
రూ. 5,600 కోట్లు కట్టాలి
పదహారు సర్కిళ్లలో 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ట్రేడింగ్, షేరింగ్ మొదలైన వాటికి ఉపయోగించుకునేందుకు..........
స్పెక్ట్రం ‘సరళీకరణ’పై ఆర్‌కామ్‌కు డాట్ ఆదేశం
న్యూఢిల్లీ: పదహారు సర్కిళ్లలో 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ట్రేడింగ్, షేరింగ్ మొదలైన వాటికి ఉపయోగించుకునేందుకు వీలుగా షరతులు సడలించడం కోసం రూ. 5,600 కోట్లు చెల్లించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్) టెలికం విభాగం (డాట్) సూచించింది. అలాగే వన్ టైమ్ స్పెక్ట్రం చార్జ్ (ఓటీఎస్‌సీ) కింద రూ. 1,569 కోట్లకు బ్యాంకు గ్యారంటీని నెలరోజుల్లోగా సమర్పించాలని పేర్కొంది.