ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గూగుల్ యూకే మేనేజింగ్ డైరెక్టర్ డెబ్బీ వైన్‌స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ బార్డ్ ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు పనిచేయదు. ఇందుకోసం యూజర్లు బార్డ్‌కు బదులుగా గూగుల్‌లో సెర్చ్ చేసి కావాల్సిన సమాచారం గురించి తెలుసుకోవాలని సూచించారు.
‘గూగుల్ బార్డ్ ఓ ప్రయోగమని, యూజర్లకు కావాల్సిన నిర్ధిష్టమైన సమాచారాన్ని అందించేందుకు తయారు చేసింది కాద’ని ఆమె స్పష్టం చేశారు. బీబీసీ టుడే ప్రోగ్రామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘AI hallucinations with Google's in-house chatbot Bard’ అనే అంశంపై పలు వెయిన్ స్టీన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా సాంప్రదాయ పద్దతిలో గూగుల్‌లో సెర్చ్ చేసి కావాల్సిన సమాచారం గురించి తెలుసుకోవడం కంటే బార్డ్‌ను అడిగి తెలుసుకోవడం విభిన్నంగా ఉంటుంది. బార్డ్‌ను లార్జ్ లాంగ్వెజ్ మోడల్‌తో ఎలా వినియోగించాలి అనే తెలుసుకునేందుకు జరిపిన ఓ ప్రయోగం మాత్రమే. సమస్యకు పరిష్కారం, ఆలోచనలు, ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందే తప్పా నిర్ధిష్టమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే పొందలేమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గూగుల్ ఏఐ చాట్‌బాట్ బార్డ్ విశ‍్వసనీయ సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ గూగుల్ సంస్థ బార్డ్‌ను యూజర్లకు ఎందుకు అందిస్తుందనే ప్రశ్నపై స్పందించిన ఆమె..బార్డ్‌లో మీకు కావాల్సిన సమాచారం దొరకలేదు. వెంటనే గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకునేందుకు ఓ ఆప్షన్‌ను సైతం అందుబాటులోకి తెచ్చాం. ఆ ఆప్షన్ ఉపయోగించి మీరు ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారో దాని గురించి తెలుసుకోవచ్చని సూచించారు.
అంతేకాదు, ఖచ్చితమైన సమాచారం కోసం యూజర్లు గూగుల్‌పై ఆధారపడతారని మాకు తెలుసు. కాబట్టి పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, గూగుల్ యూకే మేనేజింగ్ డైరెక్టర్ డెబ్బీ వైన్‌స్టెయిన్ చేసిన కామెంట్స్ టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి.
చదవండి👉 గూగుల్‌లో జీతాల పంచాయితీ.. సుందర్ పిచాయ్‌ను విమర్శిస్తున్న ఉద్యోగులు!
Comments
Please login to add a commentAdd a comment