గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్‌లను తొలగించే చర్యను అనుమతించలేమని కేంద్రం తెలిపింది. టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్‌ల ప్రతినిధులను సోమవారం (మార్చి 4) రావాలని ఐటి మంత్రి 'అశ్విని వైష్ణవ్' ఆహ్వానించారు.
సర్వీస్ ఫీజు చెల్లింపులపై వివాదాలను పేర్కొంటూ గూగుల్ నిన్న (మార్చి 1) భారతీయ కంపెనీల యాప్‌లను తొలగించడానికి సిద్ధమైంది. ఇందులో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్‌అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. అయితే గూగుల్ చేపట్టిన ఈ చర్యకు కంపెనీలు అసహనం వ్యక్తం చేశాయి.
అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, గూగుల్ అధికారులతో చర్చ జరిపిన తరువాత సానుకూలమైన ఫలితం రావచ్చని, తప్పకుండా ఈ కంపెనీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి 'అశ్విని వైష్ణవ్' వెల్లడించారు.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్‌కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం!
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా యాప్ డెవలపర్లు నిబంధలను ఉల్లగించినట్లు, ఈ కారణంగానే ఆ యాప్‌లను తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్‌లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం త్వరలో ఐటి మంత్రిని కలిసిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment