![Beware Of Fake Chatgpt Apps On The Google Play Store - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/17/chatgpt.jpg.webp?itok=jbIBj66O)
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరస్తులు తెలివి మీరిపోతున్నారు. ఈజీ మనీ పేరుతో యూజర్ల జేబును ఖాళీ చేసేందుకు అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత ఏడాది విడుదలైన చాట్‌జీపీటీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఏఐ టూల్‌తో సైబర్ నేరస్తులు ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్‌లలో మాల్వేర్‌ను పంపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్‌లో సొమ్ము కాజేస్తున్నారు. లేదంటే యూజర్ల డేటాను డార్క్ వెబ్‌లో సొమ్ము చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
పాలో ఆల్టో నెట్‌వర్క్స్ పరిశోధకులు చాట్‌జీపీటీ ఫేక్ యాప్స్‌లలో మీటర్‌ప్రెటర్ ట్రోజన్ అనే మాల్‌వేర్‌ను గుర్తించారు. ఈ మాల్వేర్ వేరియంట్‌లు ప్రత్యేకంగా చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్ ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. కాబట్టి, ఏఐ యాప్స్ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో సైబర్ నేరస్తులు ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్ సాయంతో పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన కాంటాక్ట్ నెంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ మెసేజ్‌లను క్లిక్ చేయడం ద్వారా మాల్వేర్‌లు సదరు యూజర్ల ఫోన్‌లలోకి ఈజీగా చొరబడుతుంది. తద్వారా డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతున్న కేటుగాళ్లు బాధితుల్ని బెదిరించి వారికి కావాల్సినంత డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరహా ఫోన్ నెంబర్లనే మాల్వేర్ క్రియేటర్లు, స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ తరుణంలో గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ టెక్నాలజీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు. డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో రివ్యూలతో పాటు గతంలో ఆ యాప్‌ను ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారో గుర్తించాలని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఫేక్ యాప్స్ జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment