set ablaze
-
ఘోరం: ఒంటికి నిప్పంటించుకున్న మహిళ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ అసెంబ్లీ గేటు వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ఒంటికి నిప్పంటించుకుని ప్రాణాపాయ స్థితిలో పడింది. స్థానిక మీడియా కథనం ప్రకారం... అంజనా(35) అనే మహిళకు గతంలో అఖిలేశ్ తివారి అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆసిఫ్ అనే యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో అతడిని పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం మతం స్వీకరించిన, అంజన తన పేరును ఆయిషాగా మార్చుకుంది. కొన్నాళ్ల తర్వాత ఆసిఫ్ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిపోగా, ఆమె అత్తింట్లో ఉండిపోయింది. (చదవండి: హాథ్రస్: క్రైంసీన్ పరిశీలించిన సీబీఐ) ఈ క్రమంలో భర్త తరఫు బంధువులు తనను వేధిస్తున్నారంటూ ఆయిషా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. దీంతో ఆవేదన చెందిన బాధితురాలు మంగళవారం లక్నోలోని అసెంబ్లీ గేటు ఎదుట అగ్నికి ఆహుతి అయ్యేందుకు ప్రయత్నించింది. అక్కడే విధుల్లో ఓ పోలీస్ అధికారులు మంటలార్పి, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారి సోమన్ వర్మ, ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
డోర్లు లాక్‌చేసి.. కారుకు నిప్పంటించాడు
సాక్షి, విజయవాడ: స్థానిక నోవాటెల్ హోటల్ దగ్గర కారు(AP16BC4534)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలు కాగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా రియల్ ఎస్టేట్ గొడవల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: అమీన్పూర్ ఘటన: రహస్య విచారణ) వివరాలు.. కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి, వేణుగోపాల్‌రెడ్డి అనే నలుగురు వ్యక్తులు కారులో కూర్చుని ల్యాండ్ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం తలెత్తడంతో వేణుగోపాల్ రెడ్డి చర్చల మధ్యలోనే కారు నుంచి దిగిపోయాడు. వెంటనే డోర్లన్నీ లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీసీపీ హర్షవర్ధన్ రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ఆ లెక్చరర్ చనిపోయింది..!
ముంబై: ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మహారాష్ట్రలోని వార్దాకు చెందిన ఓ యువతి(25) లెక్చరర్‌గా పనిచేస్తోంది. కాగా విక్కీ నగ్రాలే అనే వివాహితుడు గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గత సోమవారం సదరు యువతిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. చదవండి : పెళ్లికి నిరాకరణ.. దుళ్లలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది కాగా వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక విక్కీకి గతంలోనే పెళ్లయిందని, అతడికి ఏడు నెలల వయస్సు గల కొడుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు బల్లార్షాలో పనిచేసేవాడని.. బాధితురాలికి నిప్పు అంటించిన తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడని పేర్కొన్నారు. ఇక మహిళా లెక్చరర్‌పై అఘాయిత్యానికి నిరసనగా స్థానికులు నిరసన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేసి.. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం బాధితురాలి తరఫున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికాంను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదం: ఇద్దరు పిల్లలను హతమార్చి.. ఆపై -
మహిళా లెక్చరర్‌ను వెంబడించి..
ముంబై : మహారాష్ట్రలోని వార్ధాలో కాలేజ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మహిళకు ఓ పోకిరి నిప్పు పెట్టిన ఘటన వెలుగుచూసింది. సోమవారం ఉదయం మహిళ కాలేజ్‌కు వెళుతుండగా రెండేళ్లుగా ఆమె వెంటపడుతున్న నిందితుడు విక్కీ నగ్రారే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మహిళా లెక్చరర్‌కు నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కాగా బాధితురాలికి నిప్పంటించి నిందితుడు పరారవడంతో గమనించిన స్ధానికులు నీటితో మంటలను ఆర్పి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు నాగపూర్‌లోని ఆరంజ్ సిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారు.నిందితుడు వివాహితుడని అతడికి ఏడునెలల కుమారుడు ఉన్నాడని, రెండేళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చదవండి : పెళ్లికి నిరాకరణ, రెచ్చిపోయిన ప్రేమోన్మాది -
ఇండియా గేట్ వద్ద యువకుడి సజీవ దహనం
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద ఓ యువకుడు తనకుతాను నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. ఇండియా గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం పాతికేళ్ల యువకుడు తనకు తాను నిప్పంటించుకోగా అక్కడికి దగ్గరలో ఉన్న ఢిల్లీ పోలీసులకు చెందిన పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్‌లో బాధితుడిని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. యువకుడికి 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా, బాధిత యువకుడిని ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనకు పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తెగువ
లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై వరుస హత్యాచార ఘటనలు, దాడులు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా మహిళలపై నమోదవుతున్న అత్యాచార ఘటనలు మహిళ భద్రతను, రక్షణను సవాల్ చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై దాడిచేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగు చూసింది. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలు, గురువారం జరిగిన మరో దాడిలో కూడా చూపించిన తెగువ, సాహసం చర్చనీయాంశమైంది. తనే స్వయంగా పోలీసు ఎమర్జెన్సీ నెంబరు 112 ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కాల్తోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే తనపై దాడిచేసిన వ్యక్తులు పేర్లను పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అందించిన కథనం ప్రకారం, మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది. సహాయం కోసం అర్ధిస్తోంది. ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఆమెను పలకరించాను. తన పేరు చెప్పిన వెంటనే.. తన దగ్గరినుంచి ఫోన్ తీసుకుని పోలీసుల అత్యవర నంబరుకు కాల్ చేసిందని ఆయన చెప్పారు. ఆమె మంటల్లో కాలిపోతున్న ఆ దృశ్యం ఇప్పటికే తనను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారంటూ ఈ దారుణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా అత్యాచార బాధితురాలు విచారణ నిమిత్తం రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా, ఇటీవల బెయిల్‌పై విడుదలైన నిందితులు దారికాచి, దగ్గర్లోని పొలంలోకి ఈడ్చుకెళ్లి మరి నిప్పంటించారు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం విమానాశ్రయం నుంచి సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్‌కు ఏర్పాట్లు చేస్తోంది. (లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..) -
అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం
ఘజియాబాద్ : క్షణికావేశం నిండు సంసారంలో నిప్పులు పోసింది. భర్తతో జరిగిన స్వల్ప వివాదం నేపథ్యంలో తన ఇద్దరు చిన్నారులతోపాటు ఆత్మహత్యకు పాల్పడిందో గృహిణి. ఈ ఘటనలో అయిదేళ్ల కుమారుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బైటపడగా, తల్లీ కూతుళ్లిద్దరూ సజీవహదనమైపోయారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌లోని మురాద్ నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. దీప (35) కైలాస్ దంపతులకు వీరికి పాప రీనా (2), బాబు లలిత్ (5) ఉన్నారు. అవసరం ఏమిటో తెలియదుగానీ, తనకు 2 వేల రూపాయలు ఇవ్వాలని భర్త కైలాస్‌ని అడిగింది. ఇందుకు కైలాస్ నిరాకరించడంతో వివాదం మొదలైంది. ఇది మరింత ముదిరి దీపమీ చేయి చేసుకొని బయటకు వెళ్లిపోయాడు కైలాస్. అంతే తలుపు గడియవేసుకొని తనతో పాటు, బిడ్డలిద్దరిపైనా కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. దీప, రీనా అగ్నికి ఆహూతి కాగా, ఎలాగోలా తలుపు గడియ తీసుకుని బైటపడిన లలిత్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అదనపు కట్నం కోసం తమ కూతురిని అత్తమామలు వేధిస్తూ వచ్చారని ఆరోపిస్తూ దీప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నీరజ్ కుమార్ జదౌన్ తెలిపారు. -
ఆరని మంట.. మోగని రవళి
రవళి... తమ జీవితాలకు ఆనంద రవళి అవుతుందని కలలు కన్నారు ఆమె అమ్మానాన్నలు. అందెలు ఘల్లుమంటూ రవళి ఇంట్లో తిరుగుతుంటే సంతోషాల హరివిల్లును చూశారా అమ్మానాన్నలు. ఒక్కగానొక్క బిడ్డ. ఆమె ప్రతి వేడుకా ఆ ఇంటికి ఆనందాల డోలికగానే సాగింది. ఓణీ ఫంక్షన్లో పెళ్లి కూతురిలా అలంకరించి ఫొటో తీసుకున్నారు ఆమె అమ్మానాన్న పద్మ, సుధాకర్. తాము చదువుకోలేదు. ఉన్న కొద్దిపాటి పొలంలో సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. కూతురిని చదివించాలనేది వాళ్ల కల. రోజూ రవళిని కాలేజ్‌కి పంపించి గోడ మీదున్న ఓణీ ఫంక్షన్ ఫొటోను చూస్తూ డిగ్రీ పూర్తయిన వెంటనే సంబంధాలు చూడాలి. బంధువులందరినీ పిలుచుకుని మంచి వరుడితో ఆమె పెళ్లి వైభవంగా చేయాలని చెప్పుకునేవాళ్లు పద్మ, సుధాకర్‌లు. వాళ్లు అనుకున్నట్లే నిన్న (మంగళవారం) రవళికి పెళ్లి చేశారు వరుడిని వెతక్కుండానే. అరటి చెట్టుతో పెళ్లి చేశారామెకి. కాదు... ఆమెకి కాదు... ఆమె మృతదేహానికి. (ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి) రవళిది వరంగల్ జిల్లా, సంగం మండలం, రామచంద్రాపురం. రెండు నెలల కిందట ఇంట్లో చెప్పింది... కాలేజ్‌లో ఓ కుర్రాడు తనను వేధిస్తున్నాడని. అతడు అదే ఊరికి చెందిన అన్వేష్. ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. తన అమ్మానాన్న, మేనమామ సాక్షిగా ‘ఇక ఆ అమ్మాయి జోలికి వెళ్లను’ అని తలవంచుకున్నాడు అన్వేష్. పెద్దవాళ్లు మందలించడంతో తప్పు తెలుసుకున్నాడనే అనుకున్నారంతా. ఇక్కడే అందరి అంచనాలూ తారుమారయ్యాయి. అతడి మౌనం కార్చిచ్చులా రవళిని దహించి వేస్తుందని అతడు రవళి మీద పెట్రోల్ పోసి తగల పెట్టే వరకు ఎవరూ ఊహించ లేదు. (పేట్రేగిన ప్రేమోన్మాదం) సున్నితమైన శరీరం భగ్గున మండిపోయింది. 85 శాతం బర్న్స్. కళ్లు మండిపోయాయి. ఊపిరి తిత్తులు మాడిపోయాయి. ఇంకేం మిగిలి ఉంది జీవించడానికి. దేహంలో ప్రతి అవయవమూ బతుకుపోరాటం చేసే శక్తిలేనంతగా బొగ్గయిపోయాయి. ఆరు రోజులు ప్రాణాలతో పోరాడి చివరికి తాను గెలవలేకపోతున్నానని లోకానికి చెప్పింది రవళి. హాస్పిటల్ వాళ్లు దేహం మొత్తానికి తెల్లటి వస్త్రాన్ని చుట్టి అమ్మానాన్నల చేతుల్లో పెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డను అందుకున్నంత భద్రంగా అందుకున్నారు అమ్మానాన్నలు ప్రాణం లేని రవళిని. చివరి చూపు లేదు ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. బంధువులంతా వచ్చారు. ఆమె ముఖాన్ని కళ్లారా చూసుకుందామని కట్లు విప్పిన వాళ్లకు కళ్లు బైర్లుకమ్మాయి. తల్లి స్పృహ తప్పి పడిపోయింది. రవళి ముఖం... ముఖంలా లేదు. చూడలేక కప్పేయాల్సి వచ్చింది. అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. అరటి చెట్టుతో పెళ్లి చేశారు. అక్షింతలు వేస్తూ ‘నీ పెళ్లికి వచ్చి అక్షింతలు వేస్తామనుకున్నామే కానీ ఇలా జరిగిందేమిటి తల్లీ’ అని బంధువులంతా భోరున ఏడుస్తూ ఉంటే అక్కడున్న వాళ్లందరి గుండెలు తరుక్కుపోయాయి. ఏ బిడ్డకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లు తుడుచుకున్నారు. రవళి మృతదేహానికి అరటి చెట్టుతో పెళ్లి చేస్తున్న దృశ్యం ఓ ఉన్మాది చేతిలో కాలిపోయిన జీవితం రవళిది. మరే తల్లికీ ఇలాంటి గర్భశోకం రాకూడదని గుండెలవిసేలా ఏడుస్తోంది రవళి తల్లి. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి మనసు గంటకోసారి స్పృహ కోల్పోతోంది. స్పృహలోకి వచ్చిన ప్రతిసారీ ఒకటే మాట... ‘అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. ఒక తల్లి కన్న బిడ్డ ప్రాణాలు తీసే హక్కు అతడికెక్కడిది? ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష అందరికీ కనువిప్పు కావాలి. అట్లాంటి చట్టాల్లేకపోతే చట్టాలు మార్చుకుని మరీ శిక్ష వేయండి’ అంటూ పలవరిస్తోంది. - గజ్జెల శ్రీనివాస్, సాక్షి, సంగెం, వరంగల్ రూరల్ మా చెల్లికి దిక్కెవరు నాకు, మా చెల్లికి కలిపి ఒక్కర్తే అమ్మాయి. రవళికి ఆడపిల్లకు చేసుకునే వేడుకలన్నీ ఇద్దరం కలిసి చేసుకున్నాం. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలనుకుంటే ఇప్పుడిలా అయింది. మా చెల్లికి మెలకువ వస్తే ఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పద్మను కాపాడుకోవడం ఎలాగో తెలియడం లేదు. ప్రభుత్వం వాడిని(అన్వేష్) శిక్షించాలి. ఇలాంటి ఉన్మాదులు ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూడడానికి భయపడేటట్లు శిక్షించాలి. - రమ, రవళి పెద్దమ్మ -
సజీవదహనంతో బాధితురాలి ఆత్మాహుతి..
లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. లైంగిక దాడి జరిగిందనే అవమానంతో మైనర్ బాలిక తనకు తాను నిప్పంటించుకున్న ఘటన అలీఘఢ్‌లో వెలుగుచూసింది. బాధితురాలిపై ఇటీవల ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. తనపై నిందితులు ఒడిగట్టిన దారుణాన్ని తండ్రికి చెప్పుకున్న కొద్ది క్షణాలకే బాలిక తనకు తాను నిప్పటించుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలో న్యాయం కోరుతూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వెలుపల తమను తాము కాల్చుకుని ఆత్మాహుతికి పాల్పడేందుకు ప్రయత్నించిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించింది. ఉన్నావ్ లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలను సీబీఐ నిర్ధారించింది. -
రేప్ కేసు.. గుంజీలు తియ్యమంటే తగలబెట్టేశాడు
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఓ యువతి(18)కి నిప్పటించిన ఘటన కలకలం రేపింది. పంచాయితీ పెద్దల తీర్పును జీర్ణించుకోలేని నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఛాత్రా జిల్లా రాజకెందువా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తల్లిదండ్రులు బంధువుల వివాహానికి వెళ్లగా యువతి(18) ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. అది గమనించిన నలుగురు యువకులు గురువారం రాత్రి ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మరుసటి ఉదయం విషయం తెలిసిన యువతి తండ్రి పంచాయితీలో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడికి 30 వేల రూపాయల జరిమానా.. వంద గుంజీలు తీయాలని పంచాయితీ పెద్దలు హేయమైన తీర్పు ఇచ్చారు. దీంతో యువకుడు ఆగ్రహంతో యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులను చితక్కొట్టి ఆపై యువతికి నిప్పటించాడు. ఘటన తర్వాత యువకుడు పారిపోగా.. కాలిన గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతి బంధువుల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతికి ప్రధాన నిందితుడికి పాత పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్థానిక ఎస్సై వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
కళ్ల ముందు తగలబెడుతున్నా కాపాడలేదు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళను ఆమె భర్త తగలబెడుతుంటే.. జనాలు చూస్తూ ఉండిపోయారు. ఘటన తర్వాత కూడా ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర గాయాలతో ఆ మహిళ రెండు రోజుల తర్వాత కన్నుమూసింది. హేయనీయమైన ఈ ఘటన త్రిస్సూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జీతూ(29) తన భర్త విరాజ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉండగా విరాజ్ తన భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఓ లోన్ పని నిమిత్తం ఆమె తన తండ్రితో కలిసి చెంగళూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో భర్త విరాజ్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్ పోయటంతో ప్రాణాల కోసం ఆమె పరుగెత్తారు. జీతూ తండ్రి తన కూతురిని కాపాడాలంటూ అక్కడున్న వారందరి కాళ్ల వేళ్ల పడ్డారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. చివరకు ఆమె మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. కనికరం చూపలేదు... ఘటన తర్వాత విరాజ్ అక్కడి నుంచి పారిపోగా.. తీవ్ర గాయాలపాలైన జీతూను ఆస్పత్రికి తరలించేందుకు తండ్రి అక్కడున్న వారి సాయం కోరారు. కాళ్లా వేళ్లా పడ్డ ఎవరూ కనికరం చూపలేదు. చివరకు ఓ ఆటోడ్రైవర్ సాయంతో జీతూ తండ్రి ఆమె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ ఘటనలో స్థానిక వార్డు మెంబర్ హస్తం కూడా ఉందని జీతూ తండ్రి వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక వేసి తన కూతురిని అక్కడికి రప్పించి మరీ హత్య చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ‘ఉగ్రవాదులకు కూడా మన దేశంలో మంచి ఆతిథ్యం ఇస్తారు. అలాంటిది నా కూతురు తగలబడి పోతున్నా సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విరాజ్‌ను బుధవారం రాత్రి ముంబైలో అరెస్ట్ చేశారు. -
కాస్ట్లీ కారు.. క్షణాల్లో బుగ్గిపాలు
పుణే : క్షణాల్లో లక్షలు విలువ చేసే కారు బుగ్గిపాలైంది. పార్కింగ్‌లో ఉన్న ఆడీ కారును తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పుణేలోని ధాయారి ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుపై ఏదో విసిరారు. ఆపై నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. క్షణాల్లోనే కారు బుగ్గి పాలైపోయింది. అయితే ఈ ఘటనలో పక్కనే ఉన్న మారుతీ సుజుకీ, హోండా సిటీ కారులు కూడా దహనం అయ్యాయి. కారు యాజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బేస్మెంట్లోని సీసీ టీవీ ఫుటేజీలో ఆ దృశ్యాలు నమోదు అయ్యాయి. ఆడీ క్యూ-5 మోడల్‌కు చెందిన ఆ కారు ఖరీదు రూ. 50లక్షలు పైగానే తేలింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వ్యక్తి సజీవ దహనం..
-
ఎవరైనా కొట్టి ఇంట్లో వేసి నిప్పుపెట్టారా..?
సాక్షి, చిత్తూరు: అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సజీవ దహనమైన ఘటన చిత్తూరు జిల్లా బోయకొండ సమీపంలోని భవాని నగర్లో చోటుచేసుకుంది. భవానీ నగర్‌కి చెందిన శ్రీరాములు కుమారుడు శివ(35). ఇతను అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తూ భక్తులు ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతున్నాడు. వారం రోజుల క్రితం శివ భార్య అనిత పిల్లలతో కలిసి తిరుపతికి వెళ్లింది. అతని ఇంట్లో నుంచి మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున అరుపులు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బయట తాళం వేసే ఉండడంతో తలుపులు తీసెలోపు శివ నిర్జీవంగా పడి ఉన్నాడని వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. శివను ఎవరైనా కొట్టి ఇంట్లో వేసి నిప్పుపెట్టారా, ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తమిళనాడులో మరో స్వాతి..
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ లో నెల క్రితం ప్రేమించలేందంటూ టెకీ స్వాతిని నరికిచంపిన ఘటన మరువకముందే విల్లుపురం జిల్లాలో శనివారం మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదంటూ ఓ ఉన్మాది ఆమెకు నిప్పంటించబోయాడు. సెంథిల్(32) ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా నవీన అనే అమ్మాయి వెనుకతిరిగాడు. ఈ సమయంలో అతన్ని రైలు ఢీకొనడంతో యాక్సిడెంట్ లో కుడి చేయి, కుడి కాలు పోయాయి. కాలు, చేయి లేకపోవడంతో నవీన తనను రెజెక్ట్ చేస్తుందని భావించిన అతను.. ఆమెను అంతమొందించాలనుకున్నాడు. శనివారం సెంథిల్ నవీన ఇంటిబయట దాక్కున్నాడు. నవీన్ ఇంట్లో పెద్దలందరూ వెళ్లిపోయే వరకూ వెయిట్ చేశాడు. వాళ్లు ఇల్లు వదిలి బయటకు వెళ్లగానే లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో నవీనతో పాటు ఉన్న ఆమె సోదరి, సోదరులను కత్తి చూపించి బెదిరించాడు. మొదట నవీనకు నిప్పంటిచే ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడంతో, తన మీద తానే పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పంటించుకుని నవీనకు కూడా అంటించాడు. ఈలోగా ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తుండంతో స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడారు. అప్పటికే సెంథిల్ అక్కడికక్కడే కాలిబూడిదయ్యాడు. గాయాలపాలైన నవీనను పాండిచ్చేరిలోని జింపర్ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో నవీన ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంది. -
10 నెలల శిశువుకు నిప్పంటించిన తండ్రి
బరాబన్కీ(యూపీ): కట్టుకున్న భార్య, కన్న కొడుకును ఓ కసాయి అత్యంత కిరాతకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటనలో 10 నెలల వయసున్న శిశువు మృతి చెందగా, భార్య కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పోందుతోంది. వివాహేతర సంబంధాన్ని నిలదీసినందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాలు...రాంపూర్ గ్రామానికి చెందిన పీకూ యాదవ్‌కు రింకూతో వివాహమైంది. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. వివాహేతర సంబంధం విషయంమై పీకూ యాదవ్‌ను రింకూ నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన పీకూ యాదవ్ భార్యతోపాటూ 10 నెలల కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అయితే బాబు అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రగాయలతో రింకూ ఆస్పత్రిలో చికిత్స పోందుతుంది. బాబు, రింకూను కాపాడడానికి యత్నించిన నిందితుడి తల్లి, సోదరుడికి కూడా నిప్పు అంటుకోవడంతో వారిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనం
కాంచీపురం సమీపాన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనమైంది. ఈమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిగా పోలీసులు కనుగొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాంచీ పురం సమీపాన పరుత్తికులం గ్రామంలో కాంచీపురం - చెంగల్పట్టు రైల్వే పట్టాల పక్కన కాలిపోయిన స్థితిలో 20 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కాంచీపురం డీఎస్పీ బాలసుందరం, ఇన్స్పెక్టర్ లక్ష్మీపతి, తాలుకా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం లభించిన ప్రాంతం నుంచి పది అడుగుల దూరంలో రైల్వే లైన్‌కు దిగువ భాగాన ఒక బ్యాంక్ పాస్ బుక్ చినిగిపోయిన స్థితిలో కనిపించింది. పక్కనే ఏటీఎం కార్డు లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలావుండగా ఆ యువతి వివరాలు రాబట్టారు. ఆమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని. ఈమె పేరు షకీనా(23). కాంచీపురం సమీపాన గల పొన్నేరికరై ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆమె సొంత ఊరు దిండుగల్ జిల్లా ఇలాపటి గ్రామం. కళాశాలలోని హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. ఆదివారం ఉదయం ఆమె హఠాత్తుగా మాయమైనట్లు తెలిసింది. దీని తర్వాత ప్రస్తుతం శవంగా కనుగొన్నారు. ఆమె కాలిపోయిన స్థితిలో ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన ప్రాంతంలో ఒక లేఖ కూడా లభించినట్లు తెలుస్తోంది. అందులో కళాశాల ఫీజును చెల్లించలేక పోతున్నందున మనోవేదనతో ఉన్నట్లు విద్యార్థిని రాసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవాలను తారుమారుచేసేందుకు హంతుకుడు ఈ లేఖను రాసి ఉండవచ్చని భావిస్తున్నారు. -
ప్రేమికుడి దాడిలో గాయపడిన అరుణ కన్నుమూత
-
ప్రేమికుడి దాడిలో గాయపడిన అరుణ కన్నుమూత
రెండేళ్లుగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుందాం అని అడిగిన పాపానికి ఆ బంగారు తల్లిని నిలువునా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఐదు రోజుల పాటు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడిన ఆ అమ్మాయి.. ఇక ఈ పాపిష్టి లోకంలో తానుండలేనంటూ వెళ్లిపోయింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూసింది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఆమెకు దర్వేశిపురానికి చెందిన సైదులుతో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోమంటే ఏదో కారణం చెబుతూ వాయిదా వేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఫైనాన్స్ కార్యాలయంలోకి అరుణ వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీసింది. దీంతో అతను కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని ఆమె బావకు ఫోన్ చేసి తెలిపాడు. తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినా, మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదు రోజుల పాటు నరకం అనుభవించిన అరుణ.. ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది.