సాక్షి,ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణకు హాజరైనారు. ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం చేరుకోవడం చర్చనీయాంతంగా నిలిచింది. అయితే ఏ కేసుకు సంబంధించి అంబానీని పిలిచారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఫెమా ఉల్లంఘన కేసులో అంబానీనీ విచారించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) కింద అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరైనట్టు తెలుస్తోంది. కాగా 2020లో మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు అధికారులను, అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో యెస్ బ్యాంక్స్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ. 12,800 కోట్ల రుణాలు పొందాయి. రిలయన్స్‌తోపాటు, పాటు చాలా కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ గతంలో అంబానీకి సమన్లు జారీ చేసి విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment