Mother daugther
-
Mother's Day 2023: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' హవా..
'అమ్మ' అనే పదాన్ని వర్ణించడానికి పదాలు చాలవు, శ్లోకాలు చాలవు ఆఖరికి గ్రంధాలు కూడా చాలవు. ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం అమ్మ ప్రేమకు బానిస అవుతాడు అనేది శాసనం. ఏ రంగంలో అయినా, ఏ సందర్భంలో అయినా.. భూమి నుంచి ఆకాశం వరకు ఏదైనా చెయ్యగలిగే శక్తి మాతృమూర్తి సొంత. ఇక వ్యాపార రంగంలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 'మాతృ దినోత్సవం' సందర్భంగా వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్తున్న నలుగురు తల్లీ కూతుళ్ళ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.. ఫల్గుణి & అద్వైత నాయర్ అమెరికాలో ఉద్యోగం వదిలి తన తల్లి ఫల్గుణి నాయర్ సహాయంతో వ్యాపార రంగంలో ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఫల్గుణి నాయర్ భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె 2021లో చాలా విజయవంతమైన IPO తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 36,000 కోట్లకు పైగా ఉన్న Nykaa CEO కూడా. ఈ కంపెనీకి అద్వైత నాయర్ నేతృత్వంలోని Nykaa ఫ్యాషన్ అనే ఫ్యాషన్ విభాగం తోడైంది. ఉన్నత చదువులు చదువుకున్న అద్వైత కంపెనీ అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. 10 మందితో ప్రారంభమైన వీరి కంపెనీ ఇప్పుడు 3000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. తల్లీ, కూతుళ్లు నైకా బ్రాండ్ కింద అనేక ఉత్పత్తులు విక్రయిస్తూ విజయాల బాటలో ప్రయాణిస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వీరి ఆదాయం రూ. 724 కోట్ల కంటే ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ఆదాయాన్ని మరింత పెంచడానికి కృషి చేయడానికి కావలసిన ఎన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఫల్గుణి నాయర్ & అద్వైత భారతదేశంలో అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరుగా ఉన్నారు. వీరి నికర ఆస్తుల విలువ రూ.20,000 కోట్లు. షహనాజ్ హుస్సేన్ & నెలోఫర్ కర్రింబోయ్ షహనాజ్ హుస్సేన్ భారతదేశంలోని షహనాజ్ హుస్సేన్ గ్రూప్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈమె హెర్బల్ బ్యూటీ కేర్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు, ఆయుర్వేదంలో భారతీయ మూలికా వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. వాణిజ్య పారిశ్రామిక రంగంలో షహనాజ్ కృషికి భారత ప్రభత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. షహనాజ్ హుస్సేన్ కుమార్తె నెలోఫర్ కర్రింబోయ్ కూడా తల్లి మార్గంలోనే ముందుకు సాగుతోంది. ఈ తల్లీ కూతుళ్ల ద్వయానికి చెందిన బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. టెక్నాలజీ పట్ల నీలోఫర్స్కు ఉన్న ఆసక్తి ఆయుర్వేదం, బ్యూటీ రంగంలో మరింత మంచి భవిష్యత్తుకు మార్గదర్సకం కానుంది. శోభన కామినేని & ఉపాసన కామినేని కొణిదెల అపోలో హాస్పిటల్ సామ్రాజ్య స్థాపనకు కారకులైన కుటుంబానికి చెందిన శోభన కామినేని & ఉపాసన కామినేని కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ 'శోభనా కామినేని', అపోలో హాస్పిటల్స్‌లోని CSR వైస్ చైర్‌పర్సన్‌గా 'ఉపాసన కామినేని' పనిచేస్తున్నారు. ఉపాసన ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ద వహించే మెళుకులను తెలియజేస్తూ.. మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వరిస్తోంది. జయ & శ్వేతా శివకుమార్ వై సో బ్లూ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రముఖ వ్యాపారవేత్తలుగా మారిన తల్లీ కూతుళ్లే జయ & శ్వేతా శివకుమార్. వారి కుటుంభంలో ఒక విషాద సంఘటన జరిగిన తరువాత వారు ఈ సంస్థకు ప్రాణం పోశారు. ఆధునిక కాలంలో అద్భుతమైన డ్రెస్ బ్రాండ్ ప్రారంభించి వీరి జీవిత కాల కళను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వారు అద్భుతమైన పర్యావరణ స్పృహతో కూడిన కాటన్ దుస్తుల బ్రాండ్‌ను సృష్టించి మంచి లాభాలను గడిస్తున్నారు. నాస్తి మాతృ సమం దైవం, నాస్తి మాతృ సమః పూజ్యో, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురుః. (అమ్మతో సమానమైన పూజ్యులు గానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు) అన్న మాటలు ఇప్పటికే నిత్య సత్యాలే.. మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి సాక్షి బిజినెస్ తరపున శుభాకంక్షాలు. -
కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో..
ముంబై: ప్లాట్‌ఫాంపై కదులుతున్న రైలు ఎక్కబోయి తల్లీకూతురు కిందపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు, ఓ ప్యాసెంజర్ వీళ్లిద్దరిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ముంబైలోని వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. Prompt action by #RPF Constable Tejaram saved a mother-daughter duo from a major accident in nick of time at Vasai Road railway station while they tried to board a moving train. Your safety is our greatest concern.#MissionJeewanRaksha #BeResponsie #BeSafe @rpfwr1 @rpfwrbct pic.twitter.com/lTUhu2rNOX — RPF INDIA (@RPF_INDIA) December 13, 2022 తల్లీకూతురును రక్షించిన కానిస్టేబుల్ తేజారామ్‌ను ఆర్పీఎఫ్ ప్రశంసించింది. ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. తమ ప్రాణాలు కాపాడినందుకు రైల్వే కానిస్టేబుల్ తేజారామ్‌కు తల్లీకూతురు కృతజ్ఞతలు చెప్పారు. చదవండి: పెళ్లి రద్దు.. రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి.. -
పని మనిషి కాస్త.. ఓనర్ అయ్యింది!
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే.. దాని వెనుక బోలెడంత కథాకమీషు ఉంటుంది. అయితే అనుకున్న దానిని నెరవేర్చుకునేందుకు కొందరు పడే తాపత్రయం.. ఆకట్టుకోవడమే కాదు, వాళ్ల లక్ష్యసాధన చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది కూడా. ఒకప్పుడు ఆమె ఆ విలాసవంతమైన ఇంట్లో పని మనిషి. ఇల్లు ఊడ్చి.. తుడిచి.. ఇంటి పనులు చేసేది. కాలచక్రం గిర్రున తిరిగి 43 ఏళ్లు గడిచింది. అదే ఇంట్లో ఇప్పుడామె ఓనర్‌గా దర్జాగా కాలు మీద కాలేసి కూర్చుంది!. న్యూమెక్సికో అల్బుకెర్కీకి చెందిన మార్గరెట్ గాక్సియోలా.. 1976లో 29 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లైంది. అయితే భర్త ఆమెను వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయాడు. దీంతో పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఓ పూల షాపులో పని చేస్తూనే.. నాలుగు ఇళ్లల్లో పని మనిషిగా చేసింది. ఆ సమయంలో చిన్నకూతురు నికోల్‌ను వెంటపెట్టుకుని వెళ్లేది. అయితే అన్నింట్లోకి ఆమెకు ఒక ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఆ ఇల్లు చాలా విలాసవంతమైంది కావడమే అందుకు కారణం. తన పూర్తి జీవితం అందులోనే గడిపితే బాగుండేదని తరచూ గాక్సియోలా పిల్లలతో చెబుతూ ఉండేదట. కానీ, అది సాధ్యం కానీ అంశమని ఆమెకు కూడా తెలుసు!. ఇక నికోల్‌కు కూడా ఆ ఇంట్లో ఎంతో నచ్చింది. ఓ టేబుల్ కింద కూర్చుని ఎక్కువ సేపు ఆడుకునేది. ఆ ఇల్లు గాక్సియోలా ఉండే చిన్ని అద్దెయింటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉండేది. ఇక ఇంటి ఓనర్ పమేలా కీ లిండెన్ కూడా ఈ తల్లీబిడ్డలను సొంతవాళ్లుగా భావించేది. అలా చాలా ఏళ్లు గడిచాయి. 2018లో పమేలా అనారోగ్యంతో చనిపోయాక.. గాక్సియోలా ఆ ఇంటి పనులకు వెళ్లడం మానేసింది. ఈలోపు తన ముగ్గురు పిల్లలు మంచి చదువులతో.. మంచి ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు కొడుకులు భార్యాపిల్లలతో సుఖంగా వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. గాక్సియోలా మాత్రం ఒంటరిగా ఆ చిన్ని అద్దె ఇంట్లోనూ ఉంటూ వచ్చింది. అయితే తన తల్లి మనసును అర్థం చేసుకుంది కూతురు నికోల్ నారంజో(44). పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కూడా.. తన తల్లి కలను నెరవేర్చేందుకు ప్రయత్నించింది. భర్త సాయంతో.. తానూ ఉద్యోగం చేస్తూ డబ్బును కూడబెడుతూ వచ్చింది. తమ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి.. వెలకట్టలేని బహుమతిని అందించాలనుకుంది. నవంబర్ 2020లో ఆ ఇల్లును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు.. ఆ ఇంటిని కొనుగోలు చేసి.. ఈ మధ్యే ఆ ఇంట్లో తల్లిని అడుగుపెట్టించింది. కోరుకున్న కలను కళ్ల ముందు ఉంచిన బిడ్డను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. ఆ క్షణాలను భావోద్వేగంగా మల్చుకుంది ఆ తల్లి. -
ఓ తల్లి ఘాతుకం: కన్న బిడ్డనే కడతేర్చింది..
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): క్షణికావేశం.. ఆ తల్లిని హంతకురాలిని చేసింది. నవమాసాలూ మోసి కన్న బిడ్డనే కర్కశంగా హత్య చేసేలా ప్రేరేపించింది. అంతేకాదు, తను రక్తం పంచిన ఆ బిడ్డ శరీరం రక్తమోడుతున్నా.. ఆ అమ్మ మనసు కరగలేదు. మరణించే దాకా అలానే ఉండిపోయింది.. ఆ తర్వాత తనూ ఆత్మహత్యా యత్నం చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని కొత్తపేటలో నివాసముంటున్న బీరే శ్రీనివాసులు, భార్య మీనాక్షిలు చేనేత కార్మికులు. వీరికి తనుశ్రీ, ప్రణతి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీనివాసులు మరమగ్గం నేసేందుకు గొట్లూరు గ్రామానికి వెళుతుంటాడు. మీనాక్షి ఇంట్లోనే మగ్గం నేస్తుంటుంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే ఏమైందో ఏమోగానీ శుక్రవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత శ్రీనివాసులు మరమగ్గం నేసేందుకు వెళ్లిపోయాడు. పెద్ద కుమార్తె తనుశ్రీ అమ్మమ్మ ఇంటికెళ్లింది. భర్త వెళ్లిన కాసేపటికే మీనాక్షి ఇంట్లో తలుపులు వేసి.. రెండున్నరేళ్ల చిన్న కుమార్తె ప్రణతి ఎడమ చేతిని మగ్గం పోగులు కోసే కత్తితో కోసేసింది. నొప్పి భరించలేక చిన్నారి ఏడుస్తున్నా తల్లి మనసు కరగలేదు. ప్రాణాలు పోయే వరకూ అలాగే ఉండిపోయింది. తర్వాత తనూ చేయి కోసుకుంది. ఎంతకీ తన ప్రాణాలు పోకపోవడంతో చీరతో ఉరేసుకుంది. ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో వారు తలుపుల్ని బద్దలు కొట్టారు. మీనాక్షిని వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, అర్బన్ సీఐ కరుణాకర్ ఘటనా స్థలానికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మలా చేసింది.. ఎందరినో మెప్పించింది!
వాషింగ్టన్: కరోనా వల్ల చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి, ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. దీంతో పిల్లలైతే.. తల్లిదండ్రుల పనులు చేస్తామంటూ.. ఆ స్థానాల్లో కూర్చుని అల్లరి చేసినవి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని వర్జీనియాకు చెందిన 8 ఏళ్ల అడెల్లె అనే చిన్నారి తల్లిని అనుకరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 1 నిమిషం 23 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఆ అమ్మాయి తన తల్లి డెస్క్ వద్ద కూర్చుని, కంప్యూటర్లో పనిచేస్తున్నప్పుడు తల్లి ఎలా ఉంటుంది. ఆ సమయంలో ఫోన్ కాల్స్‌కి స్పందించడం. పిల్లలు గదిలోకి ప్రవేశించినపుడు ఆమె తల్లి ఎలా ప్రవర్తిస్తుందని నటిస్తూ చూపించింది. కొలీన్ చులిస్ ఏప్రిల్‌లో తన కుమార్తె వీడియోను లింక్డ్ఇన్లో షేర్ చేయగా.. 5 మిలియన్లకు పైగా లైక్‌లు, 15 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ఇక కొలీన్కు ముగ్గురు పిల్లలు లూకా (10), అడెల్లె (8), డెక్లాన్ (6) ఉన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ చాలా బాగా చేశారు. నీ నటనకు ఫిదా చిట్టి తల్లి.’’ అంటూ కామెంట్ చేశాడు. -
ప్రియుడితో సంబంధం.. కూతురు అడ్డుగా ఉందని...
రాయ్‌బరేలి: కామంతో కళ్లు మూసుకుని రక్త సంబంధాలు మర్చిపోతున్నారు కొందరు. ఆ సమయంలో ఏం చేస్తున్నారో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగిన వారికన్నా కామం మత్తు మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తమ కోరికకలకు అడ్డుగా ఉన్నారని భావిస్తే ఎవరినైనా హతమారుస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉందని భావించి తన కూతురును కన్నతల్లి చంపేసుకుంది. అనంతరం మృతదేహాన్ని బావిలోకి పడేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగింది. రాయ్‌బరేలీలోని దాల్మయి కోట్వాలీ మండలం సుర్సానా గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్ భార్య, కూతురు (5)తో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల హోలీ సందర్భంగా భార్య కూతురును తీసుకుని పుట్టింటికి వచ్చింది. పండుగ అనంతరం ఆమె తిరిగి రాలేదు. అనంతరం ఆమె అదృశ్యమైంది. ఆమె కోసం గాలిస్తుండగా ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో ఆమె గురించి తెలిసిన వారు ఒకరు సమాచారం అందించారు. ఆమె తన ప్రియుడితో కలిసి పక్క ఊరిలో ఒక ఇంట్లో ఉంటోందని తెలిసింది. దీంతో భర్త వెంటనే అక్కడకు వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కూతురి విషయం అడగ్గా ఆమె సమాధానం ఇవ్వలేదు. కుటుంబసభ్యులు అంతటా గాలించారు పాప ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో బావిలో బాలిక మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకుని మృతదేహం బయటకు తీయగా బాలిక కనిపించింది. వివరాలు సేకరించి బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తానే బాలికను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు.. ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు బావిలో పడేసినట్లు చెప్పింది. దీంతో భర్త, ఆమె కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే ప్రియుడితో పాటు ఆమెను జైలుకు తరలించారు. -
తల్లికి టీకా వేసిన కూతురు
కేసముద్రం: ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి వైద్యులు, వైద్యులకు సిబ్బంది కరోనా వ్యాక్సిన్ ఇస్తుండటం మనకు తెలిసిందే. అయితే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఆసక్తికరమైన సంఘటన జరిగింది. తొలిదశలో మహమూద్‌పట్నం అంగన్వాడీ సెంటర్లో ఆయాగా పనిచేస్తున్న ఎల్లమ్మ పేరు జాబితాలో ఉంది. ఆమె పేరు రావడంతో అదే పీహెచ్సీలో పని చేస్తున్న ఎల్లమ్మ కూతురు, ఏఎన్ఎం యాకమ్మ విధుల్లో ఉండటంతో స్వయంగా తన తల్లికి టీకా వేశారు. దీంతో అక్కడున్న సిబ్బంది చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మళ్లీ రేపు టీకాల పంపిణీ సాగనుంది. టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతుండడంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాన్ని అభినందించింది. -
తల్లీకూతుళ్ల దారుణ హత్య..
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని న్యూఅశోక్ నగర్లో తల్లీకూతుళ్లను దుండగులు కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఘటన వెలుగుచూసింది. మృతులను సుమిత (65), సమ్రిత (25)లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించగా ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి వెళ్లడం, బయటకు రావడం రికార్డయింది. నిందితుల్లో ఒకరు రాజస్ధాన్‌లోని జైపూర్‌కు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినయ్ అలియాస్ విక్రాంత్ నాగర్‌గా గుర్తించారు . రాజస్ధాన్ పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, తల్లీకూతుళ్ల హత్య కేసులో కొన్ని క్లూలు లభించాయని డీసీపీ(ఈస్ట్) జస్మీత్ సింగ్ చెప్పారు. కాగా సుమిత ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె కుమార్తె సమ్రిత హాస్పిటాలిటీ రంగంలో శిక్షణ పొందుతున్నారని పోలీసులు చెప్పారు. కాగా సుమిత భర్త 20 ఏళ్ల కిందటే మరణించారని, సమ్రిత కోసం వచ్చిన వ్యక్తే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని స్ధానికులు చెబుతున్నారు. నిందితులు సమ్రిత కారులోనే పరారయ్యారని వారు పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. -
తల్లీకూతుళ్ల విజయం
ఆసిఫాబాద్: పరిషత్ ఎన్నికల్లో కుమురంభీం జిల్లాలో తల్లీ కూతుళ్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోవ లక్ష్మి పరిషత్ ఎన్నికల్లో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో దిగగా, కూతురు కోవ అరుణ సిర్పూర్(యు) నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో కోవ లక్ష్మి జైనూర్ జెడ్పీటీసీగా ఏకగ్రీవం కాగా, మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో కూతురు అరుణ సిర్పూర్(యు) జెడ్పీటీసీగా 5,088 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థిపై 3,444 ఓట్ల మెజార్టీ సాధించి ఘనవిజయం సాధించారు. జిల్లాలోని రెండు జెడ్పీటీసీ స్థానాలు తల్లీ కూతుళ్లు కైవసం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలోని అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన కోవ లక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కానుంది. -
తల్లీకూతుళ్లపై హత్యాయత్నం, చిన్నారి మృతి
నల్లగొండ: చిన్నారి సహా తల్లిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ కాళికామాత గుడి వద్ద ఓ ఇంట్లో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి మృతిచెందగా, తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే భర్తపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.