Play Store
-
ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..
ప్రభుత్వ మొబైల్ యాప్‌లకు ప్రత్యేకమైన లేబుల్ వాడనున్నారు. ఈమేరకు ప్లేస్టోర్‌లో ప్రభుత్వ యాప్‌లకు లేబుల్వాడేందుకు గూగుల్ సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలతోపాటు ఓటీటీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ..దాదాపు డిజిటల్‌గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది.ప్లేస్టోర్‌లో లక్షల్లో యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్..ఏది కాదో అనే అంశంపై స్పష్టత కరవవుతోంది. కొన్ని ప్రభుత్వ యాప్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మన వివరాలిస్తున్న యాప్ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా..లేదా అనే విషయాన్ని ధ్రువపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్లేస్టోర్‌లోని ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్ ఉపయోగించనున్నారు. దాంతో ఆ యాప్‌లను వెంటనే గుర్తించే వీలుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు యాప్‌లో లేబుల్ ఉంచేందుకు గూగుల్ సైతం సిద్ధమైందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..‘ఎక్స్’ (ట్విటర్)లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది. -
Play Store pricing policy: గూగుల్‌కు సీసీఐ షాక్
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ ధరల విధానం విషయంలో పోటీ వ్యతిరేక పద్ధతులను పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం ఆదేశించింది. గూగుల్ అనుసరిస్తున్న చెల్లింపు విధానాలు యాప్ డెవలపర్స్, పేమెంట్ ప్రాసెసర్స్, వినియోగదారులతో సహా అనేక మంది వాటాదారులపై ప్రభావం చూపుతున్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆధిపత్య స్థానం దురి్వనియోగానికి సంబంధించిన పోటీ చట్టంలోని సెక్షన్ 4ను గూగుల్ ఉల్లంఘించిందని సీసీఐ ప్రాథమికంగా గుర్తించింది. పీపుల్ ఇంటెరాక్టివ్ ఇండియా (షాదీ.కామ్), మీబిగో ల్యాబ్స్ (కుకు ఎఫ్ఎం), ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్), ఇండియన్ డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్ (ఐడీఎంఐఎఫ్) ఫిర్యాదు మేరకు సీసీఐ తాజా ఆదేశాలు వెలువరించింది. గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను తీసివేసిన రెండు వారాల లోపే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. సరీ్వస్ ఫీజు చెల్లింపులపై వివాదం కారణంగా మార్చి 1న భారత్‌లోని ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను గూగుల్ తొలగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో కొన్ని రోజుల్లోనే యాప్స్‌ను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
‘గూగుల్ గుత్తాధిపత్యం’.. యాప్‌ల తొలగింపు.. పునరుద్ధరణ
సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి గూగుల్ పది భారతీయ మొబైల్ యాప్‌లను తొలగించిన విషయం తెలిసిందే. దాంతో పలు అంకుర సంస్థలకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమావేశమయ్యారు. గూగుల్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన మొబైల్ యాప్‌లకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర మంత్రులు సోమవారం పలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎటువంటి పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. యాప్‌ల విషయంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని భారత కంపెనీలు ఆరోపిస్తున్నాయి. గూగుల్ కారణంగా సమస్యలను లేవనెత్తిన సంస్థలు, ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరాయి. ఇన్-యాప్ చెల్లింపులపై గూగుల్ 11-26 శాతం ఫీజు వసూలు చేస్తుండటంతో ఈ వివాదం మొదలైంది. యాంటీ కాంపిటీషన్ సంస్థ సీసీఐ ఇంతకు ముందు 15-30 శాతం బిల్లింగ్ వ్యవస్థను తొలగించింది. కంపెనీలకు సుప్రీంకోర్టు ఉపశమనం ఇవ్వకపోవడంతో ఫీజు రద్దుచేస్తున్న సంస్థలను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అనంతరం ప్రభుత్వ జోక్యంతో పునరుద్ధరించింది. సమావేశ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. భారత యాప్ డెవలపర్స్ సంఘం అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్)తో చంద్రశేఖర్ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. తొలగించిన యాప్‌లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్‌లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. -
గూగుల్ చర్యను అనుమతించలేము.. యాప్స్ తొలగింపుపై కేంద్రం
గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్‌లను తొలగించే చర్యను అనుమతించలేమని కేంద్రం తెలిపింది. టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్‌ల ప్రతినిధులను సోమవారం (మార్చి 4) రావాలని ఐటి మంత్రి 'అశ్విని వైష్ణవ్' ఆహ్వానించారు. సర్వీస్ ఫీజు చెల్లింపులపై వివాదాలను పేర్కొంటూ గూగుల్ నిన్న (మార్చి 1) భారతీయ కంపెనీల యాప్‌లను తొలగించడానికి సిద్ధమైంది. ఇందులో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. అయితే గూగుల్ చేపట్టిన ఈ చర్యకు కంపెనీలు అసహనం వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, గూగుల్ అధికారులతో చర్చ జరిపిన తరువాత సానుకూలమైన ఫలితం రావచ్చని, తప్పకుండా ఈ కంపెనీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి 'అశ్విని వైష్ణవ్' వెల్లడించారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం! సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా యాప్ డెవలపర్లు నిబంధలను ఉల్లగించినట్లు, ఈ కారణంగానే ఆ యాప్‌లను తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం త్వరలో ఐటి మంత్రిని కలిసిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలుస్తుంది. -
గూగుల్‌పై మిట్టల్ ఆగ్రహం.. యాప్స్ అన్నీ రీస్టోర్ చేయాల్సిందే!
సర్వీసు ఫీజు చెల్లింపులపై వివాదం తలెత్తిన నేపథ్యంలో భారత్‌లోని తన ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్‌లను గూగుల్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే షార్క్ ట్యాంక్ జడ్జ్, పీపుల్ గ్రూప్ షాదీ.కామ్ వ్యవస్థాపకుడు,సీఈఓ అనుపమ్ మిట్టల్ గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నెట్కు ఈరోజు చీకటి రోజు.సర్వీసు ఫీజు చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ గూగుల్ యాప్స్‌ను తొలగించింది. సేవ్ స్టార్టప్ అంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎక్స్.కామ్‌లో ట్యాగ్ చేశారు. Today is a dark day for India Internet. Google has delisted major apps from its app store even though legal hearings are underway @CCI_India & @indSupremeCourt Their false narratives & audacity show they have little regard for 🇮🇳 Make no mistake - this is the new Digital East… — Anupam Mittal (@AnupamMittal) March 1, 2024 గూగుల్ యాప్స్ తొలగింపు అంశంలో సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్లేస్టోర్‌లో డీలిస్ట్ చేసిన యాప్స్‌ని రీస్టోర్ చేయాలని డిమాండ్ చేశారు. -
10 భారతీయ కంపెనీ యాప్‌లపై కన్నెర్రజేసిన గూగుల్!
టెక్ దిగ్గజం గూగుల్ (Google) పది భారతీయ కంపెనీల యాప్‌లపై చర్య తీసుకుంటున్నట్లు ఈ రోజు (మార్చి 1) వెల్లడించింది. ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్లింగ్ విధానాన్ని పాటించని కారణంగా కంపెనీ వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ తొలగించనున్న యాప్‌ల జాబితాలో మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారమ్ షాదీ.కామ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ALTT, స్టేజ్ మాత్రమే కాకుండా.. డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. ఈ యాప్స్ అన్నీ కూడా ప్లే స్టోర్‌కు ఫీజులు చెల్లించకపోవడం వల్ల వీటిని పూర్తిగా తొలగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యాప్ డెవలపర్లు కూడా గూగుల్ మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఇందులో గూగుల్ గేట్ కీపింగ్ చార్జీలు, ఎక్స్ట్రా కమీషన్స్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. యాప్ డెవలపర్ల నుంచి తక్కువ ఫీజులే వసూలు చేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ప్లేలో ప్రస్తుతం 200000 మంది భారతీయ యాప్ డెవలపర్లు తమ విధానాలకు కట్టుబడి ఉన్నారని, సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌ను నిర్ధారిస్తున్నారని కంపెనీ తెలిపింది. అయితే 10 కంపెనీలు మాత్రమే తమ నియమాలను పెడచెవిన పెడుతున్నాయని, ఈ కారణంగానే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇదీ చదవండి: అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్: పాప్ సింగర్ ఒక్క పర్ఫామెన్స్కే అన్ని కోట్లా? -
కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే..
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5800 కోట్లు) పరిహారాన్ని చెల్లించనుంది. అమెరికా రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు, అటార్నీ జనరల్ దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది. దాంతోపాటు ప్లే స్టోర్‌లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్‌పై గూగుల్ కొన్ని మార్గాల్లో అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కస్టమర్లు ఫిర్యాదులో ఆరోపించారు. కొన్ని అప్లికేషన్ల లావాదేవీలపై 30 శాతం కమిషన్ తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆండ్రాయిడ్ యాప్ ధరలను పెంచినట్లు యూఎస్ అటార్నీ జనరల్ ఆరోపించారు. యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధిస్తుందని చెప్పారు. ఈ ఫిర్యాదును విచారించిన అనంతరం అమెరికా కోర్టు తుది తీర్పును వెలువరించింది. కస్టమర్ల నుంచి చట్ట విరుద్ధంగా కంపెనీకి సమకూరిన నగదును వారికి సెటిల్ చేయాలని ఆదేశించింది. దాంతో గూగుల్ 700 మిలియన్ డాలర్లు(రూ.5800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదీ చదవండి: చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..? యాప్‌ల కొనుగోళ్లకు అధికమొత్తంలో చెల్లించిన వినియోగదారులకు 630 మిలియన్ డాలర్లు(రూ.5200 కోట్లు) అందనున్నాయి. 70 మిలియన్ డాలర్ల(రూ.600 కోట్లు) రాష్ట్రాలకు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో కంపెనీ తన ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌కు సంబంధించి మార్పులు తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా?
మాల్వేర్ దాడుల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించాలనే నేపథ్యంలో గూగుల్ ఏకంగా 22 యాప్స్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్ వినియోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు పరిశోధనలో తెలియడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కొన్ని యాప్స్ కారణంగా మొబైల్ ఛార్జింగ్ వేగంగా అయిపోవడంతో పాటు.. డేటా కూడా వేగంగా ఖాళీ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు వీటిని మాన్యువల్‌గా తొలగించాలి. ఇప్పటికే ఈ యాప్స్ 2.5 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. వీరందరూ ఈ యాప్స్ వీలైనంత త్వరగా తొలగించాలని సూచిస్తున్నారు. ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల సంపద- సన్యాసుల్లో కలిసిపోయారు! గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన యాప్స్ జాబితాలో బారో టీవీ, DMB యాప్, Jihosoft మొబైల్ రికవరీ యాప్, మ్యూజిక్ బడా, మ్యూజిక్ డౌన్లోడర్, బారో డిజిటల్ గిఫ్టింగ్ యాప్, న్యూ లైవ్, రింగ్టోన్స్ ఫ్రీ మ్యూజిక్, స్ట్రీమ్కార్ లైవ్ స్ట్రీమింగ్, లైవ్‌ప్లే, OnAir ఎయిర్‌లైన్ మేనేజర్, మ్యూజిక్ ప్లేయర్ - ఆడియో ప్లేయర్, AT ప్లేయర్, ట్రోట్ మ్యూజిక్ బాక్స్-ఫ్రీ ట్రోట్ మ్యూజిక్ ప్లేయర్ మొదలైనవి ఉన్నాయి. -
లాభాల వలవేసి.. డబ్బు లాగేసి..
కర్నూలు: ముచ్చటైన ఆఫర్లు.. కళ్లెదుటే లాభాలు.. చుట్టుపక్కల వాళ్లను జతచేస్తే బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు. అకౌంట్లోకి తేరగా వచ్చి పడుతున్న డబ్బును చూసి అందరికీ ఆశ కలిగింది. ఒకరిని చూసి మరొకరుగా చేరుతుండటంతో కొత్త స్కీమ్‌లు తెరపైకి వచ్చాయి. రూ.100 కడితే రూ.2 వేల ఆదాయం వస్తుండటంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది. కొత్త అకౌంట్ల సంఖ్య పెరగడంతోపాటు వ్యాపారం రూ.కోట్లకు చేరింది. అంతా సజావుగా సాగుతున్నట్టు అనిపించినా ఒకానొక రాత్రి ఆ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్లేస్టోర్‌లో పుట్టుకొచ్చి .. ప్లేస్టోర్ వేదికగా పుట్టుకొచ్చిన కెనడియన్ సోలార్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఆన్లైన్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఐదు నెలల కాలంలో అందమైన ఆఫర్లతో వేలాది మందిని బుట్టలో వేసుకుంది. కాఫీ తాగుతున్న విదేశీ యువతి ఫొటోను డీపీగా పెట్టుకుని 97904 01505, 44 7467 135 221 నంబర్లతో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఖాతాదారులకు కంపెనీ దగ్గరైంది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో ఒకరి తర్వాత ఒకరు లాభాలకు ఆకర్షితులయ్యారు. మొదట్లో డబ్బు చెల్లించడమే తరువాయి.. వెంటవెంటనే డబ్బు వస్తుండటంతో నమ్మకంతోపాటు ఖాతాదారుల సంఖ్య కూడా పెరిగిపోయింది. కొత్త స్కీమ్‌లతో విస్తరణ మొదట 45 రోజుల స్కీమ్‌తో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత నెల రోజులు.. 15 రోజులు.. 10 రోజులు.. 3 రోజులు.. చివరగా ఒక్క రోజు కాల వ్యవధితోనూ స్కీమ్‌లు నడిపింది. 45 రోజుల స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేసిన వాళ్లకు వెనువెంటనే ఖాతాల్లోకి డబ్బు చేరుతుండటం.. ఆ వివరాలను చూసి మరికొందరు ఆ స్కీమ్‌లలో చేరడం జరిగిపోయింది. పది రోజుల స్కీమ్‌లో ఒకసారి రూ.47 వేలు కడితే.. 10 రోజుల వరకు రోజూ రూ.21,374 చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఒక్క రోజు స్కీమ్ (ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్)లో రూ.13,500 చెల్లిస్తే అదే రోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత రూ.29,700 చెల్లిస్తామని కంపెనీ నమ్మబలికింది. రెఫర్ చేస్తే బోనస్ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు చైన్ లింకును తెరపైకి తెచ్చింది. ఒకరికి లింకు పంపిస్తే బోనస్‌ను నిర్ణయించింది. ఆ లింకు డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి రూ.13,500 చెల్లిస్తే.. చేర్పించిన వ్యక్తికి రూ.1,800 బోనస్, 700 పాయింట్లు, అదనంగా రూ.600 సబ్సిడీ బోనస్ కలిపి రూ.3,500 చెల్లిస్తుంది. ఇలా జాయిన్ చేసిన వారి వివరాలను వాట్సాప్ చాట్‌లో నమోదు చేస్తే ఒక ప్రోమో కోడ్ వస్తుంది. ఆ కోడ్‌ను తమ వద్దనున్న యాప్‌లో రివార్డు కాలమ్‌లో ఎంటర్ చేయగానే బోనస్ మొత్తం అకౌంట్లో జమ అవుతుంది. చీకట్లో కలిసిపోయింది. నమ్మకమే పెట్టుబడిగా ఏర్పాటైన ఈ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. ఎంతగా అంటే.. ప్లే స్టోర్‌లో కూడా సమాచారం లేకుండాపోయింది. చివరకు సెల్ఫోన్ల నుంచి కూడా యాప్ దానంతటదే డిలీట్ అయ్యిందంటే కంపెనీ నిర్వాహకుల తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. స్పందన’లో ఫిర్యాదు కెనడియన్ సోలార్ యాప్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి ఇస్తామని చెప్పి మోసం చేశారని కర్నూలు నగరం బుధవారపుపేటకు చెందిన అర్ఫత్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఈ నెల 17న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రూ.2.85 లక్షలు ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తామని నమ్మించి మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
తస్మాత్ జాగ్రత్త! .. గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్ కలకలం
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరస్తులు తెలివి మీరిపోతున్నారు. ఈజీ మనీ పేరుతో యూజర్ల జేబును ఖాళీ చేసేందుకు అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత ఏడాది విడుదలైన చాట్‌జీపీటీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఏఐ టూల్‌తో సైబర్ నేరస్తులు ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లలో మాల్వేర్ను పంపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లో సొమ్ము కాజేస్తున్నారు. లేదంటే యూజర్ల డేటాను డార్క్ వెబ్‌లో సొమ్ము చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ పరిశోధకులు చాట్‌జీపీటీ ఫేక్ యాప్స్‌లలో మీటర్ప్రెటర్ ట్రోజన్ అనే మాల్వేర్ను గుర్తించారు. ఈ మాల్వేర్ వేరియంట్లు ప్రత్యేకంగా చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్ ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. కాబట్టి, ఏఐ యాప్స్ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో సైబర్ నేరస్తులు ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్ సాయంతో పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన కాంటాక్ట్ నెంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ మెసేజ్‌లను క్లిక్ చేయడం ద్వారా మాల్వేర్లు సదరు యూజర్ల ఫోన్లలోకి ఈజీగా చొరబడుతుంది. తద్వారా డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతున్న కేటుగాళ్లు బాధితుల్ని బెదిరించి వారికి కావాల్సినంత డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరహా ఫోన్ నెంబర్లనే మాల్వేర్ క్రియేటర్లు, స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ టెక్నాలజీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు. డౌన్లోడ్ చేసుకునే సమయంలో రివ్యూలతో పాటు గతంలో ఆ యాప్‌ను ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో గుర్తించాలని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఫేక్ యాప్స్ జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు. -
ఫేక్ యాప్స్ ను ఏరిపారేస్తామంటున్న గూగుల్
-
స్మార్ట్ ఫోనుల్లో చాలా మంది చేసే తప్పులు ఇవే.. మరి ఏం చేయాలి?
గీతిక (పేరుమార్చడమైనది) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ మధ్య తన క్లాస్మేట్ (నందు) చేసే మెసేజ్‌లు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అందుకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి తనకే పోస్ట్ చేస్తున్నాడు. ఎవరికైనా చెబుదామంటే ఎవరూ నమ్మరు. పైగా తననే నిందిస్తారు. తను ఊళ్లో లేకపోయినా తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తిరిగి తనకే పంపిస్తున్నాడు. ఏమైనా అంటే, నాకు అన్నీ తెలుసు.. అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇది ఇబ్బందికరంగా ఉండటమే కాదు భయంగానూ ఉంటోంది. గీతిక లాగే చాలా మంది ఇబ్బందులకు లోనయ్యే సమస్య ఇది. తమ ఫోన్ హ్యాక్ అయిందనే విషయాన్ని ఏ మాత్రం పసిగట్టలేరు. అంత స్మార్ట్‌గా మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనుల్లో దొంగలు దూరుతున్నారు జాగ్రత్త. స్మార్ట్ ఫోన్లలో చాలా మంది చేసే కొన్ని తప్పులు ఏంటంటే.. ♦ మనం ఏం చేస్తున్నామో మిగతా అంతా చూసేలా చేయడం. ♦ అలెక్సా వంటి టూల్స్ వాటంతట అవే రన్ అయ్యేలా చేయడం ♦ ఎప్పుడూ యాప్స్ సైన్ ఇన్లోనే ఉండటం ♦ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఏదైనా ఓకే చేయడం. వెంటనే తెలుసుకోవాలంటే... ♦ ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే.. సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్లు (ఏదైనా తెలియని యాప్‌లో స్పై, మానిటర్, ట్రాక్ ట్రోజన్ .. మొదలైన పేర్లు ఉన్నాయేమో చెక్ చేయండి. ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్, ప్లేస్ – గూగుల్ ప్లే, ప్రొటెక్షన్ స్కాన్ చేయండి. ♦ ఐవోఎస్ వినియోగదారులు అయితే.. అన్ని పాస్‌వర్డ్‌లను మార్చాలి. నెట్వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయాలి. ఐఓఎస్ రీసెంట్ వెర్షన్‌ను అప్డేట్ చేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో స్నూపింగ్‌కి అనుమతించేవి... ♦ పిల్లలు వాడుతున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా వారు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడానికి ట్రాక్ చేయగల యాప్స్ ఉంటాయి. ♦ కంపెనీ గ్యాడ్జెట్లలో ఇన్స్టాల్ చేయబడిన మానిటరింగ్ సాఫ్ట్వేర్, వాటిని కంపెనీ ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి కాబట్టి ఈ హక్కును రిజర్వ్ చేసుకోవచ్చు. ♦ ఆర్డర్ డెలివరీని ట్రాక్ చేయడం, డెలివరీని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిఘా అవసరం కావచ్చు. కొన్ని రకాల సమస్యలు ♦ హాని కలిగించే యాప్స్, స్పై వేర్, పబ్లిక్ వైఫై, ఉపయోగించని యాప్స్, ఫిషింగ్, పాస్వర్డ్ సెక్యూరిటీ లేనివి .. వంటి వాటి వల్ల సమస్యలు కలగవచ్చు. ముఖ్యమైన పోర్టల్స్ ♦ మీ ఫోన్ IMEI నెంబర్ని https://www.imei.info/ చెక్ చేయండి. ♦ మీ పేరుపై ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో చెక్ చేసుకోవడానికి https://tafcop.dgtelecom.gov.in సైబర్ టాక్ ఎలా చెక్ చేయాలి? ♦ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్స్– కెమెరా/ మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్ ఉందో లేదో తనిఖీ చేయండి) ♦ యాపిల్ ఫోన్ అయితే సెట్టింగ్స్– ప్రైవసీ–కెమెరా/మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయాలి) తెలుసుకోవడం ఎలా..? ♦ ఫోన్ చాలా స్లో అవుతుంది. ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ♦ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. ♦ యూ ట్యూబ్ లేదా ఆన్లైన్ వీడియోలు బఫర్ అవ్వవు. ♦వెబ్ పేజీలు లోడ్ అవడానికి టైమ్ పడుతుంది. ♦ ప్రోగ్రామ్స్, యాప్స్ క్రాష్ అవుతాయి. ♦ గాడ్జెట్ సడెన్‌గా రీస్టార్ట్ అవుతుంది. ♦ చిత్రమైన, ఊహించని మెసేజీలు వస్తుంటాయి. ఏం చేయాలి? ♦ మీ ఫోన్ పరిమితులను మీకు మీరుగా నిర్దేశించుకోండి. ♦ ఐఓఎస్ యాప్స్‌ని వెంటనే అప్డేట్ చేయండి. ♦ ఉపయోగంలో లేనప్పుడు మీ గ్యాడ్జెట్స్‌ను లాక్ చేసి ఉంచండి. ♦ వైఫై, బ్లూ టూత్ వాడకంలో జాగ్రత్తలు పాటించండి. ♦ బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాల కోసం రెండురకాలప్రామాణీకరణలను పాటించండి. ♦ డేటాను తరచూ బ్యాకప్ చేయండి. ♦ సెక్యూరిటీ యాంటీవైరస్, మాల్వేర్ అప్లికేషన్లను ఉపయోగించండి ♦ మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఎంచుకోండి. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
టెక్ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్
-
వారం రోజుల వ్యవధిలో.. గూగుల్‌కు సీసీఐ రూ. 936.44 కోట్ల ఫైన్
వారం రోజుల వ్యవధిలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కమిషన్ ఆఫ్ కాంపిటీషన్ (సీసీఐ) రూ. 936.44 కోట్ల ఫైన్ విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విభాగంలో గూగుల్ తన గుత్తాదిపత్యాన్ని గూగుల్‌కు సీసీఐ రూ.1,338 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాలు మానుకోవాలని హితువు పలికింది. ఆ జరిమానాపై గూగుల్ స్పందించింది. సీసీఐ తమపై విధించిన జరిమానా భారతీయ వినియోగదారులు, వ్యాపారానికి ఎదురు దెబ్బ అని గూగుల్ పేర్కొంది. సీసీఐ తీర్పును సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తమ ఆండ్రాయిడ్ అనేక అవకాశాలు సృష్టించిందని గూగుల్ తెలిపింది. దాంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది వ్యాపారాలు విజయానికి మద్దతుగా నిలిచిందని పేర్కొంది. సీసీఐ నిర్ణయం భారత్‌లో మొబైల్ డివైజ్‌ల ధరలు పెరిగేందుకు దారి తీస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. Case Nos. 07 of 2020, 14 of 2021 and 35 of 2021 CCI imposes a monetary penalty of ₹ 936.44 Crore on Google for anti-competitive practices in relation to its Play Store policies. Read the full order here: https://t.co/GDR820ffYg Press release: https://t.co/7HEPJeHVK3#Antitrust pic.twitter.com/TbTa6vbCXl — CCI (@CCI_India) October 25, 2022 ఈ తరుణంలో మరోమారు సీసీఐ..గూగుల్‌కు భారీ ఎత్తున ఫైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది. మార్కెట్లో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్లేస్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తుందని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో గూగుల్‌కు పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని ఫైన్ విధిస్తున్నట్లు తెలిపింది. చదవండి👉 ‘టిమ్‌కుక్’ను ట్రోల్ చేయాలనుకుంది, పాపం..అడ్డంగా దొరికిపోయిన గూగుల్? -
ఆ యాప్స్ ను అన్ ఇన్స్టాల్ చెయ్యకపోతే ..!
-
గూగుల్ హెచ్చరికలు, ఈ 16 యాప్స్ చాలా డేంజర్..వెంటనే డిలీట్ చేసుకోండి!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ వినియోగదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రమాదకరమైన 16 యాప్స్‌ను తొలగించినట్లు తెలిపింది. ఆ యాప్స్‌ను యూజర్లు వినియోగిస్తున్నట్లైతే వెంటనే వాటిని డిలీట్ చేయాలని కోరింది బ్యాటరీని నాశనం చేయడం, డేటా వినియోగం ఎక్కువ అయ్యేలా చేసే 16 యాప్స్ ప్లేస్టోర్‌లో ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. ఇప్పటికే 20 మిలియన్ల మంది ఇన్స్టాల్ చేసుకున్న సదరు యాప్స్ యూజర్లు ఉపయోగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. తమ యాప్స్ ఓ భద్రతా సంస్థ నుంచి గుర్తింపు పొందినవని చెబుతూ తప్పుడు ప్రకటనలతో యూజర్లను ఏమార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు గూగుల్ పేర్కొంది. ఆర్స్ టెక్నికా నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుండి 16 అప్లికేషన్లను తొలగించింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గుర్తించిన ఈ ప్రమాదకరమైన యాప్స్‌ను గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లలో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడానికి, మొబైల్, లేదంటే టాబ్లెట్లలో ఫ్లాష్‌ను టార్చ్‌గా ఆన్ చేయడానికి లేదా వివిధ రకలా అవసరాల కోసం వినియోగించేందుకు ఉపయోగపడినట్లు తెలిపింది. ఇప్పుడు అవే యాప్స్ యూజర్లకు నష్టం కలిగిస్తున్నట్లు మెకాఫీ ప్రతినిధులు తెలిపారు. తొలగించిన యాప్స్ తొలగించిన యాప్స్‌లలో BusanBus, Joycode, Currency Converter, High speed Camera, Smart Task Manager, Flashlight+, K-Dictionary, Quick Note, EzDica, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడర్, ఈజెడ్ నోట్స్ వంటివి ఉన్నాయి. చదవండి👉 భారత్‌లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ -
ప్లేస్టోర్‌లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్ యాప్స్‌ను గతంలో తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్ 28 నుంచి 2023 సెప్టెంబర్ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్‌లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్ఎస్ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్), రమ్మీ యాప్స్‌ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్‌లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్ సంస్థ విన్జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్ .. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్ గేమ్స్ (పీఎఫ్‌జీ) అభిప్రాయపడింది. -
2 వేల లోన్ యాప్స్ తొలగింపు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్ నుంచి 2,000 పైగా లోన్ యాప్స్‌ను తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా తెలిపారు. రుణాల యాప్‌ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్ యాప్‌ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉండగా.. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు. సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు.. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్‌ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది. -
8 యాప్‌లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే!
ప్రస్తుత 4జీ కాలంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. టెక్నాలజీ పుణ్యమా అని మనకు కావాల్సినవన్నీ మొబైల్లోనే ప్రత్యక్షమవుతన్నాయి. అయితే దీంతో పాటే కొన్ని సార్లు వైరస్, హాకర్ల రూపంలో ప్రమాదాలు వస్తుంటాయి. అందుకు మనం కాస్త జాగ్రత్త వహిస్తే వాటి నుంచి బయటపడచ్చు. ప్రస్తుతం మాగ్జిమమ్ ఇంగ్రావ్ అనే ఫ్రెంచ్ రీసెర్చర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను హెచ్చరించారు. ప్రమాదకరమైన కొన్ని యాప్‌లను ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయని అవి మీ మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదన్నారు. అయితే ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్ వాటికి కనుగొని అందులో నుంచి తీసేసింది. అయినా కొందరు తెలియక వాటిని వేరొక సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగిస్తూనే ఉన్నారు. కాగా ఈ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డిలీట్ చేసినప్పటికీ వీటి ఏపీకే (APK) వర్షన్స్ ఇంకా గూగుల్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని కొందరు దుండగులు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఫేక్ ప్రోఫైల్స్ క్రియేట్ చేశారు. వాటి ద్వారా యాడ్స్ క్రియేట్ చేసి ప్రొమోట్ చేస్తున్నారు. ఆ యాడ్లను క్లిక్ చేసిన యూజర్ల డేటాను హ్యాకర్లు చేజిక్కించుకుంటున్నారు. దీంతో వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. కనుకు వెంటనే మీ మొబైల్లో ఈ యాప్‌లు ఉంటే డిలీట్ చేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర 8 యాప్‌లు ఇవే.. 1. వోల్గా స్టార్ వీడియో ఎడిటర్, 2. క్రియేటివ్ త్రిడీ లాంచర్, 3. ఫన్నీ కెమెరా, 4. వావ్ బ్యూటీ కెమెరా, 5. జీఐజీ ఈమోజీ కీబోర్డ్, 6. రేజర్ కీబోర్డ్ ఎండ్ థీమ్, 7. ఫ్రీగ్లో కెమెరా, 8. కోకో కెమెరా. చదవండి: Suv Cars: రెండేళ్లైన వెయిట్ చేస్తాం.. ఎస్యూవీ కార్లకు క్రేజ్.. ఎందుకో తెలుసా! -
వార్నింగ్: ఆ వాట్సాప్ వాడుతుంటే వెంటనే డెలీట్ చేయండి.. లేదంటే దబిడిదిబిడే!
నకిలీ వాట్సాప్ యాప్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోందని, యూజర్లు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈవో విల్ కాథ్‌కార్ట్ హెచ్చరించారు. ఈ యాప్ వాడే యూజర్లు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని, ఈ తరహా నకిలీ యాప్‌లను ఫోన్ల నుంచి డెలీట్ చేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. వాట్సాప్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ చేసిన పరిశోధనలో.. వాట్సాప్ తరహాలోనే యూజర్లకు సేవలను అందిస్తున్న కొన్ని హానికరమైన యాప్‌లను కనుగొన్నారని చెప్పారు. హేమాడ్స్ డెవలపర్ నుంచి మార్కెట్లో విడుదలైన ‘హే వాట్సాప్’ వంటి యాప్‌లు ప్రమాదకరమని, ప్రజలు వాటిని డౌన్లోడ్ చేయకుండా ఉండాలని క్యాత్‌కార్ట్ సూచించారు. ‘‘కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను యాప్‌లో యాడ్ చేశామని ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే అలాంటి యాప్‌లు కేవలం యూజర్ల ఫోన్లలో ఉన్న వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. దాని ద్వారా యూజర్ల డేటా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నకిలీ వెర్షన్ ప్లే స్టోర్‌లో కనిపించదు, అయితే అనధికారిక వెబసైట్ల నుంచి ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ పేరుతో వస్తున్న హే వాట్సాప్ యాప్‌ను వాడితే ఇబ్బంది తప్పదు. దానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండదని’’ విల్ కాథ్‌కార్ట్ తెలిపారు. -
గూగుల్ హెచ్చరిక..! యాప్స్‌ను అప్డేట్ చేయండి..లేకపోతే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. యాప్స్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ను అప్డేట్ చేయాలని, లేదంటే వాటిని తొలగిస్తామని తెలిపింది. అయితే గూగుల్ హెచ్చరించిన యాప్స్ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో సుమారు ప్లే స్టోర్‌లో ఉన్న సుమారు 9లక్షల యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. గూగుల్ ప్లేస్టోర్‌లో దాదాపు 8.69లక్షల ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్‌లో సుమారు 6.50లక్షల ఐఓఎస్ యాప్స్ ను తొలగించేందుకు ఆ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండేళ్ల నుంచి అప్డేట్ కానీ యాప్స్‌ను అప్డేట్ చేయాలని వాటి డెవలపర్లకు గూగుల్, యాపిల్ వార్నింగ్ ఇచ్చాయి. విధించిన గడువులోపే యాప్స్‌ను అప్డేట్ చేయాలని గూగుల్‌తో పాటు యాపిల్ సైతం హెచ్చరించాయి. అయినా డెవలపర్లు పట్టించుకోకపోవడంతో వాటిని డిలీట్ చేయనున్నాయి. -
టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యాప్స్ డెవలపర్లకు భారీ షాకిస్తూ 12లక్షల యాప్స్‌ను బ్లాక్ చేసింది. 2021లో గూగుల్ ప్లేస్టోర్ ప్రైవసీ పాలసీ నిబంధనల్ని ఉల్లంఘించినందునే 12లక్షల యాప్స్‌పై చర్యలు తీసుకున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇన్స్టంట్ లోన్ యాప్స్‌తో జనాల్ని పీక్కుతింటున్న యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో చాలానే ఉన్నాయని గూగుల్ గుర్తించింది. అలాంటి మోసపూరిత, సేఫ్ కానీ యాప్‌లపై చెక్ పేట్టే ప్రయత్నం చేసింది. 12లక్షల యాప్స్‌ను నిషేధించింది. దీంతో పాటు స్పామ్ డెవలపర్స్‌గా అనుమానిస్తున్న 2లక్షల యాప్స్‌ను, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న మరో 5లక్షల యాప్స్‌ను నిలిపివేసింది. బ్లాక్ చేసిన యాప్స్న్నీ తమ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. తమ యూజర్ల సెక్యూరిటీకి భరోసా ఇచ్చేలా వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే స్పామ్, మాల్వేర్, డేంజరస్ యాప్స్‌లను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటామని గూగుల్ స్పష్టం చేసింది. చదవండి👉Ludo King Game: భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు -
గూగుల్ హైడ్రామా! రష్యాకు మరో కోలుకోలేని దెబ్బ!
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో రష్యాకు ధీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. దిగ్గజ టెక్ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే టెక్ దిగ్గజం గూగుల్ గూగుల్.. యూట్యూబ్ పరిధిలోని రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ టెక్నికల్ అంశాలను సాకుగా చూపించి రష్యాలో గూగూల్ ప్లే స్టోర్, యూట్యూబ్ పేమెంట్స్ ఆధారిత అన్ని సేవలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రష్యన్లు గూగుల్ ఆధారిత పెయిడ్ సబ్ స్క్రిప్షన్లను కొనుగోలు చేయలేరు. షాపింగ్ చేయలేరు. గూగుల్ కాకుండా వేరే సెర్చ్ ఇంజిన్లు రష్యాలో సేవలు కొనసాగిస్తున్నాయి. కానీ గూగుల్ మించిన సర్వీసులు లేకపోవడం గూగుల్ నిర్ణయం ఆదేశ ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే టెక్ కంపెనీలు రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ సేవల్ని నిలిపివేశాయి. ఆర్దిక సంస్థలైన పేపాల్,వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లు సర్వీసుల్ని ఆపేశాయి. తద్వరా రష్యాకు ఆర్ధిక సంక్షోభం తలెత్తనుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్! -
Google: దెబ్బకు దిగొచ్చిన గూగుల్
టెక్ దిగ్గజ కంపెనీల మీద గత కొన్నిరోజులుగా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూజర్ల డాటాకు భద్రత కరువైందని, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని, నైతిక విలువల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో యాప్ మార్కెట్, డెవలపర్స్ నుంచి గూగుల్ అడ్డగోలు కమిషన్ వసూలు చేస్తుందనే ఆరోపణల మీద దర్యాప్తులు నడుస్తున్నాయి. ఇవేకాకుండా గూగుల్ క్లౌడ్ మార్కెట్‌ప్లేస్ నుంచి సాఫ్ట్‌వేర్‌ను ఇతరుల నుంచి కొన్నప్పుడు కూడా గూగుల్ కొంత పర్సంటేజ్ తీసుకుంటూ వస్తోంది. అయితే ఇది అడ్డగోలుగా ఉంటోందనే విమర్శ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్ పర్సంటేజ్‌ను ఒక్కసారిగా 20 శాతం నుంచి 3 శాతానికి తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో మధ్యవర్తులకు భారీగా ఊరట లభించనుంది. ‘‘పోటీ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం, మిగతా కంపెనీలకూ అవకాశం ఇస్తూ పోటీతత్వాన్ని ప్రొత్సహించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామ’’ని గూగుల్ ప్రకటించుకుంది ఈ ఏడాది మొదట్లో.. డెవలపర్స్ వార్షికాదాయంలో మొదటి 1 మిలియన్ డాలర్లు(దాదాపు ఏడుకోట్ల రూపాయలకు పైనే) నుంచి సగం ఫీజు మాత్రమే యాప్ స్టోర్ సేవల కోసం వసూలు చేస్తామని గూగుల్ నిర్ణయించింది. అయితే గూగుల్ కంటే ముందే యాపిల్.. కిందటి ఏడాది నవంబర్‌లో పైనిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక వరుస విమర్శల నేపథ్యంలో జులై 1వ తేదీ నుంచి యాప్ స్టోర్ ఫీజులను 30 నుంచి 15 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది గూగుల్. చదవండి: తెలుగు బిగ్‌బాస్ 5 విజేత అతడే అంటున్న గూగుల్! -
Google: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే!
టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో అక్రమాలకు పాల్పడుతోందనే ఆరోపణలు నిజమని తేలింది. ఈ మేరకు రెండేళ్ల తర్వాత ఆరోపణల్ని నిర్ధారించుకున్న దర్యాప్తు ఏజెన్సీ.. గూగుల్‌పై తీసుకునే చర్యల విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. యాప్ మార్కెటింగ్‌లోనూ గూగుల్‌కు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్. అలాంటిది అక్రమంగా మిగతా పోటీదారులను దెబ్బతీసి లాభపడిందనే ఆరోపణలు గూగుల్‌పై వెల్లువెత్తాయి. ఒక్క గూగుల్ మాత్రమే కాదు.. అమెజాన్, యాపిల్ సహా అరడజను కంపెనీలను ఈ తరహా ఆరోపణలే చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేపట్టింది. చదవండి: కమిషన్ కక్కుర్తిపై యాపిల్ గప్‌చుప్ అక్రమాల ఆరోపణలివే.. తయారీ కంటే ముందే తమకు, తమతో ఒప్పందాల్ని కుదుర్చుకున్న కంపెనీల యాప్‌ల్ని ఇన్స్టాల్ చేయాలని డివైజ్ తయారీదారులను ఒత్తిడి చేసిందనేది గూగుల్‌పై మోపబడిన ప్రధాన ఆరోపణ. యాప్ మార్కెటింగ్‌లో ఇతరులకు స్థానం ఇవ్వకపోవడం భారత చట్టాల ప్రకారం నేరం కూడా. ఈ మేరకు సదరు వేధింపులపై అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(ADIF) ఫిర్యాదు చేయడంతో సీసీఐ 2019లో దర్యాప్తు మొదలుపెట్టింది. డివైజ్ తయారీదారుల సామర్థ్యం తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ వెర్షన్లను(ఫోర్క్స్) బలవంతంగా వాళ్లపై రుద్దిందనేది సీసీఐ తన దర్యాప్తులో గుర్తించింది. తాజాగా అనధికారికంగా ఒక నివేదికను విడుదల చేసిన సీసీఐ.. అధికారిక ప్రకటనతో పాటు, గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. మే 2009 నుంచి ఇది పూర్తి స్తాయిలో పని చేస్తోంది.వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఒకవేళ అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం ఉంది సీసీఐకి. చర్చల దిశగా గూగుల్! ఇక గూగుల్‌కి ఎదురుదెబ్బ నేపథ్యంలో అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(350 స్టార్టప్స్, ఫౌండర్స్, ఇన్వెస్టర్స్) హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు తాజాగా యాప్ మార్కెటింగ్ కట్టడికి దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం లాంటిదే.. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని ADIF కోరుతోంది. అయితే ఈ ఆరోపణల్ని ఖండిస్తూనే.. సీసీఐతో చర్చలకు సిద్ధపడుతోంది గూగుల్. ఆండ్రాయిడ్ మార్కెట్లో పోటీతత్వం ఎలా ఉందనే విషయాన్ని, ఆవిష్కరణలకు తాము ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నామనే విషయాన్ని సీసీఐ బెంచ్ ఎదుట హాజరై వివరించబోతున్నట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇదీ చదవండి: సౌత్ కొరియా చేసింది ఇదే.. మరి భారత్ సంగతి? -
వామ్మో.. పేరు నుంచి పాస్వర్డ్ దాకా అన్నీ ఫసక్
సురక్షితంకానీ యాప్‌ల జోలికి వెళ్లొద్దని, ఫోన్లో గనుక అలాంటివి ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని స్టోర్లు(గూగుల్, యాపిల్) ఎప్పటికప్పుడు యూజర్లను హెచ్చరిస్తూనే ఉంటాయి కదా. కానీ, ఈసారి ఆ అలర్ట్ భారీ లెవల్లోనే రిలీజ్ అయ్యింది. ఒక్క గూగుల్ ప్లేస్టోర్‌లోనే 19 వేల అరక్షితమైన యాప్‌లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్.. ఒక్క గూగుల్ ప్లేస్టోర్‌లో సేఫ్కాని 19,300 యాప్‌ల్ని గుర్తించింది. డేటాబేస్(ఫైర్‌బేస్ అంటారు)లో భద్రతలేని ఈ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవాస్ట్ హెచ్చరించింది. యాప్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌ను సురక్షితమైన సోర్స్‌గా భావిస్తుంటారు. కానీ, ఇందులో ఉన్న యాప్స్ కూడా యూజర్ డాటాకు ముప్పు తెచ్చేవే అని తర్వాతి కాలంలో వెలుగు చూసింది. ప్రస్తుతం గుర్తించిన యాప్‌ల వివరాల్ని గూగుల్‌కు అందజేశామని, తద్వారా యాప్ డెవలపర్స్ అప్రమత్తం అవుతారని ఆశిస్తున్నామని ఎవాస్ట్ తెలిపింది. పొరపాటు ఇదే.. సాధారణంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యాప్స్(మొబైల్-వెబ్ యాప్స్) డెవలపింగ్ కోసం ఫైర్‌బేస్‌ను ఉపయోగిస్తారు డెవలపర్స్. ఆ మొత్తాన్ని ఇతర డెవలపర్స్‌కు కనిపించేలా ఉంచుతారు. ఈ క్రమంలో ఈ డేటాబేస్ ద్వారా ఆ సమాచారం మొత్తం అందరికీ చేరుతుంది. వీటిలోని యాప్స్ మిస్కన్ఫిగరేషన్ ప్రభావం వల్ల.. లైఫ్‌స్టైల్, వర్కవుట్, గేమింగ్, మెయిల్స్, ఫుడ్ డెలివరీ ఇతరత్ర యాప్‌ల నుంచి డేటా లీక్ కావొచ్చు. అంటే యూజర్ల పేర్లు, చిరునామా, లొకేషన్ డేటా, ఒక్కోసారి పాస్వర్డ్లు కూడా హ్యాకర్ల చేతికి అందుతాయి. మొత్తంగా లక్షా ఎనభై వేల మూడు వందల యాప్స్‌ను ఎవాస్ట్ థ్రెట్ ల్యాబ్ రీసెర్చర్స్ పరిశీలించారు. అందులో 10 శాతం అంటే.. 19,300 యాప్స్ ఓపెన్‌గా, గుర్తింపులేని డెవలపర్స్ నుంచి డాటాను లీక్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. జాగ్రత్తలు.. ►వెరిఫై మార్క్ లేని యాప్స్ లేని డౌన్లోడ్ చేయకపోవడం బెటర్. ►యాప్ పర్మిషన్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. లేకుండే డాటా మొత్తం లీక్ అవుతుంది ►ప్లేస్టోర్లలో కింద రివ్యూలు, సమాచారం పూర్తిగా చదవాలి. ఒక్కోసారి ఫేక్ రివ్యూలు బోల్తా కొట్టిస్తుంటాయి. కాబట్టి, జెన్యూన్ రీజన్ ఉంటేనే డౌన్లోడ్ చేయాలి. ►రివార్డులు ఆఫర్ చేసే యాప్స్ విషయంలో మరింతజాగ్రత్త అవసరం. ►యాంటీ వైరస్ ఎంపికలోనూ ఆచీతూచీ వ్యవహరించాలి. ►ఒక్కోసారి ‘మొబైల్స్’కు హాని చేస్తాయనే సందేశాన్ని పట్టించుకోకుండా ‘టెంప్టింగ్’ యాప్స్‌ను డౌన్ లోడ్ చేస్తుంటారు. ఈ చర్య తెలిసిమరీ గోతి తవ్వుకున్నట్లే.. ►గేమ్స్ ఆడేటప్పుడు లేదంటే అశ్లీల వీడియోలు చూసేటప్పుడు వచ్చే యాప్స్ నోటిఫికేషన్ సురక్షితమైనది ఎంతమాత్రం కాదు ►అవతలివాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను అన్‌లాక్ చేసి చూడాలనే ఉత్సుహకతతో ఇలాంటి అరక్షితమైన యాప్స్‌ను ప్రొత్సహిస్తుంటారు కొంతమంది. కానీ, మిగతా యాప్స్ కన్నా ఇలా డౌన్ లోడ్ చేసే యాప్స్ ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంటాయి. చదవండి: యాప్ మార్కెట్.. గూగుల్, యాపిల్‌కు భారీ షాక్ -
గూగుల్, యాపిల్‌కు భారీ దెబ్బ!
టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్‌కు భారీ షాకిచ్చింది సౌత్ కొరియా. స్మార్ట్ ఫోన్లలో ఈ రెండు కంపెనీల ‘యాప్’ మార్కెటింగ్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఇకపై యూజర్ తమకు నచ్చిన యాప్ స్టోర్‌ను ఎంచుకునే అవకాశం కల్పించనుంది. తద్వారా ఆ బడా కంపెనీలకు కమిషన్ల రూపంలో వెళ్లే బిలియన్ల ఆదాయానికి గండి పడినట్లయ్యింది. యాప్ మార్కెట్‌ప్లేసులలో టాప్ టూ పొజిషన్లలో కొనసాగుతున్నాయి యాపిల్, గూగుల్ కంపెనీలు. అయితే మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌లో యాప్ కొనుగోళ్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్స్ కమిషన్స్ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇది సుమారు 30 శాతం ఉండడం ఫోన్ మేకర్లకు ఇబ్బందిగా మారడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపెడుతోందని దక్షిణ కొరియా భావించింది. అయినప్పటికీ పోటీ ప్రపంచం, డిమాండ్ కారణంగా ఇంతకాలం సైలెంట్‌గా ఉంటూ వస్తున్నాయి. ఈ తరుణంలో ధైర్యం చేసి సంచలన నిర్ణయం తీసుకుని.. ఆ రెండింటి ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ప్రత్యేక చట్టం చేసింది దక్షిణ కొరియా. ప్రపంచంలో ఈ తరహా చట్టం చేసిన దేశం దక్షిణ కొరియానే కావడం విశేషం. టెలికమ్యూనికేషన్స్ బిజినెస్ యాక్ట్ ప్రకారం.. ఇకపై యూజర్లకు ఫ్రీ ఛాయిస్ దక్కనుంది. అంటే కావాల్సిన స్టోర్‌ను, యాప్ మేనేజ్మెంట్ను ఫోన్ వినియోగదారుడే ఎంచుకోవచ్చు. తద్వారా ఈ రెండు కంపెనీలకే కాకుండా.. ఎపిక్ గేమ్స్(అమెరికా)లాంటి మరికొన్ని కంపెనీలకు ఛాన్స్ దక్కనుంది. యూజర్ల భద్రత వ్యవహారం! పోయిన బుధవారమే ఈ బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉండగా.. ఆలస్యంగా నిన్న (సోమవారం-ఆగష్టు30) ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇంతకాలం యాప్ మేనేజ్మెంట్ బిజినెస్‌తో మధ్యవర్తిగా బిలియన్ల డాలర్లు దండుకుంటున్న యాపిల్ కంపెనీ, ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ మాతృక సంస్థ) పెద్ద షాకే తగిలినట్లయ్యింది. ఇక నేరుగా యూజర్లే తమకు కావాల్సిన యాప్‌లను పొందే వెసులుబాటు కల్పించిన ఈ చట్టంపై గూగుల్, యాపిల్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ హడావిడి నిర్ణయం యాప్ డెవలపర్స్‌పైనా, కొరియన్ కన్జూమర్స్‌పైనా ప్రభావం చూపించనుందని గూగుల్ పబ్లిక్ పాలసీ సీనియర్ డైరెక్టర్ విల్సన్ వైట్ చెప్తున్నాడు.‘ఇది ఫోన్ యూజర్ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం. ఇంతకాలం అది భద్రతతో కూడిన ఓ వ్యవస్థతో నడుస్తూ వస్తోంది. మేం వసూలు చేసే ఛార్జీలు సహేతుకం కాదనే వాదన అర్థవంతం కాదు. స్వేచ్ఛ ప్రకారం యూజర్ తనకు నచ్చిన యాప్ మేనేజ్మెంట్, యాప్ స్టోర్‌ను ఎంచుకుంటే.. అందులో అన్నీ యూజర్ ప్రైవసీని కాపాడతాయనే గ్యారెంటీ ఇవ్వగలదా ఈ కొరియా చట్టం? మేం ఇవ్వగలం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడాయన. సంచలనం: ఇక సిమ్‌కార్డ్, నెట్‌వర్క్‌లతో పని లేదు -
మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి..!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రమాదకరమైన 8 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఆ యాప్స్‌ను ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని యూజర్లను హెచ్చరించింది. టప్ మని నీటి బుడగలా పేలిపోయే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. అయితే ఆ ఇంట్రస్ట్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అనుసరిస్తున్నారు. బిట్ కాయిన్‌పై యాప్స్ తయారు చేసి వైరస్ల సాయంతో యూజర్ల అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. దీంతో గూగుల్ ఆయా యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ♦ బిట్‌ఫండ్స్- క్రిప్టో క్లౌడ్ మైనింగ్ ♦ బిట్‌కాయిన్ మైనర్- క్లౌడ్ మైనింగ్ ♦ వికీపీడియా (BTC)- పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్ ♦ క్రిప్టో హోలిక్- బిట్‌కాయిన్ క్లౌడ్ మైనింగ్ ♦ డైలీ బిట్ కాయిన్ రివార్డ్స్ - క్లౌడ్ ఆధారిత మైనింగ్ వ్యవస్థ ♦ బిట్‌కాయిన్ 2021 ♦ మైన్‌బిట్ ప్రో - క్రిప్టో క్లౌడ్ మైనింగ్ & బిటిసి మైనర్ ♦ ఎథీరియం (ETH) - పూల్ మైనింగ్ క్లౌడ్ యాడ్స్‌ను ఎరగా వేసి సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్ ద్వారా యూజర్ల అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో తెలిపింది. ట్రెండ్ మైక్రో రిపోర్ట్ ప్రకారం.. తొలత సైబర్ నేరస్తులు బిట్ కాయిన్ పై ట్రేడింగ్ నిర్వహించేందుకు ఇష్టపడుతున్న వారిని టార్గెట్ చేస్తారు. వారికి రూ.1000తో (ఉదాహరణకు) బిట్ కాయిన్‌పై ట్రేడింగ్ చేస్తే వారికి అదనంగా రూ.2వేలు చెల్లిస్తామంటూ యాడ్స్‌ను క్రియేట్ చేస్తుంటారు. పొరపాటున ఆ యాడ్స్‌ను క్లిక్ చేస్తే మన పర్సనల్ డేటా అంతా సైబర్ నేరస్తుల డేటాలో స్టోరై ఉంటుందని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఆ తర్వాత యాప్స్ ద్వారా మాల్వేర్ సాయంతో అకౌంట్లలో ఉన్న డబ్బులు కాజేస్తుంటారని, ఇలాంటి యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చదవండి : Asus Chromebook: మార్కెట్లో బాహుబలి ల్యాప్ ట్యాప్ -
ఫ్రెండ్లీ యాప్ ‘యూట్యూబ్’ సంచలనం
మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సంచలన రికార్డు నమోదు చేసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్ డౌన్లోడ్స్ పూర్తి చేసుకున్న తొలి యాప్‌గా ఘనత దక్కించుకుంది. ఈ మేరకు 9టు5 గూగుల్ అనే వెబ్సైట్ కథనం ప్రచురించింది. ప్లే స్టోర్‌లో ఇదో అరుదైన రికార్డ్ అని పేర్కొంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇదంతా ప్రీ ఇన్‌స్టాలేషన్‌తో కలిపే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గూగుల్ సంబంధిత లిస్ట్‌లో యూట్యూబ్ తర్వాత గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ టెక్స్ టు స్పీచ్, జీమెయిల్ తర్వాతి స్థానాల్లో 5 బిలియన్ల డౌన్‌లోడ్స్‌కి పైగా ఉన్నాయి. ఫ్రెండ్లీ యాప్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధిక డౌన్లోడ్ల కౌంట్‌లో మాత్రం ముందుండేది ఏదో తెలుసా?.. ‘గూగుల్ ప్లే స్టోర్’. ఇక 2005లో లాంఛ్ అయిన యూట్యూబ్‌ని.. 2006లో 1.6 బిలియన్ డాలర్లు చెల్లించి గూగుల్ సొంతం చేసుకుంది. ఆపై యూట్యూబ్ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఇక ఫ్రెండ్లీ యాప్‌గా యూట్యూబ్‌కి పేరుంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం, గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్, 4జీ డివైజ్‌లు ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ తర్వాత యూట్యూబ్ వినియోగం విపరీతంగా పెరిగింది. తద్వారా అతిపెద్ద స్ట్రీమింగ్ యాప్‌గా అవతరించింది యూట్యూబ్. ఇంత కాలం వీడియో చేసే వాళ్లకు మాత్రమే ఇన్కమ్సోర్స్గా ఉన్న యూట్యూబ్.. తాజాగా ‘సూపర్థ్యాంక్స్’ ద్వారా చూసేటోళ్ల నుంచి సైతం డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. -
ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి
న్యూఢిల్లీ: చాలా సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రముఖ బార్కోడ్ స్కానర్ యాప్ ను వెంటనే ఆన్ ఇన్స్టాల్ చేయండి లేకపోతే హ్యాకింగ్ భారీన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ యాప్ లో వైరస్ ప్రవేశించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఈ వైరస్ వేగంగా ఇతర మొబైల్స్ లోకి వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. దాంతో వెంటనే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను తొలిగించినట్లు పేర్కొంది. దీనిని ఇప్పటికే ఒక కోటికి మందికి పైగా దీనిని డౌన్ లోడ్ చేసుకొని వాడుతున్నారు. ఈ యాప్ ను ఓపెన్ చేసినప్పుడు క్రాష్ అవ్వడంతో పాటు చాలా రకాల ప్రకటనలు(యాడ్స్) వస్తున్నాయని కొందరు వినియోగదారులు గుర్తించారు. ఈ సమస్య గురుంచి తెలుసుకున్న వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే దీనిని అన్ఇన్స్టాల్ కోరింది. ఈ యాప్ ను లావాబర్డ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మీ ఫోన్లో దీనిని కనుగొనలేకపోతే AppCheckerని డౌన్లోడ్ చేసి 'బార్కోడ్ స్కానర్' ను చెక్ చేయండి. బార్కోడ్ స్కానర్ ఒక సాధారణ యాప్, గత సంవత్సరం డిసెంబర్ 4న తీసుకొచ్చిన అప్డేట్ తర్వాత ఫోన్లలోకి వైరస్ వచ్చినట్లు తెలుస్తుంది. చదవండి: ఓటు వేసి రియల్మీ నార్జో30 గెలుచుకోండి ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్ -
రుణాల యాప్‌లపై గూగుల్ సంచలన నిర్ణయం
హైదరాబాద్: లాక్డౌన్ ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక కష్టాల సమయంలో రుణాలు ఇస్తామంటూ వెంటపడి ఇచ్చిన రుణ యాప్‌లు అనంతరం ఆ రుణాలు చెల్లించాలని తీవ్ర వేధింపులకు గురి చేసి పదుల సంఖ్యలో ప్రజలు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విధంగా రుణాలు ఇచ్చే యాప్‌లు ప్రజలను వేధిస్తున్నాయని పోలీసులతో పాటు ప్రజలు ఫిర్యాదులు చేయడంతో ఎట్టకేలకు గూగుల్ సంస్థ స్పందించింది. అలాంటి లోన్ యాప్స్‌ను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దాదాపు 100 యాప్‌లపై నిషేధం విధించింది. డాటాను దుర్వినియోగం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తం వడ్డీలు వసూలు చేస్తున్నారనే విషయాన్ని గూగుల్ గుర్తించి ఈ చర్యలు తీసుకుంది. ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. వెంటనే రుణాలు ఇస్తామని ప్రజల వెంటపడి తర్వాత అధిక వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. రుణాలు చెల్లించినా కూడా వడ్డీ పేరిట అధిక వసూళ్లకు పాల్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ల మోసాలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ యాప్‌ల ద్వారా రుణాలపై అధిక వడ్డీకి సంబంధించిన ఫిర్యాదులు చాలా వచ్చాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వక సమాధానంలో బుధవారం పార్లమెంటుకు తెలిపారు. వ్యక్తిగత డాటా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని రుణాలకు సంబంధించిన యాప్‌లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. తొలగించిన యాప్‌లు తమ నిబంధనలను పాటించడం లేదని, భద్రతా విధానాలను ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ వివరించింది. అయితే ఎన్ని యాప్స్.. వేటిని నిషేధించిందనే విషయం మాత్రం గూగుల్ బహిర్గతపర్చలేదు. మొత్తానికి కొన్ని రుణాల యాప్స్‌లను తొలగించడంతో కొంత ఊరట కలిగించే అంశమైనప్పటికీ ఇలాంటి రుణాలకు సంబంధించిన యాప్స్ ప్లే స్టేర్ వేలకొద్దీ ఉన్నాయని.. వాటిని కూడా నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు గూగుల్‌కు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే యాప్‌లను నిషేధించడం.. ప్లే స్టోర్ నుంచి తొలగించడం కొత్త కాదు. గతంలో చైనాకు సంబంధించిన యాప్‌లు భారతదేశంలో నిషేధించారు. ప్రాణాంతకంగా మారడంతో పబ్జీ గేమ్‌ను కూడా నిషేధించిన విషయం తెలిసిందే. -
మీ కళ్ళతోనే చాట్ చేయండి
గూగుల్ మరో కొత్త యాప్ ని తీసుకొస్తుంది. "లుక్ టు స్పీక్" అనే ఈ యాప్ ద్వారా కళ్లతోనే చాట్ చేసే అవకాశం యూజర్లకు కలుగుతుంది. మన ఫోన్ లో ఉన్న పదాలను కళ్లతో చూస్తే అది గట్టిగా చదివి వినిపిస్తుంది. దీనిని ముఖ్యంగా మాట్లాడలేని వారిని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ 9పై వెర్షన్ గల యూజర్లకు అందుబాటులో రానుంది. దీనిని ఉపయోగించడానికి ముందుగా ఫోన్ స్థిరంగా పట్టుకొని అందులో ఉన్న పదాలను ఎడమ, కుడి లేదా పై వైపు చూడటం ద్వారా అక్కడ ఉన్న పదాలను ఎంపిక చేసుకోవచ్చు. కంటి చూపు సెట్టింగులను యాప్ లో మార్చుకునే అవకాశం ఉంది. గూగుల్‌లో ఇలాంటి ప్రాజెక్ట్‌పైనే పని చేస్తున్న ఓ టీమ్.. స్పీడ్, లాంగ్వేజ్ థెరపిస్ట్ సారా ఏజెకిఎల్, రిచర్డ్ కేవ్ లుక్‌తో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేసారు. ఈ యాప్ ని ఒక వ్యక్తి లేదా కమ్యూనిటీకి ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ యాప్‌ను డెవలప్ చేసినట్లు కేవ్ తెలిపారు. దీనిలో ఎక్కువగా ఉపయోగించే హలో, థ్యాంక్యూ, గ్రేట్, ఓకేలాంటి పదాలు ఉన్నాయి.(చదవండి: శామ్ సంగ్: రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ) -
ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే
2020 ఏడాది ముగుస్తున్న సందర్బంగా ప్లే స్టోర్ బెస్ట్ యాప్స్ ప్రకటించింది గూగుల్. బెస్ట్ యాప్స్ మాత్రమే విడుదల చేయకుండా.. కేటగిరీలుగా విభజించి ప్లే స్టోర్ లో ఉన్న బెస్ట్ గేమ్స్, మూవీస్, బుక్స్ జాబితాను విడుదల చేసింది. ప్రతి రోజు కొత్త కొత్త యాప్స్ ప్లే స్టోర్ లో వస్తుంటాయి. ఆలా వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే పాపులర్ అవుతాయి. బాగా పాపులర్ వాటిని యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటారు. కొత్తగా వచ్చినవి పాపులర్ అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే ప్రతి ఏడాది చివర్లో వినియోగదారుల అభిప్రాయాలను తీసుకోని అందులో బెస్ట్ యాప్స్ ఏవో ప్రకటిస్తుంది. అలాగే కేటగిరీల వారీగా ఉత్తమమైన వాటి జాబితాను ఏడాది చివర్లో విడుదల చేస్తూ ఉంటుంది గూగుల్. ఈసారి కూడా అనేక యాప్స్‌ని ప్రకటించింది. పర్సనల్ గ్రోత్, ఎవ్రీడే ఎస్సెన్షియల్ లాంటి కేటగిరీస్‌లో యాప్స్ లిస్ట్ ప్రకటించింది గూగుల్. (చదవండి: పబ్జీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్) 2020 ఏడాదిలో వచ్చిన యాప్స్ లలో బెస్ట్ ఆఫ్ 2020 అవార్డును 'స్లీప్ బై వైసా' యాప్ దక్కించుకుంది. అలాగే గేమ్ పరంగా చుస్తే 2020 బెస్ట్ గేమ్ యాప్ అవార్డును 'లెజెండ్స్ ఆఫ్ రన్‌టెరా' కు ఇచ్చారు. యాప్స్ లలో 2020 యూజర్స్ ఛాయిస్ యాప్ అవార్డును మైక్రోసాఫ్ట్ ఆఫీస్: వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కు ఇచ్చారు. అలాగే 2020 యూజర్స్ ఛాయిస్ గేమ్ యాప్ అవార్డును క్రికెట్ ఛాంపియన్షిప్ 3 - డబ్ల్యుసిసి3కు ఇచ్చారు. ప్రశాంతమైన నిద్ర కోసం నిద్ర కథలు వినిపించడంతో పాటు ఆలోచనాత్మకంగా రూపొందించిన యాప్ ఈ 'స్లీప్ బై వైసా' యాప్ అని గూగుల్ పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా చాల మంది నిద్రలేమితో భయపడే వారికీ ఇది చాలా ఉపయోగపడింది అని గూగుల్ పేర్కొంది. ఎపిక్ గేమ్స్ వారు అభివృద్ధి చేసిన లెజెండ్స్ ఆఫ్ రన్‌టెరా అనే యాప్ క్రీడా అభిమానులకు ఆసక్తికరమైన డిజైన్ మరియు ప్రత్యర్థుల మధ్య నిజమైన యుద్ధ అనుభూతిని కలిగించడం ద్వారా బెస్ట్ యాప్ గా నిలిచింది. -
కోట్లు దోచేస్తున్న యాప్స్ : చెక్ చెప్పిన చిన్నారి
సాక్షి, న్యూఢిల్లీ: ఆడపిల్లలని చులకనగా చూడకండి..వారు ప్రపంచాన్ని సృష్టించడమే కాదు.. తమ నైపుణ్యంతో ప్రపంచాన్ని కాపాడతారు కూడా. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లోని ఒక చిన్న అమ్మాయి నిరూపించింది ఇదే. భద్రతా పరిశోధకులే నివ్వెరపోయేలా మాలావేర్ గుర్తించి,కోట్లను దోచేసిన కేటుగాళ్లను పట్టించింది. తద్వారా టెక్ సంస్థలు నష్టపోతున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోని యాప్స్ భద్రతపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్కామర్ల ముప్పు తప్పడం లేదు. పిల్లలను లక్ష్యంగా ఈ యాప్స్ 2.4 మిలియన్లకు పైగా సార్లు డౌన్లోడ్ అయినట్టు పరిశోధకులు కనుగొన్నారు. వివరాల్లోకి వెళ్లితే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఏడు నకిలీ యాప్స్ ద్వారా ఇప్పటివరకు 5 లక్షల డాలర్లను (సుమారు రూ.3.7 కోట్లు) దోచేశారు. ప్రధానంగా టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఈ మోసపూరిత యాప్స్‌కు సంబంధించిన ప్రకటను ప్లే అవుతాయట. ఇవి సాధారణంగా ఎవరికీ కనిపించకుండా మాల్వేర్ ద్వారా లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాయి. ఈ యాప్స్ ద్వారా ఒక్కో యూజర్ ద్వారా 10 డాలర్ల మధ్య ఆర్జిస్తున్నాయి. అయితే టిక్‌టాక్‌లో ఇలాంటి యాడ్స్ చూసిన ఒక పాప ఈ విషయమై ఫిర్యాదు చేసింది. పిల్లలు ఆన్లైన్లో ఎలా సేఫ్‌గా ఉండాలో తెలిపే అవాస్ట్ ‘బీ సేఫ్’ ఆన్లైన్ ప్రాజెక్టుకు దీన్ని రిపోర్ట్ చేసింది. దీంతో వారు రంగంలోకి మరింత పరిశోధించడంతో విషయం వెలుగు చూసింది. ఇవి వాల్‌పేపర్, మ్యూజిక్ లేదా ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ ముసుగులో ఉంటాయని, వీటి ద్వారానే యాడ్వేర్ స్కామ్‌లు జరుగుతున్నట్లు సెన్సార్ టవర్‌కు సంబంధించిన పరిశోధకులు తెలిపారు. అంతేకాదు టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయమని పరిశోధకులు వ్యాఖ్యానించారు. 5 వేల నుంచి 33 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారట. దీన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన చిన్నారికి అవాస్ట్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే పరిశోధకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించింది. దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించలేదు. -
గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్టు గూగుల్ స్పష్టం చేసింది. దీనిపై గూగుల్ గతంలోనే పేటీఎంకు నోటీసులు జారీ చేసింది. క్యాసినోస్, గ్యాంబ్లింగ్ మనీ ప్రమోషన్లు తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ పేర్కొంది. పేటీఎం పదేపదే ఈ నిబంధనలను అతిక్రమించిందని గూగుల్ వెల్లడించింది. ఇక పేటీఎం మనీ, పేటీఎం మాల్, పేటీఎం బిజినెస్ యాప్‌లు మాత్రం ప్లేస్టోర్‌లో యథావిథిగా అందుబాటులో ఉండగా పేటీఎం యాప్ కనిపించలేదు. ఇక కొద్దిరోజులు ప్లేస్టోర్‌లో తమ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని పేటీఎం వివరణ ఇచ్చింది. అందరి డబ్బులు సురక్షితమేనని హామీ ఇచ్చింది. త్వరలోనే పేటీఎం యాప్ యథావిథిగా పనిచేస్తుందని పేర్కొంది. చదవండి : ‘క్యాంప్ గూగుల్’ విజేతగా గుంటూరు విద్యార్థి -
ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్ తొలగింపు
న్యూఢిల్లీ : చైనా యాప్ టిక్‌టాక్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్, యాపిల్ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్తో సహా 59 చైనీస్ యాప్స్‌ను నిషేధిస్తూ చైనాకు భారత్ షాకిచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ లెక్కల ప్రకారం గతేడాది జూన్ నాటికి భారతదేశంలో 12 కోట్ల మంది నెలవారీ టిక్‌టాక్ వినియోగదారులు ఉన్నారు. తమ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో ఈరోజు తమ వివరణ వినడానికి ప్రభుత్వం అంగీకరించిందని టిక్‌టాక్ ఇండియా తెలిపింది. (చైనాకు షాక్; టిక్‌టాక్‌పై నిషేధం) -
మిట్రాన్‌కు షాకిచ్చిన గూగుల్
న్యూఢిల్లీ: క్యారిమీనటి ఉదంతం, చైనా యాప్ బహిష్కరణ నినాదం.. ఈ రెండూ టిక్‌టాక్‌కు ముచ్చెమటలు పట్టించాయి. ఫలితంగా యాప్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో నెగెటివ్ రివ్యూల తొలగింపు పేరుతో గూగుల్ టిక్‌టాక్‌కు అండగా నిలిచింది. అయితే దీనికన్నా ముందు టిక్‌టాక్ కష్టకాలాన్ని ఉపయోగించుకుంటూ స్వదేశీ యాప్ పేరిట 'మిట్రాన్' తెరమీదకు వచ్చింది. దీంతో అప్పటికే చైనాపై వ్యతిరేకత ఉన్న నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్లోడ్ చేశారు. తక్కువ కాలంలోనే దీని డౌన్లోడ్ల సంఖ్య 5 మిలియన్లు దాటిపోయింది. 4.7 రేటింగ్‌తో తిరుగులేని యాప్‌గా నిలిచింది. ఇలా బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న మిట్రాన్‌కు గూగుల్ సడన్ షాకిచ్చింది. (మిట్రాన్ యాప్.. అసలు కథ ఇది!) భద్రతా సమస్యల కారణంగా ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్‌ను తొలగించినట్లు గూగుల్ పేర్కొంది. సైబర్ నిపుణులు సైతం వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు యాప్ డెవలపర్స్ ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. వీలైతే యాప్‌ను డిలీట్ చేయాల్సిందిగా కోరారు. కాగా ఈ యాప్‌ను రూర్కే ఐఐటీ విద్యార్థి శిబంక్ అగర్వాల్ తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై క్యూబాక్సస్ వ్యవస్థాపకుడు ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ.. 'తమ సంస్థ యాప్ సోర్స్ కోడ్‌ను సదరు విద్యార్థికి విక్రయించాం. అతను దాన్ని మిట్రాన్ పేరిట భారత్‌లో విడుదల చేశాడు' అని పేర్కొన్న విషయం తెలిసిందే. (ట్రంపొకరు కిమ్మొకరు) -
ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్
న్యూఢిల్లీ: ప్రపంచానికి కరోనా దెబ్బ తాకితే, టిక్‌టాక్‌కు క్యారిమీనటి దెబ్బ తగిలింది. దీంతో టాప్ రేటింగ్‌లో దూసుకుపోయిన టిక్‌టాక్ 1 స్టార్ రేటింగ్‌కు పడిపోయింది. ఇక టిక్‌టాక్‌కు రోజులు చెల్లిపోయాయి, ఇప్పుడో, అప్పుడో యాప్ కూడా కనిపించకుండా పోతుందని ఎంతో మంది అనుకుంటూ వచ్చారు. అయితే ఈ తతంగాన్ని అంతటినీ నిశితంగా పరిశీలిస్తోన్న గూగుల్ దారుణమైన రేటింగ్ ఇచ్చిన ఎనిమిది మిలియన్ల నెగెటివ్ రివ్యూలపై వేటు వేసింది. దీంతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ 4.4 స్టార్ రేటింగ్‌తో తిరిగి యథాస్థితికి చేరుకుంది. ఊహించని పరిణామానికి యూట్యూబ్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఈ గొడవలో గూగుల్ మధ్యలో ఎందుకొచ్చిందంటే.. అందరూ ఈ యాప్‌కు రేటింగ్, రివ్యూలు ఇస్తోంది గూగుల్ ప్లే స్టోర్‌లోనే. కాగా టిక్‌టాక్‌కు నెగెటివ్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన చాలామంది తమ రివ్యూల్లో దానికి గల అసలు కారణాన్ని వెల్లడించలేదు. (యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్: గెలుపెవరిది?) పైగా ఆ యాప్‌కు సంబంధం లేకుండా ఇష్టారీతిన సమీక్షలు ఇచ్చారు. దీంతో వీటన్నింటిపై దృష్టి సారించిన గూగుల్ అసంబద్ధంగా ఉన్న రివ్యూలనన్నింటినీ తొలగించాలని నిర్ణయించుకుంది. సుమారు ఎనిమిది మిలియన్ల రివ్యూలను తీసివేసినట్లు తెలుస్తోంది. రివ్యూల దుర్వినియోగాన్ని తగ్గించేందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు గూగుల్ తన చర్యను సమర్థించుకుంది. కాగా యూట్యూబ్, టిక్‌టాక్‌ల మధ్య ఓమోస్తరు యుద్ధమే నడిచిన విషయం తెలిసిందే. భారతీయ యూట్యూబ్ అభిమానులు టిక్‌టాక్‌ను దేశంలో బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు. అంతిమంగా దారుణ రేటింగ్స్‌తో టిక్‌టాక్ క్రేజ్ అమాంతం పడిపోయింది. (ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ) -
కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి చాప కింద నీరులా అన్ని దేశాలకు విస్తరించింది. దాని భయంతో గడప దాటాలాంటేనే జనాలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాలు సైతం గుంపులుగా వెళ్లకండి, సమూహాలుగా జత కట్టకండి అంటూ ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. మరి రోజంతా ఇంట్లో ఉండాలంటే అది అయ్యేపనేనా.. ఎన్నిరోజులని ఒంటరిగా స్వీయనిర్భందం చేసుకుంటాం. పోనీ అన్ని గంటలు ఒక్కరమే ఉండాలంటే మనకు తోడుగా ఓ వ్యాపకం ఉండాల్సిందే. దీనికి ఫోన్‌ను మించిన అవకాశం మరొకటి లేదు. కాబట్టి మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కింద చెప్పుకునే గేమ్స్ వేసుకోండి. పైగా వీటిని ఎలాంటి రుసుము లేకుండా ప్లేస్టోర్‌లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. మరింకెందుకాలస్యం.. వెంటనే ఫోన్ అందుకో.. గేమ్ ఆడుకో.. ► ఎయిట్ బాల్ పూల్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్‌లో ఇది కూడా ఒకటి. ఇది తప్పకుండా మీకు మజా ఇస్తుంది. ప్రత్యర్థుకు పోటీనిస్తూ ఎక్కువ స్కోర్ సాధించుకునే అవకాశం ఉంది. ► సబ్వే సర్ఫర్స్: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ మెచ్చే గేమ్ ఇది. ఓ పిల్లవాడు తన ఎదురుగా ఉండే కాయిన్స్‌ను అందుకుంటూ వెళ్లాలి. క్రమక్రమంగా వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే రైళ్లను ఢీ కొట్టకుండా తప్పించుకు పరుగెత్తాలి. ఎన్నిసార్లు ఆడినా అస్సలు బోర్ కొట్టదు. ఆడిన ప్రతిసారీ ఇంతకుమించి హైస్కోర్ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది. (కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే) ► క్యాండీ క్రష్ సోడా సాగా: ఈ గేమ్ తెలియనివారు దాదాపుగా ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది పాత గేమే అయినప్పటికీ ఇప్పటికీ దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ టూర్లు గట్రా అంటూ తిరిగే వారికి ప్రయాణంలో దీన్ని మించిన తోడు ఉండదు. ► లూడో కింగ్: ఇది తప్పకుండా మీకందరికీ సుపరిచితమైన గేమ్. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి ప్రత్యక్షంగా ఆడుకునేవాళ్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చాక దీన్ని కాస్త ఆధునీకరించి ఆన్లైన్లో పరోక్షంగా ఆడుతున్నారు. ఆఫ్‌లైన్‌లో కంప్యూటర్‌తో, ఇంటిసభ్యులతో ఆడుకునే సదుపాయం ఉండగా ఆన్లైన్లో ప్రపంచంలో ఎవరితోనైనా ఆడవచ్చు. ► ప్లేయర్స్ అన్నౌన్ బ్యాటిల్‌గ్రౌండ్స్(పబ్జీ): చివరగా చెప్పుకునే ఈ గేమ్ ఈపాటికే చాలామంది మొబైల్స్‌లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సాధారణ గేమ్స్ కన్నా ఇది కాస్త భిన్నం. అడ్వెంచర్స్‌ను ఇష్టపడేవాళ్లకు ఈ గేమ్ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి పబ్జీ ఆడటానికి అలవాటుపడ్డారంటే.. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అది మీకు సంబంధం లేనట్టే వ్యవహరిస్తారు. అంతలా అందులో తలమునకలవుతారు. ఈ గేమ్‌లో ఒకరినొకరు కాల్చిచంపుకునే విధ్వంసం కూడా ఉంటుంది. కానీ అది గేమ్వరకే పరిమితం. ఈ గ్రాఫిక్ గేమ్ ప్రస్తుత యూత్‌కు మోస్ట్ ఫేవరెట్ గేమ్‌గా నిలిచిపోయింది. (పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!) ఇలాంటి మరెన్నో గేమ్స్ ప్లేస్టోర్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. మీ అభిరుచిని బట్టి వాటినీ ఓసారి ట్రై చేయండి. దీంతోపాటు టీవీలో కార్టూన్స్, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. కుదిరితే పుస్తకాలతో కుస్తీ పట్టండి. ఈ విధంగా కరోనా భయాన్ని మీ దరి దాపుల్లోకి రాకుండా నిలువరించండి. కానీ, ఏదేమైనా వైద్యులు, ప్రభుత్వాల సూచనలు మాత్రం తూచ తప్పకుండా పాటించండి.. కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి. -
వందలాది యాప్‌లను తొలగించిన గూగుల్
నిబంధనల ఉల్లంఘన, ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై శోధన దిగ్గజం గూగుల్ మరోసారి వేటు వేసింది. మొబైల్ ప్రకటన మోసాలను ఎదుర్కునే ప్రయత్నంలో గూగుల్ తన గూగుల్ ప్లే స్టోర్ నుండి వందలాది యాప్‌లకుచెక్ పెట్టింది. ఈ మేరకు గూగుల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ భద్రతా చర్యల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో దాదాపు 600 అనువర్తనాలను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేసామని వెల్లడించింది. తమ ప్రకటనల మోనిటైజేషన్ ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్ యాడ్‌మాబ్, గూగుల్ యాడ్ మేనేజర్ నుండి నిషేధించామని ప్రకటించింది. భంగపరిచే ప్రకటనల తీరును తాము అనుమతించమని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో యాడ్ ట్రాఫిక్ క్వాలిటీ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ పెర్ బిజోర్కే తెలిపారు. విఘాతకరమైన ప్రకటనలతో సహా, అనవసర ట్రాఫిక్‌ను సృష్టిస్తున్న యాప్‌లను నిరోధించడంతో పాటు, వినియోగదారులు, ప్రకటనదారులకు భరోసా కల్పించేలా తమ ప్లాట్‌ఫాంపై తగిన విధానాలను అభివృద్ధికి, రూపకల్పనకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెడుతూనే వుంటామన్నారు. యూజర్ బ్రౌజర్లో ఊహించని రీతిలో ఈ ప్రకటనలు పాప్ అప్అవుతూ అంతరాయం కలిగిస్తున్నాయని తెలిపింది. వాస్తవానికి వినియోగదారు యాప్‌లో చురుకుగా లేనప్పుడు కూడా ఒక విధమైన విఘాతకర ప్రకటనలనుహానికరమైన డెవలపర్లు మొబైల్స్‌లో అందిస్తున్నారని గూగుల్ ఆరోపించింది. తొలగించిన యాప్‌లు 4.5 బిలియన్లకు పైగా డౌన్లోడ్ అయినట్టు తెలిపింది. ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లు ఉన్నట్టు తెలిపింది. ఈ యాప్‌ల డెవలపర్లు ప్రధానంగా చైనా, హాంకాంగ్, సింగపూర్, భారతదేశంలో ఉన్నారని వివరించింది. అయితే తొలగించిన అప్లికేషన్ల వివరాలను మాత్రం గూగుల్ వెల్లడించలేదు. -
ఆ యాప్స్‌ను తొలగించిన గూగుల్
శాన్ఫ్రాన్సిస్కో: వార్షిక వడ్డీ రేటు 36 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రిడేటరీ లోన్ యాప్స్‌ను గూగుల్ తొలగించింది. వీటిని వినియోగదారుల భద్రత రీత్యా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన ఎక్స్పాండెడ్ ఫైనాన్షియల్ పాలసీ కింద వీటిని తొలగించినట్లు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ చర్య చట్టబద్ధంగా నడుపుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆన్లైన్ లెండర్స్ అలియన్స్ సీఈఓ మేరీ జాక్సన్ తెలిపారు. (చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ యాప్స్ హల్చల్) -
గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ యాప్స్ హల్చల్
హానికరమైన యాప్స్‌ను తొలగించేందుకు గూగుల్ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డేంజరస్ యాప్స్ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధన ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటి నిరోధానికి ఎంత కృషి చేస్తున్నప్పటికీ, మరిన్ని యాప్స్ రంగంలోకి దిగుతున్నాయని ఈఎస్ఈటీ భద్రతా పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో విశ్లేషణలో బహిర్గతమైంది. ప్రమాదకరమైన ఈ గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్ ప్లే స్టోర్‌లో వేగంగా పెరుగుతున్నాయని లుకాస్ స్టెఫాంకో నివేదించారు. ఈ యాప్స్‌లోని మాలావేర్ లక్షలాది వినియోగదారులను చేరిందని ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఈ క్రమంలో దాదాపు 172 హానికరమైన అనువర్తనాలను గుర్తించినట్టు తెలిపారు. వీటిని 335 మిలియన్లకు పైగా వినియోగదార్లు ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్నట్టు చెప్పారు. అటువంటి అనువర్తనాలు ప్లే స్టోర్‌లో అందుబాటులో లేకుండా ప్లే స్టోర్ చర్యలు తీసుకుంటున్నా ఇవి చెలరేగుతున్నాయని, ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడం, విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే వీటిని స్వీకరించడంతోపాటు, వెబ్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టెఫాంకో హెచ్చరిస్తున్నారు. -
టిక్ టాక్ యాప్‌కు ఇండియాలో చెక్
-
ఆ యాప్స్‌పై ఓ షాకింగ్ న్యూస్!
గూగుల్ యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్ లేదా బ్యూటీ యాప్స్ వినియోగిస్తున్న యూజర్లకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల రీత్యా గూగుల్ కొన్ని యాప్‌లను డిలీట్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ను తొలగించినట్టు తాజాగా వెల్లడించింది. వీటి ద్వారా యూజర్ల డేటాకు భారీ ప్రమాదం ఉందన్న నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియాలో ముఖ్యంగా ఇండియాలో ప్రో కెమెరా బ్యూటీ, కార్టూన్ ఆర్ట్ ఫోటో, ఎమోజి కెమెరావంటి యాప్స్ కొన్ని లక్షలకు పైగా డౌన్లోడ్ అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. హానికరమైన ఈ యాప్స్ మాల్వేర్ను స్మార్ట్ఫోన్లలోకి పంపిస్తున్నాయంటూ అమెరికా ఆధారిత సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో గుర్తించింది. ప్లేస్టోర్‌లోని బ్యూటీ కెమెరా యాప్స్ రిమోట్ యాడ్ కాన్ఫిగ్యురేషన్ సర్వర్లను యాక్సెస్ చేయగలదని ట్రెండ్ మైక్రో తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ముఖ్యంగా ప్రో కెమెరా బ్యూటీ, ఎమొజీ కెమెరా, సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్డీ, ప్రిజ్మా ఫోటో ఎఫెక్ట్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి. వీటిద్వారా యూజర్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోందని పేర్కొంది. ఈ యాప్స్ డౌన్లోడ్ చేయగానే యూజర్లకు ఎలాంటి సందేహం రాకుండా.. గుర్తించలేనంతగా ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్ చేస్తుంది. దీని వలన ఈ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం కూడా కష్టతరం అవుతుందని వివరించింది. అంతేకాదు వీటిని ఎనలైజ్ చేయడానికి వీల్లేకుండా ప్యాకర్స్ను కూడా వాడుతుందట. -
ఈ యాప్‌లు మీ ఫోన్లో ఉన్నాయో.. ఇక అంతే!
ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాదకరమైన 85 రకాల అప్లికేషన్లను తొలగిస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో గేమ్, టీవీ అండ్ రిమోట్ కంట్రోల్ సిములేటర్ వంటి యాప్స్ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈ విషయాన్ని ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ మొదట రిపోర్టు చేసింది. ‘ఫుల్ స్క్రీన్ యాడ్స్‌ను ప్రజెంట్ చేస్తూ, డివైస్ స్క్రీన్ అన్లాకింగ్ పనితీరును గమనించే ఇటువంటి యాప్‌లు చాలా ప్రమాదకరం. అయితే ఇప్పటికే ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్ అనే యాప్‌ను యూజర్లు 50 లక్షల సార్లు డౌన్లోడ్ చేశారు. అంతేకాదు ఇటువంటి మరిన్ని 85 హానికారక యాప్‌లు కూడా 9 మిలియన్ల సార్లు డౌన్లోడ్ చేయబడ్డాయి. ఈ యాప్‌లు ఓపెన్ చేసిన ప్రతిసారీ ఫుల్ స్క్రీన్ యాడ్ డిస్ప్లే అవుతుంది. దాని నుంచి బయటికి వచ్చేందుకు వరుసగా వివిధ రకాల బటన్స్ నొక్కమంటూ ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. అలా అనేక రకాల వెబ్‌పేజీల్లోకి మన వివరాలు వెళ్లిపోతాయి. యాప్ క్రాష్ అయ్యేంతవరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో మన ఫోన్ లాక్ ప్యాట్రన్‌తో పాటు ఇతర కీలక సమాచారం హ్యాకర్ల చేతికి సులభంగా చిక్కుతుంది’ అని ట్రెండ్ మైక్రో పరిశోధకులు తమ బ్లాగులో కథనం వెలువరించారు. ఇక గూగుల్ ఇలా హానికారక యాప్‌లను తొలగించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబరులో 13, డిసెంబరులో మరో 22 ఫేక్ యాప్‌లను తొలగించింది. మన ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లు - స్పోర్ట్ టీవీ - ప్రాడో పార్కింగ్ సిములేటర్ 3డీ -టీవీ వరల్డ్ -సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్ -అమెరికన్ మజిల్ కార్ -ఐడిల్ డ్రిప్ట్ -టీవీ రిమోట్ -ఏసీ రిమోట్ -బస్ డ్రైవర్ -లవ్ స్టిక్కర్స్ -క్రిస్మస్ స్టిక్కర్స్ -పార్కింగ్ గేమ్ -బ్రెజిల్ టీవీ - వరల్డ్ టీవీ - ప్రాడో కార్ -చాలెంజ్ కార్ స్టంట్స్ గేమ్ - యూకే టీవీ - ఫొటో ఎడిటర్ కొలాగ్ 1 - మూవీ స్టిక్కర్స్ - రేసింగ్ కార్ 3డీ - పోలీస్ చేజ్ -ఫ్రాన్స్ టీవీ - చిలీ టీవీ - సౌతాఫ్రికా టీవీ మొదలైనవి -
యూరప్‌లో గూగుల్ యాప్స్‌కు చార్జీ
శాన్ఫ్రాన్సిస్కో: యూరప్‌లో స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షాకిచ్చేందుకు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సిద్ధమైంది. తమ ఉత్పత్తులైన ప్లే స్టోర్, జీ–మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటి ఫీచర్లు ఇకపై కావాలనుకుంటే ఒక్కో ఫోన్‌కు లైసెన్సు ఫీజుగా రూ.2,939(40 డాలర్ల)ను వసూలు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్లేస్టోర్ నుంచి ఏ యాప్‌నైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ బండిల్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చట్టవ్యతిరేకంగా ప్రకటించిన యూరప్ అధికారులు.. గూగుల్‌పై ఏకంగా రూ.36,737 కోట్ల(5.1 బిలియన్ డాలర్ల) భారీ జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు చేపట్టిన గూగుల్.. క్రోమ్, గూగుల్ సెర్చింజన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. తాము వసూలు చేసే లైసెన్సు ఫీజులు యూరప్‌లో దేశాలు, మొబైల్ ఫోన్లను బట్టి మారుతాయని వెల్లడించింది. ఈ మార్పులు అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వస్తాయనీ.. లైసెన్సు ఫీజులను 2019, ఫిబ్రవరి 1 నుంచి వసూలు చేస్తామని పేర్కొంది. -
కింభో కథ కంచికేనా ?
స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి సంస్థ డిజిటల్ రంగంలోనూ తన సత్తా చాటాలనుకుంది. వాట్సాప్‌కి ఈ స్వదేశీ యాప్‌తో సవాల్ విసురుతున్నాం అంటూ కొత్త మెసేజింగ్ యాప్ కింభోను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారత్ మాట్లాడుతోంది అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్ ప్రవేశపెట్టి 24 గంటలు తిరగక ముందే దాని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా కింభో అదృశ్యమైంది. ఈ యాప్‌కి ఏ మాత్రం సెక్యూరిటీ లేదన్న విమర్శలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎందుకు తొలగించారు ? కింభో యాప్ తయారీదారులు పతంజలి కమ్యూనికేషన్స్ దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. పూర్తి స్వదేశీ అని చెప్పుకుంటూ వచ్చిన ఈ మెసెంజర్ యాప్‌లో పాకిస్తాన్ నటీమణి మావ్రా హోకేన్ ఫోటోను వాడడం ఇబ్బందికరంగా మారింది. అదీ కాకుండా కింభో యాప్ బోలో అన్న యాప్‌కి మక్కీకి మక్కీ కాపీ అంటూ ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తాయి. ఇది స్వదేశీ యాప్ కాదు కాపీ క్యాట్ అంటూ రెండు యాప్‌ల స్క్రీన్షాట్లు పక్క పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల్లో ట్రాల్ కావడంతో దీనిని ప్రస్తుతానికి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ఈ యాప్ కనిపించకపోవడంపై కింభో సాంకేతిక బృందం వివరణ ఇచ్చింది. తాము ఊహించని దానికంటే అధికంగా స్పందన రావడంతో సర్వర్లు అప్‌గ్రేడ్ చేస్తున్నామంటూ ట్వీట్ చేసింది. కింభో ఒక భద్రతా విపత్తు : ఫ్రెంచి నిపుణులు కింభో యాప్ వచ్చిన ఒక్క రోజులోనే దాని చుట్టూ ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. భద్రతాపరంగా అదొక పైఫల్యాల పుట్ట అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కింభో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ఏ మాత్రం సురక్షితం కాదని ఫ్రెంచి సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఫ్రాన్స్‌కు చెందిన నిపుణుడు ఎలియట్ ఆల్డర్సన్ కింభో యాప్‌ని ఒక పెద్ద జోక్ అంటూ అభివర్ణించారు..‘ కింభో యాప్ నిండా సాంకేతిక లోపాలే ఉన్నాయి. దీనిని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇది అచ్చంగా బోలో అన్న అప్లికేషన్‌కు కాపీలా ఉంది. అంతేకాదు కింభో యాప్ బోలోమెసేంజర్.కామ్‌కి రిక్వెస్ట్ కూడా పంపుతోంది‘ అని అల్డర్సన్ ట్వీట్ చేశారు. ఈ యాప్‌ని వినియోగించే ప్రతీ ఒక్కరికీ తాను యాక్సెస్ అయి వారి మెసేజ్‌లు చదవగలుగుతున్నానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. కింభో ఎలా ఉంది ? కింభో అచ్చంగా వాట్సాప్‌ని తలపించేలా ఉంది. మెసేజింగ్, ఆడియా చాట్, వీడియో కాలింగ్, గ్రూప్స్ ఏర్పాటు, ఫోటోలు వీడియోల షేరింగ్, స్టిక్కర్స్, క్వికీస్, గ్రాఫిక్స్ ఇలా అన్ని రకాల ఫీచర్లతో వాట్సాప్‌ను పోలి ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇంతే కాకుండా సెలిబ్రిటీలను ఫాలో అయ్యే కొత్త ఫీచర్ కూడా ఇందులో పొందుపరిచారు. కింభో అంటే సంస్కృతంలో ఎలా ఉన్నారు ? ఏంటి కొత్త విషయాలు ? అని అర్థం. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ యాప్‌కి అందరూ అడిగే మొట్టమొదటి కుశల ప్రశ్న ఎలా ఉన్నారు అన్న అర్థం వచ్చేలా కింభో అన్న పేరు పెట్టారు. ఇక లోగో దగ్గర్నుంచి మిగిలినవన్నీ ఇంచుమించుగా వాట్సాప్ మాదిరిగానే ఉన్నాయి. భారత్‌లో మొట్టమొదటి మెసేజింగ్ యాప్ ఇదే.. ‘ఇది మన స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. వాట్సాప్‌ను సవాల్ చేసేలా ఈ యాప్ డిజైన్ చేశాం.‘ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్.కె. తిజరావాలా ట్వీట్ చేశారు. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన ఒక్క రోజులోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యం కావడంతో దీని కథ ఇక కంచికేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. వాట్సాప్ డౌన్లోడ్లు 100 కోట్లు దాటిపోవడంతో, ఎంత స్వదేశీ రంగు పూసినా ఏ మెసేజింగ్ యాప్‌కి వాట్సాప్‌ని ఎదుర్కొనే సత్తా సమీప భవిష్యత్‌లో ఉండదనే అభిప్రాయమైతే వినిపిస్తోంది. -
సైబర్ క్రైమ్ ఎఫెక్ట్: 500 యాప్స్ గోవిందా!
వాషింగ్టన్: ఇటీవల సాంకేతిక ప్రపంచాన్ని వణికించిన వన్నాక్రై సైబర్ అటాక్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్ అవుతుందన్న కారణంతో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఏకంగా 500 అప్లికేషన్లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అమెరికాకు చెందిన సాంకేతిక (సైబర్) నిపుణుల సూచన మేరకు గూగుల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. వన్నాక్రై సైబర్ దాడితో 41 యాప్స్ లో వైరస్ ఉన్నట్లు గతంలో గుర్తించారు. కానీ అది అంతటితో ఆగకుండా 500కు పైగా ప్లే స్టోర్ అప్లికేషన్లకు వ్యాప్తి చెందిందనట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్న ఈ యాప్స్ ద్వారా వైరస్ లు వ్యాప్తి చెంది నెటిజన్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేసి హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. గూగుల్ తొలగించిన అప్లికేషన్లలో మొబైల్ గేమ్స్, ఆన్ లైన్ రేడియో, ఫొటో ఎడిటింగ్, ఆరోగ్యం, వాతావరణం, వీడియో కెమెరా యాప్స్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. 'ఐజెక్సిన్' (Igexin) అనే సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కిట్ (ఎస్డీకే) ను అప్లికేషన్లలో ఎంబాడ్ చేయడంతో వైరస్ సోకిన ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు ప్రభావితమైన అనంతరం నకిలీ యాడ్ ను క్రియేట్ చేస్తూ హ్యాకర్లు డబ్బులు గుంజడానికి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అయితే కొన్ని సంస్థల కోడింగ్ డెవలపర్లకు యాప్స్‌లో వైరస్ వ్యాప్తి చెందుతోన్న విషయం తెలియకపోవటం గమనార్హం. -
షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ పై వైరస్ దాడి
ప్రపంచవ్యాప్తంగా జరిగిన వన్నాక్రై సైబర్ అటాక్ తో ఇంకా తేరుకోనే లేదు, అప్పుడే మరోసారి స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడి జరిగింది. ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేసుకుని.. ఓ మాల్ వేర్ స్మార్ట్ ఫోన్లలోకి చొప్పించుకుని వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ వైరస్ దాడి జరిగినట్టు సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్ పాయింట్ గుర్తించింది. జుడీ అనే మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లోకి చొరబడినట్లు ఈ సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 41 యాప్స్ లో ఈ వైరస్ ఉన్నట్టు తేలింది. ఇప్పటికే 85 లక్షల నుంచి 3.65 కోట్ల మంది యూజర్లకు దీనికి ప్రభావితమైనట్టు రిపోర్టు చేసింది. ఈ విషయంపై చెక్ పాయింట్ గూగుల్ ను అలర్ట్ చేసింది. దీంతో మాల్వేర్ చొరబడిన యాప్స్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించేస్తోంది. ' ఈ జుడీ మాల్ వేర్ 'ఆటో క్లికింగ్ యాడ్ వేర్' అని చెక్ పాయింట్ తన బ్లాక్ లో పేర్కొంది. ఈ మాల్ వేర్ తో స్మార్ట్ ఫోన్లు ప్రభావితమైన అనంతరం నకిలీ యాడ్ క్లిక్స్ ను క్రియేట్ చేస్తూ హ్యాకర్లు డబ్బులు గుంజుతారని తెలిపింది. దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ కినీవినీ అభివృద్ధి చేసిన కొన్ని యాప్ ల ద్వారా ఇది వచ్చినట్టు రీసెర్చ్ సంస్థ చెప్పింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు ఆ సంస్థ యాప్స్ ను డెవలప్ చేస్తోంది. ఈ మాల్ వేర్ తో ప్రభావితమైన యాప్స్ ఇప్పటికే 45 లక్షలకు పైగా డౌన్ లోడ్ అయ్యాయి.