రూ.700 కోట్లు కట్టండి | UK High Court to set terms in Chinese banks claim against Anil Ambani | Sakshi
Sakshi News home page

రూ.700 కోట్లు కట్టండి

Published Sat, Feb 8 2020 5:47 AM | Last Updated on Sat, Feb 8 2020 5:47 AM

UK High Court to set terms in Chinese banks claim against Anil Ambani - Sakshi

లండన్‌: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్‌ అనిల్‌ అంబానీకి బ్రిటన్‌ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆరు వారాల్లో 100 మిలియన్‌ డాలర్లు (రూ.700 కోట్లు) కోర్టులో డిపాజిట్‌æ చేయాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంకు ఆఫ్‌ చైనా ముంబై శాఖ, చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా అనిల్‌ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌లో కండీషనల్‌ ఆర్డర్‌లో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement