సర్వీసు ఫీజు చెల్లింపులపై వివాదం తలెత్తిన నేపథ్యంలో భారత్‌లోని తన ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్‌లను గూగుల్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే షార్క్ ట్యాంక్ జడ్జ్, పీపుల్ గ్రూప్ షాదీ.కామ్ వ్యవస్థాపకుడు,సీఈఓ అనుపమ్ మిట్టల్ గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియా ఇంటర్నెట్‌కు ఈరోజు చీకటి రోజు.సర్వీసు ఫీజు చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ గూగుల్ యాప్స్‌ను తొలగించింది. సేవ్ స్టార్టప్ అంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎక్స్.కామ్‌లో ట్యాగ్ చేశారు.
Today is a dark day for India Internet. Google has delisted major apps from its app store even though legal hearings are underway @CCI_India & @indSupremeCourt Their false narratives & audacity show they have little regard for 🇮🇳 Make no mistake - this is the new Digital East…
— Anupam Mittal (@AnupamMittal) March 1, 2024
గూగుల్ యాప్స్ తొలగింపు అంశంలో సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్లేస్టోర్‌లో డీలిస్ట్ చేసిన యాప్స్‌ని రీస్టోర్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment