తల్లీకూతుళ్ల దారుణ హత్య.. | Woman Daughter Stabbed In New Ashok Nagar | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్ల దారుణ హత్య..

Published Tue, Mar 10 2020 10:24 AM | Last Updated on Tue, Mar 10 2020 10:28 AM

Woman Daughter Stabbed In New Ashok Nagar - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని న్యూఅశోక్‌ నగర్‌లో తల్లీకూతుళ్లను దుండగులు కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఘటన వెలుగుచూసింది. మృతులను సుమిత (65), సమ్రిత (25)లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించగా ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి వెళ్లడం, బయటకు రావడం రికార్డయింది. నిందితుల్లో ఒకరు రాజస్ధాన్‌లోని జైపూర్‌కు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినయ్‌ అలియాస్‌ విక్రాంత్‌ నాగర్‌గా గుర్తించారు

. రాజస్ధాన్‌ పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, తల్లీకూతుళ్ల హత్య కేసులో కొన్ని క్లూలు లభించాయని డీసీపీ(ఈస్ట్‌) జస్మీత్‌ సింగ్‌ చెప్పారు. కాగా సుమిత  ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె కుమార్తె సమ్రిత హాస్పిటాలిటీ రంగంలో శిక్షణ పొందుతున్నారని పోలీసులు చెప్పారు. కాగా సుమిత భర్త 20 ఏళ్ల కిందటే మరణించారని, సమ్రిత కోసం వచ్చిన వ్యక్తే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని స్ధానికులు చెబుతున్నారు. నిందితులు సమ్రిత కారులోనే పరారయ్యారని వారు పేర్కొన్నారని పోలీసులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement