
రూ.611 కోట్లు చెల్లించాలని వన్97 కమ్యూనికేషన్స్‌కు ఆదేశం
చైర్మన్ విజయ్‌శేఖర్‌కూ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’కు (ఓసీఎల్) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు జారీ చేసింది. వన్97 కమ్యూనికేషన్స్‌తోపాటు, సంస్థ చైర్మన్, ఎండీ విజయ్ శేఖర్ శర్మ, సబ్సిడరీ కంపెనీలైన లిటిల్ ఇంటర్నెట్, నియర్‌బై ఇండియాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.611 కోట్ల విలువకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్టు దర్యాప్తులో తేలడంతో న్యాయపరమైన చర్యలకు ముందు ఈడీ స్పెషల్ డైరెక్టర్ ఈ నోటీసు జారీ చేశారు.
నియంత్రణ ప్రక్రియలు, చట్టబద్ధమైన మార్గా ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేటీఎం అధికార ప్రతినిధి ప్రకటించారు. ఓసీఎల్ సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని ఆర్‌బీఐకి వెల్లడించలేదని దర్యాప్తులో గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఆర్‌బీఐ నిర్దేశిత ధరల మార్గదర్శకాలను అనుసరించకుండా, ఓసీఎల్ సబ్సిడరీ అయిన లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేటు లిమిటెడ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అందుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ రెండు కంపెనీలను తాము 2017లో దక్కించుకున్నామని, వీటికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన తమ సబ్సిడరీలు కాకముందు జరిగినవిగా పేటీఎం స్పష్టత ఇచి్చంది.
పేటీఎం షేరు ఎన్‌ఎస్‌ఈలో 4% పడి, ఇంట్రాడే కనిష్టానికి (రూ.684) దిగజారింది. చివరికి 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment