Fema Act
-
మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మహువా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ)పై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తోందని.. దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై గరువారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తీర్పును రిజర్వులో పెట్టి నేడు(శుక్రవారం) విడుదల చేశారు. మహువా మొయిత్రి చేసిన ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించాడు. ఈ కేసు సంబంధించి మహువా సమాచారాన్ని ప్రెస్ రిలీజ్ లేదా మీడియాకు వెల్లడించటం చేయలేదని తెలిపారు. ఇక.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మహువా మొయిత్రా హాజరుకాలేదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే... తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారు. అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని.. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది. భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత డిసెంబరులో మహువా లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా.. తాను ఏ తప్పు చేయలేదని లోక్‌సభ సభ్యత్వ రద్దును ఖండించారు.తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లో నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్ల పై కేసు నమోదైన విషయం తెలిసిందే. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో రూ.8 కోట్ల పైచిలుకు నిధుల లవాదేవీలపై ఎన్నికల ముందు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అలాగే డిపాజిట్లకు సంబంధించి ఈడీ ఆరా తీస్తోంది. దీనిపై ఇవాళ వివేక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది నవంబర్‌లో విశాక సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి, రూ.కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
రఘురామకృష్ణరాజుకు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారంటూ రూ.40 కోట్ల జరిమానా విధించింది. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్(ఐబీఎస్‌ఈపీఎల్)లోకి మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రూ.202 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 2011 మార్చి 24న ఇన్వెస్ట్ చేసింది. ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సేకరించిన రూ.202 కోట్లలో రూ.200 కోట్లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా.. ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కల్)కు మళ్లించింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిధుల తరలింపుపై ఈడీ విచారించి 2017లో షోకాజ్ నోటీసులిచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి ఫెమా ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించి ఈ నెల 3న రూ.40 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం -
ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
సాక్షి,ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణకు హాజరైనారు. ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం చేరుకోవడం చర్చనీయాంతంగా నిలిచింది. అయితే ఏ కేసుకు సంబంధించి అంబానీని పిలిచారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఫెమా ఉల్లంఘన కేసులో అంబానీనీ విచారించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) కింద అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరైనట్టు తెలుస్తోంది. కాగా 2020లో మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు అధికారులను, అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో యెస్ బ్యాంక్స్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ. 12,800 కోట్ల రుణాలు పొందాయి. రిలయన్స్తోపాటు, పాటు చాలా కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ గతంలో అంబానీకి సమన్లు జారీ చేసి విచారించింది. -
బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు..
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 (FEMA) నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ గురువారం పేర్కొంది. ఫెమా నిబంధనల ప్రకారం.. కంపెనీ ఆర్థిక లావాదేవీల పత్రాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. కొంతమంది బీబీసీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి స్టేట్మెంట్ల రికార్డింగ్‌ను కోరినట్లు ఈడీ సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీబీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీబీసీ డాక్యుమెంట్ భారత్‌లో ప్రసారం చేయకుండా బ్యాన్ విధించింది. దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఆ తరువాత కొద్ది రోజులకే ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులపాటు బీబీసీ ఉద్యోగులను విచారించారు. అయితే ఇవి సోదాలు కాదని.. సర్వే అని ఐటీ అధికారులు పేర్కొన్నారు. క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. చదవండి: కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు! -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్‌చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్!
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీకి భారీ షాక్ తగిలింది. షావోమీ సంస్థకు చెందిర రూ.5,551కోట్ల నగదును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు. ఈడీ చరిత్రలో తొలిసారి అత్యధిక మొత్తం నగదు సీజ్ చేసిటన్లు తెలుస్తోంది. అయితే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించి షావోమీ విదేశాలకు డబ్బు మళ్లించిట్లు తేలింది. రాయల్టీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును ఎగ్గొట్టి ఈ ఘనకార్యానికి పాల్పడడంతో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. The Competent Authority appointed under FEMA has confirmed the seizure order of Rs 5551.27 Crore passed today by the ED against Xiaomi Technology India Private Limited under the provisions of FEMA: Enforcement Directorate pic.twitter.com/bXdVaF6v9n — ANI (@ANI) September 30, 2022 -
ఫారెక్స్ ట్రేడింగ్‌పై ఆర్బీఐ హెచ్చరికలు
ముంబై: దేశీయంగా ఫారెక్స్‌లో లావాదేవీలు నిర్వహించేందుకు అధికారిక అనుమతులులేని సంస్థల జాబితాను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. వీటిపట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా హెచ్చరించింది. అక్టాఎఫ్ఎక్స్, అల్పారి, హాట్ఫారెక్స్, ఒలింప్ ట్రేడ్సహా మొత్తం 34 సంస్థలతో జాబితాను ప్రకటించింది. ఫారెక్స్‌లో లావాదేవీలు చేపట్టడం, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణకు వీటికి అధికారిక అనుమతులులేవని తెలియజేసింది. అధీకృత వ్యక్తుల ద్వారా మాత్రమే విదేశీ మారక చట్ట(ఫెమా) నిబంధనల ప్రకారం అనుమతించిన కారణాలతో ఫారెక్స్ లావాదేవీలు చేపట్టవచ్చని వివరించింది. ఇలాకాకుండా అనధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టిన వారు ఫెమా చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఫారెక్స్‌లో డీల్ చేసేందుకు అధీకృతంకాని సంస్థలతో తమ వెబ్సైట్లో అలర్ట్ లిస్ట్‌ను ఉంచేందుకు నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలియజేసింది. జాబితాలో ఫారెక్స్4మనీ,ఈటోరో,ఎఫ్ఎక్స్సీఎం,ఎన్టీఎస్ ఫారెక్స్ ట్రేడింగ్,అర్బన్ ఫారెక్స్,ఎక్స్ఎమ్ తదితరాలున్నాయి. -
ఎల్ఐసీలో ఎఫ్‌డీఐలకు నిబంధనల్లో సవరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి). దీన్ని ఎల్ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
పనామా పేపర్స్ కేసులో ఈడీ ముందుకు ఐశ్వర్యా రాయ్
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆదేశాల మేరకు సోమవారం ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దాదాపు ఆరు గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. విదేశాలకు నిధుల మళ్లింపునకు సబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ 2016–17 నుంచి దర్యాప్తు చేస్తోంది. 2004లో ఆర్బీఐ సరళీకరించిన విదేశీ పెట్టుబడుల పథకం(ఎల్ఆర్ఎస్), ఫెమా చట్టాలను ఉల్లంఘించి 2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లో ఆమె తల్లిదండ్రులతో కలసి అమిక్ పార్ట్నర్స్ సంస్థను నెలకొల్పారని, దీనిపై బచ్చన్ కుటుంబం వివరణ ఇవ్వాలని ఈడీ గతంలోనే నోటీసులిచ్చింది. ఈ విషయంలో ఐశ్వర్యకు సమన్లు జారీచేయగా తనకు మరికొంత సమయం కావాలని ఆమె గతంలో రెండుసార్లు విన్నవించుకున్నారు. సోమవారం ఐశ్వర్యను ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పన్నుల బాదరబందీలేని, పెట్టుబడులకు స్వర్గధామంగా భావించే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో అనేక దేశాలకు చెందిన సంపన్నులు, నేతలు, సెలబ్రిటీలు రహస్య పెట్టుబడులు పెట్టారని, తద్వారా సొంత దేశాలకు భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. పనామాకు చెందిన ఆర్థిక, కార్పోరేట్ సేవల సంస్థ మొసాక్ ఫోన్సెకా ద్వారా వీరంతా పెట్టిన పెట్టుబడులు, ఎగ్గొట్టిన పన్నుల సమగ్ర వివరాలను వాషింగ్టన్కు చెందిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే).. పనామా పేపర్స్ పేరిట విడుదల చేసి ప్రకంపనలు సృష్టించిన సంగతి తెల్సిందే. దాదాపు 1.15 కోట్ల డాక్యుమెంట్లతో 2016 ఏడాదిలో వెలుగుచూసిన ఈ ఉదంతంలో భారతీయులకు చెందిన 426 ఆర్థిక ఉల్లంఘనల కేసులూ బయటపడ్డాయి. వాటిలో ఐశ్వర్య డైరెక్టర్‌గా ఉన్న సంస్థా ఉంది. 2009లో ఐశ్వర్య ఆ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఆమె మామ అమితాబ్ బచ్చన్‌నూ ఈడీ ప్రశ్నించింది. పెట్టుబడులన్నీ భారతీయ చట్టాలకు లోబడే జరిగాయని ఆయన గతంలో వివరణ ఇచ్చారు. మీకు గడ్డుకాలం మొదలవుతుంది రాజ్యసభలో బీజేపీ ఎంపీలకు జయా బచ్చన్ శాపం సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, బీజేపీ సభ్యులకు మధ్య సోమవారం రాజ్యసభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎన్డీపీఎస్ (సవరణ) బిల్లుపై జయ మాట్లాడుతూ... 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా కూడా గతంలో వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారేనన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా తనపై వ్యక్తిగత కామెంట్లు చేశారని జయ ఆరోపించారు. ఒకదశలో సహనం కోల్పోయిన ఆమె బీజేపీ ఎంపీలను ఉద్దేశిస్తూ ‘మీకు త్వరలోనే గడ్డుకాలం మొదలవుతుంది. ఇదే నా శాపం’ అని ఆగ్రహించారు. కోడలు ఐశ్వర్య ఈడీ విచారణకు హాజరైన రోజే.. ఇది చోటుచేసుకోవడం గమనార్హం. ‘సభలో నాపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. నా పైనా, నా కెరీర్ పైనా వ్యాఖ్యలు చేశారు. ఇది దురదృష్టకరం. వారలా మాట్లాడాల్సింది కాదు. మీరు సదరు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి. సభాపతి స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీరు ఏ పార్టీకి చెందిన వారు కాదు సార్. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’ అని భువనేశ్వర్ కలితాను ఉద్దేశించి జయాబచ్చన్ అన్నారు. తర్వాత కూడా అధికార, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో రాజ్యసభ వాయిదా పడింది. వీటికి మీ సమాధానమేంటి ? 1. 2005లో అమిక్ పార్ట్నర్స్ పేరిట నెలకొల్పిన కంపెనీతో మీకున్న సంబంధాలేంటి? 2. కంపెనీ తొలినాళ్లలో మీరు, మీ తండ్రి కె.రమణ కృష్ణ రాయ్, తల్లి కవిత, సోదరుడు ఆదిత్య తలా 12,500 డాలర్లు మొత్తంగా 50వేల డాలర్ల ప్రారంభ పెట్టుబడులు పెట్టారు. ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఎందుకున్నారు? 3. 2005 జూన్‌లో డైరెక్టర్ నుంచి షేర్‌హోల్డర్‌గా ఎందుకు మారారు? 4. 2008 నుంచి సంస్థ ఎందుకు క్రియాశీలకంగా లేదు? 5. ఆర్థిక లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతుల వివరాలు చెప్పండి? 6. మీ సంస్థను మొసాక్ ఫోన్సెకాయే రిజిస్టర్ చేసిందని మీకు తెలుసా? -
డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు ఈడీ షాక్..!
చెన్నై: డీఎంకే లోక్‌సభ ఎంపీ జగత్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఫెమా నిబంధనలను ఎంపీ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈడీ అటాచ్ చేసిన వాటిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్ళు వంటి స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ మొత్తంగా రూ .89.19 కోట్ల వాటాలను స్వాధీనం చేసుకుంది. ఎంపీ జగత్రక్షకన్ తమిళనాడులోని అరక్కోణం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2017 లో జగత్రక్షకన్, ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ 90 లక్షల షేర్లను సింగపూర్‌లోని మెసర్స్ సిల్వర్ పార్క్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి కొనుగోలు చేశారని.. అయితే ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలేదని వెల్లడైంది. ఫెమా 37ఏ నిబంధనల ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న విదేశీ మారకద్రవ్యం, విదేశీ భద్రత, స్థిరమైన ఆస్థి ఫెమాలోని సెక్షన్ 4కు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ మొత్తం విలువకు సమానమైన ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి ఉంది. దీనికి అనుగుణంగలా తమిళనాడులోని వ్యవసాయ భూములు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ రూపంలో జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులనుంచి రూ. 89.19 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఫెమా సెక్షన్ 37ఏ నిబంధనల ప్రకారం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. (‘అమ్మా, అప్పా.. అలసిపోయా.. క్షమించండి’) -
ఐపీఎల్: బీసీసీఐకి భారీ షాక్
సాక్షి, ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఎన్ఫోర్స్మెంట్ విభాగం(ఈడీ) షాకిచ్చింది. 2009 ఐపీఎల్ సీజన్ నిర్వాహణకు సంబంధించి బీసీసీఐకి భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు మాజీ సభ్యులకు కలిపి మొత్తం రూ. 121 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. 2009 ఐపీఎల్ సీజన్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. విదేశీ ఖాతా తెరవకుండానే రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ సౌతాఫ్రికాకు బదిలీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావటంతో భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌తోపాటు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, ఇతరులకు కలిపి ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది. బీసీసీఐకు రూ. 82.66 కోట్లు శ్రీనివాసన్‌కు రూ.11.53 కోట్లు, లలిత్ మోదీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్‌కు రూ. 9.72 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీఐతో విలీనమైంది)కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది. ఈ జరిమానాను 45రోజుల్లోగా చెల్లించాలంటూ ఈడీ ఆదేశించింది. -
కదిలిన హవాలా డొంక!
‘బిల్ ఆఫ్ ఎంట్రీ’ ఆధారంగా దర్యాప్తు - ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో హెచ్డీఎఫ్సీ ఫిర్యాదు - రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ - గత నెలలో ముగ్గురు నిందితుల అరెస్టు - ‘పీటీ వారెంట్’పై విచారించిన చందానగర్ పోలీసులు - నిందితుల వాంగ్మూలం ఆధారంగా మరో ఇద్దరి అరెస్టు సాక్షి, హైదరాబాద్: ‘బిల్ ఆఫ్ ఎంట్రీ’తీగ లాగితే సిటీ కేంద్రంగా సాగుతున్న హవాలా వ్యాపారం డొంక కదిలింది. కరెంట్ ఖాతాల ద్వారా విదేశాలకు నగదు పంపిన వ్యాపారులు దీనిని దాఖలు చేయకపోవడంతో అనుమానం వచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్– ఇండియాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), చందానగర్ పోలీసులు మొత్తం ఐదు గురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. వీరందరూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులే కావడం గమనార్హం. చైనా, హాంకాంగ్ నుంచి నగరానికి భారీ స్థాయిలో సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి అవుతు న్నాయి. అయితే వ్యాపారులు సరుకు విలు వను సగానికి తగ్గించి రికార్డుల్లో చూపిస్తు న్నారు. ఈ మొత్తానికే పన్నులు చెల్లిస్తూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల ద్వారానే హవాలా రూపంలో విదేశాల్లో ఉన్న సరఫరా దారులకు పంపుతున్నారు. ఇందుకు బోగస్ ఇన్వాయిస్లు, కరెంట్ ఖాతాలకు వినియో గిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో సూత్రధారి... హాంకాంగ్‌లో ఉంటున్న వ్యాపారి పవన్ అగ ర్వాల్ ఈ దందాకు సూత్రధారిగా వ్యవహ రిస్తున్నాడు. నగరంలోని కిషన్‌గంజ్ ప్రాంతా నికి చెందిన కాస్మోటిక్స్ వ్యాపారి మహేం ద్రకుమార్ ఖత్రి అతడికి హవాలా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడికి పరిచయస్తులైన బీ పురోహిత్, జూరారాం పురోహిత్, బాబూ లాల్ హరిసింగ్ రాజ్ పురోహిత్‌లకు రుణాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి గుర్తింపుకార్డులు, పాన్‌కార్డులు, ఓటర్ ఐడీలు తీసుకున్నాడు. వీటి ఆధారంగా మహరాజ్‌గంజ్ చిరునామాతో శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ, జీఎస్ ట్రేడర్స్, కోఠి బ్యాంక్ స్ట్రీట్ చిరునామాతో వినాయక ఎంటర్ప్రైజెస్ పేరుతో బోగస్ ఖాతాలు తెరి చాడు. వైశ్యా బ్యాంకు ఉద్యోగి సీహెచ్ దుర్గా ప్రసాద్‌కు రూ.2 లక్షలు చెల్లించి ఈ మూడు సంస్థలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సులు తీసుకున్నాడు. అంబర్‌పేటకు చెందిన ధరణి సాయికిరణ్ సహకారంతో వివిధ చిరునా మాలతో బోగస్ రెంటల్ అగ్రిమెంట్లు, స్టాంపు పేపర్లు సేకరించి పని పూర్తి చేశాడు. ఈ ట్రేడ్ లైసెన్సుల ఆధారంగా ఖత్రి చందానగర్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదిం చాడు. రిలేషన్ షిప్ మేనేజర్ చక్రవరం రఘుపతిరాజుకు ఈ పత్రాలు దాఖలు చేసిన ఖత్రి.. మూడు కరెంట్ ఖాతాలు తెరిచాడు. ఈ వ్యవహారం మొత్తం 2014లోనే జరిగింది. సరుకు లేకపోవడంతో లేని ‘ఎంట్రీ’... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును పరిశీలించే కస్టమ్స్ అధికారులు దాని విలువకు సరిపడా పన్ను విధించి వసూలు చేస్తారు. ఆపై ఈ బిల్ ఆఫ్ ఎంట్రీని వ్యాపారికి అందిస్తారు. అయితే ఖత్రి చేయించిన నగదు బదిలీలు హవాలా రూపంలో పంపిన డబ్బునకు సంబం ధించినవి కావడంతో దీనికి సంబంధించిన సరుకు రావడం, బిల్ ఆఫ్ ఎంట్రీ లభించడం అనేది ఉండదు. దీంతో నిర్ణీత సమయంలో బ్యాంకు అధికారులకు బిల్ ఆఫ్ ఎంట్రీలు దాఖలు కాలేదు. అప్రమత్తమైన బ్యాంకు అధి కారులు.. క్షేత్రస్థాయి పర్యటన చేయగా రికార్డు ల్లో ఉన్నవి బోగస్ చిరునామాలుగా తేలింది. 2015లోనే ఎస్టీఆర్ నమోదు... ఈ తతంగం మొత్తం 2015లో జరిగింది. శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ, జీఎస్ ట్రేడర్స్, వినాయక ఎంటర్ప్రైజెస్ చేసిన విదేశీ లావా దేవీలను అనుమానం వ్యక్తం చేస్తూ హెచ్డీ ఎఫ్‌సీ అధికారులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్యూఐ)–ఇండియాను ఆశ్ర యించారు. 2015 నవంబర్ 4న ఎఫ్యూఐలో సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ (ఎస్టీఆర్) నమోదు చేశారు. ఈ లావాదేవీలన్నీ విదే శాలతో జరిగినవి కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్ ఉండి ఉంటుందని అనుమానిం చిన ఈడీ రంగంలోకి దిగింది. దర్యాప్తు చేప ట్టిన ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ఈ ఏడాది జూన్ 23న ఖత్రి, వినోద్, ఆనంద్‌కుమార్‌ను అరెస్టు చేశారు. మరోపక్క బోగస్ పత్రాలతో తమ శాఖలో బ్యాంకు ఖాతా లను తెరిచారంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ కె.శైలజ.. చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు అప్పటికే ఈడీ అరెస్టు చేసిన ముగ్గురినీ పీటీ వారెంట్‌పై తమ కేసులో అరెస్టు చేశారు. న్యాయస్థానం అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత ఈ నెల 1న దుర్గాప్రసాద్, సాయికిరణ్‌లను కటక టాల్లోకి పంపారు. ఈ వ్యవహారాన్ని సీరియ స్‌గా తీసుకున్న ఈడీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. మరో ఇద్దరి సహకారంతో ‘బదిలీ’ బోగస్ కరెంట్ ఖాతాలు సిద్ధం చేసిన ఖత్రి వీటిలోకి ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయించడానికి వినోద్ ఓఝా, రాణిగం జ్‌కు చెందిన స్టీలు వ్యాపారి ఆనంద్ కుమార్ బిద్రకర్ను సంప్రదించాడు. తాను తెరిచిన బోగస్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేందుకు వీరితో ఒప్పందం కుదుర్చుకు న్నాడు. వీరి సాయంతో ఖత్రి బోగస్ బ్యాంకు ఖాతాల ద్వారా 40 రోజుల్లో రూ.31.6 కోట్ల నగదును విదేశీ ఖాతాల్లోకి మళ్లిం చాడు. హాంగ్‌కాంగ్‌లో ఉన్న పవన్ అగ ర్వాల్ నుంచి ఎల్ఈడీ లైట్లు, ఇతర ఉప కరణాలు దిగుమతి చేసుకున్నట్లు నకిలీ ఇన్వాయిస్లు పొందిన ఖత్రి వీటి ఆధారంగా నగదు బదిలీల ప్రక్రియ పూర్తి చేశాడు. ఈ తరహాలో విదేశాలకు నగదు బదిలీ చేసిన కరెంట్ ఖాతాదారులకు సంబంధించి ఫెమా చట్టం ప్రకారం... నగదు బదిలీ జరిగిన 180 రోజుల్లోపు ఖాతాదారులు బ్యాంకునకు బిల్ ఆఫ్ ఎంట్రీని దాఖలు చేయాల్సి ఉంటుంది.