![Daughter Imitates Her Mother Video Goes Viral In America At Virginia - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/10/viral-video.jpg.webp?itok=zewovORu)
వాషింగ్టన్: కరోనా వల్ల చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి, ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. దీంతో పిల్లలైతే.. తల్లిదండ్రుల పనులు చేస్తామంటూ.. ఆ స్థానాల్లో కూర్చుని అల్లరి చేసినవి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని వర్జీనియాకు చెందిన 8 ఏళ్ల అడెల్లె అనే చిన్నారి తల్లిని అనుకరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
1 నిమిషం 23 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఆ అమ్మాయి తన తల్లి డెస్క్ వద్ద కూర్చుని, కంప్యూటర్‌లో పనిచేస్తున్నప్పుడు తల్లి ఎలా ఉంటుంది. ఆ సమయంలో ఫోన్ కాల్స్‌కి స్పందించడం. పిల్లలు గదిలోకి ప్రవేశించినపుడు ఆమె తల్లి ఎలా ప్రవర్తిస్తుందని నటిస్తూ చూపించింది. కొలీన్ చులిస్ ఏప్రిల్‌లో తన కుమార్తె వీడియోను లింక్డ్ఇన్‌లో షేర్ చేయగా.. 5 మిలియన్లకు పైగా లైక్‌లు, 15 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ఇక కొలీన్‌కు ముగ్గురు పిల్లలు లూకా (10), అడెల్లె (8), డెక్లాన్ (6) ఉన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ చాలా బాగా చేశారు. నీ నటనకు ఫిదా చిట్టి తల్లి.’’ అంటూ కామెంట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment