Virginia
-
భార్యను కడతేర్చి ఆపై గూగుల్‌లో ఏం సెర్చ్ చేశాడంటే..
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత తనకేం తెలియదన్నట్లు పెద్ద నాటకమే ఆడాడు. భార్య కనిపించడం లేదని తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఆమె మరణానంతరం ఏం జరుగుతుందని గూగుల్‌లో సెర్చ్ కూడా చేశాడు. అయితే తన నాటకం ఎన్నో రోజులు నడవలేదు. చివరికి పోలీసులు భర్తే హంతకుడని తేల్చి కటకటాల వెనక్కి పంపారు.వర్జినియాకు చెందిన నరేష్ భట్(33).. నేపాల్‌కు చెందిన తన భార్య మమతా కప్లే భట్(28)తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఓకూతురు కూడా ఉంది. మమతా గత జూలై 19 నుంచి కనిపించకుండాపోయింది. ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న మమతా.. ఆ రోజు సాయంత్రం హెల్త్ ప్రిన్స్ విలియం మెడికల్ సెంటర్లో చివరిసారిగా కనిపించింది. తరువాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో పనికి వెళ్లిన తన భార్య కనిపించకుండాపోయిందని భర్త ఆగష్టు 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక మందిని విచారించారు. కానీ ఇప్పటి వరకు ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో మొదట ఆమె న్యూయార్క్, టెక్సాస్‌లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. కానీ తరువాత, ఆమెకు ఆ రాష్ట్రాల్లో ఎవరూ బంధువులు లేరని, ఆమె ఫోన్ ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్‌లో ఉందని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో అతడు తడబడ్డాడు.ఆగస్టు 22న నరేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భర్త నరేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో తన భార్యతో విడియేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు చెప్పాడు. అంతేగాక ‘భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. భాగస్వామి చనిపోయాక అప్పులు ఏమవుతాయి.. వర్జినీయాలో జీవిత భాగస్వామి కనిపించకుండా పోతే ఏం జరుగుతుంది’ అంటూ నరేష్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అయితే భర్త మమతాను హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేగాక నరేష్ తన ఇంటి సమీపంలోని వాల్‌మార్ట్‌లో మూడు కత్తులను కొనుగోలు చేసినట్లు ఆధారలు వెలువడ్డాయి. వాటిలో రెండిటి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. భార్య అదృశ్యమైన తర్వాత భట రక్తంతో తడిసిన బాత్ మ్యాట్, బ్యాగ్‌లను చెత్త కాంపాక్టర్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చెత్త సంచులను పారవేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో మమతను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడనే పోలీసుల అనుమానం బలపడింది. దీని ద్వారా తన నేరాన్ని దాచడానికి ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి సెప్టెంబర్‌లో బెయిల్ నిరాకరించడంతో కస్టడీలోనే ఉన్నాడు. -
సమాధుల వద్ద థమ్సప్లా!
వర్జీనియా: సైనిక అమరులకు నివాళుల సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ సందర్భంగా అబే గేట్ వద్ద మరణించిన 12 మంది సైనికులకు ఆర్లింగ్టన్ నేషనల్ శ్మశానవాటికలో ట్రంప్ నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద హావభావాలు ప్రదర్శించారు. సమాధుల వద్ద ఫొటోలకు పోజులివ్వడమే గాక చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. అంతటితో ఆగకుండా బొటనవేలు పైకెత్తి థమ్సప్ చిహ్నం చూపారు. వీటిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. సైనిక అమరుల పట్ల ఆయన అత్యంత అగౌరవంగా, అవమానకరంగా ప్రవర్తించారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. సమాధుల వద్ద చిరునవ్వులు చిందించడమేంటని మండిపడుతున్నారు. సమాధుల వద్ద నవ్వడం అసాధారణమని రిపబ్లికన్ నేత ఆడమ్ కిన్సింగర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. సైనిక అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపినందుకు ట్రంప్‌ను కొందరు అభినందించారు. మరికొందరేమో ఇది కూడా ప్రచార వ్యూహంలో భాగమంటూ పెదవి విరిచారు. -
ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం..
వర్జీనియాలో కాంగ్రెస్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు. సహచర భారతీయ-అమెరికన్ క్రిస్టల్ కౌల్‌తో సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. అంతేగాదు వర్జీనియ కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆయన 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీ, 2023లో వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్. ఆయన ఈ గెలుపుతో నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సాధారణ రిపబ్లికన్ మైక్ క్లాన్సీతో తలపడతారు.సుహాస్ నేపథ్యం..37 ఏళ్ల సుహాస్ సుబ్రమణ్యం బెంగళూరు నుంచి యూఎస్‌కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యుస్టన్‌లో జన్మించాడు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఒక యూఎస్ మీడియా ఇంటర్యూలో సుహాస్ మాట్లాడుతూ..అమెరికాకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కాంగ్రెస్‌కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్తుకి బంగారు బాటవేసే కాంగ్రెస్ ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లకు మాత్రమే కాదు, రాబోయే 20 ఏళ్లకో లేదా 30 ఏళ్లకో చట్టాలు చేయకూడదు. నాకు పిల్లలు కావాలి. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారు ఇద్దరు లేదా ముగ్గురుగా అయ్యేటప్పటికీ మెరుగైన దేశంగా తీర్చిదిద్దిలన్నారు. పైగా వాళ్లు మంచి ప్రపంచంలో జీవించేలా చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ అమెరికాలో జీవించాలనే డ్రీమ్ అందరికీ దక్కాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నైకి చెందినవారు. కొంతకాలం సికింద్రాబాద్‌లో ఉన్నారు. వారు అమెరికాకు వచ్చి మంచి వైద్యులుగా స్థిరపడాలనుకున్నారు. అయితే వారు ఇక్కడ వచ్చినప్పుడూ.. తన తల్లిందడ్రులు అంతబాగా ఉన్నవాళ్లు కాదని కేవలం కష్టపడి చదివి తమ అమెరికా డ్రీమ్‌ని నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ కలను అందరూ సాకారం చేసుకోవాని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ తాము కోరుకున్న దాంట్లో లేదా ఏదైన బిజినెస్‌లో విజయం సాధించి ఆర్థికంగా తమను తాము శక్తిమంతంగా చేసుకోగలిగినట్లయితే గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. అంతేగాదు ప్రతిఒక్కరూ బాగా చదివి, కష్టపడి పనిచేస్తే..ఎలాంటి స్థితి నుంచి అయినా ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దాన్ని నిలబెట్టుకునే యత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాని అన్నారు సుహాస్. వ్యక్తిగత జీవితం..నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో ఆనర్స్‌తో లా డిగ్రీని సంపాదించిన తర్వాత, సుహాస్ ప్రెసిడెంట్ ఒబామాకు వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. ఇక వైట్ హౌస్ నుంచి నిష్క్రమణ తర్వాత సుహాస్ లౌడౌన్ కౌంటీలో తన స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే తన కమ్యూనిటీకి వాలంటీర్ మెడిక్, అగ్నిమాపక సిబ్బందిగా కూడా సేవలందించారు. అతను మిరాండా పెనా సుబ్రమణ్యంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలోని యాష్బర్న్లో నివసిస్తున్నారు. (చదవండి: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు) -
ఉద్యోగ ప్రకటన దుమారం.. టెక్ కంపెనీకి భారీ జరిమానా
అమెరికాలో ఓ ఉద్యోగ ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. "శ్వేత జాతీయులు మాత్రమే" దరఖాస్తు చేయాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వర్జీనియాకు చెందిన ఒక టెక్ కంపెనీ వేలాది డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఆర్థర్ గ్రాండ్ టెక్నాలజీస్ అనే ఫెడరల్ కాంట్రాక్టర్ సంస్థకు అమెరికా న్యాయ, కార్మిక శాఖలు 7,500 డాలర్ల జరిమానా విధించాయి. దీంతోపాటు ప్రకటన గురించి ఫిర్యాదు చేసిన 31 మందికి 31,000 డాలర్లు చెల్లించాలని ఆయా డిపార్ట్మెంట్లు ఆదేశించాయి.21వ శతాబ్దంలో కూడా 'శ్వేతజాతీయులు మాత్రమే', 'అమెరికాలో జన్మించిన వారు మాత్రమే' అంటూ ఉద్యోగ నియామకాలను ప్రకటించడం సిగ్గుచేటని న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.డల్లాస్, టెక్సాస్ కేంద్రంగా సేల్ఫోర్స్ బిజినెస్ అనలిస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్థానం కోసం కంపెనీ 2023 మార్చిలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. అవేంటంటే డల్లాస్‌కు 60 మైళ్ల లోపు దూరంలో స్థానికంగా ఉన్న యూఎస్ బోర్న్ సిటిజన్స్ [శ్వేత జాతీయులు] మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది.ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో న్యాయశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్‌ను కంపెనీ ఖండించింది. ఇది భారతదేశంలోని తమ అనుబంధ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ లిస్టింగ్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిందని, జాతి, జాతీయ మూలం, ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా ఫెడరల్ కాంట్రాక్టర్లు వివక్ష చూపరాదనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను కంపెనీ ఉల్లంఘించిందని కార్మిక శాఖ తెలిపింది. -
వర్జీనియాలో ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం
-
వర్జీనియాలో కొలకలూరి ఇనాక్‌తో ఆత్మీయ సమ్మేళనం!
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్టోబరు 7న లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధానులు శ్రీ నరాల రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని కథా-నవలా రచయిత, ఫిలిం మేకర్, ఇనాక్ అమెరికా పర్యటన పర్యవేక్షకులు వేణు నక్షత్రం ఆధ్వర్యంలో, సాహిత్యాభిమానులు వాషింగ్టన్ సాహితీ సంస్థ నిర్వాహకులు రవి వేలూరి, సాహిత్యాభిమానులు ప్రసాద్ చెరసాల, కవి చంద్ర కాటుబోయిన, పవన్ గిర్లా, ప్రవీణ్ దొడ్డల సంయుక్త నిర్వాహణలో జరిగింది. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో దేన్ని అయినా, ఎంతటి కఠినాత్ములని అయినా ప్రేమతో మాత్రమే జయించవచ్చని, శత్రువుని ఎదిరించడానికి సాహిత్యాన్నే ఆయుధంగా ఉపయోగించానని తెలిపారు. బలహీనులని పీడిస్తే , ఏదో ఒకరోజు వారు తిరగబడతారని బలవంతులు గ్రహించాలని అన్నారు. తన రచనలన్నీ సమాజంలోజరిగిన సంఘటనలే అని వాటి ద్వారా కొంత నయినా అవగాహన కల్పించడమే తన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. సభాధ్యక్షులు నరాల రామిరెడ్డి మాట్లాడుతూ, ఇనాక్ సభలో అధ్యక్షత వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇనాక్ రచనలు చాలా చదివానని, సాహిత్యంలో కథ, నవల, పద్యం, వ్యాసం ఇలా ప్రతి అంశాన్ని సృజించి ప్రతి ప్రక్రియలో అవార్డులు పొందిన ఘనత ఇనాక్ గారిదే అని అన్నారు. సభా నిర్వాహకులు వేణు నక్షత్రం మాట్లాడుతూ.. ఇనాక్‌కి ఇప్పటికే వచ్చిన ఎన్నో అవార్డులతో పాటు ఉత్తమ తండ్రి అనే అవార్డు కూడా ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే ఇనాక్ తన ముగ్గురు పిల్లలు ఎలాంటి రిజర్వేషన్లు ఉపయోగించకుండా కేవలం ప్రతిభతో అత్యుత్తమ చదువులు చదివి సమాజంలో అధ్యాపకులుగా, క్లాస్ వన్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ఇనాక్ గారి సాహిత్యం ఎంతో ఉపయోగపడిందని వేణు నక్షత్రం అన్నారు. ఇనాక్ రాసిన మునివాహనుడు కల్పిత నవల అంశం ఇప్పుడు సమాజంలో మునివాహన సేవగా ప్రాచుర్యం పొందడం లాంటి ఘనత ఇనాక్ రచనలకే చెందిందని కొనియాడారు. రవి వేలూరి , రమేష్ రావెళ్ల గారు ఇనాక్ని, నరాల రామిరెడ్డి ని శాలువాతో సత్కరించారు. కాపిటల్ ఏరియా తెలుగు అధ్యక్షులు సతీష్ వడ్డీ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతీ సంవత్సరం ఒకసారి ప్రత్యేక సాహిత్య సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిసానని అన్నారు. అమెరికాలో తెలుగు సంస్థలు ప్రతి రెండేళ్ళకోసారి కోట్ల ఖర్చుతో సదస్సు నిర్వహిస్తారని, అందులో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని, అందుకే ప్రతి సంవత్సరం ఒక సారి ప్రత్యేక సాహితీ సమావేశాలు నిర్వహిస్తే, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన వారవుతారని వేణు నక్షత్రం తెలుగు సంఘాలని కోరారు. వాషింగ్టన్, మేరీలాండ్, వర్జీనియా ప్రాంతంలోని సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
‘వర్జీనియా’కు రికార్డు ధర
జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఐదు వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం దశల వారీగా ముగిసింది. గత ఏడాది కంటే కేజీ సరాసరి ధర రూ.50 పైగానే లభించింది. ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పరిధిలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో 55 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో కేజీ సరాసరి ధర రూ.191.72 లభించగా, ఈ ఏడాది కేజీ సరాసరి ధర రూ.248 లభించింది. అంటే ఈ ఏడాది కేజీకి రూ.56.28 అధికంగా లభించింది. -
అసలు వీడు మనిషేనా?.. విదేశాల్లో భార్యను ఒంటరిగా వదిలేసి..
సాక్షి, హైదరాబాద్: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు. కానీ, ఓ ప్రవాస ప్రబుద్ధుడు భార్య చదువు ఆర్థిక భారంగా భావించాడు. ఉన్నత చదువులు చదివి..మంచి ఉద్యోగం సంపాదించి భర్తకు చేదోడుగా నిలుద్దామనుకున్న ఆమె కలలను కల్లలు చేశాడు. విదేశాల్లో ఒంటరిగా వదిలేసి..తాపీగా చేతులు దులుపేసుకున్నాడు. అల్లుడికి నచ్చచెబుదామని పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో.. దిక్కుతోచని స్థితిలో బాధితురాలి తల్లిదండ్రులు గచ్చి»ౌలిలోని మహిళా పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా.. మాదాపూర్ జోన్‌కు చెందిన కావ్య (పేరు మార్చాం) స్థానికంగా డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధం వెతికి అమెరికాలో స్థిరపడిన కిషోర్ (పేరు మార్చాం)కు ఇచ్చి పెళ్లి చేశారు. కిషోర్ యూఎస్‌లోని వర్జీనియాలో ఉద్యోగి కావటంతో.. పెళ్లి తర్వాత ఈ యువ జంట అక్కడికి వెళ్లింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేద్దామని భావించిన కావ్య అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరింది. దీంతో భర్త అసలు రంగు బయటపడింది. భార్య చదువు ఆర్థిక భారంగా మారిందని కిషోర్ తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీనిపై ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు వివరించింది కావ్య. దీంతో పలుమార్లు ఫోన్లో అల్లుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. అల్లుడి తల్లిదండ్రులను కలిసి వారి కొడుక్కి సర్దిచెప్పమని చెబుదామని ప్రయత్నిస్తే వారి నుంచి కూడా స్పందన లేదు. దీంతో చేసేదిలేక గచ్చిబౌలిలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్ తల్లిదండ్రులను విచారించగా.. వాళ్లిద్దరి మధ్య అవగాహన సరిగా లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో విదేశంలో కూతురు ఒంటరైపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నారై సంబంధం ఇలా పెటాకులు కావటంతో అమ్మాయి చదువు, వసతి ఇతరత్రా ఖర్చులన్నీ తల్లిదండ్రులే భరిస్తున్నారు. ఎన్నారై బంధానికి ఏడు సూత్రాలు: ► ఎన్నారైల ఎంపిక, పెళ్లి చేసే విషయంలో తొందరపడకూడదు. ► వరుడు/వధువు అతని కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని ధ్రువీకరించుకోవాలి. ► మ్యారేజ్ బ్రోకర్లు, బ్యూరోలపై ఆధారపడి సంబంధాన్ని అంగీకరించకూడదు. ► ప్రవాసుల వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ► విదేశాలలో చట్టపరమైన హక్కులు, అర్హతలు, అత్యవసర సేవల గురించి తెలుసుకోవాలి. ► వధువు వీసా, పాస్‌పోర్ట్, ఇతరత్రా ముఖ్యమైన కాపీలను వధువు కుటుంబం లేదా దగ్గరి స్నేహితుల వద్ద ఉంచాలి. ► ఎన్నారై వరుడి పాస్‌పోర్ట్, విదేశీయుల నమోదు కార్డు, సామాజిక భద్రత నంబరు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పన్ను రిటర్న్‌లు, బ్యాంకు పత్రాలు వంటి కీలకమైన పత్రాలను తనిఖీ చేయాలి. -
అమెరికాలో టీచర్‌పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు
నోర్‌ఫోల్క్: అమెరికాలో చిన్నారుల చేతుల్లో కూడా తుపాకీ పేలుతోంది. వర్జీనియాలో రిచ్‌నెక్ ఎలమెంటరీ స్కూలులో ఆరేళ్ల విద్యార్థి తన క్లాస్‌రూమ్‌లో పాఠం చెబుతున్న టీచర్‌పై హఠాత్తుగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో టీచర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదని పోలీసు చీఫ్ స్టీవ్ డ్రూ చెప్పారు. ఆ విద్యార్థి హ్యాండ్‌గన్‌తో క్లాసుకి హాజరైనా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఈ దారుణం జరిగింది. విద్యార్థి మైనర్ కావడంతో పోలీసులు క్లాసు లోపల జరిగిన విషయాలు వెల్లడించలేదు. -
21 ఏళ్లైనా అంతుచిక్కని జర్నలిస్ట్ డెత్ మిస్టరీ.. హత్యే అని తెలిసినా..!
దుష్టులు నిర్మించుకున్న దుర్భేద్యమైన కోటలను కూలగొట్టాలని విఫలయత్నం చేశాడో వీరుడు. కథల్లోనో, సినిమాల్లోనో అయితే.. ఆ వీరుడే గెలిచేవాడు. కానీ ఈ రియల్ స్టోరీ.. అతడి మరణాన్నే మిస్టరీగా మలచింది. 1991 ఆగస్టు 10, మధ్యాహ్నం వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్స్బర్గ్ సమీపంలోని షెరటన్ హోటల్ ముందు ఒక్కసారిగా జనం గుమిగూడారు. హోటల్ కస్టమర్స్, సిబ్బంది, యాజమాన్యం.. అంతా అక్కడున్నారు. వేగంగా వచ్చి ఆగిన పోలీస్ వ్యాన్‌లోంచి పోలీసులు ఒక్క ఉదుటన దుమికి.. ‘ఏ రూమ్?’ అన్నారు. సిబ్బందిలో ఒకరు 517 అని చెప్పగానే.. పోలీస్ బూట్లు అటుగా పరుగుతీశాయి. రూమ్ నంబర్ 517లోని బాత్‌టబ్‌లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ డానీ కాసోలారో(44) నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి రెండు చేతుల మణికట్లు లోతుగా తెగున్నాయి. ఓ పక్కన రేజర్ బ్లేడ్, మరోపక్కన సూసైడ్ నోట్ కనిపించాయి. నోట్ ఓపెన్ చేస్తే.. ‘నన్ను ప్రేమించేవారంతా నన్ను క్షమించండి. ముఖ్యంగా నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నా.. దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు’ అని రాసుంది. డానీ.. 1977లో మాజీ మిస్ వర్జీనియా అయిన టెరిల్ పేస్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ట్రే అనే కొడుకున్నాడు. పదేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకోవడంతో కొడుకు ట్రే బాధ్యతను డానీకే అప్పగించింది కోర్టు. 1970 నుంచి జర్నలిస్ట్‌గా ఉన్న డానీ.. కమ్యూనిస్ట్ చైనా నల్లమందును యూఎస్‌లోకి అక్రమంగా రవాణా చేయడం.. వంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డానీ రూమ్ మొత్తం క్షుణ్ణంగా వెతికిన పోలీసులకు.. క్రెడిట్ కార్డులు, డబ్బులున్న అతని వాలెట్ బెడ్ మీద సురక్షితంగా కనిపించింది. బలవంతంగా ఎవరైనా రూమ్‌లోకి వచ్చారా? అంటే.. అలాంటి ఆనవాళ్లేమీ లేవు. దాంతో డానీ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న డానీ ఫ్యామిలీ.. అది కచ్చితంగా హత్యేనని మొరపెట్టుకున్నారు. ‘మృతదేహం దొరికిన రోజే ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు’ అని నిలదీశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రిపోర్టర్‌గా డానీ జరిపిన వందలాది విచార ణ పత్రాలు, ఇతర ముఖ్యమైన ఫైల్స్.. వేటినీ కుటుంబానికి అందించలేదు. ‘అవన్నీ ఎక్కడా?’ అని ఆరా తీసిన డానీ సోదరుడు టోనీకి.. మృతదేహం దొరికిన హోటల్ రూమ్‌లో అవేం దొరకలేదనే సమాధానం వచ్చింది. రక్తపరీక్షల కోసం సూది గుచ్చితేనే భయపడే డానీ.. చేతులను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేమంటూ.. అతడి కుటుంబం పోరాటం మొదలుపెట్టింది. డానీ మరణానికి కొద్ది రోజుల ముందు.. అతను చాలా మంది స్నేహితులతో.. ‘నేను చాలా పెద్ద కేసుని దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే వెలుగులోకి తెస్తా’ అని చెప్పాడట. నిజానికి ఆగస్ట్ 1990లో ఇన్‌స్లా అనే కార్పొరేట్ – గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీదారులైన బిల్ హామిల్ట¯న్Œ , నాన్సీలను ఇంటర్వ్యూ చేయడంతోనే ఆ సాఫ్ట్వేర్ మీద డానీ పరిశోధన మొదలైందట. వారు ప్రారంభించిన ‘ప్రామిస్’ అనే శక్తిమంతమైన ప్రాసిక్యూషన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌లో.. చాలా పెద్ద మోసం ఉందని.. తెరవెనుక పెద్ద స్కామ్ నడుస్తుందని అనుమానించిన డానీ.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టాడు. అప్పటికే ఇన్‌స్లా కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని.. కొందరు న్యాయశాఖ అధికారులు దీన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వపెద్దల కుట్ర కూడా ఉందని.. ఆ లింకులు ఇతర దేశాలకూ పాకుతున్నాయని వస్తున్న పుకార్లను కూపీలాగడం మొలుపెట్టాడు డానీ. ఎందరో గూఢచారుల్ని కలసి.. ఎన్నో ఆధారాలను సంపాదించాడు. ఆ క్రమంలోనే ఎన్నో బెదిరింపు కాల్స్‌నూ ఎదుర్కొన్నాడు. ఆ విషయం తన సోదరుడు టోనీకి చెబుతూ.. ‘ఒకవేళ నేను చనిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మవద్ద’ని చెప్పాడట. తను విచారిస్తున్న కుంభకోణానికి ‘ది ఆక్టోపస్’ అని పేరు కూడా పెట్టాడట. పోలీస్ విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు.. హోటల్ సిబ్బందిని ఆరా తీయగా మరో నిజం బయటపడింది. డానీ చనిపోయిన రోజు.. పోలీసులు రాకముందే ఎవరో.. ప్రొఫెషనల్ క్లీనింగ్ వర్కర్స్‌తో డానీ రూమ్‌ని శుభ్రం చేయించారని తేలింది. ఆ క్లీనింగ్ వర్కర్లలో ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు రక్తంతో తడిచిన రెండు టవల్స్‌ని మృతదేహం దగ్గర్లో చూశాం. వాటిని అప్పుడే చెత్తలో వేసేశాం. మాకంటే ముందే ఎవరో ఆ రూమ్‌లో నేల మీద పడిన రక్తాన్ని ఆ టవల్స్‌తో తుడిచినట్లు అనిపించింది’ అని చెప్పాడు. అయితే అతడు బహిరంగ సాక్ష్యానికి అంగీకరించలేదు. ఇక ఆగస్టు 9 సాయంత్రం ఐదున్నరకు.. డానీ తన పక్క గదిలో దిగిన లూనీని పలకరించాడట. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కలవబోతున్నానని చెప్పాడట. తొమ్మిదింటికి లూనీని మళ్లీ కలసిన డానీ.. ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లి.. కొన్ని నిమిషాల్లోనే తిరిగివచ్చాడట. ‘బహుశా అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో? తెలియదు. మేం చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం’ అని లూనీ చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాత్రి డానీ.. సమీపంలోని పిజ్జాహట్‌లో డిన్నర్ చేశాడట. అందులోని వెయిట్రెస్ డానీని గుర్తుపట్టింది. రాత్రి 10 దాటాక కాసోలారో సమీపంలోని కన్వీనియెన్స్ స్టోర్‌లో కాఫీ కొనుక్కుని తాగాడట. అదే అక్కడివారికి డానీ చివరిసారిగా సజీవంగా కనిపించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. మరి ఆ రాత్రి ఏం జరిగింది? మరునాడు మధ్యాహ్నం వరకూ శవాన్ని ఎందుకు గుర్తించలేదు? ఇలా వేటికీ సమాధానాల్లేవు. మరోవైపు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆర్మీమన్.. డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడట. డానీ శవపేటిక మీద గౌరవప్రదంగా ఒక పతకాన్ని ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అసలు అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? అతడు నిజంగానే సైనికాధికారా? లేక డానీని చంపిన కిల్లరా? అనేది నేటికీ తేలలేదు. 1973లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఇన్‌స్లా.. 1981లో లాభాపేక్షతో కూడిన అనుబంధసంస్థలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే దాని ఆస్తులన్నీ కొత్త సంస్థలకు బదిలీ అయ్యాయి. డానీ మరణం తర్వాత.. ఇన్‌స్లా సంస్థ.. తన సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించడానికి ప్రభుత్వమే కుట్ర పన్నిందని, దొంగిలించిన సాఫ్ట్‌వేర్‌ను.. విదేశీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించిందని.. నాసాతో సహా సీ.ఐ.ఏ, డి.ఓ.జీలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని.. హత్యల్లోనూ ప్రమేయం ఉందని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ.. 12 సంవత్సరాల సుదీర్ఘన్యాయ విచారణ తర్వాత ఫెడరల్ క్లెయిమ్స్ కోర్ట్ వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఇక్కడ 1960 నుంచి 66 వరకూ బిల్ హామిల్టన్ ఆరేళ్ల పాటు నాసా ఉద్యోగిగా ఉండడం గమనార్హం. -సంహిత నిమ్మన -
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ మరోసారి గర్జించింది. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తుపాకీతో స్టోర్‌లోకి వెళ్లిన వ్యక్తి కన్పించినవారిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అతను వాల్‌మార్ట్‌లో పనిచేసే ఉద్యోగా? కాదా? తెలియాల్సి ఉందన్నారు. నిందితుడు కూడా స్టోర్ లోపలే చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. అయితే పోలీసులే నిందితుడ్ని కాల్పి చంపి ఉంటారని స్థానిక మీడియా చెప్పింది. కానీ తాము కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడే తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం -
ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత...
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తిగా ధ్వసంమై సముద్ర గర్భంలో పడి ఉన్న వందేళ్ల నాటి జలాంతర్గామిని శిథిలాల పరిశోధకుడు డైవర్ ఎరిక్ పెట్కోవిక్ కనుగొన్నాడు. ధ్వంసమై సముద్రంలో పడి ఉన్న బోట్లపై డైవర్ ఎరిక్ పెట్కోవిక్ పరిశోధనలు చేస్తుంటాడు. ఈ జలాంతర్గామిని వర్జీనియా తీరంలోని కేవలం 400 అడుగుల లోతుల్లో గుర్తించాడు. వాస్తవానికి ఈ జలాంతర్గామి మొదటి ప్రపంచ యుద్ధంలో 1922లో అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో సుమారు 1600 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబందించి ఐదు జలాంతర్గాములు, రెండవ ప్రపంచ యద్ధానికి సంబంధించి ఎనిమిది జలంతర్గాములను కనుగొన్నారు. అయితే ఈ యూ-111 జలంతర్గామి కూడా వర్జినియాలోనే మునిగిపోయినట్లు పరిశోదకులు గుర్తించలేకపోవడమే కాకుండా కనుగొన లేకపోయారు కూడా. అదీగాక సముద్రంలో ఉండే ఉప్పు కారణంగా మునిగిపోయిన ఓడలు, జలాంతర్గాములు వేగంగా క్షీణిస్తాయి. సముద్రంలో ఉండే కొన్ని రకాల పురుగులు కలపను తినేస్తాయి. అయినప్పటికీ ఈ జలంతర్గామి శిధిలాలు సజీవంగా కనుగొనడం విశేషమే. 1985లో తొలిసారిగా రాబర్ట్ బల్లార్డ్ అనే పరిశోధకుడు టైటానిక్ ఓడల శిధిలాలను కనుగొన్నాడు. అతని తర్వాత డైవర్ ఎరిక్ పెట్ కోవిక్ ఈ ధ్యంసమైన నౌకలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పరిశోధకుడు తన మిత్రుడు రస్వీ సాయంతో ఎక్స్‌ప్లోరర్ డైవింగ్ నౌకను ఉపయోగించి ఈ జలాంతర్గామి శిథిలాలను వెలికితీశాడు. (చదవండి: Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక) -
వర్జీనియా, కాలిఫోర్నియాలో వెటా ఆధర్యంలో బతుకమ్మ సంబురం!
తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థ బతుకమ్మ వేడుకలను వర్జీనియా రాష్ట్రంలోని FAIRFAX నగరంలో ఘనంగా నిర్వహించింది. స్థానిక ఎస్బీ లోటస్ టెంపుల్ ఆవరణలో పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని, ఒక్కొక్క పువ్వేసి చందమామా...ఒక్క జాము గడిచె చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో అంటూ అనేక బతుకమ్మ పాటలతో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపు కున్నారు. సంప్రదాయ వస్త్రాదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే. ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈవేడుకల్లో ప్రముఖ యాంకర్ ఉదయ భాను దాదాపు 800 మంది పెద్దలు , పిల్లలను ఎంటర్టైన్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ వెటాప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వర్జీనియా బోర్డ్ అఫ్ డైరెక్టర్ జయశ్రీ తెలుకుంట్ల, మేరీల్యాండ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి, రీజినల్ కల్చరల్ చైర్ చైతన్య పోలోజు,రీజినల్ కోర్ కమిటీ స్మృతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సతీష్ వడ్డే, సుధ పాలడుగు, సతీష్ వేమన, విశ్వేశ్వర్ కలవాల,కాంగ్రెస్ మహిళజెన్నిఫర్ వెక్స్టన్ హాజరయ్యారు. కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు కాలిఫోర్నియా లోని హ్యాంఫోర్డ్ నగరంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్లగారి బంగ్లా ఆవరణలో " బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేసిన Dr కాంతం & సుజాత గాదె గారికి ఝాన్సీ గారు కృతజ్ఞతలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో WETA treasurer విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, RVP పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల తో పాటు దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. -
పైత్యం నశాలానికి.. పసిబిడ్డకు తిండి కరువు.. 18 నెలల వయసులోనే..
వాషింగ్టన్: కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది తల్లి. పిల్లాడు ఎప్పుడైనా ఆకలితో ఏడిస్తే తల్లడిల్లిపోతుంది. కానీ అమెరికాలో ఓ మహిళ చేసిన పని కన్నపేగు బంధానికే కలంకం తెచ్చింది. పసివాడికి సరిగ్గా తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసింది. ఫలితంగా అతని మరణానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు షీలా ఓ లీరి(38)పై హత్య కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు మాత్రం నాలుగుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వర్జీనియా కోర్టు ఆమెకు సోమవారం జీవిత ఖైదు విధించింది. ఈ ఆరోపణలతోనే ఈమె భర్త కూడా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షీలా కుటుంబసభ్యులంతా శాకాహారులు. కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారు. పిల్లలకు తిండి సరిగ్గా పెట్టకపోవడం వల్ల పోషకాహారలోపం బాధితులయ్యారు. ఈ క్రమంలోనే 18 నెలల వీరి కుమారుడు చనిపోయాడు. అతడి బరువు 8 కేజీలు మాత్రమే. అతడికి తల్లిపాలే ఆహారంగా ఇచ్చేదట షీల. చనిపోయిన బాబు 18నెలల వయసులో కూడా 7 నెలల చిన్నారి పరిమాణంలో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. వీరికి ముడేళ్లు, ఐదేళ్ల వయసున్న మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చదవండి: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు కన్నుమూత -
ఇదో ‘అమెజాన్ అడవి’
ప్రపంచంలో అతి పెద్ద అడవులంటే... అమెజాన్ అని మనకు తెలుసు. కానీ వర్జీనియా నగరంలో మరో ‘అమెజాన్ అడవి’ నిర్మితమవుతోంది. నగరంలో అడవి ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అది ఓ అడవిలాంటి భవనం. దానిని నిర్మిస్తున్నది రీటైల్ దిగ్గజం ‘అమెజాన్’. ఆ భవనం వివరాలేంటో తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణలోనే కాదు... తమ కార్యాలయాల నిర్మాణంలోనూ ప్రత్యేకతను చాటు కునే సంస్థ అమెజాన్. హైదరాబాద్‌లో ఉన్న ఇంద్ర భవనంలాంటి ఆఫీసే అందుకు తార్కాణం. ఇదే ఇలా ఉందంటే.. సియాటిల్‌లో తన ప్రధాన కార్యా లయం ఎలా ఉండాలి? మూడు గోళాకార భవనా లను పారదర్శకంగా నిర్మించింది. వీటిని పర్యావ రణ హితంగా రూపొందించింది. ఇప్పుడు తన రెండో హెడ్‌క్వార్టర్స్ నిర్మాణంలోనూ అదే ప్రత్యేక తను చాటబోతోంది. వర్జీనియాలోని అర్లింగ్టన్ కౌంటీని ఇందుకు వేదికగా చేసుకుంది. నగరం నడిబొడ్డున ఎత్తైన పర్వతం, దాని చుట్టూరా పచ్చని చెట్లతో కూడిన అడవిలాంటి భవనాన్ని నిర్మించ నుంది. ఇందుకోసం గతంలో తమ భవనాలను నిర్మించిన ఎన్బీబీజే సంస్థనే ఎనుకున్నది. మన రాష్ట్ర బడ్జెట్‌కు సమానం... క్రిస్టల్ సిటీగా పేరుగాంచిన వర్జీనియా నగరంలో అమెజాన్... 350 అడుగుల ఎత్తైన భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఇటీవలే అధికారుల నుంచి ప్లానింగ్ అనుమతులు కూడా పొందింది. ఆ భవనం కట్టేందుకు 2.5బిలియన్ డాలర్ల (దాదాపు రెండు లక్షల కోట్లు)వ్యయం ఖర్చు చేయనుంది. అంటే దాదాపు మన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమాన మన్నమాట. 25వేల మంది ఉద్యోగులు పనిచేసేం దుకు వీలుగా 22 అంతస్తులతో భవనాన్ని నిర్మిస్తు న్నారు. ఇందులో ప్రత్యేకమైన పార్క్, కమ్యూనిటీ హైస్కూల్, అనేక షాప్స్ కూడా ఏర్పాటవుతు న్నాయి. ఇక బయటినుంచి చూడటానికి గోపురం లా కనిపించే ఈ భవనం చుట్టూ ర్యాంప్... దానికి రువైపులా చెట్లతో నిజంగానే అడవిని తలపిం చనుంది. ర్యాంప్ మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ... భవనం పైవరకూ వెళ్లే వీలు కల్పించను న్నారు. ఈ అమెజాన్ అడవి భవనాన్ని ఎక్కాలంటే 2025 దాకా ఆగాల్సిందే. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
తన హత్య కేసును తనే రీ ఓపెన్ చేయించుకున్న ఆత్మ?! ఆ తర్వాత
‘మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?’ సమాధానం దొరకని ప్రశ్న! అయితే ‘ఆత్మ అమరం’ అని నమ్మేవారు అశరీరవాణికి పెద్దపీట వేస్తారు. దెయ్యాలు, పిశాచాలు, సైతాన్లు.. ఇలా కంటికి కనిపించని అతీంద్రియ శక్తులను బలంగా నమ్ముతారు. అలాంటివారి నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ గ్రీన్ బ్రియర్ ఘోస్ట్ మిస్టరీ. ఓ ఆత్మ తన కథను తనే తిరగరాసుకుంది. తన మర్డర్ కేసుని తనే రీ–ఓపెన్ చేయించుకుని.. తనని చంపినవాడికి శిక్షపడేలా చేసింది. నమ్మబుద్ధి కావట్లేదు కదూ! కానీ 18వ శతాబ్దం చివర్లో అమెరికాని వణికించిన ఉదంతం ఇది. 1897.. జనవరి 23.. మిట్ట మధ్యాహ్నం.. వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఓ బాలుడు.. గావుకేకలు పెడుతూ తన తల్లి దగ్గరకు పరుగుతీశాడు. ‘ఎల్వా ఆంటీ.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉందమ్మా’ అని చెప్పాడు రొప్పుతూ. ‘ఏమైందీ’ అంటూ కంగారు పడింది ఆ బాలుడి తల్లి. ‘ఎల్వా ఆంటి భర్త ఎడ్వర్డ్ అంకుల్ లేడూ.. తను మార్కెట్‌కు పోతూ పోతూ.. ఎల్వా ఆంటీకి ఏమైనా కావాలేమో కనుక్కుని రా అంటూ నన్ను వాళ్ల ఇంటికి పంపించాడు. నేను వెళ్లేసరికి ఆమె మాట లేకుండా పడి ఉందమ్మా..’ అంటూ వణుకుతూ వివరించాడు తనకు తెలిసిందీ.. తను చూసిందీ! అది విన్న వెంటనే కొడుకును తీసుకుని డాక్టర్ నాప్ దగ్గరకు పరుగుపెట్టింది ఆ బాలుడి తల్లి. 1896 అక్టోబర్‌లో ఎల్వా జోనా హిస్టర్కీ, ఎరాస్మన్ (ఎడ్వర్డ్) షూతో పెళ్లైంది. ఎడ్వర్డ్ స్థానికంగా కమ్మరి పనిచేసేవాడు. ఇంటికి వెళ్లిన పిల్లాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఎడ్వర్డ్.. కంగారుగా ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి చేరేలోపే అక్కడ డాక్టర్‌తో పాటు చుట్టుపక్కలవాళ్లు గుమిగూడి ఉన్నారు. వారి మధ్యలో అచేతనంగా పడున్న ఎల్వాని చూసి.. నిశ్చేష్టుడైపోయాడు ఎడ్వర్డ్. ఓ పక్క డాక్టర్ ఆమెని చెక్ చేస్తున్నాసరే.. భార్య ముఖాన్ని పట్టుకుని వదిలిపెట్టలేదు ఎడ్వర్డ్. ఏడుస్తూనే ఉన్నాడు. భార్యకు ఎంతో ఇష్టమైన స్కార్ఫ్ అంటూ ఓ స్కార్ఫ్ తెచ్చి ఎల్వా మెడకు చుట్టాడు. నా భార్య విశ్రాంతి తీసుకుంటుందని తల కింద దిళ్లు పెట్టి జోకొట్టాడు. అతని స్థితి చూసిన వాళ్లంతా ‘అయ్యో పాపం’ అంటూ కంటతడిపెట్టారు. ఎల్వా తల దగ్గర భర్త ఎడ్వర్డ్ పడి ఏడుస్తుంటే, డాక్టర్ నాప్.. ఎల్వాను చెక్ చేసి.. ఆమె ప్రాణాలతో లేదని నిర్ధారించాడు. పైగా ఎల్వా గత కొన్ని రోజులుగా తన దగ్గర గైనిక్ సమస్యకు చికిత్స తీసుకుంటుండడంతో .. ఆ సమస్యే తీవ్రమై ఆమె చనిపోయుంటుందని భావించాడతను. అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎల్వా తల్లి మేరీ జేన్ హిస్టర్ కూడా అక్కడికి చేరుకుని, కూతురి శవాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. రావాల్సిన వాళ్లు, చూడాల్సిన వాళ్లు ఎవ్వరూ లేరని తేలిన తర్వాత.. మరునాడు జనవరి 24న ఎల్వా మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. అప్పుడే మొదలైంది అసలు కథ.. నెల రోజులు గడవక ముందే ఎల్వా తల్లి మేరీకి వరుసగా నాలుగు రోజుల పాటు ఎల్వా కలలోకి వచ్చింది. తనది సహజమరణం కాదని.. తన భర్త ఎడ్వర్డే తనని బలవంతంగా చంపేశాడంటూ మొరపెట్టుకుంది. మేరీ ఆశ్చర్యపోయింది. ‘సాక్ష్యం లేనిదే కోర్టులో ఎలా నిరూపించగలను?’ అనుకుంటూనే స్థానిక ప్రాసిక్యూటర్ జాన్ ఆల్ఫ్రెడ్‌ని కలిసింది. తన కూతురు కలలోకి వచ్చిందని, కేసును రీ–ఓపెన్ చెయ్యాలని ప్రాధేయపడింది. ఆమె వాదనని మొదట్లో కొట్టిపారేసిన జాన్ .. అనుమానం వచ్చి ఎడ్వర్డ్ ఎలాంటివాడని స్థానికంగా ఆరా తీశాడు. ఎల్వాను నిరంతరం ఎడ్వర్డ్ కొట్టేవాడని, అతడే చంపేసుంటాడనే అనుమానాలు వెలువడ్డాయి. వెంటనే డాక్టర్ నాప్‌ని ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ జాన్ . ‘ఎడ్వర్డ్ ఏడుస్తూ ఉండటంతో.. ఎల్వా డెడ్ బాడీని సరిగా పరీక్షించలేకపోయాను’ అని నాప్ తెలిపాడు. దాంతో.. కేసు రీ–ఓపెన్ అయ్యింది. 1897 ఫిబ్రవరి 22న ఎల్వా బాడీని సమాధి నుంచి బయటికి తీసి.. ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. 1897 మార్చి 9కి రిపోర్టుల్లో ఎల్వాది హత్యేనని తేలింది. మెడ విరిచి చంపినట్లు ఎడ్వర్డ్ వేలిముద్రలు కూడా దొరికాయి. విరిగిన మెడ వాలిపోకుండా ఉండటానికే ఆ రోజు శవం మెడకు స్కార్ఫ్ చుట్టాడని, తల కింద దిండ్లు పెట్టాడని అందరికీ అర్థమైంది. దాంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో ఎడ్వర్డ్ గురించి మరిన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఎడ్వర్డ్‌కి ఎల్వా మొదటి భార్య కాదని.. మూడో భార్యని తెలిసింది. మొదటి భార్య.. ‘ఇలాంటి క్రూరుడితో బతకడం నా వల్ల కాదు’ అని విడాకులు ఇచ్చి వెళ్లిపోగా.. రెండో భార్య అనుమానాస్పద రీతిలో చనిపోయింది. అంటే ఆమెని కూడా ఎడ్వర్డే చంపి ఉంటాడనే ఆరోపణలు బలపడ్డాయి. పైగా ఎడ్వర్డ్.. ఏడు పెళ్లిళ్లు చేసుకోవాలనేది తన కోరికని, అందుకే ఎల్వాను చంపానని, సరైన ఆధారాలు లేవు కాబట్టి.. త్వరలోనే విడుదల అవుతానని తోటి ఖైదీలతో గర్వంగా చెప్పుకునేవాడట. 1897 జూన్ 22న కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎల్వా ఆత్మకి సంబంధించి చర్చ వచ్చినప్పుడు.. ‘కోర్టు ముందు ఆత్మల ప్రస్తావన వద్దని.. రిపోర్టులు, ఆధారాలతోనే ముందుకు వెళ్దామని’ జడ్జ్ అడ్డుపడటంతో కేసులో ఆత్మ ప్రస్తావన లేకుండాపోయింది. మొత్తానికీ ఎల్వాని ఉద్దేశపూర్వకంగానే ఎడ్వర్డ్ హత్య చేసినట్లు జూలై 11న తీర్పు రావడంతో ఎడ్వర్డ్‌కి జీవిత ఖైదు పడింది. ఓ అమాయకురాల్ని పొట్టనపెట్టుకున్నాడని, అతడ్ని తామే చంపుతామని చాలామంది ఎల్వా సానుభూతిపరులు.. జైలుపై దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎడ్వర్డ్ తప్పించుకున్నాడు. కానీ తర్వాత మూడేళ్లకే అంటే 1900 మార్చి 13న వెస్ట్ వర్జీనియా, మౌండ్స్ విల్లేలోని స్టేట్ పెనిటెన్షియరీలో ఎడ్వర్డ్ చనిపోయాడు. అయితే అది సహజ మరణం కాదు. తెలియని ఏదో వ్యాధి సోకి, చిత్రవధ అనుభవిస్తూ చనిపోయాడు. ఎల్వా ఆత్మే అతడిని చంపిందని అంతా అనుకున్నారు. ఆ వ్యాధి ఎవరికీ సోకే ప్రమాదం లేకుండా.. స్థానిక శ్మశాన వాటికలో అతనిని ఖననం చేశారు. ఎల్వా సమాధి దగ్గర.. వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఓ చారిత్రక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఇలా ఉంటుంది.. ‘ఎల్వా ఆత్మ.. తన తల్లి కలలోకి వచ్చి.. తనది సహజ మరణం కాదని చెప్పింది. ఆమె భర్తే ఆమెని హత్య చేసినట్లు తేలింది. ఒక ఆత్మ సాయంతో ఓ హత్య కేసు పరిష్కరించడం ఇదే మొదటిసారి’ అని. మొత్తానికీ ఈ కథ చరిత్రలో ఓ ఊహించని మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
బ్లాక్స్బర్గ్: అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్‌బర్గ్ డౌన్‌టౌన్‌లోని మెలోడీ హుక్కా లాంజ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!
