Google Get Rid Of Stalkerware Ads Promoting Spying On Spouse: ప్రస్తుత టెక్నాలజీతో ప్రతిదీ సాధ్యమే..! టెక్నాలజీను మంచి మార్గంలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..! అదే చెడు కోసం వాడితే భారీ ముప్పునే కల్గిస్తుంది. కొంత మంది వీపరిత బుద్దితో సాంకేతికతను దుర్వినియోగం కోసం వాడే వారు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఉపయోగించి తమ భాగస్వాములపై నిఘా పెట్టడం కోసం పలువురు స్టాకర్వేర్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే కొంత మందికి అదునుగా మారి ఆయా వ్యక్తుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా తమ జీవిత భాగస్వామిపై నిఘా పెట్టేందుకు స్టాకర్వేర్ యాప్స్ భారీగానే అందుబాటులో ఉన్నాయి. ఈ స్టాకర్వేర్ యాప్స్ ద్వారా జీవిత భాగస్వామి ఫోన్ మెసేజ్‌లు, కాల్ లాగ్‌లు, లొకేషన్, ఇతర వ్యక్తిగత కార్యకలాపాలను తెలుసుకుంటున్నారు. ఈ స్టాకర్వేర్ యాప్స్ ఫోన్‌లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం.
చదవండి: మొన్న ఫేస్‌బుక్ డౌన్..! ఇప్పుడు జీ మెయిల్..!
స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ కీలక నిర్ణయం..!
తాజాగా స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాకర్వేర్ యాప్స్‌ను ప్రోత్సహించే యాప్స్‌పై గూగుల్ ఉక్కుపాదం మోపింది. అంతేకాకుండా స్టాకర్వేర్ యాడ్స్‌ను కూడా గూగుల్ యాడ్స్‌లో కన్పించకుండా చేసింది. జీవిత భాగస్వాములపై నిఘా పెట్టే యాప్స్ గూగుల్ కఠినవైఖరిని అవలంభిస్తోందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. కొన్ని యాప్స్ అనేక పద్దతులను ఉపయోగించి స్టాకర్వేర్ యాప్స్‌ను ప్లేస్టోర్‌లో చొప్పించే ప్రయత్నాలను చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు.
భారత్‌లో నిఘా ఎక్కువే...!
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కాస్పర్‌స్కై నివేదిక ప్రకారం...స్టాకర్వేర్ యాప్స్‌తో భారత్‌లో సుమారు 4627 మంది ప్రభావితమైనట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా స్టాకర్వేర్ యాప్స్‌తో 2019లో 67,500 మంది, 2020లో 53,870 మంది ప్రభావితమయ్యారు.
చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!
Comments
Please login to add a commentAdd a comment