షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ పై వైరస్ దాడి | Judy malware infects millions of Android smartphones via Play Store | Sakshi
Sakshi News home page

షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ పై వైరస్ దాడి

Published Mon, May 29 2017 5:18 PM | Last Updated on Sat, Aug 18 2018 4:50 PM

షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ పై వైరస్ దాడి - Sakshi

షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ పై వైరస్ దాడి

ప్రపంచవ్యాప్తంగా జరిగిన వన్నాక్రై సైబర్ అటాక్ తో ఇంకా తేరుకోనే లేదు, అప్పుడే మరోసారి స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడి జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన వన్నాక్రై సైబర్ అటాక్ తో ఇంకా తేరుకోనే లేదు, అప్పుడే మరోసారి స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడి జరిగింది. ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేసుకుని.. ఓ మాల్ వేర్ స్మార్ట్ ఫోన్లలోకి చొప్పించుకుని వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ వైరస్ దాడి జరిగినట్టు సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్ పాయింట్ గుర్తించింది. జుడీ అనే మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లోకి చొరబడినట్లు ఈ సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 41 యాప్స్ లో ఈ వైరస్ ఉన్నట్టు తేలింది. ఇప్పటికే 85 లక్షల నుంచి 3.65 కోట్ల మంది యూజర్లకు దీనికి ప్రభావితమైనట్టు రిపోర్టు చేసింది. ఈ విషయంపై చెక్ పాయింట్ గూగుల్ ను అలర్ట్ చేసింది. 
 
దీంతో మాల్వేర్ చొరబడిన యాప్స్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించేస్తోంది. ' ఈ జుడీ మాల్ వేర్ 'ఆటో క్లికింగ్ యాడ్ వేర్' అని చెక్ పాయింట్ తన బ్లాక్ లో పేర్కొంది.  ఈ మాల్ వేర్ తో స్మార్ట్ ఫోన్లు ప్రభావితమైన అనంతరం నకిలీ యాడ్ క్లిక్స్ ను క్రియేట్ చేస్తూ హ్యాకర్లు డబ్బులు గుంజుతారని తెలిపింది. దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ కినీవినీ అభివృద్ధి చేసిన కొన్ని యాప్ ల ద్వారా ఇది వచ్చినట్టు రీసెర్చ్ సంస్థ చెప్పింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు ఆ  సంస్థ యాప్స్ ను డెవలప్ చేస్తోంది.  ఈ మాల్ వేర్ తో ప్రభావితమైన యాప్స్ ఇప్పటికే 45 లక్షలకు పైగా డౌన్ లోడ్ అయ్యాయి.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement