
లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. లైంగిక దాడి జరిగిందనే అవమానంతో మైనర్ బాలిక తనకు తాను నిప్పంటించుకున్న ఘటన అలీఘఢ్‌లో వెలుగుచూసింది. బాధితురాలిపై ఇటీవల ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. తనపై నిందితులు ఒడిగట్టిన దారుణాన్ని తండ్రికి చెప్పుకున్న కొద్ది క్షణాలకే బాలిక తనకు తాను నిప్పటించుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలో న్యాయం కోరుతూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వెలుపల తమను తాము కాల్చుకుని ఆత్మాహుతికి పాల్పడేందుకు ప్రయత్నించిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించింది. ఉన్నావ్ లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలను సీబీఐ నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment