మహిళా లెక్చరర్‌ను వెంబడించి.. | Woman College Teacher Set On Fire By Stalker | Sakshi

మహిళా లెక్చరర్‌ను వెంబడించి..

Feb 3 2020 6:28 PM | Updated on Feb 3 2020 6:34 PM

Woman College Teacher Set On Fire By Stalker - Sakshi

మహిళా లెక్చరర్‌ను వెంటాడిన పోకిరీ ఆమెకు నిప్పంటించిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.

ముంబై : మహారాష్ట్రలోని వార్ధాలో కాలేజ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న మహిళకు ఓ పోకిరి నిప్పు పెట్టిన ఘటన వెలుగుచూసింది. సోమవారం ఉదయం మహిళ కాలేజ్‌కు వెళుతుండగా రెండేళ్లుగా ఆమె వెంటపడుతున్న నిందితుడు విక్కీ నగ్రారే ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మహిళా లెక్చరర్‌కు నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. కాగా బాధితురాలికి నిప్పంటించి నిందితుడు పరారవడంతో గమనించిన స్ధానికులు నీటితో మంటలను ఆర్పి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు నాగపూర్‌లోని ఆరంజ్‌ సిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీస్‌ అధికారులు వెల్లడించారు.నిందితుడు వివాహితుడని అతడికి ఏడునెలల కుమారుడు ఉన్నాడని, రెండేళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

చదవండి : పెళ్లికి నిరాకరణ, రెచ్చిపోయిన ప్రేమోన్మాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement