
పేటీఎమ్ బ్రాండ్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా డిస్‌ప్లేతోకూడిన మహాకుంభ్ సౌండ్‌బాక్స్‌ను విడుదల చేసింది. దేశీయంగా తయారైన డిస్‌ప్లే సౌండ్‌బాక్స్‌ను కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ శుక్రవారం విడుదల చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ లాభాల్లోకి ప్రవేశించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు కీలక బిజినెస్‌లు దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త విభాగాలలో పెట్టుబడులు చేపడుతున్నట్లు తెలియజేశారు.

ప్రీమియం మర్చంట్ల అభిప్రాయాలమేరకు కస్టమర్ల చెల్లింపులను ఇతరులు వినకుండా డిస్‌ప్లేతోకూడిన సౌండ్‌బాక్స్‌ను రూపొందించినట్లు వివరించారు. అధిక విలువగల కొనుగోళ్లకు వీలున్న భారీ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు తదితర పెద్ద షాపులు లక్ష్యంగా వీటిని తయారు చేసినట్లు తెలియజేశారు.