డోర్లు లాక్‌చేసి.. కారుకు నిప్పంటించాడు | Car Set Ablaze Near Novotel Hotel Vijayawada | Sakshi

కారుకు నిప్పంటించిన దుండగులు

Aug 17 2020 6:49 PM | Updated on Aug 18 2020 1:38 AM

Car Set Ablaze Near Novotel Hotel Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: స్థానిక నోవాటెల్‌ హోటల్‌ దగ్గర కారు(AP16BC4534)పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలు కాగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా రియల్‌ ఎస్టేట్‌ గొడవల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: అమీన్‌పూర్‌‌ ఘటన: రహస్య విచారణ)

వివరాలు.. కృష్ణారెడ్డి, గంగాధర్‌, నాగమల్లి, వేణుగోపాల్‌రెడ్డి అనే నలుగురు వ్యక్తులు కారులో కూర్చుని ల్యాండ్‌ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం తలెత్తడంతో వేణుగోపాల్‌ రెడ్డి చర్చల మధ్యలోనే కారు నుంచి దిగిపోయాడు. వెంటనే డోర్లన్నీ లాక్‌ చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీసీపీ హర్షవర్ధన్‌ రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement