Reliance Communications
-
అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీపై దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వేసిన కేసులో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో ఆయన ఆస్తులపై తీవ్ర ఆంక్షలు విధించింది. వాటిని బదలాయించడంగానీ లేక విక్రయించడంగానీ లేదా తాకట్టు పెట్టడంకానీ చేయరాదని స్పష్టం చేసింది. ఆస్తులకు సంబంధించి ఆయన ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులూ జరగరాదని ఆదేశించింది. జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేస్తూ, ఆలోపు తమ వాదనలు తెలపాలని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే కంపెనీలపై ఈ లోపు తగిన న్యాయపరమైన చర్యలు కొనసాగుతాయని, ఐబీసీ పార్ట్ 3 కింద అంబానీ పిటిషన్ విషయంలో మాత్రమే స్టే విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణ సదుపాయం కల్పించింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణంగా అందించింది. 2016 సెప్టెంబర్‌లో అనిల్ అంబానీ వ్యక్తిగత పూరీకత్తునిచ్చారు. అయితే, 2016 ఆగస్టు నుంచి వర్తింపజేస్తూ ఆర్‌కామ్, ఆర్ఐటీఎల్ ఖాతాలను 2017లో మొండిపద్దుల కింద బ్యాంకులు వర్గీకరించాయి. దీంతో అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును 2018 జనవరిలో ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఈలోగా ఆర్కామ్నకు ఇచ్చిన రూ. 5,447 కోట్లు వసూలు చేసుకునేందుకు చైనా బ్యాంకులకు బ్రిటన్ కోర్టుల నుంచి అనుమతులు లభించాయి. ఒకవేళ చైనా బ్యాంకులు కూడా అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులపై చర్యలు ప్రారంభిస్తే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని ఎస్బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్‌పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ ఎన్సీఎల్టీ ఈ నెల 20న ఆదేశాలు ఇచ్చింది. -
స్పెక్ట్రమ్ షేరింగ్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ పంపిణీ వివరాలను (షేరింగ్) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రమ్ పంపకం జరగ్గా.. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ కామ్ తోపాటు, వీడియోకాన్ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. ‘‘వీడియోకాన్ స్పెక్ట్రమ్ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్ టెల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వీడియోకాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు. ఏజీఆర్ బకాయిలను ఐబీసీ కింద నిర్వహణ బకాయిలుగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను జియో వినియోగించుకున్నందున ఆ మొత్తానికి సంబంధించి జియో చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగినా ఇవ్వలేదేమంటూ ధర్మాసనం టెలికం శాఖను ప్రశ్నించింది. అనంతరం దివాలా చర్యల పరిధిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్ పంపిణీకి సంబంధించి ఎంత మేర బకాయిలు రావాలన్న వివరాలను సమర్పించాలని టెలికం శాఖను ఆదేశించింది. 1999 నుంచి ఏ కంపెనీలు స్పెక్ట్రమ్ ను వినియోగించుకున్నదీ, వాటి మధ్య వాణిజ్య ఒప్పంద వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. ఏజీఆర్ బకాయిలను ఏటా కొంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించేందుకు అనుమతించాలని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి. ఈ రెండు కంపెనీలు కలసి రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. టెలికం శాఖ డిమాండ్ ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.8,000 కోట్లను ఇప్పటి వరకు జమ చేయగలిగింది. భారతీ ఎయిర్ టెల్ రూ.43,000 కోట్ల బకాయిలకు గాను రూ.18,000 కోట్లను చెల్లించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
జియోపై మీ వైఖరి చెప్పండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల వివాదం కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. వివరాల్లోకి వెడితే.. దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కట్టాల్సిన బాకీలను ఆ కంపెనీ స్పెక్ట్రంను వాడుకుంటున్నందున రిలయన్స్ జియో సంస్థ కట్టాలని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ (డాట్), ఇటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దివాలా ప్రక్రియ జరుగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి లేదన్నది డాట్ భావన కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఏ ఉత్తర్వులు ఇచ్చినా సమ్మతమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీలను జియో చెల్లించే అంశంపై అసలు కేంద్రం వైఖరి ఏమిటన్నది తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఏయేడాదికాయేడు ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీల వివరాలను సమర్పించాలంటూ డాట్‌కు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
అంబానీ వద్ద చిల్లి గవ్వ లేదా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘35 మిలియన్ పౌండ్ల యాట్ (దాదాపు 337 కోట్ల రూపాయల విలాసవంతమైన విహార పడవ), 60 మిలియన్ పౌండ్ల (దాదాపు 579 కోట్ల రూపాయల) బోయింగ్ జెట్ ప్రైవేటు విమానంతోపాటు ముంబైలో రెండు బిలియన్ డాలర్ల (దాదాపు 19 వేల కోట్ల రూపాయల) విలాసవంతమైన 27 అంతస్తుల కుటుంబ భవనం కలిగిన అనిల్ అంబానీ చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఏమిటీ?’ అంటూ లండన్ హైకోర్టులో మూడు చైనా బ్యాంకుల తరఫున న్యాయవాది అనిల్ అంబానీని ఉద్దేశించి వాదించారు. ఈ వాదనను ఆసక్తిగా విన్న హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్మన్ జోక్యం చేసుకొని ‘మీది విలాసవంతమైన జీవితం అని మాకు తెలుసు. ఒకప్పుడు ప్రైవేటు హెలికాప్టర్లో తిరిగిన మీరు బొంబార్డియర్ లెగసీ 650 ప్రైవేటు జెట్ విమానంలో తిరుగుతున్నారు. దాదాపు 2.31 మిలియన్ పౌండ్ల (దాదాపు 22 కోట్ల రూపాయలు) విలువైన 11 కార్లు మీ కుటుంబానికి ఉన్నాయి. పైగా మీకు ప్రత్యేకంగా దక్షిణ బొంబాయిలోని అత్యంత ఖరీదైన భవనంలో రెండు అంతస్థులు ఉన్నాయి.(అప్పులు చెల్లించలేను.. వైరాగ్యంలో అనిల్) చెల్లించడానికి మీ వద్ద డబ్బు లేకపోవడం ఏమిటీ? మార్చి 20వ తేదీలోగా 80 మిలియన్ పౌండ్లు (దాదాపు 772 కోట్ల రూపాయలు) బ్యాంకులకు చెల్లించండి’ అంటూ అనిల్ అంబానీని ఆదేశించారు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఆరువ వ్యక్తిగా రికార్డు సృష్టించిన అనిల్ అంబానీ 2008లో ఆర్థిక మాంద్యం వల్ల రిలయెన్స్ కమ్యూనికేషన్ల ద్వారా తీవ్రంగా నష్టపోయారు. దాన్ని పునరుద్ధరించడంలో భాగంగా ఆయన 2012లో చైనాకు చెందిన మూడు ప్రభుత్వ బ్యాంకుల నుంచి 550 మిలియన్ పౌండ్లు (దాదాపు 5,310 కోట్ల రూపాయలు) రుణంగా తీసుకున్నారు. నాడు అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపైనే అంత మొత్తం తీసుకున్నారు. తీసుకున్న రుణాలకు అసలు సంగతి అటుంచితే వడ్డీ కూడా చెల్లించక పోవడంతో చైనాకు చెందిన మూడు బ్యాంకులు ఓ బృందంగా ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మేరకు లండన్ హైకోర్టులో కేసు పెట్టాయి. గత డిసెంబర్లో ఈ కేసు విచారణ జరగ్గా, నాలుగు రోజుల కిందట మరోసారి కేసు విచారణకు వచ్చింది. కాగా, తన కంపెనీల షేర్ల విలువ మొత్తం 63.7 మిలియన్లు అని, నగదు జీరో అని, తాను రుణాలు చెల్లించే పరిస్థితుల్లో లేనని అనిల్ అంబానీ వాదించారు. ఆ సమయంలో చైనా బ్యాంకుల న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్మన్, అంబానీని నిలదీశారు. దానికి సమాధానంగా గతంలో స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు తాను చెల్లించాల్సిన 60 మిలియన్ పౌండ్లను తన సోదరుడు ముకేశ్ అంబానీ చెల్లించారని, ఇంకేమాత్రం తన అప్పులు చెల్లించేందుకు ఆయన సిద్ధంగా లేరని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ‘ఫర్వాలేదు. ముందు చెల్లించారు, మొన్న చెల్లించారు, ఇక ముందు కూడా చెల్లిస్తారు. చెల్లించేందుకు ఉమ్మడి ఆస్తులు లేవా?’ అని జడ్జీ ప్రశ్నించారు. తన క్లైయింట్‌ని డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకరావద్దని, అలా చేసినట్లయితే ఆయన తన కేసును తాను సరిగ్గా వాదించుకునే మానసిక పరిస్థితిలో ఉండరని అంబానీ న్యాయవాది వాదించారు. మార్చి 20లోగా చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు జడ్జీ కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలను పాటిస్తారా ? అని ఇంగ్లండ్ మీడియా అనిల్ అంబానీ న్యాయవాదిని సంప్రదించగా, చట్టపరంగా తదుపరి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో పరిశీలించాల్సి ఉందన్నారు. చైనా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్న ఏడాదే స్టీఫెన్ స్పీల్బెర్గ్ దర్శకత్వం వహించిన ‘లింకన్’ హాలివుడ్ చిత్రానికి ఫైనాన్స్ చేయడం ద్వారా అంబానీకి భారీగా డబ్బులు వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ నటుడిగా రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. -
రూ.700 కోట్లు కట్టండి
లండన్: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్ అనిల్ అంబానీకి బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆరు వారాల్లో 100 మిలియన్ డాలర్లు (రూ.700 కోట్లు) కోర్టులో డిపాజిట్æ చేయాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా ముంబై శాఖ, చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లో కండీషనల్ ఆర్డర్లో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
ఆర్‌కామ్ ఆస్తుల రేసులో ఎయిర్టెల్, జియో
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్ డేటా సెంటర్, ఆప్టికల్ ఫైబర్ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థ.. అసలు బిడ్ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. ఆర్‌కామ్ సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్‌ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్‌కామ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) ఆర్‌కామ్ వ్యవహారం చేరింది. ఎన్సీఎల్టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. స్టాక్ .. అప్పర్ సర్క్యూట్.. బిడ్డింగ్ వార్తలతో సోమవారం ఆర్‌కామ్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్ఈలో ఆర్‌కామ్ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది. -
అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
న్యూఢిల్లీ: దివాలా స్మృతి కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్‌గా అనిల్ అంబానీ రాజీనామా చేయడాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాలను కూడా తోసిపుచ్చింది. నవంబర్ 20న జరిగిన సమావేశంలో సీవోసీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆర్‌కామ్ డైరెక్టర్లుగా కొనసాగాలని, దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి పరిష్కార నిపుణునికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సీవోసీ సూచించినట్లు వివరించింది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ పిటీషన్ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఆర్కామ్పై దివాలా ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. రుణాలిచి్చన బ్యాంకులు, ఆరి్థక సంస్థల క్లెయిమ్ ప్రకారం ఆర్‌కామ్ దాదాపు రూ. 49,000 కోట్లు బాకీ పడింది. -
అనిల్ అంబానీకి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ 453 కోట్లు క్లియర్ చేయడంతో ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కొట్టివేసింది. అనిల్ కంపెనీకి ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ బాసటగా నిలవడం, కంపెనీ ఆస్తులను జియో కొనుగోలు చేయడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎరిక్సన్కు బకాయిలను చెల్లించింది. అంతకుముందు రిలయన్స్ జియోకు ఆస్తులు విక్రయించినప్పటికీ తమ బకాయిలను చెల్లించలేదని ఎరిక్సన్ సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చీఫ్ ఛాయా విరానీలను నిందితులుగా సుప్రీం విచారణ సాగింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్ ఇండియాకు రూ 453 కోట్లను చెల్లించాలని లేనిపక్షంలో మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారికి రూ కోటి చొప్పున జరిమానా కూడా విధించింది. -
ఆర్‌కామ్ దివాలాకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా ప్రక్రియను ఎదుర్కోనుంది. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించింది. ఎరిక్సన్ పిటిషన్ మేరకు కంపెనీకి వ్యతిరేకంగా దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ లోగడ ఆదేశించగా.., దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌కామ్ గతేడాది జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్‌కామ్, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికాంకు వ్యతిరేకంగా ఎరిక్సన్ దివాలా పిటిషన్ వేయడంతో ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ 2018 మే 15న తీర్పు జారీ చేసింది. తాత్కాలిక పరిష్కార నిపుణుడిని సైతం నియమించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా వెనక్కి తీసుకుంది. సంస్థ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దివాలా ప్రక్రియ మెరుగైనదిగా కంపెనీ బోర్డు భావించింది. దీంతో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఆర్‌కామ్ కోరడంతో అందుకు ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. -
ఆర్‌కామ్ దివాలా పిటీషన్‌పై ఎన్సీఎల్ఏటీ దృష్టి
న్యూఢిల్లీ: రుణభారం పేరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దివాలా పిటీషన్‌పై విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై తానే తుది నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. తమకు రావాల్సిన రూ. 550 కోట్ల బాకీల కోసం స్విస్ టెలికం సంస్థ ఎరిక్సన్ గతంలో ఈ పిటీషన్ వేసింది. అయితే, ఆ తర్వాత బాకీలు వసూలు కావడంతో పిటీషన్‌ను ఉపసంహరించుకుంటామని తెలిపింది. కానీ, ఇతర రుణదాతలకు బాకీలు చెల్లింపులు జరిపే పరిస్థితుల్లో తాము లేమని, దివాలా పిటీషన్‌పై ప్రొసీడింగ్స్ కొనసాగించాలని ఎన్సీఎల్ఏటీని ఆర్‌కామ్ కోరుతోంది. ఎరిక్సన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. రూ.550 కోట్లు ఎరిక్సన్ తిరిగి ఇచ్చేయాలా? ఈ నేపథ్యంలో ఎన్సీఎల్ఏటీ తాజాగా సోమవారం తన అభిప్రాయం వెల్లడించింది. ఒకవేళ ఆర్‌కామ్ దివాలా ప్రక్రియకు అనుమతించిన పక్షంలో ఎరిక్సన్ తనకు దక్కిన రూ. 550 కోట్లు కూడా వాపసు చేయాల్సి ఉంటుందని ద్విసభ్య బెంచ్ చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. ‘రుణాలిచ్చిన మిగతావారందరినీ కాదని ఒక్కరే మొత్తం బాకీ సొమ్మును ఎలా తీసుకుంటారు‘ అని ప్రశ్నించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రొసీడింగ్స్ కొనసాగించడమా లేదా నిలిపివేయడమా అన్నదానిపై ఎన్సీఎల్ఏటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఎన్సీఎల్ఏటీ ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఐఎల్ఎఫ్ఎస్ 4 సంస్థల వివరాలివ్వండి.. మరో నాలుగు గ్రూప్ కంపెనీల వివరాలు సమర్పించాల్సిందిగా రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. వాటిల్లో పెన్షను, ప్రావిడెంట్ ఫండ్స్ పెట్టుబడులు, వాటి రుణాల వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించింది. ఉద్యోగులకు చెందాల్సిన పింఛను నిధులను తొక్కిపెట్టి ఉంచకూడదని, ఆ మొత్తాన్ని ముందుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హజారీబాగ్ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే, జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ, మొరాదాబాద్ బరైలీ ఎక్స్‌ప్రెస్‌వే, వెస్ట్ గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలు వీటిలో ఉన్నాయి. చెల్లింపులు జరపగలిగే సామర్థ్యాలను బట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలను మూడు వర్ణాలుగా వర్గీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాషాయ వర్ణం (నిర్వహణపరమైన చెల్లింపులు జరిపే సామర్థ్యం ఉన్నవి) కింద వర్గీకరించిన నాలుగు సంస్థల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చింది. మొత్తం 13 కాషాయ వర్ణ సంస్థల్లో మిగతా తొమ్మిది సంస్థలు తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 16లోగా రుణాల చెల్లింపు ప్రణాళికను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉండాలని పేర్కొంది. -
అనిల్ అంబానీకి తప్పిన ‘కారాగార’ ముప్పు
న్యూఢిల్లీ: బిలియనీర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి ‘కారాగార’ ముప్పు తప్పింది. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు స్వీడన్ టెలికం పరికరాల తయారీ సంస్థ– ఎరిక్సన్కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చెల్లించింది. సోమవారం ఎరిక్సన్కు బకాయిలు చెల్లించినట్లు ఆర్‌కామ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్ నుంచి రావాల్సిన మొత్తం అందినట్లు (సోమవారం రూ.458.77 కోట్లు. అంతక్రితం 118 కోట్లు) ఎరిక్సన్ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. వడ్డీతోసహా రావాల్సిందంతా అందినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. సోమవారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ షర్ ధర నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో 9 శాతం పడి, రూ.4 వద్ద ముగిసింది. కేసు క్రమం ఇదీ... ►ఆర్‌కామ్ దేశవ్యాప్త టెలికం నెట్వర్క్ నిర్వహణకు అనిల్ గ్రూప్‌తో 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది. ►రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్ అడ్మిట్ చేసుకుంది. ►అయితే ఈ కేసును ఆర్‌కామ్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. ►ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్ సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ►ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్ 23న ఆర్‌కామ్‌కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ►డిసెంబర్ 15లోపు బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించవచ్చని సూచించింది. ► అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ► దీనిపై ఫిబ్రవరి 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును ప్రకటించింది. ► ఈ కేసులో అనిల్ అంబానీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ► నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ►ఈ కేసులో ఆర్‌కామ్ చైర్మన్ అనిల్‌తో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ చిరహా విరాణి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. ► ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. ►తదనంతరం ఆదాయ పన్ను రిఫండ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను ఎరిక్సన్కు చెల్లించేందుకు అనుమతివ్వాలంటూ ఆర్‌కామ్ రుణ దాతలు– బ్యాంకర్లును అభ్యర్థించింది. అయితే ఇందుకు అవి ససేమిరా అన్నాయి. ఆదుకున్న అన్న! ‘‘ఈ క్లిష్ట సమయాల్లో నా వెంట నిలిచిన గౌరవనీయులైన నా అన్న, వదిన ముకేశ్, నీతాలకు హృదయపూర్వక ధన్యవాదములు. సకాలంలో సహకారం అందించడం ద్వారా మా కుటుంబ విలువలకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. నేను, నా కుటుంబం గతాన్ని దాటి వచ్చినందుకు కృతజ్ఞులం’’ అంటూ ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. దీంతో ఎరిక్సన్కు బకాయిల చెల్లింపునకు కావాల్సిన మొత్తాన్ని సోదరుడు ముకేశ్ అంబానీ సమకూర్చి ఆదుకున్నట్టు అనిల్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. -
ఆ నిధులపై హక్కులు మాకే...
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్) ఐటీ రిఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్ల నిధులపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని బ్యాంకులు స్పష్టంచేశాయి. ఇదే విషయాన్ని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్ఏటీ) చెప్పాయి. తమకు చెందాల్సిన నిధులతో ఎరిక్సన్కి ఇవ్వాల్సిన బాకీలను ఆర్‌కామ్ తీరుస్తానంటే కుదరదని తెగేసి చెప్పాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్కు చెల్లించడం కోసం రిటెన్షన్, ట్రస్ట్ ఖాతాలో ఉన్న ఐటీ రిఫండ్ నిధులను ఉపయోగించుకునేలా అనుమతించాలంటూ ఆర్‌కామ్ వేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా బ్యాంకుల తరఫున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే రిటెన్షన్, ట్రస్ట్ ఖాతా ఏర్పాటైందని, దానికి, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఎరిక్సన్ బాకీల భారాన్ని ఆర్‌కామ్ బ్యాంకులపై రుద్దడం కుదరదని తెలిపారు. ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదాపడింది. -
మీరు చెప్పిందేమిటి... జరిగిందేమిటి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ ’తప్పుడు అభిప్రాయం’ కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ‘రిలయన్స్ జియోకి అసెట్స్‌ను విక్రయించడం ద్వారా రూ. 37,000 కోట్లు వస్తాయని ఆర్‌కామ్ అంటే మీరంతా దానికి వంతపాడారు. భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుందంటూ భ్రమలు కల్పించారు. కానీ అసలు అసెట్స్ అమ్మకమే జరగలేదు. మీరు విఫలమయ్యారు. జాయింట్ లెండర్స్ ఫోరమ్ విఫలమైంది. అసలు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి‘ అంటూ బ్యాంకులను.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య ఎన్సీఎల్ఏటీ బెంచ్ కడిగేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్ సంస్థకు బాకీలు కట్టుకోవడం కోసం ఐటీ రీఫండ్ నిధులను ఆర్‌కామ్ వినియోగించుకునేలా ఎందుకు అనుమతించరాదో చెప్పాలంటూ బ్యాంకులను ఆదేశించింది. దీనిపై రెండు పేజీల నోట్‌ను దాఖలు చేయాలని ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టెలికం పరికరాల సంస్థ ఎరిక్సన్కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీతో పాటు ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుశిక్ష ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఐటీ రీఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్లను ఇందుకోసం ఉపయోగించుకునేలా తగు ఆదేశాలివ్వాలంటూ ఎన్సీఎల్ఏటీని ఆర్‌కామ్ ఆశ్రయించింది. -
అనిల్ అంబానీ పని అయిపోయిందా..?
అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్ అంబానీతో పోటీపడిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్ అంబానీ 47 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతుండగా.. 2 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్ అంబానీ కనీసం దేశీ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి తగ్గిపోయారు. దశాబ్ద కాలంలో అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినప్పటికీ... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేస్తూ.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది. పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ప్రస్తుతం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుదేలై.. దివాలా తీసింది. గ్రూప్‌లోని మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆర్‌కామ్ దివాలా ప్రకటనతో సోమవారం అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. గ్రూప్‌లో కీలకమైన అయిదు సంస్థల మార్కెట్ విలువ ఒక్క రోజే ఏకంగా రూ.5,831 కోట్ల మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న అనిల్, అడాగ్ గ్రూప్ కంపెనీలు, కారణాలపై ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది... సరి సమానంగా విభజన... వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవటంతో 2005లో దాదాపు రూ.90,000 కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇందులో ముడిచమురు కంపెనీ అన్న ముకేశ్‌కు రాగా.. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రా, పవర్ వంటి కీలక సంస్థలు అనిల్ చేతికి దక్కాయి. అవిభాజ్య గ్రూప్‌లో అనిల్ అంబానీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్ఓ) వ్యవహరించేవారు. వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా.. డీల్స్ కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే విభజన తరవాత భారీ సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీద పడటంతో.. ఆయన సామర్థ్యాలకు పరీక్ష మొదలైంది. సవాళ్లూ ఒక్కొక్కటిగా ఎదురవటం మొదలెట్టాయి. వ్యాపార విస్తరణ కాంక్షతో సంబంధం లేని రంగాల్లోకి కూడా చొచ్చుకుపోయారు అనిల్. చివరకు అప్పుల భారం పేరుకుపోయిన ఆర్‌కామ్ రూపంలో సంక్షోభం బయటపడింది. వచ్చే ఆదాయాలు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితుల్లోకి గ్రూప్ దిగజారిపోయింది. ముంబైలో తొలి మెట్రో లైన్ నిర్మించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ... గతేడాది ఆగస్టులో బాండ్లను చెల్లించలేక చేతులెత్తేసింది. 2008లో రికార్డ్ ఐపీవోకి వచ్చిన రిలయన్స్ పవర్ షేరు.. అప్పట్నుంచీ పడుతూనే ఉంది. కాస్త లాభసాటిగా ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం రిలయన్స్ క్యాపిటల్‌కి కూడా కష్టాలు తప్పలేదు. మొత్తానికి సంక్షోభంలోకి పడిపోయిన కొన్ని గ్రూప్ కంపెనీలను చూస్తే.. ఆర్‌కామ్: కాల్ డిస్కనెక్ట్.. 2010లో 17% మార్కెట్ వాటాతో దేశీ టెలికంలో ఆర్‌కామ్ రెండో స్థానంలో ఉండేది. 2016లో అన్న ముకేశ్ ఎంట్రీ తర్వాత ఇది పదవ స్థానానికి పడిపోయి.. టాప్ కంపెనీల లిస్టు నుంచి తప్పుకుంది. ఒకప్పుడు రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో వెలుగొందిన ఆర్‌కామ్ ఇప్పుడు రూ.45 వేల కోట్ల పైచిలుకు రుణ భారంలో ఉంది. చివరికి ప్రధానమైన మొబైల్ వ్యాపారాన్ని అన్న కంపెనీకే అమ్మేసినా.. స్పెక్ట్రం బాకీల వివాదంతో డీల్ ముందుకు సాగడం లేదు. బాకీలు ఎగ్గొట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్ వంటి కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. 1.8 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని వసూలు చేసుకునేం దుకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దివాలా పిటిషన్ వేసింది. సినిమా... అట్టర్ ఫ్లాప్ ఒకప్పటి సినీతార టీనా మునీమ్‌ను వివాహం చేసుకున్న అనిల్ అంబానీ .. తన అడాగ్ గ్రూప్ ద్వారా గ్లామర్ ప్రపంచ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఫిలిమ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, పంపిణీ రంగాల్లోని యాడ్ ల్యాబ్స్ సంస్థ కొనుగోలుతో ఆరంభంలో భారీగానే విస్తరించారు. 2008 నాటికి దాదాపు 700 స్క్రీన్స్‌తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్‌గా అనిల్ ఎదిగారు. కానీ 2014 నాటికి ఈ మీడియా వైభవం తగ్గిపోయింది. రుణాల భారం తగ్గించుకోవడానికి వందల కొద్దీ స్క్రీన్స్‌ను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. సంబంధం లేని గ్లామర్ బిజినెస్‌లోకి దూకి అనిల్ దానిపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాన గ్రూప్ కంపెనీల పనితీరు దెబ్బతిన్నదనే విమర్శలూ ఉన్నాయి. అసెట్స్ అమ్మకాలకు ఆటంకాలు.. మరోపక్క, అప్పుల భారాలను తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ పెద్ద ఎత్తున అసెట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్, టెలికం టవర్స్ మొదలైన వాటిని అమ్మేశారు. కానీ.. ఒక్కో వ్యాపార విభాగంలో ఒక్కో సమస్య కారణంగా అసెట్స్ విక్రయం పూర్తి స్థాయిలో ముందుకు జరగడం లేదు. రూ. 1,00,000 కోట్లు.. 2018 మార్చి ఆఖరు నాటికి అడాగ్ రుణభారం ఇది. ఏటా వడ్డీల కిందే రూ. 10,000 కోట్లు. రూ. 4,00,000 కోట్లు.. గరిష్ట స్థాయిలో అడాగ్ గ్రూప్‌లోని 5 ప్రధాన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల కన్నా తక్కువకి పడిపోయింది. రక్షణ... బ్యాక్ ఫైర్! ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు.. అనిల్ అంబానీ 2016లో పిపావవ్ మెరైన్ అండ్ ఆఫ్‌షోర్ (రిలయన్స్ నేవల్గా పేరు మారింది) యాజమాన్య వాటాలను కొనుక్కున్నారు. ఇది భారతీయ నేవీ కోసం యుద్ధనౌకల నిర్మాణం, మరమ్మతుల సర్వీసులు అందిస్తుంది. సమస్యల్లో ఉన్న ఇన్ఫ్రా నుంచి పుష్కలమైన అవకాశాలున్న డిఫెన్స్ వైపుగా వెడితే అడాగ్‌ను కాపాడుకోవచ్చని అనిల్ భావించారు. కానీ, ఈ ప్రయోగమూ దెబ్బతింది. అయినా.. అసలు భారీ నష్టాలు, అప్పులతో కుదేలైన ఈ సంస్థను ఎందుకు కొన్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్‌తో ఈ కంపెనీ జట్టు కట్టడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రభుత్వమే ఈ రెండింటి మధ్య డీల్ కుదిర్చిందంటూ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. 45 బిలియన్ డాలర్ల వ్యత్యాసం.. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం 2007లో అనిల్ సంపద 45 బిలియన్ డాలర్లు. అన్న ముకేశ్ సంపద 49 బిలియన్ డాలర్లు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2018కి వస్తే ఫోర్బ్స్ ఇండియా కుబేరుల లిస్టులో ముకేశ్ 47.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 2.44 బిలియన్ డాలర్ల సంపదతో అనిల్ 66వ స్థానానికి పడిపోయారు. అసలెక్కడ తేడా కొట్టింది..? కేవలం దశాబ్దం కాలంలో అనిల్ సామ్రాజ్యం కుప్పకూలడానికి దారి తీసిన కారణాలేంటి. డీల్ మేకర్‌గా, వ్యాపార నిర్వహణలో ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న అనిల్ అంబానీ గ్రాఫ్ ఎందుకిలా పడిపోయింది? 2008లో రికార్డు స్థాయిలో రిలయన్స్ పవర్ రూ.11,500 కోట్ల నిధుల కోసం ఐపీఓకు వచ్చినపుడు... అది రికార్డు స్థాయిలో 70 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. మరలాంటప్పుడు.. ఎక్కడ తేడా కొట్టింది? నిర్వహణ లోపమా? సమర్థమంతమైన టీమ్ లేకపోవడం వల్లా? లేదా ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా కుప్పతెప్పలుగా కంపెనీలు పెట్టేయడం వల్లా? లేదా ఎకాయెకిన ఆకాశానికి నిచ్చెనలేసేయాలన్న అత్యుత్సాహంతో దొరికిన చోటల్లా అడ్డగోలుగా అప్పులు చేసేసి.. రుణభారం పెంచేసుకోవడం వల్లా? వ్యాపార పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడం వల్లా? తరచి చూస్తే సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ప్రధాన కారణాల గురించి వెతుక్కుంటూ పోతే అంతు ఉండదన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే, అన్నింటికీ వ్యాపార పరిస్థితులు బాగా లేకపోవడం, దురదృష్టం అనుకోవడానికి ఉండదని.. ఆయన ప్రారంభించిన అనేక కంపెనీలే ఒకదాన్ని మరొకటి దెబ్బతీశాయని.. వాటాదారుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కాస్తంత ఇబ్బందికరమైనదే అయినా.. సోషల్ మీడియా యాప్స్‌లో అన్నదమ్ములపై ఒక సెటైర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్న ముకేశ్ అంటే ’ము–క్యాష్’ (డబ్బుల మూట) అని, తమ్ముడు అనిల్ అంటే ’అ–నిల్’ (సున్నా) అంటూ వ్యంగ్యోక్తులు కూడా నడిచాయి. -
అనిల్ అంబానీని జైల్లో పెట్టండి!!
న్యూఢిల్లీ: దాదాపు 550 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చీఫ్ అనిల్ అంబానీపై స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న ఆయన్ను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఒక ఆంగ్ల ఫైనాన్షియల్ డెయిలీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆర్‌కామ్ జరపాల్సిన చెల్లింపులకు సంబంధించి అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో దీని ఆధారంగానే ఎరిక్సన్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, స్పెక్ట్రం విక్రయాన్ని జాప్యం చేయడంపై టెలికం శాఖపై (డాట్) ఆర్‌కామ్ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. స్పెక్ట్రం విక్రయంలో డాట్ జాప్యం చేయకుండా ఉండి ఉంటే ఎరికన్స్, ఇతర రుణదాతల బకాయిలు తీర్చేసేందుకు ఉపయోగకరంగా ఉండేదని పేర్కొంది. ఈ రెండు పిటీషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. ‘ఆర్‌కామ్‌తో పాటు తత్సంబంధిత వర్గాలు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో తాజాగా మరో పిటిషన్ వేయాల్సి వచ్చింది. మేం చాలా కాలంగా బాకీల చెల్లింపు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ వారు చెల్లించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. కోర్టు ఆదేశాల ధిక్కరణ రుజువైన పక్షంలో ఆరు నెలల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది‘ అని ఎరిక్సన్ తరఫు న్యాయవాది అనిల్ ఖేర్ తెలిపారు. స్పెక్ట్రం విక్రయంపై ఆర్‌కామ్ ఆశలు.. ఎరిక్సన్కు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించడంలో ఆర్‌కామ్ విఫలం కావడం ఇది రెండోసారి. తొలిసారి డిఫాల్ట్ అయిన తర్వాత ఆర్‌కామ్‌కు సుప్రీం కోర్టు మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోగా ఏటా 12 శాతం వడ్డీ రేటుతో బాకీలు చెల్లించాలని ఆదేశించింది. కానీ ఆర్‌కామ్ రెండో సారి కూడా విఫలమైంది. మరో టెలికం సంస్థ రిలయన్స్ జియోకు వైర్లెస్ స్పెక్ట్రంను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణదాతలకు బకాయిలు చెల్లించేయాలని ఆర్‌కామ్ ఆశిస్తోంది. అయితే, ఆర్‌కామ్ బాకీలకు బాధ్యత వహించడానికి జియో సిద్ధంగా లేనందున కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పెక్ట్రం డీల్‌కు అనుమతించలేమంటూ డిసెంబర్ నెలలో టెలికం శాఖ తోసిపుచ్చింది. ఈ పరిణామాల దరిమిలా ఆర్‌కామ్, ఎరిక్సన్ వివాదం మరోమారు కోర్టుకెక్కింది. మరోవైపు, ఇరు కంపెనీల మధ్య స్పెక్ట్రం డీల్‌కు సంబంధించిన ప్రక్రియపై స్పష్టతనివ్వాలంటూ రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కలిసి కేంద్ర టెలికం శాఖకు లేఖ రాసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రంనకు సంబంధించిన బకాయీలను తీర్చే బాధ్యత ఆర్కామే తీసుకుంటోందని జియో తెలిపినట్లు వివరించాయి. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌తో స్పెక్ట్రం ట్రేడింగ్ ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధమేనని జియో స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం విక్రయం ద్వారా రిలయన్స్ జియో నుంచి వచ్చే రూ. 975 కోట్లలో ఎరిక్సన్కు రూ. 550 కోట్లు, మైనారిటీ వాటాదారైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్కు రూ. 230 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్‌కామ్ యోచిస్తోంది. వివాదమిదీ.. దేశవ్యాప్తంగా ఆర్‌కామ్ టెలికం నెట్వర్క్ నిర్వహణకు సంబంధించి 2014లో ఎరిక్సన్ ఏడేళ్ల కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే, 2016 నుంచి చెల్లింపులు నిల్చిపోవడంతో సెప్టెంబర్ 2017లో ఆర్‌కామ్‌తో పాటు ఆ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికంలపై ఎరిక్సన్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ వేసింది. ఆర్‌కామ్ నుంచి తమకు రూ. 978 కోట్లు రావాలని, నోటీసులిచ్చినా చెల్లింపులు జరపకపోవడంతో ఇది రూ.1,600 కోట్లకు పెరిగిందని ఎరిక్సన్ పేర్కొంది. అయితే, దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆర్‌కామ్ ఆశ్రయించగా.. దివాలా చర్యలపై స్టే విధించింది. సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎరిక్సన్కు రూ.550 కోట్లు కట్టాలని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. కానీ, గడువులోగా ఆర్‌కామ్ కట్టకపోవడంతో ఎరిక్సన్ మళ్లీ కోర్టుకెళ్లింది. దీంతో ఈసారి న్యాయస్థానం డిసెంబర్ 15 దాకా గడువిచ్చింది. ఆర్‌కామ్ ఈసారి కూడా డిఫాల్ట్ కావడంతో ఎరిక్సన్ మళ్లీ కోర్టునాశ్రయించింది. ప్రస్తుతం ఆర్‌కామ్ రుణ భారం రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉంది. అనిల్ అంబానీ ప్రణాళిక ప్రకారం రిలయన్స్ జియో తదితర సంస్థలకు ఆర్‌కామ్ అసెట్స్ విక్రయానంతరం ఇది సుమారు రూ.6,000 కోట్లకు తగ్గవచ్చని అంచనా. అయితే, స్పెక్ట్రం ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి అనుమతులు వీటికి కీలకం. ఆర్‌కామ్ ప్రభుత్వానికి కట్టాల్సిన స్పెక్ట్రం బకాయిలకు రిలయన్స్ జియో బాధ్యత వహించడానికి ఇష్టపడకపోవడంతో.. డాట్ నుంచి అనుమతులు రావడం లేదు. న్యాయస్థానం ఆదేశాలున్నా డాట్ కావాలనే జాప్యం చేస్తోందని, దీనివల్ల తాము రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్‌కామ్ వాదిస్తోంది. -
‘టెలికం’కు ఆర్‌కామ్ గుడ్‌బై...
ముంబై: ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. ఇకపై భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. మంగళవారం జరిగిన ఆర్‌కామ్ 14వ వార్షిక సాధారణ సమావేశంలో .. రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అన్నింటికన్నా ముందుగా ఆర్‌కామ్‌కు ఉన్న రూ. 40,000 కోట్ల రుణభారాన్ని పరిష్కరించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ’ టెలికం రంగం భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగంలో ఇక కొనసాగరాదని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. భవిష్యత్‌లో రిలయన్స్ రియల్టీ ఈ సంస్థకు వృద్ధి చోదకంగా ఉండనుంది’ అని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ముంబై శివార్లలో ఉన్న 133 ఎకరాల ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏకేసీ) గురించి ప్రస్తావిస్తూ.. ఈ సైట్ ద్వారా దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను సృష్టించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు. అన్న ముకేశ్‌కు థ్యాంక్స్.. కంపెనీ రుణభారానికి మరికొద్ది నెలల్లో తగు పరిష్కార మార్గం లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టెలికం ఇన్ఫ్రా, ఫైబర్ వ్యాపారాలను రిలయన్స్ జియోకి విక్రయించే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఇలాగే ఇతరత్రా విభాగాల విక్రయం తదితర చర్యలతో నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని అనిల్ అంబానీ చెప్పారు. స్పెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అప్పట్లో అవిభాజ్య రిలయన్స్ గ్రూప్‌ను టెలికం రంగం వైపు నడిపించడంతో పాటు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్‌కామ్ అసెట్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు కూడా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న పెద్దన్న ముకేశ్ అంబానీకి అనిల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ’వ్యక్తిగతంగా నాకు, ఆర్‌కామ్‌కు, .. మార్గనిర్దేశనం చేసి, తోడ్పాటు అందించిన నా సోదరుడు ముకేశ్ భాయ్ అంబానీకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది సరైన సమయం’ అని అనిల్ పేర్కొన్నారు. టెలికం రంగంలో సృజనాత్మక విధ్వంసం జరుగుతోందని.. సాముదాయిక గుత్తాధిపత్యానికి దారి తీసిందని అనిల్ చెప్పారు. తర్వాత రోజుల్లో ఇది ద్విదాధిపత్యం (రెండే కంపెనీల ఆధిపత్యం), అటు పైన పూర్తి గుత్తాధిపత్యానికి కూడా దారితీయొచ్చని అనిల్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ సామ్రాజ్యం విభజన అనంతరం టెలికంతో పాటు కొన్ని విభాగాలు అనిల్ అంబానీకి, రిఫైనరీ తదితర వ్యాపార విభాగాలు ముకేశ్ అంబానీకి లభించిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ తాజాగా మళ్లీ రిలయన్స్ జియోతో.. టెలికం రంగంలోకి ప్రవేశించారు. రిలయన్స్ రియల్టీ.. మొబైల్ వ్యాపార విభాగాన్ని జియోకి విక్రయించేసిన తర్వాత ఆర్‌కామ్ ప్రస్తుతం ఎంటర్ప్రైజ్, డేటా సెంటర్స్, అండర్‌సీ కేబుల్స్ మొదలైన వ్యాపార విభాగాల ద్వారా 35,000 సంస్థలకు సర్వీసులు అందిస్తోందని అనిల్ అంబానీ చెప్పారు. వీటన్నింటి నుంచి వైదొలగడంతో పాటు బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఆర్‌కామ్ కట్టుబడి ఉందని.. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆర్‌కామ్‌కు అనుబంధ సంస్థగా ఏర్పాటైన రిలయన్స్ రిటైల్.. నవీ ముంబైలోని డీఏకేసీని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కంపెనీకి ముప్పై లక్షల చ.అ.ల బిల్టప్ స్పేస్ ఉందని.. దీన్ని బహుళజాతి సంస్థలకు లీజుకివ్వనున్నామని అనిల్ చెప్పారు. తొలి ఏడాది నుంచే వీటిపై ఆదాయాలు రాగలవన్నారు. ఆర్థికేతర వ్యాపారాల నుంచి రిలయన్స్ క్యాపిటల్ నిష్క్రమణ.. రిలయన్స్ క్యాపిటల్ వచ్చే 12–18 నెలల్లో ఆర్థికేతర వ్యాపార విభాగాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ 32వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే లిస్టింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్ క్యాపిటల్‌కి ప్రస్తుతం అసెట్ మేనేజ్మెంట్, బీమా, గృహ.. వాణిజ్యరుణాలు, ఈక్విటీలు.. కమోడిటీల బ్రోకింగ్ వ్యాపారాలు ఉన్నాయి. తమ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో గణనీయమైన వాటాల కొనుగోలు కోసం వ్యూహాత్మక భాగస్వామితో చర్చలు జరుగుతున్నాయని.. మరికొద్ది నెలల్లో ఈ డీల్ పూర్తి కాగలదని అనిల్ పేర్కొన్నారు. మరోవైపు ఈ త్రైమాసికంలో రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ తెలిపారు. మరోవైపు, ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వుల తర్వాత కూడా చెల్లింపులు జరపకుండా ప్రభుత్వ విభాగాలు జాప్యం చేస్తున్నాయంటూ రిలయన్స్ ఇన్ఫ్రా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న అనిల్ అంబానీ ఆరోపించారు. దీనివల్ల తమకు రావాల్సిన దాదాపు రూ. 8,000 కోట్ల బకాయిలు నిల్చిపోయాయని ఆయన పేర్కొన్నారు. -
అన్నకు 2వేల కోట్ల ఆస్తులు అమ్మేసిన తమ్ముడు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తన తమ్ముడు రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తులను ఇతరుల చేతుల్లోకి వెళ్లనీయకుండా తానే దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ.. ప్రణాళిక ప్రకారం మీడియా కన్వెర్జెన్స్‌నోడ్స్(ఎంసీఎన్)ను, సంబంధిత మౌలిక సదుపాయాలను తన అన్న కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అమ్మేసినట్టు ప్రకటించారు. వీటి విలువ 2000 వేల కోట్ల రూపాయలు. మొత్తం రూ.2000కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మే ప్రక్రియ పూర్తయినట్లు అనిల్ అంబానీ గురువారం వెల్లడించారు. 248 నోడ్స్ దాదాపు 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. వీటిని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగిస్తున్నారు. వీటన్నింటిన్నీ ప్రస్తుతం జియోకు బదిలీ చేసినట్లు ఆర్‌కామ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల మొదట్లో కూడా తన రూ.250 బిలియన్(రూ.25000 కోట్ల) ఆస్తుల అమ్మకపు ప్రణాళిక ప్రక్రియ నడుస్తుందని ఆర్‌కామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘మా ఎంసీఎన్, సంబంధిత మౌలిక సదుపాయల ఆస్తులను రూ.20 బిలియన్లకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అమ్మే ప్రక్రియ పూర్తయిందని రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ నేడు ప్రకటిస్తుంద’ని ఆర్‌కామ్ పేర్కొంది. గత ఏడాది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్.. రిలయన్స్ జియోతో ఒప్పందం కుదర్చుకుంది. భారీగా తనకున్న అప్పులను తగ్గించుకునేందుకు ఆర్‌కామ్ వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను జియోకు అమ్మేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్, 43000కు పైగా టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 248 మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ ఈ అమ్మకపు డీల్‌లో ఉన్నాయి. అతిపెద్ద ఈ డీల్‌లో ప్రణాళిక ప్రకారం నేడు నోడ్స్ అమ్మకం పూర్తయినట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. -
సుప్రీంలో ఆర్‌కామ్‌కు చుక్కెదురు!
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల విక్రయ ప్రయత్నాలకు గండిపడింది. తీవ్ర రుణ భారంతో ఉన్న ఆర్‌కామ్, తనకున్న టెలికం ఆస్తులను విక్రయించి అప్పులు తీరుద్దామనే ప్రణాళికతో ఉంది. అయితే, ఆస్తుల విక్రయంపై బోంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి జస్టిస్ ఆదర్శ్ గోయెల్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ఆర్‌కామ్, ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన పిటిషన్లపై తుది విచారణను ఏప్రిల్ 5న నిర్వహిస్తామని పేర్కొంది. ఆర్‌కామ్ బ్యాంకులకు రూ.42,000 కోట్లు బకాయి పడి ఉంది. ఎస్బీఐ, 24 ఇతర దేశీయ రుణ దాతలు ఆర్‌కామ్‌కు రుణాలివ్వడంతో అవన్నీ కూటమిగా ఏర్పడి ఆర్‌కామ్ కన్సాలిడేటెడ్ ఆస్తులను విక్రయించే ప్రక్రియను చేపట్టాయి. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రం, సెల్ టవర్లు, ఇతర సదుపాయాలను కొనుగోలు చేస్తానని రిలయన్స్ జియో ఆసక్తి చూపింది. ఇంతలోనే ఎరిక్సన్ సంస్థ ఆర్‌కామ్ రూ.1,150 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందని, ఆస్తుల విక్రయాలు జరగకుండా నిరోధించాలంటూ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఆ తర్వాత బోంబే హైకోర్టు స్టే ఆదేశాలను సమర్థించింది. దీంతో ఆర్‌కామ్, బ్యాంకుల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రుణదాతల తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, బ్యాంకులు ఇచ్చింది సెక్యూర్డ్ రుణాలు కనుక వారి క్లెయిమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎరిక్సన్ తరఫు న్యాయవాది మాత్రం స్టే ఎత్తివేస్తే తాము బకాయిలు వసూలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు. దీంతో ఇది చాలా పెద్ద అంశం అయినందున, వాదనలు వినాల్సి ఉందని, అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల విక్రయాన్ని వేగంగా పూర్తి చేస్తాం: ఆర్‌కామ్ సుప్రీంకోర్టులో తక్షణ ఉపశమనం లభించకపోయినప్పటికీ, ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేస్తామని ఆర్‌కామ్ తెలిపింది. ఆర్బీఐ నిర్దేశించినట్టు ఆగస్ట్ 31లోపు తమ ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. -
జియో చేతికి ‘ఆర్‌కామ్’
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొనుగోలు చేయనుంది. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో తెలిపింది. ఇరు కంపెనీలు ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ డీల్ విలువ రూ.24,000 – 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు ఊరటనిచ్చే విషయమే. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా. అనిల్ అంబానీ తాజా రుణ పునర్వ్యవస్థీకరణను ప్రకటించిన రెండు రోజుల్లోనే ఈ డీల్ కుదరడం, రిలయన్స్ వ్యవస్థాపకులు, ధీరూభాయ్ అంబానీ 85వ జయంతి రోజున (గురువారం) వెల్లడి కావడం విశేషం. సరైన సమయంలో అదనపు వివరాలు... ఆర్‌కామ్ ఆస్తుల విక్రయ ప్రక్రియను నిర్వహించడానికి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థను ఆర్‌కామ్ నియమించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఈ ఆస్తుల కొనుగోళ్లకు గాను రెండు దశల బిడ్డింగ్ ప్రక్రియలో తమ కంపెనీకే విజయం దక్కిందని పేర్కొంది. ఈ ఆస్తుల కొనుగోళ్ల కారణంగా తాము భారీ స్థాయిలో వైర్లెస్, ఫైబర్–టు–హోమ్, ఎంటర్ప్రైజెస్ సేవలందించడానికి వీలవుతుందని వివరించింది. ఈ కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి, వివిధ అధికారిక సంస్థల నుంచి రుణ దాతల నుంచి ఆమోదాలు పొందాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని, సరైన సమయంలో ఇతర అదనపు వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది. కాగా రిలయన్స్ జియోకు 16 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఆర్‌కామ్ ఆస్తుల కొనుగోలు ప్రక్రియలో వివిధ సంస్థలు రిలయన్స్ జియోకు సలహా సేవలనందించాయి. గోల్డ్‌మన్ శాక్స్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, జేఎమ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, డేవిస్పాక్ అండ్ వార్డ్‌వెల్ ఎల్ఎల్పీ, సిరిల్ అమర్చంద మంగళ్‌దాస్, ఖైతాన్ అండ్ కో, ఎర్నస్ట్ అండ్ యంగ్లు సలహాదారులుగా వ్యవహరించాయి. రుణభారం తగ్గించుకుంటాం... ఈ డీల్‌లో భాగంగా రిలయన్స్ జియో నగదు చెల్లిస్తుందని, దీంతో పాటు టెలికం డిపార్ట్మెంట్కు చెల్లించాల్సిన వాయిదా పడిన స్పెక్ట్రమ్ వాయిదాలను కూడా చెల్లిస్తుందని ఆర్‌కామ్ తెలిపింది. ఈ డీల్ ద్వారా వచ్చిన సొమ్ములను రుణ భారం తగ్గించుకోవడానికే వినియోగిస్తామని పేర్కొంది. నిర్వహణ వ్యయాలు భరించే స్తోమత లేకపోవడంతో నెల క్రితం ఆర్‌కామ్ మొబైల్ వాయిస్ వ్యాపారాన్ని మూసేసింది. కాగా గతంలో రూపొందించిన కొంత వాటాను బ్యాంక్‌లకు ఈక్విటీగా మార్చే రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను రద్దు చేస్తున్నామని ఈ వారం మొదట్లోనే ఆర్‌కామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. రుణదాతలకు ఎలాంటి ఈక్విటీ కేటాయింపుల్లేని తాజా రుణ ప్రణాళికను అనిల్ అంబానీ ప్రకటించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా దివాలా పిటిషన్‌ను దాఖలు చేసిన చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఈ తాజా రుణప్రణాళికకు ఆమోదం తెలిపింది. షేరు... పరుగో పరుగు స్టాక్ మార్కెట్లో ఆర్‌కామ్ షేరు జోరు కొనసాగుతోం ది. అనిల్ అంబానీ రుణ ప్రణాళికను ప్రకటించిన రోజు నుంచి ఈ షేర్ పెరుగుతూనే ఉంది. గత రెండు రోజుల్లో 60 శాతానికి పైగా ఎగసిన ఈ షేర్ గురువారం మరో 8 శాతం లాభపడి రూ.31 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 18 శాతం లాభంతో రూ.34ను తాకింది. మొత్తం మీద గత మూడు రోజుల్లో ఈ షేర్ దాదాపు 70 శాతం పెరిగింది. గత వారంలో రూ.3,000 కోట్ల మేర మాత్రమే ఉన్న ఆర్‌కామ్ మార్కెట్ విలువ గురువారం రోజు రూ.8,562 కోట్లకు ఎగసింది. జియో పరమవుతున్న ఆర్‌కామ్ ఆస్తులు ►43,000 టెలికం టవర్లు ►1,78,000 కి.మీ. ఫైబర్ నెట్వర్క్ ►5 మిలియన్ చదరపుటడుగుల స్థలంలో విస్తరించిన 248 మీడియా కన్వర్జన్స్ నోడ్స్, ►800/900/1800/2100 మెగాహెట్జ్ బాండ్స్‌లో 122.4 మెగాహెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్ -
2జీ ఆపరేషన్స్ క్లోజ్: ఆర్‌కామ్ ఢమాల్
ముంబై : అప్పులతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్, తన 2జీ ఆపరేషన్స్‌కు గుడ్‌బై చెబుతున్న క్రమంలో ఈ కంపెనీ షేర్లు అతలాకుతలమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఆర్‌కామ్ షేర్లు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్‌లో సుమారు 5 శాతం మేర ఆర్‌కామ్ షేర్లు కిందకి పడిపోయాయి. ప్రారంభంలోనే బలహీనంగా ఎంట్రీ ఇచ్చిన ఆర్‌కామ్ షేర్లు, బీఎస్ఈ ఎక్స్చేంజ్లో మరింత కిందకి దిగజారి 52 వారాల కనిష్ట స్థాయిల్లో 4.55 శాతం నష్టంలో రూ.15.70 వద్ద ట్రేడవుతున్నాయి. అంతేకాక ఎన్ఎస్ఈలో 4.86 శాతం నష్టంలో ఏడాది కనిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో కూడా ఆర్‌కామ్ షేర్లు 3 శాతం నష్టాలను గడించాయి. నవంబర్ 30 వరకు తమ టెలిఫోనీ వ్యాపారలను మూసివేయాలని ఆర్‌కామ్ ప్లాన్స్ వేస్తోంది. కేవలం 4జీ ఇంటర్నెట్ సర్వీసులపైనే ఇది దృష్టిసారించనుంది. దీంతో వేల మంది ఉద్యోగులు కూడా రోడ్డున పడబోతున్నారు. 1200 మంది ఉద్యోగులను తీసివేయాలని ఆర్‌కామ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారాల మూత 5000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని హెడ్‌హంటర్స్ ఇండియా అంచనావేస్తోంది. తమ నవంబర్ వేతనాలను నెలన్నర ఆలస్యం చేస్తున్నట్టు ఉద్యోగులు కూడా తెలిపారు. జనవరి 15న ఫుల్ సెటిల్మెంట్తో ఉద్యోగులకు వేతనాలను ఇవ్వనున్నట్టు రిలయన్స్ టెలికాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ తెలిపారు. -
అంబానీకి భారీ ఊరట
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను కెనడా ఆధారిత బ్రూక్ ఫీల్డ్ కంపెనీ విక్రయానికి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదం లభించింది. దీంతోపాటు ఎయిర్‌సెల్ విలీనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతి ఇన్ ఫ్రాటెల్, ఎరిక్సన్, జీటీఎల్ అభ్యంతరాలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. దీంతో అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్‌కాంకు భారీ ఊరట లభించింది. మరోవైపు ఈ వార్తలతో స్టాక్‌మార్కెట్ లోఆర్కాం కౌంటర్ 17శాతం ఎగిసింది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు విక్రయించనుంది. ఈ డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్‌ఫీల్డ్‌కు ఉంటాయని ఆర్‌కామ్ వివరించింది. ఈ డీల్ ద్వారా వచ్చే నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. ఎయిర్ సెల్ ఆర్‌కాం విలీనానాకి రెగ్యులేటరీ సంస్థల ఆమోదం ఇప్పటికే లభించింది. -
టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ల వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల గట్టును కాగ్ రట్టు చేసింది. 2010-11, 2014-15 మధ్య కాలంలో వీరు తక్కువ చేసి చూపించిన రెవెన్యూ విలువపై కాగ్ ఓ నివేదిక రూపొందించి పార్లమెంట్‌కి సమర్పించింది. ఈ రిపోర్టులో ఆరు ప్రైవేట్ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల చెల్లింపులు తగ్గిపోయాయని కాగ్ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శుక్రవారంపార్లమెంట్‌లో సమర్పించింది. కాగ్ తన ఆడిట్లో ఆరు ఆపరేటర్లు అడ్జెస్టడ్ గ్రాస్ రెవెన్యూలు మొత్తం రూ. 61,064.56 కోట్లకు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్ రిపోర్టులో ఇవి బయటపడగా.. సిస్టెమా శ్యామ్ అనే కంపెనీ 2006-07 నుంచి 2014-15 ఈ చర్యకు పాల్పడిందని తెలిసింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టుకుందని కాగ్ రిపోర్టు తేల్చింది. -
అన్ని కోట్లు పోయినా..అంబానీయే...
దిగ్గజ టెలికం సంస్థగా వెలుగొందిన రిలయన్స్ కమ్యూనికేషన్ కుప్పకుప్పలుగా రుణభారం పెరిగిపోయిందని, ప్రత్యర్థి కంపెనీల నుంచి విపరీతమైన పోటీ వాతావరణం నెలకొందని ఇటీవల విపరీతంగా వార్తలొచ్చాయి. దీంతో రేటింగ్ ఏజెన్సీలు కూడా కంపెనీ బాండ్ల రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేశాయి. వీటన్నంటికీ తోడు నిరాశజనమైన ఆర్థిక ఫలితాలు.. కంపెనీ మార్కెట్ విలువను భారీగా దెబ్బతీశాయి. వైర్ లెస్ యూనిట్ షేర్లు 39 శాతం మేర పడిపోవడంతో దాన్ని మార్కెట్ విలువ రూ.3,310 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆర్ కామ్ దెబ్బతో ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మాత్రం ఇంకా ధనవంతుడిగానే కొనసాగుతున్నారని బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది. ఆయన నికర సంపద ఏకంగా 82 మిలియన్ డాలర్ల(రూ.528కోట్లు) నుంచి 2.7 బిలియన్లకు(రూ.17,400కోట్లకు) పెరిగినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ లో వెల్లడించింది. అంబానీకి చెందిన వైర్ లెస్ బిజినెస్ లు పడిపోయినప్పటికీ, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ భారీగా వృద్ధి చెందినట్టు పేర్కొంది. ఇవి టెలికాం యూనిట్ బిజినెస్ లనుంచి వచ్చే ప్రభావాన్ని అధిగమించాయని తెలిపింది. అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ బిజినెస్ లు కూడా భారీగా ఆయుధాల కాంట్రాక్టులు పొందుతూ కొత్త లాభాదాయక పిల్లర్ గా మారుతున్నాయని రిపోర్టు చేసింది. అయితే ఈ విషయంపై రిలయన్స్ గ్రూప్ అధికారప్రతినిధి ఇంకా స్పందించలేదు. 2002లో అంబానీ కుటుంబం టెలికాం పరిశ్రమలోకి ప్రవేశించింది. అనంతరం అనిల్, ముఖేష్ లు తమ ఆస్తులను పంచుకున్నారు. ప్రస్తుతం వీరు భారత్ లో అత్యంత ధనవంతులుగా వెలుగొందుతున్నారు. కానీ ఇటీవల అన్న ముఖేష్ కు చెందిన జియోతో తమ్ముడి ఆర్ కామ్ బిజినెస్ లు దెబ్బతింటున్నాయి. -
అంబానీకి భారీ రుణభారం, జియో షాక్
ముంబై: బడా పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్ కాం) సోమవారం నాటిమార్కెట్ లో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. టెలికాం సేవల్లోకి జియో ఎంట్రీ, భారీ రుణ భారం కారణంగా బిలియనీర్ అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. దాదాపు 10కి పైగా దేశీయ బ్యాంకులకు భారీగా బకాయిపడిందన్న వార్తలతో భారీ నష్టాలు నమోదు చేసింది. యాక్సిస్ , ఎస్, ఎస్బీఐ బ్యాంకు తదితర బ్యాంకులకు అప్పులను చెల్లించడంలో వెనకబడిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. భారీ అప్పల్లో కూరుకుపోయిందన్న ఆందోళనల నేపథ్యంలో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. ప్రధానంగా ఆర్‌కామ్ 23శాతం కుప్పకూలింది. అంబానీకి చెందిన మరో ప్రధాన కంపెనీ రిలయన్స్ కేపిటల్ 8 శాతం, రిలయన్స్ డిఫెన్స్ 6 శాతం రిలయన్స్ ఇన్ఫ్రా 8 శాతం, రిలయన్స్ పవర్ 7 శాతం పతనం కావడం గమనార్హం. ముఖ్యంగా సోదరుడు ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో 4 జి సేవల్లో గత ఏడాది వాయిస్ అండ్ డేటా సేవలతో సునామీలా దూసుకు రావడంతో ఆర్‌కాం భారీ నష్టాలతో రికార్డ్ కనిష్టాన్ని నమోదు చేసింది. అలాగే జియోకి పోటీగా ఇతర టెలికాం కంపెనీలు భారతి, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లు డేటా సేవలను సమీక్షించుకుంటూ వస్తుండగా, ఈ విషయంలో ఆర్‌కాం వెనుకబడింది. వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫలితంగా మార్చి 31 నాటికి దాదాపు రూ.42 వేలకోట్ల అప్పులను ఆర్‌కాం మూటగట్టుకుంది. మరోవైపు రేటింగ్ సంస్థ ఇక్రా కూడా ఆర్ కాం రేటింగును బీబీబీ నుంచి బీబీ డౌన్ గ్రేడ్ చేసింది. 10 బ్యాంకులకు పైగా రుణాల చెల్లింపు ఆలస్యమైందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. మొండిబకాయిల(ఎన్పీఏలు) సమస్యలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉపశమనాన్ని కల్పించే బాటలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపుల ద్వారా కొత్త చట్టాన్ని తీసుకు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లు భారీ అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిరాకరించింది. కాగా వైర్ లెస్ వ్యాపారాన్ని ప్రత్యర్థి ఎయిర్ సెల్లో విలీనం చేస్తున్నట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ గతంలో ప్రకటించింది. అలాగే టవర్ బిజినెస్‌లో రూ. 10,000 కోట్లవిలువైన 51 శాతం వాటాలను కెనడా బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ గ్రూపునకు విక్రయించింది. ఈ అమ్మకంద్వారా రూ .25,000 కోట్లు (3.9 బిలియన్ డాలర్లు) విలువైన రుణాలను తిరిగి చెల్లించాలని కంపెనీ భావిస్తోంది. దీంతో గతవారం ఆర్ కాం భారీగా నష్టపోయింది. గత ఏడాది మార్చి నాల్గవ త్రైమాసికంలో రూ. 966 కోట్ల నష్టాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
జియో దెబ్బ: ప్రత్యర్థులు మరింత కుదేలు
జియో దెబ్బకు మేజర్ టెలికాం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక్కసారిగా మూడో క్వార్టర్లో భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో క్వార్టర్లోనూ ఈ దిగ్గజాలకు పరిస్థితి ఇదే మాదిరే ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్లు కొనసాగించినంత వరకు టెలికాం దిగ్గజాలు మార్జిన్లకు భారీగానే గండికొడుతూ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడైతే జియో తన ఉచిత ఆఫర్లను విత్ డ్రా చేసుకుని, డేటా సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందో అప్పటినుంచి టెలికాం దిగ్గజాల పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని టెలికాం ఇండస్ట్రి ప్రాక్టిస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా అర్పితా పాల్ అగర్వాల్ చెప్పారు. 2016 సెప్టెంబర్ నుంచి వెల్ కమ్ ఆఫర్ కింద జియో ఉచిత ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం డిసెంబర్లో జియో తమ ఉచిత డేటా ఆఫర్లను 2017 మార్చి వరకు పొడిగిస్తున్నామని పేర్కొంది. దీంతో టెలికాం దిగ్గజాలు రెవెన్యూలు భారీగా కోల్పోతున్నాయి. భారతీ ఎయిర్ టెల్ 55 శాతం, ఐడియా సెల్యులార్ రూ.478.9కోట్లను, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ.531 కోట్ల నష్టాలను నమోదుచేశాయి. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో దోపిడీ ధరల విధానం వల్లనే తాము రెవెన్యూలను భారీగా కోల్పోతున్నామని టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ల దూకుడే టెలికాం కంపెనీలకు భారీగా దెబ్బకొడుతుందనే దానికి ఎలాంటి సందేహం లేదని టెలికాం కన్సల్టెన్సీకి చెందిన ఓ సంస్థ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ చెప్పారు. ధరల విధానంపై భారత మార్కెట్ ఆధారపడి ఉంటుందని, అలాంటి ఆఫర్లు మార్కెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని గార్టనర్ టెలికాం బిజినెస్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్టు రిషి తేజ్ పాల్ చెప్పారు.