Anil Ambani
-
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ!
ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయి.. అప్పులన్నీ దాదాపుగా తీరిపోయాయి.. నష్టాలు పోయి లాభాలు కూడా పలకరించాయి. ఇక అంతా ఆనందమే అనుకుంటున్న సమయంలో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారంటూ రిలయన్స్ పవర్‌కి, దాని అనుబంధ సంస్థకు భారత క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్ఈసీఐ షోకాజ్ నోటీసు పంపింది. సంస్థలపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ సంజాయిషి కోరింది.రిలయన్స్ పవర్‌కు చెందిన ఒక యూనిట్ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సమర్పించిందనే ఆరోపణలపై రిలయన్స్ పవర్‌ను, దాని యూనిట్‌ను మూడేళ్లపాటు వేలంలో పాల్గొనకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) గత వారం నిషేధించింది.రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్యూ బీఈఎస్ఎస్ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ కూడా నకిలీదని ఎస్ఈసీఐ తన నవంబర్ 13 నాటి నోటీసులో పేర్కొంది. ఈ చర్య తర్వాత, గురువారం బీఎస్ఈలో రిలయన్స్ పవర్ షేర్లు 1.53 శాతం పడిపోయి రూ.36 వద్ద స్థిరపడ్డాయి.కాగా ఆరోపణలపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "మోసం, ఫోర్జరీ, కుట్రలో బాధితులం" అని పేర్కొంది. “దీనికి సంబంధించి ఇప్పటికే థర్డ్ పార్టీపై అక్టోబర్ 16న ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశాం. దాని ఆధారంగా నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదైంది. విషయం దర్యాప్తు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది” అని రిలయన్స్ పవర్ తెలిపింది. -
అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనిల్ అంబానీకి మళ్ళీ గట్టి ఎదురుదెబ్బ తెగిలింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలపై మూడేళ్లపాటు టెండర్లలో బిడ్డింగ్ చేయకుండా 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (SECI) నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.SECI తన టెండర్ ప్రక్రియలో భాగంగా జూన్‌లో 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ వంటి వాటికి బిడ్లను ఆహ్వానించింది. ఆ సమయంలో అనిల్ అంబానీకి చెందిన సంస్థలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేయడం మాత్రమే కాకుండా.. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ సమర్పించిన బిడ్‌ను రద్దు చేసి నిషేదించింది.అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో SECI డిబార్మెంట్ ఒకటి. అంత కంటే ముందు ఆగస్టులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంబానీని సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించి, రూ. 25 కోట్ల జరిమానా కూడా విధించింది. అక్టోబర్‌లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సెబీని పెనాల్టీ వసూలు చేయకుండా నిలిపివేసినప్పటికీ, సెక్యూరిటీల మార్కెట్ నుంచి డిబార్మెంట్ కొనసాగుతోంది.రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ జారీ చేసిన సాధారణ ప్రయోజన రుణాలకు సంబంధించిన కేసులో కూడా సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ అంబానీ 2016లో పిపావావ్ షిప్‌యార్డ్‌ను కొనుగోలు చేయడంలో భారీగా పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత దానిని రిలయన్స్ నావల్ & ఇంజినీరింగ్‌గా మార్చారు. ఇది కూడా ఊహించనిరీతిలో ముందుకు వెళ్లలేకపోయింది. చివరకు దానిని విక్రయించాల్సి వచ్చింది. -
అనిల్ అంబానీ కంపెనీలకు సెబీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన కంపెనీల్లో రుణ భారాన్ని తగ్గించుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ అయితే ఇటీవల పూర్తిగా రుణరహితంగా మారింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని కష్టాలు తప్పడం లేదు.కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపింది. రూ. 154.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి.15 రోజుల్లో చెల్లించాలిఈసారి 15 రోజుల్లోగా చెల్లించకపోతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేస్తామని సెబీ ఈ సంస్థలను హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్), రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్జెన్ లిమిటెడ్ ఉన్నాయి.ఆరు వేర్వేరు నోటీసులలో ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ. 25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఇందులో వడ్డీతోపాటు 15 రోజులకూ రికవరీ ఖర్చులను జోడించింది. బకాయిలు చెల్లించని పక్షంలో, మార్కెట్ రెగ్యులేటర్ ఈ సంస్థల స్థిర, చరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
రాధికా మర్చంట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
భూటాన్‌లో అనిల్ అంబానీ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్‌లో ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్ సంస్థలు వాటి షేర్ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. -
షేర్ మార్కెట్లో దూసుకెళ్తున్న అనిల్ అంబానీ
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ (ఆర్‌పవర్) షేర్ మార్కెట్లో దూసుకెళ్తోంది. ఆ కంపెనీ షేర్లు గత తొమ్మిది సెషన్లలో 55 శాతం ర్యాలీ చేశాయి. సెప్టెంబర్ 17న రూ. 31.40 ముగింపు ధర నుండి ఆర్‌పవర్ షేర్లు వరుసగా తొమ్మిది రోజులు ఎగువ సర్క్యూట్లను తాకాయి.నిధుల సమీకరణకు సంబంధించి అక్టోబర్ 3న కంపెనీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో కంపెనీ షేర్లకు ఊపు వచ్చింది. సెప్టెంబర్ 30న ఆర్‌పవర్ షేర్లు దాని మునుపటి ముగింపు రూ. 46.35కి వ్యతిరేకంగా ఒక్కొక్కటి రూ. 46.25 వద్ద ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభమైన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్టాక్ దాదాపు 5 శాతం క్షీణించి రూ.44.21 కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే మధ్యాహ్న సమయంలో తిరిగి పుంజుకుంది. ఎన్ఎస్ఈలో రూ. 48.66 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎన్ఎస్ఈలో 20.62 కోట్ల షేర్లు చేతులు మారగా, బీఎస్ఈఇలో దాదాపు 3.57 కోట్ల షేర్లు చేతులు మారాయి.ఊపు ఎందుకంటే..విదర్భ ఇండస్ట్రీస్ పవర్‌కు రూ. 3,872 కోట్ల గ్యారెంటీని పూర్తిగా సెటిల్ చేసినట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత ఆర్‌పవర్ షేర్లలో అప్‌ట్రెండ్ వచ్చింది. ఈ సెటిల్మెంట్ ఫలితంగా రూ. 3,872.04 కోట్ల బకాయి రుణానికి సంబంధించిన అన్ని కార్పొరేట్ గ్యారెంటీలు, అండర్‌టేకింగ్‌లు, ఆబ్లిగేషన్లు పరిష్కారమయ్యాయి. సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్తో కూడా అన్ని వివాదాలను రిలయన్స్ పవర్ పరిష్కరించుకుంది. అంతేకాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలన్నీ తీరిపోయినట్లు ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగింపు నాటికి సంస్థ ఏకీకృత నికర విలువ రూ.11,155 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
ఎట్టకేలకు.. అనిల్ అంబానీకి భారీ ఊరట
అప్పుల భారం తగ్గించుకుంటున్న అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వివాదంలో తమకు అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు తీర్పు వెలువరించినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. డీవీసీ-రియలన్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కేసుపై కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా డీవీసీ.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.780 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కోల్కత్తా హైకోర్టు సమర్ధించింది.పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పే కాంట్రాక్టును రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక దశాబ్దం క్రితం రూ.3,750 కోట్లకు దక్కించుకుంది. అయితే కొన్ని వివాదాలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది.ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలుఈ సమయంలో డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి నష్టాన్ని కోరింది. దీన్ని సవాలు చేస్తు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్టును ఆశ్రయించింది. 2019లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అనిల్ అంబానీ కంపెనీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. రూ.896 కోట్లు చెల్లించాలని డీవీసీని ఆదేశించింది. కానీ డీవీసీ దీనిపైన కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కేలా గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని సమర్థించింది. -
పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
పడిన కెరటం తప్పకలేస్తుంది. అలాగే పరాజయం పాలైన ప్రతిఒక్కరికీ తమదైన రోజు తప్పక వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన అనిల్ అంబానీ వరుస వైఫల్యాలతో నష్టాలు, అప్పులతో చీకటి రోజులను చవిచూశారు. ఇప్పుడాయనకు మంచి రోజులు వచ్చాయి. ఒక్కో కంపెనీ అప్పుల ఊబిలోంచి బయట పడుతోంది. వ్యాపార సామ్రాజ్యం తిరిగి పుంజుకుంటోంది.టాప్ టెన్ సంపన్నుడుఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా 2008లో 42 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. తర్వాత ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రూ.24,000 కోట్ల విలువైన బాండ్లను చెల్లించలేక రిలయన్స్ క్యాపిటల్ 2021లో దివాళా తీసే వరకూ వచ్చేశారు.వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని చూసి చాలా మంది ఇక ఆయన పుంజుకోలేడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగిన అనిల్ అంబానీ అద్భుతమైన పునరాగమనం చేస్తున్నారు.కలిసొచ్చిన సెప్టెంబర్ఈ ఏడాది సెప్టెంబర్ నెల రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి అనుకూలమైనదిగా మారుతోంది. ఎందుకంటే 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. రిలయన్స్ పవర్ భారీ ఆర్డర్‌ను అందుకుంది. దాని షేర్లను పెంచుకుంది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ రహితం దిశగా వేగంగా కదులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నుండి అనుకూలమైన వార్తలను అందుకుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?అనిల్ అంబానీకి పెద్ద ఊరటగా కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చేసిన అంచనా ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై బకాయిలను క్లెయిమ్ చేయాలని రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టిందని వార్తా సంస్థ తాజాగా నివేదించింది.అనిల్ అంబానీ నెట్వర్త్తన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీల పురోగతితో అనిల్ అంబానీ నెట్‌వర్త్ కూడా పుంజుకుంటోంది. నిధుల చేరిక ఫలితంగా ఇటీవలి ఫైలింగ్‌ల ప్రకారం.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ రూ. 9,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2023 ఫిబ్రవరిలో నివేదించినదాని ప్రకారం.. అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 20,000 కోట్లు. -
అనిల్ అంబానీ కంపెనీలో భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రమోటర్లు ఈక్విటీ రూపేణా రూ. 1,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి జతగా ముంబైకి చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రూ. 1,900 కోట్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు రూ. 6,000 కోట్ల సమీకరణ ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది.వీటిలో రూ. 3,014 కోట్లు ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా అందుకోనుంది. మిగిలిన రూ. 3,000 కోట్లు సంస్థాగత కొనుగోలుదారుల నుంచి సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 3,014 కోట్లు సమకూర్చుకోనుంది. వీటిలో ప్రమోటర్ సంస్థ రైజీ ఇన్ఫినిటీ ప్రయివేట్ 4.6 కోట్ల షేర్లకు సబ్స్క్రయిబ్ చేయనుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?ఈ బాటలో ముంబై సంస్థలు ఫార్చూన్ ఫైనాన్షియల్ అండ్ ఈక్విటీస్ సర్వీసెస్(4.41 కోట్ల షేర్లు– రూ. 1,058 కోట్లు), ఫ్లోరిన్‌ట్రీ ఇన్నొవేషన్స్ ఎల్ఎల్పీ(3.55 కోట్ల షేర్లు– రూ. 582 కోట్లు) చొప్పున ప్రిఫరెన్షియల్ ఇష్యూలో భాగంకానున్నాయి. పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాథ్యూ సైరియా ఫ్లోరిన్ట్రీని ఏర్పాటు చేయగా.. ఫార్చూన్ ఫైన్షాఇయల్ను నిమిష్ షా నెలకొల్పారు. రిలయన్స్ ఇన్ఫ్రాలో ప్రమోటర్లకు ప్రస్తుతం 21.34 శాతం వాటా ఉంది. -
హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్‌లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్మెంట్లలో రిలయన్స్ ఇన్ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ సెటిల్మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!అలాగే ఎడిల్వీస్కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. -
అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. -
Anil Ambani: దెబ్బ మీద దెబ్బ.. పట్టిందల్లా పతనం!
-
రిలయన్స్ హోమ్‌పై సెబీ
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల అక్రమ మళ్లింపులో అనిల్ అంబానీ ప్రధాన పాత్ర పోషించినట్లు సెబీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆడిటింగ్ తదితరాల వివరాలను బయటపెట్టింది. వీటి ప్రకారం అప్పటి కంపెనీ బోర్డు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సంబంధిత యాజమాన్యం వీటిని పట్టించుకోలేదు. కంపెనీ విధానాలను వ్యతిరేకంగా రుణాలను విడుదల చేసింది. అసంపూర్తి డాక్యుమెంటేషన్, క్రెడిట్ పాలసీ నిబంధనల ఉల్లంఘన ద్వారా రుణ మంజూరీ జరిగింది. రుణ విడుదల అంశాలను సమీక్షిస్తూ బోర్డు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. వెరసి సాధారణ కార్పొరేట్ రుణ విధానాలకు పాతరవేశారు. వీటన్నిటి వెనుక మాస్టర్‌మైండ్ అనిల్ అంబానీదేనని సెబీ అభిప్రాయపడింది. ఇతర వివరాలు ఇలా.. ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధుల అక్రమ మళ్లింపు జరిగినట్లు కంపెనీకి చట్టబద్ధ ఆడిటర్‌గా వ్యవహరించిన పీడబ్ల్యూసీ, ఫోరెన్సిక్ ఆడిటర్ గ్రాంట్ థార్న్టన్ వెల్లడించాయి. గ్రాంట్ థార్న్‌టన్‌ను రుణదాతల కన్సార్షియంకు అధ్యక్షత వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నియమించింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం సాధారణ కార్పొరేట్ లోన్ ప్రొడక్ట్‌లో భాగంగా విడుదల చేసిన రుణాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. 2018 మార్చి31కల్లా రూ. 900 కోట్ల రుణాలు విడుదలకాగా.. 2019 మార్చి31కల్లా రూ. 7,900 కోట్లకు జంప్‌చేశాయి. రుణగ్రహీత సంస్థలలో నెగిటివ్ నెట్‌వర్త్, అతితక్కువ ఆదాయం, బిజినెస్ కార్యకలాపాలు, లాభార్జన లేకపోవడం తదితర పలు ప్రతికూలతలున్నాయి. ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి మాత్రమే రుణాలను పొందడం, రుణాలతో పోలిస్తే తక్కువ ఈక్విటీ మూలధనం, రుణాలు అందుకునే ముందుగానే ఏర్పాటుకావడం, రుణ దరఖాస్తు రోజునే రుణ మంజూరీ తదితర అక్రమాలు నెలకొన్నాయి. ఇక 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్‌వరకూ బీవోబీ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ తొలి నివేదిక 2020 జనవరిలో వెలువడింది. ఈ కాలంలో కార్పొరేట్ రుణ విధానాలకింద ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ. 14,577 కోట్లకుపైగా రుణాలు విడుదలయ్యాయి. వీటిలో రూ. 12,487 కోట్లకుపైగా నిధులు సంబంధిత 47 సంస్థలకే చేరాయి. 2019 అక్టోబర్ 31కల్లా రూ. 7,984 కోట్ల రుణాలు వసూలుకావలసి ఉంటే.. దాదాపు రూ. 2,728 కోట్లు మొండిబకాయిలుగా నమోదయ్యాయి. తదుపరి నివేదికలలో గ్రూప్‌లోని పలు ఇతర కంపెనీలకు సైతం రుణాలు విడుదలైనట్లు నివేదిక పేర్కొంది. -
నిధులు మళ్లింపు.. అంబానీపై రూ.25 కోట్ల పెనాల్టీ
మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా అనిల్ అంబానీను, 24 సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు అంబానీ రూ.25 కోట్ల పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై కూడా రూ.6 లక్షల జరిమానా విధించి, ఆరు నెలల పాటు మార్కెట్ నుంచి బహిష్కరించింది.అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఆర్హెచ్ఎఫ్ఎల్) ఇతర సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో సెబీ దర్యాప్తు జరిపి తాజాగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఆర్హెచ్ఎఫ్ఎల్ ఆరోపణల నేపథ్యంలో 222 పేజీలతో తుది ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ కీలక అధికారుల సహాయంతో అనిల్ అంబానీకి అనుసంధానం అయిన సంస్థలకు రుణాల రూపంలో నిధులు మళ్లించినట్లు సెబీ కనుగొంది. చిన్న కంపెనీలు నియమాలకు విరుద్ధంగా భారీగా రుణాలు పొందాయని సెబీ గుర్తించింది.ఫిబ్రవరి 2022లో జరిగిన ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అప్పటి కీలక అధికారులు అనిల్ అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలపై సెబీ చర్యలు తీసుకుంది. వీరిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరితో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల నుంచి కూడా మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని చెప్పింది.ఇదీ చదవండి: పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..ఈ కేసుతో సంబంధం ఉన్న అంబానీతో పాటు మరో ముగ్గురికి చెందిన 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్పై రూ.26 కోట్లు, షాపై రూ.21 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇతర ఒక్కో సంస్థపై రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. -
అంబానీ ‘పవర్’ను కొంటున్న అదానీ పవర్!
దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్‌తో సహా అనేక రంగాలలో ఉన్న అదానీ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న ఆయన విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేసే యోచనలో ఉన్నారు.రూ. 2.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన అతని అదానీ పవర్.. నాగ్‌పూర్‌లో ఉన్న బుటిబోరి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోందని ‘మింట్’ నివేదిక పేర్కొంది. ఈ పవర్ ప్రాజెక్ట్‌కు రుణదాతగా ఉన్న సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీతో అదానీ గ్రూప్ మాట్లాడుతోందని, ఈ డీల్ విలువ రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది.ఈ పవర్ ప్లాంట్ ఒకప్పుడు అనిల్ అంబానీకి చెందిన దివాలా తీసిన రిలయన్స్ పవర్ ఆధీనంలో ఉండేది. ఇది ఇప్పుడు రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ కింద ఉంది. ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 600 మెగావాట్లు. ఈ వార్తల తర్వాత సోమవారం (ఆగస్టు 19) రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ.32.79 వద్ద ముగిసింది. -
చురుకైన ఈ ఎంటర్‌ప్రిన్యూర్ అనిల్ అంబానీ కోడలు
ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ఈనెల 12న అత్యంత విలాసంగా జరిగింది. అబ్బురంగా జరిగిన ఈ వేడుకల విశేషాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సోదరుడు, పెద్దగా వార్తల్లో లేని అనిల్ అంబానీ కోడలు ఎంటర్‌ప్రిన్యూర్ క్రిషా షా (Khrisha Shah) గురించి, ఆమె వ్యవస్థాపక స్ఫూర్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనిల్ అంబానీ, టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీని క్రిషా షా వివాహం చేసుకున్నారు. క్రిషా నికుంజ్ ఎంటర్ప్రైజెస్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివంగత నికుంజ్ షా, ఫ్యాషన్ డిజైనర్ నీలం షా కుమార్తె ఈ క్రిషా షా. ఈమెకు ఇద్దరు పెద్ద తోబుట్టువులు ఉన్నారు. సోదరుడు మిషాల్ షా వ్యాపారవేత్త కాగా సోదరి నృతి షా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్.ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. క్రిషా షా, జై అన్మోల్ అంబానీలు వారి కుటుంబాల ద్వారా పరిచయం అయ్యారు. కొన్నేళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో వీరి వివాహం కూడా విలాసవంతంగానే జరిగింది.‘డిస్కో’ స్థాపనక్రిషా షా వృత్తిపరమైన ప్రయాణం యూకేలో యాక్సెంచర్ సంస్థలో ప్రారంభమైంది. అక్కడ ఆమె భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ సర్వీస్ ప్రాజెక్ట్‌లలో సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత ఆమె భారీ సంపాదననిచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ఏర్పాటు కలల వైపు పయనించారు. అలా సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ ‘డిస్కో’ను స్థాపించారు. ఇది ప్రొఫెషనల్స్ కోసం ఆన్లైన్ హైపర్ లోకల్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. ఫ్రీలాన్సర్లు, ఎంటర్‌ప్రిన్యూర్లు, ప్రొఫెనల్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వొచ్చు. తమ విశేషాలను పంచుకోవచ్చు.ఎంటర్ప్రిన్యూర్గానే కాకుండా క్రిషా షా సామాజిక కార్యకర్త, మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా. ప్రేమ, ఆశ, శాంతి, ఐక్యత విలువలను ప్రోత్సహించే సాంస్కృతిక, మానసిక ఆరోగ్య అవగాహన చొరవ అయిన #LOVEnotfear అనే ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. క్రిషా షా విద్యా నేపథ్యం విషయానికి వస్తే యూఎస్‌లోని యూసీ బర్కిలీ నుంచి పొలిటికల్ ఎకానమీలో బీఏ, ఇంగ్లండ్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషల్ పాలసీ అండ్ డెవలప్మెంట్లో ఎంఎస్సీ పట్టా పొందారు.జై అన్మోల్ అంబానీ, క్రిషా షా దంపతులు ప్రస్తుతం అనిల్ అంబానీ, టీనా అంబానీలతో కలిసి ముంబైలోని పాలి హిల్‌లోని సంపన్న నివాస ప్రాంతంలో తమ 17-అంతస్తుల ఇల్లు, అబోడ్లో నివసిస్తున్నారు. వార్తా సంస్థ డీఎన్ఏ ఇండియా ప్రకారం దీని విలువ రూ. 5,000 కోట్లు. -
అనిల్ అంబానీ కంపెనీలు.. వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అంబానీ సోదరులు అనగానే అందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీయే గుర్తొస్తారు. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన అనిల్ అంబానీ (Anil Ambani ) గురించి, ఆయనకున్న కంపెనీలు, వ్యాపార సామ్రాజ్యం గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది.ఎప్పుడూ నష్టాలతో వార్తల్లో నిలిచే అనిల్ అంబానీ ఇటీవల రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేశారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది. రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని తీర్చేసింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్, పవర్ జనరేషన్ వంటి రంగాల్లో వైవిధ్యమైన వ్యాపారాలను కలిగి ఉంది. 2006లో రిలయన్స్ గ్రూప్ విడిపోయిన తర్వాత ఈ గ్రూప్ ఏర్పాటైంది. 2002 జూలై 6న ధీరూభాయ్ అంబానీ మరణించిన తరువాత, అప్పటి 15 బిలియన్ డాలర్ల సమ్మేళనం ఇద్దరు సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య విడిపోయింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ ఇవే..» రిలయన్స్ కమ్యూనికేషన్స్: మార్కెట్ క్యాప్ రూ.335 కోట్లు. షేరు 52 వారాల కదలిక రూ.2.49 గరిష్టాన్ని, రూ.1.01 కనిష్టాన్ని సూచిస్తుంది. షేరు ప్రస్తుత ధర రూ.1.93.» రిలయన్స్ హోమ్ ఫైనాన్స్: మార్కెట్ క్యాప్ రూ.132 కోట్లు. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.4.05గా ఉంది. 52 వారాల కదలిక రూ .5.80 గరిష్టాన్ని, రూ .1.70 కనిష్టాన్ని సూచిస్తుంది.» రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: మార్కెట్ క్యాప్ రూ.4,876 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ప్రస్తుత ధర రూ.202.99. షేరు 52 వారాల కదలికలు రూ.308 గరిష్టాన్ని, రూ.134 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.» రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్: మార్కెట్ క్యాప్ రూ.155 కోట్లు. కంపెనీ నౌకా నిర్మాణంలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2.3గా ఉంది.» రిలయన్స్ పవర్: మార్కెట్ క్యాప్ రూ.4,520 కోట్లు. రిలయన్స్ పవర్ ప్రస్తుత ధర రూ.31.08గా ఉంది. షేరు 52 వారాల కదలికలు రూ.34.45 గరిష్టాన్ని, రూ.13.80 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు! -
‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు!
ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చీకటి రోజులు తొలగిపోయాయి. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన ఆయన రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేస్తున్నారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది.బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని కలిగి ఉండేది. రుణాలిచ్చిన బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేసింది. గత కొన్ని నెలలుగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులతో డెట్ సెటిల్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ బ్యాంకులకు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించింది. ఫలితంగా రిలయన్స్ పవర్ ఇప్పుడు స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా మారింది.అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ప్రస్తుతం 38 లక్షలకు పైగా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో రూ .4016 కోట్ల ఈక్విటీ బేస్‌ను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని 3960 మెగావాట్ల సాసన్ యూఎంపీపీ, 1200 మెగావాట్ల రోసా థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా ఇది 5900 మెగావాట్ల ఆపరేటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 2008లో సుమారు రూ.260.78 వద్ద ట్రేడైన రిలయన్స్ పవర్ షేరు భారీ పతనం తర్వాత 2020 మార్చి 27న షేరు ధర రూ.1.13 వద్ద ముగిసింది.కొన్నేళ్లుగా నెమ్మదిగా కోలుకుంటున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ మరోసారి ట్రేడర్ల దృష్టిని ఆకర్షించింది. రిలయన్స్ పవర్ షేరు ప్రస్తుతం రూ.26.15 పైన ట్రేడవుతోంది. ఇది త్వరలోనే రూ.36 మార్కును చేరుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అప్పుల్లో ఉన్నా అస్సలు తగ్గని అనిల్ అంబానీ.. కొత్త కారులో
భారతదేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ తన రెండో కొడుకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరపడానికి సిద్ధమయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్ 29 మే నుంచి జూన్ 1 మధ్య జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. తాజాగా ముఖేష్ అంబానీ సోదరుడు 'అనిల్ అంబానీ' బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో విమానాశ్రయంలో కనిపించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనిల్ అంబానీ బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో నుంచి దిగటం చూడవచ్చు. కారు నుంచి బయటకు వచ్చిన తరువాత ఫోటోగ్రాఫర్ల వైపు కూడా చూడకుండా ముంబైలోని కలీనా విమానాశ్రయంలోకి వెళ్లారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది అనిల్ అంబానీ కొనుగోలు చేశారా అని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.బీవైడీ ఎలక్ట్రిక్ కారు డైనమిక్, ప్రీమియం, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో.. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అనిల్ అంబానీ కనిపించిన కారు ప్రీమియం వేరియంట్ అని తెలుస్తోంది.బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు 61.44 కిలోవాట్, 82.56 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి వరుసగా 510 కిమీ, 650 కిమీ రేంజ్ అందిస్తాయి. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తాయి. View this post on Instagram A post shared by The Viral Cinema - Sajal Jain (@theviralcinema) -
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీకి మరో దెబ్బ తగిలింది. తన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో రూ.397.66 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ ఇప్పుడు దానిని మించి నష్టాన్ని చవిచూసింది.ఇంధన వ్యయాలు పెరగడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. నష్టాలు ఉన్నప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,193.85 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.1,853.32 కోట్లతో పోలిస్తే ఇది అధికం. అయితే ఈ త్రైమాసికంలో వినియోగించిన ఇంధన వ్యయం రూ.953.67 కోట్లకు పెరిగింది. 2022-23 జనవరి-మార్చి కాలంలో ఇది రూ.823.47 కోట్లు.పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్ పవర్ నష్టాలు గణనీయంగా ఎగిసి రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరిగాయి. ఇక క్యూ4లో రిలయన్స్ పవర్ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కాగా సెబీ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు (ఎఫ్‌సీసీబీలు), సెక్యూరిటీల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. -
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..
నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి తుది నోటీసు అందింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. రూ. 2,599 కోట్లను ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున వడ్డీతో పాటు 15 రోజులలోపు తిరిగి చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL)కి డీఎంఆర్సీ నోటీసు జారీ చేసింది. చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఇదీ నేపథ్యం..న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సెక్టార్ 21 ద్వారక వరకు నడిచే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ రూపకల్పన, నిర్వహణ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, అనిల్ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే తాము గుర్తించిన కొన్ని నిర్మాణ లోపాలను డీఎంఆర్సీ పరిష్కరించలేదని ఆరోపిస్తూ 2012లో డీఏఎంఈపీఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీనికి సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ రూ. 2,950 కోట్లు వడ్డీతో సహా డీఏఎంఈపీఎల్కి చెల్లించాలని ని ఆదేశించింది. దీంతో డీఎంఆర్సీ రూ. 2,599 కోట్లను యాక్సిస్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో తాము డిపాజిట్ చేసిన రూ. 2,599 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనిల్ అంబానీ సంస్థకు 15 రోజుల సమయం ఇచ్చింది. -
బ్లూం బెర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు
ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్ దిగ్గజం ‘లో రియాల్’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్ కారణంగా డెట్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ రెండవ స్థానం, ఎలాన్ మస్క్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్ గ్రూప్‌లోకి భారత్ నుంచి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం. -
అనిల్ అంబానీ పిల్లలు ఆ బిజినెస్‌లో.. ఒకప్పుడు లగ్జరీ కార్లలో!
ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన అందరికీ.. దాదాపు అనిల్ అంబానీ కుటుంబం గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే.. అనిల్ అంబానీ పిల్లలు ఇద్దరూ మీడియాకు కొంత దూరంగా ఉంటారు. ఈ కథనంలో వీరి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.ఒకప్పుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ, కొన్ని సొంత నిర్ణయాల వల్ల భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అనిల్ అంబానీ, టీనాలకు ఇద్దరు కుమారులు. వారే 'జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ'. వీరిరువురు చాలావరకు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు.జై అన్మోల్ అంబానీ.. అనిల్ అంబానీ, టీనాల పెద్ద కొడుకు. 1991 డిసెంబర్ 12న జన్మించిన ఈయన ముంబైలోని ప్రసిద్ధ కేథడ్రల్, జాన్స్ కాన్వెంట్ స్కూల్ నుండి తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆ తరువాత యూకేలో సెవెన్ ఓక్స్ స్కూల్లో చేరారు. 18 ఏళ్ల వయసులోనే చదువుకుంటూ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇంటర్న్‌షిప్ ప్రారంభించారు.చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లోనే పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత 2017లో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవి చేపట్టారు. ఆ తరువాత వివిధ పదవులను చేపట్టారు.ఇక అనిల్ అంబానీ రెండో కుమారుడు జై అన్షుల్ అంబానీ విషయానికి వస్తే.. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్‌లో కూడా పనిచేశారు. ఆ తరువాత 2019లో జై అన్మోల్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇన్ఫ్రా డైరెక్టర్ల బోర్డులోకి ప్రవేశించారు.జై అన్మోల్, జై అన్షుల్ ఇద్దరికీ లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వీరు మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌కే350, లంబోర్ఘిని గల్లార్డో, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ వోగ్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. కార్లు మాత్రమే కాకుండా వీరి వద్ద హెలికాఫ్టర్లు కూడా ఉండేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయా? లేదా అనేది తెలియాల్సిన విషయం.