
ప్రతీకాత్మకచిత్రం
ఇండియా గేట్ వద్ద యువకుడు తనకు తాను నిప్పంటించుకున్న ఘటన కలకం రేపింది.
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద ఓ యువకుడు తనకుతాను నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. ఇండియా గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం పాతికేళ్ల యువకుడు తనకు తాను నిప్పంటించుకోగా అక్కడికి దగ్గరలో ఉన్న ఢిల్లీ పోలీసులకు చెందిన పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్‌లో బాధితుడిని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. యువకుడికి 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా, బాధిత యువకుడిని ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనకు పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.