధంగా ఉంచుకోవాలి. -
Study Abroad: విదేశీ స్కాలర్‌షిప్‌లకు మార్గమిదిగో..!
గత కొన్నేళ్లుగా దేశంలోని యువత దృష్టి విదేశీ యూనివర్సిటీల్లో చదువులపై ఎక్కువగా ఉంటోంది. ఏదో రకంగా స్టడీ కోసం అబ్రాడ్‌కు వెళ్లాలని గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. వీరి మార్గంలో అధిక ఫీజులు, ఇతర వ్యయాలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ప్రతిభావంతులకు ఆర్థిక అవరోధాలు అడ్డురాకూడదనే సదాశయంతో వివిధ దేశాలు, పలు ట్రస్టులు స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ విద్య అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు సంబంధించి ముఖ్యమైన స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లపై ప్రత్యేక కథనం.. ఆస్ట్రేలియా అవార్డ్స్ స్కాలర్షిప్స్ వీటిని ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ అందిస్తోంది. ఆస్ట్రేలియాలో పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపుతోపాటు రీసెర్చ్, అకడమిక్ వ్యయాలకు సరిపడే మొత్తం స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది. వెబ్సైట్: dfat.gov.au ► ఎండీవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్: ఈ ప్రోగ్రామ్ పరిధిలో పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది. పీజీ అభ్యర్థులకు రెండేళ్లు, పీహెచ్డీ అభ్యర్థులకు మూడున్నరేళ్ల వరకు స్కాలర్షిప్ గడువు ఉంటుంది. ► ఎండీవర్ ఆస్ట్రేలియా చెంగ్ కాంగ్ రీసెర్చ్ ఫెలోషిప్: నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో రీసెర్చ్ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం. ఎంపికైన అభ్యర్థులకు 23,500 ఆస్ట్రేలియా డాలర్లు లభిస్తాయి. ► ఎండీవవర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అవార్డ్స్: ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిధిలోని కళాశాలలు, యూనివర్సిటీలలో డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, అసోసియేట్ డిగ్రీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు వీటిని అందజేస్తారు. ► ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్షిప్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఉద్దేశించిన పథకం ఇది. ప్రతి ఏటా మూడు వందల మంది విదేశీ విద్యార్థులను ఆయా ప్రామాణికాల(రీసెర్చ్ టాపిక్, అకడమిక్ రికార్డ్ తదితర) ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్స్: https://india.highcommission.gov.au/ https://www.studyinaustralia.gov.au/ కెనడా: బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ హెల్త్ సైన్స్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో రీసెర్చ్ ఔత్సాహికులకు బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్‌ను అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి డెబ్భై వేల డాలర్లు లభిస్తాయి. ఏటా 70 ఫెలోషిప్స్(అన్ని దేశాలకు కలిపి) అందుబాటులో ఉంటాయి. వ్యవధి: రెండు సంవత్సరాలు. వెబ్సైట్: banting.fellowships-bourses.gc.ca ► ట్రుడే సాలర్షిప్స్: వీటిని ది ట్రుడే ఫౌండేషన్ అందిస్తోంది. డాక్టోరల్(రీసెర్చ్) స్టడీస్ విద్యార్థులకు అందిస్తారు. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్డీ చేస్తున్న వారికి ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా అరవై వేల డాలర్ల స్కాలర్‌షిప్‌తోపాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్ అలవెన్స్ లభిస్తుంది. వెబ్సైట్: www.trudeaufoundation.ca ► వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్: కెనడియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం... వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏటా యాభై వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు స్కాలర్షిప్ అందిస్తారు. వెబ్సైట్: vanier.gc.ca ► కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్–మాస్టర్స్ ప్రోగ్రామ్స్: ఇది కెనడా ప్రభుత్వ గుర్తించిన యూనివర్సిటీల్లో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకం. ఏటా కెనడా సహా అన్ని దేశాలకు సంబంధించి మొత్తం 2,500 మందికి వీటిని అందజేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి 17,500 డాలర్లు స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది. వెబ్సైట్: https://www.nserc-crsng.gc.ca/ -
స్టడీ అబ్రాడ్: ఈ పొరపాట్లు లేకుంటే కల సాకారమే!
దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల స్వప్నం.. స్టడీ అబ్రాడ్. ఈ కలను సాకారం చేసుకోవాలని ఎంతోమంది కష్టపడుతుంటారు. కానీ, విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా,సుదీర్ఘంగా ఉంటుంది. దాంతో విద్యార్థులు అప్లికేషన్ దశలోనే పొరపాట్లు చేస్తూ.. ఇబ్బందుల్లో పడుతున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో.. కాస్త అప్రమత్తంగా ఉంటే .. విదేశాల్లో చదువుకోవాలనే తమ కలను నిజం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులు చేస్తున్న పొరపాట్లు–వాటిని అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం.. రీసెర్చ్ లేదు రీసెర్చ్ చేయకపోవడం.. ఇది స్టడీ అబ్రాడ్ అభ్యర్థులు చేస్తున్న తప్పిదాల్లో ముందు వరుసలో ఉంది. చాలామంది అభ్యర్థులు దేశం, విశ్వవిద్యాలయం, కోర్సులు, ఆర్థిక ప్రో త్సాహకాలు(స్కాలర్షిప్స్), ఫీజులు, ప్రవేశ విధానాలు, క్యాంపస్, లొకేషన్, వాతావరణం, లివింగ్ కాస్ట్ వంటి అంశా లపై లోతుగా అధ్యయనంచేసి.. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. దాంతో వారి జాబితాలో కేవలం కొన్ని యూనివర్సిటీలు, కోర్సులు మాత్రమే ఉంటున్నాయి. ఫలితంగా స్టడీ అబ్రాడ్ కల క్లిష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఆన్లైన్లో సమస్త సమాచారం లభ్యమవుతోంది. అభ్యర్థులు సరైన రీసెర్చ్‌తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. సరైన వ్యక్తికి సరైన ప్రశ్న! విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ కనీసం ఒక అడ్మిషన్ కౌన్సెల ర్ను నియమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అవస రమైన సలహాలు, సూచనలు, గైడెన్స్ అందించడం వీరి ప్రధాన విధిగా ఉంటుంది. కాబట్టి స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక అభ్యర్థుల సందేహాల నివృత్తికి నేరుగా వర్సిటీని మెయిల్ ద్వారా సంప్రదించొచ్చు. తద్వారా సరైన వ్యక్తి నుంచి సరైన పరిష్కారాన్ని పొందవచ్చు. ఇలా చేయకుండా.. గూగుల్‌లో తోచింది బ్రౌజ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అంటున్నారు నిపుణులు. ప్రణాళిక లేమి భారత్‌లో మాదిరిగా విదేశీ యూనివర్సిటీలు, ఇన్స్టి ట్యూట్స్.. ఒకే సమయంలో ప్రవేశ ప్రక్రియను ప్రారం భించవు. ప్రతి వర్సిటీ, ఇన్స్టిట్యూట్ తనదైన ప్రత్యేక అడ్మిషన్ షెడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అనేక ఇన్స్టి ట్యూట్లు ఏడాది పొడవునా దరఖాస్తులు ఆహ్వానిస్తే.. మరికొన్ని మూడు గడువుల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తు న్నాయి. కాబట్టి అభ్యర్థులు అడ్మిషన్‌కు ఒక సంవత్సరం ముందుగానే మానసికంగా,డాక్యుమెంటేషన్ పరంగా సిద్ధం కావడం ప్రారంభించాలి. అడ్మిషన్ కౌన్సెలర్లు కేవలం విశ్వ విద్యాలయ అంశాల్లోనే అభ్యర్థులకు సహాయపడగలరు. వీసా సంబంధిత విషయాల్లో వారి నుంచి ఎలాంటి తో డ్పాటు అందదు. కాబట్టి వీసా ప్రక్రియను అభ్యర్థులు సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సహనం కోల్పోకుండా.. ఓపిగ్గా ఒక్కో అడుగు వేయాలి. సీటు దక్కితే చాలదు స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులు విశ్వవిద్యాలయంలో సీటు దక్కితే చాలు..వీసా ప్రక్రియ పూర్తయితే సరిపోతుంది అనే కోణంలో ఆలోచిస్తుంటారు. కానీ, వీటితోపాటు సదరు దేశంలో, వర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత స్డూడెంట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే కోణంలోనూ ఆలోచించాలి. తరగ తులు ప్రారంభమైన తర్వాత అందుబాటులో ఉండే ప్రత్యా మ్నాయాలు? డిగ్రీ చేతికొచ్చిన తర్వాత ఏం చేయాలను కుంటున్నారు? తదితర అంశాలపై స్పష్టతతో వ్యవహరిం చాలి. దీనికోసం ముందుగా ఇంటర్న్షిప్స్, ఫ్యాకల్టీ, మెంటార్స్, క్లబ్స్ వంటి విషయాల్లో తగిన రీసెర్చ్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్(ఎస్ఓపీ) విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియలో.. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్వోపీ) చాలా కీలకం. ఇందులో అభ్యర్థులు స్వీయ విజ యాలు, లక్ష్యాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఆఫీసర్స్.. ఈ ఎస్వోపీ ఆధారంగా అభ్యర్థి యూనివర్సి టీలో ప్రవేశానికి అర్హుడా? కాదా?అనే విషయంపై ఒక నిర్ణ యానికి వస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన విజయాలతోపాటు ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో ప్రవేశం, స్పోర్ట్స్ వంటి వాటినీ ఎస్‌వోపీలో పేర్కొనాలి. వీటిని ప్రస్తావించే సమయంలో నిజాయితీగా వ్యవ హరించాలి. ఎస్వోపీ రూపకల్పనలో గొప్పలకు పోవడం మంచికాదు. అలాగే సాధించిన విజయాలను తక్కువ చేసుకోవడం చేయరాదు. ఉన్నది ఉన్నట్లు రాయాలి. ఫాల్, స్రింగ్.. ఏది బెటర్ విదేశీ యూనివర్సిటీలు ఫాల్ సెషన్,స్ప్రింగ్ సెషన్ పేరుతో ఏటా రెండుసార్లు అడ్మిషన్స్ కల్పిస్తాయి. కానీ, చాలా మంది విద్యార్థులకు ఏ సెషన్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో పూర్తి స్పష్టత ఉండదు. ఈ రెండు సెషన్ల మధ్య తేడాల గురించి విద్యార్థులు తప్ప నిసరిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి ఈ రెండు సెషన్ల విషయంలో బోధన, కోర్సులు, ఇతర ప్రోత్సాహకాల పరంగా అనేక వ్యత్యాసాలు ఉంటాయి. సెమిస్టర్ ప్రారంభం.. ఇలా ప్రతి ఏటా ఫాల్ సెషన్ ఆగస్టులో, స్ప్రింగ్ సెషన్ జనవరిలో ప్రారంభమవుతుంది. వీటికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ సదరు సెషన్ ప్రారంభానికి ఆరు నెలల ముందుగానే మొదలవుతుంది. ఫాల్ సెషన్ అడ్మిషన్ల కోసం జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు; స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో యూనివర్సిటీలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. వీటికి అదనంగా మరికొన్ని విశ్వవిద్యాలయాలు రోలింగ్ అడ్మిషన్ల పేరిట ఏడాది పొడవునా దరఖాస్తు ప్రక్రియ చేపడుతుంటాయి. వీటి సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు. ‘ఫాల్’కే మొగ్గు మన దేశం నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఫాల్ సెషన్ అడ్మిషన్లకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణం.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కాగానే..ఎక్కువ కాలం వేచి ఉండకుండా.. విదేశీ వర్సిటీలో అడుగు పెట్టొచ్చు అనే ఆలోచనే. విదేశీ యూనివర్సిటీలు కూడా ఫాల్ సెషన్లోనే ఎక్కువ కోర్సులు, సీట్లను అందుబాటులో ఉంచు తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు వారు మెచ్చిన కోర్సులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు వీటితోపాటు మరికొన్ని అంశాలు కూడా విద్యార్థులు ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కారణమవుతున్నాయి. వీటిలో ప్రధానంగా పేర్కొనాల్సింది.. యూనివర్సిటీలు అం దించే స్కాలర్షిప్స్(ఆర్థిక ప్రోత్సాహకాలు). ఫాల్ సెషన్‌కు ఇతర సెషన్స్‌తో పోల్చితే వర్సిటీలు స్కాలర్షిప్స్ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో అకడమిక్‌గా మంచి ప్రొఫైల్ ఉన్న విద్యార్థులకు ఫాల్ సెషన్లో స్కాలర్షిప్స్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టీచింగ్ అసిస్టెంట్‌షిప్ ఫాల్ సెషన్ విద్యార్థులకు కలిసొస్తున్న మరో అంశం.. టీచింగ్ అసిస్టెంట్‌షిప్. అంటే.. ఒక కోర్సులో చేరిన విద్యార్థి ఆ కోర్సుకు సంబంధించి ప్రొఫెసర్ల వద్ద టీచింగ్ అసిస్టెం ట్‌గా సహకారం అందించడం. విద్యార్థులు అదనపు తరగ తులు, మూల్యాంకన, పరీక్షల ఇన్విజిలేషన్ తదితర అంశా ల్లో సహకారం అందించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధిలో ఉండే ఈ టీచింగ్ అసిస్టెంట్‌షిప్ అవకాశాలు ఫాల్ సెషన్లో ఎక్కుగా లభిస్తాయి. కారణం.. ఫాల్ సెషన్లోనే ఎక్కువ ప్రవేశాలు కల్పించే విధానాన్ని యూనివర్సిటీలు అనుసరి స్తుండటమే. టీచింగ్ అసిస్టెంట్‌షిప్ పొందే విషయంలో.. భారత విద్యార్థులు ఇతర దేశాల విద్యార్థులతో పోల్చితే ముందుంటున్నారు. భారత విద్యార్థుల్లో కష్టపడే తత్వం, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్కువగా ఉండటంతో ప్రొఫెసర్లు సైతం మన విద్యార్థులను తమ అసిస్టెంట్స్‌గా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. స్ప్రింగ్ ఇలా డిసెంబర్/జనవరిలో ప్రారంభమయ్యే స్ప్రింగ్ సెషన్లో.. ఫాల్ సెషన్‌తో పోల్చితే అందుబాటులో ఉండే కోర్సులు, ఇతర ప్రోత్సాహకాలు కొంచెం తక్కువ. అలాగని విద్యార్థులు స్ప్రింగ్ సెషన్లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని భావించాల్సిన పనిలేదు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత స్టడీ అబ్రాడ్ వైపు దృష్టిసారించే వారికి స్ప్రింగ్ సెషన్ అందుబాటులో ఉంటుంది. కొందరు విద్యార్థులు స్టాండర్ట్ టెస్ట్ స్కోర్లను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో.. ఆయా టెస్ట్‌లను మరోసారి రాద్దాం అనే వ్యూహంతో అడుగులు వేస్తూ ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోరు. ఇలాంటి విద్యార్థులకు స్ప్రింగ్ సెషన్లో సానుకూలతలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం సరైన ఆలోచన కాదు. ఫాల్, స్ప్రింగ్ సెషన్ ఏదైనా.. బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో చేరేందుకు కృషి చేయాలి. ఫాల్ సెషన్లో తక్కువ ర్యాంకు ఇన్స్టిట్యూట్లో చేరడం కంటే.. స్ప్రింగ్ సెషన్లో బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడం మేలని గుర్తించాలి. అంతేతప్ప.. స్కాలర్షిప్స్, టీచింగ్ అసిస్టెన్స్ అవకాశాలు తక్కువనే ఆలోచనతో స్ప్రింగ్ సెషన్‌ను విస్మరించరాదు. దరఖాస్తు చేసుకుంటున్న యూనివర్సిటీల్లో, ఆసక్తి గల కోర్సుకు స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని స్ప్రింగ్ సెషన్ ఔత్సాహికులు పరిశీలించాలి. వ్యత్యాసాలు ఫాల్ సెషన్: విద్యార్థుల నుంచి డిమాండ్ ఎక్కువ. అంతే స్థాయిలో అందించే కోర్సుల సంఖ్య కూడా ఎక్కువే. ► బ్యాచిలర్ డిగ్రీ పూర్తవుతూనే అబ్రాడ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందాలనుకునే వారికి ఈ సెషన్ అనుకూలం. ► స్కాలర్షిప్స్, అందుబాటులోని కోర్సుల పరంగా మెరుగైన అవకాశాలు. స్ప్రింగ్ సెషన్: తక్కువ డిమాండ్, తక్కువ సంఖ్యలో కోర్సులు. టెస్ట్ స్కోర్స్ ఉత్తమంగా ఉండి మరో ఏడాది వృథా చేయడం ఎందుకు అనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. ► స్కాలర్షిప్స్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ► మొదటి సంవత్సరంలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ అవకాశం లేకపోవడం ప్రతికూలత. ఇవెంతో కీలకం ► ఏ సెషన్ అయినా.. విద్యార్థులు కంట్రీ, కాలేజ్, కోర్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నచ్చిన కోర్సు కేవలం ఒక సెషన్లో మాత్రమే అందుబాటులో ఉంటే ఆ సెషన్‌కే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ రెండు సెషన్స్‌లోనూ ఉంటే ప్రొఫైల్‌ను మరింత పటిష్టంగా దరఖాస్తు చేసుకుంటే.. స్కాలర్షిప్ దక్కే అవకాశాలు మెరుగవుతాయి. రెండో ప్రామాణికం ‘కాలేజ్’ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం విద్యార్థులు బెస్ట్ కాలేజ్‌లో సీటు లభించాలంటే.. జీఆర్ఈ/ఐఈఎల్టీఎస్ / జీమ్యాట్ తదితర టెస్ట్ స్కోర్స్ అత్యంత మెరుగ్గా ఉండాలని భావిస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.. కాలేజ్‌లు కేవలం టెస్ట్ స్కోర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదు. అభ్యర్థుల ప్రొఫైల్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రొఫైల్ మెరుగ్గా ఉండేలా వ్యవహరించాలి. విద్యార్థులకు అత్యున్నత ఆయుధం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఈ ఎస్ఓపీని అత్యంత మెరుగైన రీతిలో తీర్చిదిద్దేలా కసరత్తు చేయాలి. ► బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్/కాలేజ్‌లు ఉన్న దేశాన్ని గమ్యంగా ఎంచుకోవాలి. చేరాలనుకుంటున్న కోర్సులో అత్యుత్తమ బోధన అందించే కళాశాలలు ఉన్న దేశాలను అన్వేషించి.. వాటి నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫాల్ సెషన్లో అడ్మిషన్ లభించకపోయినా ఫర్వాలేదు.. బెస్ట్ కాలేజే లక్ష్యం అనుకొని స్ప్రింగ్ సెషన్ వైపు మొగ్గు చూపే విద్యార్థులు.. ఈ రెండు సెషన్ల దరఖాస్తు సమయానికి మధ్య ఉండే వ్యవధిని ప్రొఫైల్‌ను మెరుగుపరచుకోవ డానికి వినియోగించుకోవాలి. ఆన్లైన్ కోర్సులు అభ్యసించడం, రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం, టెక్నికల్ పేపర్స్ పబ్లిష్ చేయడం వంటి వాటికి సమయం కేటాయించాలి. స్టడీ అబ్రాడ్.. డాక్యుమెంట్స్ ► అప్లికేషన్, కవరింగ్ లెటర్ ► అప్లికేషన్ ఫీజు ► జీఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, ఎస్ఏటీ పరీక్షల్లో స్కోరు. ► స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ► లెటర్ ఆఫ్ రికమండేషన్ ► వ్యాసాలు ఠి అకడమిక్ సర్టిఫికెట్లు ► ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ► పాస్‌పోర్ట్ ఠి స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయపు పన్ను స్టేట్మెంట్ -
ఎడ్యుకేషన్ లోన్స్.. తీసుకోండి ఇలా!
కళ్ల ముందు కలల కోర్సులు ఎన్నెన్నో! ఆ కోర్సుల్లో చేరితే భవిష్యత్తు బంగారమవుతుందనే భావన! కెరీర్లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే ఆలోచన! కానీ.. చాలామందికి ఆర్థిక పరిస్థితులు వెనక్కులాగుతుంటాయి! రూ.లక్షల్లో ఫీజులు చూసి.. అర్హతలు, అవకాశం ఉన్నా.. నిరాశతో వెనుకంజ వేస్తున్న వైనం! ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు చక్కటి మార్గం.. ఎడ్యుకేషన్ లోన్స్!! ప్రస్తుతం పలు బ్యాంకులు.. విద్యారుణాలు అందిస్తూ.. విద్యార్థుల కెరీర్ ఉన్నతికి దోహదపడుతు న్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యా రుణాలు, అర్హతలు, విధి విధానాలపై విశ్లేషణ.. బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయాలంటే.. కనిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు; గరిష్టంగా రూ.15 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదే విదేశీ విద్యకు వెళ్లాలంటే.. సగటున రూ.50 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఫీజుల భారం కారణంగా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్.. విద్యార్థులకు విద్యా రుణాలు అందించే ఏర్పాట్లుచేశాయి. విద్యా రుణాలు దేశంలోని గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూ ట్లలో,కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికే కాకుండా.. విదేశీ విద్యకు వెళ్లే ప్రతిభావంతులు కూడా అందుకునే అవకాశం ఉంది. ఇన్స్టిట్యూట్కు, కోర్సుకు గుర్తింపు విద్యా రుణాలను అందిస్తున్న బ్యాంకులు.. కొన్ని నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. బ్యాంకుల విధి విధానాల ప్రకారం–ఏఐసీటీఈ, యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే.. సదరు ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఎంట్రన్స్‌లో అర్హత సాధిస్తేనే విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంటే.. ఏదైనా ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి.. కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారికే విద్యా రుణ దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఎంట్రన్స్‌లో మెరిట్ పొందిన వారికే విద్యారుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మేనేజ్మెంట్ కోటా ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. గరిష్టంగా రూ.10లక్షలు, రూ.20లక్షలు ► విద్యా రుణాల మంజూరు, గరిష్ట రుణ మొత్తం విషయంలో ప్రస్తుతం బ్యాంకులు రెండు రకాల విధానాలు అమలు చేస్తున్నాయి. ► దేశంలోని ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నాయి. ► విదేశీ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు రుణం లభిస్తోంది. అవసరమైతే హామీలు ► విద్యా రుణాలను బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానంలో మంజూరు చేస్తున్నాయి. ► అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న శ్లాబ్(రుణ మొత్తం) ఆధారంగా.. భవిష్యత్తులో రీపేమెంట్ పరంగా ముందుగానే కొన్ని హామీ పత్రాలు ఇచ్చే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి. ► శ్లాబ్–1 ప్రకారం– రూ.4 లక్షలు రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు. ► శ్లాబ్–2 ప్రకారం– రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ► శ్లాబ్–3 విధానం ప్రకారం– రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం లభిస్తోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్ సెక్యూరిటీ(స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది. మార్జిన్ మనీ చెల్లింపు ఎడ్యుకేషన్ లోన్ కోరుకునే విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో విద్యకు అయిదు శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రుణం లభించే వ్యయాలు ► ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్/ లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు, విదేశీ విద్య విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం, కంప్యూటర్ కొనుగోలు వ్యయం; కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తదితరాలకు అయ్యే ఖర్చు రుణంగా లభిస్తుంది. ► ఇన్స్టిట్యూట్లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్లకు కూడా రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి. ► కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది. తిరిగి చెల్లింపు ఇలా ► విద్యా రుణం తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు ఇటీవల కొంత సరళీకృత విధానాలు అనుసరిస్తున్నాయి. రీపేమంట్ హాలిడే పేరుతో కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయి ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇలా గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం మొత్తం చెల్లించొచ్చు. ► రుణ తిరిగి చెల్లింపు పరంగా స్టార్టప్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు లభిస్తోంది. దీని ప్రకారం–స్టార్టప్ ఏర్పాటు చేసిన విద్యార్థులు.. కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల తర్వాత నుంచి రుణం తిరిగి చెల్లించొచ్చు. ► ఉన్నత విద్యనభ్యసించే మహిళా విద్యార్థులను ప్రోత్సహించే దిశగా బ్యాంకులు విద్యారుణాల వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి. టాప్ ఇన్స్టిట్యూట్లో చేరితే ప్రస్తుతం ఐబీఏ మార్గనిర్దేశకాల ప్రకారం–విద్యా ర్థులు ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే.. గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికా రాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐ ఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ పరిమితి విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. నిరంతర సమీక్ష విద్యా రుణం మంజూరు అయిన విద్యార్థికి సంబం«ధించిన ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్స్టిట్యూట్కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి ఇస్తాయి. ఆ తర్వాత దశ నుంచి ఇన్స్టిట్యూట్కు పంపుతాయి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో నిర్దేశిత గడవు తేదీలోగా ఇన్స్టిట్యూట్కు చెల్లిస్తాయి. అంతేకాకుండా అంతకుముందు సంవత్సరంలో చదువులో సదరు విద్యార్థి ప్రతిభను సమీక్షిస్తున్నాయి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ► ప్రవేశ ధ్రువీకరణ పత్రం ► అకడమిక్ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు ► తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ ► తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్స్ ► నివాస ధ్రువీకరణ ► థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ ► కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ల నుంచి అధీకృత లెటర్స్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.iba.org.in/ ఎడ్యుకేషన్ లోన్స్.. ముఖ్యాంశాలు ► స్వదేశీ, విదేశీ విద్యకు బ్యాంకుల రుణాలు. ► నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశిస్తేనే రుణ దరఖాస్తుకు అర్హత. ► కనిష్టంగా రూ.4 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షల వరకు రుణ మొత్తం. ► విదేశీ విద్య, ఐఐఎంలు, ఐఐటీలు వంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే రుణ మొత్తాన్ని పెంచే అవకాశం. ► మహిళా విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంట్రస్ట్ సబ్సిడీ స్కీమ్. ► విద్యాలక్ష్మి పోర్టల్ పేరిట ఆన్లైన్లో ఒకేసారి మూడు బ్యాంకులకు రుణ దరఖాస్తు చేసుకునే సదుపాయం. విద్యా లక్ష్మి పోర్టల్.. ఆన్లైన్ ద్వారా విద్యారుణం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్.. విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో లాగిన్ అయి.. కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను.. అభ్యర్థులు ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు తెలియజేస్తాయి. వెబ్సైట్: www.vidyalakshmi.co.in -
అమ్మానాన్నలకు ఆయుష్షు
చెట్టుకు నీరందితే..పండుటాకు కూడా పడకుండా ఆగుతుందేమో! పిల్లల ప్రేమ ఆయుష్షుపోసే అమృతం! పిల్లల కోసం కన్న కలలన్నీ ఇచ్చేశాక తల్లిదండ్రులకు నిద్రా ఉండదు.. కలా మిగలదు! కంటికి కనపడితే చాలు.. అప్పటిదాకా మూగగా ఉన్న కన్నీరు ఆనందబాష్పాలుగా రాలుతాయి!! ఆత్మీయత చెదరకుండా ఉంటే దూరాలదో లెక్క కాదు అంటారు.పాశం గాఢంగా ఉంటే ఎవరు ఎక్కడ ఉంటే ఏం అని కూడా అంటారు.మేం ఇక్కడ ఉన్నాం కానీ మా మనసంతా అక్కడే అని పిల్లలు అంటే మీరు బాగుంటే చాల్రా మాదేముంది ఎక్కడైనా బతికేస్తాం అని పెద్దలు అంటారు.తప్పు. మాటలు చాలా తప్పు.సడన్‌గా అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది సప్త సముద్రాల అవతల పిల్లలు ఉంటే ఎంత బాధో, ఇంటినుంచి ఫోన్ వస్తే అరగంటలో వాలిపోని దూరంలో ఉంటే పిల్లలకు ఎంత క్షోభో.తెలుగు నేల నుంచి అమెరికాకు ఎగురుతున్న విమానాలు ఎన్ని కథలను తమ రెక్కల మీద మౌనంగా మోస్తున్నాయో కదా. అట్లాంటా కూడా దాదాపు సౌత్ ఇండియాలానే ఉంటుందని అంటారు. ఇలాంటి ఎండే. ఇలాంటి వానే. ఇలాంటి సముద్రమే. ఇరవై ఏళ్లయిపోయింది సునీల్ అక్కడకు వచ్చి. భార్యతో కలిసి జీవితం అక్కడే మొదలెట్టాడు. పిలల్ని కనే సమయంలో భార్య ఇండియాకు వెళ్లక్కర్లేదని ఇక్కడే డెలివరీ అయ్యే ఏర్పాటు చేశాడు. ఒకమ్మాయి ఒకబ్బాయి. ఇద్దరూ కొంచెం గబుక్కున చూస్తే అచ్చు అమెరికన్లలా ఉంటారు ఎర్రగా బుర్రగా అలాంటి బట్టల్లో. ఇరవై ఏళ్లలో సంపాదించింది సునీల్‌కు సంతృప్తిగా ఉంది. చేసిన సేవింగ్స్... ఏర్పాటు చేసుకున్న ప్రాపర్టీస్ అతడు ఇక పని చేయకపోయినా కాపాడుతాయి. భార్య కూడా వచ్చిపోయే బంధువులు, పెత్తనాలు చేసే అనుబంధాలు, ఆరా తీసే చుట్టపు చూపులు లేకపోవడం వల్ల ఇదే మంచి జీవితం అని నమ్ముతూ ఉంది. అంతా బాగున్నట్టే కాని కొన్నాళ్లుగా సునీల్ ఇంతకు మునుపులా లేడు. పనికి సక్రమంగా వెళ్లడం లేదు. హుషారుగా జోకులు వేయడం లేదు. నవ్వడం లేదు. పరధ్యానంగా ఉంటున్నాడు. ఫ్రెండ్స్‌ను కూడా కలవడం లేదు.‘నేనేం అపకారం చేశానని ఇంతలా మూగమొద్దు అయ్యారు’ అని భార్య ఒకరోజు నిలదీసింది.పిల్లలు కూడా ‘ఏమైంది నాన్నా’ అని ఇంగ్లిష్‌లో అడిగారు.కాని సునీల్ ఏమని చెప్తాడు?బహుశా అమెరికాలో ఉన్న చాలామంది చేరే దశకే అతడు చేరినట్టు ఉన్నాడు.సునీల్ తండ్రి రాఘవయ్య పోస్ట్‌మాస్టర్‌గా పని చేసేవాడు. ఒకప్పుడు అత్యంత ఎక్కువ పని, అతి తక్కువ జీతం ఉండే శాఖ పోస్టల్ శాఖ అని చాలామందికి తెలియదు. రాఘవయ్య ఏ రోజూ తీరిగ్గా ఇంట్లో ఉండేవాడు కాదు. ఎప్పుడూ కుటుంబంతో సంతోషంగా గడిపేవాడు కాదు. ‘మనబ్బాయి బాగా చదువుకోవాలి. అందుకు నేను కష్టపడాలి’ అని భార్యతో చెప్పేవాడు. ప్రతిపైసా సునీల్ కోసమే. స్థోమత లేకపోయినా మంచి స్కూళ్లలో చేర్పించాడు. మంచి కోచింగ్‌లో చేర్పించాడు. బి.టెక్ మంచి కాలేజీలో చదివించాడు. అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అమెరికా వెళితే సంతోషపడ్డాడు. సునీల్ తన సేవింగ్స్‌లో నుంచి ఊళ్లో పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టించాడు. పాత స్కూటర్ మీద తిరగొద్దని కొత్త కారు కొనిపెట్టాడు. ఏ అవసరం ఎలా ఉంటుందో అని తల్లి పేర్న, తండ్రి పేర్న డబ్బు అకౌంట్లో వేసి పెట్టాడు. అంతేనా... సంవత్సరానికి ఒకసారి కుటుంబంతో సహా వచ్చి నెలరోజులు ఉండేసి పోయేవాడు. కాని రాను రాను పద్ధతి మారింది. పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఇండియాకు రమ్మంటే వారి ఆసక్తి పోయింది. పైగా కాలేజీ చదువులనీ స్పెషల్ క్లాసులనీ ఇంకేవో పనులనీ రెండు మూడేళ్లుగా ఇండియా రావడం మానేశారు. సునీల్ ఆరునెలలకు ఓసారి వెళ్లి వస్తున్నా కుటుంబం లేని మనిషిగా వెళుతున్నాడు. క్రమంగా తన తల్లిదండ్రులకు తనకూ మధ్య ఏదో తెగిపోయిందనే భావన వచ్చింది.అదే కాదు–తల్లిదండ్రులు కూడా వయసులో పెద్దవారయ్యాక ‘వద్దులేరా... నీ దగ్గరకు వచ్చి జరగరానిది జరిగితే దేశం కాని దేశంలో మా కట్టె కాలడం ఇష్టం లేదు’ అని చెప్పేశారు.కాకుంటే ఇప్పుడు వాళ్లకు మనిషి లేడు. ఉండాల్సిన మనిషి అమెరికాలో ఉన్నాడు. అదీ సమస్య.‘మీ కుటుంబంలో మొత్తం ముగ్గురు డిప్రెషన్‌తో బాధ పడుతున్నారు’ అంది సైకియాట్రిస్ట్ సునీల్‌తో. భార్య బలవంతం చేస్తే గాలి మార్పు ఉంటుందని అంటే పిల్లలను అక్కడే వదిలి భార్యతో కలిసి ఇండియాకు వచ్చిన సునీల్ సైకియాట్రిస్టు దగ్గరకు వచ్చాడు.‘అవునా?’ అన్నాడు సునీల్.‘అవును. మీ తల్లిదండ్రులకు కూడా డిప్రెషన్ ఉంటుంది మీరు గమనించి చూసినట్టయితే. అలాంటి చాలామంది తల్లిదండ్రులను నేను ట్రీట్ చేశాను. ఒక్కడే కొడుకు. అల్లారు ముద్దుగా పెంచి దేశం కాని దేశం పంపించారు. కాని చివరి రోజుల్లో కూడా ఆ కొడుకు అంతే దూరంలో ఉంటాడంటే ఎవరికైనా మనసులో శూన్యం వచ్చేస్తుంది. కనీసం వారిది గిల్ట్ లేని డిప్రెషన్. మీది గిల్ట్ ఉన్న డిప్రెషన్. ఇంత కష్టపడిన తల్లిదండ్రులకు దగ్గరుండి ఏమీ చేయలేకపోతున్నానే అనే సమస్య మీది’ అంది సైకియాట్రిస్ట్.‘అవును డాక్టర్. పూర్తిగా చక్రబంధంలో ఇరుక్కుపోయాను. ఇండియాకు షిఫ్ట్ అవ్వాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్లను తీసుకువెళ్లాలన్నా సమస్యలు. నాన్నకు ఆస్తమా ఉంది. అటాక్ వచ్చినప్పుడు తనకు సాయానికి దిక్కూమొక్కూ లేదు అని అనుకుంటే నాకెంత నొప్పి. నేను అక్కడా ఉండలేకా ఇక్కడా ఉండలేక బాధ పడుతున్నాను’ అన్నాడు సునీల్.సైకియాట్రిస్ట్ సునీల్ భార్య వైపు చూసింది.‘నాదేం లేదు డాక్టర్. ఈయన మళ్లీ మామూలు మనిషైతే చాలు. నేను అన్ని విధాల సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను’ అంది.‘అయితే ఒక పని చేయండి. మీరు సీన్ రివర్స్ చేయండి’ అంది సైకియాట్రిస్ట్.’అంటే?’ అన్నాడు సునీల్.‘మీ పిల్లలు ఇప్పుడు కాలేజీ వయసులో ఉన్నారు కదా. వాళ్లను అక్కడే ఉంచి ఒక రెండేళ్లు మీరిక్కడకు షిఫ్ట్ అవ్వండి. మూడు నెలలకో ఆరు నెలలకో ఒకసారి వెళ్లి ఎవరో ఒకరు పిల్లలను చూసి వస్తుండండి. ఇది గొప్ప సొల్యూషన్ కాకపోవచ్చుగానీ ఇప్పుడున్న పరిస్థితిలో బెటర్ సొల్యూషన్’ అంది సైకియాట్రిస్ట్.ఇది సునీల్‌కు, సునీల్ భార్యకు నచ్చింది.ఇద్దరు పిల్లలూ యూనివర్సిటీలలో అడ్మిషన్స్ తీసుకున్నాక వాళ్లు ఇక్కడకు వచ్చి సునీల్ తల్లిదండ్రులతో ఉండటం మొదలెట్టారు. తల్లిదండ్రులకు ఇది ఎంతో ఓదార్పుగా అనిపించింది. సునీల్‌కు కూడా తాను తల్లిదండ్రులను చూసుకుంటున్నాను అనే భావన ఆరోగ్యాన్ని ఇచ్చింది.ఇందుకు బదులుగా సునీల్ తన కెరీర్‌ను పక్కన పెట్టాడు.ఒకటి పొందాలంటే మరొకటి పోగొట్టుకోవాల్సిందేనని అర్థమైంది.సునీల్ చేసిన పని కూడా చేయలేని చాలామంది నడి వయసు తెలుగువాళ్లు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వృద్ధాప్యంలో చివరి రోజులు లెక్కపెట్టుకుంటున్న వారి తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు. ఇరు వర్గాలకు ఆర్థిక లేమి లేదు మానసిక ఆనంద లేమి తప్ప.వలస లేని మానవజాతి లేదు.కాని వలస వల్ల జరుగుతున్న అనుబంధాల నష్టాన్ని మాత్రం ఏ లెక్కలూ తేల్చడం లేదు.ఇక్కడి అరుగుల మీద కుర్చున్న వృద్ధులు, అక్కడ మార్నింగ్ వాక్ చేస్తున్న కొడుకులు నవ్వుతున్నారు కానీ నిజంగా సంతోషంగా ఉన్నారా అనేది ప్రశ్న. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
స్టడీ అబ్రాడ్.. స్కాలర్షిప్స్
విదేశీ విద్యకు ఆసరాగా స్కాలర్షిప్లు నేరుగా విదేశీ యూనివర్సిటీలు/ ఇన్స్టిట్యూట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అకడమిక్ ప్రతిభతోపాటు టోఫెల్/ జీఆర్ఈ/జీమ్యాట్‌లో స్కోర్ తప్పనిసరి విదేశీ విద్య అనగానే భారీ ఫీజులు, తడిసిమోపుడయ్యే ఖర్చులే గుర్తుకొ స్తాయి. అందుకే విదేశీ యూనివర్సిటీల్లో చదువుకోవాలని ఉన్నా..చాలామంది ముందడుగేయ లేరు. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం ఆయా దేశాల్లో పలు స్కాలర్షిప్స్ అందుబాటులోకి వచ్చాయి. అకడమిక్ రికార్డ్, నిర్ణీత టెస్ట్ స్కోర్లలో ప్రతిభతోపాటు విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకుంటే చాలు.. స్కాలర్షిప్ అందుకునేందుకు వకాశాలు ఎన్నో! తద్వారా ఫీజుల ఆందోళనకు ఫుల్స్టాప్ పెట్టి... విదేశీ విద్య స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చు!! ఫాల్ సెమిస్టర్ ప్రవేశ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ విద్య ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ల వివరాలు.. ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ముందంజలో నిలుస్తున్న దేశం ఆస్ట్రేలియా. అందుకోసం ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు పలు స్కాలర్షిప్స్ అందిస్తోంది. ఆస్ట్రేలియా అవార్డ్స్ స్కాలర్షిప్స్: ఆస్ట్రేలియన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వీటి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయిలో పూర్తిస్థాయి ప్రవేశం పొందిన వారికి వీటిని అందజేస్తారు. ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, రీసెర్చ్ కోసం అవసరమయ్యే అకడమిక్ వ్యయాలకు సరిపడే మొత్తానికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఎండీవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్: ఈ ప్రోగ్రామ్ పరిధిలో కూడా పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఏడాదికి 2,01,00 ఆస్ట్రేలియన్ డాలర్లు మంజూరు చేస్తారు. పీజీ అభ్యర్థులకు రెండేళ్లు, పీహెచ్డీ అభ్యర్థులకు మూడున్నరేళ్ల వరకు గడువు ఉంటుంది. ఎండీవర్ ఆస్ట్రేలియా చెంగ్ కాంగ్ రీసెర్చ్ ఫెలోషిప్: నాలుగు నుంచి ఆర్నెల్ల వ్యవధిలో రీసెర్చ్ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం. ఎంపికైన అభ్యర్థులకు 23,500 ఆస్ట్రేలియా డాలర్లు లభిస్తాయి. ఎండీవర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అవార్డ్స్: ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిధిలోని కళాశాలల్లో, యూనివర్సిటీలలో డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, అసోసియేట్ డిగ్రీ ప్రవేశం పొందిన అభ్యర్థులకు వీటిని అందజేస్తారు. గరిష్టంగా 1,19,500 ఆస్ట్రేలియన్ డాలర్లు మంజూరు చేస్తారు. వివరాలకు వెబ్సైట్: https://india.highcommission.gov.au/ndli/study8.html ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్షిప్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఉద్దేశించిన స్కాలర్షిప్ పథకమిది. ఏటా 300 మంది విదేశీ విద్యార్థులను ఆయా ప్రామాణికాల (రీసెర్చ్ టాపిక్, అకడమిక్ రికార్డ్ తదితర) ఆధారంగా ఎంపిక చేస్తారు. వివరాలకు వెబ్సైట్:https://www.studyinaustralia.gov.au/ జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, రీసెర్చ్‌కు పేరున్న దేశం జర్మనీ. ఇక్కడి యూనివర్సిటీలు∙ఉన్నతవిద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు పలు స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి. DDA స్కాలర్షిప్ జర్మనీలో ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు అత్యున్నత స్కాలర్షిప్ సదుపాయం కల్పించే పథకం.. డాడ్ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ మేరకు విద్యార్థులకు రీసెర్చ్, ట్యూషన్ ఫీజు, ట్రావెల్ గ్రాంట్స్ లభిస్తాయి. దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ స్కాలర్షిప్ పరిధిలో ఉంటాయి. వివరాలకు వెబ్సైట్: https:www.daad.in/en కోఫి అన్నన్ ఎంబీఏ స్కాలర్షిప్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్: జర్మనీలోని యూరోపియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించేందుకు అందుబాటులోకి తెచ్చిన పథకం ఇది. కనీసం ఏడాది వ్యవధి కలిగిన మేనేజ్మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశించే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఈఎస్ఎంటీ విభాగంలో 25 వేల యూరోలు, ఎంఐఎం విభాగంలో 43,500 యూరోల స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.esmt.org సింగపూర్ సింగపూర్‌లో ఉన్నతవిద్య పట్ల ఇటీవల కాలం లో భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. 3 ప్రభుత్వ యూనివర్సిటీలు, పలు ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు కలిగిన సింగపూర్... అంతర్జాతీయ విద్యార్థులకు పలు స్కాలర్షిప్ సదుపాయాలు కల్పిస్తోంది. ఎస్ఐఏ యూత్ స్కాలర్షిప్ సింగపూర్ ప్రభుత్వ విద్యాశాఖ అందిస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇది. సింగపూర్‌లోని గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు దీన్ని అందిస్తారు. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 2,400 సింగపూర్ డాలర్లతోపాటు, ఉచిత హాస్టల్ సదుపాయం లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.moe.gov.sg/home నాన్యాంగ్ స్కాలర్షిప్ సింగపూర్ ప్రభుత్వ యూనివర్సిటీ.. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ అందిస్తున్న మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ ఇది. ఉత్తమ అకడమిక్ ట్రాక్ రికార్డు కలిగి.. ఈ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, బుక్స్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఉచిత వసతి లభిస్తాయి. వివరాలకు వెబ్సైట్: admissions.ntu.edu.sg సింగపూర్ మిలీనియం స్కాలర్షిప్స్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రీ–డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఔత్సాహికులకు అందిస్తున్న స్కాలర్షిప్స్ ఇవి. ఎంఎస్సీ విద్యార్థులకు నెలకు 2000 సింగపూర్ డాలర్లు; పీహెచ్డీ విద్యార్థులకు 3 వేల సింగపూర్ డాలర్లు, పోస్ట్ డాక్టోరల్ అభ్యర్థులకు అయిదు వేల సింగపూర్ డాలర్లు లభిస్తాయి. వివరాలకు వెబ్సైట్: www.singaporemillenniumfoundation.com.sg సింగపూర్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ అవార్డ్: సింగపూర్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. దీని పరిధిలో ఆయా యూనివర్సిటీల్లో సైన్స్, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీలో ప్రవేశం ఖరారు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు ఏటా 24 వేల సింగపూర్ డాలర్లు అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.a-star. edu.sg/singa-award ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్ సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన వారికి సదరు యూనివర్సిటీ అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్. ఎంబీఏలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా కనిష్టంగా ఎనిమిది వేలు, గరిష్టంగా 58 వేల సింగపూర్ డాలర్లను అలవెన్స్‌గా చెల్లిస్తారు. వివరాలకు వెబ్సైట్: mba.nus.edu./en/fees-finances/scholarships యునైటెడ్ కింగ్డమ్ (యూకే) భారతీయ విద్యార్థులకు అమెరికా తర్వాతి గమ్యం యూకే. కారణం.. పేరున్న యూనివర్సిటీలు, నాణ్యమైన బోధన. ఫీజులు, ఇతర వ్యయం అధికంగా ఉండే యూకేలో ఉన్నతవిద్యకు పలు స్కాలర్షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్ స్కాలర్షిప్స్ యూకేలో విదేశీ విద్యార్థులకు లభిస్తున్న ప్రధా నమైన స్కాలర్‌షిప్స్‌గా గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్‌ను పేర్కొనొచ్చు. బ్రిటిష్ కౌన్సిల్ ఏటా అందించే స్కాలర్షిప్స్ ఇవి. మన దేశ విద్యార్థులకు ఈ ఏడాది 67 మందికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీ బట్టి స్కాలర్షిప్ మొత్తం నిర్ణయమవుతుంది. పీజీ కోర్సు లకు అయిదు వేల నుంచి ఏడు వేల పౌండ్ల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.britishcouncil.in చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్షిప్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ తదితర కోర్సుల విద్యార్థులకు వీటిని అందిస్తారు. కనిష్టంగా మూడు వేల పౌండ్ల నుంచి గరిష్టంగా ఏడు వేల పౌండ్లు లభిస్తాయి. ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్ స్టడీస్ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. వివరాలకు వెబ్సైట్: www.britishcouncil.in ఛెవెనింగ్ స్కాలర్షిప్స్ యూకే ప్రభుత్వం నేరుగా అందించే గ్లోబల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్.. ఛెవెనింగ్ స్కాలర్షిప్స్. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులూ ఈ స్కాల ర్షిప్నకు అర్హులే. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తం మినహాయింపుగా లభిస్తుంది. ఎంపిక ప్రక్రి యలో భాగంగా విద్యార్థులు యూకే యూనివర్సిటీ నుంచి పొందిన అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఆధా రంగా చెవెనింగ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. ఎంపిక విధానంలో అభ్యర్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్‌తోపాటు ఆన్లైన్ అసెస్మెం ట్స్ సైతం నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తారు. ప్రస్తుతం 2018–19 సంవత్సరానికి సంబం ధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వివరాలకు వెబ్సైట్: www.chevening.org కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్షిప్స్ యూకే ప్రభుత్వం డీఎఫ్ఐడీ (డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డవలప్మెంట్) సహకారంతో కామన్వెల్త్ స్కాలర్షిప్ కమిషన్, యూకే యూని వర్సిటీల ద్వారా కామన్వెల్త్ సభ్య దేశాల్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్స్.. కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్ షిప్స్. ఏటా ఆయా దేశాలకు చెందిన 800 మందికి వీటిని అందిస్తారు. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులు అర్హులు. ఎంపికైతే ట్యూషన్ ఫీజు మిన హాయింపుగా లభిస్తుంది. ఠ వివరాలకు వెబ్సైట్: http://cscuk.dfid.gov.uk ఫెలిక్స్ స్కాలర్షిప్ యూకేలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్స్.. ఫెలిక్స్ స్కాలర్షిప్స్. వీటికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.felixscholarship.org ఐఈఎల్టీఎస్ అవార్డ్స్ యూకేలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి అవస రమైన ఐఈఎల్టీఎస్ టెస్ట్‌లో మంచి ప్రతిభ చూపిన వారికి బ్రిటిష్ కౌన్సిల్ అందిస్తున్న స్కాలర్ షిప్.. ఐఈఎల్టీఎస్ అవార్డ్స్. ఐఈఎల్‌టీఎస్‌తో స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు కోసం రూ. మూడు లక్షలు అందజేస్తారు. వివరాలకు వెబ్సైట్: www.britishcouncil.org గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్స్ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అందిస్తు న్న స్కాలర్షిప్స్.. గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్స్. ఇవి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారికే లభిస్తాయి. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు, నివాస ఖర్చులు, డిపెండెంట్స్ అలవెన్స్‌లు పొందొచ్చు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.gatescambridge.org హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూకేలో దాదాపు అయిదు దశాబ్దాలుగా విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కల్పిస్తున్న సంస్థ ఎ.ఎస్.హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ప్రధానంగా యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీ కోర్సులు చదివే వారికే అందిస్తారు. అంతేకాకుండా సదరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయానికే స్వదేశంలో ఇంగ్లిష్ బోధనలో అనుభవం పొంది ఉండాలి. వివరాలకు వెబ్సైట్: www.hornby-trust.org.uk అమెరికా విదేశీ విద్య అంటే మన విద్యార్థులకు ఠక్కున గుర్తొచ్చే దేశం అమెరికా. ఈ దేశంలో ఇటీవల కాలంలో నిబంధనలు కఠినంగా మారాయి. భారతీయ విద్యా ర్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కొన్ని ప్రోత్సాహ కాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు.. ఫుల్బ్రైట్–నెహ్రూ ఫెలోషిప్స్ అమెరికాలోని యూనివర్సిటీల్లో ఆర్ట్స్, కల్చర్, మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పబ్లిక్ అడ్మి నిస్ట్రేషన్ తదితర విభాగాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి అందుబాటులో ఉన్న పథకం.. ఫుల్ బ్రైట్ నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చు లకు సరిపడే మొత్తాన్ని అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.usief.org.in హ్యూబర్ట్ హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్ అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రోత్సాహకం... హ్యూబర్ట్ హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్. కనీసం ఐదేళ్ల ప్రొఫెషనల్ అనుభవంతో అమెరికాలోని యూని వర్సిటీల్లో అడుగుపెట్టినవారు ఈ ఫెలోషిప్‌నకు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ముఖ్యంగా సస్టెయిన బుల్ డెవలప్మెంట్, డెమొక్రటిక్ ఇన్స్టిట్యూషన్ బిల్డిం గ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే వారికి పది నెలల పాటు ఫెలోషిప్ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులకు సరిపడే మొత్తం లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.humphreyfellowship.org ఆగాఖాన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అమెరికాలోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయే ట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు అందు బాటులో ఉన్న మరో స్కాలర్షిప్ ప్రోగ్రామ్.. ఆగాఖా న్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. దీనికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తంలో 50 శాతాన్ని ఉచితంగా, మరో 50 శాతాన్ని రుణం రూపంలో అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.akdn.org ఏఏసీఈ స్కాలర్షిప్స్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ (ఏఏసీఈ) స్కాలర్‌షిప్స్‌కు అగ్రికల్చర్, కెమికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆర్కిటెక్చరల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఫాల్ సెమిస్టర్ సెషన్లో ఎంఎస్‌లో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఏటా రెండు వేల డాలర్ల నుంచి ఎనిమిది వేల డాలర్ల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది అభ్యర్థుల ప్రతిభ, ఎంపిక చేసుకున్న బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది. వివరాలకు వెబ్సైట్: www.aace.org మరికొన్ని స్కాలర్షిప్స్ ఆసియన్ ఉమెన్ ఇన్ బిజినెస్ స్కాలర్షిప్ ఫండ్. కార్నెల్ యూనివర్సిటీ టాటా స్కాలర్షిప్ ఫుల్బ్రైట్ నెహ్రూ రీసెర్చ్ ఫెలోషిప్ ఎస్ఎన్ బోస్ స్కాలర్స్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ స్టాన్‌ఫర్డ్ రిలయన్స్ ధీరూభాయి ఫెలోషిప్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ వీటితోపాటు మిట్, స్టాన్‌ఫర్డ్, ప్రిన్స్టన్, కార్నిగి మెలాన్, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ వంటి దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్స్/ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. విద్యార్థులు ఎప్పటికప్పుడు సదరు యూనివర్సిటీల వెబ్సైట్లను వీక్షించడం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. కెనడా అమెరికా సరిహద్దు దేశం కెనడాలోని యూనివర్సిటీలు నాణ్యమైన విద్య అందిం చడంలో ముందుంటున్నాయి. దాంతో అంతర్జాతీయంగా వివిధ దేశాలతోపాటు మన దేశ విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ హెల్త్ సైన్స్, నేచురల్ సైన్సెస్, ఇంజనీ రింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో రీసెర్చ్ ఔత్సాహికులకు బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీ యంగా అన్ని దేశాలకు సంబంధించి ఏటా 70 మందికి వీటిని అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 70 వేల డాలర్లు చొప్పున రెండేళ్లపాటు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.banting.fellowships-bourses.gc.ca ట్రుడే సాలర్షిప్స్ ది ట్రుడే ఫౌండేషన్ నిర్వహిస్తున్న పథకమిది. దీన్ని కూడా డాక్టోరల్ (రీసెర్చ్) విద్యార్థులకే అందిస్తారు. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్డీ చేయాలనుకున్న వారికి ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా 60 వేల డాలర్ల స్కాలర్íషిప్‌తో పాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్ అలవెన్స్ అందుతుంది. వివరాలకు వెబ్సైట్: www.trudeaufoundation.ca వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ కెనడియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం.. వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 50 వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు ఈ స్కాలర్షిప్ అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.vanier.gc.ca మరికొన్ని స్కాలర్షిప్స్: కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్– మాస్టర్స్ ప్రోగ్రామ్స్, ఐడీఆర్సీ రీసెర్చ్ అవార్డ్స్; ఎన్ఎస్ ఈఆర్సీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్; అన్నేవల్లె ఎకలాజికల్ ఫండ్. జపాన్ రీసెర్చ్ కార్యకలాపాల పరంగా ముం దంజలో నిలుస్తున్న జపాన్.. భారతీయ విద్యార్థులకు ప్రత్యేకంగా పలు స్కాలర్ షిప్స్ అందిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ డాక్టోరల్ వరకు వీటిని అందుకునే వీలుంది. జపనీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ రీసెర్చ్ స్టూడెంట్ జపాన్ సంబంధిత హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఐటీ, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ సహా 17 విభాగాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశంపొందిన వారికి ఈ స్కాలర్షిప్ సదుపాయం లభిస్తుంది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 1,43,000 జపాన్ యెన్లు స్టైపెండ్‌గా అందుతుంది. దీంతోపాటు ట్యూషన్ ఫీజు నుంచి మినహా యింపు ఉంటుంది. వివరాలకు వెబ్సైట్: www.in.emb-japan.go.jp అండర్గ్రాడ్యుయేట్ స్టడీస్ సోషల్æ సైన్సెస్, నేచురల్ సైన్స్, ఇంజ నీరింగ్, మెడిసిన్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కో ర్సుల్లో ప్రవేశం పొందిన వారికి లభించే స్కాలర్షిప్స్ ఇవి. అయిదేళ్లపాటు ఏడాదికి 1,17,000 యన్లు స్కాలర్షిప్ లభిస్తుంది. యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ పీజీ కోర్సుల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం ఇది. పబ్లిక్ అడ్మినిస్ట్రే షన్, లోకల్ గవర్నెన్స్, లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో జపాన్ యూని వర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఏడాది వ్యవధిలో నెలకు 2,42,000 జపాన్ యెన్ల రూపంలో స్కాలర్షిప్ ఇస్తారు. ఏషియన్ డవలప్మెంట్ బ్యాంక్ – జపాన్ స్కాలర్షిప్ జపాన్‌లోని యూనివర్సిటీల్లో ఎకనామిక్స్, మేనేజ్మెంట్, సైన్స్, టెక్నాలజీ తదితర కోర్సుల్లో పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యదేశాల విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఏడీబీ–జపాన్ స్కాలర్షిప్స్. ఏటా 150 మందికి ఏడీబీ బ్యాంక్ ఈ స్కాలర్షిప్ను అందిస్తుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, నివాస వ్య యం, ఇతర అకడమిక్ సంబంధిత వ్యయాలకు సరిపడే మొత్తాన్ని చెల్లిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.adb.org ఎంపిక విధానం స్కాలర్షిప్ కోరుకునే విద్యార్థులు ఆయా యూనివర్సిటీలు లేదా సంస్థలకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్పటికే తాము ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా దరఖాస్తులను వడపోస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందించి.. వారికి స్కాలర్షిప్/ఫెలోషిప్‌లు ఖరారు చేస్తారు. అర్హతలు అకడమిక్‌గా పదో తరగతి నుంచి 60 శాతానికి మించిన మార్కులతో ఉత్తీర్ణత. టోఫెల్/ఐఈఎల్టీఎస్ టెస్ట్ స్కోర్స్. జీఆర్ఈ/జీమ్యాట్ టెస్ట్ స్కోర్స్. లెటర్స్ ఆఫ్ రికమండేషన్. -
కల చెదిరినా..కాంతులీనేలా!
స్టడీ అబ్రాడ్ అనగానే గుర్తొచ్చే దేశం అమెరికా. కానీ, ఇప్పుడు అమెరికా కొత్త ప్రభుత్వం కఠిన నిబంధనల వల్ల పరిస్థితులు మారుతున్నాయి. ఫలితంగా భారతీయ యువతలో అమెరికా కల చెదిరిపోతున్న పరిస్థితి. కానీ, స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులకు భరోసా ఇచ్చే దేశాలు మరెన్నో ఉన్నాయి. ఓవైపు ఉన్నత విద్యావకాశాలు, మరోవైపు వర్క్పర్మిట్లతో అమెరికాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. వాటి వివరాలు.. సింగపూర్ ప్రస్తుతం ఏటా దాదాపు 35 వేల మంది విదేశీ విద్యార్థులు సింగపూర్‌లో అడుగుపెడుతుండగా.. వారిలో భారతీయులు 15 నుంచి 20 శాతం వరకూ ఉంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల పరంగా సింగపూర్ ఆకర్షణీయంగా మారుతోంది. వీసా నిబంధనల సరళత, తక్కువ ఫీజులు, కోర్సు పూర్తయ్యాక ఏడాదిపాటు పోస్ట్ స్టడీ వర్క్ పేరుతో అక్కడే పని చేసే అవకాశం, తర్వాత దాన్ని కొనసాగించుకునే వెసులుబాటు... ఇలాంటివన్నీ విదేశీ విద్యార్థులకు అనుకూల అంశాలు. సింగపూర్‌లో అకడమిక్ సెషన్ మార్చి, జూలై నెలల్లో రెండుసార్లుగా ఉంటుంది. వివరాలకు: www.moe.gov.sg జర్మనీ జర్మనీకి సంబంధించి భారతీయ విద్యార్థుల్లో అవగాహన కొంత తక్కువనే అభిప్రాయం ఉంది. ఇక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫీజులు నామమాత్రం. సెమిస్టర్‌కు 500 నుంచి 700 యూరోల మధ్య ఉంటాయి. ఈ దేశం ఇంజనీరింగ్ కోర్సులకు ప్రత్యేకంగా నిలుస్తోంది. కాలపరిమితిపై ఆంక్షలు లేకుండా పోస్ట్ స్టడీ వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం జర్మనీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. దీని ప్రకారం కోర్సు పూర్తయ్యాక కూడా 18 నెలలపాటు జర్మనీలోనే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఉద్యోగం సొంతం చేసుకుంటే స్పాన్సర్ లెటర్ ఆధారంగా అక్కడే∙కొనసాగొచ్చు. ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో అకడమిక్ సెషన్లు ప్రారంభమవుతాయి. వెబ్సైట్: www.studyin.de జపాన్ జపాన్‌లో ప్రధాన కోర్సులు ఇంజనీరింగ్, సైన్స్. ఇక్కడి వీసా నిబంధనలు కూడా సరళీకృతంగా ఉంటున్నాయి. అంతేకాకుండా కోర్సు పూర్తయ్యాక పోస్ట్ స్టడీ వర్క్ వీసా పరంగా సానుకూల విధానం అమల్లో ఉంది. చదువు çపూర్తయ్యాక ఉద్యోగ సాధన దిశగా ఆర్నెల్లు అక్కడే నివసించే అవకాశముంది. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే స్పాన్సర్షిప్ లెటర్ ఆధారంగా మూడేళ్ల వ్యవధికి వర్క్ వీసా పొందొచ్చు. ఏటా ఏప్రిల్, అక్టోబర్లలో ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్లకు కనీసం 8 నెలలు ముందుగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం మంచిది. వెబ్సైట్: www.jasso.go.jp న్యూజిలాండ్ గతేడాది 30 వేల మంది విదేశీ విద్యార్థులు న్యూజిలాండ్‌లోని పలు వర్సిటీల్లో అడుగుపెట్టగా వారిలో భారత విద్యార్థుల సంఖ్య దాదాపు 5 వేలు. ముఖ్యంగా అగ్రికల్చర్, మేనేజ్మెంట్ కోర్సులకు న్యూజిలాండ్‌లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది. ఫీజులు కూడా తక్కువే. అన్నింటికంటే ముఖ్యంగా కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత జాబ్ సెర్చ్ వీసా ద్వారా ఏడాది పాటు అక్కడే ఉండి ఉద్యోగ వేట కొనసాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే గరిష్టంగా మూడేళ్లు అక్కడే పని చేసుకునే అవకాశముంది. ప్రతి ఏటా మార్చిలో ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ కోసం ఏడాది ముందుగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం మేలు. వెబ్సైట్: www.immigration.govt.nz చైనా చైనా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా వర్క్ వీసాల పరంగా సరళీకృత నిబంధనలు అమలు చేస్తోంది. అయితే చైనా విషయంలో మన విద్యార్థులు ఇంకా అంతగా ఆసక్తి చూపడం లేదు. గతేడాది గణాంకాల ప్రకారం చైనాలో మూడు లక్షల మంది విదేశీ విద్యార్థులుంటే.. వారిలో భారత విద్యార్థుల సంఖ్య కేవలం 14 వేలు. రెండేళ్ల వ్యవధి కోర్సులను పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ అకడమిక్ సంబంధిత రంగాల్లో చైనా సంస్థల్లో కనిష్టంగా ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. అలాగే వర్క్ వీసాల పరంగా అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించే విధంగా చైనా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వెబ్సైట్: : www.csc.edu.cn ఆస్ట్రేలియా అమెరికా, యూకే తర్వాత మన విద్యార్థులకు అత్యంత ఫేవరెట్‌గా నిలుస్తున్న దేశం ఆస్ట్రేలియా. భారత్ నుంచి ఏటా దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఆస్ట్రేలియా పయనమవుతున్నారు. హోటల్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల పరంగా నాణ్యమైన ఇన్స్టిట్యూట్లు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇక్కడి స్టూడెంట్ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలు సరళీకృతంగా ఉండటం మన విద్యార్థులకు కలిసొచ్చే అంశం. పోస్ట్ స్టడీ వర్క్ వీసా పరంగా టెంపరరీ గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్, పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ వీసా విధానం అమలవుతోంది. కనీసం రెండేళ్ల వ్యవధి కలిగిన కోర్సులను అభ్యసించి ఉద్యోగం సొంతం చేసుకున్న విద్యార్థులకు టెంపరరీ గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్ విధానంలో తొలుత ఏడాదిన్నరపాటు అక్కడ పని చేసే వీలుంది. పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ విధానంలో.. అభ్యర్థులు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా నాలుగేళ్లు ఆస్ట్రేలియాలోనే పనిచేసే అవకాశముంది. ఇటీవలి కాలంలో స్టూడెంట్ వీసా నిబంధనలు సడలించడం, పలు క్లాస్‌లుగా ఉండే వీసా దరఖాస్తులను ఒకే క్లాస్ కిందికి తీసుకురావడం కూడా స్టూడెంట్ వీసా పరంగా కలిసొచ్చే అంశం. ఏటా జూన్/జూలై, ఫిబ్రవరి/మార్చిల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కొన్ని యూనివర్సిటీలు నవంబర్/డిసెంబర్‌లలోనూ అకడమిక్ సెషన్స్ ప్రారంభిస్తాయి. వెబ్సైట్: www.border.gov.au కెనడా రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్సులకు కేరాఫ్ అయిన కెనడాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వర్క్ పర్మిట్ పొందడం ద్వారా భవిష్యత్తులో అమెరికాలో అడుగుపెట్టే అవకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చనే భావన నెలకొంది. గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది విదేశీ విద్యార్థులు కెనడాలోని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక్కడ రెండేళ్ల వ్యవధి కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత వర్క్ పర్మిట్ పొందడం చాలా సులభం. కనీసం 8 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆ కోర్సు వ్యవధికి సమానంగా ఉండే కాలపరిమితితో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ మంజూరు చేస్తారు. కోర్సు వ్యవధి రెండేళ్లకు మించితే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ పేరుతో గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితితో ఉండే వర్క్ పర్మిట్‌ను జారీచేసే విధానం ఉంది. వెబ్సైట్: www.cic.gc.ca యూకే ఏటా లక్షకుపైగా విదేశీ విద్యార్థులు యూకేలో అడుగుపెడుతున్నారు. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 20 శాతం వరకు ఉంటోంది. పోస్ట్ స్టడీ వర్క్ వీసా అవకాశాల పరంగా రెండు విధానాలు ఇక్కడ అమల్లో ఉన్నాయి. వాటిలో.. టైర్–5 గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఎక్సే్ఛంజ్ స్కీమ్ ప్రకారం– కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత తమ అకడమిక్ సబ్జెక్ట్‌కు సంబంధించిన రంగంలో అక్కడే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసేందుకు అనుమతి లభిస్తుంది. టైర్–4 విధానంలో డిగ్రీ, ఆపై స్థాయి కోర్సులు పూర్తయ్యాక నాలుగు నెలలపాటు అక్కడే ఉండి ఉద్యోగ సాధనకు కృషి చేయొచ్చు. ఉద్యోగం సొంతం చేసుకుంటే గరిష్టంగా ఐదేళ్లు అక్కడే నివసించొచ్చు. ఏటా జనవరి, సెప్టెంబర్లలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. వెబ్సైట్: www.gov.uk మలేసియా గతేడాది మలేసియాలోS విదేశీ విద్యార్థుల సంఖ్య లక్షన్నర వరకు ఉంది. ఏడాదిన్నర వ్యవధి ఉండే మాస్టర్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేటగిరీ–1, 2, 3 పేరుతో మూడు రకాల పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లు అందుబాటులో ఉంటాయి. కేటగిరీ–1 విధానంలో నెలకు కనిష్టంగా 5 వేల రింగిట్స్ జీతం పొందే వారికి ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఎంప్లాయ్మెంట్ పాస్ సొంతమవుతుంది. నెలకు 5 వేల లోపు రింగిట్స్ వేతనంతో రెండేళ్ల కాంట్రాక్ట్ ఉద్యోగం పొందిన వారికి కేటగిరీ–2 విధానంలో; ఉద్యోగ కాల పరిమితి ఏడాది లోపు, వేతనం 2,500–4,999 రింగిట్స్ మధ్యలో ఉంటే.. కేటగిరీ–3 విధానంలో ఎంప్లాయ్మెంట్ పాస్‌లు మంజూరవుతాయి. వెబ్సైట్: educationmalaysia.gov.my నెదర్లాండ్స్ కోర్సులు ఆయా సబ్జెక్ట్‌లను బట్టి కనిష్టంగా ఏడాది, గరిష్టంగా రెండేళ్ల వ్యవధిలో ఉంటాయి. వీటిని పూర్తిచేసిన వారికి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్సుల అనంతరం ఉద్యోగ సాధన పరంగా ఏడాది పాటు అక్కడే నివసించే వెసులుబాటు ఉంది. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే తొలుత మూడేళ్లపాటు నివసించే విధంగా వర్క్ పర్మిట్ లభిస్తుంది. వెబ్సైట్: www.studyinholland.nl -
స్టూడెంట్ లైప్ @ ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా.. స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులకు ఉన్నత వేదిక! ఇంజనీరింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ వరకు వివిధ కోర్సుల్లో చేరేందుకు అక్కడికి వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో త్వరలో స్ప్రింగ్ సెషన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియా.. ఒకవైపు టాప్ యూనివర్సిటీలకు, మరోవైపు ఆహ్లాదకర పర్యాటక ప్రాంతాలకు నెలవు. కంగారూలకు కేరాఫ్ అయిన ఆస్ట్రేలియా వాతావరణంలో ఇమిడిపోయే విషయంలో కంగారు అనవసరం. విద్యార్థి జీవితాన్ని దిగ్విజయంగా పూర్తిచేయొచ్చు. అయితే దీనికి కొన్ని లక్షణాలు అలవరచుకోవాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడ్మిషన్ ఖరారు చేసుకున్న అభ్యర్థులు అకడమిక్‌గా, వ్యక్తిగతంగా మెలగాల్సిన తీరుపై విశ్లేషణ. భిన్న సంస్కృతులు ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో అమెరికా మొదలు అంగోలా వరకు వివిధ దేశాలకు చెందినవారు ఉంటారు. ఆసియా విద్యార్థులకు ఉత్తర ఆస్ట్రేలియా కేరాఫ్‌గా ఉంటోంది. అందువల్ల ఈ ప్రాంత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన భారతీయ విద్యార్థులకు అలవాటు పడే అంశంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పరాయి దేశంలో ఎక్కడ చదువుతున్నా కొన్ని ప్రత్యేక లక్షణాలను అలవరచుకోవాల్సిందే. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో మమేకమయ్యేందుకు ప్రాధాన్యమివ్వాలి. సంస్కృతి పరంగా వైవిధ్యమున్న వారితో కలిసిపోయే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు.. కొత్తగా చేరిన అంతర్జాతీయ విద్యార్థుల్లో భయం, బిడియం వంటివి పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. ౌఠ్ఛీ్ఛజుటగా పిలిచే ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్. దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకట్రెండు వారాలపాటు తరగతులు, లెక్చర్ల జోలికెళ్లకుండా.. ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఒకరి గురించి మరొకరికి తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కోర్సుల విధివిధానాలపైనా అవగాహన పెంపొందిస్తారు. ఇవి.. కొత్త విద్యార్థులకు.. అక్కడి వాతావరణంలో ఇమిడేందుకు ఎంతో ఉపయోగపడతాయి. నివాస సదుపాయం దేశం ఏదైనా విదేశీ విద్యార్థులు తొలుత దృష్టిసారించే అంశం.. నివాస సదుపాయం. ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీలు ఆన్–క్యాంపస్ హౌసింగ్ పేరుతో క్యాంపస్ పరిధిలోనే హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నాయి. వీటిలో ఉండటం వల్ల క్యాంపస్‌లో నిరంతరం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆఫ్ – క్యాంపస్ విషయానికొస్తే విద్యార్థులు సొంతంగా షేరింగ్ విధానంలో నివాస సదుపాయం పొందొచ్చు. ఆన్–క్యాంపస్ విద్యార్థులతో పోల్చితే ఆఫ్–క్యాంపస్‌లో ఉంటున్న వారికి సోషల్ కల్చర్‌పై ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇది భవిష్యత్తులో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. స్వయంకృషి కీలకం అకడమిక్, వ్యక్తిగత జీవితం విషయంలో సెల్ఫ్ డిపెండెన్సీకి ప్రాధాన్యమివ్వాలి. తరగతిగది లెక్చర్‌కు సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవాలంటే స్వయంకృషిపై ఆధారపడాల్సిందే. దీనికోసం క్యాంపస్ లైబ్రరీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఏవైనా సందేహాలుంటే ప్రొఫెసర్లను కలిసి, నివృత్తి చేసుకోవాలి. ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి ఇలాంటి దృక్పథాన్ని ఆశిస్తారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కేవలం అకడమిక్స్‌కే పూర్తి సమయం కేటాయించి.. లైఫ్‌ను ఎంజాయ్ చేయడం లేదనే భావన రానీయకుండా యూనివర్సిటీలు విద్యార్థుల కోసం వివిధ ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వారాంతాల్లో స్పోర్ట్స్ ఈవెంట్స్, గేమ్స్ వంటివి నిర్వహిస్తుంటాయి. అదే విధంగా గెస్ట్ లెక్చర్స్, గెస్ట్స్ స్పీక్స్ పేరుతో అకడమిక్ ఎక్సలెన్స్, మోటివేషన్ లెవల్స్ పెంచేలా ప్రముఖుల లెక్చర్స్ సదుపాయం కల్పిస్తుంటాయి. వీటిలో పాల్గొనడం వల్ల ఆయా రంగాల నిపుణులను సంప్రదించే అవకాశం లభిస్తుంది. భాషా నైపుణ్యాలు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించాలంటే లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవాలి. స్థానిక భాషకు సంబంధించి ప్రాథమిక అంశాలను నేర్చుకోవాలి. యాస, షార్ట్‌కట్ పదాలను ఉపయోగించడాన్ని కూడా అలవరచుకుంటే స్వల్ప సమయంలోనే స్థానిక వాతావరణంలో ఇమిడిపోవచ్చు. వాస్తవానికి ఆన్ – క్యాంపస్, ఆఫ్ – క్యాంపస్‌లలో ఇంగ్లిష్ మాట్లాడే వారు అధికంగానే ఉన్నప్పటికీ.. స్థానిక భాష నేర్చుకోవడం వల్ల వర్క్ ఎట్ స్టడీ పేరుతో పార్ట్‌టైం జాబ్స్ చేయాలనుకునే వారికి అవకాశాలు మెరుగవుతాయి. అయిదారేళ్ల కిందటి వరకు ఆస్ట్రేలియాలోని అంతర్జాతీయ విద్యార్థులను జాత్యహంకార దాడుల భయం వెంటాడేది. కానీ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఖర్చు విషయంలో పొదుపుగా.. విదేశీ విద్యార్థులు ఖర్చు విషయంలో పొదుపుగా వ్యవహరించడం ఎంతో అవసరం. యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజుల పరంగా యూఎస్, యూకేలతో పోల్చితే ఖర్చు కొంత తక్కువైనప్పటికీ.. నివాస ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. సాధారణంగా షేరింగ్ నివాసానికి ఏడాదికి ఏడు వేలు నుంచి తొమ్మిది వేల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు అద్దెలు ఉంటాయి. డైనింగ్, ఇతర హౌస్‌హోల్డ్ ఖర్చు నాలుగు వేల నుంచి అయిదు వేల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటుంది. స్టూడెంట్ క్లబ్స్, స్టడీ గ్రూప్స్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవడానికి, నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవడానికి అంతర్జాతీయ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఇతర మార్గాలు.. స్టూడెంట్ క్లబ్స్, స్టడీ గ్రూప్స్. ఇవి.. అకడమిక్, కల్చరల్ సంబంధిత అంశాల్లో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో సభ్యత్వం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. టాప్–5 ఉత్తమ నగరాలు ♦ మెల్బోర్న్లో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ సహా వివిధ ఉన్నత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య పరంగా ఈ నగరం ముందంజలో నిలుస్తోంది. ♦ ఆస్ట్రేలియా ఫైనాన్షియల్ హబ్‌గా, దేశంలో విస్తీర్ణం పరంగా పెద్ద నగరంగా గుర్తింపు పొందిన సిడ్నీలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ – సిడ్నీ వంటి ప్రముఖ యూనివర్సిటీలు నెలకొన్నాయి. ♦ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డైవర్సిటీ పరంగా గుర్తింపు పొందిన ప్రాంతం కాన్బెర్రా. ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఇక్కడే ఉంది. ♦ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వంటివి ముఖ్యమైన విద్యాసంస్థలు. పెద్దఎత్తున సహజ వనరులు, ఇంధన కంపెనీలకు నిలయమైన ఈ నగరంలో కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. ♦ యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా వంటి ముఖ్యమైన యూనివర్సిటీలు ఈ నగరంలో ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలమైన నగరంగా దీన్ని చెప్పొచ్చు. -
హెచ్–1బి కఠినం!
హెచ్–1బి వీసా.. అమెరికాలో కొలువు కలను సాకారం చేసుకునేందుకు మార్గం. దీనిద్వారా కంపెనీలకు సైతం భారత్ నుంచి నిపుణులను నియమించుకునే అవకాశం ఉంటుంది. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అటు కంపెనీలు, ఇటు ఉద్యోగార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. విదేశీ వలస ఉద్యోగులకు అడ్డుకట్ట వేసేలా నిబంధనలు కఠినతరం చేస్తామన్న ఆయన ప్రకటనలు అమెరికా జాబ్ ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్–1బి నిబంధనలు– వాటిని కఠినతరం చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్.. హెచ్–1బి ద్వారా ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెట్టడానికి రెండు విధానాలు అమలవుతున్నాయి. అవి.. 1. అమెరికాలో ఉన్న సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించడం. 2. అమెరికాలో ఉన్న కంపెనీలకు ఔట్సోర్సింగ్ ద్వారా సేవలందించే ఇతర దేశాల సంస్థలు తమ ఉద్యోగులను అమెరికాలోని తమ క్లయింట్ సంస్థకు పంపడం. ఈ రెండిటిలో రెండో విధానం ద్వారా అధిక శాతం మంది భారతీయులు అమెరికాలో అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు హెచ్–1బి ఆధారిత నియామకాల్లో ముందంజలో ఉంటున్నాయి. అర్హులు లేరని రుజువు చేస్తేనే విదేశీ వ్యక్తులను నియమించుకునే క్రమంలో సంబంధిత జాబ్ ప్రొఫైల్‌కు అవసరమైనlనైపుణ్యాలున్న వారు అమెరికాలో లభించడం లేదని ధ్రువీకరణ ఇస్తేనే హెచ్–1బి వీసా స్పాన్సర్షిప్ లెటర్ దరఖాస్తుకు అనుమతి లభిస్తుంది. అయితే ఈ విధానంలో తక్కువ వేతనాలకే విదేశీయులను నియమించుకుంటున్నారనే విమర్శ ఉంది. అంతేకాకుండా ఆయా జాబ్ ప్రొఫైల్స్‌కు అవసరమైన స్కిల్స్ కలిగిన యువత అమెరికాలో ఉన్నారని అక్కడ కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. నిపుణుల కొరత అమెరికా ఉద్యోగాలను విదేశీయులు చేజిక్కించుకోవడం వల్ల స్వదేశీ యువత అవకాశాలకు దూరమవుతోందన్నది అక్కడి రాజకీయ వర్గాల వాదన. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అమెరికా ప్రభుత్వ కార్మిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం– STEM రంగాల్లో 2018 నాటికి 24 లక్షల ఉద్యోగాలకు నిపుణుల కొరత ఏర్పడనుంది. వాటిలో దాదాపు సగం ఐటీ, సాఫ్ట్వేర్ సంబంధిత ఉద్యోగాలే! అంతేకాకుండా నవంబర్ 2016న యూఎస్ కాన్ఫరెన్స్ డేటా విడుదల చేసిన నివేదిక.. ప్రతి నాలుగు టెక్నికల్ ఉద్యోగాలకు ఒక్కరు మాత్రమే అర్హులు ఉన్నారని పేర్కొనడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్–1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయడమనేది ప్రస్తుతానికి అక్కడి రాజకీయ పరిస్థితుల కోణంలో యువతను ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ.. కంపెనీల కోణంలో సమీప భవిష్యత్తులో తీవ్ర ఒడిదుడుకులు ఎదురవడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. కఠిన నిబంధనలు హెచ్–1బి వీసా నిబంధనలు కఠినతరం చేయడం ఖాయమని తేలిన నేపథ్యంలో వాటి తీరుతెన్నులపై నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు.. - ఏటా 65 వేల పరిమితిగా ఉన్న హెచ్–1బి వీసాల సంఖ్యను 15 నుంచి 20 శాతం తగ్గించే అవకాశం. - విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వీసా ఫీజు, ఇతర ఆర్థిక వ్యయాలు (ఉద్యోగులకు ఇచ్చే ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ ఫీజు తదితరాలు) పెంచడం. - కనీస వేతన పరిమితిని పెంచడం. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కనీస వేతన పరిమితి కంపెనీలు, ఉద్యోగ విధుల స్థాయిని బట్టి 65 వేల డాలర్ల నుంచి 1.2 లక్షల డాలర్ల మధ్యలో ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు అమెరికాలో ఉద్యోగ ఔత్సాహికులను వేధిస్తున్న ప్రశ్న.. హెచ్–1బి విధానం కఠినమైతే తమకున్న ప్రత్యామ్నాయాలేంటి అనేదే! ఔత్సాహికులకు రెండు ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో: అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థలు, రీసెర్చ్ సంస్థలు, లాభాపేక్ష లేని ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో ఉద్యోగం పొందితే హెచ్–1బితో సంబంధం లేకుండా నేరుగా కొలువుదీరొచ్చు. అయితే వీటిని పొందాలంటే కనీసం పీహెచ్డీ అర్హత తప్పనిసరి. ఓపీటీ: బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అమెరికాలో కొలువు దీరాలనుకునే ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ). ఈ మార్గంలో ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా అభ్యర్థులు ఎఫ్–1 స్టూడెంట్ వీసాతో తొమ్మిది నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉన్న కోర్సుల్లో ప్రవేశం పొందాలి. ఆ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి, కోర్సుకు సంబంధించిన సంస్థల్లో ప్రాక్టికల్ శిక్షణ తీసుకునేందుకు అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన విద్యార్థులు STEM విభాగాల్లో గరిష్టంగా మూడేళ్లు శిక్షణ తీసుకునే అవకాశముంది. సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులు ఏడాది పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం తమ కోర్సుకు సరితూగే సంస్థల్లో ప్రవేశించొచ్చు. ఇలా శిక్షణ కోసం అనుమతి పొందినవారు మెరుగైన పనితీరు ద్వారా సదరు కంపెనీలో కొలువు సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఇచ్చే స్పాన్సర్లెటర్ ద్వారా హెచ్–1 బి వీసా సైతం పొందొచ్చు. భారత్ కంపెనీల తరఫున ప్రవేశించడం ఇప్పటికే అమెరికాలో కార్యాలయాలు నెలకొల్పడం ద్వారా లేదా అమెరికాలోని సంస్థలకు సేవలందిస్తున్న భారత కంపెనీల తరఫున అమెరికాలో ప్రవేశించడం మరో మార్గం. అయితే ఈ విధానంలో వెళ్లాలంటే కంపెనీల్లో అంతర్గతంగా తీవ్రమైన పోటీ ఉంది. మంచి పనితీరు చూపిన వారిని స్పాన్సర్ చేయడానికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణులు ఒకరు తెలిపారు. హెచ్–1బి వీసా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏటా 65 వేల వీసాల మంజూరు 2016లో 2.36 లక్షలకుపైగా దరఖాస్తులు. భారత్ నుంచే అత్యధిక పోటీ (దాదాపు 60 శాతం దరఖాస్తులు). విద్యార్థుల కలలకు.. తల్లిదండ్రుల వెన్నుదన్ను నాణ్యమైన విద్య, మెరుగైన ఉద్యోగ అవకాశాలు.. ఇవే భారతీయ విద్యార్థులను అమెరికా వైపు నడిపిస్తున్నాయి. ఉన్నతవిద్యకు అమెరికాను లక్ష్యంగా నిర్దేశించుకునేది విద్యార్థులే అయినా.. వారికి వెన్నుదన్నుగా నిలిచేది మాత్రం తల్లిదండ్రులే. వారు ఇస్తున్న నైతిక, ఆర్థిక మద్దతు కీలకమైంది. ఈ నేపథ్యంలో స్టడీ అబ్రాడ్–యూఎస్ దిశగా ఆలోచిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని, ముందడుగు వేయాలంటున్నారు నిపుణులు.. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌కు చెందిన ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ’.. అమెరికా విద్యపై సందేహాలను నివృత్తి చేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు; అమెరికా పంపించాలనుకుంటున్న పేరెంట్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. వీరికి ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తూ, మార్గనిర్దేశనం చేస్తోంది. అందువల్ల ఔత్సాహిక విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ నుంచి యూనివర్సిటీ సమాచారం వరకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పరిశోధన విభాగం ఓపెన్ డోర్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక (2015–16) ప్రకారం అమెరికా యూనివర్సిటీల్లో మొత్తం 10.43 లక్షల మంది విదేశీ విద్యార్థులు చేరారు. ఒక ఏడాదిలో 10 లక్షలు అంతకంటే ఎక్కువ మంది అమెరికా యూనివర్సిటీల్లో చేరడం ఇదే తొలిసారి. వీరిలో భారత్ నుంచి వెళ్లినవారు 1.66 లక్షల మంది. చైనా నుంచి అత్యధికంగా 3.28 లక్షల మంది వెళ్లగా, తర్వాతి స్థానంలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. మరిన్ని సూచనలు పిల్లలతో మనసువిప్పి మాట్లాడాలి. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. వారి ప్రతిభను గుర్తించి, వారి ఆసక్తులను అర్థం చేసుకోవాలి. యూనివర్సిటీలు, అవి ఆఫర్ చేస్తున్న కోర్సులపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటిలో తమ పిల్లలకు నప్పే, మెచ్చే కోర్సు, విద్యాసంస్థను ఎంపిక చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రకారం నడచుకోవాలి. భవిష్యత్తులో ఏం నేర్చుకోబోతున్నారు? ఆ జ్ఞానం ఆధారంగా కెరీర్ ఎలా ఉండబోతోంది? తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా యూనివర్సిటీల్లో చదువుతున్న, పూర్వ విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఎంచుకున్న కోర్సుకు సంబంధించి, కొంత పరిశోధన చేయాలి. (స్టడీ అబ్రాడ్) -
స్టడీ అబ్రాడ్ ఆశలపై నీళ్లు!
3,50,000.. భారత్ నుంచి గతేడాది (2015-16) అంతర్జాతీయంగా పలు దేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య! 3,60,000.. రానున్న సంవత్సరం (2017) చివరికి భారత్ నుంచి విదేశాలకు వెళ్లనున్న విద్యార్థుల సంఖ్య అని అంచనా!!ప్రస్తుతం ఈ విదేశీ విద్య ఔత్సాహికులను పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆందోళనకు గురి చేస్తోంది. నోట్ల రద్దు సమయంలో పేర్కొన్న పన్ను నిబంధనలు, ఆర్థిక లావాదేవీలపై పరిమితులు విద్యార్థుల స్టడీ అబ్రాడ్ ఆశలపై ఒకరకంగా నీళ్లు చల్లాయంటున్నారు నిపుణులు. విద్యార్థుల విదేశీ విద్య ప్రయత్నాలపై నోట్ల రద్దు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.. బ్యాంకు బ్యాలెన్స్ తప్పనిసరి విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజులు వేల డాలర్లలో ఉంటున్నాయి. వాటిని మన కరెన్సీలోకి లెక్కిస్తే రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల మధ్యలో ఉంటుంది. దీనికి అదనంగా కోర్సు సమయంలో నివాస, జీవన వ్యయా లను భరించే స్థోమత అభ్యర్థికి ఉందని తెలిపే బ్యాంక్ బ్యాలెన్స్‌ను తప్పనిసరిగా చూపాలి. అమెరికా, బ్రిటన్ నుంచి ఐర్లాండ్, సింగపూర్ వంటి అప్‌కమింగ్ డెస్టినేషన్స్‌గా మారుతున్న దేశాల వరకు.. అన్ని దేశాల్లోని వర్సిటీలు, ఇమిగ్రేషన్ శాఖలు ఈ నిబంధనలను విధిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు - పరిమితులు, పరిమితి దాటిన డిపాజిట్లు, బ్యాలెన్స్‌లపై ఆర్థిక శాఖ నిబంధనలు కఠినతరం చేసింది. అంటే... ఒకవైపు విదేశీ విద్యకు వెళ్లాలంటే... వర్సిటీలకు లక్షల్లో ఫీజులు చెల్లించాలి, లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స చూపాలి. మరోవైపు రూ.2.5 లక్షల పరిమితి దాటిన డిపాజిట్లపై నిఘా ఉంటుందని మన ఆర్థిక శాఖ ప్రకటించడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. స్ప్రింగ్ సెషన్.. హైటెన్షన్ ఆయా దేశాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రారంభమయ్యే స్ప్రింగ్ సెషన్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను పెద్ద నోట్ల రద్దు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఇప్పటికే ఫీజులు, ఇతర రుసుములు చెల్లించినా.. భవిష్యత్తులో అయ్యే వ్యయాలకు సరిపడా కరెన్సీ చేతిలో లేకపోవడం సమస్యగా మారింది. విమాన ప్రయాణ ఖర్చులు మొదలు తమ గమ్యస్థానం చేరుకున్నాక అయ్యే వ్యయాలను సమీకరించుకునేందుకు, సమీకరించుకున్నా.. వాటికి సంబంధించి చూపాల్సిన సోర్సెస్ ఆఫ్ ఇన్‌కం, వాటిపై ట్యాక్స్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఫాల్ సెషన్.. అప్లికేషన్ నుంచే... సెప్టెంబర్/అక్టోబర్ నుంచి ఫాల్ సెషన్ పేరుతో ప్రారంభమయ్యే అడ్మిషన్సకు అప్లికేషన్ దశ నుంచే కరెన్సీ రద్దు ప్రతికూలంగా మారింది. దరఖాస్తు, స్టాండర్డ్ టెస్ట్స్ రిజిస్ట్రేషన్ ఫీజులు అన్నీ కలిపితే మన కరెన్సీలో రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను తమ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసినా.. వాటికి సరిపడా కొత్త కరెన్సీ లభించడం లేదు. అంతేకాకుండా విత్‌డ్రా మొత్తాలపైనా ఆంక్షలు అమలవుతున్నాయి. అప్లికేషన్ ఫీజులు, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్‌కు సంబంధించిన ఫీజులు ఆన్లైన్లో చెల్లించినా.. టెస్ట్స్ సెంటర్స్‌కు చేరుకొని పరీక్ష రాసేందుకు అయ్యే ప్రయాణ చార్జీలకు సరిపడా కొత్త నగదు కూడా లభించడంలేదంటున్నారు. ఫారెన్ ఎక్స్ఛేంజ్ ప్రభావం ఇప్పటికే ఆయా దేశాల్లో అడుగు పెట్టి కోర్సులు అభ్యసిస్తున్నవారిని సైతం కరెన్సీ రద్దు ప్రభావం వెంటాడుతోంది. కొత్త నోట్లు సరిపడా లభించకపోవడంతో.. అధిక శాతం మంది ఆధారపడుతున్న మనీ ఫారెన్ ఎక్స్ఛేంజ్ విధానం కూడా కుంటుపడింది. ఇప్పటివరకు చాలామంది తల్లిదండ్రులు విదేశాల్లోని తమ పిల్లలకు నగదు పంపేందుకు ఫారెన్ ఎక్స్ఛేంజ్ విధానం వెసులుబాటుగా ఉండేది. కానీ ఇప్పుడు సదరు ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఏజెన్సీలు పాత నోట్లను అంగీకరించకపోవడం సమస్యగా మారింది. థర్డ్ పార్టీ హామీ దొరక్క విదేశీ విద్యకు వెళుతున్న అభ్యర్థులు ఆర్థిక నిధుల రుజువులు, ధ్రువీకరణలకు సంబంధించి థర్డ్‌పార్టీ(తల్లిదండ్రులు కాకుండా ఇతరులు) హామీ పొందేవారు. కానీ నోట్ల రద్దు నేపథ్యంలో థర్డ్‌పార్టీ హామీ ఇచ్చే వారు సైతం వెనుకంజ వేస్తున్నారు. తమ పిల్లల చదువుకు సంబంధించి నిధులు చూపించే స్థోమత ఉన్న తల్లిదండ్రుల్లో సైతం కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తమ పిల్లల అకౌంట్లలో నగదు జమ చేయడం, దానికి సోర్స్ ఆఫ్ ఇన్‌కం చూపించాల్సి రావడం, లేదంటే భారీ ఎత్తున పన్నులు ఎదుర్కోవాల్సి వస్తుందని మదనపడుతున్నారు. ‘ప్రైవేట్’ రుణాలు దొరకని పరిస్థితి విదేశాల్లో ఉన్నత చదువులకు అయ్యే వ్యయాల కోసం ఔత్సాహికులు ఎక్కువగా ఆధారపడేది ప్రైవేట్ రుణాలపైనే. అయితే నోట్ల రద్దుతో చెల్లింపులన్నీ చెక్కులు లేదా నగదు రూపంలో ఉండాలనే నిబంధన, దానికి అనుబంధంగా రుణం ఇచ్చిన వ్యక్తికి ఆ మొత్తం ఎలా లభించిందో నిరూపించే సోర్స్ ఆఫ్ ఇన్‌కంను కూడా చూపాల్సి ఉంటుంది. దాంతో ప్రైవేట్ రుణ దాతలు ఇప్పుడు విదేశీ విద్య ఔత్సాహికులకు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. పెరుగుతున్న డాలర్ విలువ ఇవన్నీ ఒక ఎత్తయితే.. మన రూపాయితో పోల్చితే డాలర్ విలువ పెరుగుతుండటం విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలరోజులుగా ఒక డాలర్ మారకం విలువ రూ.67 నుంచి రూ. 69 వరకు కూడా వెళ్ల్లింది. దీని వల్ల ఫీజులకు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి రావడంతోపాటు చూపించాల్సిన ఆర్థిక వనరుల మొత్తాలు పెరుగుతాయి. ఇది విదేశీ విద్య ఔత్సాహికులను నిరాశకు గురిచేస్తుంది. స్టడీ అబ్రాడ్ విద్యార్థులకు ఆర్థిక నిధుల పరంగా ఆయా యూనివర్సిటీలు అమలు చేస్తున్న నిబంధనలను పరిగణనలోకి తీసుకుని.. వారికి ఉపశమనం కలిగించేలా ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుంటుందని ఓ ప్రముఖ బ్యాంక్‌కు చెందిన జీఎం తెలిపారు. ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకుని వాటిని బ్యాంక్ అకౌంట్లో జమచేసి హామీగా చూపించుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని.. ఇతర మార్గాల ద్వారా సమీకరించుకునే వారిపై నిఘా ఉంటుందని ఆయన అంటున్నారు. సోర్స్ ఆఫ్ ఇన్‌కం తప్పనిసరి ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2.5 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరూ సోర్స్ ఆఫ్ ఇన్‌కం చూపించాల్సిందే. అది ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు సరితూగేలా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేకపోతే నిబంధనల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. స్టడీ అబ్రాబ్ ఔత్సాహికుల విషయంలో ఇప్పటి వరకు ప్రత్యేక మార్గదర్శకాలు ఏమీ లేవు. కానీ వీరికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. - కె.రఘురాం, ఐటీఓ, హైదరాబాద్ -
స్టడీ అబ్రాడ్..
విదేశాల్లో చదువుకొని, ఉన్నతవిద్యా పట్టా పొంది సుస్థిర కెరీర్‌ను సాధించాలని ఎంతో మంది లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. అయితే చాలా మంది ఆర్థిక సమస్యల కారణంగా ‘స్టడీ అబ్రాడ్’కు దూరమవుతారు. కానీ, ఓర్పూ, నేర్పూ ఉంటే విదేశాల్లో చదువుకుంటూ, ఖర్చులకు అవసరమైన డబ్బును పార్ట్‌టైమ్ ఉద్యోగాల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ క్రమంలో పార్ట్‌టైమ్ కొలువును ఎలా సంపాదించాలి? ఏ దేశంలో ఎన్ని గంటలు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే వెసులుబాటు ఉంది? వంటి అంశాలపై ప్రత్యేక కథనం.. విదేశాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే ముందు ఆర్థిక ప్రయోజనాలతోపాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అది భవిష్యత్‌లో ఉద్యోగపరంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. ఆ ఉద్యోగం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయా? కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగ సాధనకు ఉపయోగపడుతుందా? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పార్ట్‌టైమ్ వర్కర్‌గా అభ్యర్థికి ఉన్న హక్కులు, పాటించాల్సిన నియమ, నిబంధనలు వంటి అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఏ దేశంలో? ఎన్ని గంటలు? ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ పనిదినాల్లో ప్రతి రెండు వారాలకు 40 గంటలు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చు. సెలవుల్లో ఎన్ని గంటలైనా చేయొచ్చు. కెనడాలో ఏదైనా కోర్సులో తొలి ఆరు నెలలు పూర్తిచేసినవారిని మాత్రమే పార్ట్‌టైమ్ వర్క్ చేసేందుకు అనుమతిస్తారు. క్యాంపస్‌లో వారానికి 20 గంటలు, సెమిస్టర్ బ్రేక్స్‌లో ఫుల్‌టైమ్ పనిచేసుకోవచ్చు. అమెరికాలో ఇక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పార్ట్‌టైమ్ జాబ్ చేసేందుకు ఆప్షన్లు ఉండవు. రెండేళ్ల వ్యవధి గల కొన్ని ఉన్నత విద్య కోర్సుల విద్యార్థులకు ఫస్టియర్‌లో ఆన్ క్యాంపస్ వర్క్‌కు అనుమతి ఇస్తారు. సెకండియర్‌లో సంబంధిత అధికారి అనుమతి మేరకు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేసుకోవచ్చు. అయితే వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. బ్రిటన్‌లో సెమిస్టర్ టైమ్‌లో వారానికి సగటున 20 గంటలు, సెమిస్టర్ బ్రేక్స్‌లో ఫుల్‌టైమ్ పనిచేయొచ్చు. సింగపూర్‌లో వారానికి 16 గంటలు పార్ట్‌టైమ్ వర్క్ చేసుకోవచ్చు. మలేషియాలో ఏడు రోజులకు మించి సెలవులు ప్రకటించినప్పుడు వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చు. నిబంధనలు-హక్కులు విద్యార్థులు స్టూడెంట్ వీసాతో పార్ట్‌టైమ్ వర్క్ చేయడానికి అనుమతించే నియమ నిబంధనలు, పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. ఇవి ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. పనిచేసే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడని ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు కనీస వేతనం, బ్రేక్స్, విశ్రాంతి సమయం, వ్యక్తిగత భద్రత. ప్రయత్నాలు ఎప్పుడు ప్రారంభించాలి? కొత్త దేశంలో, కొత్త క్యాంపస్ వాతావరణంలో ఇమిడేందుకు, కొంత సమయం కేటాయించాలి. వర్సిటీలో చేరిన 3, 4 నెలల తర్వాతపార్ట్టైమ్ జాబ్ ప్రయత్నాలు చేయడం మంచిది. ఈలోపు కోర్సు సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి. పార్ట్‌టైమ్ జాబ్ ప్రయత్నంలో భాగంగా రెజ్యూమె ఎంత బాగా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం అంత బాగుంటుంది. కరిక్యులం విటేలో అనవసర వివరాలను పొందుపరచొద్దు. విద్యార్హతలు, నైపుణ్యాలు, పూర్వానుభవం గురించి తెలపాలి. భవిష్యత్ లక్ష్యాలను పేర్కొనాలి. వీటన్నింటినీ చక్కటి భాషలో సూటిగా, స్పష్టంగా పొందుపరచాలి. పార్ట్‌టైమ్ జాబ్ ఎక్కడ చేయాలి? విద్యార్థులు ఉన్న ప్రాంతంలోనే పార్ట్‌టైమ్ జాబ్‌ను వెతుక్కోవడం మంచిది. క్యాంపస్‌లో ఉండేవారు ఆన్ క్యాంపస్ అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఉదాహరణకు కంప్యూటర్ సెంటర్లు, కేఫ్టీరియాలు. అయితే అధిక శాతం మంది వీటి కోసమే ప్రయత్నించడం వల్ల పోటీ ఎక్కువగా ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్.. ఆన్ క్యాంపస్ మినహా వేరేచోట పార్ట్‌టైమ్ వర్క్ చేయడానికి వీల్లేదు. కేఫ్‌లు, రెస్టారెంట్లు, బార్లు కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగానికి బెస్ట్. నైపుణ్యాలను బట్టి బార్ స్టాఫ్‌గా, వెయిటర్‌గా చేరొచ్చు. ఈ రెండూ దొరక్కపోతే కిచెన్‌లో పనిచేసేందుకైనా ప్రయత్నించొచ్చు. రెస్టారెంట్లలో పని అధిక శాతం సాయంత్రం వేళల్లో ఉంటుంది. బార్లలో కూడా నైట్ షిఫ్టుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. దాంతో మార్నింగ్ క్లాస్‌లకు వెళ్లడం కష్టమవుతుంది. ఫలితంగా మొత్తం స్టడీ సైకిలే దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల సరైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టుంటే పార్ట్‌టైమ్ జాబ్ కోసం కాల్ సెంటర్లలోనూ ప్రయత్నించొచ్చు. ఇందులోనైతే వేతనాలు కూడా రీజనబుల్‌గా ఉంటాయి. శారీరక శ్రమ తక్కువ గా ఉండటమే కాకుండా ఆఫీస్ వాతావరణంలో పనిచేస్తున్న భావన కూడా కలుగుతుంది. ఇంటర్న్‌షిప్ కోసం కోర్సు, స్పెషలైజేషన్‌కు తగిన ఇంటర్న్‌షిప్ కోసం కూడా ప్రయత్నించొచ్చు. ఇంటర్న్‌గా పనిచేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వర్క్‌ప్లేస్‌లో నిపుణుల పనితీరును పరిశీలిస్తూ వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆయా సంస్థలే రెగ్యులర్ ఉద్యోగం కల్పించే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ రంగంలోనూ ప్రయత్నించొచ్చు. అడ్మినిస్ట్రేషన్, ట్యుటోరియల్, టూరిజం, రిటైల్ (క్లాత్స్టోర్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు, సూపర్ మార్కెట్లు)పైనా దృష్టిసారించవచ్చు. అందిపుచ్చుకునే చొరవ ఉండాలేగానీ అవకాశాలకు కొదవలేదు. సోషల్ నెట్వర్కింగ్ ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వివరాలు పొందుపరిచేటప్పుడు ‘పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను’ అని పేర్కొనాలి. సరైన ‘వేకెన్సీ గ్రూప్స్’లో సభ్యులుగా చేరడం, యూనివర్సిటీ పేజీలను ‘లైక్’ చేస్తుండటం వంటి వాటివల్ల అవకాశాలు మెరుగవుతాయి. సంప్రదాయ ప్రయత్నాలతో పోల్చితే సోషల్ మీడియా సైట్లలో జాబ్ సెర్చింగ్ ప్రక్రియ పది రెట్లు వేగంగా జరుగుతుంది. యూనివర్సిటీ కెరీర్ టీమ్‌లను సంప్రదించి ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ పార్ట్‌టైమ్ జాబ్ ఆప్షన్ల గురించి తెలుసుకోవాలి. విద్యార్థులకు ఉద్యోగాలు చూపించడమే లక్ష్యంగా ఆయా బృందాలు పనిచేస్తాయి. వార్తాపత్రికల్లోని జాబ్ లిస్టింగ్‌లను రోజూ చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ జాబ్స్, ఈ4ఎస్ తదితర పాపులర్ పార్ట్‌టైమ్ జాబ్ వెబ్సైట్లను బ్రౌజ్ చేస్తుండాలి. వేతనాలు పార్ట్‌టైమ్ జాబ్‌కి లభించే వేతనం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశం, ఉద్యోగ స్వరూపం, పనిచేసే గంటలు తదితర అంశాల ఆధారంగా వేతనాలు ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు కోసం తాత్కాలికంగా పార్ట్‌టైమ్ జాబ్ చేసినా.. అంతిమంగా విద్యార్థుల దృష్టి స్టడీపైనే ఉండాలి. స్టడీని, వర్క్‌ను సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలను సాధించాలి. -
స్టడీ అబ్రాడ్
ప్రముఖ దేశాలు, కోర్సుల వివరాలు.. విదేశీ చదువు.. పరదేశీ కొలువు... కొన్నేళ్ల కిందట సగటు భారతీయ విద్యార్థికి తీరని కల. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలు, లభిస్తున్న ఆర్థిక వనరుల దృష్ట్యా అందరికీ విదేశీ విద్య అందుబాటులోకి వచ్చింది! దీంతో ఇష్టమైన కోర్సు చదవడానికి భారతీయ యువత రెక్కలు తొడిగిన పక్షిలా విదేశీ విద్య వైపు విహరిస్తూ, అక్కడే మంచి కొలువులు సాధిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థుల అవసరాలకనుగుణంగా వివిధ దేశాల్లోని యూనివర్సిటీలు ప్రవేశ ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. ప్రధానంగా మన దేశం నుంచి ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్మెంట్, మెడిసిన్ కోర్సుల్లో ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన దేశాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిని అందిస్తున్న ప్రముఖ యూనివర్సిటీలపై ఫోకస్.. యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశీ విద్య అనగానే ఎక్కువ మంది యూఎస్ఏ వైపు చూస్తారు. గత మూడు, నాలుగు దశాబ్దాల నుంచి భారత్, చైనా, దక్షిణ కొరియా, దక్షిణాసియాలకు చెందిన ఎక్కువ శాతం విద్యార్థులు ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్, ఎంఐటీ వంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతోపాటు దాదాపు 4000 యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు ఏటా 9 లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నట్లు అంచనా. అమెరికా యూనివర్సిటీల్లో బోధనా విధానం, ఆకర్షణీయమైన ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలు, కోర్సు పూర్తయిన తర్వాత మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశం ఉండటం కూడా ప్రపంచంలో ఎక్కువ మంది అమెరికా వెళ్లడానికి ప్రధాన కారణం. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, సోషల్ సెన్సైస్, ఫిజికల్ అండ్ లైఫ్ సెన్సైస్. ప్రముఖ యూనివర్సిటీలు: మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో, కార్నెగీ మిలన్ యూనివర్సిటీ. యూకే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు నెలవైన యూకే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. యూకేలో ఉన్నతవిద్య కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటుండగా వీరిలో భారత్ నుంచి దాదాపు 25 వేల మంది విద్యార్థులు ఉంటున్నట్లు అంచనా. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు కాగా అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఫాస్ట్‌ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాది వ్యవధిలోనే పీజీ కోర్సులను అందిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందుబాటులో ఉండటం ఇక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. బ్రెగ్జిట్ ప్రభావంతో అకడమిక్ ఫీజులు కూడా తగ్గే అవకాశం ఉన్నందువల్ల విద్యార్థుల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, సోషల్ సెన్సైస్, ఫిజికల్ అండ్ లైఫ్ సెన్సైస్, ఫైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్. ప్రముఖ యూనివర్సిటీలు: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్-లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, కింగ్స్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, యూనివర్సిటా ఆఫ్ వార్విక్. ఆస్ట్రేలియా అమెరికా, యూకేల తర్వాత భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యం ఇస్తున్న దేశం ఆస్ట్రేలియా. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఈ దేశం. ఉన్నత విద్య, స్కాలర్‌షిప్‌లకు కూడా అక్కడి ప్రభుత్వం చాలా ప్రాముఖ్యం ఇస్తోంది. స్టూడెంట్ వీసా నిబంధనలను సరళీకృతం చేయడం, పోస్ట్ స్టడీ వర్క్ పేరుతో అక్కడే ఉద్యోగం చేసే అవకాశం కల్పించడం విద్యార్థులు ఆస్ట్రేలియా వైపు వెళ్లడానికి ప్రధాన కారణం. వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు వెళుతున్నట్లు అంచనా. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, హెల్త్ ప్రొఫెషన్స్, ఫుడ్, హాస్పిటాలిటీ అండ్ పర్సనల్ సర్వీసెస్. ప్రముఖ యూనివర్సిటీలు: ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, మొనాష్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, యూనివర్సిటీ ఆఫ్ వోలన్గాంగ్, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, విక్టోరియా యూనివర్సిటీ. కెనడా ప్రపంచం నలుమూలల నుంచి కెనడాకు ఏటా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నట్లు అంచనా. ఈ దేశ యూనివర్సిటీల నుంచి పొందిన డిగ్రీకి యూఎస్, ఆస్ట్రేలియా దేశాల డిగ్రీలతో సమ ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. కెనడా విదేశీ విదార్థులకు స్టడీ వీసాతోపాటు వర్క్‌పర్మిట్ వీసా కూడా మంజూరు చేస్తోంది. చదువుకుంటూనే సొంత ఖర్చుల కోసం విద్యార్థులు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైం జాబ్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కూడా రెండేళ్ల వరకు పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది అక్కడి ప్రభుత్వం. పని అనుభవం ఉన్న ఉన్నత విద్యావంతులు పర్మినెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, హోటల్ మేనేజ్మెంట్, జర్నలిజం, లిబరల్ ఆర్ట్స్. ప్రముఖ యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, మెక్‌గిల్ యూనివర్సిటీ, మెక్ మాస్టర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్, యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా, యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా, యూనివర్సిటీ ఆఫ్ ఒటావా, యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ. న్యూజిలాండ్ గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం న్యూజిలాండ్ వెళ్లే భారతీయల సంఖ్య దాదాపు 400 శాతం పెరిగింది. అక్కడ ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం. ఇతర దేశాలతో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఉన్నతవిద్యను పూర్తిచేయొచ్చు. కోర్సు పూర్తయ్యాక స్టూడెంట్ వీసాతోనే ఏడాది కాలపరిమితితో చాలా విద్యాసంస్థలు ‘స్టూడెంట్ జాబ్ సెర్చ్’ అనే సర్వీస్‌ను అందిస్తున్నాయి. పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన ఉద్యోగం సాధిస్తే న్యూజిలాండ్ పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) కూడా సులువుగా లభిస్తుంది. పీఆర్ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నతవిద్య అభ్యసించాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం తిరిగి చెల్లించే నిబంధనలతో ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, సోషల్ సెన్సైస్, ఫిజికల్ అండ్ లైఫ్ సెన్సైస్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ప్రముఖ యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో, యూనివర్సిటీ ఆఫ్ కాంటెర్బరీ, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్, మాసే యూనివర్సిటీ, వ్యకాటో యూనివర్సిటీ, లింకన్ యూనివర్సిటీ, ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. జర్మనీ ఉచిత లేదా అతి స్వల్ప ఫీజులతో ఉన్నతవిద్యను అందిస్తున్న దేశం జర్మనీ. ఆ దేశ ప్రభుత్వ విధానాల ప్రకారం చాలా యూనివర్సిటీలు ఫీజులు లేకుండానే లేదా సెమిస్టర్‌కు 500 యూరోల స్వల్ప ఫీజుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎలాంటి ఫీజు వసూలు చేయని ఇన్స్టిట్యూట్లలో చేరిన విద్యార్థులు సెమిస్టర్ కంట్రిబ్యూషన్ పేరుతో ప్రతి సెమిస్టర్‌కు 150 యూరోల నుంచి 250 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. జర్మనీ యూనివర్సిటీల్లో దాదాపు 12 శాతానికి పైగా విదేశీ విద్యార్థులే ఉన్నారు. ఎలాంటి కాలపరిమితి లేకుండా వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం.. కోర్సు పూర్తయ్యాక 18 నెలలపాటు జర్మనీలో ఉండి ఉద్యోగాన్వేషణ సాగించేందుకు అవకాశం కల్పించడం జర్మనీకి సంబంధించిన ప్రత్యేకాంశాలు. ముఖ్యమైన కోర్సులు: సెన్సైస్, ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, లా, ఎకనామిక్స్, సోషల్ సెన్సైస్. ప్రముఖ యూనివర్సిటీలు: ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆచెన్, టీయూ మునిచ్, యూనివర్సిటీ ఆఫ్ డిస్బర్గ్ ఎస్సెన్, టీయూ చెమిట్చ్, టీయూ హంబర్గ్-హర్బర్గ్, టీయూ డర్మ్స్టాట్, యూనివర్సిటీ ఆఫ్ బాన్, యూనివర్సిటీ ఆఫ్ స్టట్గార్ట్, టీయూ కైసర్స్లాటెర్న్, యూనివర్సిటీ ఆఫ్ డార్ట్మండ్. చైనా అంతర్జాతీయంగా వైద్యవిద్యకు పేరొందిన దేశం చైనా. గతంలో కేవలం చైనీస్ భాషలోనే బోధించే ఇన్స్టిట్యూట్లు ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనూ బోధిస్తుండటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రాధాన్యం ఇవ్వడం లాంటి అంశాలతో చైనా అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది. వైద్య విద్యతోపాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు కూడా చైనాలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనాలోని చాలా మెడికల్ కాలేజీలు ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించకుండా అడ్మిషన్లను సులభతరం చేయడంతో విద్యార్థులు ఎక్కువగా ఆ దేశానికి వెళ్తున్నారు. ముఖ్యమైన కోర్సులు: మెడిసిన్, హ్యుమానిటీస్, బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, సోషల్ సెన్సైస్. ప్రముఖ యూనివర్సిటీలు: పెకింగ్ యూనివర్సిటీ, టి సింఘు్యవా యూనివర్సిటీ, ఫుడాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా, నాన్జింగ్ యూనివర్సిటీ, ఝెజియాంగ్ యూనివర్సిటీ, షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ, సన్- యెట్- సెన్ యూనివర్సిటీ. సింగపూర్ నాణ్యమైన విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యు.ఎస్, చైనా సర్టిఫికెట్లు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండటం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉండటం మన దేశ విద్యార్థులను సింగపూర్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, లా. టాప్ యూనివర్సిటీస్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, నాన్యాంగ్ టెక్నలా జికల్ యూనివర్సిటీ, కార్నెల్-నాన్యెంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సినవి.. జీఆర్ఈ, టోఫెల్, పీటీఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, శాట్ లాంటి పరీక్షల్లో స్కోరు ఉండాలి. దరఖాస్తుతోపాటు కవరింగ్ లెటర్ అప్లికేషన్ ఫీజు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్ ఆఫ్ రికమండేషన్ సర్టిఫికెట్లు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పాస్‌పోర్ట్ స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయపు పన్ను స్టేట్మెంట్ -
బీటెక్ అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్ స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల తొలి ప్రాధాన్యం.. యూఎస్! అక్కడ కోర్సు పూర్తిచేస్తే తిరుగులేని కెరీర్ సొంతమవుతుందని భావించి, ఏటా లక్షల మంది ఆ దిశగా ప్రయత్నిస్తుంటారు. వీరిలో అధిక శాతం మంది లక్ష్యం.. ఎంఎస్, ఎంబీఏ! అయితే అమెరికాలో యూజీ కోర్సులు చేయడానికి కూడా అవకాశాలు అనేకం. మరికొద్ది నెలల్లో యూఎస్ వర్సిటీల్లో స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలో బీటెక్ అవకాశాలు.. అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్).. భారత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న కోర్సు. ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సీటు కోసం తీవ్ర పోటీ ఉంటుంది. దాంతో అమెరికాలోని యూజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే భారత్ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2015 నాటికి అమెరికాలో 9 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉండగా, వారిలో భారత విద్యార్థుల సంఖ్య 1,32,888. వీరిలో 15-18 శాతం మంది యూజీ కోర్సుల విద్యార్థులు! వీరిలో 80 శాతం మంది ఇంజనీరింగ్‌కు సంబంధించిన వారు కాగా, మిగిలిన వారు సైన్స్ కోర్సులు చేస్తున్నవారు. యూఎస్‌లో బీటెక్‌కు మార్గం యూఎస్‌లో బీటెక్‌లో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి.. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. * స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)లో స్కోర్. * శాట్ సబ్జెక్టు టెస్ట్‌ల్లో స్కోర్ (కొన్ని ప్రముఖ యూనివర్సిటీలకు మాత్రమే) * ACT (American College Testing) శాట్, ఏసీటీ పరీక్షల విధానం శాట్ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. అవి.. రీడింగ్ (52 ప్రశ్నలు), రైటింగ్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ (44 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (58 ప్రశ్నలు). మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. అదనంగా మరో 50 నిమిషాల్లో ఒక ఎస్సే రాయాలి. ఇది అభ్యర్థుల ఛాయిస్ మాత్రమే. 1600 పాయింట్లకు గరిష్ట స్కోరింగ్ ఉంటుంది. ఇందులో 50 శాతం మ్యాథమెటిక్స్‌కే!. విద్యార్థులు 1200 పాయింట్లు సాధిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సుకు అనుగుణంగా అనుబంధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు శాట్ సబ్జెక్టు టెస్ట్‌లు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ తదితర 21 సబ్జెక్టుల్లో ఉండే శాట్ సబ్జెక్ట్ టెస్ట్‌లో ప్రతి సబ్జెక్ట్ పరీక్షకు 800 పాయింట్ల స్కోర్ ఉంటుంది. శాట్ పరీక్షను ఏటా ఏడుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. అయితే రెండు కంటే ఎక్కువ అటెంప్ట్‌లు ఇస్తే దరఖాస్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయముంది. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అమెరికాలోని కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మరో పరీక్ష.. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్ విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1 నుంచి 36 పాయింట్ల స్కోర్ కేటాయిస్తారు. ఈ పాయింట్ల శ్రేణిలో 25 పాయింట్లు సొంతం చేసుకుంటే.. ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పరీక్షను ఏటా ఆరుసార్లు నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం తొలుత అమెరికా విదేశీ వ్యవహారాల అధికారిక వెబ్సైట్ ఆధారంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీల జాబితాను పరిశీలించాలి. ఆయా యూనివర్సిటీలు-అవసరమైన అర్హతలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత శాట్ లేదా ఏసీటీ టెస్ట్‌లకు సన్నద్ధం కావాలి. ఆ స్కోర్ల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. దరఖాస్తుతోపాటు అందించాల్సిన పత్రాలు.. * విద్యార్హతల సర్టిఫికెట్లు ఠ స్టాండర్ట్ టెస్ట్ స్కోర్ కార్డులు * కోర్సు ట్యూషన్ ఫీజు, కోర్సు వ్యవధిలో అమెరికాలో నివసించేందుకు అయ్యే వ్యయాలకు సరిపడినంతగా ఆర్థిక వనరులున్నాయనే రుజువులు. * స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (సదరు కోర్సులో, నిర్దిష్టంగా సదరు ఇన్‌స్టిట్యూట్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణాలు, ఆ ఇన్స్టిట్యూట్ అర్హతలు, ఇతర ప్రమాణాలకు తాము ఎలా సరితూగుతామో తెలియజేస్తూ రాసే స్టేట్మెంట్) * లెటర్ ఆఫ్ రికమండేషన్ వీసా ఎలా ప్రవేశం ఖరారు చేసిన ఇన్స్టిట్యూట్ ఐ-20 పేరుతో అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ పంపుతుంది. దాని ఆధారంగా విద్యార్థులు ఎఫ్-1 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు నిర్దేశిత తేదీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందితే వీసా లభిస్తుంది. ఈ వీసా కాల పరిమితి కోర్సు వ్యవధి మేరకు ఉంటుంది. ఎఫ్-1 వీసా పొందిన వారు కోర్సు పూర్తయ్యాక 2 నెలలు అమెరికాలో ఉండే విధంగా నిబంధనలో వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఎఫ్-1వీసా ఆధారంగా యూజీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఆ అర్హతతో అమెరికాలోనే మరో ఇన్స్టిట్యూట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందితే.. మరో ఐ-20 ఫామ్ ఆధారంగా వీసా పొడిగింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు, వ్యయాలు యూనివర్సిటీలను బట్టి ఫీజుల్లో వ్యత్యాసాలున్నాయి. టాప్-10 యూనివర్సిటీల్లో వార్షిక ఫీజు 40-47 వేల డాలర్లు ఉంది. ఉండటానికి, రవాణా, ఆహారం తదితర అవసరాలకు నెలకు 10 వేల డాలర్ల వరకు అవసరం. కొన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలి. ఉదా: ఏఏసీఈ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్, ఫుల్బ్రైట్ స్కాలర్షిప్.. * ద అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమెన్ (విద్యార్థినులకు) వంటి స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నించొచ్చు. కొన్ని యూనివర్సిటీలు మెరిట్ కమ్ మీన్ బేస్డ్ విధానంలో తొలి సెమిస్టర్లో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. యూఎస్-టాప్ వర్సిటీలు * మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ * ప్రిన్స్టన్ యూనివర్సిటీ * కాలిఫోర్నియా యూనివర్సిటీ * హార్వర్డ్ యూనివర్సిటీ * మిచిగాన్ యూనివర్సిటీ * స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ * యూనివర్సిటీ ఆఫ్ షికాగో * కొలంబియా యూనివర్సిటీ * యేల్ యూనివర్సిటీ * కార్నెగీ మిలన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.usnews.com, https://educationusa.state.gov యూఎస్‌లో అండర్గ్రాడ్యుయేట్ చదవాలనుకునే విద్యార్థులు.. అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం 8 నెలల ముందు నుంచి ఆ దిశగా అడుగులు వేయాలి. హాజరు కావాల్సిన ప్రామాణిక పరీక్షలు, యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్లపై రెండు నెలల్లో అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంటుంది. శాట్, ఏసీటీ పరీక్షల విషయంలో ఆందోళన అనవసరం. ఈ ఏడాది శాట్‌లో చేసిన మార్పులు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి. - రుచి థోమర్, డీజీఎం, మాన్యా ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. -
విదేశీ ‘కొలువు’దీరేందుకు మార్గాలు...
‘స్టడీ అబ్రాడ్’ అంటే.. సాధారణంగా విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి గుర్తొచ్చే పదం. ఇందుకోసం గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచే కసరత్తు మొదలుపెడతారు. విదేశాల్లోని యూనివర్సిటీల్లో కాలు మోపేందుకు సన్నద్ధమవుతారు. ఇటీవలకాలంలో స్టడీ అబ్రాడ్తోపాటు బాగా ప్రాచుర్యం పొందుతున్న మాట.. ‘జాబ్స్ అబ్రాడ్’! అంటే.. విదేశీ ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణలో భాగంగా కొత్త సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాయి. అవసరమైన మానవ వనరుల కోసం విదేశీ అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ కొలువులపై స్పెషల్ ఫోకస్.. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మంచి ఆదరణ లభిస్తోంది. కష్టపడి పనిచేసే తత్వం.. త్వరగా స్థానిక పరిస్థితులతో ఇమడగలిగే నేర్పు.. ఇంగ్లిష్‌పై పట్టు.. విదేశాల్లో భారతీయులకు అవకాశాలు పెరగడానికి కారణమన్నది నిపుణుల అభిప్రాయం. అనేక దేశాల్లో భారతీయులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.. లో-స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ప్రొఫెషనల్ స్కిల్స్ పేరుతో దిగువ స్థాయి మొదలు.. ఆయా రంగాల్లో అనుభవం గడించిన మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ వరకూ.. ఎన్నో విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ డెస్టినేషన్స్ సాధారణంగా ‘విదేశీ’ లక్ష్యం ఎంచుకున్న వారికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు తొలి ప్రాధాన్యంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాల వల్ల అక్కడి సంస్థల్లో డెరైక్ట్ రిక్రూట్మెంట్ ఆశించడం కొంత కష్టంతో కూడుకున్న విషయం. ఇదే సమయంలో అంతే స్థాయిలో ఆదాయార్జనకు మార్గం వేసే క్రమంలో మరెన్నో దేశాలు ఉద్యోగాల పరంగా బెస్ట్ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి. పొరుగు దేశం చైనా మొదలు ఆఫ్రికా వరకు భారతీయులకు అవకాశాలు కల్పించడంలో ముందుంటున్నాయి. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న చైనా.. విదేశీ ఉద్యోగులను ఆకర్షించడంలో ముందుంటోంది. అదేవిధంగా ఆసియా ఖండంలోనే విదేశీ ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్న మరో దేశం.. సింగపూర్. ఇక్కడ టూరిజం, హాస్పిటాలిటీ, టెలికాం రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో క్లర్క్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు.. హెల్త్‌కేర్ నుంచి హాస్పిటాలిటీ దాకా.. అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక.. ఆఫ్రికా దేశాల్లోనైతే భారత అభ్యర్థులకు అవకాశాలు కోకొల్లలు. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, టెలికం రంగాల్లో అవకాశాలు విస్తృతం. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు మరింత ప్రయోజనం విదేశీ ఉద్యోగాల విషయంలో ఎంట్రీ లెవల్ అభ్యర్థులతో పోల్చితే.. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జీతభత్యాలే. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సంబంధించి మన దేశంలో చక్కటి వేతనాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా దేశాల్లోని జీతాలతో పోల్చితే సమానంగా ఉంటున్నాయి. కానీ మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ విషయంలో మాత్రం ఇక్కడ కంటే విదేశాల్లో ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వచ్చే జీతభత్యాలకు కనీసం రెండింతలకుపైగా అందుకోవచ్చు. విదేశీ ఉద్యోగాన్వేషణకు మార్గాలు విదేశాల్లో ఉద్యోగం కోరుకునే ఔత్సాహికులకు ఉద్యోగాన్వేషణ క్రమంలో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే ప్రముఖంగా నిలుస్తోంది కన్సల్టెన్సీల ద్వారా అన్వేషణ. ప్రస్తుతం ఎన్నో ‘అబ్రాడ్ జాబ్ కన్సల్టెన్సీలు’ అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహికులు ముందుగా వీటిని సంప్రదిస్తే సరైన గమ్యాలు తెలుస్తాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్: జాబ్స్ అబ్రాడ్ దిశగా మరో ముఖ్య సాధనం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్. ఔత్సాహికులు ఆయా సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్ ద్వారా తాము అడుగుపెట్టాలనుకుంటున్న దేశం, అక్కడి అవకాశాలపై.. అప్పటికే ఆయా దేశాల్లో స్థిరపడిన స్నేహితులు, ఇతర అనుభవజ్ఞుల ద్వారా సమాచారం పొందొచ్చు. జాబ్ సెర్చ్ ఇంజిన్స్: ఇంటర్నెట్ సాధనంగా జాబ్ సెర్చ్ ఇంజిన్స్ (నౌకరీ డాట్ కామ్, మాన్స్టర్ డాట్ కామ్ తదితర) ద్వారా కూడా విదేశీ ఉద్యోగావకాశాలపై సమాచారం పొందొచ్చు. ఈ మార్గాల ద్వారా అన్వేషణ సాగించి అసలైన గమ్యాన్ని తెలుసుకోవడం ఎంతో తేలిక. స్పష్టతతో అన్వేషణ సాగిస్తేనే విదేశీ ఉద్యోగార్థులు ఎంతో స్పష్టంగా వ్యవహరించాలి. తమ విద్య, ఉద్యోగ నేపథ్యం- అనుభవం ఆధారంగా ముందుగా తాము కోరుకుంటున్న ఉద్యోగాన్ని, అందుకు తగిన గమ్యాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత సదరు దేశంలో తమకు సరిపోయే సంస్థలు, వాటిలో అవకాశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత.. ఆయా సంస్థల పనితీరును పరిశీలించాలి. ఇందుకు ఏకైక సాధనం ఇంటర్నెట్. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న కంపెనీల వెబ్సైట్లను వీక్షించి సదరు సమాచారం పొందొచ్చు. అంతేకాకుండా ఆయా కంపెనీలకు ఆ దేశంలోని నియంత్రణ సంస్థల అనుమతుల విషయంలోనూ పరిశోధన సాగించాలి. అనుమతులున్న కంపెనీల్లోనే దరఖాస్తుకు ఉపక్రమించాలి. ఇంటర్వ్యూలకు సన్నద్ధత జాబ్ అబ్రాడ్‌కు సంబంధించి దరఖాస్తుల విషయంలో ప్రస్తుతం ఇంటర్వ్యూలు సాధారణంగా టెలిఫోన్ లేదా ఈ-మెయిల్ లేదా స్కైప్ మాధ్యమాల్లో జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. టెలిఫోనిక్, స్కైప్ ఇంటర్వ్యూల సమయంలో.. ప్రశ్నలకు సమాధానమిచ్చేట ప్పుడు ఎలాంటి తడబాటుకు లోనవకూడదు. ఇక ఈ-మెయిల్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూల సమయంలో సమయపాలన, భాషపై పట్టు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఆన్లైన్ చాటింగ్ ద్వారా జరిగే ఇంటర్వ్యూలలో సంబంధిత సంస్థ అధికారులు తాము అడిగిన ప్రశ్నకు అభ్యర్థి సమాధానం ఇవ్వడానికి తీసుకుంటున్న వ్యవధిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి.. వీటిని దృష్టిలో పెట్టుకుని.. దరఖాస్తు సమయం నుంచే ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యేలా శిక్షణ పొందాలి. అప్రమత్తతో కన్సల్టెన్సీలు, ఏజెంట్స్ ఎంపిక విదేశీ ఉద్యోగార్థులకు మార్గంగా నిలుస్తున్న జాబ్ కన్సల్టెన్సీలు, రిక్రూటింగ్ ఏజెంట్స్ విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ అన్ని దేశాలకు సంబంధించి గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలు, ఏజెంట్ల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. ముందుగా దాన్ని పరిశీలించి ఆ జాబితాలో ఉన్న కన్సల్టెన్సీలను సంప్రదించడం మేలు. అదేవిధంగా ఇతర దేశాలు కూడా విదేశాల్లోని తమ అధీకృత రిక్రూటింగ్ ఏజెన్సీల వివరాలను తమ ఎంబసీ వెబ్సైట్లు, ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లలో పొందుపర్చాయి. ఔత్సాహికులు తాము ఎంపిక చేసుకున్న దేశం.. అక్కడి ప్రభుత్వ గుర్తింపు ఉన్న రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగాలు అందుకు సంబంధించి ఏజెంట్లు జారీ చేసే ప్రకటనల ఆధారంగా వెళ్లే అభ్యర్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. నైపుణ్యాలను నిరూపించుకుంటే.. సులువుగా వీసా వీసా.. విదేశాల్లో అడుగుపెట్టేందుకు కచ్చితంగా అవసరమైంది. ఈ విషయంలో అన్ని దేశాలు ఎంతో నిర్దిష్టంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా.. స్టడీ, టూరిస్ట్, బిజినెస్ వీసాలతో పోల్చితే వర్క్ వీసాల మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఔత్సాహికులు తమ నైపుణ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అక్కడి వారికంటే తామెంత మెరుగైన నైపుణ్యాలు కలిగున్నామో తెలియజేయాలి. తద్వారా వీసా అధికారులను మెప్పించాల్సిన బాధ్యత అభ్యర్థులదే. అదనపు ‘భాష’ ప్రయోజనం విదేశీ ఉద్యోగార్థుల కోణంలో మరో అదనపు ప్రయోజనం సంబంధిత దేశ భాషలో నైపుణ్యం సాధించడం. ఇది భవిష్యత్తులో రాణించేందుకు ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీస్‌గా ఉన్న చైనా, స్కాండినేవియన్ దేశాలలో ఉద్యోగాలు కోరుకునేవారు తప్పనిసరిగా ఆయా దేశాల భాషలను నేర్చుకోవడం లాభిస్తుంది. పని చేసే ప్రాంతంలో ఇంగ్లిష్ భాషా నైపుణ్యంతో రాణించగలిగినా.. సామాజిక పరిస్థితుల కోణంలో స్థానిక భాషను నేర్చుకోవడం అవసరం. అంతేకాకుండా విధుల్లో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటనలకు అవసరమైన మార్కెటింగ్ విభాగాలు, ఎన్జీఓ రంగాల్లో ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా స్థానిక భాషపై పట్టుండాల్సిందే. అప్పుడే.. ఉద్యోగ వాతావరణంలో, అక్కడి సామాజిక పరిస్థితుల్లో రాణించగలిగి భవిష్యత్తులో సుస్థిర స్థానాలు సొంతం చేసుకోగలుగుతారు. జాబ్ అబ్రాడ్.. అనుసరించాల్సిన విధానాలు ముందుగా గమ్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఏ దేశంలో అడుగుపెట్టాలనుకుంటున్నారో.. ఆ దేశంలో తమకు సరితూగే అవకాశాలు, కంపెనీల గురించి తెలుసుకోవాలి. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని వాటి గత చరిత్రను, భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించాలి. ఫలితంగా తమ వ్యక్తిగత ప్రగతిపైనా అవగాహన ఏర్పడుతుంది. ఆయా కంపెనీల వెబ్సైట్లలో పొందుపర్చిన వివరాల ఆధారంగా.. అకడెమిక్, ఎక్స్పీరియన్స్ నిబంధనలతోపాటు ఇతర అవసరాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కనీసం ఐదేళ్లు పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. అవసరమైన డాక్యుమెంట్లు అబ్రాడ్ జాబ్ దిశగా కదిలే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. అవి.. పాస్‌పోర్ట్ వీసా, వర్క్ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ పత్రాలు, లేదా రిక్రూట్మెంట్ లెటర్ యాక్స్‌ప్టెన్స్ లెటర్ (సదరు నియామక ప్రతిపాదనను అంగీకరిస్తూ సంస్థలో చేరేందుకు సంసిద్ధత తెలియజేసే లెటర్) హెల్త్ సర్టిఫికెట్ (దాదాపు అన్ని దేశాలు అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హెల్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశాయి.) ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అకడెమిక్ సర్టిఫికెట్స్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎంట్రీ మాత్రమే కాదు.. ఎగ్జిస్టెన్స్ కూడా ముఖ్యమే ఇప్పుడు ఎన్నో దేశాలు భారత అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుబాటులోని మార్గాల ద్వారా వీటిని అందిపుచ్చుకోవడం సులభంగా మారింది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీలు, సోషల్ నెట్వర్కింగ్ సోర్సెస్ ద్వారా వివిధ దేశాల్లోని అవకాశాలు తెలుసుకోవడం, వాటిని సొంతం చేసుకోవడం ఇప్పుడు ఎంతో తేలిక. ఔత్సాహికులు సంబంధిత దేశంలో అడుగుపెట్టడంపై దృష్టి సారించాలి. దాంతోపాటు దీర్ఘకాలం ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ క్రమంలో ఆయా సంస్థల క్షేత్ర స్థాయి నైపుణ్యాల్లో రాణించాలి. అక్కడి సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో పనిచేయగల నేర్పు ఉండాలి. - సుబ్రహ్మణ్యం, విసు గ్లోబల్ కన్సల్టెంట్స్ వీసా విషయంలో జాగ్రత్తగా విదేశీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు వీసా పొందే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంస్థ అందించిన ఆఫర్ లెటర్ ఆధారంగా వీసా కాలపరిమితి ఉంటుంది. దీన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. యూకేలో ఉద్యోగం పొందితే.. ఆయా అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగా టైయర్-2, టైయర్-3 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ వ్యవహారశైలిపై అనుమానం కలిగితే సందేహ నివృత్తి చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించకూడదు. - సుచిత గోకర్ణ్, హెడ్, బ్రిటిష్ కౌన్సిల్ డివిజన్,బిటిష్ హైకమిషన్, న్యూఢిల్లీ