ఈజిప్ట్: ఒక్కసారి లాటరీ గెలిస్తేనే ఎగిరి గత్తేస్తాం. రెండూ సార్లు గెలిస్తే అబ్బో అదృష్టం అంటే మనదే అంటూ తెగ సంబరపడిపోతాం. కానీ ఏకంగా 20 సార్లు గెలిస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడొక వ్యక్తి కొనుగోలు చేసిన 20 టికెట్లకి లాటరీ తగిలింది. ఎవరా లక్కీ ఫెలో అని ఎగ్జాయింటింగ్ ఉన్నారా! (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....అలెగ్జాండ్రియాకు చెందిన విలియం నెవెల్ వర్జినియాలోని ఓ దుకాణం నుంచి ఆన్లైన్లో 20 ఒకేలాంటి టికెట్లు కొనుగోలు చేశాడు. అయితే నాలుగు టికెట్ల చొప్పున వరుసగా 5, 4, 1, 1 సంఖ్యలను ఎంచుకున్నాడు. ఇక అంతే వర్జినియా లాటరీ అధికారులు లాటరీ తీసిన ప్రతిసారి నెవెల్ కొనుగొలు చేసిన 20 టికెట్లకు 20 సార్లు గెలిచాడు. దీంతో నెవెల్ ప్రతి టికెట్‌కి 5 వేల డాలర్లు చొప్పున మొత్తం1,00,000 డాలర్లు (అంటే రూ.74 లక్షలు) గెలుచుకున్నాడు. ఏది ఏమైనా ఒకటి, రెండు సార్లు కూడా కాదు ఏకంగా 20 సార్లు అతను కొనగోలు చేసిన 20 టికెట్లుకు లాటరీ తగలడం విశేషం. (చదవండి: అది బైక్ ? విమానమా !) -
వర్జీనియాలో డెమెక్రాటిక్ పార్టీనే గెలిపించండి
నవంబరు 2న జరిగే ఎన్నికల్లో వర్జీనియా గవర్నర్‌గా టెర్రీని గెలిపించాలని వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు కోరారు. అమెరికా అధ్యక్షులు జోసఫ్ బైడన్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేసారు. ఇమిగ్రేషన్, బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలను వక్తలు వివరంగా తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న అనుకూల విధానాలే కొనసాగాలంటే డెమోక్రాట్లు అధికారంలోకి రావాలని తెలిపారు. వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు శ్రీధర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో లౌడెన్ కౌంటీ, వర్జీనియా రాష్ట్రంలోని లౌడెన్ కౌంటీలో ప్రవాస భారతీయ నాయకులు తొలిసారిగా సభ నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాహాఫ్ ముఖ్య అతిథి గా విచ్చేశారు. గత వర్జీనియా గవర్నర్, ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్న టెర్రీ మెకాలిఫ్, అటార్నీ జనరల్ గా పోటీ చేస్తున్న మార్క్ హేరింగ్, అమెరికా రిప్రజెంటేటివ్ జెన్నిఫర్ వెక్సన్, వర్జీనియా సెనేటర్ జెన్నిఫర్ బాయిస్కో, డెలిగేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, డెలిగేట్ వెండీ గూడిటిస్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు కోరారు. ఈ సమావేశంలో ప్రవాస తెలుగు, భారతీయ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు భాగమయ్యారు. ప్రసంగించిన వక్తలు వర్జీనియా రాష్ట్రంలో, డెమోక్రాటిక్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలలో వివిధ రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, హై టెక్నాలజీ, ఎంప్లాయిమెంట్, కోవిడ్ వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు. -
వర్జీనియాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్ట్ 15న అమెరికా వర్జీనియాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ప్రతి నిధులు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా అధ్యక్షురాలు సుధారాణి కొండపు మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టి పెరిగిన మన భావితరాలు ఆనందించేలా మన భారతీయతను ప్రతిబింబించే జెండా రంగులలోని కాషాయరంగు ,తెలుపు, ఆకుపచ్చ వర్ణాల అలంకరణతో పార్క్ ఏరియా కళకళలాడుతుందని అన్నారు. పిల్లలకు చాక్లెట్లను, బహుమతులను పంచుతూ తమ కార్యవర్గసభ్యులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, ట్రస్టీలు, గోపాల్ నున్న , వెంకట్ కొండపోలు కార్యవర్గసభ్యులు సతీష్ వడ్డి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి , పార్ధ బైరెడ్డి ,హరీష్ కొండమడుగు , రామచంద్ర ఏరుబండి , రాజు గొడుగు, సతీష్ సుంకనపల్లి,రమణారెడ్డి, ఉదయ్ , సాయి, రంగా, కౌశిక్ , విష్ణు, వినీత్ , కృష్ణకిశోర్, సంధ్య, రాధిక, అవని, లావణ్య, సుప్రజ ,విజయ,హరిత తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
అమ్మలా చేసింది.. ఎందరినో మెప్పించింది!
వాషింగ్టన్: కరోనా వల్ల చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి, ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. దీంతో పిల్లలైతే.. తల్లిదండ్రుల పనులు చేస్తామంటూ.. ఆ స్థానాల్లో కూర్చుని అల్లరి చేసినవి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని వర్జీనియాకు చెందిన 8 ఏళ్ల అడెల్లె అనే చిన్నారి తల్లిని అనుకరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 1 నిమిషం 23 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఆ అమ్మాయి తన తల్లి డెస్క్ వద్ద కూర్చుని, కంప్యూటర్లో పనిచేస్తున్నప్పుడు తల్లి ఎలా ఉంటుంది. ఆ సమయంలో ఫోన్ కాల్స్‌కి స్పందించడం. పిల్లలు గదిలోకి ప్రవేశించినపుడు ఆమె తల్లి ఎలా ప్రవర్తిస్తుందని నటిస్తూ చూపించింది. కొలీన్ చులిస్ ఏప్రిల్‌లో తన కుమార్తె వీడియోను లింక్డ్ఇన్లో షేర్ చేయగా.. 5 మిలియన్లకు పైగా లైక్‌లు, 15 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ఇక కొలీన్కు ముగ్గురు పిల్లలు లూకా (10), అడెల్లె (8), డెక్లాన్ (6) ఉన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ చాలా బాగా చేశారు. నీ నటనకు ఫిదా చిట్టి తల్లి.’’ అంటూ కామెంట్ చేశాడు. -
వైరల్: మీనా.. గుడ్‌బై నేస్తమా
చిన్నముక్క బిస్కెట్, ఒక ఆప్యాయ స్పర్శ చాలు.. కుక్కను మనవైపు తిప్పుకోవడానికి. ఆ పనిని మనం వాటిని మరిచిపోయినా.. అవి మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి. మనుషుల పట్ల లెక్కకట్టలేనంత విశ్వాసాన్ని కనబరిచే ఆ మూగజీవాలు.. ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు తమ చేష్టలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. గుజరాత్ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న స్నిఫ్ఫర్ డాగ్ మీనా(7) అనారోగ్యంతో మృతి చెందింది. దాని అంతిమ సంస్కారాలకు ముందు అధికారులు పూలతో నివాళులు అర్పించారు. ఆ టైంలో అక్కడే ఉన్న మరో రెండు స్నిఫ్ఫర్ డాగ్స్.. మీనా భౌతికకాయం ముందు మోకరిల్లి నివాళులర్పించాయి. ఐపీఎస్ అధికారి శంషేర్ సింగ్ ఆ ఫొటోను అప్లోడ్ చేయగా.. వైరల్ అవుతున్న ఆ ఫొటోకి నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. Final salute to their colleague , Meena. pic.twitter.com/bYuceNlsee — Shamsher Singh IPS (@Shamsher_IPS) June 17, 2021 ఇక వర్జీనియాలో జరిగిన ఓ ఘటనలో.. యజమాని నుంచి తప్పిపోయి అడవుల్లోకి వెళ్లిన ఓ కుక్క.. వాగులో కొట్టుకుపోతున్న జింక పిల్లను ఒడ్డుకు చేర్చింది. ‘హీరో డాగ్’గా పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకుంది. హర్లే అనే కుక్క ఆ జింక పిల్లను కాపాడుతున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: బుడగలు ఊదుతూ రిలాక్స్‌గా.. -
‘‘ఈ బిడ్డలు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్లరు’’
వాషింగ్టన్: ఈ మధ్య కాలంలో మన దేశంలో రెండు మూడు సంఘటనలు జనాలను బాగా కదిలించాయి. అవేంటంటే బెంగళూరుకు చెందిన ఓ కోటీశ్వరుడు చనిపోయిన భార్యను పోలిన విగ్రహం తయారు చేయించి.. దానితో గృహప్రవేశం చేశాడు. తమిళనాడులో కొందరు అక్కాచెళ్లల్లు చనిపోయిన తండ్రి విగ్రహం చేయించి.. దాని సమక్షంలో సోదరి వివాహం జరిపించారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే ఓ తల్లి కూడా ఇలానే తన బిడ్డలను పోలిన బొమ్మలను చేయించి.. వాటితో కాలం గడుపుతుంది. ఎందుకు ఇలా అంటే భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు కూడా తండ్రి వద్దనే ఉంటున్నారు. ఆ బాధ నుంచి బయటపడటం కోసం ఆ తల్లి ఇలా లక్షలు ఖర్చు చేసి బిడ్డల బొమ్మలు తయారు చేయించుకుని వాటితో సంతృప్తి పడుతుంది. ఆ వివరాలు.. వర్జీనియా క్లిఫాన్కు చెందిన లిజ్ వాట్సాన్ 2010లో భర్తనుంచి విడిపోయింది. అప్పటికే వారికి ముగ్గురు పిల్లలు. ఆఖరి సంతానం వయసు 18 నెలలు కాగా మిగతా ఇద్దరు పిల్లు కొంచెం పెద్దవారు. తల్లితో వచ్చిన కొద్ది రోజుల తర్వాత పెద్దపిల్లలు ఇద్దరు తండ్రి దగ్గరకు వెళ్లిపోయారు. ఆ బాధనుంచి కోలుకోవాడినికి ఆమె దాదాపు 5 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఓ సారి ఆమె యూట్యూబ్‌లో అచ్చు మనిషిని పోలినట్లుండే బొమ్మలను చూసింది. వాటిని చూడగానే వాట్సన్‌కు ఓ ఆలోచన వచ్చినంది. వెంటనే తన పిల్లల ఫోటోలు ఇచ్చి.. వారిలాంటి బొమ్మలు తయారు చేయించింది. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు పెట్టింది. అలా 2016 నుంచి వాట్సాన్ రీబోర్న్ బేబీ డాల్స్ లోకంలో అడుగుపెట్టింది.ప్రస్తుతం ఆమె దగ్గర మొత్తం తొమ్మిది బొమ్మలున్నాయి. దీనిపై వాట్సాన్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.‘‘నా బిడ్డలు నాన్న కావాలంటూ నా దగ్గర నుంచి వెళ్లిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో మాటల్లో వర్ణించలేను. పిల్లలు వెళ్లిపోయాక నాకు ఎలా అనిపించింది అంటే అన్నాళ్లు వాళ్లని పెంచి ఎవరికో దత్తత ఇచ్చినట్లనిపించింది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఇలా నా బిడ్డలను పోలిన బొమ్మలు తయారు చేయించాను. ఎందుకంటే వీటికి మాటల రావు.. పెరగవు. మరి ముఖ్యంగా ఎన్నటికి నన్ను విడిచిపెట్టి వెళ్లవు’’ అన్నది. చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో.. -
పైనుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు!
వాషింగ్టన్ : అమ్మాయిలు బట్టలు మార్చుకునే గదిలోకి తొంగిచూస్తూ అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. సీలింగ్‌పై నుంచి గదిలోకి పడి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాండ్ఫోర్డ్ కౌంటీ షరీఫ్ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసిన వివరాల మేరకు.. వర్జీనియాకు చెందిన బ్రియాన్ ఆంథోనీ జోయ్ శనివారం అక్కడి ఓ జిమ్‌కు వెళ్లాడు. వర్కవుట్లు చేయటం అయిపోయిన తర్వాత ఉమెన్స్ లాకర్ రూం( అమ్మాయిలు బట్టలు మార్చుకునే, దాచుకునే గది)లోని సీలింగ్‌పై నక్కి కూర్చున్నాడు.. అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటే చూద్దామని. కొద్దిసేపటి తర్వాత అతడి బరువు తాళలేకపోయిన సీలింగ్ షీటు ఊడిపోయింది. దీంతో అతడు పది అడుగుల ఎత్తునుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు. అదే సమయంలో గదిలోకి వచ్చిన ఓ అమ్మాయి అతడు పైనుంచి కిందపడటంతో బిత్తరపోయింది. ( పీపాలో నెల రోజులు.. మలం తిని బతికాడు) మొదట అతడ్ని జిమ్ సిబ్బంది అనుకుంది. అయితే అతడి ఒంటిపై యూనీఫాంకు బదులు మామూలు డ్రెస్ ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతడు కిందపడిన వెంటనే పైకి లేచి, దొంగచూపులు చూస్తూ రూములోంచి బయటకు వెళ్లిపోయాడు. బ్రియాన్‌పై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి అతడ్ని అడ్డగించి ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడినుంచి పారిపోయి జిమ్‌లోని బాత్రూమ్లో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బ్రియాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. View this post on Instagram A post shared by Jennifer Benitez Health Coach✨ (@fitwjenn) -
ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..
నాలుగేళ్ల పిల్లాడు ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ చిన్నారి కొత్త స్నేహితుడ్ని చూసిన అతడి తల్లి ఒకింత ఆశ్చర్యపోయింది. వెంటనే తన మొబైల్ తీసుకుని స్టైల్‌గా ఉన్న ఇద్దరి ఫోటోలను తీసింది. అయితే ఆ బుడతడి కొత్త ఫ్రెండ్ మరెవరో కాదు జింక పిల్ల. అమెరికాలోని వర్జీనియాలో ఈ అరుదైన ఘటన జరిగింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. వివరాలు.. విహారయాత్ర కోసం స్టెఫానీ బ్రౌన్ కుటుంబం వర్జీనియాలోని మసానుటెన్కు వచ్చింది. డొమినిక్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఈ నెల 26న ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొంతసేపటికి తర్వాత తిరిగి వచ్చిన కుమారుడ్ని చూసి అతడి తల్లి స్టెఫానీ బ్రౌన్ ఆశ్చర్యపోయింది. ఆ చిన్నారితో కలిసి వచ్చిన జింక ఏ మాత్రం భయపడకుండా తలుపు పక్కన నిలబడింది. అయితే దాని తల్లి తన పిల్ల కోసం చూస్తుందని, ఆ జింక పిల్లను తిరిగి పార్కులో వదిలేయమని చెప్పింది. కాగా, కొత్త ఫ్రెండ్‌తో తన కుమారుడు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను స్టెఫానీ బ్రౌన్ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వందల సంఖ్యలో సాలీడులు.. వారి పరిస్థితి ఏంటో